Thursday, September 12, 2013

రాష్ట్ర సర్వీసులు బంద్ చేస్తే,కేంద్రానికి ఏమిటి నొప్పి?


                                                                    
                                                               

లక్షలాది  సీమాంద్రా ప్రజలు సమైఖ్యాంద్రప్రదేశ్ కోసం నలబై రోజులుగా రోడ్ల మీద ధర్ణా చేస్తే కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు అనిపిస్తుంది. గతంలో తెలంగాణా ఉద్యోగులు సైతం నలబై రోజుల సమ్మె చేస్తే ఇదే రెస్పాన్స్ కేంద్రం నుండి . ఎందుకు ఇలా జరుగుతుంది.? లక్షాలాది ప్రజల మాట అంటే కేంద్రానికి దేనితో సమానం?

  తెలంగాణా ఏర్పాటు అనేది పూర్తీగా కేంద్రం వారి బాద్యత. దానికి రాష్ట్ర ప్రభుత్వానిది నామ మాత్ర తంతు నిర్వహణా బాద్యత. అసెంబ్లీ కీ బిల్ వస్తే అప్పుడు మాత్రమే అనుకూలంగానో, వ్యతిరేకంగానో తీర్మాణం చేసి పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర తీర్మానం ని ఖాతరు చేయాల్సిన అవసరం కేంద్రానికి లేదు. అదే విషయం కేంద్ర పెద్దలు తెగేసి చెప్పారు. మీరు అవునన్నా, కాదన్నా, తెలంగాణా ఇచ్చి తీరుతాం అని డిల్లీ పెద్దలు తేగేసి చెప్పాకా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదిగేదేముంది? మరి అటువంటప్పుడు అటు సీమాంద్రులు కానీ ఇటు తెలంగాణా వారు కానీ వారీ కోర్కేల సాధనకు రాష్ట్ర సర్వీసులను స్తంభింపచేయ్యడంలో ఔచిత్యమేమున్నది?

  నలబై రోజులుగా ఆర్.టి.సి. బంద్ చేసారు.వైద్యం బంద్ చేసారు. ఇప్పుడు విద్యుత్ బంద్ చేస్తాం అంటున్నారు. దీనివలన బాదపడుతుంది ఎవరు? రాష్ట్ర ప్రజలు. నష్టం ఎవరికి? రాష్ట్ర సర్కారుకు. తప్పు కేంద్రం చేస్తే, శిక్ష రాష్ట్ర సర్కారుకు వేస్తే ఎలా? నలబై రోజులు బంద్ అవసరమా? నాలుగు రోజులు కేంద్ర సర్వీసులు అయిన రైళ్లు, ఇతర సర్వీసులు ఆపి చూడండి. ఎంత తొందర్గా మీ సమస్యలను పట్టించుకుంటారో. మన పిల్లోడ్ని కొడితే ఎదుటింటోడికి ఏమిటి నొప్పి?  కేంద్ర సర్వీసులు నడిచినంత కాలం ప్రజల గోడు కేంద్రం పట్టించుకోదు గాక పట్టించుకోదు.    

No comments:

Post a Comment