మనం పురాణ గాదల్లో చదివాం. మహా రుషులు యజ్ణాలు చేస్తుంటే, రాక్షసులు వాటికి ఆటంకం కలిగించేవారని. వాటి రక్షణకు రాజులు తగిన రక్షణ చర్యలు తీసుకునే వారని. రామాయణం లో ప్రత్యేకం గా యాగ రక్షణ కోసమని, విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను సాయమర్థించి తీసుకు వెలతాడు. అక్కడ తాటకి, ఇతర రాక్షసులను సంహరిస్తాడు. అయితే ఇక్కడ గమనార్హం ఏమిటంటే, సదరు రాక్షసులు మాయా అంటే అద్రుశ్య రూపంలో వచ్చి,యజ్ణాలలో రక్తం, మాంసం, రాళ్ళు వగైరా లాంటి పడ వేస్తూ "యజ్ణభంగం" చేయాలని చూస్తుంటారు. దానిని సమర్దులైన రుషులు లేక రాజులు నిరోదించి, యజ్ణాలు సజావుగా జరిగేలా చూస్తారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం బ్లాగుల్లో టపాలు పెట్టినప్పుడు, కొంతమంది వారి అక్కసు, అసహనం, నీచ పదజాలతో కూడిన కామెంట్లు చూస్తుంటే పూర్వ కాలంలో రాక్షసుల దుచ్చేష్టలే గుర్తు వస్తున్నాయి. ప్రతి బ్లాగు నిర్వహణ ఒక యజ్ణం లాంటిదే. వివిద రకాల యజ్ణాలు ఉన్నట్లే బ్లాగులు కూడ ఎవరి అభి రుచి ప్రాకారం వారి ఇష్టం వచ్చిన టాపిక్ ల మీద నిర్వహిస్తుంటారు. వీటికి కొంత మంది ప్రశంసిస్తూ కామెంట్లు, చేస్తారు. వీరు వరమిచ్చే దేవతలు లాంటి వారు. సంత్రుప్తి చెంది వరమిచ్చినట్లు, వీరి కామెంట్లు ఉంటాయి. కొంత మంది సద్విమర్శ చేస్తారు. వారి ఉద్దేశ్యం మన చెప్పే విషయం లోని లోటుపాటులను, సంస్కారవంతమయిన బాషతో కామెంట్ల రూపం లో విశదీకరిస్తారు. వీరు మహా రుషుల లాంటి వారు, వీరి విమర్శలు అంతిమంగా మన బ్లాగు అభిరుద్దికే తోడ్పడుతుంది కాబట్టి.
ఇక పొతే "రాక్షస కామెంటీర్లు" ఉంటారు వీరు నోరు ఎలా కంపు కొట్టుద్దో తెలియదు కాని ఉపయోగించే బాష అంతా నీచాతీ నీచమయిన కంపు కొడుతుంటది. వీరు ఆజ్ణాతంగా ఉంటారు, సేమ్ వెనుకటి రాక్షసుల లాగే. వారు బండలు వేస్తే వీరు కు విమర్శలు చెస్తారు. వారు రక్తం మాంసం యజ్ణమ్లో వేసినట్లే, వీరు నీచాతి పదజాలం కుమ్మరిస్తారు. వీరి నీచమయిన పనులకు బ్లాగుల్లో రక్షణ విదానాలు ఉన్నయి కాబట్టి సరిపోయింది కాని లేకుంటే, బ్లాగులు బంద్ చెయ్యాల్సిందే.
ఎవరి అభిప్రాయలు వారికుంటాయి. ఎవరి ఆలోచనలు వారికుంటాయి. నీకు మంచిదనిపించింది నాకు అనిపించకపోవచ్చు. అందరూ ఒకే తరహా ఆలోచనలు ఉంటే, ఇంక భావ వైవిద్యం ఏముంది. భావాలు షేర్ చేసుకునేదేముంది. ఒకరు తమకు నచ్చని విషయం మీదకాని, బేదాభి ప్రాయమ్ ఉన్నదానిమీద విమర్శలు చేయవచ్చు. చేయాలి కూడ. కాని ఉపయోగించే బాష సంస్కార వంతంగా ఉండాలి. తాము అజ్ణాతంగా ఉన్నారు కాబట్టి, తమ నీచత్వాన్ని పరాయి బ్లాగుల్లో ప్రదర్సిద్దామనుకుంటె ఎలా? దానికన్న రాక్షసత్వం ఉంటూందా? వెనుక అటువంటి "మాయావిల"ను కూల్చటానికి "శబ్దభేధి" అనే అస్త్రాని ప్రయోగించే వారట. అలాంటివి ఏమన్నా ప్రయోగిస్టే గాని వీరికి బుద్ది రాదనుకుంటా!ఒక వేళా వారి నైజం అదే అయితే వారి స్వంట బ్లాగుల్లొ ప్రదర్శించవచ్చు కంపుకొట్టే వారి బాషా పాండిత్యం. చీ.. చీ..