ఇది నేను ఇంతకు మునుపు పెట్టిన టపా
http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_13.htmlకి కొన సాగింపు.
అసలు దలై లామా గారు ఎందుకు తెలుగు వారి అవతార పురుషుడు, బ్రహ్మం గారి బవిష్య అవతారం,"వీర బోగ వసంత రాయలు" మీద ద్రుష్టి కేంద్రికరించారు అంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్లు, బ్రాహ్మణ, ఆఫీసర్ వేద వ్యాస్ గారు. ఆయన రచనలు, బ్రహ్మం గారి కాల జ్ణానం నమ్మిన ’దలై లామ" గారు, "దర్మ స్తలం లోని కొంత మంది, వేదవ్యాస్ గారి అభిమానులు లేక ఆయన సంబందితుల ప్లాన్ కి తల ఊపి ఉంటారు.
"వేద వ్యాస్" గారి ప్రకారం ’కల్కి’ అన్నా వీర బోగ వసంత రాయలు" అన్నా ఒకరే. అతను తప్పకుండా "బ్రాహ్మణుడై" ఉండాలి. లేకుంటే కొంప దీసి, ఏ శూద్రుడో, అవతార పురుషుడుగా వస్తే "శూద్రపాలన" లోనే బారత దేశం బవిష్యత్తు ఉంటుంది. వారి ద్రుష్టిలో అంతో ఇంతో మన సమాజానికి మేలు చేసింది "బ్రాహ్మనులే". ఈ శూద్రులు(ఇప్పటి అగ్రవర్ణాల్లో కొన్ని కులాలు వారు ఆ నాడు శూద్రులే),పాలన వల్లే "వేద ధర్మం" మంట గలిసి పోతుంటే, మళ్లి బ్రహ్మం గారి అవతారం "వీర బోగ వసంత రాయలు" రాజ్యమెలితే ఏమన్నా ఉందా?. అందుకే "వేదవ్యాస్" గణానికి శూద్రులు ఎట్టి పరిస్తితిలో,"వీర బోగ వసంత రాయలు" కాకూడదు. పోని బ్రాహ్మణులు వస్తారా అంటె అదిక శాతం మంది నమ్మక పోవచ్చు. ఉబయతారకంగా అసలు మన వారిని కాకుండా టిబెట్ వారైతే ఎవరికీ బాద లేదు అనుకుని దలై లామ గారిని ఒప్పించి ఉండాలి.
అటు దలై లామా గారికి ఏదో రకంగా బారతీయుల అండ అవసరం.అమ్దుకే ఇంతకు ముందు చెప్పిన తతంగం అంతా.(మొదటి బాగం చూడండి). కాని ’బాల దేవత " నాటకం ’బాలల హక్కులు" కు బంగం అని మానవతావాదులు చేసిన గోల కి "శాంబవి" అద్దె తల్లి తండ్రులతో సహా తట్టా,బుట్టా, సర్థుకుని ’దర్మ శాల" కి వెళ్లి పోక తప్పలేదు.
అయినా వారి పిచ్చి కాని, బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందా? వీరు అనుకున్నట్లు జరుగుతుందా? బ్రహ్మంగారు శూద్రుడు. ఆయన సాంప్రాదాయాలకు అనుకూలమయినప్పటికి, మతంలో "బ్రాహ్మణ ఆదిపత్యాన్ని’ ప్రశ్నించిన వారు. మరి అటువంటి ఆయన పునరవతారం ""బ్రాహ్మణుడిగా" వస్తుందా? రాదు గాక రాదు. అందుకే వీరి చేష్టలకు కోపం వచ్చే దేవుడు వారిని "సూర్య నంది"లొ వారి బాగోతం బట్ట బయలు చేసి ఉంటాడు.ఇక్కడ మానవ హక్కుల కమీషన్ వారి జ్యోక్యంతో,కలెక్టర్ "శాంబవి " వ్యవహరం మీద విచారణ చేపట్టడం గురించి తెలుసుకున్న "దలై లామ " గారు "సూర్య నంది"లో "ఆశ్రమ ప్రారంబోత్స్వం" కార్యక్రమం రద్దు చేసుకున్నారు. ఆ
దెబ్బతో బయటకు వద్దా మనుకున్న "బోగస్" "వీర బోగ వసంత రాయలు" రాలేక పోయాడు. అయ్యా ఇదీ "శాంబవి కథ" ఇక్కడ గమనార్హం ఏమిటంటే అటు "గోగినేని బాబు’ గారి అద్వర్యంలో మానవ హక్కుల కార్య కర్తలు, ఆస శాంభవిని బడిలో చేర్పించాలన్న ఆస కూడ నెరవేరలేదు."శాంబవి తిరిగి "దర్మ శాల" కే వెల్లింది. దీని వల్ల మన కర్థ మయ్యేది ఏమిటంటే కేవలo "దర్మ శాల " వారి ప్లాన్ బగ్నం చెయ్యడమే దైవ సంకల్పం తప్పా, ఇది మన్యుషుల సంకల్పానికి అనుకూలంగా జరిగింది కాదు.
అసలు బ్రహ్మం గారు ఏమి చెప్పారంటె తాను వీర భోగ వసంతరాయలు గా వాచ్చే నాటికి పాపం పండి ఉంటుంది. అదంతా ప్రక్షాళన చేశి "ముందు ఏ రీతిగా దర్మం నడిచెనో ఆ రీతి గా చేయుదుము" అంటారు. అంటె నిజమయిన "దర్మ పాలనను" అందిస్తానని చెపుతారు. అది క్రుత యుగం లో మాదిరి కుల, మత బేదాలు లేకుండా ఉంటుంది అని అర్థం కావచ్చు. చూదాం అది నిజమో కాదో?