Friday, December 20, 2013

B.C కులంలో పుట్టినంత మాత్రానా B.C. నాయకులు కాలేరు, B.C ల అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి నాయకుడు B.C యే !.


                                                        

మన రాజకీయాలలో ఒక తప్పుడు అభిప్ర్రాయం  ఉంది . అదేమిటంటే B.C   కులం కి సంబందించిన రాజకీయ నాయకులు B.C  ల అభిరుద్ది కోసం తెగ ఆలోచిస్తారని, తక్కిన కులాల వారు ఎవ్వరూ B.C  ల సంక్షేమాన్ని పట్టించుకోరని. నిజమైన ప్రజా  నాయకుదు కి కుల మతాల వివక్షత లేకుండా ప్రలందరి సంక్షేమం గురించి ఆలోచిస్తాడు.

   అయితే మన దేశం లో ఉన్న ప్రత్యేక పరిస్తితుల వలన అంటే కొన్నీ యేండ్లుగా కుల వ్యవస్త మాటున కొన్ని వర్గాల ప్రజలు సామాజికంగా అణచి వేయబడ్డారు. వారిని ఇతర వర్గాల ప్రజలతో సమానం గా ఎదగడానికి కొన్న ప్రత్యెక రాయితీలు రిజర్వేషన్ ల రూపం లో ఇవ్వడం తప్పనిసరి అయింది. అలా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వర్గాలను ఎంపిక చెయ్యడానికి "కులం" ప్రాతిపదిక తప్పా , మరేది మెరుగైనడిగా కనపడ లేదు. అందుకే   షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులుగా ప్రజలను కుల ప్రాతిపదిక పరంగా గుర్తించి , వారికి రిజర్వేషన్ లు కలుగ చేసారు. కాబట్టి ఈ  వర్గాలుకు చెందిన ప్రజలు రాజ్యంగ పరంగా ప్రబుత్వ రాయితీలు  పొందడానికి అర్హులు.

   వీరు సంఘాలు పెట్టుకోవటానికి, తమ కోరికలు ప్రభుత్వాలకు చెప్పుకుని , తమ హక్కులు సాదించుకోవటానికి అర్హత కలిగిన వారు. వీరు నిర్వహింవ్చే సభలకు, సమావేశాలకు రాష్ట్రపతిని పిలిచినా , రావాల్సిన అవసరం ఉంది. అదే ఏ అగ్ర వర్ణం వారో సభ పెడితే అది "కుల సంఘ సభ" అవుతుంది. కానీ రాజ్యాంగం గుర్తించిన పై వర్గాల వారు ఎవరు సభ పెట్టినా అది కుల సంఘ సభ గ బావించి రావడానికి  ఏ అధికారి నిరాకరించరాదు. అది ఆ యా వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నిరాకరిస్తున్నట్లు బావించవచ్చు.

    ఇక పోతే B.C  కులంలో పుట్టినంత మాత్రానా B.C.  నాయకులు కాలేరు, B.C  ల అభివృద్ధి  కోసం ఆలోచించే ప్రతి నాయకుడు B.C  యే అని నా అభిప్రాయం. ఈ  ప్రస్తావన ఎందుకంటే , మొన్న హైదరాబాద్ లో B.C ల హక్కులు గురించి  "బి.సి ల సింహ గర్జన " అనే పేరుతో , B.C లు కొంతమంది ఒక సభ నిర్వహించారు. దానికి B.C  నాయకులతో పాటు, పార్టి పరంగా 100 సీట్లు B.C  లకు కేటాయిస్తాను అని ప్రకటించిన , తెలుగుదేశం అదినేత నారా చంద్ర బాబు నాయుడు గారిని కూడా  వేదిక మీదకు ఆహ్వానించారట! దానితో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు కోపం వచ్చిన B.C  ల సభలో B.C  యేతరుడు ఎలా అని చిందులేస్తో , సభను వీడి వెళ్లి పోయారట! B.C  సభకు అన్నీ పార్టీల అద్యక్షులను పిలచి తమకు ఎన్నికలలో సగం సీట్లు కావాలని కోరితే బాగుండేది. కానీ అలా పిలవనంత మాత్రానా చంద్రబాబు గారు B.C  ల సభలో పాల్గొనే అర్హత లేదనడం "కొంచపు తనం" అవుతుంది తప్పా , అది B.C  లకు ఏ మాత్రం మేలు చేసే ఆలోచన కాదు.ఇదే సందు అని చెప్పి కొన్నీ చానళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూసాయి . అటువంటి దానిని ఈ  క్రింద ఇవ్వబడిన వీడియో లింక్ లో చూడండి. 

          
            

Sunday, December 15, 2013

ABN చానల్ వారు చేసిన స్టింగ్ ఆపరేషన్ ఎందుకు డంగై పోయింది!?

                                                             



                             తెలుగు జాతి రక్తంలో అవినీతి అనేది ఇంకి పోయింది. తెలుగు రాష్ట్ర విబజన గురించి ఎంతో మరిగి పోతున్న  జాతీ రక్తం అవినీతి అంటే చల్లగా గడ్డ కట్టి పోతుంది. రాష్ట్ర విబజన గురించి నిత్యం బండబూతులు తిట్టుకుంటూ , ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ నాయకులు అవినీతి విషయం లో మాత్రం ఒక సీక్రెట్ అవగాహన తో మెసులుతున్నట్లు అని పిస్తుంది.

     24-11-2013 తేదినాడు, దమ్మున్న చనల్, దుమ్ము రేపే చానల్ అని చెప్పుకునే ABN  వారు రాష్ట్రం లోని కొంతమంది ప్రముఖ నాయకులు తమ వద్ద నున్న నల్ల దనాన్ని, తెలివిగా  ఎలా తెలుపు చేస్తున్నారో ,ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన వివరాలను ప్రసారం చెయ్యడం జరిగింది. అది చూసి నేననుకున్నాను, ఇది రాష్ట్రం లో పెను సంచలనం స్రుష్టిస్తుందని. బహూశా చానల్ వారు కూడా అదే ఊహించి ఉండవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా "సంచలనం" కాదు కదా, సమ్ చలనం కూడా లేకుండా పోయింది. దీని వలన అర్దమయింది ఏమిటంటే తెలుగు జాతి రక్తం అవినితిని సహించే స్తాయికి ఎదిగి  పోయింది. ఎవరైన అవినీతి గురించి చెపితే "ఇట్స్ కామన్ యార్" అనే స్తాయికి తెలుగు కామన్  మాన్ ఎదిగాడు. అందుకే డిల్లీలో "ఆం ఆద్మీ" గా కేజ్రీవాల్ ముందుకు రాగలిగినా, రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ "కామన్ మాన్" థీం  ముడుచుకు పోతుంది. దాని బదులు "కరప్షన్ మాన్"  విజయం సాదించేటట్లు ఉన్నాడు. శబాశ్ !

      24-11-2013 తేది నాడు ABN  చానల్ వారు ప్రసారం చేసిన ఈ వీడియో ను చూడండి           




             

Thursday, December 12, 2013

AIDS కారకాన్ని ప్రోత్సాహిస్తున్న సోనియా , రాహుల్ గాందీ !

                                                               

సమాజంలో మానవ జీవనానికి విఘాతం కలిగించే దుర్నీతి , దుర్నడతలను తప్పుబట్టవలసిన అవసరం ఆ యా సమాజం లలోని మేదావులందరి పైన ఉంది. స్వలాబాలను , పార్టీల ఓట్ల కోసం సదరు దుర్నడతలను ప్రోత్సాహిస్తే దాని ప్రబావం సమాజం లోని అందరి పైన ఉంటుందనేది మేదావులు అనబడుతున్న వారు మరచి పోకూడదు .
  మొన్న సుప్రీం కోర్టు వారు స్వలింగ సంపర్కాలను నేరం గా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు చాల మంది గే, లెస్బియన్ మేధావులను నిరాశ పరచింది. ఇదేదో తమ వ్యక్తీ గత హక్కులకు భంగం అని కొంత మంది ప్ల  కార్డులు చేత పట్టి వీదుల్లో హంగామా చేస్తున్నారు. దానికి సామాజిక కార్యకర్తల ముసుగులో కొంత మంది దీనికి వత్తాసు పలుకుతున్నారు.

ఈ  సృష్టిలో ప్రతి జీవ రాశికి ప్రక్రుతి పరమైన రక్షణలు ఉన్నాయి. అలాగే సెక్స్ లో కూడా  ప్రక్రుతి నిర్దేశించిన సహజ రతి క్రియ ద్వారా మానవుడు పునరుత్పత్తి పొందటమే కాక , సహజఆరోగ్య  రక్షణ పోందుతున్నాడు. మనిషిలో రతి సమయం లో సహజంగా ఉత్పత్తి అయ్యే కొన్ని ద్రవాలు యొక్క రక్షణ పలితాన్ని కేవలం సహజ రతి ప్రక్రియలోనే పొందగలరు. ఒక అద్యయనం ప్రకారం సహజ రతి ప్రక్రియలో కంటే అసహజ రతి ప్రక్రియ లో ఎయిడ్స్ ముప్పు 1800% ఎక్కువట! మరి ఇలాంటి ముప్పు కలిగిస్తున్న స్వలింగ సంపర్కాలను వ్యతిగత స్వేచ్చా పేరుతో మన దేశ రాణీ , యువరాజు లు అని మెజార్టీ ప్రజల చేత కొనియాడ బడుతున్న సోనియా గాందీ , రాహుల్ గాంది   గారలు , ప్రోత్సాహించడం ఎంతవరకు సమంజసం?. ప్రజల ఆరోగ్యాలకు బంగం కలిగించెట్టట్లు ఉంటే, అది  మత పరమైన హక్కులైన సరే నియంత్రించవలసిందే అని భారత రాజ్యాంగం చెపుతుంది. మరి మన  దేశం లో ఉన్న కొద్ది మంది గే , లెస్బియన్ ల కోసం మెజార్టీ ప్రజల ఆరోగ్యాలకు  కీడు తెచ్చే స్వలింగ సంపర్క సంస్కృతిని ప్రోత్సాహించడం , కొంతమంది మేదావులనబడే వారిలోని అజ్ఞానానికి ప్రతీక అనుకోవచ్చా!?

      ఇదే విషయం పై మరింత సమాచారం కొరకు చూడండి http://www.aidsmap.com/HIV-transmission-risk-during-anal-sex-18-times-higher-than-during-vaginal-sex/page/1446187/

Wednesday, December 11, 2013

"గృహ హింస నిరోదక చట్టం" మొగుళ్ళు చావుకొస్తే , మరి "మత హింస నిరోదక చట్టం " ఎవరి చావు కోసం?

                                                             


ఈ  దేశాన్ని విదేశి సంస్క్రుతి యే ఏలుతుంది. తమ పార్టీ వోట్ల కోసం కొన్ని వర్గాల ప్రజలని నిరంతరం బయపెడుతూ , వారి రక్షణ కోసం ఎదో ఒక పనికి మాలిన చట్టం చేస్తూ , తాము మత్రమే సదరు వర్గాల ప్రజల రక్షణకు కంకంణం కట్టుకున్న వీరాది వీరులమని కుహన లౌకిక వాదులు ప్రజలను నమ్మించ చూస్తున్నారు.
ఇప్పటికే కొన్ని వర్గాల రక్షణకు ఉద్దేసించిన చట్టాలు 95% దుర్వినియోగమై , ప్రజల మద్య ఒక కాన రాని విభజన రేఖ ఏర్పడుతూ , ఏ వర్గ రక్షణ కైతే చట్టాలు చేయబడ్డాయో , అ వర్గపు ప్రజలను మిగతా ప్రజలకు దూరం చేస్తున్నాయి అనడం లో అతిశయోక్తి ఏమి లేదు. ఇప్పుడు చాలా  మంది కొన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా ఉండడానికి బయపడుతున్నారు. వారితో డబ్బు లావాదేవీలు లాంటివి నడపడానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు. వారికి తమ వద్ద ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా వారికి భయం పుడుతుంది. ఒక్కప్పుడు మన సమాజంలో కొన్ని వర్గాల వారిని అంటరాని వారిగా పరిగణించి వారిని అవమానించారని, అలాంటి చర్యలు నాగరిక సమాజం లో కూడదనే ఉద్దేశ్యం తోనే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చిన మాట నిజమే అయినా, ఆ చట్ట నిర్మాణం లో కొన్ని  జాగర్తలు తీసుకోక పోవటం వలన చివరకు ఆ చట్టం అమలులో 95% దుర్వినియోగమై తప్పుడు కేసులు పెట్టి ప్రత్యర్దులను హింసించడం ఒక లాభ సాటి వ్యాపార మయ్యే సరికి , సామాన్యుడు ఏమి చెయ్య లేక చివరకు ఆ వర్గ ప్రజలకు దూరంగా ఉండదమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. ఏ అంటరాని తన్నాన్ని ప్రజల మద్య రూపు మాపాలని చట్టం చేసారో , ఆ అంట రాని  తనం ని ఎక్కువ చెయ్యడం లో ఆ చట్టం దోహదపడింది. కాకపోతే ఒకటే తేడా! ఆ నాడు కనపడే అంటరాని తనం, ఈ  నాడు కనిపించని అంట రాని తనం.

 ఇక పోతే గృహ హింస చట్టం తెచ్చిస్త్రీలకు లకు రక్షణ పేరుతో , భర్తలను, వారి కుటుంబ సబ్యులను హింసిస్తూ , వారి ఆత్మ హత్యలకు కా రణమవుతుంది. ఈ  చట్టం కూడా  ఆచరణలో దారుణంగా అంటే 95% విపలమై , కొంతమంది స్త్రీలు అంటే పురుషులు బయపడి పోయే స్తితిని కల్పించింది. నిజమయిన బాదిత స్త్రీలు ఈ చట్టం వలన రక్షణ పోందింది తక్కువ అనేది గణాంకాల వలన అర్దమవుతుంది. దీని పుణ్యమా అని ఎన్నడూ  లేని విదంగా పురుష హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి అంటే పరిస్తితి ఎంత ఘోరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు!

 ఇక ఇప్పుడు మత  హింస నిరోదక బిల్లు పేరుతో మైనార్టీల రక్షణకు బిల్లు తేవాలని తెగ ఉబలాట పడుతుంది సోనియా గాంది  గారి  ప్రభుత్వం . ఒక వేళ ఇది వస్తే ఇక మైనర్టీలను" ఎం బ్రదర్ బాగున్నవ్వా" అని కూడా పలకరిమ్చ లేక ఫొవచ్చు. హిందువుల నమ్మకాలను ఎవరైనా ప్రశ్నించవచ్చు, కాని మైనర్టీల అశాస్త్రీయ బావనలు ఎవరూ ప్రశ్నించ లేక ఫొవచ్చు. ఎందుకంటే వారు మానసికంగా గాయపడతారు కాబట్టి. అదీ పరిస్తితి ! పాపం హిందువులది ఎంత దయనీయ పరిస్తితి? ఇటువంటి దిక్కు మాలిన చట్టాలను సమర్దించే వారికి ఎన్నికలలో బుద్ది  చెప్ప లేక పోతే మన దేశం లో మన సంస్కృతిని కాపాడుకోలేని దీన స్తితిలో ఉండడం ఖాయం.

Friday, December 6, 2013

సోనియా గాందీ పుట్టిన రోజు సీమాంద్రా కాంగ్రెససోల్ల చావు కొచ్చింది!

                                                 
 
ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది అని సామెత! అచ్చం  అలాగే ఉంది, సోనియా గాందీ పుట్టిన రోజు కహాని . డిసెంబర్ 9 ని సీమాంద్రా ప్రజలు ముఖ్యంగా సీమాంద్రా కాంగ్రెస్ నాయకులు మరచిపోలేని దినం గా మారనుంది. ఎందుకంటే ఆ రోజు వలనే తాము నమ్ముకున్నకాంగ్రెస్  పార్టీ కి సీమాంద్ర ప్రజలు గోరి కట్టడానికి కారణ మవుతుంది! తెలివిగా తమిళ తంభి  చిదంబరం K.C.R  గారి చేత నిరాహార దీక్ష చేయించి ఆమె జన్మ దిన కానుకగా పొందిన వరం "తెలంగాణా రాష్ట్రం" . కా బట్టి నాలుగేళ్ళ క్ల్రితమే తెలుసు శ్రీ మాన్ చిదంబరానికి మరియు K.C.R  గారికి, తెలంగాణా ఎట్టి పరిస్తితుల్లో ఆగదని. తెలంగాణ ఇవ్వడం లో సోనియా గాంది కి ఉన్న ఇంట్రస్ట్ కేవలం తన పుట్టిన రోజు కానుకగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడమే తప్ప , వేరే రాజకీయ ఆసక్తులు ఆమెకు లేక పోవచ్చు. ఎందుకంటే ఆమె రాజకీయ పరంగా ఆమెకు ఉన్న జ్ఞానం నిల్  కాబట్టి.

   కానీ చిదంబరానికి మాత్రం ఈ  విషయం లో గట్టి పట్టుదలతో  ఉన్నాడని నిన్న జరిగిన ఉదంతం కూడా తేట తెల్లం చేస్తుంది. నిన్న కేంద్ర కాబినెట్ లో టేబుల్ ఐటం గా తెలంగాణా మీద గ్రూప్ అప్ మినిస్టర్స్ నివేదికకు ఆమోదం తెలిపే ప్రక్రియ చేపట్టాకా , మన రాష్ట్ర మంత్రులు అయిన పల్లం రాజు, కావూరి "ఇది అజెండా లో లేకుండా టేబుల్ ఐటం గా ప్రవేశ పెట్టారు కాబట్టి , విషయ అవగతం కు ఒక 2 రోజులు టైం  ఇవ్వండి " అని అడిగితే ప్రదాన మంత్రి గారు O.K  అన్నారట! కానీ వెంటనే చిదంబరం గారు కలుగ చేసుకుని "అదంతా కుదరదు, వెంటనే ఆమోదం తెలపాల్సిందే" అనే సరికి , రాష్ట్ర మంత్రులు ఇద్దరూ లేచి బయటకు వచ్చేశారట! కాబట్టి 2014 లోపు తెలంగాణా ఏర్పాటు అనేది చిదంబరం "చింత" లో నుంచి పుట్టి, సోనియా పుట్టిన రోజుకు ముడి పెట్టి , అది త్వరిత గతిన సాదించడంలో సక్సెస్ అయ్యడు.

 ఈ  కుట్ర తెలియని సీమాంద్రా నాయకులు ఏమి జరగదు అనే దీమాతో ప్రతి దానికి తల ఆడించి, ప్రజల అభిప్రాయాన్ని సోనియా గాంది కి చెప్పకుండా , తెలంగాణా అంటే తమకు అబ్యంతరం లేదని చెప్పడం వల్లే , రాష్ట్ర ఏర్పాటు సాధ్య పడింది. ఇప్పటికి వారు తమ తప్పు తెలుసుకోకుండా ప్రజలను మబ్య పెడతానికే చూ స్తున్నారు. కేంద్రం లో అద్ కార కాంగ్రెస్ , ప్రతిపక్ష B.J.P  తెలంగాణా కు O.K  అన్నాకా , ఇక బిల్ ఆమోదం పొందడమనేది నల్లేరు మీద నడక. అవసరమైతే రాజ్యంగ సవరణకు కావాల్సిన 2\3 మెజార్టీ ఉంది కాబట్టి పార్ల మెంట్ లో బిల్లు పెడితే నెగ్గడం ఖాయం. ఈ  విషయంణ్ లో కాంగ్రెస్ వారికి, B.J.P  వారికి ఒక అవగాహన ఉందనడానికి నిదర్శనం నిన్న "రాయల తెలంగాణా" ప్రతిపాదన నుండి కేంద్ర మంత్రి వర్గం డ్రాప్ అయి 10 జిల్లాల తెలంగాణాకు ఆమోద ముద్ర వెయ్యడమే!

   కాబట్టి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది సీమాంద్రా  రాజకీయ నాయకులు నిర్లక్ష్య దోరణీకి , మితిమీరిన విశ్వాసానికి , అమ్మకు ఎదురు చెప్పలేని చేతకాని తనం వలననే సాద్యపడింది. దీనికి తెలంగాణా నాయకులూ వారికి థాంక్స్ చెప్పాలి మరి! ఇదే విషయం మీద ఇదే  బ్లాగులో నేను చెప్పిన విషయం ఎలా నిజమయిందో చూడండి

(నాన్నా "తెలంగాణా" వచ్చే!http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html)

Sunday, December 1, 2013

"సువ్వర్ కా బచ్చా " అనేదే మనిషికి కరెక్ట్ అంట!

                                                            


శాస్త్ర విజ్ఞానం , శాస్త్ర విజ్ఞానం అని మనం సైంటిస్టులు చెప్పే దానిని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కానీ వారు మొన్నటి దాక మనిషి "కోతి" నుండి పరిణామ క్రమం లో అభివృద్ధి చెందిన వాడు అంటే సరేలే "బందర్ కా బచ్చా " అనేగా అంటున్నది అని ఊ రుకున్నారు . కానీ ఇప్పుడేమో కాదు, కాదు మనిషి కోతినుండి అభివృద్ధి చెందిన వాడు కాదు, వాడు ఆడ చింపాంజీకి , మగ పందికి పుట్టిన అక్రమ సంతానం అని సెలవిచ్చాడు ఒక సైంటిస్ట్. అమ్మా ! ఎంత పని జరిగింది! చివరకు మానవ జాతీ అంతా  అక్రమ సంతానం అయి పోయిందన మాట!

   ఈ మాత్రం కనిపెడతానికి సైంటిస్ట్ లకి ఇన్నాళ్ళు పట్టింది. అదే విషయాన్ని మనలో కొంతమంది పెద్దలు ఏనాడో చెపితే ఎవరైనా పట్టించుకున్నారా? కాకపోతే వారు తిట్ల రూపం లో చెప్పారు . వీరేమో శాస్త్రీయంగా చెపుతున్నాం అంటున్నారు అంతే తేడా! పెద్దలు పిల్లల్ని తిట్టే తిట్లలో "పంది నా .... ! అని సువ్వర్ కా బచ్చా అని అనడం వింటుంటాం. అంటే తమకు తెలియకుండానే తమ మూల పురుషుణ్ణి స్మరిస్తున్నారు అన్నమాట!

   చర్మ కణాలు, గుండె తాలూకు వాల్వ్స్లలక్షణాలు  పందికి మనిషికి ఒకటే నంట. ఆకారం, ఇతరత్రా చింపాజీకి దగ్గర పోలికలు కలిగి ఉంటాడు మనిషి. మనిషిలో తమ పూర్వీకుల  లక్షణాలు ఉండి తీరతయి కాబట్టి , ఈ  రెండు లక్షణాలు మనిషిలో ఉంటానికి కారణం వాటి మద్య ఎప్పుడో జరిగిన అక్రమ సంపర్కమే అని అమెరికన్ సైంటిస్ట్ Eugene McCarthy అనే అయన సిద్దాంతం అనుకుంటా . అయన ఏమి చెప్పాడో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ  క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు. 

   పంది అంటే కొంతమందికి యమ అసహ్యం. హిందువులు విష్ణువుని  "వారాహ మూర్తి" గా పూజిస్తారు కాబట్టి వారికి పర్వాలేదు కానీ , పంది అంటే అసలు పడని వారు ఈ సిద్దాంతాన్ని కోడా అసహ్యించుకుంటారు అనుకుంటా! ఏదైనా పెద్దల తిట్లు దీవెనలే కాదు , సైన్స్ సిద్దాంతాలు కూడా  అన్నమాట! http://www.dailymail.co.uk/sciencetech/article-2515969/Humans-evolved-female-chimpanzee-mated-pig-Extraordinary-claim-American-geneticist.html

Saturday, November 30, 2013

స్త్రీ లకు స్వేచ్చ నిస్తే, సమాజం లో "కాల్ గాల్స్" కంటె "కాల్ బాయ్స్ " ఎక్కువ అవుతారా ?

        కొన్ని కొన్ని విషయాలు వింటుంటే సమాజం లో స్వేచ్చకు నిజమయిన అర్దం తెలుసుకునే శక్తీ ప్రజలందరికి ఉంటుదనుకోవటం చాలా పొరపాటు అనిపిస్తుంది. జ్ఞాన వంతులు 10% ఉంటారు . మిగాతా వారు వారిని అనుసరించడమే కరెక్టు తప్పా , మెజార్టీ అభిప్రాయాలు కు విలువ ఇచ్చి దానీ ప్రకారం సమాజం ని ఉంచాలంటే దాని అంత బేవకోఫ్ తనం మరొకటి ఉండదేమో అనిపిస్తుంది . ప్రజాస్వామ్యం అంటే ప్రజలకోసం ఆలోచించేదా? లేక మెజార్టీ ప్రజల చేత ఆలోచింపబడేదా? ఒక దొంగని మెజార్టీ ప్రజలు దొర  అంటే ఒప్పుకోవలసిందేనా? ఒక వేశ్యని మెజర్తీ ప్రజలు తమ రోల్ మోడల్ అంటుంటే అంగికరించ వలసిందేనా? ఒక్కడైన సరే పది మందికి ఉపయోగపడే మాట చెపితే అది ప్రజాస్వామ్య ఆలోచన కాదా? కాదు మనం అరువు తెచ్చుకున్న ప్రజాస్వామ్య బావనలో పాక్షిక సత్యం తప్ప సంపూర్ణం గా నిజం లేదు. of the people, by the people అనేవి ప్రజాస్వామ్య సూత్రాలు అయినా కాక పోయినా , for the people మాత్రం ఖచ్చితంగ ప్రజాస్వామ్య సూత్రం. కాబట్టి ప్రజలకు మేలు చేసే మాట ఒక్కడు చెప్పినా వినే వాడే నిజమైన విజ్ణుడు. అటువంటి ప్రజలు ఉన్న సమాజమే ప్రజాస్వామ్య సమాజం.

   ఈ  ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెపుతున్నాను అంటే , స్త్రీ స్వేచ్చ కోసం పోరాటాలు చేసి, చేసి, చివరకు పురుషునితో పాటు స్త్రీ కూడా  సమానం అని రాజ్యాంగం లో రాసుకున్న మనం నిజంగా స్త్రీ స్వేచ్చ  కొన్ని విషయాల్లో సంపూర్ణంగా సాదించినట్లే కనపడుతుంది. పురుషంకార సమాజంలో "కాల్ గాళ్స్ " ఉంటే సమ సమాజం లో "కాల్ బాయిస్ " కూడా  తయరయ్యారు. శబాష్!  స్త్రీ లకు  స్వేచ్చ నిస్తే పురుషుల తో పాటు అన్నీ రంగాల్లో అభివృద్ధి సాదిస్తారు అనుకుంటే అన్ని రంగాల్లో ఏమో "అనంగ రంగం లో మాత్రం సమానత్వం సాదించారు(కొంత మంది మాత్రమే సుమా). ఈ  విషయం లో మన హైదరాబాద్ లో "కాల్ బాయిస్ గా మారిన హైదరాబాద్ యువకులు గురించి ఈ  క్రింది విడియో లింక్ ని క్లిక్ చేసి చోడండి.

Wednesday, November 27, 2013

తెలివి గల "తెహెల్కా తేజ పాల్" స్వయం ప్రకటిత శిక్ష తో పోలిస్ ఉచ్చులో చిక్కుకున్నాడు !

                                                    
రంకు నేర్చినోడు బొంకు నేర్వకపోతే ఎటువంటి చిక్కుల్లో పడతాడో డి గ్రేట్ "తరుణ్ తేజ్ పాల్ " ఉదంతం తెలియ చేస్తుంది. నా ఉద్దేశ్యం అబద్దాలు చెప్పి కేసులు నుండి తప్పిచుకోమని కాదు. తప్పు జరిగాక బాదితుల అంగీకారం లేకుండా, వారితో సంబందం లేకుండా తనంతట తాను తను చేసిన నేరాలకు శిక్షను ప్రకటించుకోవటం,దానిని స్వయంగా అమలు పరచుకోవడం , పరివర్తన చెందిన గొప్ప మహానుబావుడిగా పోజులు కొట్టడం ఇవ్వన్నీఅతన్ని చివరకు డిఫెన్స్ తీసుకోలేని స్తితికి నెట్టి వేశాయి. వివరాలు లోకి వెలితే,

 అయన పేరు తరుణ్ తేజ్ పాల్ . స్టింగ్ ఆపరేషన్లతో పెద్ద పెద్ద మగాళ్ళ నే గడ గడ లాడించిన తెహెల్కా వీక్లీ  మేగజైన్ వ్యవస్తాపక చీఫ్ ఎడిటర్. ఇతను ఎంతో మంది యువ జర్నలిస్టులకు మోడల్ రోల్. అటువంటి పెద్ద మనిషి తన స్నేహితుని కూతురుతో అనుచితంగా ప్రవర్తించి తన కొంచపు బుద్దిని బయట పెట్టుకున్నాడు. గోవాలో జరిగిన ఒక పత్రికా కార్యక్రమంలో తనతో పాటు పాల్గొన్న తెహెల్కా పత్రికా లేడి జర్నలిస్ట్ ను అసబ్యంగా తాకరాని ప్రాంతాలలొ తాకి, ఆమె ప్రవైసీకి బంగం కలుగ చేసాడు. దీనితో ఖంగుతిన్న ఆ అమ్మాయి , ఆ పత్రికా లేడి చీఫ్ ఎడిటర్కు సెల్ మెసేజ్ ద్వారా విషయం తెలియచేసి బోరుమంది. దానితో దిమ్మ తిరిగి తేజ్ పాల్ తన పెద్దమనిషి తన్నాన్ని కప్పెట్టుకునేందుకు ఆ లేడి జర్నలిస్టుకు క్షమాపణ చెపుతున్నాను అని, అలాగే తను తెహెల్కా బాద్యతలు నుండి 6 నెలలు సస్పెండ్ అవుతున్నాని, కాబట్టి విషయాన్ని అంతటితో వదిలెయ్యమని ఆ ఎడిటర్ ని కోరాడట .

   తేజ్పాల్ చేసినది మాత్రం అతితెలివి పనే అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళా ఉద్యోగినుల వేదింపుల చట్టం ప్రకారం ఏ స్త్రీ ఉద్యోగిని పైన అయినా లైంగిక వేదింపులు జరిగితే బాదితుల అనుమతితో ఒక కాంప్రమైజ్ కు వచ్చి తదనుగుణంగా కాంప్రమైజ్ సెటిల్మెంట్ రాసుకుని దానిని అమలు చేయమని కోరవచ్చు. కానీ ఈ  కేసులో అమ్మాయిని సంప్రదించకుండా తనే క్షమాపణ చెప్పడం , తనే 6 నెలలు పత్రికా బాద్యతల నుండి తప్పుకోవడం ఇవ్వన్నీ విషయాన్నీ మసి పోసి మారేడు కాయ చేసే అతి తెలివి పనులు. ఆ పనులే ఇప్పుడు అతన్ని పీకల్లోతు కష్టాలలోకి నెట్టాయి. జాతీయ స్తాయిలో పోకస్ అయిన ఈ  వ్యవహారం పై గోవా ప్రభుత్వం సుమోటో గా స్పందించి విచారణ చేపట్టింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కాక , చీఫ్ ఎడిటర్ నుంచి తేజ్పాల్ ప్రకటన కు సంబందించిన రికార్డులు స్వాదీనం చేసుకుంది. దానితో కళ్ళు తెరిచినా తేజ్పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పెటిషన్ వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. కానీ స్వయం ప్రకటిత  శిక్షను విదించుకున్న అతని తెలివి అతనిని ఖచ్చితంగా కట కటాల్లోకి  నెట్టవచ్చు. కాబట్టి ఏ పని చేసినా కీడెంచి మేలెంచాలన్నారు పెద్దలు. ఎంతైనా పెద్దల మాట పెద్దల మాటే , అడునికుల చేష్టలు ఆటవిక చేష్టలే!

Monday, November 25, 2013

అమ్మాయిలూ కష్టపడి షేవింగ్ చేసి బ్రతికినా గౌరవమే ! చీటింగ్ లు చెస్తే మాత్రం కటకటాలు తప్పవని రుజువు చేసిన వైజాగ్ పోలిస్!

                                                           


  అమ్మాయిలూ పై పొటోలో మాదిరి బార్బర్ షాప్పుల్లో  పనిచేసి మగవారికి సైతం షేవింగ్ లు చేసి శారీరక శ్రమ తో జీవించడం నేటి సమాజం ఆమోదిస్తుంది. దీనికి ఏ మాత్రం బిడియపడవలసిన పనిలేదు. పనిపాట చెయ్యకుండా, కుటుంబాలకు వీసమెత్తు సహాయం అందించకుండ బలాదూర్ తిరిగే ఎంతోమంది కుర్రకారు ఇటువంటి   స్త్రీలను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. "శ్రమయేవజయతే "

  కానీ కొంత మంది స్త్రీలు పురుషులలోని వీక్నెస్ ను అవకాశంగా తీసుకుని వారిని మోసం చేస్తూ జీవిశ్తుంటారు. ఇటువంటివరే ఇద్దరు ఐ మద్య వైజాగ్ లో ఒక సైట్ ఓపెన్ చేసి "అమ్మాయిలతో పరిచయాలు" కావాలా అంటూ పేపర్లలో, పేస్బుక్ లో ప్రకటనలు ఇచ్చేసరికి అమ్మాయి అని పేరు వినపడితే చాలు"సొల్లు కార్చుకునే" వారు కొంతమందా "మాకు కావాలి" మాకు కావాలి" అంటే ముందుగా రిజిస్ట్రేషన్ పిజ్ కట్టాలన్నారట! సరే అని కట్టిన తర్వాత ఇక కాంటాక్ట్ బంద్ చేసే సరికి ఎవరో ఓపిక ఉన్నవారు పోలిస్ కేసు పెడితే వారు ఆ అమ్మాయిలను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఆ అమయిలను చూడాలి అనుకుంటేఈ  వీడియో లింక్ ను చూడండి