Tuesday, November 19, 2013

Face Book లో లైక్ ల కోసం వేగంగా వస్తున్నా రైల్ క్రింద పడుకున్న పిల్లలు!



 సామాజిక సైట్ అయిన ఫేస్ బుక్ పిచ్చి పిల్లలను ఎంత ప్రమాదకరమైన పనులు చేయిస్తుందో ఐ క్రింది విడియో లింక్ ను చూస్తె తెలుస్తుంది. ఆడపిల్లలు ఏమో "నేను బాగున్నానా " అని కామెంట్ల కోసం పోటోలు పెడుతూ, అపరాచితులకు తమ అందాలు ప్రదర్శిస్తుంటే , మగ పిల్లలు ఏమో తమ వీరత్వాన్నీ ప్రదర్శిస్తూ, ప్రమాదకరమైన ఫీట్లు సెల్ పోన్ ద్వారా చిత్రీకరించి మరీ ఫేస్ బుక్ లో పెడుతున్నారు. ఇటువంటి చేష్టలను నియంత్రించడానికి తగిన నియమ నిబందనలు త్వరగా ఏర్పాటు చేయకపోతే ఈ  పిచ్చి ముదిరి పాకాన పడేటట్లుంది.

  మైనర్ లు సెల్ పోన్ లు ఉపయోగించకుండ చట్టం చేస్తే ఎలా ఉంటుంది? ఒక వేళ సెల్ ఇచ్చిన కేవలం ఒక నంబర్ కు మాత్రమే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండే సెల్ లు మాత్రమే ఉపయోగించలి. అంతే కాక ఎట్టి పరిస్తితిలో మైనర్ ల సెల్ లకు నెట్ కనెక్షన్ ఉండ కూడదు.  అటువంటి సెల్ లను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పే అధికారం పబ్లిక్ కి ఉండాలి . అంటే మైనర్ లు నిషేదిత సెల్ లను ఉపయోగించడాన్ని "కాగ్నిజబుల్  అపెన్స్ " గా గుర్తించాలి. ఇలా చేస్తే కొంత నియంత్రణా భయం ఉంటుంది అనుకుంటా!

ఫేస్బుక్ లో లైకుల కోసం పిల్లలు చేసిన ఆ ప్రమాదకర ఫీటు కోసం క్రింది విడియో లింక్ ను చూడండి
                       


                                         

Sunday, November 17, 2013

ఇండియన్స్ అందరి లో ఉన్నది హిందూ D,N.A యే నట!

మొన్నీ మద్య ఒక విడియో చూసాను. ఆ వీడియో లో ప్రముఖ   B.J.P  రాజకీయ వేత సుబ్రమణ్య స్వామీ గారు మాట్లాడుతూ  , తాజా D.N.A  అద్యయనం వలన, భారతీయుల అందరిలో ఉన్నది ఒకటే D.N.A  అని అది మన పూర్వికులదైన  "హిందూ D.N.A " అని తెలిపారు. అయన చెప్పిన దాని ప్రకారం ఇంతవరకు చరిత్రకారులు చెపుతూ వస్తున్నా కదలు అయిన "ఆర్యుల దండ యాత్ర లు. , ద్రవిడుల సంస్క్రుతి ఇవ్వన్ని పనికి రాని  ఊహ వాదాలుగా అయన కొట్టి పారేశారు. కాబట్టి ఏ మతస్తులైన సరే ఇండియాలో ఉన్నవా రందరిది ఒకటే D.N.A  కాబట్టి మౌలికంగా వారంతా హిందువులే. కొన్ని ప్రత్యేక కారణాల వలన వివిధ మతాలూ అవలంబించి , తమ పూర్వికులు వేరే వారనే దురభి ప్రాయం లో ఉన్నారు అని శ్రీ సుబ్రమణ్య స్వామీ సెలవిచ్చారు. సైన్స్ ఆవిష్కరణ ల వల్లా , ఇప్పటి వరకు చదువుకున్న చరిత్రలు  తారు మారయ్యే అవకాసం ఉందని ఐ D.N.A.  ఆవిష్కరణలు రుజువు చేస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామీ గారి ప్రసంగం తాలూకు ఐ క్రింది విడియో  లింక్ ను  క్లిక్ చేసి చూడగలరు .

Published on Jan 2, 2013
Muslims think of themselves as an international Community , they think they are the descendants of Arabs , this is not true DNA studies have shown they are of the same DNA as other Hindus , their ancestors were hindu . Aryan Invasion theory and Dravidian theory are all disproved by Dna Studies all Indians have same DNA

Saturday, November 16, 2013

పార్లమెంట్ కంటే ముందే రాష్ట్రాన్ని విడదీసిన A.P.S.R.T.C.

                                                       



సీమాంద్రా ప్రజలు ఎంత సమైక్యతా రాగం ఆలపిస్తూ ఇటు గల్లీ నుంచి డిల్లీ దాకా తమ గోడు వెళ్ళ బోసుకుంటున్నా , రాజకీయ నాయకులు, ప్రజలే కాదు ప్రభుత్వ రంగ సంస్తలు కూడా  రాష్ట్ర విభజన జరిగి పోయినట్లే బావిస్తున్నాయి. అందుకు మంచి ఉదాహరణ మొన్న A.P.S.R.T.C.  వారు  మరియు ఆంద్ర ప్రదేశ్ టూరిజం డెవలెప్మెంట్ వారు కార్తీక మాసం సందర్భంగా  ప్రకటించిన " పంచారామా సందర్శన పదకం ".
         టూరిజం డిపార్ట్ మెంట్ వారి ప్యాకేజీలో బాగంగా హైదరాబాద్ నుండి ప్రతి శని అది వారాలు "అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం మరియు సామర్ల కోట లోని శివ క్షేత్రాలు ఉన్నాయి . ఇవన్నీ సీమాంద్రా లోని శివ క్షేత్రాలు.
అలాగే రంగారెడ్డి  R.T.C డిపో వారి ప్యాకేజీలో తెలంగాణ లోని 5 శివ క్షేత్రాలు అయిన పాలకుర్తి , 1000 స్తంభాల గుడి, రామప్పా , వేముల వాడ, కాళేశ్వరం ఉన్నాయి. ఈ విదంగా అసలు పంచారామాలు అనబడే 5 శివ క్షేత్రాలు సీమాంద్రా లోనే ఉన్నాయి . కానీ రాష్త్రం విడి పోయిందనే బావనకు వచ్చిన A.P.S.R.T.C. వారు "డెక్కన్ మహా శివాలయాలు " అనే పేరుతో నూతనంగా "తెలంగాణా  పంచారామా" లను  ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ప్యాకేజి కల్పించారు. అయ్యో శివుడా ! ఈ   రాష్ట్ర విభజన  నీ ఆలయాలను వదలిపెట్టటం లేదు కదా!

అయినా సరే ! పంచారామాలు అంటే ఏమిటో , వాటి గురించిన విశేషాలు ఇక్కడ బ్లాగులో ప్రచురించి , పంచారామా సందర్శన బాగ్యం కలిగినట్లు ఆనందిస్తాను. మీరు కూడా  తెలుసుకుని తరించండి. విభజనలు అనే రాజకీయ పరమైనవి. భక్తులకు భగవంతునికి మద్య అవి అడ్డు గోడలు కట్ట లేవు .

 ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.
3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.
4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

Thursday, November 14, 2013

బ్లాగుల్లో గీత: పోస్టు లు పెట్టు వీరెవరు ? కామెంటులు పెట్టు వారెవ్వరు?!

                                                     

 ఈ  మద్య  కొన్ని బ్లాగులను నిశితంగా గమనిస్తే, ఒక విషయం బోదపడుతుంది. ఆ బ్లాగుల్లో పోస్టు పెట్టిన వారు  కానీ, వారి సంబదీకులు కానీ నాలుగైదు కామెంట్లు , సదరు బ్లాగు పోస్టులోని విషయానికి వ్యతిరేకంగా , లేక అనుకూలంగా పెడుతూ వీక్షకులను రెచ్చగొట్తీ  తమ బ్లాగు టపా వైపు ఆకర్షింప బడేలా చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఇటువంటి వాటికి పేరులు వేర్వేరు గా ఉండాలి కదా అంటే అవసరం లేదు. అందరిని ఆదుకునే ఆ "అజ్ఞాత " వ్యాఖ్యాత వీరికి సహాయం చేస్తుంటాడు. అజ్ఞాత పేరుతో చిన్నా ,పెద్దా , మంచి మర్యాద లేకుండా నానా బూతులు తిడుతూ  తమ అసహ్యకర దోరణిని బయట పెట్టుకుంటారు .

  ఒక విషయం మీద అనేక రకాల అభిప్రాయాలు ఉండవచు. ఉండాలి కూడా . అలాగే ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించవచ్చు. విబేదించవచ్చు. దీనికి వేరే బాష ప్రయోగించాల్సిన  అవసరం కానీ, తమ లోని కుసంస్కారన్ని తెలిపే విదంగా పద ప్రయోగం చేయవలసిన అవసరం ఏముంది? సంస్కారమైన  పదజాలంతోనే తమ లోని నిరసన స్తాయిని ప్రతిద్వనించేలా చేయవచ్చు. అలా చేయాలంటే ముందు మనలో సంస్కారం ఉండాలి. మన సంస్కారం ఏమిటో పదిమందికి తెలియ చేయటానికి మన అసలు పేరో, కలం పేరుతోనో బ్లాగుల్లో పోస్టులు , కామెంట్లు పెట్టే దమ్మూ , దైర్యమూ ఉండాలి. అంతే కాదు , అలా  దమ్ము దైర్యమూ ఉన్న వారి కామెంట్లనే అనుమంతించాలి. బ్లాగు నిర్వహణ అంటే కేవలం బావ ప్రకటనే కాదు అది సంస్కారవంతైన , పదిమందికి ఆమోద యోగ్యమైన బాషాజాలం తో కూడినది ఉండాలని నా అభి ప్రాయం. ఒక వేళ కాదు , నేను ఇలాగే రాస్తాను అంటే దానికి వేరే "అడల్ట్ " కాటగిరి బ్లాగులు ఉన్నాయి కాబట్టి అందులో చూపించవచ్చు, బాషా నైపుణ్యం.

   ఏది ఏమైనా ఇటువంటి బ్లాగులు తక్కువగానే ఉన్నా వాటిలోని విషయాలు మీద ఏదైనా కామెంట్ చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాతి కామెంటర్ చండలకరమైన పదజాలంతో తన అసహనం తెలియ చేస్తే? దానిని బ్లాగర్ అనుమతిస్తారు కాబట్టి, అలాంటి బ్లాగుల్లో కామెంట్ లు పెట్టక పోవడమే మంచిది అనిపిస్తుంది. కాబట్టి ఈ  విషయం లో సహా బ్లాగర్లు ఆలోచిస్తారని ఆశ . అంతే !.

చచ్చాడు అనుకున్న మొగుడు కాసేపు బ్రతికి , బార్యని ఆమె ప్రియున్ని కటకటాల లోకి నెట్టి చనిపోయాడు

                                                     

 కొన్ని కొన్ని సంఘటనలు "దేవుడు అనే వాడు  ఉన్నాడు అనిపిస్తుంటాయి".పాపులను శిక్షించటానికి దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అని తెలియ   పరచటానికి ప్రత్యేకించి కదలు చెప్పనవసరం లేదు. నిత్య జీవితంలో జరిగేవి కూడా  అందుకు సాక్ష్యంగా ఉంటాయి. అలంటి ఒక సంఘటణ మొన్న 8 వ తరీకున బెంగుళూర్ లో జరిగింది.

  అయన పేరు దయానంద స్వామి . చాలా ఏండ్ల క్రిందట బెంగలోర్ వచ్చి అక్కడక్కడ హోటల్లో పని చేస్తూ , అలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక బేకరీ పెట్టుకున్నాదు. ఆయనకి బార్య రత్నమ్మ , ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకి ఆయనకి 20 ఏండ్ల అంతరం ఉంది. అందుకే ఆమెకి అతనితో అసంతృప్తి ఉండేది కాబోలు. అయన గారేమో తన బేకరీ చూడటానికి తన మేనల్లుని తెచ్చి పెట్టాడు. రత్నమ్మ కన్ను తనకంటే చిన్నొడైన ఆ కుర్రాడి మీద పడింది. మెల్లగా వాడిని ముగ్గులోకి దించింది. ఇది కనిపెట్టిన దయానంద స్వామీ ఆమెను, ఆ కుర్రాడ్ని మందలించి ,బేకరీ నుండి వెళ్ళ గొట్టి , బార్యను ఇక నుండి జాగర్తగా ఉండమన్నాడు అంట.

    రుచి మరిగిన కుక్క అలవాటు మానుకోవటం కష్టం కాబట్టి, వారు వారి సంబందానికి పుల్స్టాప్ పెట్టుకోవటం ఇష్టం లేక , దయనందా స్వామీ జీవితానికే పుల్స్టాప్ పెడదామని డిసైడ్ అయి పోయారు.అతని మేనల్లుడు వేరే బేకరిలో పని చేస్తున్నప్పటికీ , రత్నమ్మ తో అక్రమ సంబందం చాటు మాటుగా కోన సాగిస్తున్నాడు. ఒక రోజు ఆతను తిరిగి వారిద్దరిని రెఢాండెడ్ గా పట్టుకుని , పెద్ద గొడవ చేస్తే , ఆ రోజు అతను నిద్రలో ఉండగా బార్య , మేనల్లుడు కలిసి అతని గొంతు పిసికి చంపారు. అతను చని పోయాడు అని నిర్దారించుకున్నాక , అతని బందువులకు , చుట్టు ప్రక్కల వారికీ ఆతను నిద్రలో గుండె పోటు చని పోయాడు అని కదలల్లారు. అతని దహన సంస్కారాలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

   ఇంతలో ఆ వచ్చిన బందువులలో ఒకరికి దయానంద స్వామీ లో ఎక్కడో చిన్న కదలిక కనపడి , అనుమానంగా  పరిక్షించి చూస్తె ఎక్కడో ఊపిరి ఉన్నట్లు కనిపెట్టి హాస్పిటల్లో చేర్చారు. అక్కడ హాస్పిటలో డాక్టర్లు సపర్యలతో కొంత సేపు బ్రతికిన దయానంద స్వామి తన బార్యా మేనల్ళుల బాగోతం గురించి "మరణ వాంగ్మూలం " ఇచ్చి మరీ చని పోయాడు. ఆ దెబ్బతో పోలిసులు అక్రమ ప్రియుడు , ప్రియురాలిని కటకటాల లోకి నెట్టి , విచారణ చేస్తున్నారు. అదీ కద!

 అందుకే అంటారు "తలచినదే జరగినదా , దైవం ఎందులకు? అని

Tuesday, November 12, 2013

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న K.C.R గారు విష్ణు మూర్తి అవతారమా !?

                                                    

నేను ఈ   మద్య  మన్వంతరాలు గురించి ఒక పురాణ బాగం చదివాను.హిందూ పురాణం  లోనివి అని అందులో చేప్పబడిన అంశాలు "దశవాతార" సిద్దాంతానికి కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదాహరణకు దశావతారాలలో వామన అవతారం 5 వది. అది నరసింహా స్వామీ అవతారం తర్వాత వస్తుంది. అయన తర్వాత వచ్చేది పరశురామావతారం . కానీ "మన్వంతర " సిద్దాంతం ప్రకారం ఏడవ మనువైన వైవస్వత మనువు పేరుతో ప్రారంభమైన ప్రస్తుత "వైవస్వత మన్వంతరం " లో అవతరించిన విష్ణుదేవుని అవతార స్వరూపమే వామనుడు .
 ఈ  వామన అవతారమే "బలి చక్రవర్తిని " పాతాళానికి త్రొక్కి  వేసి , అతని వద్దనుండి "ఇంద్ర " పదవిని "పురంద్రుడికి అప్ప చెపుతూంది. అయితే ఎంతో ధర్మ నిష్టుడైన "బలి చక్రవరి" దాన గుణానికి సంతసించి అతనికి రాబోయే మన్వంతరం లో అంటే "సూర్య సావర్ణిక మన్వంతరం " కాలం లో తిరిగి ఇంద్ర సింహాసనం అధిష్టింప చేస్తానని వరమిస్తాడు. అలా బలి చక్రవర్తికి  భగవాన్ విష్ణు మూర్తి  వరం ఓకటి  పెండింగ్ లో ఉంది .

ప్రస్తుతం రాజరికాలు పోయి ప్రజాస్వామ్యాలు వచ్చాయి .దళిత బావజాల వాదులు హిందూ సాంప్రాదాయక దేవుళ్ళును పూజించవద్దని, రాక్షస వంశజులైన రావణుడు, బలి చక్రవర్తి , నరకాసురుడు వంటి వారిని పూజించాలని నూతన బావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ , కొన్ని విశ్వ విద్యాలయాలలో వారి పేరు  మీదనే "ఉత్సవాలు" చేస్తున్నారు. అయితే బలి చక్రవర్తికి స్వయంగా విష్ణు మూర్తే వరం ఇచ్చాడు కాబట్టి , అటు సాంప్రదాయక హిందూ సిద్దాంతం ప్రకారం కూడా  రాక్షస వంశజుడైన "బలి చక్రవర్తి" ఇంద్రుడు కావల్సిందే. ఇది దళిత నాయకులకు ప్లస్ పాఇంట్. కానీ మహా బలి ని ఇంద్రుడు చేయాలంటే భగవాన్ విష్ణు మూర్తి కూడా  తిరిగి అవతారం ఎత్తాలి. అయన అవతారం ఎత్తాలి అంటే మన్వంతరం మారాలి . కానీ సాంప్రదాయక హిందూ లెక్కల ప్రకారం ఇప్పట్లో మన్వంతరం మారదు.

   కానీ కోంత మంది సిద్దాంత కారుల ప్రకారం "వైవస్వత మన్వంతరం "  వెళ్లి  మనం "సూర్య సావర్ణిక మన్వంతరం " లోకి అడుగు పెట్టామట! అందుకే  బలి లాంటి రాక్షస వంశీయులకు పూజలు మొదలయ్యాయి అట. త్వరలో రాక్షస వంశీ యులే   ప్రజా నాయకులై అధికారాన్ని చేపడతారట! మరి దళిత నాయకులు కు ఇంత అనుకూలంగా ఉన్న హిందూ మతగ్రందాలలోని అంశాలు నమ్ముతారో , నమ్మరో ! అయితే మనకు త్వరలో ఏర్పడబోయే "తెలంగాణ రాష్ట్రం " కి ముఖ్యమంత్రిగా "దళిత వర్గం " నాకు చెందిన వారినే నియమిస్తాను అని  తె. రా . స అదినేత గతం లో దళితులకు వరం ఇచ్చారు . మరి ఆ వాగ్దానాన్ని అయినా దళిత నాయకులు నమ్మితే , రేపు వారి వర్గం వారే తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా K.C.R.  గారిని తమ కోసం అవతరించిన బగవంతుడు అనుకుంటే , పురాణాలలో చెప్పిన విష్ణు మూర్తి అవతారం K.C.R గారే అని అనుకోవచ్చా ?

  మొత్తానికి దళిత బావజాలికులు హిందూ పురాణాలను నమ్మక పోయినా , పురాణాలలో వారికే బవిష్యత్ ఇంద్ర పీఠం అని బగవంతుడు వరమిచ్చినట్లు ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే! నేను చదవిన ఆ పురాణం తాలుకూ పేజి ని క్రింద చూడగలరు.(viii chap, 3rd para).

Monday, November 11, 2013

"క్షీర సాగర 'మదన'o " సూత్రం ఫేస్ బుక్ పరిచయాలకు వర్తిస్తుంది!

                                                

ఈ  మద్య ఫేస్ బుక్  ఖాతాదారులు అయిన కొంత మంది స్త్రీలు   మిత్రుల సమావేశం లో తమ బాదతో కూడిన అభి ప్రాయాలు  వెలి బుచ్చారు. వారి ఆవేదనలో అర్దం ఉంది. వారి మాటల ప్రకారం తమ కంటే ఎంతో చిన్న వారు అయిన మగపిల్లలు  , అందులో తమ పిల్లలు వయసు ఉన్న వారు కూడా  తమకు ప్రెండ్ రిక్వెస్ట్ పంపమని వత్తిడి తెస్తుంటారట. అలా ఒకరు  పోనీలే ఎంతో ఇదిగా అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆ కురాడినిమ్ ప్రెండ్ గా ఆడ్  చేసి వాడి పోస్టింగ్ లు చూస్తె మైండ్ బ్లాంక్ అయినంత పని అయిందట. ఆ విషయ్యాన్ని ఆవిడ గారు చెపుతూ , అలా చేయవద్దని ప్రాదేయపడే దోరణిలో కోరుతుంటే నాకు ఆమె అమాయకత్వానికి జాలి వేసింది.

   పేస్ బుక్ ని మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం స్నేహితులుగా ఎంచుకో బోతున్న వారు ఏ దృష్టితో వాడుతున్నారు అనేదే ప్రధానం. పేస్ బుక్ లో ఒక్కప్పుడు కంటే ఇప్పుడు కొంత పరిపక్వత చెందిన వారు ఖాతా దారులుగా ఎక్కువుగా చేరుతున్నప్పటికి కుర్ర కారు మత్రం దానిని ఇంకా తమ లోని వికారాలు ప్రదర్శించ దానికే వినియోగిఒస్తున్నారు అని చెప్పక తప్పదు. ఈ  పేస్ బుక్ విషయం లో "క్షీర సాగర మదనo సూత్రం " వర్తిస్తుందని ఎందుకు అంటున్నాను అంటే దానికి దీనికి కొంత పోలిక ఉంది . అదేమిటంటే:-

   "పూర్వం దేవతలు ,రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. అజరామరులు గా  ఉండడానికి  ఇరు వర్గాలకు "అమృతం " అవసరం కాబట్టి , ఒక అవగాహనా మేరకు మందర పర్వతాన్ని కవ్వం గా, వాసుకి ని తాడు గా చేసి పాల కడలిని మదించడం మొదలు పెట్టారు. అప్పుడు ముందుగా ఉద్బవించింది "హాలా హలం" అంటే విషం . దాని దెబ్బకు ముల్లోకాలు తల్లడిల్లాయట . దానిని స్వీకరించడానికి ఎవరికీ శక్తి లేదు. స్వికరిమ్చక పోతే  సాగర మదనం కుదరదు. అప్పుడు మహా దేవుడైన శివుడు ఆ గరళాన్ని తను మింగి అది లోపలకు పోకుండా కంఠం లోనే దాచుకుని గరళ కఠుండైనాదు.  అ విదంగా క్షీర సాగర మదనం కోన సాగించి అమృతాన్ని సాదిస్తారు దేవ దానవులు . ఆ తర్వాతి కద మనకు అవసరం లేదు.

    ఈ  కదను నేను ఎందుకు పేస్ బుక్ తో పోల్ఛానంటే ఒక మంచి  కోసం ముందుకు పోతున్నపుడు ముందుగా ఎదురయ్యేది చెడే కావచ్చు . కానీ దానిని అదిగమిస్తేనే మంచి అనేది దొరకదు. ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపేన్ చేసే వారిలో చాలా మంది తమ ఒరిజినల్ పోటోలు కానీ , అడ్రెస్ కానీ ఇవ్వరు. ఆడపిల్లలు అయితే సరే. కానీ మగపిల్లలు కూడా  ఆడపిల్లల పేరుతో అకౌంట్ లు ఓపెన్ చేసి ఆడపిల్లలతో స్నేహాలు కలిపి చాటింగ్ లు చేస్తూ ఉంటారు. ఇది లేని పోని వ్యవహారాలకు దారి తీసి  తమ జీవితాలు నాశనం చేసుకున్న వారి గురించి పేపర్లలో చదువుతున్నాం. కాబట్టి ఇటువంటి వారి అకౌంట్ ల పట్ల జాగర్త గా ఉంటే, ఫేస్ బుక్ విషయ సేకరణకు, సామజిక అవగాహనకు బాగా పనికి వస్తుంది. ప్రజల  అభిప్ర్రాయాలు తెలుసుకోవడానికి సామాజిక వెబ్సైట్లు ను ప్రభుత్వ వర్గాలు ఉపయోగించడం గమనార్హం.మీ బావాలను , మీ లోని నైపుణ్యాలను పది మందితో పంచుకుని , మీ విషయ పరిదిని పెంచుకోవడానికి , మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది తప్పకుండా పనికి వస్తుంది. కాకపొతే దానిలో ఉన్న రాక్షసుల అకౌంట్ లను పట్టించుకోకుండా , ఎవరి అకౌంట్ అయినా కొంత కాలం పరిశీలించాకే వారిని మిత్రులుగా స్వీకరింఛి వారితో మీ బావాలు షేర్ చేసుకోవడం  మంచిది.మీ ఫేస్ బుక్ మిత్రులు గురించి మీ కుటుంబం లోని వారికి కూడా తెలియటం మంచిది. అప్పుడే మీకు పేస్ బుక్ జ్ణానామ్రుతం  పంచగలగటం  తో పాటు స్వాంతన చేకూర్చగల మాద్యమం అవుతుంది. పేస్ బుక్ దానవులు ని నిరోదించటానికి సాంకేతిక అవగాహన కలిగిఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి నుండి బెడద ఉండక పోవచ్చు.

Friday, November 8, 2013

తెలంగాణా వాదుల "వసూల్ దందా " నుండి వ్యాపారస్తులని రక్షించడానికే "తెలంగాణా " ప్రకటిస్తున్నారా? !

                                                     


మొన్నటి దాక చిరంజీవి గారు హైదరాబాద్ ని "U.T " చేయాల్సిందే అంటే, ఏమో లే సీమాంద్రుల కోరికను ద్రుష్టిలో పెట్టుకుని ఆ విదంగా డిమాండ్ చేసి వారి మెప్పు సంపాదించుకోవాలి అనుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ మొన్న మాజీ I.P.S  అధికారి విజయ్ కుమార్ నేతృత్వం లోని "టాస్క్ పోర్స్ " బృందం , వారం రోజులు కసరతు చేసి ,కేంద్ర  హోం శాఖ కు  ఇచ్చిన నివేదిక చూస్తుంటే "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ వాదులు కంటే సీమాంద్ర మరియు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్న ఇతర వర్గాల వారే ఎక్కువుగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది చ

  ఆ మద్య ఒక సారి చిరంజీవి గారు t.r.s  మిద ఆరోపణలు చేస్తూ, వారు సినిమా వర్గాల వారి  దగ్గర  బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన అక్రమ వసూలకు గురించిన సమాచారం తన దగ్గర ఉందని చెప్పినట్లు గుర్తు . కాని దాని గురించి రాదాంతం చేస్తే చివరకు దాని ప్రభావం వలన తమ సినిమాలు తెలంగాణా లో నష్టపోతాయి అనే ఉద్దేశ్యంతోనే కాం గా ఉండి , తెర  వెనుక పైరవీలు చేసి "తెలంగాణ" ఏర్పాటు ప్రకటనతో తమ బాధలకు పుల్స్టాప్ పెట్టాలను కుంటునట్లుంది . మొన్న టాస్క్ పోర్స్ వారు హోO శాఖకు ఇచ్చిన నివిదేకలో 'తెలంగాణా వాదుల బలవంతపు వసూలు" నుండి సీమాంద్రుఅను రక్షించడానికి హైదరాబాద్ ని గవర్నర్ అజమాయిషిలో ఉంచాలి అని చెప్పారట. అంతే కాకుండా తెలంగాణా వ్యాప్తంగా ఉన్న సీమాంద్రుల ఆసక్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం అవసరం అని కూడా  నివేదికలో పొందుపర్చారు అట!

   వారు నివేదికలో ఇచ్చిన అంశాలు మరియు సీమాంద్రా మంత్రులు కోరుతున్న కోరికలు చూస్తుంటే తెలంగాణా వారికి "తెలంగాణ" అనే పేరు తప్పా ఏమి దకేటట్లు లేదు. అలగే సీమాంద్రుఅకు ఒక సమైక్యం అనేది తప్పా అన్నీ లాభాలు వారికే అనిపిస్తుంద సీమాంద్రుల రక్షణ పేరుతో పదేండ్ల పాటు కేంద్ర అజమాయిషిలో ఉన్న హైదరాబాద్ను పదకొండో సంవత్సరం అయినా  తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారని గ్యారంటీ ఏమిటి? అప్పటికి మరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తెలంగాణాలో ప్రోస్తాహించి ఆ వంక తో హైదరాబాద్ ని శాస్వతంగా కేంద్ర అజమాయిషిలో ఉంచుకుంటే కాదనే దమ్మున్న వాడు ఎవరు? ఈ  తతంగం అంతా  చూస్తుంటే తెలంగాణా సాయుడ విముక్తి పోరాటం సమయంలో జరిగిన కదా అని ఒక పెద్దాయన చెప్పిన సంగటన గుర్తుకు వస్తుంది. అదేమిటంటే :-

      తెలంగాణా లో రజాకర్ల మీద పోరాటం తర్వాత కమ్మోనిస్ట్ దళాలు తెలంగాణ లోని బూస్వాముల మీద తమ పోరాటం కొనసాగిస్తుంటే , వారిని అణచి వేయడానికి భారత ప్రభుత్వం పోలిస్ ఆక్షన్ ని రజాకర్ల లొంగుబాటు తర్వాత కోడా కొనసాగించిందట. అటువంటి సమయం లో స్తానిక కమ్మ్యూనిస్ట్ దళాలను అణచి వేయడానికి ఒక రెడ్డీ దొర  గారు పైరవీ చేసి కొంత పోలిస్ బలగాన్ని రప్పించుకుని తన బంగ్లా  లోనే  వారికి బస కల్పించి, కమ్మ్యునిస్ట్ దాడుల నుండి భయం లేకుండా చేసుకున్నాడు అంట. ఆ తర్వాత కమ్మ్యూనిస్ట్ లు కూడా  ఆ ప్రాంతాల నుండి ,కనుమరుగైనా ,ఆ పోలిస్ బెటాలియన్ కమాండర్ మాత్రం ఆ రెడ్డిగారి భవనం విడచి వెళ్ళడానికి ఇష్టపడక , పైకి తప్పుడు నివేదికలు పంపుతూ తన బలగంతో సహా అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. అను మానం వచ్చిన ఆ" దొర గారు " ఆరా తీస్తే నమ్మ లేని చేదు నిజం బయట పడిందట! ఆ దొరగారి తాలూకు "దొరసాని" కి ఆ కమాండర్ కి అక్రమ సంబందం ఏర్పడటం వలన ఆ సుఖాలను వదులుకోలేక తప్పుడు నివేదికలతో తను అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. దానితో అటు భార్యను ఏమనలేక, ఇటు పోలిస్ వారిని ఎదిరించే దమ్ము లేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడట ఆ "దొరగారు". అదీ కద.

   రేపు తెలుగు వారి పరిస్తితి అంతే . ఒకరి మీద ఒకరు  అనుమానాలతో, ఏదో వస్తుందన్న పేరాశతో రాజదాని నగరాన్ని వదులుకుంటే దానీ మీద శాశ్వతంగా ఆశ వదులు కోవాల్సిందే! తస్మాత్ జాగర్త  

Thursday, November 7, 2013

వెలగని "ఒలంపిక్స్ కాగడ " ని అంతరిక్షం లో ప్రదర్శించాలనుకోవడం ని సైన్స్ వాదుల "పిచ్చి" కి పరాకాష్ట అనుకోవచ్చా!?

                                                       

పెబ్రవరి7 , 2014 లో సోషలిస్ట్ దేశమైన రష్యా లోని సోచి స్టేడియం లో వింటర్ ఒలంపిక్స్ గేమ్స్ 2014 మొదలు కాబోతున్నాయి . ఇవి పెబ్రవరి 23 వరకు సాగుతాయి. ఒలంపిక్స్ సాంప్రదాయం ప్రకారం "ఒలంపిక్స్ టార్చ్ " ని వెలిగించి అది ఆరకుండా వివిధదేశాల  క్రీడాకారుల బాగస్వామ్యంతో అన్ని ప్రాంతాలలో తిప్పి, చివరకు ఆ టార్చ్ తోనే స్టేడియం లో లోని జ్వాలను రగిలించడం  ద్వారా, ఒలంపిక్స్ గేమ్స్ ప్రారంబిస్తారు. ఇందులో ప్రదానమైన  మైన విషయం ఏమిటంటే "ఒలంపిక్స్ జ్యోతి" బయలు దేరిన నాటి నుండి స్టేడియం కు తిరిగి చేరే వరకు వెలుగుతూనే ఉండాలి.  

   కానీ ఈ  సారీ గేమ్స్ నిర్వహిస్తుంది ఘనత వహిస్తున్న సోషలిస్ట్ దేశం గా ప్రకటితమైన రష్యా వారు కాబట్టి, వారికి సాంప్రఫ్దాయలు అంటే అసలు పడదు కాబట్టి ఒక కొత్త ఆలోచన చేసి దానిని అమలు చేస్తున్నారు. తాము నిర్వహించే "వింటర్ఒలంపిక్స్ 2014 " తర తరాలు గుర్తుండి పోయేలా ఒలంపిక్స్ జ్యోతి ని బూమి మీదే కాక అంతరిక్షం లో కూడా  తిప్పాలని సంకల్పించారట. మరి అక్కడ మనుషులు ఉండని ప్రాంతం కదా అంటే ఎవరైనా అనుకోవచ్చు. మనుషులు ఉండక పోతే ఉండక పోయారు కనీసం ఒలంపిక్స్ జ్యోతి వెలగడానికి అవసరమైన గాలి కూడా  ఉండదు. అంతే కాదు స్పేస్ క్రాప్ట్ లోకి వెళ్లగానే ఆ జ్యోతి ని అర్పి వేయాలి. ఇందుకు బద్రతా పరమైన అంశాలు కారణం. అలాగే వ్యోమ నౌక నుండి బయటకు వెళ్లి అంతరిక్ష నడక నడచేటప్పుడు , అక్కడ ఆక్సిజెన్ ఉండదు  కాబట్టి 'ఒలంపిక్స్ జ్యోతి " వెలిగే ప్రశ్నే లేదు. అంటే ఎప్పుడైతే  ఒలంపిక్స్ జ్యోతి తో వ్యోమగాములు స్పేస్ క్రాప్ట్ లో ప్రవేసిస్తరో అప్పుడే ఒలంపిక్స్ జ్యోతి ఆరిపోతుంది. ఇక ఆ ఆరిపోయిన జ్యోతి ని అంతరిక్షం లో తిప్పి తమ "పిచ్చి" ని ప్రదర్సీమ్పబోతున్నారన మాట ఘనత వహించిన వ్యోమగాములు , వారిని ప్రోస్తహిస్తున్న సైంటిస్ట్ లు, మేదావులు, ప్రభుత్వాలు.అలా మద్యలో ఆర్పివేసిన "ఒలంపిక్స్ జ్యోతి"తో బ్రహ్మాండంగా "వింటర్ ఒలంపిక్స్ 2014" ప్రాంబిస్తారట.

  అదే పని ఏ మత వాదులో చేస్తే , వారిని దుమ్మెత్తి పోసే వారే.కానీ ఈ  పని చేస్తుంది సైన్స్ వాదులమని చెప్పుకునే సోషలిస్టులు కాబట్టి ఎవరూ ఏమి అనరు. పిచ్చి అనేది ఎవరికైనా ఒకటే . సైన్స్ వాదులు , సోషలిస్ట్ వాదులు దీనికి మినాహాయింపు కాదని ఈ  తాజా ఉదంతం తెలియ చేస్తుంది. అందుకే మన ప్ర్పెద్దలు అంది "అతి సర్వత్రా వర్జ్యయేత్" అని. అందుకే అనేది "హూజ్ మాడ్  థోస్  హప్పి"

Wednesday, November 6, 2013

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? !!!..


                                                         

 మంగళ యాన్ ! భారతీయులు తరపున మొట్ట మొదటిసారిగా మంగళ లేదా అంగారక గ్రహం చుట్టూ తిరగి విషయ సేకరణ చేయట్టానికి పంపిన స్పేస్  క్రాఫ్ట్ పేరు అది. దాని బరువు 1350 కిలోలు. దీని ని నిన్న మద్యాహ్నం P.S.L.V 25 ద్వారా భూ కక్ష్యలో  ప్రవేశ పెట్టారు. దీనితో తోలి దాస పూర్తయింది. ఇంకా ఎనిమిది నెలలు జాగర్తగా పర్యవేక్షిస్తూ అంగారక గ్రహ కక్ష్యలోకి వెళ్ళేలా చేయగలిగితే అప్పుడు భారతీయుల కల నెరవేరుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అంగారకుడి మీద రోవర్లు దించి పరిశోదన చేస్తున్నాయి . మనం మాత్రం అంగారకుడి పై కాలు మోపకుండా దాని కక్ష్యలో తిరుగుతూ , అంగారకుడి గురించి మరింత సమాచరం తెలుసుకోవడమే" మంగళ యాన్ " ప్రయోగ ఉద్దేశ్యం.

 అసలు నాకనిపిస్తుంది "డార్విన్" చెప్పిన "జీవ పరిణామ " సిద్దాంతం తప్పేమో అని . ఎందుకంటే ఆ సిద్దాంతం ప్రకారం ఇప్పటి ఆదునిక మానవుదు "కోతి " నుండి అనేక మార్పులు పొందుతూ చివరకు మనిషి లా రూపొందాడు అట. ఇలా రూపొందటానికి గరిష్టం గా 20,000 సంవత్సరాలు కాలం సేరి పోతుందని ఒక అంచనా. మరి ఒక లెక్క ప్రకారం ఆప్రికా ఖండం లో ఆదునిక మానవుడుకి మూల రూపమైన 'హోమో సేపియన్" ఆవిర్బవించి 2,00,000 {రెండు లక్షలు ) సంవత్సరాలు అయిందట. కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళబట్టి కేవలం డెబ్బై యేండ్ల క్రితమే మొదలయింది అందంటారు.ఆసియా ఖండానికి వచ్చి 15,000 యేంద్లేనట. మరి కోతి నుండి మనిషిగా పరిణామం చెందటానికి 20,000 సంవత్సరాలు సరిపోతే సుమారు 1,50,000 సంవత్సరాల పాటు ఒకే ప్రాంతం లో ఎలా ఉండగలిగాడు మానవుడు అంటే ఇప్పటికి సమాదానం దొరకని ప్రశ్నే. కోతి నుండి మానవుడు పరిణామా క్రమం చెందితే ఇంకా కోతులు కనపడడానికి కరణం ఏమిటి? అని చాల మంది ప్రశ్నిస్తుంటారు. ఒకే ప్రాంతం లో పరిణామ క్రమం చెందిన జీవులు, చెందకుండా మూల రూపాలోనే మిగిలి పోయిన జీవులు కలసి  ఉండటానికి అవకాశం ఉందా ? ఒకవేళ మనం ఆప్రికా నుండి రూపాంతరం చెంది వచ్చిన కోతులుకు వారసులం అయితే , ఆప్రికాలో కోతులు ప్రస్తుతం లేవా? అని ప్రశ్న. మరి ఇండియా లో ని పూర్వపు కోతులు ఏ రూపాంతరం చెందకుండా అలాగే ఎలా ఉన్నాయి ?

    మనకు రామాయణం లో వానర  వీరులు  ప్రస్తావన ఉంది. మన అంజనేయ స్వామి వారు సాక్షాత్తు వానర జాతికి చెందిన వారు. అది పూర్తిగా కవి కల్పన అని అనవచ్చు కొందరు. కానీ రామాయణ రచనా  కాలం డార్విన్ ఆవిష్కరణ కంటే కొన్నీ వేల  సంవత్సారాల ముందు ది.ఒకవేళ అది ఊహే అనుకున్నా , నరులతో వానరులు స్నేహసంబందాలు కలిగిఉండటం ని,కలసి మెలసి సంచరించడాన్నీ ,   విదేశి శాస్త్రజ్ఞులు కంటే వేల సంవత్సరరాల పూర్వమే మన రామాయణ కర్త అయిన వాల్మీకి ఊహించగలగడం  గ్రేటే కదా!   ఒక సిద్దాంతం ప్రకారం శాస్త్రజ్ణులు కంటే ముందే  ఆద్యాత్మిక వాదులు విశ్వ రహస్యాలు తెలుసుకోగలుగుతారు.  ఆ విషయాన్నీ వారు వారి కర్దం  అయిన రీతిలో వివరిస్తారు. కొంచం కల్పనా శక్తి ఉన్న వారు కధలూ  , కావ్యాలుగా వాటిని ఆవిష్కరిఇంచారు . ఆ తర్వాతనే శాస్త్రీయ బావనలు అభివృద్ధి చెందటం ప్రారంబం అయ్యాక వాటిని నిరూపించడానికి ప్రయత్నిచడం ప్రారంభించారు శాస్త్రజ్ఞులు

             అసలు కోతి నుండి మనిషి వచ్చాడు అనే దానికంటే ఒకప్పుడు వానరాలను పోలిన జీవ జాతి ఒకటి మానవులతో సమకాలీనులుగ ఉండే వారు అనిపిస్తుంది. మరి వారెవరూ ? ఈ  మానవు లెవరు? అనేది   తరవాతి టపాలో చెపుతాను. .