Tuesday, August 6, 2013

సీమాంద్ర అడుక్కు తినే వాళ్ళ J.A.C కూడా ఉద్యమం చేస్తుందట !



                                                                


   ఇన్నాళ్ళు తెలంగాణా కోసం రకరాల J.A.C. లు తెలంగాణా లో ఉద్యమం సాగించాయి  వాటి క్రుషి పలితమో ,సోనీయమ్మ కరుణ పలితమో తెలంగాణా ప్రత్యేక రాష్త్ర ఏర్పాటు ప్రకటించడం జరిగింది .ఇప్పుడు ఉద్యమ ఊపు సీమాంద్రలో షురూ  అయింది . తెలంగాణాలో ఏ విదంగా ఉద్యమాలు చేసారో అదే విదానం సీమాంద్రలోను "సమైఖ్యాంద్ర " కోసం కోన సాగుతుంది . మంత్రుల ఇళ్ళ ముట్టడి దగ్గర్నుంచి రోడ్ల మీద వంటా వార్పూ దాకా అదే స్టైల్ . కాకపోతే సీమాంద్ర ఉద్యమంలో అన్ని వర్గాల j.a.c.  లతో పాటు బిచ్చగాళ్ళ J.A.C.  అదేనండి అడుక్కు తినేవాళ్ల J.A.C. కూడా  ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుందట !.

అది విన్న నాకు ఆశ్చర్యం వేసింది . ఇదేమిటబ్బా ! తెలంగాణా ఏర్పడితే సీమాంద్రా బిచ్చ గాళ్ళకి కలిగే నష్టమేమిటా అని ,తెగ ఆలోచించగా, ఆలోచించగా టక్కున ప్లాష్ అయింది సమాదానం . అసలు సీమాంద్రా వారు ఉద్యమం చేసేదే హైదరాబాద్ కోసం . హైదరాబాద్ తమ చేజారిపోతే , ఉద్యోగ అవకాశాలు లేని తమ పిల్లలు సీమాంద్రాలో బొచ్చె పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుందని సీమాంద్రుల వాదన . మరి అదే నిజమయితే సీమాంద్రలో ఇప్పుడ్డున్న అడ్డుక్కు తినే వారికి హెవీ కాంపిటీషన్ ఏర్పడే ప్రమాదముంది కాబట్టి , ముందుగానే జాగర్తపడి ,ఉద్యమం లో పాలు పంచుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపు చేస్తే , తమ వృత్తికి బంగం కలగదని , ముందు చూపుతో ,అడుక్కు తినే వారంతా J.A.C. గా ఏర్పడి ఉద్యమం చేస్తున్నారన్న మాట !

 చూసారా ,అడుక్కు తినే వారైన వారికున్న ముందు చూపు ఎంత గొప్పదో! కనీసం వీరికున్న పాటి ముందు చూపు సీమాంద్ర రాజకీయ నాయకులకు లేదాయే! సీమాంద్ర ప్రజల మెడలు సోనీయా చేతిలో పెట్టి తమాషా చూస్తున్నారు . సిమాంద్ర ప్రజలు ఇక రాబోయే ఎలక్షన్ లలో రాజకీయ నాయకులని బదులు అడుక్కు తినే వారిని నిలబెట్టి గెలిపిస్తే కనీసం నిరుద్యోగులకు అడుకునే రాత తప్పిస్తారు .విష్ యూ బెస్ట్ ఆప్ లక్ .


Monday, August 5, 2013

అర్దరాత్రి చెల్లెలునే బయటకు గెంటిన వాడు ఆంద్రోళ్లను గెంటడని గ్యారంటీ ఏమిటి?



                                                                       


  తెలంగాణా ప్రజల మీద ఆంద్రావారికి అనుమానాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ , కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి మీద బోల్డన్నీ అనుమానాలున్నాయి  అరే ! తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ వారు ప్రకటించి రెందు రోజులు కాక ముందే చెల్లెలు రాములమ్మను అర్ద రాత్రేళా సస్పెండ్ చేసిండా ! అంటే ఏమిటి ? ఆడబిడ్డను  అడగకుండా బయటకు పంపిండు కదా!  ఆడబిడ్డనే అర్దరాత్రి బయటకు పంపినోడు , అగర్బ శత్రువులు లా చూసే వారిని ,అదేనండి ఆంద్రోలను బయటకు పంపకుండా ఉంటాడా ? అదిగో ఆ డౌట్  తోటే ఆంద్రోళ్లంతా ఆందోళన చేస్తున్రు . లేకుంటే విదేశాలు పోయి బ్రతికేటొరికి తెలంగాణా లో బ్రతకడానికి భయమెందుకు ?

  పాపం రాములక్క !  ఏమన్నది ! జై తెలంగాణాయే అన్నది కాని , జై సమైఖ్యాంద్ర అనలేదు కదా.  వేళా కలవకుంట్ల చంద్ర శేఖర్ గారి పొటోలు తీసి వేసి ఇందిరమ్మ పొటోలు తన ఆఫిసుకాడ పెట్టిందనుకో . అందుకు రీజన్ అడిగి నోటీస్ ఇవ్వాలే కానీ , చెప్పా చెయ్యకుండా అర్ద రాత్రి గెంటుతావా పార్టీ లోంచి . ఆడబిడ్డకు ఎంత అవమానం ,
ఎంత అవమానo . అయ్యో ,రాములక్కా , నీ కెంత కష్టం వచ్చిందే !. తెలంగాణా కోసం అన్న అడుగు జాడల్లో నడచిన దానికి నీకు దొరికిన దొరికిన బహుమానం అవమానమేనా అక్కా !

  అసలు నాకు ఉన్న చిన్న అనుమానం ఏమిటంటే , అంత అవమానంగా , అక్కను బయటకు పంపితే , ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకని ?తెలంగాణా కోసం అక్క చేసిన త్యాగం అదే నండి, సినిమా బందూక్ వదిలేసి వచ్చి , బయట బందులలో పాల్గొని రియల్ గా జైలుకు వెళ్ళింది కదా ! ఆ విశ్వాసం అన్నకు లేకపోయినా , తమ్ముళ్ళకు ఉండొద్దా ? పాపం మనసాగబట్టక చివరకు కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిఅన్న కూతురు ఒచ్చి ఓదార్చిందట . అందుకే చెప్పేది ,అన్న అయినా ,తమ్ముడు అయినా వాళ్ళంతా మగాల్లే కాబట్టి వారికి ఆడవారి కష్టాలు తెలియవు మరి ! ఇకనైనా రాములక్కా , మగవాళ్ళ ను నమ్ముకోకుండా ఆడవాళ్ళని నమ్ముకుంటే మంచిది . 

Saturday, August 3, 2013

పెట్టుబడిదారుడు వద్దంటా ! పొట్టకూటి కోసం వస్తే ముద్దంటా !

               
                                                    



 అయ్యా హరీశ్ రావు గారు ! మీ చీర్ ఫుల్ పేస్ చూసి తెలంగాణాకి ముఖ్యమంత్రి మీరైతేనే బాగుంటుందని తెలంగాణా వాళ్ళు అనుకుంటున్నారు  కానీ నిన్న మీరన్న మాటలు చూస్తె తెలంగాణా అభివృద్ధి ఏదో ఆయేట్టట్టే అనిపిస్తుంది .
  ఎట్టెట్టా ! తెలంగాణా కి పెట్టుబడిదారులు  వస్తే వద్దంటావా ! పొట్టకూటి కోసం వస్తే రమ్మంటావా ! ఏ "తెలంగాణా " లో అటు మొదటి అక్షరం ,ఇటు చివరి అక్షరం తీసేసిన రాష్ట్రం గా మారుదామనుకుంటున్నావా ? అసలు ఒక పెట్టుబడి దారుడు వస్తే వేయి మందికి ఉపాది కల్పించే పరిశ్రమ పెడతాడు కాబట్టి రాష్ట్రం అభిరుద్ది చెందుద్ది . కాని వేల మంది పొట్ట కూటి  కోసం వస్తే ,తెలంగాణా కి ఏమి ఒరుగుద్ది . వలసవాదుల తాకిడి తప్పా! వారికి పుడ్ అని ,బెడ్ అని "k.c.r  గృహ కల్ప " అని రాష్ట్ర ఖజానా కి బొక్క అవ్వడమే కాక ,ఇక్కడి ప్రజలకు పని పాఠాలలో పోటీ .

  అంద్ చేత కమ్మూనిస్ట్  మాటలు కట్టి పెట్టి ,నూతన  రాష్ట్ర అభిరుద్ది గురించి మీకున్న విదానమేంటో , మీ మామ గారిని అడిగి చెప్పండి . లేకుంటే తెలంగాణా ప్రజలు ,మీ పట్ల వారికి ఉన్న విజన్ మార్చుకోవలసి ఉంటుంది మరి !

Friday, August 2, 2013

విడాకులు అయితే ఇచ్చేశాం , కాని పదేండ్లు కలసి ఉండక తప్పదు !


                                                               

అంద్రా  తెలంగాణా వీలీనాన్ని, పజల్ ఆలీ కమీషన్ మొదలు రాజకీయ వాదులు దాక , చాలా మంది బార్యా బర్తల సంబందం గానే పరిగణించారు . ఒక తెలివి గల అబ్బాయికి ,అమాయకురాలైన అమ్మాయికి మద్య జరిగిన పెండ్లి లాంటిది వీలీన ప్రక్రియ, అని కూడా  అన్నారట ! అలాగే కొన్నాళ్ళు కలసి ఉన్నాక పొసగటం లేదని బావిస్తే , తిరిగి ఎవరి దారిన వారు అంటే, తెలంగాణా వారు విడిపోవచ్చు అని కూడా  అన్నారట ! కాని పాపం అమాయకులు అయిన తెలంగాణా వారు , తెలివి గలవారైనా ఆంద్రా వారు కీచులాడుకుంటు , కాట్లాడుకుంటు ఎలాగో ఇన్నాళ్ళు ఓపికగా కాపురం చేస్తూ వచ్చారు .

    మరి యాబై యేండ్ల పై చిలుకు కాపురం లో అమ్మాయి ఇంటినే (హైదరాబాద్ ),తన ఇల్లుగా బావించి అబ్బాయి ఇంట్లో సొమ్ము కూడా  తెచ్చి , అమ్మాయి ఇంటిని హైటెక్ ఇంటిగా మార్చాడు . కాని ఆ  వంకతో అమ్మాయి తరపు వారిని, అబ్బాయి తరపు వారు కొంచం చిన్నచూపు చూస్తున్నారని , ఇక  మీ ఇంటికి మీరు వెళ్ళాల్సిందే, అని అమ్మాయి తరపు వారు గొడవ చేస్తే , విడాకులు మంజూరు చేసే పెద్ద మనిషి  అందరి అభిప్రాయాలు అడిగితే , ఆ... అరవై యేండ్లు కలసి ఉన్న వారిని విడదీస్తారంటలే....  , అనుకుని తమ వాళ్ళని ఎవరిని అడగకుండా , అబ్బాయి తరపు పెద్ద మనుషులు మీ ఇష్టం అనే సరికి , ఆ  పెద్ద మనిషి కాస్తా విడాకులు మంజూరుకు o.k.  అన్నాడు. అంతే ! అబ్బాయి తరపు వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది .

    అమ్మాయి ఇల్లు తమదనుకుని ఇన్నాళ్ళూ "హైటెక్ " గా అభిరుద్ది చేస్తే , ఏదో పది ఏండ్లు ఇక్కడే  ఉండి ,  తర్వాత మీ ఇంటికి వెళ్ళ మంటా రేమిటి ? ఇదెక్కడి తీర్పు ! అని అబ్బాయి తరపు వారు పెద్ద గొడవ చేస్తుంటే ,పెద్ద మనుషులు తాము చేసిన తప్పిదం గుర్తు వచ్చి , తేలు కుట్టిన దొంగలా ఏమనలేక , ఆ  విడాకులు ఇచ్చిన పెద్దమనిషి ఇలా చేస్తాడు అని ఊహించలేదని , ఇప్పుడు మీరేమి చేసినా మేమేమి మాట్లాడం అని , ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసరికి , రెచ్చిపోయిన అబ్బాయి తరపు వారు ఆ విడాకులు మంజూరు చేసిన పెద్ద మనిషిని బండ బూతులు తిడుతూ , ఆ హైటెక్ ఇంటిని వదలుకునే ప్రసక్తి లేదని కారాలు , మిరియాలు నూరుతున్నారు .. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా , సీమాంద్రల విడాకుల వ్యవహారం .

  నాకు ఒక డౌట్  ఏమిటంటే ,ఒక సారీ విడాకులు ఇచ్చాక , మళ్లీ  పదేండ్లు ఒకే ఇంటిలో వేర్వేరు కాపురాలు చేసుకొమ్మని తీర్పు చెప్పటం వివేకమైనదేనా ? ఈ  పదేండ్లలో ఆ మాజీ బార్య బర్తలు మద్య వివాదాలు రావా? వస్తే ఆ ఇంటి పరిస్తితి ఏమిటి ? మళ్లీ  ఆయనొచ్చే  మొదలేయి, !అన్నట్లు ఉండదా? సామరస్యంగా కాక కోట్లాడి  విడిపోయే వారిని ,మళ్ళి  ఏదో ఒక సాకుతో ఒక చోట ఉంచడం అంత తెలివి గల పని కాదేమో ! ఆలోచించండి.

Thursday, August 1, 2013

కోడలు చేసిన పనికి "అమ్మా కొడుకులు" అదిరి పోతున్నారు !

"వీపు నోరుని బతిమాలుద్దంట ! "నీవు వాగకే అక్కడా ,నాకు పగిలి పోద్ది ఇక్కడా " అని. అలా ఉంది "తెలంగాణా " రాష్ట్ర ప్రకటనా వ్యవహారం . అత్త  ఇందిరా గాందీ గారు చెయ్యని సాహసం కోడలు సోనియా గాందీ గారు చేసేసారు . అరవై యేండ్ల సుదీర్ఘ సమస్యను ;అలవోకగా తీర్చేశారు . ఒకే ఒక్క రోజులో రెండు మీటింగులు పెట్టి ఏక  వాక్య ప్రతిపాదనతో నాలుగు కోట్ల మందికి మోదం , మరో నాలుగున్నర్ర కోట్ల మందికి ఖేదం కలిగించారు .

     అంతే ! అప్పటి  దాక తమ మాటను కాదనదు అనే  గుడ్డి నమ్మక్కంతో నేతలు , అదే స్తాయిలో ఆంద్రా ప్రజలు ఉత్కంటతతో ఎదురు చూస్తున్న వేళ ,కోడలు గారి నిర్ణయం పిడుగు పాటులా తగిలింది . దిమ్మ తిరిగి పోయింది . నేతలు ఇండ్లకు వెళ్ళలేని పరిస్తితి . అక్కడ ప్రజలకు తమ ఆక్రోశం ఎవరిమీద చూపించాలో తెలియని పరిస్తితి . బస్సులన్నీ డీపోలోనే ఉండి పోయాయి . బయట ప్రబుత్వ వాహానాలు ఏమి తిరగడం లేదు . కోపంతో చుట్టూ చూస్తున్న వారికి నవ్వూతూ దర్శన మిచ్చారు కోడలు గారి అత్తా,ఆయనా ! అంతే ఒక్కసారిగా సుత్తులు , పలుగులూ పట్టుకుని వారి మీదకు లంఘించారు . దొరికిన విగ్రహాలను సుత్తులు పెట్టి కొడుతుంటే పాపం ఆ నాయకులకి అదిరిపోయింది . కోడలు గారికి తెలిసి ఫైర్ అయ్యేసరికి , రాష్ట్ర పోలిస్ వారు విగ్రహాల  ద్వంస కారుల పై కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు . అదీ కద !బ్రతికున్నంత కాలం శత్రువులను ఆదరగోట్టినా , చనిపోయాక , కోడలి గారి పనికి అదరగొత్తిచ్చుకోక తప్పలేదు మరి !

Wednesday, July 31, 2013

రాజీవ్ గాందీ గారి పెండ్లి రాష్త్ర నాయకుల చావు కొచ్చిందా ?

                                                                




ఎంకి పెండ్లి సుబ్బి  చావు కొచ్చిందని సామెత. అలాగే రాజీవ్ గాందీ గారి పెండ్లి మన రాష్ట్ర ప్రజల చావు కొచ్చిందా ,అని అనిపిస్తుంది. పాపం అయన గారు ఉంటే ఆంద్రా నాయకులు అయన గారీ దగ్గర తమ గోడు వెళ్ళ బోసుకునే అవకాసం ఉండేది. ఎంత ఇటలీ అమ్మాయిని పెండ్లాడినా , ఆయనలోను ఉన్నది అయన అమ్మగారి భారతీయ రక్తమే కాబట్టి ఆంద్రా వారిమూగ వేదన ను అర్దం చేసుకుని రాష్ట్రాన్ని విడగొట్టే వారు కాదు. . కానీ ఆ అవకాశం లేకుండా  తమిళ పులులు ఆయన్ని పొట్టన పెట్టుకున్నారాయే !

  అసలే తెలుగు వారికి డబల్ యాక్షన్ అంటే యమ ఇష్టం . అందుకే పైకి చెప్పేదొకటి , మనసులో అనుకునేది ఇంకొకటి. తెలంగాణా లో ప్రజలను మబ్య పెట్టడానికి "ఇచ్చేది మేమే , తెచ్చేది మేమే " అని ఒకరంటే వారు ఇస్తే మాకేమి అబ్యంతరం అని ఉదారత ఒలక బోశారు . అఖిల పక్ష బేటిలోను అదే నొక్కి వక్కానించే సరికి , వీరి డబల్ యాక్షన్ గురించి అవగాహన లేని ఇందిరమ్మ కోడలు జై తెలంగాణా అనేసరికి నోటి మాట రాక , తెల్ల ముఖం వేసుకుని , అమ్మా ,అమ్మా , ఆలోచించమ్మా , అని ఆంద్రా వారు ఆనక ప్రాదేయ పడుతుంటే , 'నదింగ్ డూయింగ్ , డెసిషన్ ఇస్ ఓవర్ " అనే సరికి కళ్ళ నీరు కుక్కుకుంటూ , పైనున్న రాజీవుని తలచుకుని, తలచుకుని బాద పడ్డారట .

  అందుకే పెద్దలంటారు . పెండ్లి చేసుకునే టప్పుడు అటు ఏడు తరాలు , ఇటు ఏడూ తరాలు చూడాలని . రాజరిక వంశాలు లో ఇది తప్పని తప్పని సరి . ఎండుకంటే ఆ వచ్చే వారికి మన ఏడ్చే ఏడ్పు అర్దం కావాలిగా . అందుకని ! అదే రాజీవ్ గాందీ గారు ఐ దేశం అమ్మాయిని పెండ్లి చేసుకుంటే , ఆంద్రా వారి అంతర బాష ,అర్దమయి ఉండేది . "ఒహో b.j.p.  వారికి రామాలయం లాంటిది , ఆంద్రా వారి తెలంగాణం " అని . కాని అది పొసగలేదు. . అప్పుడు అనిపించిందట  " రాజీవ్ గాందీ గారి పెండ్లి రాష్త్ర  నాయకుల చావు కొచ్చిందా " అని !

Tuesday, July 30, 2013

N.T.V.వారు నెలరోజుల ముందు చెపితే కల్కి ఖడ్గం ఆర్నెల్లు ముందే చెప్పింది మరి !

N.T.V  వారు ఒక నెల రోజుల క్రితం కాంగ్రెస్ వారు తెలంగాణా ఇవ్వడం ఖాయమని చెప్పారట ! దానిని N.T.V   వారు గొప్పగా ప్రసారం చేస్తుంటే నాకొకటి అనిపించింది . నేను నా బ్లాగులో ఆరు నెలలు క్రితం ,కరెక్టుగా ఆరు నెలలు అంటే ఈ సంవత్సరం పిబ్రవరి ఒకటవ తారీకున తెలంగాణ గురించి నాకు గల అభిప్రాయాలు చెపుతూ ఒక టపా పెట్టడం జరిగింది . ఆ టపాలో తెలంగాణా వ్యవహారంలో మన నాయకులు తీరును గురించి ఒక కదను కూడా చెప్పటం జరిగింది. ఈ  రోజు తెలంగాణా అంశం మీద డిల్లీ పెద్దల నిర్ణయాలు గురించి  చూస్తుంటే ఆ నాడు నేను చెప్పిన కద చందానే సీన్ నడుస్తుంది అనిపిస్తుంది. ఇంతకి ఆ కద ఏమిటంటారా ? మీరే ఐ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడండి . చూసారా మీడియా వారి కంటే బ్లాగర్లే ఎంత ముందున్నారో !

 http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html  





Sunday, July 28, 2013

మొత్తానికి పిబ్రవరి ఒకటిన నేను చెప్పిన కదే నిజమవ బోతుందన్నమాట !

నేను ఈ సంవత్సరం పిబ్రవరి ఒకటవ తారీకున తెలంగాణ గురించి నాకు గల అభిప్రాయాలు చెపుతూ ఇదే బ్లాగులో ఒక టపా పెట్టడం జరిగింది . ఆ టపాలో తెలంగాణా వ్యవహారంలో మన నాయకులు తీరును గురించి ఒక కదను కూడా చెప్పటం జరిగింది. ప్రస్తుతం తెలంగాణా అంశం మీద డిల్లీ పెద్దల నిర్ణయాలు గురించి వస్తున్నా వార్తలు చూస్తుంటే ఆ నాడు నేను చెప్పిన కద చందానే సీన్ నడుస్తుంది అనిపిస్తుంది. ఇంతకి ఆ కద ఏమిటంటారా ? మీరే ఐ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడండి . 
                                    http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

Tuesday, July 23, 2013

ఒక్క పాటకే "యాంకర్ " ఉద్యమ కారిణి అయితే, వందల పాటలు పాడిన వారి నేమంటారు?

                                                          


నిన్న ఒక  మిత్రుడి బ్లాగులో ఒక లేడి యాంకర్ ని పొగుడుతూ రాసిన పోస్ట్ చూసి కొంత అశ్చ్యర్యం వేసింది . కారణం  అప్పటి దాక ఆ యాంకర్ ని "అప్ట్రాల్" అనుకున్న అ బ్లాగ్ మిత్రుడు ఆమె పాడిన ఒకే ఒక పాట లాంటిది విని , చలించి పోయి ఆమెను గారూ" అని సంబోదిమ్చడమే కాక ఆమెను ఒక ఉద్యమ వెలుగు గా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. నాకైతే  తెలుగు సినిమా కదే గుర్తుకు వచ్చింది .
    సినిమా మొదట్లో అల్లరి చిలరి గా తిరుగుతూ దొంగ తనాలు చేసే హిరోయిన్ ని చూసి అసహ్య హించుకునే హిరో , ఒక సందర్బంలో ఆమె సమాజం లోని దుర్నితి గురించి లెక్చర్ దంచితే కంగుతిని ఆమె అరాదకుడు అయిన హిరోగారి కద  లాగా ఉంది అయన చెప్పింది . ఏదైనా సరే అప్పటి దాక ఆమె యాంకరింగ్  అంటే  ఆయనకి వెగటు పుట్టిoదట! కాని ఒక్క పాటతో 'వెగటు ' కాస్త ఆరాధ్యo గా మారి అభిమానం 'గారు " తుంది !. ఇంతకీ ఆమెగారు పాడింది చూదాం .

                                              
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా.. ఇంక ఆంబోతులాట సాగేరా..
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు
భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు..
ఎవ్వారొ…
ఎవ్వారొ ముద్దు బిడ్డలు రా… ఎందుకనొ పరుగెట్టినారురా..
ఎవ్వారొ ముద్దు బిడ్డాలెందుకనొ పరుగెట్టినారురా..
ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు
ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్
బోరు బోరు గా గండమోర్లు వెట్టి కుండే వలిగె జల్లులు
ఈ కడుపుకోతల నార్పెదెవ్వరురా
ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడురా
రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా -2
రావణాసురులంత జేరి రోజుకొక్కా రచ్చ పెడితే..
పంట చీడను మట్టుపెట్టే పురుగు మందుల విందులాయె–2
ఎంత నెత్తురు ఏరులై నెవ్వాని దూప తీరదాయే
జాలి జూపర జంగమయ్యా జాగిలాలా జాతరాపర.. -2
కొండ దిగిరా కొమూరన్నా కొండముచ్చుల కోర్కెదీర్పర..
రెండు పూటల్ పస్తులుండీ నిండు ప్రాణాలెన్నొ మింగె -2
గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకికూత కోడెనాగులు ..
గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారాలేపేరురా
ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామర –2
ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు
అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ -2
ఎవ్వడిచ్చెదేందిరా ఇది ఎవ్వనీ జాగీరురా.. -2
నీకు నువ్వే రాజురా నిన్నేలెటోడింకెవడురా-2
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ..ఇంక ఆంబోతులాట సాగేరా
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కన్ను సూడు
భూమి బుగ్గై పోయె సూడు బొంద గడ్డల జోరు సూడు..
గంగ గరుడా… గంగ గరుడాలెత్తుకెళ్ళేరా

   పై పాటలో అండర్ లైన్ చేసిన దానిని  గురించి చెప్పాలంటే అసలు  పదవుల కొరకు నిచ రాజకీయాలు చెయ్యడం నేర్పింది ఎవరు? తమకు పదవులు రాలేదని , హైదరాబాద్ ని మత కల్లోల నగరంగా మార్చి , పట్ట పగలు హత్యలు చేయించిన గాడిద కొడుకులు ఎవరు ?వారే ఇప్పుడు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం "తెలంగాణ " చిచ్చు  పెట్టారు . అది కాస్తా రాజుకుని ప్రజలలో వేర్పాటు బావాలు రగిలిస్తే , ఇప్పుడేమో "గద్దె కోసం గాడిదలు " చేస్తున్న రాజకీయం అంటున్నారు .అసలు నిజం చెప్పాలంటే "గద్దె నాశించ కుండ గాడిద చాకిరి చేసే వారెవరు ?

   మనం గత అరవై ఏండ్లుగా "ఇండో చైనా స్సాంస్క్రుతిక సంబందాలు"ఇండో రష్యా  స్సాంస్క్రుతిక సంబందాలు"ఇండియన్అమెరికా స్సాంస్క్రుతిక సంబందాలు" అని ఇతర దేశాల ప్రజలతో స్నేహ బావం పెంచుకోవడానికి కృషి చేసారు కాని ఆంద్రా,తెలంగాణా ప్రజల మద్య ఆత్మీయ సంబందాలు నెలకొల్పడానికి ఎ చర్యలు అయినా చేపట్టారా? ఇప్పటికి చాల మంది ఆంద్రా ప్రజలుకి తెలంగాణా వాలంతే చులకన బావం ఉందనేది కఠిన సత్యమ్. అదే నేడు తెలంగాణా వారు వేర్పాటు వాదాన్ని కోరుకునేలా చేస్తుంది . తెలంగాణా వచ్చి బ్రతికే వారు కూడా , తెలంగాణా ప్రజలను చిన్న చూపు చూస్తుంటే ఎవరు మాత్రం సహిస్తారు? ఏ మాత్రం అవకాసం దొరికిన వారిలో ఉన్న ఆక్రోశం వెల్ల గ్రక్కుతారు . అదే ప్రస్తుతం తెలంగాణా ప్రజలు చేస్తుంది . వారికి కె.సి.ఆర్ రూపం లో అవకాశం దొరికింది . ఉపయోగించుకుని విదిపోవాలను కుంటున్నారు . ఏ ఆశ లేకుండా చాకిరి చేసే గాడిదలు కాని, వాటి కొడుకులు కాని ,రెచ్చగొత్తె పాటలు పాడే వారికి , వారితో పాడించే వారికి ఆదర్శo కావచ్చు !. తెలంగాణా వారికి మాత్రం ఆత్మ గౌరవం కాపాడే వాడు గద్దె నాసించిన తప్పు లేదని రేపు జరగబోయే ఎన్నికలలో తీర్పు చెప్పనున్నారు . అయినా విచిత్రం కాకపొతే ఒక్క పాటకే "యాంకర్ " ఉద్యమ కారిణి అయితే, వందల పాటలు పాడిన నిజమైన ఉద్యమ కారులుని   నేమంటారు? "యాంకర్లు " అంటారా ?!రేటింగ్ ఆర్టిస్టులు అంటారా !

Sunday, July 21, 2013

హిందువులు గురించి అయిపోయింది! ఇక ముస్లిం లది మొదలయింది . !

                                                                            



ఆ  ఊరిలో ఒక పుల్లగొండి పెద్దయ్య ఉన్నాడు .    కొంచం ఎక్కువ చదువుకుని   ఉండటం  వల్ల ,అతను చెప్పేదానికి  ఎవరూ ఎదురు చెప్పే వారు కారు . దానితో ఇక అన్ని తనకే తెలుసనీ, అ ఊళ్ళో వారికి  ఏమి తెలియదని, వక నిర్ణయానికి వచ్చేసి, అవసరం ఉన్నా,లేకపోయినా, పని కల్పించుకుని , దారిన వచ్చే పోయే వారిని పిలిచి మరీ  తన పాండిత్యం ప్రదర్శించడం మొదలు పెట్టాడు .
ఆ ఊరిలో వక గుడి ఉంది . ఆ గుడిలో ఉత్సవాలు జరుగుతునాయి . ఆ సందర్బంగా వారం రోజులు పాటు సాయంత్రం వేళలో 'గీతా పారాయణం ' చేస్తుండే వారు . అది వినడానికి ఆ ఊళ్ళో ముసలి వారు ,స్త్రీలు వచ్చి వెళుతుం దేవారు . అ సమయంలో గుడి కొంచం దూరం లో, దారిలో  ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చుని , అ గీతా పారాయణం విని వస్తున్నా వారిని  తన దగ్గరకు రమ్మని పిలిచే వాడు  పుల్ల గొండి పెద్దయ్య . స్త్రీలు అయితే అతనిని పట్టించుకోకుండా  తమకు పని ఉందని వెళ్లి పోయే వారు. ఇక నడవడం ఇబ్బందిగా ఉన్న, ముసలి వారు , కాసేపు కూర్చున్నట్లు ఉంటుo దని ,అక్కడికి వెళ్లి కూర్చుంటే, వారికి 'గీత ' అనేది పెద్ద రోత  అని  ,దానిని  చెప్పిన కృష్ణుడు  పెద్ద తాగుబోతు, తిరుగు బోతు అని వివరించడానికి ప్రయత్నిస్తే, వారంతా అతనిని  తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి , దేవుడా అంటూ ఇంటికి వెళ్ళిపోయే వారు. వారికి గీతలో ఏముందో  ప్రతి వాక్యం తెలియాల్సిన అవసరం లెదు. వారికి అర్ధం అయింది ఒకతె. ఎవడి పని వాడు చెయ్యటమే దేవుడుకు నచ్చుతుo ది. కుల మతాలతో పని లేకుండా,బక్తితో  పత్రం పుష్పం ఏది ఇచ్చినా దేవుడు తిసుకుo టాడు . వారిని అనుగ్రహిస్తాదు. ఇదే వారికి తెలిసిన గిత. కాని దేవుడనే  దొంగ   అనే  పెద్దయ్య మాటలు ఎవరూ పట్టిం చుకునే వారు కారు. అయినా సరే అ వారం రోజులు పెద్దయ్య తన 'పుల్ల గొండి ' విద్యనూ ప్రదర్శిస్తూనే ఉన్నాదు. ఎలాగో వారం రోజులు గదిచాయి. ఉత్సవాలు తో పాటు గీతా పారాయణం  కూడా ముగిసిo ది. దానితో పెద్దయకు పని లేక నోరు దూల పెట్ట సాగిo ది.
 ఇంతలో ముస్లింల పండగ ఒకటి వచ్చింది . దానితో ముస్లిం లంతా మజిద్ కు  వెళ్లి నమాజులు  చెయ్యటం మొదలు పెత్తారు. అంతే ! పెద్దయ్యకు టక్కున ఒక ఆలోచన వచ్చిo ది . గీతను తిట్టినట్లు ఖురాన్ ని కూడా విమర్సిమ్చడానికి  కంకణం కట్టుకుని, మసీద్ కి దగ్గరలో కూర్చుని బయటకు వస్తున్నా యువకులను పిలిచి, కురాన్ లోని లోపాలను ఎత్తి చూప సాగాదు. అది వింటున్న కుర్ర వాళ్లకి మొదట్లో ఏమి అర్ధం కాలెదు. కొంచం అర్ధం అయ్యే సరికి . వారి కి కోపం నసాళానికి అంటి నట్లు , ఒక్క సారిగా పెద్దయ్య మిద పడి విర కుమ్ముడు కుమ్మే సరికి, పాపం పెద్దయ్య స్పృహ తప్పి పడి  పొతే, అ దారిన పోతున్న క్రిష్నయ్య  వారిని వారించి , పెద్దయ్యకు ఉప చర్యలు చేసి , హాస్పిటల్లో జాయిన్ చెసాదు. అ రోజు నుంచి పెద్దయ్య మాట్లాడితే ఒట్టు!