Friday, September 27, 2013

రాజకీయ దొంగలు "వీరప్పన్" తో పోల్చడానికి కూడ తగరు!.



                                                                    

  "వీరప్పన్"  గొప్ప చందన చోరుడు. ఆయన  బ్రతికి ఉన్నంత కాలం రెండు రాష్ట్రాల పోలిసులను ముప్పు తిప్పలు పెట్టి కొన్ని వేల కోట్ల విలువ చేసే గందం చెట్లు, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసాడు. ఆయన సంపాదించిన సొమ్ములో ఎక్కువ బాగం తనను నమ్ముకున్న వారికి అభిమానించే చుట్టుప్రక్కల ఉన్న అడవి శివారు గ్రామాల వారికి పంచాడట. ఆయన కన్నా ఆయనను అడ్డంపెట్టుకుని సంపాదించిన అధికారులు, రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తారట! మరి అంత మందిని కోటీస్వరులను చేసిన "వీరప్పన్" చనిపోయే నాటికి చిన్న గుడిసె తప్పా ఏమి లేదట.పిల్లల్ను కూడా సర్కారీ దయతో చదివించాల్సి వస్తుంది. వీరప్పన్ గజదొంగ అయినప్పటికి గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు అని చెప్పక తప్పదు. తను తన కోసం కాక తనను నమ్మిన వారి కోసం ఉపయోగ పడ్డాడు. కాబట్టి అతను ఉండే చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు అతన్ని కంటికి రెప్పల కాపాడారు.అయినా  చట్ట విరుద్ద్సమైన పనులు వలన  చివరకు అతను కాల్పుల్లో మరణించక తప్పలేదు.

  వీరప్పన్ విషయం లో ఆయన లోకం అందరికి దొంగ కావచ్చు కానీ ఆయన చేత సహాయం పొందిన వరికి మాత్రం దొంగ కాడు. అలా అని ఎవరు అన్నా వారూరుకోరు. అలాగే రాష్ట్రం లోని కొంత మంది రాజకీయ నాయకులని వీరప్పన్ తో పోల్చి పొరపటు చేస్తున్నారు. వీరప్పన్ లాంటి నిస్వార్దపరుణ్ణి, కోట్లు వెనకేసుకుని, రక్త సంబదీకులను తప్పా రెండవ వార్ని నమ్మని సంకుచిత స్వార్ద పరులతో పోల్చడమా? వీరప్పన్ కి గందం చెట్లను నరకడం తప్పా, విద్యా గందం అబ్బని వాడు. అతనుకు తెలిసినంతలో  కరెక్ట్ అనుకున్న దానిని చేసాడు, తనను నమ్ముకున్న వరికే సంపాదించింది ఇచ్చాడు. మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి, దానికి విరుద్దంగా కోటాను కోట్లు కూడ బెట్టిన రాజకీయ నాయకులు వీరప్పన్ తో సమానులా? నెవ్వర్!

  కాబట్టి దొంగకు కూడా ఒక నీతి ఉంటుంది. ఏ నీతి లేకుండా ఏ ఎండక గొడుగు పట్టడమే నేటి రాజకియ నాయకుల నీతి. 

Thursday, September 26, 2013

సమైఖ్యాంద్ర వీరుడికి తెలంగాణా "నడిబొడ్డు" మీద అపూర్వ స్వాగతం"



                                                                

  ఏయి! హైద్రాబద్ మాది. ఇక్కడికి వస్తే తిరిగి వెళతవా! ఆంద్రోళ్లు తట్ట బుట్ట సర్దాల్సిందే! హైద్రాబద్ తెలుగోడి అభివ్రుద్ది కాదు, నిజాం కష్టార్జితం. ఇలా ఎన్నో డైలాగులు కొట్టారు. లేస్తే సమరమే అని కొంగర మల్లన్న మాటలు అన్నీ మాట్లాడారు. తెలంగాణా వీరులు ఎన్ని భింకాలు పలికినా అవి మీడీయా రేటింగులకు తప్ప్ప హైద్రాబాదీయుల వోటింగ్ లో టి.ఆర్.యస్ కి మార్పేమి రాదు అని అర్దమవుతుంది.

 మొన్న జగన్ గారు చంచల గూడ జెయిల్ నుంచి లోటస్ పాండ్ వెళ్ళడానికి అయిదు గంటల పై చిలుకు పట్టిందంటే, హైద్రాబాద్ వారికి సమైక్య వాదం అంటే ఎంత మక్కువో అర్దమవుతుంది. అయినా తెలంగాణా వల్ల తెలంగాణా వారికి వచ్చే లాభం ఎన్నాల్లకు కనపడుతుందో తెలియదు కానీ హైద్రాబద్ వారికి   నష్టం మాత్రం తెల్లారినుంచే కనపడుతుంది. ఒక అంచనా ప్రకారం కోటి రూపాయలు విలువ చేసే స్తిరాస్తి, తెలంగాణా అంటే యాబై లక్షలకు పడిపోద్ది అంట! అందుకే ఎన్ని మతలబ్ లు చేసైనా, సమైక్యాంద్రా కాకుంటే హైద్రాబాద్ ని U.T.  చేయించుకోవలన్నా ద్రుడ సంకల్పం తో  హైద్రాబాద్ బడాబాబులు ప్రయత్నిస్తున్నారు అట. తెలంగాణా నాయకులు అరవమంటే ఓ.. అని అరుస్తారు తప్పా, ఒక్క పైసా కూడ జేబులోనుంచి పెట్టరు. మరి ఆంద్రోళ్ళు అలా కాదు, అవసరమైతే ఎంత ఖర్చైనా పెట్టి తాము అనుకున్నది సాదిస్తారు. మరి అలంటి ఆంద్రా వారికి మేలు చేస్తే కేంద్రం లోని పెద్దలకు గిట్టు బాటు అయిద్ది కానీ , తెలంగాణ వారికి చేస్తే ఏమొస్తది బూడిద తప్ప.

 అందుకే జగనన్న విడుదల అయ్యాడు అంటే హైద్రాబాదీయులకు అంత కుషీ అయింది. రేపు కేంద్రం లోని వారితో మాట్లాడడానికి, హైద్రాబాద్ నిU.T.  చెయ్యడానికి ది గ్రేట్ బిసినెస్ మాన్ జగన్ గారి మద్యవర్తిత్వం ఉపయోగ పడుతుంది. అందుకే ఆయనకి బ్రహ్మరదం పట్టి హైద్రాబాద్లో తమ సత్తా చాటారు. సమైక్యాంద్రా అభిలాషులు. చూడబోతే తెలంగాణా ఇచ్చుడు ఖాయం. హైద్రాబాద్ పోవుడు ఖాయం అనిపించటం లేదూ!   

Wednesday, September 25, 2013

జగన్ గారి కి బెయిల్ ఇవ్వడం రైట్! కానీ ట్రైల్ స్టార్ట్ చెయ్యక పోవడం రాంగ్!


                                                             

 అందరి కేసులు మాదిరే జగన్ గారి తీవ్ర అర్దిక నేరారోపణలు కలిగిన కేసులను చూడడం ప్రజా నమ్మకాన్ని వమ్ము చెయ్యడమే. జగన్ మామూలు వ్యక్తి కాదు .లక్షలాది మంది గుండెల్లో కొలువైన నాయకుడు. మరి అటువంటి నాయకుడిని పదహారు నెలలు జైల్లో విచారణ పేరుతో ఉంచటమే కాక, కేవళం బెయిల్ ఇచ్చి వదులుతారా! ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులు అని ఆయనని నమ్ముతున్న లక్షలాది మంది అనుకుంటుంటే , ఆ సంగతేంటో నిగ్గు తేల్చకుండా, కేవలం బ్లాక్ మెయిల్ చేయ్యడానికే బెయిల్ ఇప్పించి బయటకు పంపుతుందా ఈ అధికార కాంగ్రెస్. జగన్ కడిగిన ముత్యం లా బయటకు రావాలని  జనం కోరుకుంటుంటే ఏది తేల్చకుండా వదిలేస్తారా?

   ఒక జన నాయకున్ని  ఆర్దిక దోపిడి దారు అని ముద్ర వేసి దానిని ఏటూ తేల్చ కుండా ఉంటే ఆయన్ని ఎలా  తాము ఎన్నుకునేది?  ఆయన మీద పెట్టిన కేసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదా? అవునులే శిక్ష పడిన వారినే చట్టసభలలో కూర్చో పెట్టే ఒదార్యం రాజకీయ పార్టిలకు ఉన్నా, దొంగా అని ముద్ర పడిన వారిని నిగ్గు తేల్చకుండా ఎన్నుకునే సత్తా ప్రజలకు ఉండొద్దూ. ఇది భారత పౌరుల ప్రాదమిక హక్కులకు భంగం కాదా? తాము ఎన్నుకోబోయే నాయకుడు దొంగో దొరో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?

 అందుకే  J.P. గారన్నట్లు, నేను ఇంతకుముందు టపాలలో చెప్పినట్లు, తక్షణం  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి జగన్ గారి మీద పెట్టిన కేసులు విచారణ చేయిస్తే  స్వచ్చమైన కడిగిన ముత్యం లా జన నాయకుడు బయటపడతడని లక్షలది మంది నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరాదు.

Monday, September 23, 2013

ఎవరు? గాందీ గారికి, జగన్ గారికి పోలికే లేదన్నది? ఇవిగో పోలికలు!

                                                                 


 ఆ మద్య గుంటూరులో అనుకుంటా,ఒక అభిమాని  గాందీ గారిని, జగన్ గారిని పోలుస్తూ, ఒక ప్లెక్సీ పెడితే అప్పొజిషన్ వారు నానా యాగీ చేసారు. మరి అలా యాగీ చేసిన వారు నేడు జగన్ రాకకై ఎదురుచూస్తున్న ఆ ప్రజల కళ్ళలోని పట్టలేని ఆత్రుతతో కూడిన ఆనందాన్ని చూసి ఏమంటారు? ఎమన్నా అనే దమ్మూ ,దైర్యం భారత ప్రజాస్వామ్యం లో ఎవరికుంది?

 అయినా జగన్ గారికి గాందీ గారికి అసలు పోలికే లేదనటం ఏమిటి? ఆ నాడు స్వాతంత్ర్య పోరాటం లో బాగంగా గాందీ గారు జెయిల్ కి వెళ్ళి బయటకు వస్తున్నప్పటి ద్రుశ్యానికి, ఈ రోజు జగన్ గారు జెయిల్ నుండి బయటకు వస్తున్న ద్రుశ్యానికి ఎంతో పోలిక ఉంది.

  అప్పటి ప్రజల కళ్ళలో తమ అభిమాన నాయకుడు ఎప్పుడు బయటకు వస్తాడా అన్న ఆత్రం.

  ఇప్పటి ప్రజల కళ్ళలోను తమ ప్రియతమ నాయకుడు కోసం సేం ఎక్స్ప్రెషన్!

  అప్పటి జన నాయకునికి జే జే ద్వానాలతో స్వాగత సన్నాహాలు.

  ఇప్పటి జగన్నాయకునికి అంతకు మించిన రీతీలో అపూర్వ స్వాగత సన్నాహాలు.

  భారత దేశానికి గాందీ గారే దిక్శూచి అని నమ్మిన జనం అప్పుడు.

  దిక్కులేని తెలుగువారికి దిక్కు నువ్వే అన్నా అని అంటున్న జనం ఇప్పుడు.

    ఇరువురూ ప్రజా నాయకులే! ప్రజలకు ప్రియ నేతలే! అభిమాన నాయకులే! మరి ఇంత పోలిక పెట్టుకుని, పోలికలు ఉన్నాయని ఎవరైనా అంటే వారి మీద విరుచుకు పడడం సమంజసమా? చెప్పండి?

  అయితే ఇక్కడ క్రూసియల్ పాయింట్ ఏమిటంటే ,పోలిక లేనిది ప్రజా నాయకుల్లో కాదు, ప్రజల్లోనే! వారి ఆలోచనా విదానాలలోనే!

 ఆ నాడు తమ కోసం నీతి నిజాయితీలతో పనిచేసిన వాడు తమ నాయకుడు అన్నారు. మరి ఇప్పుడో! నీతి నిజాయితీలు అనేవి హంబగ్ ,మాకు లబ్ది చేకూర్చే వాడే మా  నాయకుడు అంటున్నారు.కాబట్టి పోలిక లేనిది ప్రజల మనస్తత్వంలో తప్పా, ప్రజా నాయకులలో కాదు.అందుకే ఆయన ఏమి చేసినా ప్రజల కోసమే.అందుకే పద్నాలుగు నెల్లలు అష్ట కష్టాల కోర్చి, జైల్ జీవితం గడిపి బయటకు వస్తున్న ఆ జగన్నాయకుడికి  జనం జే జే ద్వానాల తో స్వాగతం చెపుతుంది . ! యదా ప్రజా! తదా నాయకా!
                  ఒక వేళ ఎవరికైనా ఈ సమాజం ఇలా అయిందేమిటీ? అనే బాద ఉంటే ఇంట్లో తలుపులు అన్నీ మూసుకుని ఈ పాటని పాడుకుని మీ అవేశాన్ని చల్లార్చుకోండి. జాగర్త! బయటకు పాడేరు, జనం వింటే గొడవలు అవుతాయి!

  నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి?
గొర్రెదాటు మందకి విజ్ఞాన బోధ దేనికి?
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం?
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం?
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాతరాతి గుహలు పాలరాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

ప్రభుత్వ ఉద్యోగులు చేతిలో రాజకీయ నిర్ణయాధికారం!


                                                                     
                                                    

 ఆటు కోదండ రాం గారు అయినా, ఇటు అశోక్ బాబు గారైనా ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే!. అటు తెలంగాణా J.A.C.   కి కోదండరామ్ గారు సారద్యం వహిస్తుంటే, ప్రస్తుతం రాజకీయ నాయకులు బిక్క చచ్చి ఉన్న తరుణం లో సీమాంద్రలో  సకల జనుల ఉద్యమానికి సారద్యం వహిస్తున్న ఆశోక్ బాబు గారు కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇక వారికి సహకరిస్తున్న విద్యార్దులు కానీ, ఉద్యోగులు కానీ అటూ, ఇటూ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటే జీతాల కొరకో, స్కాలర్షిప్పుల కొరకో ప్రభుత్వ సొమ్ము మీద ఆదార పడిన వారే. అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ స్పాన్సర్డ్ ఆందోళన అని అనవచ్చా?

  ఇన్నాళ్ళు సమ్మె చేస్తే కోదండరామ్ గారిని ఏమనలేని ప్రభుత్వO, ఏ ప్రభుత్వ ఉద్యోగిని ఏమనలేక పోవచ్చు. మొగల్ చక్రవర్తులను ఎదిరించి, తెలుగు నాడుకు ఉద్యోగులైన నిజాములే పాలకులైన చరిత్ర మనది.  మరి ఆ చరిత్రయే పునరావ్రుతం కానుందా? అని నా  సందేహం.

  ఇంకొక  సందేహం ఏమిటంటే హైద్రాబాద్ ని U.T చేస్తే అటు తెలంగాణా  ప్రజలలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం లేకుండా ఉద్యమ నాయకత్వాన్ని ఉద్దేశ్య పూర్వకంగనే కోదండ రామ్ చేతిలో ఉంచి, ప్రభుత్వానికి అనుకూలం గా ఉండేటట్లు ఏర్పాటు చేసారా? అలాగే సీమాంద్రలో అశోక్ బాబు నాయకత్వంలో మొదట సమైఖ్య వాదంతో ప్రారంభించి చివరకు హైద్రాబాద్  U.T  ప్రతిపాదనతో ప్రజలు చల్లబడేలా చెయ్యడానికి ప్లాన్ చేసారా? అటూ, ఇటూ ఉద్యోగులే కదం తొక్కుతుంటే తెల్ల ముఖాలు వేసుకుని రాజకీయ నాయకులు కాలు కాలిన పిల్లిలా డిల్లీలో తిరగడం ఏమిటి?

  నిజంగా చిత్త శుద్ది ఉంటే అటు కోదండ రామ్ కానీ, ఇటు అశోక్ బాఉ కాని హైద్రాబాద్ ని U.T   చెయ్యడానికి ఒప్పుకోకుండా ఉండాలి.ఉంటారా? చూద్దాం.ప్రభుత్వ ఉద్యోగులు పట్ల ప్రభుత్వ ఉపేక్ష వెనుకాల ఉన్న మతలబ్ ఏమిటో?   

Saturday, September 21, 2013

నీ అనువాదం తగలెయ్యా! నా బుర్ర తిరిగి పోయింది కదరా!



  నేను ఈ రొజు Too circles net  అనే సైట్ లో ఒక ఆర్టికిల్. చదివాను. ఆ అర్టికిల్ ప్రక్కన ఏ బాషలో అయినా ఆ ఆర్టికిల్ చదివే వీలుగా తర్జూమా వెసులుబాటుకోసం గూగుల్ ట్రాన్స్లేట్ చూసి ఆనందించాను. తెలుగు చదువరులకు ఎంతో  ఉపయోగ  పడుతుందని బావించి, తెలుగు బాషలో దాని తర్జూమా చూసాను. అంతే మొదటి వాక్యానికే నా బుర్ర తిరిగి పోయింది. ఎందుకో మీరే చూడండి.   (అండర్ లైన్ వాక్యం )


Friday, September 20, 2013

హైద్రాబాద్ को U.T. కరో! తెలంగాణా को లూటీ కరో


                                                        

  కేంద్ర సర్కార్ మనసులో ఏముందో ఇంకా తెలంగాణా బిడ్డలకు అర్దం కావటం లేదా? తెలంగాణా ఏకైక(ఆంద్రోళ్లకి కూడా) ఐ.టి. హబ్ దునియా హైద్రాబాద్ మీద ఐ.టి. కంపెనీల కన్ను పడింది.రెండు సంవత్సారాల క్రితం  యాబై వేల ఎకరాలలో ఐ.టి  పెట్టుబడుల జోన్  కోసం, కేంద్ర అనుమతి కోసం రాష్ట్ర సర్కార్ అబ్యర్దిస్తే దానిని ఈ రోజు కేంద్ర కాబినెట్ అనుమతి ఇచ్చిందంట! దీని వలన డేబ్బై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయట! ముప్పై ఏండ్లలో దీనిని పూర్తి చెయ్యాలని ప్లాన్ అట!ఇది తప్పకుండా తెలంగాణ వారికి సంతోషం కలిగించే విషయం లా పైకి కనిపిస్తున్న కేంద్ర సర్కర్  అసలు మతలబ్ బయటపడుతుంది.

  ఇప్పుడు, అంటే  సీమాంద్రా వారు హైద్రాబాద్ గురించి లొల్లి చేస్తున్న ఈ సంక్లిష్ట సమయం లో ఎందుకు అనుమతి ఇచ్చి, సీమాంద్రా వారిని రెచ్చగొట్టెలా చేసారు. అంటే హైద్రాబాద్ ని అందరికి చేందేలా   చేయ్యాలంటే సీమాంద్రా వారి ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తే, దానిని బూచిగా చూపి హైద్రాబాద్ ని  చేస్తారన్న మాట. అందుకేనా మాట మాటాడితే తెలంగాణా నోట్ రెడీ అయింది,తెలంగాణా నోట్ చేతికి వచ్చింది అని సీమాంద్రా వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ వారి ఉద్యమ తీవ్రత తగ్గకుండా చేస్తున్నారు?

  మొన్న ఒక నాయకుడు చెప్పిన లెఖ్ఖల ప్రకారం, ఇప్పుడు సైబరాబాద్ ప్రాంతం లోని ఐ.టి. కంపెనీలలో ఉద్యోగాలలో డెబ్బై శాతం మంది రాష్ట్రేతరులే పని చేస్తున్నారట. ఎందుకంటే ఉద్యోగ రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వ ఉద్యోగాలకే తప్పా, ప్రైవేట్ ఉద్యోగాలకు వర్తించవు మరి. మరి అటువంటపుడు "చూసి ముర్వ, చెప్పుకుని ఏడ్వ" అని ఈ ఐ.టి ఇండస్ట్రీ వల్ల తెలంగాణా బిడ్డలకు ఒరిగేది ఎంత? కనీసం ప్రైవేట్ ఉద్యోగాలలో లోకల్ రిజర్వేషన్ ఉంటుందా? అలా పెడితే ప్రైవేట్ కంపెనీలు ముందుకు వస్తాయా? అలా అవకాశం లేక పోతే కె.సి.ఆర్ గారు ఆంద్రోలకి చెప్పిన "టిపిన్ సెంటర్" లు పెట్టుకుంటానికి తప్పా తెలంగాణ బిడ్డలకి ఎం ఫాయిదా? ఇదే తరహాలో మరి కర్ణాటక వారి ఐ.టి జోన్ కి కూడా  అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది  మరి బెంగళూర్  ని కూడా u.T  చేస్తారా ? చేస్తే కన్నడిగులు ఊరుకుంటారా ? ఇక్కడ మెగా ఐ.టి జోన్ కి అవకాశం  ఉండబట్టి కన్ను కుట్టిన రాష్ట్రేతరులు కేంద్ర ప్రబుత్వం చేతిలోకి హైదరాబాద్ ని తెచ్చే కుట్రలో పలితమే నేడు తెలుగు బిడ్డల మద్య గొడవలు . అని అనుకోవాల్సి వస్తుంది

  ఒక వేళా తెలంగాణ వారు  U.T  వద్దంటే హైద్రాబాద్ లో ఉన్న సెటిలర్సే కాదు తెలంగాణా వారు కూడా ఒప్పుకోరు. వారుండే నగరం డెవలప్ అవుతుంటె కాదంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అందుకే టి.ఆర్.యస్ పప్పులు హైద్రాబాద్ లో చచ్చినా ఉడకవు. మరి హైద్రాబాద్ U.T.  అయితే తెలంగాణా కి మరో రాజదాని చూసుకోవలసిందేనా? మరి ఆమ్ దాని ఉన్న రాజదాని వదులుకుంటే తెలంగాణా పరిస్తితి ఏంది? ఒక లెఖ్ఖ ప్రకారాం U.T.   దగ్గర్లో ఉన్న ఏ పట్టణాలు అభిరుద్ది చెందవట. అంటే మర్రి మాను క్రింద మొక్క లెఖ్ఖ అన్న మాట. మరి ఇంత ఉద్యమం చేసింది హైద్రాబాద్ ని వదులుకుంటానికా? మొత్తానికి కేంద్ర సర్కర్ అటు చేసి, ఇటు చేసి తెలంగానా వారికి తల లేని మొండెం ని అప్ప చెప్పి, ఇక ఏలుకోండి బిడ్డా అనబోతుందన్న మాట! అందుకే నేను మొదగాల్నే చెప్పినా, ఇది కేంద్ర సర్కార్ కుట్ర అని! తెలుగోడికి, తెలుగోడికి తంపు పెట్టి హైద్రాబాద్ ని తన ఖాతాలో జమ చేసుకుంటుంది. అలా అయితే తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు మీద పునరాలోచీంచాల్సీంది కేంద్రం కాదు, తెలంగాణా బిడ్డలే!        
 

Thursday, September 19, 2013

కాలేజీ గాళ్ సా ? కాశ్మీరీ ఎక్స్ ట్రీమిస్ట్సా !?



                                                                   

  మన సాంప్రాదాయ రీతిలో మన ఆడపిల్లలు లంగా ఓణీ, చీర లాంటి వస్త్రదారణలో చదువుకుంటుంటే వారు చదువుకున్న అమ్మాయిలుగా కనిపించరు అని మెజార్టీ తల్లి తండ్రుల అభిప్రాయం. ఈ రోజుల్లో పల్లేటూల్లో ఉండే అమ్మాయిలు కూడా పాషన్ కోసమని పంజాబీ వస్త్రదారణ చేస్తూ ఆదునికంగా కనపడుతున్నారు. బుర్రలో ఉండే మెదడు ఏ మాత్రం మెరుగుపరచుకోలేకపోయినా,వేరే రాష్ట్రాల వారి  వస్త్రధారణ ను వీరు  ఆదునిక వస్త్రధారణ గా మార్చుకుని తెలుగు రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రంగా మార్చి వేసారు మన అమ్మాయిలు. సాంప్రాదాయక వాదులు కూడా పెద్దగా అబ్యంతరం చెప్పటంలేదు.

                                                  
       
                                                           
  నేను మొన్న ఒక పనుండి ఒక కాలేజికి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పుడే కాలేజీ ప్రారంబమవుతుంది అనుకుంటా, రై రై మంటూ మగపిల్లలు, ఆడపిల్లలు తమ బైక్ ల మీద వచ్చేసి బైక్లు పార్క్ చేసీ తమ తమ క్లాసుల వైపు వడి వడిగ వెళిపోతున్నారు. సరే అబ్బాయిలు అంటే  ఇంగ్లీష్ వారి గెట్ అప్ మన ట్రెడిషనల్ గా మార్చుకున్నాం కాబట్టి, ఫాంట్ షర్ట్ లో కనపడుతూ వారి వారి ముఖాలు మనకు కనపడుతున్నాయి. కానీ అమ్మాయిలను చూదామంటే అంతా ఒకటే ముసుగుల గెట్ అప్. తమ తమ చున్నీలు కళ్ళు మాత్రం తప్పా తల అంతా చుట్టుకుని కాశ్మీరీ  తీవ్ర వాదులు లాగా కనిపిస్తున్నారు. పఈన కాశ్మీరీ, క్రింద పంజాబీ వస్త్రధారణతో నా తెలుగు తల్లులు వెలిగిపోతుంటే, నిజం చెప్పొద్దూ  నాకు కోంచం  ముచ్చట వేసింది. కానీ అంతలోనే నాలోని తెలుగు బిడ్డ లేచి గాండ్రించడం మొదలు పెట్టాడు " చీ, చీ, ఒక తెలుగు వాడివి అయి ఉండి ఇలా పరాయి రాష్ట్రాల వారి లాగా బురఖా వేసుకుని మన ఆడపిల్లలు తిరుగుతుంటే ముచ్చటపడతావా"?

  "ఇందులో తప్పే ముంది? మనం ఏనాడో ఇంగ్లీష్ వాడిని అనుకరిస్తే తప్పు లేదు కానీ ఇప్పుడు మన దేశం లోని ఇతర రాష్ట్రాల వారిని, మన ఆడపిల్లలు అనుకరిస్తే తప్పేమిటి?

  " అంటే మన తెలుగు తనం అంతరించి పోవల్సిందేనా?

   అబ్బే, అంత డేంజరేమి లేదు. మనకు  పదిహేను రోజులకో సారి  పండగ వస్తుంది  కాబట్టి అప్పుడు మన వస్త్రాలు వేసుకుని మన  సంస్క్రుతిని కాపాడితే సరి అన్నాను.

  పదిహేను రోజులకొకసారి అంటే ఎప్పుడూ, అమావాస్య కు ఒకసారా" అన్నాడు కచ్చిగా  నాలోని తెలుగు బిడ్డ.

  అంత కోపమెందుకు రా? అయినా మన వారి  పరికిణీ ఓణీ  గెట్ అప్ కంటే వారు వేస్తున్న కాశ్మీరీ గెట్ అప్ వల్ల లాభాలు ఎక్కువ" అన్నాను.

  "లాభాలా ఏంటవి?

  తల చుట్టూ, క్లాత్ కవర్ వల్ల బైక్ డ్రైవ్ చేసేటప్పుడు చెవిలోకి గాని ,ముక్కులోకి , ముఖం మీద కానీ  దుమ్ము పడదు. ముఖం చూసి కామెంట్ చేసే పోకీరీ గాళ్ళకు వీరి ముఖాలు కనపడవు కాబట్టి  వాళ్లు తెల్ల ముఖాలు వేసుకు చూడటం తప్పా కామెంట్లు చెయ్యరు. అలాగే పిల్లలు ముఖాలు కనపడకుండా తల వంచుకుని నడవాల్సిన పని ఉండదు. తల ఎత్తుకుని నడవడం వలన వారిలో ఆత్మస్తైర్యం పెరుగుతూంది....

  స్టాప్.స్టాప్. ఇక ఆపు. ఇంకొక పని చేస్తే వారికి చాలా మేలు జరుగుతుంది అన్నాడు తె.బి. ఎక్కసక్కెంగా.

 ఏమిట ది?

  వారందరికి తలొక మెచిన్ గన్ ఇస్తే అచ్చం కాశ్మీరీ తీవ్ర వాదులు లాగా ఉండటమే కాక, ట్రెనింగ్ కూడా ఇస్తే తమ వెంట బడి వేదించే మ్రుగాళ్ళను కూడా కాల్చి పారేస్తారుగా! ఆవేశంగా అన్నాడు తె.బి.

 నేను ఆలోచనలో పడ్డాను వాడు ఆవేశంగా అన్నా అందులో నిజం ఉందనిపించింది. ప్రతి ఆడపిల్లకి  పిస్టల్ లైసెన్స్ లు ఇస్తే ఎలా ఉంటుంది? వారి మీద జరిగే దాడులను వారు అరికట్ట గలరా? ఏమో మరి వారు కూడా తీవ్రవాదులుగా మారితే తప్పా మగవారి అరాచకాలకు అంతం ఉండదేమో! మొత్తానికి మన ఆడపిల్లలు గన్ లెస్ కాశ్మీరి టెర్రరిస్ట్ అవతారాలలో దర్శన మిస్తున్నందుకు నాకు ముచ్చటగనే ఉంది. మరి మీకేమనిపిస్తుంది?           

Wednesday, September 18, 2013

భద్రాచలాన్ని వాళ్ళొదులుకోలేరు, భాగ్య నగరాన్ని వీళ్లోదుకోలేరు!



                                                              

  భద్రా చలం! పరమ పవిత్ర రామ ధామం. పుణ్య గోదావరీ తీరాన నిర్మితమైన చారిత్రక పుణ్య క్షేత్రం. ఒక్క ఆంద్ర ప్రదేశ్ కే కాక యావత్ భారత దేశంలో విశిష్ట గుర్తింపు కలిగిన క్షేత్రం. ఆదాయం పరంగా కాక పోయినా, రామాయణ కాలం నాడు శ్రీ రాములు వారు సీతాలక్ష్మణ సమేతంగ తిరుగాడిన ప్రాంతం కాబట్టి, ఆ క్షెత్రానికి దేశ వ్యాప్తంగా పేరు గాంచింది. మరి అటువంటి భద్రాచలం తెలంగాణా ఎర్పాటు ప్రకటన వలన సమస్యల్లో చిక్కుకుంది.

  ఆంద్రప్రదేశ్ ఏర్పడక ముందు భద్రాచలం  నిజాముల నిర్వాకం వల్ల బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళి సీమాంద్రా ప్రాంతం లో ఉండేది. తెలుగువారంతా ఒకటేనని ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత, భద్రాచలం డివిజన్ ని తెలంగాణా లోని ఖమ్మం  జిల్లాలో కలిపారు.మరి ఇప్పుడు తెలంగాణ వాదులు కోరుతున్నట్లు  1956 ముందు తెలంగాణా ప్రాంతాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నందువలన భద్రాచలాన్ని తెలంగాణా వారు వదులుకోక తప్పని పరిస్తితి. కానీ సీమాంద్రులకు పుణ్యక్షేత్రం కంటే తమ పిల్లలకు ఇంత ఫుడ్ పెట్టె బాగ్యనగరం గురించే బెంగ పట్టుకుంది కాబట్టి, ప్రస్తుతం భద్రాచలం విషయంలో అంత సీరియస్ గా లేకపోయినా, బవిష్యతులో తెలంగాణా ఖాయం అని వారికి అనిపిస్తే భద్ద్రాచలం గురించి సీరియస్ గా క్లైమ్ చేయవచ్చు. కాబట్టి ఇరు ప్రాంతాల గురించి చర్చలు జరిగేటప్పుడు బాగ్యనగరం గురించి ఎంత పట్టుదలగా సీమాంద్రులు క్లైమ్ చేస్తారో భద్రాచలం గురించి తెలంగాణా వారు అంతే సీరియస్ గ క్లైమ్ చేస్తారు.

   మొత్తానికి అటు  సీమాంద్రులకు బాగ్యనగరం తో ఎంత అట్టాచ్ మెంట్ ఏర్పడిందో ఖమ్మం జిల్లా వారికి భద్రాచలం తో అంత అటాచ్ మెంట్ ఏర్పడింది. ఈ రెండు ప్రాంతాల భవితవ్యం ఏమిటో వేచి చూడాలి.  

Tuesday, September 17, 2013

రాష్ట్రంలో ఇంకా "రజాకార్ల సంతతి" మిగిలి ఉన్నట్లే కనిపిస్తుంది.



తెలంగాణా విమోచన కోసం అశువులు బాసిన తెలంగాణా వీర మాతలకు, వీర పుత్రులకు జోహార్లు అర్పిస్తూ.....  
                                                                

 ఈ రోజు తెలంగాణా విమోచనా దినం అని కొందరు, కాదు "వీలీన దినం" అని కొందరు ఎవరికి తోచిన బాష్యాలు వారు చేస్తున్నప్పటికి అంతిమంగా అందరూ అంగీకరించే విషయం ఏమిటంటే ఈ రోజు నిజాం పాలన కు గోరి కట్టిన దినం.మన తాతలు, తండ్రులు, అవ్వలు, అమ్మమ లందరి త్యాగాలకు ప్రతిపలంగా తెలంగాణా బిడ్డలు భారత సర్కార్ సహాయంతో నైజామోడి పీడ విరగడ చేయించుకున్న రోజు. ఎనబైఅయిదు  శాతం మంది మెజార్టీ ప్రజలను అష్టకష్టాలు పాలు చేసి ఊచకోత కోయించిన నిజామ్  "రాక్షస రజాకార్" ల పాలన నుండి విముక్తులమైన రోజు. ఇండియాకి పంద్రాగస్టు ఎలానో తెలంగాణాకు సత్రాసెప్టెంబర్ అలాగే. కానీ ఇ విషయాన్ని మనతో పాటు విముక్తులైన మరాఠా, కన్నడ రాష్ట్రాల వారు గుర్తుంచుకుని అధికారిక కార్యక్రమాలు చేస్తుంటే, మన వారు మాత్రం తూ తూ మంత్రాలతో మమ అనిపిస్తున్నారు.

 ఈ మద్య తెలంగాణా విభజన ఉద్యమం ఎక్కువయ్యాక, ఇదే సందురా అని చెప్పి అప్పటి రజాకార్ల మానస పుత్రులు కొందరు పైకి సీమాంద్రావారిని తెగడతున్నట్లు నటిస్తూ, అంతర్గతంగ నైజాము ప్రభువులను పొగిడే కార్యక్రమాలు చేపడుతూ, తెలంగాణా వారిలో నిజాముల పట్ల ఆరాదానా బావం పెంపొందించాలని చూస్తున్నారు. పొద్దున టి.వి. లో ఒక చర్చను చూశాను. అందులో ఒక మానసపుత్రుడు రాజాకార్ల దుష్క్రుత్యాలను సీంపుల్ గా తీసేస్తూ, భారత సైన్యం తెలంగానా ముస్లిమ్లను ఊచకోత కోసిందని సెలవిస్తూ, దానికి కారణం సీమాంద్రుల స్వార్దం అని వితండ వాదం చేస్తున్నాడు.అంటే మన తెలంగాణా లో ఇంకా రజాకార్ల పుత్రులు ఉన్నారని దీనిని బట్టి అర్దమవుతుంది.

 సీమాంద్రులు, తెలంగాన వారు అన్నదమ్ములు.  క్రిష్ణా గోదావరి మద్యనున్న గడ్డ అసలైన తెలుగుగడ్డ. తర్వాత కాల క్రమేనా జనాభివ్రుద్ది చేత అటు కావేరి వరకు విస్తరించ బడ్డాం. అంతే కానీ ఎక్కడో ఉజ్బెకిస్తాన్ నుండి పొట్ట కూటి కోసం వచ్చి పాలకులైన  నిజాములకు తెలంగాణా వారికి సంబందమే లేదు. వారి పాలన తెలుగు వారి పాలనా చరిత్రలో బాగం కాజాలదు.అన్నదమ్ముల మద్య అభిప్రాయ బేదాలు కలిగినంత మాత్రానా పరాయి వారిని తమ పూర్వికులు అని చెప్పుకునే దుస్తితిలో తెలంగాణా ప్రజలు లేరు.

  నాడు గోచి పెట్టి కొడవలి చేత పట్టి రజాకార్లను,వారి తొత్తులైన దొరలను దునుమాడిన వీర తెలంగాణా మాతల బిడ్డలమే మనం తప్పా, గొప్ప గొప్ప బవంతులు కట్టించాడని నిజాములను మన తెలంగాణ వాడు అని చెప్పటం ఆత్మ ద్రోహమే అవుతుంది.అసలు మరాఠీలు బొంబాయి ని ముంబాయి చేసిన  మాదిరి పౌరుషం ఉన్నవాళ్ళమైతే  మన పాలన రాగానే హైద్రాబాద్ పేరు మార్చి"ఐలమ్మ బాద్" అని పెట్టాల్సి ఉండే.అది మానేసి ఇంకా రజాకార్ల స్రుష్టి కర్తలను ఆరాదిస్తునారంటె ఎక్కడో రక్తం కలుషితమై ఉంటుంది అనుకోవాల్సి వస్తుంది. చచ్చినా బ్రతికినా అన్నదమ్ములు అన్నదమ్ములే. సందు దొరికింది కదా అని తోక జాడించాలనుకుంటె బేదాభిప్రాయాలు తొలిగిన నాడు తోకలు కట్ చేస్తారు అని రజాకార్ మానస పుత్రులు గుర్తుంచుకోవడం మంచిది.