Wednesday, September 28, 2016

అమ్మా! ఈ నలబై యేళ్ళుగా నేను లైంగిక దోపిడికి గురవుతూనే ఉన్నాను!


                                                                 
                                                               

 రోజూ ఉదయం ఆరు ఇంటికి వచ్చే పనిమనిషి "రాములమ్మ" రాలేదు. నాకు చచ్చేంత విసుగ్గా ఉంది. రాములమ్మ పనికి కుదిరిన దగ్గర్నుంచి, నాకు చాలా  పని బారం తగ్గి సుఖానికి అలవాటు పడటం వలన ,ఒక్క రోజు పని మనిషి రాకపోయినా న గుండేల్లో రైళ్లు పరుగెడ్తూ ఉంటాయి. టైం ఏడు అయింది. ఇక ఈ రోజు రాములమ్మ రాదని నిర్ణయించుకుని మనసుకి సర్ది చెప్పికి ఒళ్లు ఒంచాను.

 ఈసురో మంటూ పనులన్నీ అయిపోయాయి అనిపించేసరికి పన్నేండు అయింది. ఇక కోంచం నడుం వాలుద్దామని మంచం మీద పడుకున్నానో లేదో, బయట తలుపు కొట్టిన చప్పుడు అయి, చిరాకుగా వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా రాములమ్మ!

  ఒక్క సారిగా అరచినంత పని చేసాను"ఏమైంది రాములమ్మ? పొద్దునే రాలేదు"

  "అన్యాయం అయిపోయానమ్మా" ఒక్క సారిగా నన్ను కావలించుకుని ఘొల్లు మంది రాములమ్మ.

  "ఏమైంది రాములమ్మా" మనసెందుకో కీడు శంకిస్తుంటే అడిగాను.

  "అయ్యో నన్నాడు  నలబై  యేండ్లుగా  దోపిడి చెస్తుండటమ్మా" బోరుమంది

 రాములమ్మా.

 అదిరి పడ్దాను  నేను. "ఎవడే వాడు" కోపంగా అడిగాను.

 ఇంకెవడూ , నా మొగుడే.

 ఏమిటీ? నీ మొగుడా? అనుమానంగా అడిగాను.

  అవునమ్మా ఆడే,అని తలచుకుని తలచుకుని ఏడవ సాగింది రాములమ్మ.

  రాములమ్మ ఏడుపు వెనకాల  ఏదో పెద్ద కదే ఉందనిపించింది. నెమ్మదిగా ఆమెను కూర్చోబెట్టి బోజనం పెట్టాను. తిన్న తర్వాత అసలు ఏమి జరిగిందో చెప్ప మన్నాను. ఆమె చెప్పినది విన్న తర్వాత నాకు నోట మాట రాలేదు. అలాగే మ్రాన్పడి పోయాను. రాములమ్మ తెల్లారి టైం కి వస్తాను అని చెప్పి వెళ్ళి పోయింది. ఇంతకీ ఆమె చెప్పిన విషయం ఏమీటంటే,

  రాములమ్మకు చిన్న తనంలోనే పెండ్లి సంబందం వచ్చింది.  ఆమె మొగుడు భద్రయ్య కొంచం చదువుకోవటమే కాక గడుగ్గాయి గా  పేరు పడిన  కుర్రాడు. అందుకు రాములమ్మని ఇవ్వడానికి తల్లితండ్రులు సందేహిస్తుంటే, మద్య వర్తి" అమ్మాయి యుక్తవయస్కురాలు అయ్యాకే  పెండ్లి చెద్దాం. ముందు పప్పన్నాలు తినండి. ఒక వేళ పెండ్లి నాటికి మీకు ఇష్తం లేక పోతే అప్పుడే సంబందం కాన్సిల్ చేసుకోవచ్చు, మీ రెండు కుటుంబాలు కలిస్తే ఇద్దరికి మంచిగుంటుంది. ఆ పైన మీ ఇష్టం".అంటే సరే అని సంబందం కుదుర్చు కున్నారట. ఆ తర్వాత రాములమ్మ యుక్త వయస్కురాలవడం, ఆ పైన ఏ అబ్యంతరం లేకుండా వారి పెండ్లి జరగటం అయిపోయాయి. ఆ తర్వాత అందరి సంసారాల మల్లేనే అప్పుడప్పుడు కీచులాడుకోవడం, అలిగి పుట్టిటీంటికి వెళ్ళడం, బ్రతిమాలో, పెద్దల జ్యోక్యంతోనో  తిర్గి కాపురానికి రావడం, ఇలా గడుస్తూనే ముగ్గురు బిడ్డల తల్లి అయింది రాములమ్మ.

  నిజానికి రాములమ్మకు పని చేసి పొట్ట పోసుకోవలసిన అవసరం లేదు. పెడ్ద అబ్బయి కాలరీస్ లో పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. తక్కిన ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లిల్లు అయి వారి మొగ్గుల్లతో చక్క గా కాపురం చేసుకుంటున్నారు. కొడుకు కూడా తల్లితండ్రులకు నెల నెలా ఖర్చులకి సరి పోను పంపిస్తున్నా, రాములమ్మే కోడుకు కి తెలియకుండా మా ఇంటిలో పని చేస్తుందట. రాములమ్మ మొగుడికి ఇప్పుడు అరవైఅయిడేళ్లు. ఇంటి దగ్గరే ఉంటాడు.

  ఈ మద్య రాములమ్మ ఉండే కాలనీలోని ఆడాళ్లందరికి కలిపి ఒక సంఘం పెట్టారట. ఆ సంఘం లో ఆడాళ్ళ హక్కులు, ఆడోళ్ళు మీద మొగుళ్ళు చేసే దౌర్జన్యాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలిపారట! వారందరిలో ఒకామె చెప్పిన ఉపన్యాసం రాములమ్మని ఆలోచనలో పడేసిందట. ఆమె చెప్పిన దాని ప్రకారం "ఆడదానికి దేనిలోను స్వాతంత్ర్యం లేదు. అన్నిటీ లోను మగాడే జులుం చేసి తన కోరినట్లు ఆడది నడిచేలా చేస్తున్నాడు. చివరకు పడకింట్లో కూడా మాగాడిదే పై చేయట(?). అందుకని అటువంటి సంసారం ఇష్ట పూర్వకంగా చేసినది కాదు కాబట్టి, అది కూడా దోపిడి క్రిందే లెఖ్ఖట!కాబట్టి ఇప్పుడు అటువంటి మొగుళ్ళకి  ఎదురు తిరగాలట, అవసరమైతే విడాకులు ఇవ్వాలట!

 ఇది విన్న తర్వాత రాములమ్మకి తను రోజు మొగుడి క్రింద ఎంత దోపిడికి గురి కాబడిందో తెలిసి గుండే చెరువు అయిందట! ఎంత అవమానం! ఇక ఈ అవమానం భరించడం తన వల్ల కాదట. అందుకే తన ముసలి మొగుడికి విడాకులు ఇద్దామని పెద్దమనుషులు పంచాయితి పెడితే, కాలనీ స్త్రీల సంఘం ఒత్తిడితో కాలనీలోని పెద్ద మనుషులు విడాకులు ఇప్పిస్తాను అని ఒప్పుకున్నాడట. దానికి రాములమ్మ మొగుడు తన కొడుకు ఇచ్చే డబ్బులతో ఎలాగో బ్రకుతాను అంటే దానికి రాములమ్మ తరపు వారు ఒప్పుకోలెదట. ఇన్నాళ్ళు రాములమ్మని దోచుకుందే కాక, ఇప్పుడు రాములమ్మ కొడుకు డబ్బులు దోచుకోవడానికి ముసలాడు కుట్ర పన్నాడు అని అన్నారట. పంచాయితీ వచ్చే వారం కి వాయిదా వేసారట. అందుకే రాములమ్మ ఈ రోజు పని లోకి రాలేదట. అదీ రాములమ్మ మొగుడి  నలబై యేండ్ల దోపిడి కద.

 ఆమె కద వింటుంటే నాకెక్కడో ఇలాంటి కదే ఈ మద్య విన్నట్లు ఉంది, ఎక్కడబ్బా? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.          
                                                                                                                                                                    (28/9/2013 Post Republished).                      



Sunday, September 25, 2016

హఠాతుగా ప్రత్యక్షమైన దెయ్యం కారు! ఎక్కడి నుండి వచ్చిందో చెప్పగల విజ్ఞానులు ఎవరు?

                   
                                                                           
                               

                                 ఆస్ట్రేలియాలో ని ఒక రోడ్డుమీద గొప్ప విచిత్రం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ తన ఎదురుగా వెళుతున్న కారు గమనాన్ని వీడియో షూట్ చేస్తున్నాడు. ఒక మలుపు దగ్గర హఠాతుగా తన కారు ముందు ఉన్న కారు ఆగింది. కారణం ఏమిటంటే సదరు  కారు ముందు వెళుతున్న వ్యాన్ ను బూడిద రంగు ఆస్ట్రా కారు ఒకటి హఠాతుగా ఢీకొనడమే కాక 180 డిగ్రీ లలో తిరిగిపోయింది. ఆ తర్వాత ముందున్న కారు చిన్నగా టర్నింగ్  తీసుకుని ఆ ఢీకొట్టిన కారు పక్కనుంచి వెళ్లడం తో ఈ  వీడియో ఉన్న కారు కూడా కదలి వెళ్లి పోయింది. ఇది మాములు విషయమే కదా? ఇందులో విశేషం ఏమిటంటారా? అయితే చూడండి .

     మీరనుకున్నట్లే అది మామూలు విషయమే అని వీడియో తీస్తున్న మిత్రుడు కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇంటికి వెళ్లి వీడియో పరిశీలిస్తున్నప్పుడు ఆ విచిత్రం తెలిసింది.  సదరు మలుపు దగ్గర  ముందు నుంచి టర్న్ అవుతున్న కారు , వ్యాన్,  మరియు  ఎదురుగా వస్తున్నా అన్ని కారులు కనిపిస్తున్నాయి. కానీ వ్యాన్ ను డి కొట్టిన కారు మాత్రం అందులో కనిపించలేదు. అది హఠాతుగా ప్రత్యక్షమై వ్యాన్ ను డి కొట్టి ఆగాక మాత్రమే కనిపించింది. అందులోనుంచి ఎవరో దిగారు కూడా . మరి అప్పటి వరకు రోడ్డు మీద కానీ , ఆ పరిసరాలలో కానీ లేని కారు హఠాతుగా ఎలా ప్రత్యక్షమైంది ? అది ట్రాఫిక్ లో వ్యాన్ ను ఢీకొట్టబట్టి ఆగింది కానీ నిర్మానుష ప్రాంతం లో అయితే దానిని గుర్తించే అవకాశం  లేదు.

                    అటువంటి కారు ను తెలుగు సినిమాలు చూసే  మనం  "దెయ్యం కారు " అంటామేమో కానీ , సదరు వీడియో తీసిన వ్యక్తికీ ఇంగ్లీష్ సినిమాలు చూస్తాడు అనుకుంటా , అందులో  చూపించే అడ్వాంస్డ్ సైన్స్ లాగా  "టెలిఫోర్టేషన్  " విధానం ద్వారా ప్రత్యక్షమైన కారు అంటున్నాడు . అంటే మనం దృశ్య , శ్రవణాలను ఎలాగైతే ఒక చోట నుండి మరొక చోటుకి ప్రసారం చేస్తున్నామో  , అలాగే వస్తువులను కూడా   ఒక చోటు నుండి మరొక చోటుకి క్షణాల్లో లేక నిమిషాల్లో  పంపే ప్రక్రియ అన్న మాట . ఇదేలాగో వివరంగా తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకొండి. లేదూ , నేనే చెప్పమంటే నాకు వీలున్నప్పుడు వివరంగా చదివి ఇదే బ్లాగులో చెపుతాను . అందాక ఈ విచిత్రాన్ని క్రింది వీడియోలో చూచి అశ్చర్య పడుడి !..





                                                                    

Friday, September 23, 2016

."కల్లూరి గుట్టల" మీద బ్రతుకుతూ , "కల్ల కొండలకు " మొక్కడమేందిరా?

                                                          

                                              మా వూరి ప్రక్కనే నరసింహ రావు పేట అనే ఊరు ఉంది . అ ఊరిలో తెలగ వారి కుటుంబాలు ఎక్కువుగా ఉన్నాయి . మా పొలం ప్రక్కనే వారి పొలాలు ఉండేవి కాబట్టి వారితో మాకు పరిచయాలు ఉన్నాయి . అప్పుడప్పుడు  వారు పిలిస్తే వాళ్ళ ఇండ్లకు కూడా  వెళ్ళటం జరిగేది. ఒక రోజు అప్పయ్య  అనే స్నేహితుడు పిలిస్తే వారింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కల్లూరు గుట్ట దేవతకు సంబందించిన కొలువు కొలిచారట , దాని సందర్బంగా జరుపుఇతున్న పంక్షన్ అది. దానికే నాతో పాటు మరి కొంత మంది ప్రెండ్స్ ని పిలిస్తే వెళ్ళటం జరిగింది.

ఇక్కడ "కల్లూరు గుట్టలు " గురించి కొంత తెలుసుకోవాలి. మా ఊరికి తూర్పున పది కిలో మీటర్లు దూరంలో వ్యాపించి ఉన్న గుట్టల శ్రేణిని "కల్లూర్ గుట్టలు" అని పిలుస్తారు. ఈ  గుట్టలను అనుకుని అనేక గ్రామాలు ఉన్నా , పెద్ద గ్రామం , ఇప్పట్టి మండలం అయిన కల్లూరు కు దగ్గరలో ఉన్నందు వలన వీటికి ఆ పేరే వచ్చింది. ఈ  గుట్టలు మీద "టేకు" జాతి తప్ప , మిగతా అన్ని వృక్ష జాతులు లభిస్తాయి. మా ఊరుకు దగ్గరలో చిన్న చిన్న గుట్టలమీద సహితం టేకు చెట్లు ఉంటాయి కానీ, అంత పెద్ద గుట్టలమీద టేకు చెట్లు కనపడక పోవటం విశేషం. మా చుట్టు ప్రక్కల ఊర్లు అయిన అన్నారు గూడెం, నరసింహా రావు పేట, ఏనుకూరు గ్రామ రైతులకు కావలసిన కలప , వెదురు, చిల్లమండ, బడితెలుకు ఎక్కువుగా ఈ  గుట్టల మీదే ఆదారపడే వారు. ఇక పోతే అన్నారుగోడేం, నరసింహా రావు పేట గ్రామానికి చెందిన చాలా కుటుంబాల వారు ఈ గుట్టల మీదే ఆదారపడి బ్రతికే వారు. వారు ఉదయం కోడి కూయగానే లేచి , గొడ్డళ్ళు బుజాన వేసుకుని , కల్లూరు గుట్టలకు వెళ్లి , అక్కడ రైతులకు కావాల్సిన కలపను తీసుకుని వచ్చి, గ్రామాలలో రైతులకు ఇస్తూ తమ జీవనోపాది సంపాదించుకునే వారు. కాబట్టి ఆ కుటుంబాల వారందరికి "కల్లూరు గుట్టలు" తమకు బ్రతుకు తెరువు చూపుతున్న దేవతలు . అందుకే వాటిని దేవత రూపం లో కొలుపులు కొలుస్తూ పూజించడం వారికి ఆచారం. వారి ఇండ్లలో ఎవరైనా మగ పిల్లలు పుడితే ముందుగా ఆ పిల్ల వాడిని కల్లూరు గుట్టల వైపు పెట్టి నమస్కరించి, తమ పిల్లవాడికి ఏ లోటు లేకుండా చూడాలని మొక్కే వారట. అంత సెంటిమెంట్ వారికి!

                         అయితే ఇక్కడ మేము వెళ్ళిన మా మిత్రుడి ఇంట్లో ఒక చిన్న పాటి గొడవ మా మిత్రుడు తండ్రికి , తమ్ముడికి జరుగుతుంది. మా మిత్రుడు తమ్ముడు డు కొంత కాలం క్రితం వేరే మతం లోకి వెళ్ళాడట. ఆ మత  పద్దతుల ప్రకారం వేరే దేవతను కానీ, దేవుళ్ళను కాని పూజించకూడదు అంట. కనీసం బొట్ట కూడా  పెట్టుకోకూడదు అంట! అటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలట . లేకుంటే సైతాన్ పట్టి పీడీస్తాడట! అందుకే ఇంటి పక్కన  ఉన్న ఆతను ఈ  పంక్షన్ కి రాలెదు. కానీ మా మిత్రుడు ఇంటికి వచ్చిన బందుమిత్రులను చూసి వారి పిల్లలు పెదనాన్న  ఇంటికి వెళతామని గొడవ చేస్తుంటే , వారు ఇక్కడకు  రాకుండా చెయ్యటానికి వారి మత ఆచారాల ప్రకారం పూజించే "విదేశి  కొండలు " పోటో ఒకటి పెట్టుకుని పూజలు చెయ్యడం మొదలుపెట్టాడు. అది చూసిన మా మిత్రుడు తండ్రికి కోపం నసాళానికి అంటి చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుంటున్నాడు. " ఒరే వెదవా , పొద్దున్న లేచింది మొదలు సాయం కాలం వరకు నువ్వు గడిపేది కల్లూరు గుట్టల మీద. నీకు, నీ పెళ్ళాం బిడ్డలకు ఇంత  కూడు  పెట్టేది ఆ కల్లూరు గుట్ట దేవత అయితే నువ్వేదో ఆ "కల్ల  గుట్టలు " కు మొకుతావేందిరా అని తిడుతూ నానా హంగామా చేస్తుంటే మేము సర్ది చెప్పి, ఎవరి విశ్వాసాలు వారివి అని నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన ఆ పెద్దాయన శాంతించలేదు. " మీకు తెలియదయ్యా, నవాబుల కాలం నుండి మాకు కల్లూరు గుట్టలే దేవతలు. వారు కూడ మా నమ్మక్కాన్ని గౌరవించారు కానీ ఇదేమి మాయదారి కాలమో , ఆ గుట్ట ల మీద ఆదారపడి బ్రతుకుతూ , వేరే దేశంలో  ఉన్న గుట్ట దేవతను కొలవడమేమ్ది? అలా అంత నమ్మక్క్జం ఉంటే ఆడికే పోయి బ్రతకాల , ఈడేందుకు ? అలా చేసి అలా చేసి , ఏదో ఒక నాడు మా ఆచారం అంత మాయం చ్జేస్తారు,   . అని ఆ ఆ పెద్దాయన అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పెద్దాయనకున్న ఆలోచనలో పదవ వంతు కూడా  మనలో చాలా మందికి లేదనిపించింది.

                                     ఇది జరిగి చానాళ్లు అయింది. మన ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే దాడికి గురవుతూ , అన్య మతాలూ మరింతగా విస్తృత మవడానికి అవి కారణమవుతున్నాయి. ఈ  దేశ వనరుల మీద బ్రతుకుతూ, అన్య దేశాలను , అక్కడి ప్రాంతాలను ఆరాద్య ప్రాంతాలుగా కొలవడం అంటే అది కచ్చితంగా ఈ  ఇంటి తిండి  తిని ఎదురింటోడికి ఉపయోగపడటం లాంటిది . ఎప్పటికైనా ఇటువంటి విదానలతో మన దేశ సమగ్రతకు ముప్పే అని గ్రహించటం విజ్ఞుల లక్షణం. స్తానిక పరిసరాలను, నదులు, కొండలును ఆరాదించడం అనేది మనలోని దేశ భక్తికి కూడా నిదర్శనం.

                           మా ఊరు ప్రక్కనే ఉన్న గుట్ట ని నరసింహ స్వామి గుట్ట అంటారు. కారణం ఆ గుట్ట మీదే మా ఇల వేల్పు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వెలిసాడు కాబట్టి. అందుకే ఆ గుట్ట ని ఎంతో పవిత్రంగా చూస్తారు భక్తులు. ఆ గుట్ట మరియు నరసింహా స్వామీ దేవాలయ విశేషాల కోసం ఈ  క్రింది వీడియో లింక్ ని క్లిక్ చెయ్యండి
                                                   


                   

                                           (8/12/2013 Post Republished).

Thursday, September 22, 2016

తిరుమల కొండ మీద "పంది " సంచరిస్తుందని "వీర బ్రహ్మం " గారు చెప్పిన మాట ఈ విధంగా నిజం అయిందా!!

                            


హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామీ వేంచేసిన  తిరుమల  పరమ పుణ్య పవిత్ర క్షేత్రం . ప్రపంచం లోని అన్ని మతాల వారు ఆ దేవ దేవుని భక్తీ ప్రపత్తులతో కొలుస్తున్న తీరు ఆ స్వామీ మహత్యానికి నిదర్శనం . మరి అటువంటి తిరుమల కొండ మీదకు వెళ్ళడమే కాక , సాక్షాత్తు ఆ దేవ దేవున్ని తూలనాడి , కోట్లాది హిందూ భక్తుల మనోబావాలను గాయపరచిన వాడు  ఈ తెలుగు గడ్డ మీద ఇంకా శిక్షింప బడకుండా  ఉన్నాడు అంటే అది  ఇండియా లాంటి కుహానా సెక్యులర్ వాదులు  ఉన్న దేశం లొనే  సాద్యం . 

    మాజీ ముఖ్య మంత్రి గారి పుణ్యమా అని  తెలుగు గడ్డ మీద విచ్చలవిడిగా కిరస్తానీ మతం కు చెందిన  కొంత మంది  మత మార్పిడి  కార్యక్రమాలు పెచ్చు మీరి పోయాయి.   సాక్షాత్తు ఏడుకొండల స్వామీ నే రెండు కొండలుకు పరిమితం చేసే తెంపరి తనం అన్య మతస్తులకు కలిగిందంటె అది ఖచ్చితంగా ఆ మహానుబావుని చలవే. హిందూ మత విస్వాసాల మీద నమ్మక్కం లేని వ్యక్తులను ధర్మకర్తలుగా, ఎండోమేంట్ అధికారులుగా నియమించబట్టె ఇటువంటి ఆగడలు ఏడుకొండలు మీద ఏదో ఒక రూపం లో నిత్యం జరుగుతున్నాయి. ఇంత వరకు మత మార్పిడి వ్యవహారాలలో చట్ట విరుద్దంగా ప్రవర్తించిన వారికీ శిక్షలు విదించిన దాఖ్హాలలు లేవు. కారణం అటువంటి విషయాలలో కేసులు పెట్టె టప్పూడు ఉన్న శ్రద్ద, ప్రాసిక్యూట్ చేసేటప్పుడు ఉండక పోవడమే. మరి అటువంటప్పుడు చట్టాలు ఎందుకు? ఎవరి కళ్ళ నీళ్ళు తుడవడానికి? తిరుల కొండ మీద ప్రభుత్వ జ్యోక్యం తొలగించి నిఖార్సైన హిందూ సంస్తలకు పాలనా బాద్యత అప్పగించి చూడండి. ఇటువంటి తప్పుడు మత ప్రచారాలు చేసే వారు కొండ ఎక్కడానికి సాహసించగలరా ? దేవ దేవున్ని ధూషించి బ్రతికి బట్ట కట్ట గలరా?

  ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటె  కిరస్తాని మతం  న చెందిన వ్యక్తి ఒకతను తిరుమల కొంద మీదకు వేళ్ళి ఆ దేవ దేవున్ని, ఆయనను పూజించే భక్త కోటి వీస్వాసాలను చాలా తీవ్రంగా అవమానిస్తూ, దానిని ఒక వీడియోగా తీయడమే కాక, దానిని వీదేశాలలో ఉన్న మత మార్పిడి స్పాన్శర్ లకు పంపి అక్కడ నుండి డబ్బు తెప్పించుకుని ఇక్కడ తన దుష్ట కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. దానిని అతడు య్యూ టూభ్ లో పెట్టి మరీ హిందూ జాతిని అవమానిస్తున్నాడు అంటె అది ఇండియాలో మరియు తెలుగు గడ్డ మీదే సాద్యం అని అతనికి గట్టి నమ్మఖ్ఖం కాబట్టి. వీడియోలో అతను ఏమి వాగాడొ తెలుసుకోవాలంటె క్రింది విడియోను క్లిక్ చేసి చూడవచ్చు. ఈ వీషయంలో అతను, అతనితో ఉన్నవారి మీదే కాక ఇతువంటి అప్రాచ్యపు పనులకు ప్రోత్సాహించిన అతని విదేశి స్పాన్సర్ ల మీద కేసు బుక్ చేసి వారిని శిఖ్షింప చేయగలందులకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడమైనది.

 బ్రహ్మం గారి  కాల జ్ణానం లో ఒక చోట ఒక "పంది" తిరుమల కోండ మీద సంచరించి ఆ ప్రదేశాన్ని పాడు చేస్తుందని ఉంది. బహూశా అది ఈ వ్యక్తి గురించే కావచ్చు. ఎందుకంటె పంది సంచారమ్ ని మలినానికి ప్రతీక గా బావిస్తాం. ఇటువంటి దైవ దూషకుడు వలన తిరుమల అపవిత్రం అయింది. కాబట్టి శుద్ది కార్యక్రమాలు చేపట్ట వలసిన అవసరం ఉంది. ఇకనుండి ఇతువంటి వారి పట్ల దేవస్తానం అధికారులు అలెర్ట్ గా ఉండాలి.         

                                                                        

                                                                       

Wednesday, September 21, 2016

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "చండాల" పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.


                                                            
                                                            

 నిన్న దమ్మున్న చానల్, దుమ్మురేపే చానల్ లో ఒక స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది.

 ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట. ఈయన గారిదగ్గరకు సంపన్న వర్ఘాల స్తీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి, వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!.

  దాన్కి సదరు స్వామ్ వారు "యోని పూజ" ఒక్కటే మార్గమని సెలవిస్తే అందుకు సరే అని చేయించేవారట ఆ కలిగిన కాంతలు. యోని పూజకు ముందు వారు ఒంటిమీద నూలుపోగు లేకుండా నగ్నంగా స్వామీవారి సమక్షంలో కాళీకా మాత విగ్రహం ముందు కూర్చో వాలట. ఆ తర్వాత పూజ చేసి పంపించేవాడట. అలా పూజ చేయించుకున్న వార్ కాపురాలు కుదుటపడ్డాయో లేదో కాని, అత్యాచారం(?) మాత్రం గ్యారంటీగా జరిగేదట స్వామీగారి చేత.

 ఏమండీ! నాకు తెలియకడుగుతా! భర్తతో సంసారం బాగుండాలని ఏ ఆడపిల్లైనా  పరాయిమగవాడి ముందు నగ్నంగా పూజలు చేయించుకుంటుందా? నాకు తెలిసి అటువంటివి తంత్ర విద్యలు అంటే బ్లాక్ మాజిక్ ఒకరి మీద ఆదిపత్యం కోసం చేసే పూజలు అవి. అంటే తన భర్త తన చెప్పుచేతుల్లో ఉండాలని బావించే డబ్బున్న వారు చేసే వికారపు చేష్టలు ఇవి. వారు దానికోసం ఏదైనా చేస్తారు. నిజంగా భర్తని  కావాలనుకుంటే, ఒక్కరోజు ఆయనకి మనసు మెచ్చేలా ప్రేమతో  పూజ చేస్తే, పాపం పిచ్చి మొగుడు మీ జీవితాంతం  మీరు కోరుకున్న రీతీలో పూజలు చెయ్యడూ!

   దాంపత్యానికి  కావల్సింది ప్రేమా అనురాగాలు. సంసారానికి కావల్సింది సర్దుబాటు గుణం. ఇవి లేకుండా మొగుడు తమ గుప్పెట్లో ఉండాలని సన్నాసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి "చండాల" పూజలు చేస్తే ఒల్లు గుల్ల! ఇల్లు గుల్ల! మెడలు మెరిపించే బంగారం కాదు ఆడదానికి కావాల్సింది, మెదళ్ళు మెరిపించే జ్ణానం. అది లేకపోతే బ్రతుకు "చండాలమే"!

                                             (11/7/2013 Post republished)

Tuesday, September 20, 2016

అక్కినేని గారు దేవుణ్ణి నమ్మారు అనటానికి "నాగ దేవుడు" సెంటిమెంటే సాక్ష్యం . .

                 

                                       (స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా పునః ప్రచురణ చేయడమైనది .)                                   

చాలామంది, దివంగత నటులుశ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారికి దేవుడు అంటే నమక్కo లేదు అనుకుంటారు . అయన గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో తనకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదని చెప్పారు తప్పా , తనకు అసలు నమక్కం లేదని చెప్పలెదు. అయన గారికి దేవుడు మిద అపారమైన నమ్మక్కం  ఉందని చెప్పటానికి అయన గారికి ఉన్న "నాగ" సెంటిమెంటే ఉదాహరణ .
 శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు , ఆయన 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య ,  సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.

 అయితే నాగేశ్వర రావు గారికి ఉన్న" నాగ " సెంటిమెంట్ పాజిటివ్ పలితాలు ఇచ్చిందనే చెప్పాలి. అయన తన సంతానం లో ఒక కుమారుడు పేరు నాగార్జున కాగా , కుమార్తె పేరు నాగ సుశీల . అలాగే నాగార్జున గారి కుమారుడి పేరు కూడా నాగ చైతన్యయే . అక్కినేని నాగేశ్వర రావు గారి తర్వాత ప్రజలలో మళ్లి  అంత పాపులారిటి సంపాదించిన వారు కుమారుడు నాగార్జున మరియు మనుమడు నాగ చైతన్యయె కావడం గమనార్హం . మిగతా వారు వీరంతా పాపులార్టి పర్సన్స్ కాదు. కాబట్టి నాగేశ్వర రావు గారి నమక్కాన్ని "నాగ దేవుడు" లేక నాగ దేవత వమ్ము  చెయలెదు.అని చెప్పవచ్చు.  అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 22-1-2014న మరణించారు. అయన గారి ఆత్మకు శాంతి కలగాలని అ దేవ దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను.

          "మడిసన్నాకా కూసింత కళా పోసనే కాదు , కాస్తంత దైవ బక్తి కూడా ఉంటే లాబమే కాని , నష్టం ఏమి లేదు" అని అక్కినేని గారి కుటుంబాన్ని చూస్తె తెలియడమ్లా ?

                                                (24/1/2014 Post Republished).


  

Monday, September 19, 2016

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? అని నేను ఊహించింది నిజమే అని రుజువు చేస్తున్న సైన్స్ ఆర్టికిల్ !

                                                           


నేను గత నవంబర్ 6 న క టపాని "'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? " అనే టైటిల్ తో ప్రచురించటం జరిగింది. ఆ రోజు ఎందుకో నాకు మనిషి అనేవాడు కోతి నుండి కాక మార్క్స్ గ్రహం మీద అభివృద్ధి చెందిన మానవుడిగా ఉండి అక్కడ పరిస్తితులు జీవించడానికి వీలు లేనంతగా మారి పోయాక అంటే అతి శీతలం   వలన కానీ ఇతరత్రా కారణాల వలన కానీ , స్పేస్ షిప్ ల ద్వారా సూర్యకుటుంబం లో తర్వాతి గ్రహం మరియు జీవరాసి మనుగడకు అనుగుణంగా ఉన్న భూమి మీదకు వచ్చి ఉంటాడని ఒక ఆలోచన వచ్చింది.

      ఒక వేళ అదే నిజమయితే భూమికి  కూడా కొన్నేళ్ళకి అదే పరిస్తితి కలిగితే  తిరిగి మానవుడు వెళ్ళవలసింది శుక్ర గ్రహానికే కానీ తిరిగి అంగారక గ్రహానికి కాదు కదా అని కూడా అనిపించింది. నా ఆలోచనకు ఆదారం ఏమిటంటే ఏ గ్రహం అయినా సరే సూర్యుడు లేక నక్షత్రానికి , ప్రస్తుతం భూమి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఉండి ఉంటే అక్కడ జీవరాసి కి అనువైన వాతా వరణం ఉండి ఉండాలి. మరి విశ్వం వ్యాపిస్తుంది నిజమే అయితే తప్పకుండా గ్రహాలు సూర్యుడికి రాను రాను దూరంగా వెళుతుండాలి కదా. అలాంటప్పుడు ఏ గ్రహం కూడా  స్తిరంగా ఒకే కక్ష్యలో తిరగటానికి వీలు లేదు. అలాంటి పరిస్తితుల్లో ప్రస్తుతం ఉన్న పొజిషన్ కి  భూమి ఏ మాత్రం సూర్యుడుకి  దూరంగా వెళ్ళిన వాతావణం మార్పులు చెంది భూమి మానవ  నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన మానవుడు తప్పకుండా వేరే గ్రహానికి వలస పోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఒకప్పుడు ప్రయత్నించి ,ఆ ప్రయత్నంలో బాగంగానే అంగారక గ్రహం మీద నుండి భూ గ్రహం మీదకు మానవుడు అడుగు పెట్టి ఉంటాడని నాకు కలిగిన ఊహ.దానిని తర్వాతి టపాలో రాద్దామనుకున్నాను. కానీ కొన్ని అనుమానాలు నివృత్తి కాక టపా రాయడం వాయిదా వేసాను.

  అయితే  ఈ  మద్య ఒక చోట ఒక విషయం చదివాను.ఎవరో స్పేస్ ట్రావల్  కంపనీ వారు 2023 నాటికి అంగారక గ్రహం మీద నివాస గృహాలు ఏర్పరచి, అక్కడికి మానవులను తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారని, దానికి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని , అందులో మన హైదరాబాద్ వారు కూడా  ఉన్నారని చదివి ఆశ్చర్య పోయాను. ఇది నా ఊహకు విరుద్దం.ఒక సారి నివాస అర్హత కోల్పోయిన గ్రహంని అంటే సూర్యుని నుండి నియమిత దూరంలో ఉండాల్సినదానికంటే కొంచం దూరంగా జరిగి అక్కడి వాతావరణం శీతలంగా మారిపోయి, వాయువులు సైతం ఘనీబవించే స్తితిలో ఉన్న గ్రహాన్ని తిరిగి నివాసయోగ్యం చేయడం ఎలా సాద్యం.అక్కడి వాతావరణం ని మార్చడం అసాద్యం.  అదంతా సైన్స్ కు పేరున ప్రజల్ని మోసం  చేసి తమ స్పేస్ వ్యాపారం సంబందించి అసత్యాలు ప్రకటిస్తున్నారు అనిపిస్తుంది. లేదా . బహూశా ఇది మార్స్ గ్రహం పట్ల ప్రజలలో ఆసక్తి కలిగించేందుకు కొంతమంది పని కట్టుకుని ఇలా చేస్తుండవచ్చుఅని కూడా   అనిపిస్తుంది. కాబట్టి వీటి గురించి ఇంకా ఏమన్నా కొత్త సాక్ష్యాలు బయల్పడతయా అని ఎదురు చూ స్తున్నాను.

  నిన్న ఒక ఆర్టికిల్ చదవి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఆర్టికిల్ ఏమిటంటే   Evidence suggests life on Earth could have started on Mars.  దానిలో మొదటి లోనే ఎమున్నదంటే "There is a theory that’s gaining a bit of traction in the scientific community, a theory which suggests that life on Earth could have come from Mars. Evidence in favor of this theory has been building over the last couple of decades, and it indicates that we all (could be) Martians." అని.

   కాకపోతే సైంటిస్టుల ఊహ ఏమిటంటే అంగారక గ్రహం మీద జీవం  పరిణామ దశలో ఉండగా అక్కడి  శిలలు కొన్ని అంగారక కక్ష్యలో నుండి తప్పి భూమి మీదకు వచ్చి పడ్డాయని,అట్టి శిలలు మీద ఉన్న జీవరాశి భూ గ్రహం మీద అభివృద్ధి చెంది ఇప్పటి జంతుజాలంగా ఆవిర్భవించిందని సూత్రీకరిస్తున్నారు. దిని ప్రకారం డార్విన్ సిద్దాంతం కూడా కరక్టే అని వారి ఊహా కావచ్చు. . ఇది నా ఊహకు విరుద్దం. ఖచ్చితంగ మానవుడు అంగారక గ్రహం మీద అభివృద్ధి చెందాకే ఈ  గ్రహం మీదకు అంతరిక్ష  నౌకల ద్వారా వచ్చి ఉండాలి. మన పురాణాలలో చెపుతున్న కదలకు అంగారక గ్రహం కు ఏదో సంబందం ఉండి ఉండాలి అనిపిస్తుంది. నా ఊహ నిజమే అయితే విశ్వంలో భూమి ని పోలిన  జీవ సహిత గ్రహాలు ఇంకా చాలా  ఉండి ఉండాలి. వాటి మీద జీవులు కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్లు ఆలోచిస్తూ ఉండాలి. వారి మద్య, మన మద్య ఏదో రకమైన కమునీకేషన్ సిస్టం ఉండి ఉండాలి. అవే మనకు ఆలోచనలు గ ఫ్లాష్ అవుతూ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సైన్స్ పిక్షన్ సినిమా కద అవుతుంది .

  కానీ నాకు తెలిసినంత వరకు ఒకటి మాత్రం నిజం . సైంటిస్ట్ కంటే అద్యాత్మికంగా ఆలోచించే వారికే విశ్వ రహస్యాలు ముందుగా తెలుస్తుంటయి. వాటిని నిరూపించడమే సైంటిస్టులు చేసే క్రుషి .అంతే! మన పూర్వికులు కుజ గ్రహాన్ని బూమి పుత్రుడు గా బావించారు.ఏ పరిశోదనలు చెయ్యకుండా , సైన్స్ అనేది తెలియని రోజుల్లో వారికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? భూమికి అంగారకుడుకి సంబందం ఉంటుందని ఎలా ఊహించారు? అదే విశ్వ రహస్యం. మనిషికి, ప్రక్రుతి కాలానుగుణంగా  అట్టి జ్ఞానాన్ని ఎరుక పరుస్తుంది అని నా దృడ అభిప్రాయం. అందుకే చాలా మందికి ఆపిల్ పండ్లు చెట్టునుండి క్రింద పడడం అనుభవమే అయినా , ఒక న్యూటన్ మాత్రమే దానిలోని రహస్యాన్ని కనుగోగలిగాడు. అయిన్స్టీన్ సైతం ఏ రోజు లేబరిటరిలోకి అడుగు పెట్టకుండానే విశ్వం యొక్క  రహస్యాలు కనిపెట్టగలిగాడు. ఇవ్వన్నీ సాద్యమవటానికి దృష్టిని సంబదిత విషయం మీద లగ్నం చేసి ఆలోచన చెయ్యడం లేదా ద్యానం  చెయ్యడం. . దానినే సమాది స్తితి అంటారు. అదే మన పూర్వికులు చేసింది! 

    పై ఆర్టికిల్ కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://www.fromquarkstoquasars.com/evidence-suggests-life-on-earth-could-have-started-on-mars/

 నేను ఇదివరకు పెట్టిన'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? టపా  కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://kalkiavataar.blogspot.in/2013/11/blog-post_6.html

                                                   (2/1/2014 Post Republished).

Sunday, September 18, 2016

పాంట్ లూడదీసి చూసి మతాన్ని నిర్ణయించి మానవ హననం చేసినోడు "సేక్యులరిస్టా" ? !


                                                           


                                    నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ గారు నిజాం పట్ల తనకున్న అంతులేని అభిమాన్నాన్ని చాటుకున్నారు. ఆ యన ప్రసంగం లో నిజాం యొక్క ఔదార్యాన్ని , ఆయనలోని పరిపాలనా దక్షతను , దానగునాన్ని పర పరి విధాలా కీర్తించాడు . కాని  నిజాం   చేసిన లేక చేయించిన మానహననాలు , మారణ హోమాలు గురించి మాట్లాడవద్దని హెచ్చరికలు చెసాడు . అలా చేస్తే  ఆంద్రప్రదేశ్ అంతా రక్తాలు పారుతాయి అని కూడా సెలవిచ్చారు. ఆయన చేసిన మారణహోమం ఏమో మానిపోయిన గాయాలు ఆట. ప్రజలను పీడించి వసూలు చేసిన సొమ్ముని  తమ పరివార విలాస వంత జీవనానికోసం వెచ్చిస్తే అది అభివ్రుద్ది అట.అందుకు నిజాం  గొప్ప రూలర్ అట. ఏది ఏమైనా అతని మాటలు వలన అతను ఎలాంటి బావాలు కలిగిన వాడో అర్దం చేసుకోవటానికి తెలుగు ప్రజలకు ఒక మంచి అవకాశం కలిగింది.

 తెలంగాణా ప్రాంతంలో ఎంతో మంది తెలుగు వారు ఉర్దూ నేర్చుకున్నారు. ఉర్దూ ని అభిమానించారు. అలాగే ముస్లిమ్లు కూడా తెలుగు నేర్చుకుని తమకు ప్రాంతీయ బాష పట్ల ఉన్న మక్కువను తెలియ చేసారు. అలాగే సీమాంద్రా లో కూడా ముస్లిమ్ లు  ఉర్దు కంటే తెలుగు బాషకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చి , ఆ బాషాభివ్రుద్దికి కె కాక నిజమయిన సెక్యులరిజం కోసం తపించారు . కానీ హైద్రాబాద్లో ఒక ప్రజా నాయకుడుగా ఉంటూ కనీసం చూసి "సామాజిక" అనే తెలుగు పదాన్ని కూడా ఉచ్చరించలేని వాడు "సెక్యులరిజం " గురించి గప్పాలు కొట్టడం, పైగా  తెలుగుదేశం పార్టీ వారి  సెక్యులరిజం గురించి ప్రశ్నించడం  విడ్డూరం. ఖచ్చితంగా అక్బరుద్దీన్ గారు నిజాం లకు వారసుడు తప్పా, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగిన ముస్లిమ్లకు మాత్రం కాదు.

   ఇక పోతే ఆయన నిజాం గురించి మాట్లాడుతూ ఆయన కూడా సెక్యులరిస్టే  అన్న దోరణీ కనపర్చాడు. నిజమే మరి నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు హిందువుల మీద జరిపిన  అత్యాచారాలు , హత్యాచారాలు గురించి తెలుసుకుంటే నిజాం ఎంత సెక్యులరిస్టో అర్దమవుతుంది. పాంట్లు ఊడడిసీ చూసి మతాన్ని నిర్ణయించి హత్యలు చేసిన  వారిని సెక్యులరిస్ట్లు అంటే,  ఇక చెప్పేదేమి లేదు . వారికి దూరంగా ఉండడం, దూరంగా ఉంచడం తప్పా!.

                                  (21/1/2014 Post Republished).   

Friday, September 16, 2016

బ్రహ్మం గారు చెప్పిన "చంద్రగుప్త మహరాజు","చంద్ర బాబు నాయుడు"గారేనా!?

                                                                  
మిత్రులారా "కల్కి" అవతార పురుషుడి గురించి నా పరిశొదనా కొనసాగుతుంది. ఈ లోపు ఇతర బవిష్యాలు గురించి తెలియ చెపుతాను. నేను మొదటగా చెప్పినట్లు, నేను చెప్పేదంతా  బవిష్య గ్రంథాలలో ఉన్న దానికి నా పరిశీలనా అంశాలు జోడించి మీ ముందుంచటం జరుగుతుంది.అవి నిజాలా ?కావా?అన్నది కాలానికి వదిలేద్దాం.నమ్మే వారు నమ్మవచ్చు.లేనివారు లైట్ తీసుకుని హాయిగా నవ్వుకోవచ్చు.

                                                                        

  ఇక విషయానికి వస్తే బ్రహ్మం గారి కాలజ్ణానం లో ఒక చోట"కల్కి అవతారుడి వలన "పచ్చ బండ" రూపం లో ఉన్న చంద్రగుప్త మహరాజుకు శాప విమోచనం కలుగును" అని చెపుతారు.ఇది కల్కి అవతారం రావడానికి నాందిగా ఉంటుందని కూడ చెపుతారు.

 ఇది చదవిన నాకు చాలా ఆశ్చ్చర్యం వేసింది. ఎప్పుడొ గతించిన "చంద్రగుప్త మహారాజు"కలియుగాంతానికి ఎలా వస్టాడు అనే అనుమానం ఒకటి కాగా,ఆయన "పచ్చ బండ రూపం" లో ఉండటం ఏమిటి? అనేది రెండవది. దీని మీద లోతుగా పరిశిలిస్తే ఒక విషయం ఫ్లాష్ లైట్ లా వెలిగింది!

                                                                             
                                                                           
"చంద్ర గుప్త మహారాజు" అంటే "నారా చంద్రబాబు నాయుడు"గారు అయ్యుండాలి.పచ్చ బండ రూపం అంటే "తెలుగు దేశం" పార్టి అయ్యూండాలి(జెండా రంగు పసుపే కదా). మరి శాప విమోచనం అంటే ఏమిటి?.గత కొన్ని యేళ్లుగా ఆయన అధికారంలో లేడు కదా!. ఇది ఆయనకు దేవుడు ఇచ్చిన శాపమని దివంగత ముక్యమంత్రి అనేక సందర్బాలలో అన్నారు. కాబట్టి ఈ సారి ఎన్నికలలో "కల్కి అవతార పురుషుడు" వలన తిరిగి చంద్ర బాబు నాయుడు గారు అదికార పగ్గాలు చేపట్ట బోతున్నారా?! ఈ విషయమే బ్రహ్మం గారు తన కాలజ్ణానం లో చెప్పారా?చూద్దాం ఏమి జరుగబోతుందో?      

  Note: ఈ  టపా 2012 లో నవంబర్ 14 న రాయబడింది. ఈ  టపాలో  చెప్పినట్లే  2014 లో చంద్రబాబు గారు ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడమే కాక , ఎంతో చారిత్రిక ప్రసిద్ధం కాబోతున్న "అమరావతి " అనే రాజధాని నిర్మాణానికి నాంది పలకటం వలన చారిత్రిక పురుషుడు కాబోతున్నాడు.

Wednesday, September 14, 2016

"పంది కడుపున ఏనుగు పుట్టును " అన్న బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యం నిజమయిందా !!!?

                                   


                                                బవిష్యత్ లో జరుగబోయే దానిని ముందుగానే దర్శించిన మహానీయుల్లో తెలుగు గడ్డ మీద జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు ఒకరు . 16 వ శతాబ్దానికి చెందిన ఈయన రచించిన "కాలజ్ఞానం "లోని అనేక బవిష్యాలు నిజమయ్యాయి అని అనేక మంది నమ్ముతున్నారు . తాను కలి యుగాంతం నకు వీరబోగ వసంత రాయలు నై వస్తాను అని ,అప్పుడు జరగబోయే కొన్ని వింతలు  వీరబోగ వసంత రాయలు రాకకు గుర్తుగా ఉంటాయని కూడా "కాలజ్ఞానం '" లో చెప్పడం జరిగింది . అలాంటి వింతల్లో 'పంది కడుపున ఏనుగు పుట్టును ' అనేది కూడా ఒకటి . అ వాక్యం వేరే రూపంలో  నిజమయిందా  అని అనిపిస్తుంది "నార్వే'" దేశం లో జరిగిన ఈ వింత జననం చూస్తుంటే .
                                                                   

 నార్వే దేశం లో ని అండర్సన్ ,అలెగ్జాండర్ అనే   దంపతులకు ఒక పిల్లవాడు కలిగాడు . అయితే అ పసివాడు ఏనుగు పిల్ల మాదిరి వింత ఆకారం తో జన్మించడం తో తల్లి తండ్రులు అతనిని ఎవరికీ కనపడకుండా రహస్యంగా ఉంచినప్పటికి ,చివరకు అది బయటకు పొక్కి మిడియా వాళ్ళ చెవిన పడింది అంట . చివరకు ఆ వింత బాలుడిని యూ ట్యూబ్ లో పెట్టె సరికి అందరూ వింతగా చూసినా ,మన దేశం వాళ్ళు మాత్రం సాక్షాత్తు గణేషుని అవతారం అని అంటున్నారు అంట . ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు  లోను బగవంతుని దర్శించే హిందూ జీవన విదానం లోని గొప్పదనం అదే కదా !

కాని నార్వే కు చెందిన ఆ బాలుడి తల్లి తండ్రులు మాటలు వింటుంటె వీరు మనుషులా ? పందులా ? అనిపిస్తుంది . తమకు పుట్టింది "అష్టా వక్రుడు " అయినా తల్లి తండ్రులకు అంతో ఇంతొ మమకారం ఉంటుంది .ఆ కారణం వలననే వికలాంగులు అయిన పిల్లలు భూమి మీద జివించ గలుగుతున్నారు .కాని ఈ చిన్నారి తండ్రి అలెగ్జామ్డర్ తమకు పుట్టింది ఒక క్రీచర్ అని ఈసడించడమె కాక ,ఆ పిల్ల వాడిని 'బేస్ మెంట్ "లో ఉంచి ,రోడ్ల మీద ఏరుకొచ్చిన చెత్త ని అతడికి ఆహారంగా ఇస్తాను అని ,కుదిరితే ఇండియా లో ఎవరికైనా ఇస్తాను అని ,వారైతే ఆ వింత బాలుడిని 'తాజ్ మహల్ " లో పెట్టి చిరంజీవి గా ఉంచుతారని  చాలా అసహ్యంగా మాట్లాడాడు . అలెగ్జాండర్ కు అబ్బిన సైన్స్ విజ్ఞానం అలా అతనిలోని మానవత్వాన్ని చంపి వేసింది అన్న మాట. పిల్లల ఆలనా పాలన పట్టించుకోకుండా తిరిగే తల్లి తండ్రులను "పంది కన్నట్లు కనగానె సరిపోదు 'అని మన పెద్దలు తీడుతుంటారు . అ లెక్కన ఆండర్సన్ దంపతులు పందులు క్రిందే లెఖ్ఖ .

  ఆవిధంగా చూసినపుడు బ్రహ్మం గారు తన కాల జ్ఞానం లో చెప్పిన మాటలు ఇలా నిజమయ్యాయ్యా !? అని అనిపిస్తుంది .