"వీరప్పన్" గొప్ప చందన చోరుడు. ఆయన బ్రతికి ఉన్నంత కాలం రెండు రాష్ట్రాల పోలిసులను ముప్పు తిప్పలు పెట్టి కొన్ని వేల కోట్ల విలువ చేసే గందం చెట్లు, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసాడు. ఆయన సంపాదించిన సొమ్ములో ఎక్కువ బాగం తనను నమ్ముకున్న వారికి అభిమానించే చుట్టుప్రక్కల ఉన్న అడవి శివారు గ్రామాల వారికి పంచాడట. ఆయన కన్నా ఆయనను అడ్డంపెట్టుకుని సంపాదించిన అధికారులు, రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తారట! మరి అంత మందిని కోటీస్వరులను చేసిన "వీరప్పన్" చనిపోయే నాటికి చిన్న గుడిసె తప్పా ఏమి లేదట.పిల్లల్ను కూడా సర్కారీ దయతో చదివించాల్సి వస్తుంది. వీరప్పన్ గజదొంగ అయినప్పటికి గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు అని చెప్పక తప్పదు. తను తన కోసం కాక తనను నమ్మిన వారి కోసం ఉపయోగ పడ్డాడు. కాబట్టి అతను ఉండే చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు అతన్ని కంటికి రెప్పల కాపాడారు.అయినా చట్ట విరుద్ద్సమైన పనులు వలన చివరకు అతను కాల్పుల్లో మరణించక తప్పలేదు.
వీరప్పన్ విషయం లో ఆయన లోకం అందరికి దొంగ కావచ్చు కానీ ఆయన చేత సహాయం పొందిన వరికి మాత్రం దొంగ కాడు. అలా అని ఎవరు అన్నా వారూరుకోరు. అలాగే రాష్ట్రం లోని కొంత మంది రాజకీయ నాయకులని వీరప్పన్ తో పోల్చి పొరపటు చేస్తున్నారు. వీరప్పన్ లాంటి నిస్వార్దపరుణ్ణి, కోట్లు వెనకేసుకుని, రక్త సంబదీకులను తప్పా రెండవ వార్ని నమ్మని సంకుచిత స్వార్ద పరులతో పోల్చడమా? వీరప్పన్ కి గందం చెట్లను నరకడం తప్పా, విద్యా గందం అబ్బని వాడు. అతనుకు తెలిసినంతలో కరెక్ట్ అనుకున్న దానిని చేసాడు, తనను నమ్ముకున్న వరికే సంపాదించింది ఇచ్చాడు. మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి, దానికి విరుద్దంగా కోటాను కోట్లు కూడ బెట్టిన రాజకీయ నాయకులు వీరప్పన్ తో సమానులా? నెవ్వర్!
కాబట్టి దొంగకు కూడా ఒక నీతి ఉంటుంది. ఏ నీతి లేకుండా ఏ ఎండక గొడుగు పట్టడమే నేటి రాజకియ నాయకుల నీతి.
No comments:
Post a Comment