ఏయి! హైద్రాబద్ మాది. ఇక్కడికి వస్తే తిరిగి వెళతవా! ఆంద్రోళ్లు తట్ట బుట్ట సర్దాల్సిందే! హైద్రాబద్ తెలుగోడి అభివ్రుద్ది కాదు, నిజాం కష్టార్జితం. ఇలా ఎన్నో డైలాగులు కొట్టారు. లేస్తే సమరమే అని కొంగర మల్లన్న మాటలు అన్నీ మాట్లాడారు. తెలంగాణా వీరులు ఎన్ని భింకాలు పలికినా అవి మీడీయా రేటింగులకు తప్ప్ప హైద్రాబాదీయుల వోటింగ్ లో టి.ఆర్.యస్ కి మార్పేమి రాదు అని అర్దమవుతుంది.
మొన్న జగన్ గారు చంచల గూడ జెయిల్ నుంచి లోటస్ పాండ్ వెళ్ళడానికి అయిదు గంటల పై చిలుకు పట్టిందంటే, హైద్రాబాద్ వారికి సమైక్య వాదం అంటే ఎంత మక్కువో అర్దమవుతుంది. అయినా తెలంగాణా వల్ల తెలంగాణా వారికి వచ్చే లాభం ఎన్నాల్లకు కనపడుతుందో తెలియదు కానీ హైద్రాబద్ వారికి నష్టం మాత్రం తెల్లారినుంచే కనపడుతుంది. ఒక అంచనా ప్రకారం కోటి రూపాయలు విలువ చేసే స్తిరాస్తి, తెలంగాణా అంటే యాబై లక్షలకు పడిపోద్ది అంట! అందుకే ఎన్ని మతలబ్ లు చేసైనా, సమైక్యాంద్రా కాకుంటే హైద్రాబాద్ ని U.T. చేయించుకోవలన్నా ద్రుడ సంకల్పం తో హైద్రాబాద్ బడాబాబులు ప్రయత్నిస్తున్నారు అట. తెలంగాణా నాయకులు అరవమంటే ఓ.. అని అరుస్తారు తప్పా, ఒక్క పైసా కూడ జేబులోనుంచి పెట్టరు. మరి ఆంద్రోళ్ళు అలా కాదు, అవసరమైతే ఎంత ఖర్చైనా పెట్టి తాము అనుకున్నది సాదిస్తారు. మరి అలంటి ఆంద్రా వారికి మేలు చేస్తే కేంద్రం లోని పెద్దలకు గిట్టు బాటు అయిద్ది కానీ , తెలంగాణ వారికి చేస్తే ఏమొస్తది బూడిద తప్ప.
అందుకే జగనన్న విడుదల అయ్యాడు అంటే హైద్రాబాదీయులకు అంత కుషీ అయింది. రేపు కేంద్రం లోని వారితో మాట్లాడడానికి, హైద్రాబాద్ నిU.T. చెయ్యడానికి ది గ్రేట్ బిసినెస్ మాన్ జగన్ గారి మద్యవర్తిత్వం ఉపయోగ పడుతుంది. అందుకే ఆయనకి బ్రహ్మరదం పట్టి హైద్రాబాద్లో తమ సత్తా చాటారు. సమైక్యాంద్రా అభిలాషులు. చూడబోతే తెలంగాణా ఇచ్చుడు ఖాయం. హైద్రాబాద్ పోవుడు ఖాయం అనిపించటం లేదూ!
No comments:
Post a Comment