నేను ఇదే బ్లాగులో తెలంగాణా రాష్ట్ర విభజన విషయం గురించిన టపాలలో తెలంగాణా బిల్ విషయంలో గొప్ప డ్రామా అడిస్తుoదని చెప్పటం జరిగింది . అటు చేసి చేసి చివరకు తెలంగాణా ప్రజల చెవిలో పూవులు పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయిందని అర్ధమవుతుంది . దీనికోసం పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలు అందరిని వంచించే రీతిలో ఒక హై డ్రామా నడపటానికి రంగం సిద్దమయింది . ఒక వైపు పార్లమెంటులో బిల్ పాస్ కావడానికి చిత్త శుద్దితో ఉన్నామని ప్రజలను నమించదానికి తెగ ఆరాట పడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంకొక వైపు సమైక్యామ్ద్రా చాంపియన్ గా తాము ప్రమోట్ చేస్తున్న ముఖ్య మంత్రి గారికి సుప్రీం కోర్టు ద్వారా రాష్ట్ర విభజన ఆపే విదంగా టెక్నికల్ అవకాశాలు ఇస్తున్నారు . అవేమిటో చూదాం .
రాజ్యాంగం ప్రకారం అసెo బ్లికి ఒరిజినల్ బిల్ పంపాల్సి ఉంది కాని అలా పంపలేదు . డ్రాప్ట్ బిల్ పంపారు . ఇది బలమైన టెక్నికల్ పాయింట్ . దిని సాకుగా చూపి ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ అ బిల్ ని తిరస్కరించింది . అంటే రాష్ట్ర విబజనను కాకుండా టెక్నికల్ పాయింట్ మిద రాష్ట్ర విభజన బిల్ ని తిరస్కరించి వెనుకకు పంపింది . దినిని సరిచేసి తిరిగి అసెoబ్లికి పంపాలి కాని అలా చెయ్యకుండా డైరెక్టుగా అదే బిల్ ని ఈ నెల 10 వ తారికున రాజ్య సభలో ప్రవేశ పెడుతున్నట్లు హొమ్ మంత్రి ప్రకటించారు . ఇది మరో ఘోర తప్పిదం . రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి మాత్రమె పార్లమెంటుకు బిల్ ని రికమెండ్ చెయ్యాలి. ఈ విషయంలో కేంద్ర మంత్రి మండలి కలుగ చేసుకోవడం అంటే రాష్ట్ర పతి గారి అధికారాలను బంగపరచినట్లే . రాష్ట్రపతి గారు చెప్పాల్సిన మాటను పబ్లిక్ గా కేంద్ర మంత్రి చెప్పడం వలన మొత్తం ప్రొసిజర్ పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది . ఇది చాలు సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకోవడానికి . మరి ఇలా చెయ్యటం వలన లాబపదెది ఎవరు ? నష్టపోయేది ఎవరు? తరవాతి టపాలో చూదాం . ఎందుకంటే డ్రామా ఈ రోజే మొదలయింది ,ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది కాబట్టి . మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .