Friday, November 8, 2013

తెలంగాణా వాదుల "వసూల్ దందా " నుండి వ్యాపారస్తులని రక్షించడానికే "తెలంగాణా " ప్రకటిస్తున్నారా? !

                                                     


మొన్నటి దాక చిరంజీవి గారు హైదరాబాద్ ని "U.T " చేయాల్సిందే అంటే, ఏమో లే సీమాంద్రుల కోరికను ద్రుష్టిలో పెట్టుకుని ఆ విదంగా డిమాండ్ చేసి వారి మెప్పు సంపాదించుకోవాలి అనుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ మొన్న మాజీ I.P.S  అధికారి విజయ్ కుమార్ నేతృత్వం లోని "టాస్క్ పోర్స్ " బృందం , వారం రోజులు కసరతు చేసి ,కేంద్ర  హోం శాఖ కు  ఇచ్చిన నివేదిక చూస్తుంటే "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ వాదులు కంటే సీమాంద్ర మరియు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్న ఇతర వర్గాల వారే ఎక్కువుగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది చ

  ఆ మద్య ఒక సారి చిరంజీవి గారు t.r.s  మిద ఆరోపణలు చేస్తూ, వారు సినిమా వర్గాల వారి  దగ్గర  బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన అక్రమ వసూలకు గురించిన సమాచారం తన దగ్గర ఉందని చెప్పినట్లు గుర్తు . కాని దాని గురించి రాదాంతం చేస్తే చివరకు దాని ప్రభావం వలన తమ సినిమాలు తెలంగాణా లో నష్టపోతాయి అనే ఉద్దేశ్యంతోనే కాం గా ఉండి , తెర  వెనుక పైరవీలు చేసి "తెలంగాణ" ఏర్పాటు ప్రకటనతో తమ బాధలకు పుల్స్టాప్ పెట్టాలను కుంటునట్లుంది . మొన్న టాస్క్ పోర్స్ వారు హోO శాఖకు ఇచ్చిన నివిదేకలో 'తెలంగాణా వాదుల బలవంతపు వసూలు" నుండి సీమాంద్రుఅను రక్షించడానికి హైదరాబాద్ ని గవర్నర్ అజమాయిషిలో ఉంచాలి అని చెప్పారట. అంతే కాకుండా తెలంగాణా వ్యాప్తంగా ఉన్న సీమాంద్రుల ఆసక్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం అవసరం అని కూడా  నివేదికలో పొందుపర్చారు అట!

   వారు నివేదికలో ఇచ్చిన అంశాలు మరియు సీమాంద్రా మంత్రులు కోరుతున్న కోరికలు చూస్తుంటే తెలంగాణా వారికి "తెలంగాణ" అనే పేరు తప్పా ఏమి దకేటట్లు లేదు. అలగే సీమాంద్రుఅకు ఒక సమైక్యం అనేది తప్పా అన్నీ లాభాలు వారికే అనిపిస్తుంద సీమాంద్రుల రక్షణ పేరుతో పదేండ్ల పాటు కేంద్ర అజమాయిషిలో ఉన్న హైదరాబాద్ను పదకొండో సంవత్సరం అయినా  తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారని గ్యారంటీ ఏమిటి? అప్పటికి మరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తెలంగాణాలో ప్రోస్తాహించి ఆ వంక తో హైదరాబాద్ ని శాస్వతంగా కేంద్ర అజమాయిషిలో ఉంచుకుంటే కాదనే దమ్మున్న వాడు ఎవరు? ఈ  తతంగం అంతా  చూస్తుంటే తెలంగాణా సాయుడ విముక్తి పోరాటం సమయంలో జరిగిన కదా అని ఒక పెద్దాయన చెప్పిన సంగటన గుర్తుకు వస్తుంది. అదేమిటంటే :-

      తెలంగాణా లో రజాకర్ల మీద పోరాటం తర్వాత కమ్మోనిస్ట్ దళాలు తెలంగాణ లోని బూస్వాముల మీద తమ పోరాటం కొనసాగిస్తుంటే , వారిని అణచి వేయడానికి భారత ప్రభుత్వం పోలిస్ ఆక్షన్ ని రజాకర్ల లొంగుబాటు తర్వాత కోడా కొనసాగించిందట. అటువంటి సమయం లో స్తానిక కమ్మ్యూనిస్ట్ దళాలను అణచి వేయడానికి ఒక రెడ్డీ దొర  గారు పైరవీ చేసి కొంత పోలిస్ బలగాన్ని రప్పించుకుని తన బంగ్లా  లోనే  వారికి బస కల్పించి, కమ్మ్యునిస్ట్ దాడుల నుండి భయం లేకుండా చేసుకున్నాడు అంట. ఆ తర్వాత కమ్మ్యూనిస్ట్ లు కూడా  ఆ ప్రాంతాల నుండి ,కనుమరుగైనా ,ఆ పోలిస్ బెటాలియన్ కమాండర్ మాత్రం ఆ రెడ్డిగారి భవనం విడచి వెళ్ళడానికి ఇష్టపడక , పైకి తప్పుడు నివేదికలు పంపుతూ తన బలగంతో సహా అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. అను మానం వచ్చిన ఆ" దొర గారు " ఆరా తీస్తే నమ్మ లేని చేదు నిజం బయట పడిందట! ఆ దొరగారి తాలూకు "దొరసాని" కి ఆ కమాండర్ కి అక్రమ సంబందం ఏర్పడటం వలన ఆ సుఖాలను వదులుకోలేక తప్పుడు నివేదికలతో తను అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. దానితో అటు భార్యను ఏమనలేక, ఇటు పోలిస్ వారిని ఎదిరించే దమ్ము లేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడట ఆ "దొరగారు". అదీ కద.

   రేపు తెలుగు వారి పరిస్తితి అంతే . ఒకరి మీద ఒకరు  అనుమానాలతో, ఏదో వస్తుందన్న పేరాశతో రాజదాని నగరాన్ని వదులుకుంటే దానీ మీద శాశ్వతంగా ఆశ వదులు కోవాల్సిందే! తస్మాత్ జాగర్త  

Thursday, November 7, 2013

వెలగని "ఒలంపిక్స్ కాగడ " ని అంతరిక్షం లో ప్రదర్శించాలనుకోవడం ని సైన్స్ వాదుల "పిచ్చి" కి పరాకాష్ట అనుకోవచ్చా!?

                                                       

పెబ్రవరి7 , 2014 లో సోషలిస్ట్ దేశమైన రష్యా లోని సోచి స్టేడియం లో వింటర్ ఒలంపిక్స్ గేమ్స్ 2014 మొదలు కాబోతున్నాయి . ఇవి పెబ్రవరి 23 వరకు సాగుతాయి. ఒలంపిక్స్ సాంప్రదాయం ప్రకారం "ఒలంపిక్స్ టార్చ్ " ని వెలిగించి అది ఆరకుండా వివిధదేశాల  క్రీడాకారుల బాగస్వామ్యంతో అన్ని ప్రాంతాలలో తిప్పి, చివరకు ఆ టార్చ్ తోనే స్టేడియం లో లోని జ్వాలను రగిలించడం  ద్వారా, ఒలంపిక్స్ గేమ్స్ ప్రారంబిస్తారు. ఇందులో ప్రదానమైన  మైన విషయం ఏమిటంటే "ఒలంపిక్స్ జ్యోతి" బయలు దేరిన నాటి నుండి స్టేడియం కు తిరిగి చేరే వరకు వెలుగుతూనే ఉండాలి.  

   కానీ ఈ  సారీ గేమ్స్ నిర్వహిస్తుంది ఘనత వహిస్తున్న సోషలిస్ట్ దేశం గా ప్రకటితమైన రష్యా వారు కాబట్టి, వారికి సాంప్రఫ్దాయలు అంటే అసలు పడదు కాబట్టి ఒక కొత్త ఆలోచన చేసి దానిని అమలు చేస్తున్నారు. తాము నిర్వహించే "వింటర్ఒలంపిక్స్ 2014 " తర తరాలు గుర్తుండి పోయేలా ఒలంపిక్స్ జ్యోతి ని బూమి మీదే కాక అంతరిక్షం లో కూడా  తిప్పాలని సంకల్పించారట. మరి అక్కడ మనుషులు ఉండని ప్రాంతం కదా అంటే ఎవరైనా అనుకోవచ్చు. మనుషులు ఉండక పోతే ఉండక పోయారు కనీసం ఒలంపిక్స్ జ్యోతి వెలగడానికి అవసరమైన గాలి కూడా  ఉండదు. అంతే కాదు స్పేస్ క్రాప్ట్ లోకి వెళ్లగానే ఆ జ్యోతి ని అర్పి వేయాలి. ఇందుకు బద్రతా పరమైన అంశాలు కారణం. అలాగే వ్యోమ నౌక నుండి బయటకు వెళ్లి అంతరిక్ష నడక నడచేటప్పుడు , అక్కడ ఆక్సిజెన్ ఉండదు  కాబట్టి 'ఒలంపిక్స్ జ్యోతి " వెలిగే ప్రశ్నే లేదు. అంటే ఎప్పుడైతే  ఒలంపిక్స్ జ్యోతి తో వ్యోమగాములు స్పేస్ క్రాప్ట్ లో ప్రవేసిస్తరో అప్పుడే ఒలంపిక్స్ జ్యోతి ఆరిపోతుంది. ఇక ఆ ఆరిపోయిన జ్యోతి ని అంతరిక్షం లో తిప్పి తమ "పిచ్చి" ని ప్రదర్సీమ్పబోతున్నారన మాట ఘనత వహించిన వ్యోమగాములు , వారిని ప్రోస్తహిస్తున్న సైంటిస్ట్ లు, మేదావులు, ప్రభుత్వాలు.అలా మద్యలో ఆర్పివేసిన "ఒలంపిక్స్ జ్యోతి"తో బ్రహ్మాండంగా "వింటర్ ఒలంపిక్స్ 2014" ప్రాంబిస్తారట.

  అదే పని ఏ మత వాదులో చేస్తే , వారిని దుమ్మెత్తి పోసే వారే.కానీ ఈ  పని చేస్తుంది సైన్స్ వాదులమని చెప్పుకునే సోషలిస్టులు కాబట్టి ఎవరూ ఏమి అనరు. పిచ్చి అనేది ఎవరికైనా ఒకటే . సైన్స్ వాదులు , సోషలిస్ట్ వాదులు దీనికి మినాహాయింపు కాదని ఈ  తాజా ఉదంతం తెలియ చేస్తుంది. అందుకే మన ప్ర్పెద్దలు అంది "అతి సర్వత్రా వర్జ్యయేత్" అని. అందుకే అనేది "హూజ్ మాడ్  థోస్  హప్పి"

Wednesday, November 6, 2013

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? !!!..


                                                         

 మంగళ యాన్ ! భారతీయులు తరపున మొట్ట మొదటిసారిగా మంగళ లేదా అంగారక గ్రహం చుట్టూ తిరగి విషయ సేకరణ చేయట్టానికి పంపిన స్పేస్  క్రాఫ్ట్ పేరు అది. దాని బరువు 1350 కిలోలు. దీని ని నిన్న మద్యాహ్నం P.S.L.V 25 ద్వారా భూ కక్ష్యలో  ప్రవేశ పెట్టారు. దీనితో తోలి దాస పూర్తయింది. ఇంకా ఎనిమిది నెలలు జాగర్తగా పర్యవేక్షిస్తూ అంగారక గ్రహ కక్ష్యలోకి వెళ్ళేలా చేయగలిగితే అప్పుడు భారతీయుల కల నెరవేరుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు అంగారకుడి మీద రోవర్లు దించి పరిశోదన చేస్తున్నాయి . మనం మాత్రం అంగారకుడి పై కాలు మోపకుండా దాని కక్ష్యలో తిరుగుతూ , అంగారకుడి గురించి మరింత సమాచరం తెలుసుకోవడమే" మంగళ యాన్ " ప్రయోగ ఉద్దేశ్యం.

 అసలు నాకనిపిస్తుంది "డార్విన్" చెప్పిన "జీవ పరిణామ " సిద్దాంతం తప్పేమో అని . ఎందుకంటే ఆ సిద్దాంతం ప్రకారం ఇప్పటి ఆదునిక మానవుదు "కోతి " నుండి అనేక మార్పులు పొందుతూ చివరకు మనిషి లా రూపొందాడు అట. ఇలా రూపొందటానికి గరిష్టం గా 20,000 సంవత్సరాలు కాలం సేరి పోతుందని ఒక అంచనా. మరి ఒక లెక్క ప్రకారం ఆప్రికా ఖండం లో ఆదునిక మానవుడుకి మూల రూపమైన 'హోమో సేపియన్" ఆవిర్బవించి 2,00,000 {రెండు లక్షలు ) సంవత్సరాలు అయిందట. కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళబట్టి కేవలం డెబ్బై యేండ్ల క్రితమే మొదలయింది అందంటారు.ఆసియా ఖండానికి వచ్చి 15,000 యేంద్లేనట. మరి కోతి నుండి మనిషిగా పరిణామం చెందటానికి 20,000 సంవత్సరాలు సరిపోతే సుమారు 1,50,000 సంవత్సరాల పాటు ఒకే ప్రాంతం లో ఎలా ఉండగలిగాడు మానవుడు అంటే ఇప్పటికి సమాదానం దొరకని ప్రశ్నే. కోతి నుండి మానవుడు పరిణామా క్రమం చెందితే ఇంకా కోతులు కనపడడానికి కరణం ఏమిటి? అని చాల మంది ప్రశ్నిస్తుంటారు. ఒకే ప్రాంతం లో పరిణామ క్రమం చెందిన జీవులు, చెందకుండా మూల రూపాలోనే మిగిలి పోయిన జీవులు కలసి  ఉండటానికి అవకాశం ఉందా ? ఒకవేళ మనం ఆప్రికా నుండి రూపాంతరం చెంది వచ్చిన కోతులుకు వారసులం అయితే , ఆప్రికాలో కోతులు ప్రస్తుతం లేవా? అని ప్రశ్న. మరి ఇండియా లో ని పూర్వపు కోతులు ఏ రూపాంతరం చెందకుండా అలాగే ఎలా ఉన్నాయి ?

    మనకు రామాయణం లో వానర  వీరులు  ప్రస్తావన ఉంది. మన అంజనేయ స్వామి వారు సాక్షాత్తు వానర జాతికి చెందిన వారు. అది పూర్తిగా కవి కల్పన అని అనవచ్చు కొందరు. కానీ రామాయణ రచనా  కాలం డార్విన్ ఆవిష్కరణ కంటే కొన్నీ వేల  సంవత్సారాల ముందు ది.ఒకవేళ అది ఊహే అనుకున్నా , నరులతో వానరులు స్నేహసంబందాలు కలిగిఉండటం ని,కలసి మెలసి సంచరించడాన్నీ ,   విదేశి శాస్త్రజ్ఞులు కంటే వేల సంవత్సరరాల పూర్వమే మన రామాయణ కర్త అయిన వాల్మీకి ఊహించగలగడం  గ్రేటే కదా!   ఒక సిద్దాంతం ప్రకారం శాస్త్రజ్ణులు కంటే ముందే  ఆద్యాత్మిక వాదులు విశ్వ రహస్యాలు తెలుసుకోగలుగుతారు.  ఆ విషయాన్నీ వారు వారి కర్దం  అయిన రీతిలో వివరిస్తారు. కొంచం కల్పనా శక్తి ఉన్న వారు కధలూ  , కావ్యాలుగా వాటిని ఆవిష్కరిఇంచారు . ఆ తర్వాతనే శాస్త్రీయ బావనలు అభివృద్ధి చెందటం ప్రారంబం అయ్యాక వాటిని నిరూపించడానికి ప్రయత్నిచడం ప్రారంభించారు శాస్త్రజ్ఞులు

             అసలు కోతి నుండి మనిషి వచ్చాడు అనే దానికంటే ఒకప్పుడు వానరాలను పోలిన జీవ జాతి ఒకటి మానవులతో సమకాలీనులుగ ఉండే వారు అనిపిస్తుంది. మరి వారెవరూ ? ఈ  మానవు లెవరు? అనేది   తరవాతి టపాలో చెపుతాను. .     

Monday, November 4, 2013

ప్రజల మనసులోదీ చెప్పలేరు! తమ మనసులోది అసలు చెప్పలేరు! ఎవరికీ పనికి రానీ ఈ సీమాంద్రా పార్టీలు ఎందుకు?

                                                                          

మొన్నట్టి దాక తమకు చెప్పకుండా హఠాత్తుగా "రాష్ట్ర విభజన ' నిర్ణయం తీసుకోవడమేమిటని దీర్గాలు తీసారు. ఒక వేళ రాష్ట్రం ఏర్పాటు చెస్తే రెండు ప్రాంతాలిక్ "సమ న్యాయం" చేయాలన్నారు.  డెబ్బై రోజులకు పైగా సమ్మె చేయించారు. సాక్షాతూ ముఖ్యమంత్రి గారు రెండు ప్రాంతాల సమస్యలకు పరిష్కారం చూపించాకే   విభజన పై ముందుకు కదలాలి అనటమే కాక భారత రాష్ట్ర పతి  గారికి అధికారిక లేఖ రాశారు. అయన గారీ సూచనలకు తల ఒగ్గిన కేంద్ర ప్రభుత్వం మళ్లి  అఖిల పక్షం మీటింగ్ కు రమ్మని రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు అన్నింటిక్ కబురు పంపింది.

  ఇక ఇప్పుడేమో అఖిల పక్ష మీటింగ్ కు వెళితే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని కొత్త రాగం అందుకుని దానికి వెళ్ళేది లేదని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు. రాష్ట్రం లో T.D.P. , కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రాంతాలలో పట్టు ఉన్న పార్టిలు కాబట్టి వారు గోడ మీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారు. అసలు పార్టీల నుంచి ఒకే అభిప్రాయం చెప్పాలని రూలేమన్నా ఉందా ?  లేదు కదా ! మరి అఖిల పక్షం మీటింగ్ కు రెండు ప్రాంతాల ప్రతినిధులు హాజరయి అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇక్కడ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కాదు, రెండు ప్రాంతాల ప్రజల అభి ప్రాయలు తెలియచేయల్సిన గురుతరమైన బాద్యత రాజకీయ పార్టీల మీద ఉంది. రెండు ప్రాంతాల అభిప్రాయాలు విన్న తర్వాత కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా , దానికి రాజ్యంగా బద్దత ఉంటుంది కాబట్టి ఎవరూ చేయగలిగేది ఏమి ఉండక పోవచ్చు. మరి అలా ఒక పద్దతి ప్రకారం నడచే అవకాశం వచ్చినపుడు ఆ అవకాశాన్ని చేజార్చుకోవడం ఎందుకు?

 అసలు ప్రజల మనో బావాలను తెలియచెప్పలేక నిత్యం అయోమయానిక్ గురయ్యే ఈ  అవకాశవాద పార్టిలు తెలుగు ప్రజలకి అవసరమా? ఆలోచించండి?

Sunday, November 3, 2013

నరకాసురుడ్ని చంపబట్టి "నరక చతుర్దశి ",మరి దరాసురుడుని చంపకుండా చేయగలరా "దీపావళీ" !?

                                                               
                                                                  


మా చిన్న తనంలో దీపావళీ పండగ అంటే పిల్ల లందరికి ఎంతో సంబరంగా ఉండేది. పండుగకు అయిదు రోజుల ముందు నుంచే టపాసులు కాలూస్తూ ఆనందించే వారం. వంద రూపాయలకు బుట్టెడు టపాసులు వచ్చేవి. మరి ఈ రోజులో , పండగ వస్తుండంటే పెద్దలు  గుండెలు బేజారు అవుతున్నాయి. టపాసుల దరలు చూసి ఒక విదమైన వైరాగ్యం వస్తుంది వారికి .కమ్మగా పిండివంటలు వండుకుని తినక ఎందుకు అంతంత డబ్బులు పోసి కొని తగలెయ్యడం అని వైరాగ్య జ్ఞానం ప్రదర్శిస్తున్నారు.నిజమే మరి దేనికైనా ఒక పరిమితి ఉంటుంది.  వేల రూపాయలు ఖర్చు చేసినా చిన్న క్యారీ బ్యాగులోకి రాణి ఆ టపాసులు ని తగలేసి పండగ చెయ్యాలంటే మధ్యతరగతి వారికి ఎలా మనసొప్పుతుంది?

   సత్యబామ నరకాసురుడుని చంపింది కాబట్టి "నరక చతుర్దర్శి " వరకు చేసుకుంటున్నారు. ఆ రోజు తలకు పోసుకుని పిండి వంటలు చేసుకుని తిని ఆనందిస్తున్నారు. మరి ఈ   " దరాపతులు" (ప్రభుత్వాలు) ఆ దరాసురులు {అధిక దరలు) ని అదుపు చేయలేరు కాబట్టి దీపావళీ మాత్రం "తుస్ " మనక తప్పటం లేదు.అందుకే ఈ  రోజున ఆ దన లక్ష్మి తల్లి పూజ చేసి ,శాస్త్రానికి నలుగు టపాసులు కాల్చి కూర్చోవడమో, టి.వి.లు చూస్తూ కాలం గడపడమో  జరుగుతుంది.

 కల్కిఖడ్గం బ్లాగు మిత్రులకు , వీక్షకులకు, అగ్రిగ్రేటర్లకు దీపావళీ శుభాకంక్షలతో .....

Friday, November 1, 2013

తెలంగాణా ఇవ్వం! అని కేంద్రం హామీ ఇస్తేనే సీమాంద్ర ఉద్యోగులు "సమ్మె " విరమించి కాం గా ఉన్నారా?

                                                                


 ఈ  మద్య ముఖ్య మంత్రి గారి మాటల్లో, సీమాంద్రా నాయకుల మాటల్లో కొంత దైర్యం కనపడుతుంది. ఎట్టి పరిస్తుతుల్ల్కో రాష్ట్ర ఏర్పాటు ఎన్నికల లోపు జరగదు అంటున్నారు. ముఖ్యమంత్రి గారి కి కేంద్రం నుండి దీనికి సంబందించిన అనుకూల సంకేతాలు వచ్చినట్లు కనపడుతుంది. అందుకే అయన సీమాంద్రా ఉద్యోగుల సమ్మెను విరమింప చేసారా? అనే సందేహమూ కలుగుతుంది. అయన గారు రాష్ట్రపతి గారికి లేఖ రాయడం , ఆ లేఖ మీద రాష్ట్ర పాటి గారు హోం శాఖకు తగు సూచనలు ఇవ్వడం, ఆ తర్వాత మరొక్క సారీ తెలంగాణా పై అఖిల పక్ష పార్టీ మీటింగ్ కు అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించడం చక చక జరిగిపోతున్నాయి.

    ఇక పోతే ఇంకొక ప్రక్క కేంద్ర  హోం శాఖ వారు గ్రూప్ అప్ మినిస్టర్స్ కి పంపిన 85 పేజీల రహస్య బాక్ గ్రౌండ్ నోట్ కావాలనే మీడియాకు లీక్ చేసినట్లు తెలుస్తుంది. అందులో హైదరాబాద్ విషయం, నీటి వనరుల విషయంతో పాటు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అది ఏమిటంటే ఆర్టికిల్ 371-D సవరణ అనివార్యం కావచ్చు అనే సంకేతాలు ఇవ్వడం. దీని అర్దం అది సవరించాలంటే కావలసిన 2/3 మెజార్టీ , కాంగ్రెస్ వారికి ప్రస్తుత పార్లమెంటులో లేదు కాబట్టి, వచ్చే ఎన్నికలలో కష్టపడి ఆ మెజార్టీ సాదించాకా తెలంగాణ ఇస్తాం అని చెప్పకనే చెపుతున్నారు అన్న మాట. అందుకే కాబోలు ఎన్నికల లోపు తెలంగాణా రాదు అని సీమాంద్రా ఉద్యోగులు, నాయకులు డంకా బజాయించి చెప్పడం.

   ముఖ్యమంత్రి గారు కూడా  మొన్న్ననే "దుమ్ముగూడెం టేయిల్ పాండ్" కి అనుమతులు ఇచ్చేసినట్లు చెప్పడం వెనుకాల ఉన్న మతలబ్ అదే. ఒక ప్రక్క తెలంగాణ ఇస్తాం అని చెపుతూనే, హైదరాబాద్ లో వాటా , గోదావరి నదీ జలాల్లో  వాటా సీమాంద్రులకు ఇస్తే, ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం ఏమిటి? "ఒరే బాబూ ,'తెలంగాణ ఆవు'నీకే , కానీ దానిలో సగం పాడి నీ  సీమాంద్రా అన్నకు ఇవ్వు " అన్నట్లుంటుంది. దాని వలన తెలంగాణా ప్రజలు నిరాశకు గురి అయి ,అసలు రాష్ట్ర ఏర్పాటు మీదే ఆసక్తి చూపక పోవచ్చు. అధికార పార్టికి కావాల్సింది అదే . అందుకే అటు చేసి, ఇటు చేసి తెలంగాణా వారికి టోపి పెట్టె దిశగా కేంద్రం అడుగులు మార్చుకుందని బావించవచ్చు! చూదాం ఎం చేస్తుందో?

Thursday, October 31, 2013

ఉల్లిగడ్డల కోసం ఎల్లయ్య ఉసురు తీసిన దొంగలు!

                                                            


" ఉల్లిపాయకు ఉపదేశ మిచ్చే కల్లగురువులు వస్తారని" బ్రహ్మం గారు చెప్పారు కానీ, ఉల్లిగడ్డల దొంగతనం కోసం ఉసురు తీసే రోజులు వస్తాయని అయన కూడా  ఊహించలేక పోయారు కదా! అరె ! అరె! ఎంత పోక దల  కాలం వచ్చింది ఈ రాష్ట్రంలో ! ఆఖరుకు ఉల్లిపాయల కోసం కూడా ప్రాణాలు తీసే స్తాయికి దిగజారాయి రాష్ట్రం లోని శాంతి బద్రతలు.! ఈ  రోజు రంగారెడ్డి జిల్లలో జరిగిన వింత ఘోరం ఇది. ఒక ఉల్లిపాయల గోడౌన్ కి కాపలాగా ఉన్నాడు ముసలివాడైన ఎల్లయ్య. ముసలి వాడు కాబట్టి అతని ని బెదిరించి ఆ ఉల్లి గడ్డల బస్తాలను ఎత్తుకేల్లినా ,ఏమోలే ఉల్లి పాయకోసం కకుర్తి పడ్డారు అనుకోవచ్చు. కానీ ఏకంగా "ఎల్లయ"నే చంపి ఉల్లి గడ్డల దొంగతనం చేసారు అంటే ఖచ్చితంగా అతనిక్ తెలిసిన వారె ఈ  పని చేసి ఉండాలి. పని పాట చేయలేని పోరం బోకు వాళ్ళు కేవలం తమ చిల్లర ఖర్చుల కోసం ఇంతటి దురాగతానికి ఒడిగట్టి ఉంటారు అనిపిస్తుంది. పాపం ఎల్లయ్య ! దేశం లో ఉల్లి జనాలను ఏద్పిస్తుంటే,రాష్ట్రం లో ఏకంగా ఎల్లయ్య  ప్రాణాలు పోవడానికే కారణ మయింది!

Wednesday, October 30, 2013

శోభన్ సర్కార్ సాదువు"బంగారం కల " భారతీయులకు, వేయి టన్నుల బంగారం కంటే విలువైనది ప్రసాదించింది!

                                                              


అవును! నూటికి  నూరుపాళ్ళు నిజం! ఈ  దేశం లో చాలా మంది చెయ్యలేని పని ఒక సాదువు చేయగలిగాడు. తార్కికంగ ఆలోచించటం చేతకాని వాడిని, ఎవరు ఏది చెపితే అదే నిజమని నమ్మి,పనికి రాని  పనులు చెసే " పిల్ల మనస్తత్వం " మున్నవాడిని  నమ్మి , బవిషత్ లో ఆయన్ని బారతానికి రారాజు ను చేస్తే ఎలాంటి పనులు చేస్తాడో , ప్రజలకు "పవర్ ప్రెసెంటేషన్ " ద్వారా చూపించినట్లు చూపించగలిగాడు . ఆ సాదు మహారాజ్ అయిన "శోభన్ సర్కార్ " కల పుణ్యమాని "యువరాజ్ సర్కార్" గురించి ప్రజలు కళ్ళు తెరిచినట్లైంది.

 ఆయనగారు ఒక సాదువు. పేరు శోభన్ సర్కార్. అన్నింటిలో భగవంతుని దర్శించే గుణమున్న భక్తులు ఆయన్ని భగవద్ స్వరూపంగా కొలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ,ఉన్నావ్ జిల్లలో ,సంగ్రామ్ పూర్ అనే గ్రామంలో ఉన్న "రాంబక్ష్ సింగ్" కోట ప్రాంతంలో సుమారు వేయి టన్నుల బంగారం ఉందని , అదే ప్రాంతానికి చెందిన సదరు  శోభన్ సర్కార్ మహారాజ్ గారు సెలవిచ్చారట! అది ఆయనకు ఎలా తెలిసిందంటే, అయన కు ఒక రోజు కలలో ఆ ప్రాంత పూర్విపు  రాజు అయినటువంటి "రాంబక్ష్ సింగ్" గారు కలలోకి వచ్చి "నాయనా శొభనా ,ఈ  దేశ ఆర్దిక పరిస్తితి చూస్తుంటే నాకు కడుపు తరుక్కు పోతుంది. అందుకే  ఈ  దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాడుగా ( ఆయనను ఆంగ్లేయులు సిపాయి తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఉరి తీసారు) ఒక మేలు చెయాలనుకుంటున్నాను. నా కోట క్రింద సుమారు వేయి టన్నులు బంగారం దాచాను . కాబట్టి దానిని బయటకు తీయించి బారత దేశాన్ని రక్షించు. " అని అన్నారట. ఆ విషయం గురించి సదరు సాదువు గారు, ప్రదాన మంత్రి గారికి, రాష్ట్ర పతి  గారికి లేఖలు రాసా రట. కానీ వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత బారత యువ రాజు గా కీర్తించబడుతున్న "రాహుల్ గాందీ " గారి దృష్టికి స్తానిక మంత్రి గారి తీసుకు వెళ్ళడం , వారీ ఆదేశాలు మేరకు అర్కియాలాజికల్ సర్వే అప్ ఇండియా వారు  దనా దన్  పలుగులు పారాలు పట్టుకు వెళ్లి పదిరోజులు పాటు  సాదువు గారు చెప్పిన చోట త్రవ్వితే , పుర్రెలు, ఏము కలు దొరికాయట. ఆ దెబ్బతో త్రవ్వడం ఆపుచేసి "రాహుల్  సర్కార్" వారికి "నిల్ " అని రిపోర్ట్ ఇచ్చారట. అదీ శోభన్ సర్కార్ అండ్  రాహుల్ సర్కార్  వారి " ది తొఉజెండ్ టన్స్  గోల్డ్ హుంట్" సినిమా !


  అయితే ఈ  ఉదంతం వలన భారతీయుల కు బంగారం లభించక పోయినా కాబోయే రారాజు, దేశ్ కి నేత అని పిలువబడుతున్న ఇద్దరు కాబోయే ప్రదాని  అభ్యర్దుల ఆలోచన సామర్ద్యాన్ని తెలియ చేసింది. కల ను నమ్మి కోట ప్రాంతాన్ని  త్రవ్వించిన రాహుల్ గాందీ గారి మానసిక స్తాయి ని, అది వ్యతిరేకించిన నరేంద్ర మోడీ గారి మానసిక స్తాయిని, అంచనా వేసి ,ప్రజలు రాబోయే ఎన్నికలలో తీర్పు ఇవ్వడానికి తగిన "జ్ఞానోదయం" చేసినట్లయింది. అది వేయి టన్నుల బంగారం కంటే ఎక్కువే గా మరి!

   యువరాజు గారికి సాదువుల  మాట మీద అంత గురి ఉంటే "బాబా రాందేవ్" చెపుతున్న స్విస్  ఖాతాలోని "నల్ల డబ్బు" ని దేశానికి తీసుకు రావచ్చు గా!

Monday, October 28, 2013

'మనువు' కు ' మనాలి' కి ఉన్న ఆ సంబందం ఏమిటి?

మనువు అంటే హిందూ ధర్మశాస్త్ర కారుడు. మరి మనాలి అంటే ఎవరో మీకు తెలుసు. మరి వీరి మద్య ఉన్న ఆ లింక్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ  లింక్ ను క్లిక్ చేయక తప్పదు మరి!

      http://ssmasramam.blogspot.in/2013/10/what-is-link-between-manavu-and-manali.html

Sunday, October 27, 2013

ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి గారికి రాసిన అధికారిక లేఖ "రాష్ట్ర విభజన"కు అడ్డుపడబోతుందా?!

                                                               


 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమైఖ్యాంద్రకు కంకణమ కట్టుకున్నారని అటు కేంద్ర ప్రభుత్వానికి , ఇటు ఆంద్ర ప్రదేసశ్  ప్రజలకు అందరికి తెలిసి పోయింది. మొన్నొక చోట "ప్రక్రుతి తుఫాన్ ను ఆపే శక్తి నాకు లేక పోయినా , విభజన తుపాన్ ఆపే శక్తి ఉంది" అని ప్రకటించి ,అక్కడి ప్రజల మనసులకు స్వాంతన చేకూర్చారు. గమ్మతేమిటంటే  తుఫాన్ పీడిత ప్రజలను ఓదార్చు దామని వెళ్ళిన ముఖ్యమంత్రి , అక్కడ ప్రజలకు ఆర్దిక సహయం చేస్తామని అన్నా వారు పెద్దగా పట్టించుకోలేదు కానీ, విభజన ఆపుతాను అనగానే  ఒక్క పెట్టున హర్ష ద్వానాలు చేసారట! మరి అలాంటి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, ఊరికే ఉంటారా ? ఉండరు కదా! అందుకే ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేసీ ఉంటారు అనిపిస్తుంది. అసలు నూతన  రాష్ట్ర ఏర్పాటు   గురించి భారత రాజ్యాంగం ఏమంటుందో చూద్దాం .
3. Parliament may by law—
(a) form a new State by separation of territory
from any State or by uniting two or more States or
parts of States or by uniting any territory to a part of
any State;
(b) increase the area of any State;
(c) diminish the area of any State;
(d) alter the boundaries of any State;
(e) alter the name of any State:[Provided that no Bill for the purpose shall be
introduced in either House of Parliament except on the
recommendation of the President and unless, where the
proposal contained in the Bill affects the area, boundariesor name of any of the States 1***, the Bill has been referred
by the President to the Legislature of that State for
expressing its views thereon within such period as may
be specified in the reference or within such further period
as the President may allow and the period so specified or
allowed has expired.]Explanation I.—In this article, in clauses (a) to (e),
"State'' includes a Union territory, but in the proviso,
"State'' does not include a Union territory.
Explanation II.—The power conferred on Parliament
by clause (a) includes the power to form a new State or
Union territory by uniting a part of any State or Union
territory to any other State or Union territory.]
                       


కాబట్టి కేవలం రాష్ట్రపతి గారి రెకమెండేషన్ తోనే పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టాలి . అలా రాష్ట్ర పతి గారు రికమేండేషన్ చేసే ముందు బిల్లు ను రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపటం తప్పని సరి. కానీ అసెంబ్లీ  ఒప్పుకున్నా , ఒప్పుకోక పోయినా  పార్లమెంట్ మాత్రం బిల్ ని  ఆమోదించ వచ్చు . రాష్ట్ర ఏర్పాటు జరిగి పోతుంది .
కానీ అసలు రాష్ట్రపతి గారు రికమెండ్ చెయ్యటం కోసం బిల్ ని అసెంబ్లీ అభి ప్రాయానికి పంపక ముందే ,కొన్ని అబ్యంతరాలు ఏకరువు పెడుతూ, కూలంకష  చర్చ కోసం అసెంబ్లీకి బిల్ పంపాలని కోరితే, ఆ లేఖ మీద హోంశాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత, రాష్ట్ర పతి  గారు అసెంబ్లీకి "బిల్" పంపితే , అది రాజ్యాంగ బద్దం అవుతుందా ? 

   ముఖ్య మంత్రి గారు పంపిన లేఖ మీద రాష్ట్రపతి  గారు ఏమి  స్పందించ క పొతే అది వేరు. కానీ ఆ లేఖ మీద స్పందించి, హోం  శాఖ కు  పంపటం జరిగింది. కాబట్టి ఇప్పుడు  విభజన బిల్  పంపితే అది దేని ఆదారంగా తయారు చేసిన బిల్ అవుతుంది? రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి  గారు స్వయంగా కానీ , కేంద్ర మంత్రి మండలి సలహా  ప్రకారం  కానీ బిల్ తయారు చేసి  రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి . కానీ అలా జరుగకుండా  ముఖ్యమంత్రి గారి అధికారిక లేఖ ఆదారంగా, బిల్ తయారు చేసి అసెంబ్లీకి పంపుతున్నట్లు అవుతుంది . కాబట్టే ఈ  అనుమానం! అలా ముఖ్య మంత్రి గారి లేఖ "రాష్ట్ర విబజన" ప్రక్రియను కోర్టుల్లో సవాలు చేయడనికి ఉపయోగ పడుతుందా? అసలే ఆర్టికిల్ 371-డి  మీద స్పష్టత లేదు . అది సవరించనంత కాలం విభజన జగడానికి వీలు లేదని సీమంద్రా న్యాయవాదులు, నాయకులు వాదిస్తున్నరు. దానికి తోడు ఇది జత కానుందా?  చూదాం ఎం జరుగుద్దో!