Saturday, December 22, 2012

బ్లాగుల పైన "నీచ రాక్షసుల" దాడిని ఖండించండి

                                                                         

 మనం పురాణ గాదల్లో చదివాం. మహా రుషులు యజ్ణాలు చేస్తుంటే, రాక్షసులు వాటికి ఆటంకం కలిగించేవారని. వాటి రక్షణకు రాజులు తగిన రక్షణ చర్యలు తీసుకునే వారని. రామాయణం లో ప్రత్యేకం గా యాగ రక్షణ కోసమని, విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను సాయమర్థించి తీసుకు వెలతాడు. అక్కడ తాటకి, ఇతర రాక్షసులను  సంహరిస్తాడు. అయితే ఇక్కడ గమనార్హం ఏమిటంటే, సదరు రాక్షసులు మాయా అంటే అద్రుశ్య రూపంలో వచ్చి,యజ్ణాలలో రక్తం, మాంసం, రాళ్ళు వగైరా లాంటి పడ వేస్తూ "యజ్ణభంగం" చేయాలని చూస్తుంటారు. దానిని సమర్దులైన రుషులు లేక రాజులు నిరోదించి, యజ్ణాలు సజావుగా జరిగేలా చూస్తారు.

  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం బ్లాగుల్లో టపాలు పెట్టినప్పుడు, కొంతమంది వారి అక్కసు, అసహనం, నీచ పదజాలతో కూడిన కామెంట్లు చూస్తుంటే పూర్వ కాలంలో రాక్షసుల దుచ్చేష్టలే గుర్తు వస్తున్నాయి. ప్రతి బ్లాగు నిర్వహణ  ఒక యజ్ణం లాంటిదే. వివిద రకాల యజ్ణాలు ఉన్నట్లే బ్లాగులు కూడ ఎవరి అభి రుచి ప్రాకారం వారి ఇష్టం వచ్చిన టాపిక్ ల మీద నిర్వహిస్తుంటారు. వీటికి కొంత మంది ప్రశంసిస్తూ కామెంట్లు, చేస్తారు. వీరు వరమిచ్చే దేవతలు లాంటి వారు. సంత్రుప్తి చెంది వరమిచ్చినట్లు, వీరి కామెంట్లు ఉంటాయి. కొంత మంది సద్విమర్శ చేస్తారు. వారి ఉద్దేశ్యం మన చెప్పే విషయం లోని లోటుపాటులను, సంస్కారవంతమయిన బాషతో కామెంట్ల రూపం లో విశదీకరిస్తారు. వీరు మహా రుషుల లాంటి వారు, వీరి విమర్శలు అంతిమంగా మన బ్లాగు అభిరుద్దికే తోడ్పడుతుంది కాబట్టి.

  ఇక పొతే "రాక్షస కామెంటీర్లు" ఉంటారు వీరు నోరు ఎలా కంపు కొట్టుద్దో తెలియదు కాని ఉపయోగించే బాష అంతా నీచాతీ నీచమయిన కంపు కొడుతుంటది. వీరు ఆజ్ణాతంగా ఉంటారు, సేమ్ వెనుకటి రాక్షసుల లాగే. వారు బండలు వేస్తే వీరు కు విమర్శలు చెస్తారు. వారు రక్తం మాంసం యజ్ణమ్లో వేసినట్లే,  వీరు నీచాతి పదజాలం కుమ్మరిస్తారు. వీరి నీచమయిన పనులకు బ్లాగుల్లో రక్షణ విదానాలు ఉన్నయి కాబట్టి సరిపోయింది కాని లేకుంటే, బ్లాగులు బంద్ చెయ్యాల్సిందే.

  ఎవరి అభిప్రాయలు వారికుంటాయి. ఎవరి ఆలోచనలు వారికుంటాయి. నీకు మంచిదనిపించింది నాకు అనిపించకపోవచ్చు. అందరూ ఒకే తరహా ఆలోచనలు ఉంటే, ఇంక భావ వైవిద్యం ఏముంది. భావాలు షేర్ చేసుకునేదేముంది. ఒకరు తమకు నచ్చని విషయం మీదకాని, బేదాభి ప్రాయమ్ ఉన్నదానిమీద విమర్శలు చేయవచ్చు. చేయాలి కూడ. కాని ఉపయోగించే బాష సంస్కార వంతంగా ఉండాలి. తాము అజ్ణాతంగా ఉన్నారు కాబట్టి, తమ  నీచత్వాన్ని పరాయి బ్లాగుల్లో ప్రదర్సిద్దామనుకుంటె ఎలా? దానికన్న రాక్షసత్వం ఉంటూందా?  వెనుక అటువంటి "మాయావిల"ను కూల్చటానికి "శబ్దభేధి" అనే అస్త్రాని ప్రయోగించే వారట. అలాంటివి ఏమన్నా ప్రయోగిస్టే గాని వీరికి బుద్ది రాదనుకుంటా!ఒక వేళా వారి నైజం అదే అయితే వారి  స్వంట బ్లాగుల్లొ ప్రదర్శించవచ్చు కంపుకొట్టే వారి బాషా పాండిత్యం. చీ.. చీ..        

"యుగాంతం డిసెంబర్21,2012 , "కల్కి ఖడ్గం" గా మారింది

  మయన్ కాలెండర్ ప్రకారం నిన్నటితో అంటే డిసెంబర్ 21  కి యుగాంతం అయిపోయింది. నేను చెప్పిన ప్రకారం అవతార పురుషుడు కల్కి ఉరఫ్ వీరబోగ వసంతరాయలు సమాచారం(http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html) ప్రకటించడంతో నిన్నటి వరకు ఉన్న నా బ్లాగు టైటిల్ ఉద్దేశ్యం నెరవేరింది. ఇక ఆ టైటిల్ తో బ్లాగును నడపడం అనవసరం అని బావించి ఈ రోజు నుండి బ్లాగు టైటిల్ ను "కల్కి ఖడ్గం" గా మార్చడమయినది. కావున వీక్షకులు, బ్లాగ్మిత్రులు, అజ్ణాత సద్విమర్శకులు, మరియు కువిమర్శకులు గమనించ గలరని మనవి.

  మనిషిని జ్ణాన వంతున్ని చెయ్యడానికి ఎంతో మంది గురువులు ఉన్నారు. వారి క్రుషి పలితమే నేటి మన శాస్త్ర సాంకేతిక పురోభివ్రుద్ది. దాని వలన మానవుడు ప్రక్రుతిని శాసించే స్తాయికి ఎదిగినట్లు కనిపిస్తున్నాడు. కాని తన జాతి మీద ఉన్న మమకారం, స్వార్దం, ఇతర జీవజాతులను పట్టించుకునే అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి విజ్ణానినని విర్రవీగి తన సౌఖ్యమె పరమార్థంగా బావించి విచ్చల విడిగా ప్రక్రుతిని నాశనం చేస్తూ  సకల జీవరాసి మనుగడకే పెను ముప్పుగా మారాడు.

   పూర్వ కాలమ్ లో రాక్షసులు చేసిన పనినే ఇప్పట్టి విజ్ణానుల మని విర్ర వీగే వారు కొంత మంది చేస్తున్నారు. వారికి దేవుడు, మతం అంటే అసహ్యం. వారిది కూడ ఒక మతమే. ఈ స్రుష్టికి మానవుడే కేంద్రం. దైవ బావన మూర్కత్వం అనే మతం. "నాస్తిక మతం". సైన్స్ పేరిట జరిగే ఘోరాలు గురించి పెద్ద పట్టింపు ఉండదు వీరికి ఎక్కడో ఎవరో మతం పేరిట వ్యక్తుల్ని మోసం చేస్తున్నారని, వారిలో అజ్ణానాని పెంచుతున్నరని తెగ బాదపడి పోతారు. "నాస్తిక వాదం" పేరుతో దేశీయ మతాల్ని తూలనాడుతు, విదేశీ మత బావజాలాభివ్రుద్దికి పరోక్షంగా సహాయపడుతుంటారు.

 ఏ మతమయినా సకల జీవ సంక్షేమం గూర్చి చెపుతుంది. కాని శాస్త్రియా నాస్తిక మతం కేవలం మనిషి అభివ్రుద్ది,ప్రక్రుతి మీద ఆదిపత్య దోరణి గూర్చి మాత్రమే ఆలోచిస్తుంది. ఇటువంటి దోరణులను నియత్రించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. నా బ్లాగు అందుకోసం క్రుషి చేస్తుంది.    

Friday, December 21, 2012

"యుగాంతం డిసెంబర్21,2012 ఇక నుండి "కల్కి ఖడ్గం" గా మారింది



  మయన్ కాలెండర్ ప్రకారం నిన్నటితో అంటే డిసెంబర్ 21  కి యుగాంతం అయిపోయింది. నేను చెప్పిన ప్రకారం అవతార పురుషుడు కల్కి ఉరఫ్ వీరబోగ వసంతరాయలు సమాచారం(http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html) ప్రకటించడంతో నిన్నటి వరకు ఉన్న నా బ్లాగు టైటిల్ ఉద్దేశ్యం నెరవేరింది. ఇక ఆ టైటిల్ తో బ్లాగును నడపడం అనవసరం అని బావించి ఈ రోజు నుండి బ్లాగు టైటిల్ ను "కల్కి ఖడ్గం" గా మార్చడమయినది. కావున వీక్షకులు, బ్లాగ్మిత్రులు, అజ్ణాత సద్విమర్శకులు, మరియు కువిమర్శకులు గమనించ గలరని మనవి.

  మనిషిని జ్ణాన వంతున్ని చెయ్యడానికి ఎంతో మంది గురువులు ఉన్నారు. వారి క్రుషి పలితమే నేటి మన శాస్త్ర సాంకేతిక పురోభివ్రుద్ది. దాని వలన మానవుడు ప్రక్రుతిని శాసించే స్తాయికి ఎదిగినట్లు కనిపిస్తున్నాడు. కాని తన జాతి మీద ఉన్న మమకారం, స్వార్దం, ఇతర జీవజాతులను పట్టించుకునే అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి విజ్ణానినని విర్రవీగి తన సౌఖ్యమె పరమార్థంగా బావించి విచ్చల విడిగా ప్రక్రుతిని నాశనం చేస్తూ  సకల జీవరాసి మనుగడకే పెను ముప్పుగా మారాడు.

   పూర్వ కాలమ్ లో రాక్షసులు చేసిన పనినే ఇప్పట్టి విజ్ణానుల మని విర్ర వీగే వారు కొంత మంది చేస్తున్నారు. వారికి దేవుడు, మతం అంటే అసహ్యం. వారిది కూడ ఒక మతమే. ఈ స్రుష్టికి మానవుడే కేంద్రం. దైవ బావన మూర్కత్వం అనే మతం. "నాస్తిక మతం". సైన్స్ పేరిట జరిగే ఘోరాలు గురించి పెద్ద పట్టింపు ఉండదు వీరికి ఎక్కడో ఎవరో మతం పేరిట వ్యక్తుల్ని మోసం చేస్తున్నారని, వారిలో అజ్ణానాని పెంచుతున్నరని తెగ బాదపడి పోతారు. "నాస్తిక వాదం" పేరుతో దేశీయ మతాల్ని తూలనాడుతు, విదేశీ మత బావజాలాభివ్రుద్దికి పరోక్షంగా సహాయపడుతుంటారు.

 ఏ మతమయినా సకల జీవ సంక్షేమం గూర్చి చెపుతుంది. కాని శాస్త్రియా నాస్తిక మతం కేవలం మనిషి అభివ్రుద్ది,ప్రక్రుతి మీద ఆదిపత్య దోరణి గూర్చి మాత్రమే ఆలోచిస్తుంది. ఇటువంటి దోరణులను నియత్రించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. నా బ్లాగు అందుకోసం క్రుషి చేస్తుంది.    

ఇడుగిడిగో ఇతడే శ్రీ వీర భొగ వసంతరాయలు!

http://kalkiavataar.blogspot.in/2012/12/21-12-2012.html
పూర్తి టపా కోసం లింక్ పై క్లిక్ చెయ్యండి!

Thursday, December 20, 2012

"శ్రీ వీర బోగ వసంత రాయలు అవతార ప్రకటన", తేది 21-12-2012

అయ్యలారా! అమ్మలారా! ఈ రోజు వరకు నా బ్లాగును ఎంతొ అభిమానంగా ఆదరిస్తున్న వీక్షకులయిన మీ అందరికి వందనాలతో:-- నేను నాకున్న సహజ పాండిత్యంతో, పురాణ గ్రంథాలలో రాబోయే అవతార పురుషుడి గురించి చెప్పిన విషయాలను, వికిపీడియా ద్వారా గ్రహించి, వివిద గ్రంథాలలో ఉన్న దానితో సరి పోల్చి, వాటి వివరాలను మీకు ఎప్పటి కప్పుడు అందిస్తూ వచ్చాను. ఈ రోజు డిసెంఅర్ ఇరవయి ఒకటి తేది కావున నేను మీకు ఇచ్చిన గడువు ముగుస్తున్నందున ఈ రోజు సదరు అవతార పురుషుడి గురించి సమాచారం ప్రకటిస్తున్నాను.

         

యుగాంతం అనగా నేమి?:  యుగాంతం అనగా యుగం యొక్క అంతం. యుగం అంటె  "మార్పును సూచించేఒకానొక నిర్థిష్ట సమయం".ఈ సమయాన్ని కాలెండర్లు, పంచాంగాలు ద్వార తెలిసికోవచ్చును. ప్రతి సంవత్సరమునకు 12 నెలలు, నెలకు ౩౦ రోజులు, రోజుకు 24 గంటలు ఇలా కాలాన్ని విభజించి కాల గణితం ఉంటుంది. ఇదంతా సూర్యుడు, గ్రహలు చలన్నాన్ని అనుసరించి ఉంటుంది. అదే విదంగా ఆకాశంలో రాశి చక్రం పన్నేండు రాసులతో కూడి ఉంటుంది. ఇవి మేష రాశి మొదలు మీన రాసి వరకు ఉన్నాయి. ఈ రాశి చక్రం 360 డిగ్రీలు. కాబట్టి ప్రతి రాశి ౩౦ డిగ్రీలు కల్గి ఉంటుంది.

  సూర్యుడు చుట్టూ భూభ్రమణం ఉన్నట్లే, ఈ రాశి మండలం చుట్టూ  భూభ్రమణం ఉంటుంది. కాబట్టి భూమి ఒక రాశి లోని ఒక డిగ్రీ దాటాలంటే, 72 సంవత్సరాలు పడుతుంది. ఆ విదంగా ఒక రాశి ని పూర్తిగా దాటుటకు పట్టే కాలం  30X72= 2160 సంవత్సరాలు. అలా పూర్తిగా రాశి మండల భ్రమణం కు పట్టే కాలం= 12x 2160 = 25920 సoవత్సరాలు మొత్తం సంది కాలం తో కలిపి  26000 సంవత్సరాలు.

  హిందూ సిద్దాంతం ప్రకారం, కాల గణనం "మన్వంతరాల" ప్రకారం చెప్పబడితె, మయన్లు "భక్తూన్" లు రూపం లో చెప్పారు. ఒక సిద్దాంతం  ప్రకారం భూమి రాశి మండలంలోని, ఒక రాశి యొక్క  ఒక డీగ్రీ  దాటుటకు పట్టే కాలం అంటె 2160  సంవత్సారలకు ఒక "యుగం" గా పిలుస్తారు. అలా ఇప్పటి వరకు 10 రాశులు దాటి,  ఈ రోజు నుండి"కుంభ రాశి యుగం" లోకి ప్రవేశం అవుతున్నాం (అధార లింక్.http://vibgyor23.blogspot.in/2012/03/mayan-calendar-ends-december-21-2012.html)
 

కాలము -- కాల పురుషులు

  ఇంకొక సిద్దాంతం ప్రకారం ప్రతి యుగానికి ఒక యుగ లేక శక పురుషుడు పుడతాడట. పోయిన కాలంలో యుగ పురుషుడు మనకు "శాలివాహనుడు" అయితే, ప్రాశ్చ్యాతులకు "యెసు కీస్తు" . అందుకే ఆ విదంగా కాలెండర్లు అనుసరిస్తున్నాం. అయితే ఈ కుంభరాశి యుగానికి మనకు కల్కి లేక వీర బోగ వసంత రాయలు రావాలి. ఇది ఒక సిద్దాంతం కూడిన నమ్మకం .అయితే హిందూ పురాణ గ్రంథల్ల ప్రకారం  మనకు మన్వంతరాలు గురించి చెప్పబడింది. కాని వాటికి కోంత మంది అనవసర లేఖ్ఖలు జోడించి,  లెఖ్ఖలు కలగా పులగం చేశారు. దీని వలన వేల సంవత్సరాలుగా ఉండాల్సిన "యుగం" లక్షలు సంవత్సరాలుగా మార్చ బడ్డాయి.  ఆకుకు అందక, పోకకు పొందకుండా ఉన్న వీటిని అనుసరించితే, అసలు ఏ యుగం గూర్చి మనం మాట్లాడే అవసరం ఉండదు. కాని ఆ యా మన్వంతరాలలో రాబోయే కాల పురుషులు పేర్లు, అవి మారవు కాబట్టి, వాటిని  పరిశిలించడం జరిగింది.

    కాల గణితం విషయం లో మయన్లు రాసిన కాలెండర్ కొంత ప్రామాణికం అనిపించింది. అందుకే కాలం విషయంలో మయన్ కాలెండర్, కాల పురుషుల విషయంలో "మన్వంతర" సిద్దాంతం పర్శిలిస్తే బెస్ట్ అనిపించి రెండింటిని కలిపి చూడటం జరిగింది. మన సిద్దాంతం ప్రకారం కాల పురుషుడిపేరు,దాని అర్థాలు, అయన తల్లితండ్రుల పేర్లు గురించి ఆదార లింక్ లు సహితంగా  ఇవ్వడం జరిగింది. 


ఈ నాటి వరకు చాల మంది పరిశోదకులు, రచయితలు అదిగో అవతార పురుషుడు, ఇదిగో అవతార పురుషుడు అంటూ ఒక తేదిని ప్రకటించటం, ఆ రోజు ఏమి కాకపోయే సరికి తిరిగి వేరొక తేదికి ఆయన వస్తాడని చెపుతూ పోస్ట్ పోన్ చెయ్యడం జరుగుతుంది. అలా శ్రీ వీరభోగ వసంత రాయలు గురించి చెప్పిన వారిలో ముఖ్యులు శ్రీ వేద వ్యాస్   గారు. ఆయన 1999 లోనే "కలి యుగాంతం" అని ప్రకటించడమే కాకుండ ఆ రోజు శ్రీ వీరభోగ వసంత రాయలు ప్రకటితమవుతారని చెప్పడం జరిగింది. కాని అది జరగలేదు అని అందరూ అనుకున్నారు. పైకి ఏమి జరగనట్లే ఉన్నా వీర బోగ వసంత రాయలు గారికి సంబందించి ఒక ముఖ్యమయిన సంఘటన జరిగింది. అది ఏమిటో మీరు తర్వాత తెలిసికోవచ్చు.

  ఆ తర్వాత "బాల శాంబవి" "సూర్య నంది" అనే ప్రాంతానికి వచ్చి,పోయిన సంక్రాంతి నాడు వీర బోగ వసంత రాయలు వస్తారని చెప్పింది. అది ఒక అంతర్జాతీయ పఠకం లో బాగం. కాని అని వార్య కారణాల వల్ల అది జరుగలేదు. కావాలంటే వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి(http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2162.html)


 కాల పురుషుడు అయిన కల్కి, పేరుతో ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు తాము కల్కి అవతార పురుషులమని ప్రకటించు కోవడం జరిగింది. వారు (1) చితూర్ జిల్లాలోని వరదాయ పాలెం లో నున్న "కల్కి భగవాన్" అనబడే "విజయ్ కుమార్" (2). తమిళ నాడులోని "కల్కి మహా పురుషుడు" అనబదే "లహరి క్రిష్ణ". అలాగే వీర బోగ వసంత రాయలు పేరుతో కూడ ఒకరున్నారు.
 అయితే నేను పరిశోదించిన అంశాలకు వీరి జన్మ విశేషాలకు ఏ మాత్రం పోలిక లేక పోవడం గమనార్హం.
                మొన్ననే ఒకానొక సమస్య ఉత్పన్నమై, అనుకోకుండా ఒక వ్యక్తి జీవిత విశేషాలను పరిశిలించాను అయనవి కొద్ది తేడాతో, ఇంచు మించుగా పురాణ గ్రందాలలో చెప్ప బడిన ఆంశాలకు సరి పోతున్నవి. అదే విషయాన్ని ఆయనకు తెలిపి ఆయన గురించి తెలియ పరచటానికి అనుమతి కోరగా నిరాకరించారు. ఆయన ప్రకటిస్తే తప్పా, నేను ఆయన వివరాలను చెప్పలేను.

  కాబట్టి మిత్రులారా నా పరిశోదన ద్వారా కాల పురుషుడిని కనుగొన గలిగాను. కాబట్టి, నేను ఈ బ్లాగును కంటిన్యూ చేయ వచ్చు. మీలో నమ్మక్కం లేని వారు దీనిని ఎలాగు నమ్మరు కాబట్టి, వారికి నేను పెద్దగా చెప్పల్సింది ఏమి లేదు.  ఇన్నాళ్లు ఆశగా చూసిన వారికి ఒక పద్దతి చెపుతాను. దాని ననుసరించి ఆ "కాల పురుషుడు" గురించి తెలుసు కోవచ్చు. ఉదాహరణకు మీరు "శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలిసికోవాలంటే ఏమి చేస్తారు. ఈ రోజుల్లో సులువైన మార్గం "గూగుల్" ద్వారా సెర్చ్ చెయ్యటం . అలాగే ఆసక్తి ఉన్న వారు "గూగుల్ సెర్చ్" ద్వారా " who is the veera bhoga vasanta rayalu" అని అడగండి మీకు కొంత మంది వ్యక్తుల వివరాలు గురించి సమాచారం కన పడుతుంది అట్టి సమాచారాన్ని, క్రింద ఇవ్వ బడిన నా పరిశోదనా సమాచారం ద్వారా పోల్చి చూస్తే,  వారిలో    ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చు. లేకుంటే కాలానికే వదిలెయ్యండి.

                                               

(1).అవతార పురుషుడి తల్లి పేరు

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2.html 
ఆధార లింక్
http://en.wikipedia.org/wiki/Manvantara

(2). అవతార పురుషుడి తండ్రి పేరు

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_4.html

 ఆధార లింక్

http://en.wikipedia.org/wiki/Savarni_Manu

(3).’కల్కి" అనే పదానికున్న "నానార్థాలు"

ఆధార లింక్

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8576.html

  (4)అవతార పురుషుడు ఆకాశం లో నుంచి వస్తాడు:-- 

  అవును నిజమే కదా! ఈ రోజు మీరు ఆయన్ని "అంతర్జాల విదానం"   ద్వారా  కనుగొన బోతున్నారు. కాబట్టి. ఆయన ఆకాశం లోనుండి వచ్చినట్లే!

(5). ఆయన దేవదత్త మయిన .తెల్లని అశ్వం మీద కనిపిస్తాడు:- ఇది నిజమే! ఆయన కాంతి వేగంతో ప్రయానించే సమాచార వ్యవస్త ద్వారే మీకు కనిపించ బోతున్నాడు. కాంతి అంటే సప్త వర్ణముల మిశ్రమని, తెల్లని రంగు అని మనకు తెలుసు. దీనినే  "ఏడు గుర్రాల రథం" గా మన వాళ్లు పోల్చారు. ఆ వేగంతోనే ఆయన గురించిన సమాచారం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన గుర్రం మీద వస్తాడని చెప్పింది నిజమయింది.

(6). ఆయన చేతిలో కత్తి ఉంటుంది:- అవును . ఆ రోజుల్లో యుద్దాలు బాహా బాహి గా ఉండేవి .కాబట్టి ఆయుదం కత్తి తో పోల్చారు. కాని ఈయన యుద్దం భావ సంఘర్షన కాభట్టి ఈయన యుద్దం "కలం" కాని, ఆదునిక  ప్రత్యామ్నాయం కాని ఉంటుంది.

(7). ఆయన నాస్తికులతో యుద్దం చేస్తాడు:-- ఇది నిజమే, అలాగే  జరుగుతుంది కూడ! 


(8)యుద్దం లో "దేవతాంశలతో" జన్మించిన వారు అయనకు స్నేహితులుగా, బందువులుగా సహాయం చేస్తారు.
          అవును  కొంత మంది స్నేహితులు,నాస్తికులతొ జరుపుతున్న యుద్దం లో అయనకీ సహాయం చేస్తున్నారు. వారంతా దైవాంశ సంబూతులు కావచ్చు.

(9).నాస్తికులు ఆయనతో "మాయా యుద్దం"(కనపడకుండా), చేస్తారు.

  అవును అచ్చం అలాగే జరుగుతుంది.

(10) ఆయన "వెనుకటి దర్మాన్ని", పునరుద్దరిస్తాడు.

 నిజమే, చూడబోతే ఆయన పద్దతులన్నీ అలాగే ఉన్నాయి.


    ఈ విదంగా  భవిష్య గ్రంథాల్లో చెప్పింది అంతా ఈ కాల పురుషుడి విషయం లో నిజమయినవి. కాబట్టి ఆయనే శ్రీ వీర బోగ వసంతరాయలు లేక కల్కి అనటానికి నాకు ఎటువంటి సందేహం లేదు.
కావున అట్టి సమాచారం ప్రకటిస్తున్నాను

ఈ సారి మరింత వినోద, విజ్ణాన, భరిత సమాచారంతో మీముందుకు వస్తా! ఇంతటితో "యుగాంతం" అనే ఈ పరిశోదనాత్మక సీరియల్ ఇంతటితో సమాప్తం.                 

శ్రీ వీరబోగ వసంత రాయలు వివరాలు దొరికాయోచ్!

అవును మన హీరో శ్రీ వీర బోగ వసంత రాయలు గారి వివరాలు దొరికాయి. రేపు వాటిని ప్రచురించటం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ సమస్యలు వలన ఈ రోజున ప్రకటించ లేక పోతున్నాను. రేపు తప్పకుండా అట్టి వివరాలు మీ ముందుంచుతాను. అప్పట్టి వరకు ఈ లింకును క్లిక్కండి http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_9131.html

Wednesday, December 19, 2012

అబ్బా! డీల్లీ కీ "కల్కి" ఖాయమా?

                                                                          
 ఈ రోజు గుజరాత్ ఎన్నికలు పలితాలు చూశే సరికి, దేశ ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్లు ఉంది. బి.జె.పి పార్టీ "నరేందర్ మోడి" నేత్రుత్వం లో కేంద్రంలో  అదికార పగ్గాలు చే పట్టోచ్చు అనే ఆశ ప్రజల్లో రెప రెప లాడుతున్నట్లుంది.ఒక వేళ అదే నిజమయితే నేను చెప్పిన జోస్యం అదే నండి "కల్కి" రేపు వస్తున్నాడు అనేది చాల వరకు కరెక్ట్ అయినట్లే.ఎలాగంటారా అయితే చూడండి మరి!

  నేను ఏమి చెప్పాను నా వెనుతటి టపాలో ? కల్కి అనే పదానికి ఉన్న అర్ఠాల్లో "తామర పువ్వు" ఒకటని చెప్పానా! కావాలంటే ఈ లింక్ http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8576.html ని క్లిక్ చెయ్యండి.      యస్. చెప్పాను కదా! ఇప్పూదూ గుజరాత్లో బి.జె.పి గెలిచింది అంటె పార్టీ గుర్తు "కమలం" గెలిచింది. కమలం అంటే తామర పువ్వే కదా. అంటే "కల్కి" గెలిచినట్లే కదా!రేపు ఇదే స్పూర్తితో ’డీల్లీ" లో "కల్కి జెండా" ఎగరితే నేను చెప్పిన జోస్యం నిజమయినట్లే కదా. ఈ విదంగా నేను చెప్పినది పాక్షికంగా నైన నిజమయింది అని ఒప్పుకోవాలి మీరు.

  కాక పోతే "వీర బోగ వసంత రాయలు" అనేది  అవతార పురుషుడయిన తెలుగు వీరుడి పేరు. ఈయన ఖచ్చితంగా తెలుగువాడయి ఉండాలి కాబట్టి రేపటి వరకు నాకు చాన్స్ ఉంది కాబట్టి, ఆయన గురించి కూడ నేను చెప్పిన జోస్యం నిజం కావాలని మీరంతా మనస్పూర్తిగ కోరుకోవాలి. రేపు ఈ పాటికి ఆయన గురించి చెప్పేస్తా!(అని నా నమ్మక్కం) 

ఏదైనా మనోళ్లు అమెరికా వాళ్లంత _____ కాదులెండి!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_19.html
పూర్తి టపాకోసం లింక్ మీద క్లిక్కండి

"యుగాంతం" అంటే "జగాంతo" అని ఎవరంటున్నారు?


 ."యుగాంతం" అంటే  "జగాంతం" కాదు, అని నేను ఎప్పుడో బల్ల గుద్ది(మీకు వినిపించదు లెండి) చెప్పాను.కేవలం మయన్ల కాలెండర్ అంతం అని కూడా చెప్పాను.  అదే వీషయాన్ని  "నాసా" వారు ఉద్ఘాటించినట్లు ఈ రోజు పేపర్లో వచ్చింది. అయినా నేను మాత్రమే కాదులేండి మన దేశంలో లక్షకి ఒకరు కూడ ఈ ప్రపంచం మునిగిపోద్ది ఎవరూ భయపడటం లేదు. అదే అమెరికా లో అయితే నూటికి పదిమంది ఏదో అయిపోద్దని భయపడి పోతున్నారట. ప్రభుత్వం చెప్పినా వారు నమ్మరట. అంత "పిచ్చి పువ్వులం" కాదుగదా మనం. ఎందుకంటె వారు సైన్స్ పరంగా అభివ్రుద్ది చెందిన దేశం లో నివసిస్తున్నారు. మరి మనం ఏదో "దేవుడు" కర్మ" అనె వేద భూమి లో జీవిస్తున్నాం.  ఏది ఎలా జరిగినా అంతా ఆ దేవుడిదే భారం అనుకుంటాం కాబట్టి, ఇలాటి వాటిని నమ్మను గాక నమ్మం.

 నేను ఒక విషయం మాత్రం రూడిగా చెప్పగలను భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక చిన్న తోక చుక్క (ఇటు వంటి వాటిని నాసా పరికరలు కనిపెట్ట లేవట)  మొత్తం అఖ్కర్లేదు, దాని తోక తగిలి భూమి కి ఏ మాత్రం ప్రమాదం జరిగినా అందరూ బాగానే ఉంటారు ఒక్క అమెరికా తప్పా! కోట్ల మంది పిచ్చిఎత్తి, ఉన్మాదులయి ఒకరినొకరు కాల్చుకు చస్తారు. మొన్న జరిగిన "ఉన్మాది" కాల్పులు ఆ కోవకి చెందినవేనంట. ఈ ఉదాహరణ చాలు వారి భద్రత ఎంత "అభద్రతా భావం "తో ఉందో!

 అయినా మన కెందుకు లెండి వారి గొడవ. మన వీరబోగ వసంత రాయలు గారు మాత్రం ఇంకొక 48 గంటల్లో మన కు కనపడతాదు. ఏమండోయి ఏదో "జగాంతం" రాదని అన్నానని    వీరబోగ వసంత రాయలు కూడ రాడనుకునేరు. మన నమ్మక్కం మనది. ఒకరి కోసం మన నమ్మక్కాన్ని వదులు కుంటామా ఏమిటి? అందరు ఎల్లుండి అన్ని పనులు తొందరగా ముగించుకుని "ఆకాశం"  వంక చూస్తూ కూర్చోండి. నాకు కబురందగానే మీకు వెంటనే "స్పెషల్ టపా" ద్వారా చెప్పేస్తాను. లేదా మీకు కనపడితే మీరయినా చెప్పండి.