Friday, May 9, 2014

" సేవ్ సిస్టర్స్ " వారు జాలి పడాల్సింది "కరుణామయులు " గురించి , రౌద్ర రూపినులైన హిందూ దేవతల గురించి కాదు!

                                                                                    

భారత దేశం లో ఉన్న హిందువులకు చీము నెత్తురు తక్కువ అయినందు వల్లా , చేతకాని వెదవలు సైతం హిందూ దేవుళ్ళను , దేవతా మూర్తులను తీవ్రంగా అవమానిస్తున్నారు . స్టానిక ఆహార అలవాట్లు అయిన ఉప్పూ , కారం  మానివేసి  పిజ్జా లు లాంటి పదార్దాలు తినటం అలవాటు చేసుకున్నందు వలన కాబోలు మన జాతిలో ఎవరేమి చేసినా పట్టించుకోని తత్త్వం ఎకువై పోయింది . సహజంగా శాంత స్వబావులైనా ,అవసరమైన  వేళలో ఉగ్ర నరసింహాలుగా , రుద్ర దుర్గా మూర్తులుగా ఉండాల్సిన జాతి దిక్కుమాలిన కరుణామయ తత్వాన్ని అలవార్చుకున్నారా అన్నట్లు ప్రవర్తిమ్చండం అత్యంత హేయం .
     విదేశి పండ్స్ తో పురుడు పోసుకున్న సంస్తలు కొన్ని కావాలని పనికట్టుకుని , భారతీయ స్త్రీలను రక్షిస్తున్నాం అని పోజులు కొడుతూ , అ వంకతో హిందూ దేవత లను ఘోరంగా అవమానిస్తుంటే  హిందువులు  మిన్నకుండడం ఈ  దేశ బవిశ్యత్ కి మంచిది కాదు ? "సేవ్ సిస్టర్స్ " అనే సంస్త ముంబాయి ఆడ్ ఏజెన్సి వారితో ఒక యాడ్ ని తయారు చేసి ప్రచారం లో పెట్టింది . దాని ఉద్దేశ్యం "గృహ హింస " కు బలి అవుతున్న స్త్రీల గురించి   ప్రచారం చేయడమట ! దాని కోసం హిందూ త్రి మూర్తినులైన లక్ష్మి ,సరస్వతి , పార్వతి మాతలను గృహ హింస కు గురై నట్లు వారి ముఖాల మిద గాయాల గుర్తులు పెట్టి  ప్రచారం చేయడం వెనుకాల ఎ శక్తులు ఉన్నాయో తెలుసుకోలేని వారు కాదు హిందువులు . హిందూ దేవతలు ఏమైనా చేతకాని కరుణామయ తత్వాన్ని ప్రబోదిమ్చిన వారా హింసలు పాలు కావడానికి?    పేరొందిన పురుష రాక్షసులనే తమ కత్తులకు బలి ఇచ్చిన రౌద్ర రూపినులు . వారినా చేత కాని "సేవ్ సిస్టర్స్ " అవహేళన చేసేది ? ఇటువంటి యాడ్ ల ద్వారా  హిందువుల మనోబావాలు గాయపరచాలని చూస్తె , రాక్షసులకు పట్టించిన గతినే హిందూ మాతలు మీకు పట్టిస్తారని గుర్తుంచుకోవడం మంచిది .

    పరమ నీచమైన సదరు యాడ్ ని క్రింది విడియోలో చూడగలరు . ఒక హిందువుగా, ఇట్టి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను .
                       
                  

Sunday, May 4, 2014

"బట్ట తక్కువ వ్యాధి" తో బాద పడుతున్న బాలిఉడ్ నటి !



ఆమె గారి పేరు పూనం పాండే . బాలిఉడ్ చలన చిత్ర సీమలో  సంచలన నటిమణ . ఆమె నటిమణి కాక ముందు మోడల్ అట . మోడల్ గా తన అంగాంగ బంగిమలతో వివిధ ఆడ్స్ లో పోజులిచ్చి వీక్షకులను వేర్రేత్తించిన హాట్ గర్ల్ !2013 లో నషా అనే హిందీ సినిమాలో విద్యార్డితో ప్రేమాయాణం సాగించిన టిచర్ పాత్రలో నటించి  కుర్రకారు మతుల్నిపోగొట్టిన  నటి . 

అయితే ఇదంతా మనకు అవసరం లేదు కాని ఈమే కు పాపం ఒక జబ్బుంది .దాని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది . ఎందుకంటే దీనిని జబ్బు అని కొంతమంది స్త్రీవాదులు అనుకోరు . దీనిని ప్యాషన్ అని ,అది స్త్రీ స్వేచ్చ లో బాగమని పొరపడుతుంటారు . అందుకే దిని గురించి తెలుసుకుంటే మంచిదనేది . అ జబ్బు పేరు "బట్ట తక్కువ వ్యాది ". దీనినే ఇంగ్లిష్ లో exhibitionism అని అనవచ్చు. ఇది ఒక మానసిక రుగ్మత . ఈ రుగ్మతతో బాద పడే వారు ఒంటి నిండా బట్ట కప్పుకోవడానికి తెగ ఇబ్బంది పడి పోతుంటారు .  తరగని వస్త్ర సంపద ఉన్నా , ఒంటిని మాత్రం చిన్న పిలికతో కప్పుకుని ఎదుటి వారిని ఆకర్షించాలని తెగ ఉభలాట పడి పోతుంటారు . అది చూసి ఎవరైనా మగాళ్ళు అదుపు తప్పితే , వారిని మృగాల్ల క్రింద జమ కట్టేసి నానా యాగి చేసి జాతియ మీడియాలో పోకస్ అయి తమ రేటింగ్ లు పెంచేసుకుంటారు .                                                                                                                                                                                                                                                                                                          అలాంటి బట్ట తక్కువ వ్యాది తో బాద పడుతున్న పూనం పాండే గారు మొన్న ముంబాయిలో అర్దరాత్రి 11 గంటలకు కారును ఒక చోట ఆపి , తన బట్ట తక్కువ తన్నాన్ని ప్రదర్శిస్తుంటే , అటుగావెళుతున్న పోలీసులు ఆమెను చూసి జీపు ఆపి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసి అసభ్య ప్రవర్తన క్రింద కేసు బుక్ చేసారు అట . అ తర్వాత ఎవరో రాజకీయ నాయకుడు పోన్ చేస్తే వార్నింగ్ ఇచ్చి వదిలేశారట . ఆమె మాత్రం పోలీసులు తనను అడిగారు తప్పా , పోలిస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళలేదు అంటుంది . తీసుకు వెళ్ళారో లేదో క్రింది విడియో చూస్తె తెలుస్తుంది .                                                                                                                                                                                                                                                                                                                               ఏది ఏమైనా బట్ట తక్కువ వ్యాదితో బాద పడే వారిని జాలి తలచి ఒంటినిండా బట్ట  కప్పాలి కాని , ఇలా అరెస్ట్ చెయ్యడమేమిటి , నాన్ సెన్స్ 1 అని సంస్కరణ వాదులు అడుగుతున్నారట . నిజమేగా మరి !ఇక నుండి పోలీసులు బట్టలు మూటలు పోలిస్ జీప్ లో  పెట్టుకుని తిరగాలి మరి .                                                                                                                                                                                




                                                                         

Saturday, May 3, 2014

"ఉదయభాను" ని అంతలా ఆవేశ పరచిన అ "కొడుకు " ఎవరు !?

ఇంతకు ముందే టి.వి మహిళా యాంకర్ ఉదయభాను పాడిన పాటకు సంబందించి "నిగ్గదీసి అడుగు " అనే టైటిల్ తో యూ ట్యూబ్ లో ఏదో పెట్టారని పేస్ బుక్ లో చూసి , బహుసా ఆమె నిగ్గదీసి అడుగు అనే సినిమా పాటను ఆమె తన గొంతుతో పాదిందేమో అనుకుని క్రింది వీడియోను చూడడం జరిగింది . ఆమె పాడిన 4 చరణాలు సదరు పాటకు సంబందించినవి కావు . ఆమె పాడినది ఎవరో అవినీతి పరుడు అయిన ఆమె కొడుకు గురించి అనిపించింది . ఆమె ఆవేశo  చూసిన  నాకు అంతలా ఆమెను అవేశ పరచిన ఆమె కొడుకు ఎవ్వరో నాకు అర్ధం కాలేదు . మీకేమైనా తెలుస్తుందేమో అని ఆమె పాడిన 4 చరణాల వీడియోను పోస్ట్ చేస్తున్నాను . చూడండి  

   
                 
అయినా  ఉదయ బాను పిచ్చి కాకపొతే , అవినీతి పరులను ఆదరిస్తున్న ప్రజలను వదిలి పెట్టి , వారిని ఏమంటే ఏమి సుఖం ? ప్రజలు ఆదరిస్తున్నారు అంటే తాము చేసేది కరెక్టే అని అనుకోవడం మానవ సహజం . అందుచేత దమ్ముంటే ప్రజలను నిగ్గదీసి అడుగు సిరి వెన్నెలా సీతా రామ శాస్త్రిలా ! అది ఎలాగో క్రింది విడియోలో చూడండి .

                                           

Wednesday, April 16, 2014

వందన సమర్పణ ఎలా చేయాలో ఈ "ఉత్తమ కుమార్ " గారిని చూసి నేర్చుకోవలసిందే !

                                                                   

సభా సాంప్రదాయాలు తెలియని వారు ఘనంగా సభలు నిర్వహిస్తారు . అందరి సంగతి ఏమో కాని ఈ  రోజు కరీంనగర్ లో కాంగ్రెస్ వారు నిర్వహించిన సభ చప్పగా సాగింది అని చెప్పవచ్చు . అధిష్టాన దేవత ఎలాగో చూసి చదువుతుంది కాబట్టి , కంపెని సెక్రటరి వార్షిక నివేదిక చదివినట్లు అనిపిస్తుంది . పోనీ ఇంకా ఎవరైనా ప్రజల్ని ఆకట్టుకునేలా  మాట్లాడారా అంటే అబ్బే అందరికి దేవతను పొగడటం మిద ఉన్న యావ తెలంగాణా బవిశ్యత్ మిద ఉన్నట్లు లేదు . ఇక అందరూ అమ్మకి కండువాలు కప్పాకా , చివరకు వందన సమర్పణ చేయమని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి అవకాసా మిచ్చారు . ఆయనకి అసలు వందన సమర్పణ అంటే ఏమిటో బొత్తిగా తెలిసినట్లు లేదు . అందుకే అయన కూడా పొడి పొడి మాటలతో తానూ కూడా ఉపన్యాసం చెప్పి వెళ్లి పోయాడు . మొత్తానికి వందన సమర్పణ లేకుండానే బారి భహిరంగ సభ ముగిసింది .
     ఉత్తం  గారి  ఉత్తుత్తి వందన సమర్పణ ఎలా ఉందొ చూడాలంటే క్రింది విడియోలో చూడవచు!
             
                 

Tuesday, April 15, 2014

ఎలెక్ట్రాన్ , ప్రోటాన్ లానే న్యూట్రాన్ లను గుర్తించాలన్న సుప్రీం కోర్టు.అప్ ఇండియా !

                                                                 


మానవ సమాజం ,ఒక  అణువు లాంటి నిర్మాణం తో పోలిస్తే అందులో ఎలెక్ట్రాన్ లు న, ప్రోటాన్ లు ఉన్నట్లే సమాజo లో స్త్రీలు , పురుషులు ఉన్నారు . అలాగే ఈ రెండు లింగాలే కాకుండా అటూ ఇటూ కాని వారు కూడా ఉన్నారు . మన దేశంలో ఇప్పటి దాక వారికి, వారు కోరుకున్నట్లు స్త్రీ యో , లేక పురుషుడి గానో పరిగణిస్తూ అన్ని సౌకర్యాలు ఇవ్వటం జరుగుతుంది . కాని దేవుడే తమని ఒక ప్రత్యెక జాతిగా పుట్టిస్తే , మీరేమిటి మాకు సంబంధం లేని జాతిలో(లింగం) మమల్ని చేర్చి అవమాన పరచడం అని వారిలో చైతన్య వంతులైన వారు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు .
 నిజమే మరి అణువులో ఎలెక్ట్రాన్ , ప్రోటాన్ లతో పాటు న్యూట్రాన్ లు ఉంటాయి కదా ! వాటి స్వబావ రిత్యా వాటిని గుర్తించి , న్యూట్రాన్ లని ప్రత్యేకంగా పరిగాణిస్తున్నట్టే ఈ న్యూట్రల్ ల్స్ ని గుర్తించాలి కాని , స్త్రీ పురుషులలో కలిపి వారికి రావాల్సిన ప్రత్యెక  సౌకర్యాలు రాకుండా చేయటమేమిటి ? ప్రత్యెక సౌకర్యాలు ఏమిటంటార ? ఇక నుండి వారు సెక్సువల్ మైనారిటిలు . వారికి కూడా ఇతర మైనార్టిలు కు ఉండే ప్రత్యెక సౌకర్యాలు అన్ని లభిo చవచ్చు . ఈ  విదంగా వారు సక్సేసే అయినట్లే! కాకపొతే ఈ తీర్పు  తమకు కూడా వర్తిస్తుందని కొంతమంది హోమో లు, లెస్బియన్ లు అపోహ పడుతున్నట్లు ఉంది . వారికి ఎంత మాత్రం ఈ తీర్పు వర్తించదని , జన్మతః తృతీయ ప్రక్రుతి కలిగి ఉన్న వారికె ఈ  తీర్పు వర్తిస్తుందని ఉన్నత న్యాయ స్తానం వారు స్పష్టంగా చెప్పారు .
    మరి రిజర్వేషన్ సౌకర్యాలు కోసం కులాలు ని , తెగలు ని సైతం రికార్డు పరంగా మార్చుకునే ఘనులు ఉన్న మన  దేశం లో ఈ  న్యూట్రల్ మైనార్తి సౌకర్యలకోసం కృత్రిమ ఆపరేషన్లు చేయించుకుని ,అన్ని ఉన్న వారు   కూడా న్యూట్రల్ గా మారి సర్టిపికేట్ లు పొందరా అంటే , న్యూట్రల్స్  రాజ్యాదికారులుగా ఉన్నంత కాలం అవి జరుగుతూనే ఉంటాయి . ఇప్పుడు డబ్బు కోసం ఏంతో  మంది మగపిల్లలు "కోజ్జాలు " గా మారుతున్నా దౌర్బాగ్యపు సమాజంలో రేపు సౌకర్యాలు కోసం మారరని  గ్యారంటి ఏమి లేదు . అవినీతి సమాజంలో అన్నిo టి ని మార్చవచ్చు . అప్త్రాల్ లింగాలు ఎంత ?
  ఏది ఏమైనా ఇన్నాలకు న్యూట్రాన్ లను గుర్తించడం ద్వారా మన సమాజం పరిపూర్నమైంది . ఇకపోతే మిగిలింది ఆప్పోజిట్  ఎలేక్రాన్ , అపోజిట్ ప్రోటాన్ లను గుర్తించాల్సి ఉంది . అదే నండి , హోమో లు , లెస్బియన్ లు . ఈ సారి వారిని సపోర్ట్ చేసే రాహుల్ , సోనియాలు అధికారం లోకి వస్తే , చట్టం చేసి వారికి కూడా మైనార్టీ హోదా తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశముంది . ఇంకేం మరి ! ఈ ఎన్నికల్లో వారిని గెలిపిస్త్రే పోలా!

Wednesday, April 9, 2014

ఆమెను చూస్తె తాకబుద్ది అవుతుందట !ఈయన్ని చూస్తె పికబుద్ది అవుతుందట !

                                                                   


2014 ఎలెక్షన్ల తేది లు ప్రకటించేశారు . రాజకీయాలలో ఉన్నవారు , సినిమా రంగంలో ఉన్న వారు తమ తమ అదృష్టాలను పరిక్షించు కోవటానికి సమాయత్త మవుతున్నారు ఈ సమయంలో వారికి గుళ్ళో దేవుని కరుణ కంటే , ఓటరు దేవుని కరుణే అత్యంత అవస్యకం ! అందుకె పొద్దున్న లేచినది మొదలు రాత్రి పడుకోబోయే వరకు రోజూ లక్షలాది ఓటరు దేవుళ్ళను కరునించమని ప్రార్దిస్తూ (అలా నటిస్తూ ), సందు సందుకు , గొంది గొంది కు తిరుగుతున్నారు . మరి ఇటువంటి వారి  తిప్పలు చూస్తున్న ఓటర్లు కొంతమందికి జాలి కలిగి ఓటు వేసి కరునిద్దామా అనే ఆలోచనలో పడుతుంటే , మరి కొంత మందికి విరి చేష్టలు చూసి , వికారం కలిగి , తమలో కలిగే వికారాలను ప్రత్యక్షంగా తెలియ చేస్తున్నారు . అదెలాగ అంటే

     ఉదాహరణకు డిల్లీలో రాష్ట్ర ఎన్నికలలో అధికారానికి దగ్గరగా చేరువైన ఆమ్ అద్మి పార్టి అదినేత అరవింద్ కేజ్రివాల్ గారికి మంచి అవకాసం వచ్చినా అంటే రాష్ట్ర పాలనా అధికారం  కట్టబెట్టినా , సరిగ్గా వ్యవహరించకుండా తిక్కల నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి , అవినీతి నిర్మూలనే తమ అజెండా అని ప్రగల్బాలు పలికి , అసలు అవినీతి సామ్రాట్ లను వదిలివేసి , వారి భరతం పడతానంటున్న మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ , కాంగ్రెస్ వారికి పరోక్షంగా సహాయం చేస్తున్న , డి గ్రేట్ అరవింద్ కేజ్రివాల్ గారిని చూస్తె ఒక అటో డ్రైవర్ కి ఎందుకో కాని ఆయనకి ఒక దండ వేసి చెంప మిద పీక బుద్ది అయిందట ! అంతే! వెంటనే ఒక పూల దండ కొనుక్కుని అరవింద్ గారి కాన్వాయి దగ్గరికి వచ్చాడట . ఇంకేం , తనకు అభిమాని ఎవరో పూలదండ వేస్తున్నాడేమో అనుకుని  అనుకుని అతనికి అవకాసమిస్తె , సదరు అటో డ్రైవర్ పూలదండ వేసినట్లు వేసి , వెంటనే కేజ్రివాల్ చెంప మిద ఒకటి పీకాడట ! దానితో నివ్వెరపోయిన కేజ్రివాల్ అనుచరులు వెంటనే తేరుకుని అతని మిద దాడి చేసి కొట్టి పోలీసులకు అప్పచెప్పారట .
  కేజ్రివాల్ గారికి పై అనుభవం ఎదురైతే , ప్రముఖ గ్లామరస్ నటిమణి నగ్మా గారికి మరో రకం అనుభవాలు ఎదురవుతున్నాయట . ఆమె గారిని చూస్తుంటే ఓట్లు వేయడం తర్వాత కానీ , ఒక్క సారి ఆమెను  తాకితే  చాలు! జన్మ దన్యమైనట్లే ! అని బావిస్తున్నారట ఓటర్లు . అందుకే ఆమెను ఎలాగైనా తాకాలని ఒకరి మిద ఒకరు పోటి పడి పొలిసు వారికి సెక్యూరిటి ప్రాబ్లం కలుగ చేస్తున్నారట . మొన్న ఒక ముసలాయన , M.L.A అంతటి వాడే ఆపుకోలేక టక్కున నగ్మాని ముద్దు పెట్టుకున్నాడట . అది చూసిన పోలిస్ అధికారులు ఇక లాబం లేదని నగ్మాకి పెద్ద ఎత్తున పోలిస్ సెక్యూరిటి కలుగ చేసారట . వీళ్ళు  నాయకులైతే  ప్రజలకు ఏమి సేవ చేస్తారో తెలియదుకాని ప్రస్తుతం మాత్రం ఓటర్లు వీళ్ళని గోకకుండా  కాపాడానికే  ప్రజా దనం  ఎకువ ఖర్చు చేయాల్సి వస్తుంది . అది సంగతి

     ఒక చోట  నగ్మాను  చూస్తె తాకబుద్ది అవుతుందట !మరొక చోట కేజ్రివాల్ ను  చూస్తె పికబుద్ది అవుతుందట ! ఓట్లు వేయండి అని అడుగుతుంటే ఈ  తాకుడు , పికుడు గోల ఏమిటో అర్ధం కావటం లేదట అబ్యర్డులకు! కేజ్రివాల్ గారి చెంప చెళ్ళు కద గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .

               
             

Monday, March 31, 2014

పవన్ "ఇజం" లోని ప్రక్రుతి సమతుల్యత బావనకు, "పావురాల గుట్ట " ఉదంతానికి ఏమైనా సంబందం ఉందా ?

                                                                         


నేను ఇదే బ్లాగులో 18 నవంబర్ 2012 న బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!" అనే టపాను పెట్టడం జరిగింది . అందులో మనిషి అనేకం అనుకున్నా , చివరకు భగవంతుడి డెసిషన్ యే పైనల్ అని "పావురాల గుట్ట ఉదంతం " ఉదాహరణ గా చెప్పాను.
  మొన్న వైజాగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గారు , తన "ఇజం " పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ అందులోని ఆరు అంశాలు గురించి టూకీగా చెప్పాడు . మొదటి 5 అంశాలు కామన్ గా అందరూ చెప్పేవే అనిపించింది . కాని అరవ అంశ మైన "ప్రక్రుతి సమతుల్యత " గురించి చెపుతూ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అని అన్నాడు కాని దాన్ని గురించి సరిగ్గా వివరించ లేదు . బహుశా రాజు రవితేజ అయితే బాగా వివరించి ఉండే వాడేమో . అయన రాసిన పుస్తకం ఇంకా మార్కెట్ లో కి రాలేదు కాబట్టి మనకు ఇజం లోని "ప్రక్రుతి సమతుల్యత" గురించి తెలుసు కోవటానికి కొంత సమయం పడుతుంది . ఇక్కడ ప్రక్రుతి అనేది దేవుడు అనే బావనలో ఉపయోగించి ఉండవచ్చు .
                                           తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు !
                                        బుద్ది బూములేలదాం అంటే రాత గాడుదులు కాద్దాం అందట
                                  
అనే సామెతలు మానవ సంకల్పాలు అనుకున్నవి అనుకున్నట్లు జరుగక ఊహించిన దానికి పూర్తీ వ్యతిరేక దోరణిలో జరిగే సంఘటనల అనుభవం లో నుండి పుట్టినవి . అదే భారతీయులను  సమాజంలో జరుగుతున్నా దుష్కృత్యాలను తాము నిరోదిoచ లేమని నైరాశ్యానికి గురి అయినప్పుడు , అందులోనుoఛి  తీవ్ర వాదం జనిo చకుండా కాపాడుతున్నది , దైవిక పరమైన ఈ బావనలే అనేది నిజం . అందుకే సమాజం లోని ప్రజలలో   వేచి చూచే దోరణి , సహనం ఇవ్వన్ని అలవడి కొంత శాంతి సామరస్యాలతో జీవించడానికి అలవాటు పడ్డారు .
               
           నూరు గొడ్లను తిన్న రాబందు , ఒక్క గాలి వానకే ఖతం! అనే బావన కచ్చితంగా ప్రక్రుతి సమతుల్యత బావం లో నుంచి అవిర్బవిమ్చిందే . "ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో , అధర్మం దే పై చేయి అవుతుందో అప్పుడు నేను అవతరించి అధర్మాన్ని అంతం చేస్తాను " అన్న గితాచార్యుని వాక్యాలు ప్రక్రుతి సమతుల్యత బావానికి అడ్డం పట్టేవి . సమాజంలో సంస్కరించ లేనంతగా అరాచకం ప్రబలితే వాటిని దునుమాడె వారే అవతార పురుషులు . వారెవరూ అనేది బవిష్య  చరిత్ర మాత్రమె చెప్పగలదు . ఎందుకంటే వర్తమానం లో ఎవరికీ వారే దేవుళ్ళు . వారు చేసేదే కరెక్టు అనిపిస్తుంది . తాము పుట్టినది  ప్రజా ఉద్దరనకే అని అందరికి అనిపిస్తుంది . అలాగే  "ఆయనోస్తున్నాడు " అని అయనను  అనుసరించే వారు కోరుకుంటూoటారు.   అందుకే దేవుడు ఎవరూ , సైతాన్ ఎవరు అనేది బవిశ్యత్ లో చరిత్ర ను అద్యయనం చేసేవారు తెలుసుకుంటారు .
   మొన్నటి ఎన్నికల్లో ఒక్కొక ఓటరుకు 1000రూపాయలు , వెండి కుంకుమ బరినే లు , వస్త్రాలు ఇలా ఎవరికీ చేతనైన రీతిలో వారు పంచి పెట్టి తమ నాయకత్వ అర్హతను పరిక్షిమ్చుకుంటూ న్నారట . కోటి నిబందనలు పెట్టినా భారత ప్రజాస్వామ్యంలో  నితి  నిజాయితిలు నేతి  బీరకాయలో నేయి లాంటిదే ! మరి ఇలాంటి వాటిని చూస్తూ ఇంకా ఓపిక పట్టడానికి కారణం "ఆయనోస్తాడు " అనే . కాకపొతే అ అయన ఎవరు అంటే ఎవరి దేవుడు వారికి లాగా ఎవరి అయన వారికే అయన!

బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!కొసం లింక్ మిద క్లిక్ చేయండి "http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_18.html

Wednesday, March 26, 2014

కులంలోనైనా కాంప్రమైజ్ ఉంటుందేమో కాని , రక్తంలో మాత్రం "నో కాంప్రమైజ్ " కామ్రేడ్స్ !.

                                                                         


కొంత మంది విజ్ఞాన వాదులు కొన్ని విషయాలు గురించి వివరిస్తూ ఉపమానాలు చెపుతున్నారు . వారు చెప్పే విషయం గురించి పెద్దగా అబ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కాని , వారు చూపే పోలికలు చూస్తుంటే వారిలో ఎ మాత్రం జ్ఞానం ఉందొ యిట్టె అర్ధం అవుతుంది . ఉదాహరణకు మొన్న గుంటూర్ లో తల్లి తండ్రులు తమ కన్నా కూతురిని  తమ అనుమతి లేకుండా , తమను మోసం చేసి వివాహం చేసుకుందనే కోపంతో ఆమెను దారుణంగా చమ్పారు. దీనికి యావత్ ప్రజలు, చివరికి వారి బందువులు కూడా తీవ్రo గా ఖండించడం జరిగింది .
 
      అయితే పై కేసులో అమ్మాయిని చంపటానికి "కులం" కంటే ఆర్దిక కారణాలే ఎక్కువ ప్రబావం చూపాయి . దిని గురించి వివరంగా తెలుసుకోవాలంటే    http://ssmanavu.blogspot.in/2014/03/blog-post_24.html ని క్లిక్ చెయ్యండి . అయితే కొంతమంది మనదంతా ఒకే కులం అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నారు . దానిలో "రక్తం " ఉదాహరణ ఒకటి . పైనున్న బొమ్మ చూసారు కదా ! పేస్ బుక్ లో కొంత మంది మిత్రులు పోస్ట్ చేసారు దాన్ని . కొన్ని దశాబ్దాలుగా ఈ  ఉదాహరణ తో ప్రజలలో "కులం" గురించి ఉన్న అపోహలు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు . ఒక్కప్పుడు దిని ని కరక్టే అనుకున్నారేమో కాని , విజ్ఞానం పెరిగాక ఈ  ఉదాహరణ వాళ్ళ మనుషులు అంతా ఒకటి కాదు అనే బావమే బల పడుతుంది . అదెలాగో చూదాం .

   మనుషులలో లేక భారతీయులలో కులాలు మాదిరిగానే రక్తం లో గ్రూపులు ఉన్నాయి . కులాలు చూసుకోకుండా వివాహాలు చేసుకున్నా ఏమి జరుగదు కాని , గ్రూపులు చూడకుండా ఒకరి రక్తం మరొకరికి ఎకిస్తే మాత్రం ఎగిరి చచ్చె అవకాశ ముంది . కులంలో కొంతైనా కాంప్రమైజ్ ఉంటుందేమో కాని , రక్తంలో మాత్రం "నో కాంప్రమైజ్ " . అందు చేత మనుషులంతా ఒకటే అని చెప్పడానికి "రక్తం" ఉదాహరణ పనికి రాదు . మనుషులంతా వేరు వేరు అని చెప్పడానికి మాత్రం బేషుగ్గా పనికి వస్తుంది

Thursday, March 13, 2014

రాష్ట్ర అద్యక్షుడైనా సరే , ఒంగుంటే "ఓటు మాయం" అట!

                                                            

                                                          

అయన పేరు కఠారి శ్రీనివాస రావు గారు . అయన హోదా "లోక్ సత్తా" అనే జాతీయ పార్టికి రాష్ట్ర అద్యక్షులు . అంటే ఆంద్ర ప్రదేస్ లో ఆ పార్టి బాగోగులు చూడాల్సిన వారు . ఆయనకు గత ఎనిమిదేళ్ళుగా సేరిలింగం పల్లి బూతులో ఓటరుగా తన ఓటు హక్కు వినియోగించు కుంటున్న వ్యక్తీ . దానికి గుర్తుగా ఎప్పుడూ అయన ఓటరు కార్డు అయన జేబులోనే ఉంటుందట . కాని మొన్న ఎందుకో ఓటరు లిస్టు చూస్తె అయన పేరు గారి అయన కుటుంభ సబ్యుల పేర్లు కాని ఓటరు లిస్టు లో లెవట . దానితో ఖంగు తిన్న అయన తిరిగి కొత్తగా ఓటరు లిస్టు లో నమోదు కోసం అప్లై చేసుకున్నారట . దినంతటికీ కారణం ఒంగుంటే ఓట్లు మాయం చేసే ప్రత్యర్ది రాజకీయ పార్తిలే అని అయన గారి అరొపణ . నిజమే సుమా ! అప్పుడప్పుడు చెక్ చేసుకోక పొతే ఏదైనా మాయం చేయగల వారున్న రాష్ట్రం ఇది. తస్మాత్ జాగర్త !
 ఇంతకీ అయన గారి ఈ విషయం గురించి ఏమన్తున్నారి ఈ  విడియోలో తిలకించండి .
      

Monday, March 3, 2014

ముంబాయి పోలీసులు అనూహ్య మర్డర్ కేసును మరో "అయేషా " కేసు గా మార్చ బోతున్నారా !?

                                                             


వినేవాడి చెవిలో పువ్వులు ఉంటె చెప్పేవాడు ఎన్ని కట్టు కదలు చెప్పటానికైన రెడి ! భారత దేశం లో నిర్బయ ఉదంతం తర్వాత జరిగిన హత్యల్లో ఆంద్ర ప్రదేస్ లో ని మచిలీ పట్నం కు చెందిన మహిళా  ఇంజనీర్ అనూహ్య కేసు కూడా ఒకటి . అ హత్య జరిగి నెలలు గడుస్తున్నా నిన్నటి వరకు ఏ  క్లూ సాదిo చినట్లు ముంబాయి పోలీసులు మీడియాకు చెప్పలేదు . ఈ రోజు మాత్రం ఒక 35 ఏండ్ల వ్యక్తిని, హత్య చేసిన నిందితుడిగా ముంబాయి కోర్టులో ప్రవేశ పెట్టి , రిమాండ్ కు పంపించారు . కొద్ది సేపటి క్రితం ముంబై  పోలిస్ వారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి , అనూహ్య కేసులో మిస్టరి చేదిoచామని, ఆమెను  సనప్  అనే పాత నేరస్తుడు , టాక్సీ డ్రైవర్ గా ఆమెను తీసుకు వెళ్లి , అత్యాచారం లేక రాబరి చేయబోతే ఆమె ప్రతిఘటించడం వలన , ఆమెను ఉరి వేసి చంపి , ఆ  పై పెట్రోల్ పోసి తగల బెట్టాడని చెప్పుకొచ్చారు . ఇదంతా వింటుంటే కొన్ని అనుమానాలు బుర్ర ఉన్న వారికెవరికైనా జనిస్తాయి . మరి ఘన మైన ముంబాయి పోలిస్ వారికి రాలేదంటే నమ్మడం కష్టం . కావాలనే ఎవరో వెనుక ఉండి ఈ  కేసును అయేషా కేసు లో మాదిరి పక్క దారి పట్టించి అసలు నెరస్తులను రక్షించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది . ఈ  కేసులో కలుగుతున్న అనుమానాలేమిటంటే ---

    ఎస్తేర్ అనూహ్య ముంబాయి T.C.S కంపెనీలో ఉద్యోగిని . ఆమె గత క్రిస్టమస్ కి తన స్వస్తలం మచిలీ పట్నానికి  వచ్చి , తిరిగి జనవరి మూడవ తారికున బయలు దేరింది . 4 వ తారికున హైదరాబాద్లోని ప్రెండ్స్ తో పార్టి లో పాల్గొని ఆ సాయంత్రం ముంబాయికి రైలులో బయలు దేరింది . 5 వ తారీకు తెల్లవారు జామున ముంబాయిలో దిగిన తర్వాత కొంత సేపు వెయిటింగ్ రూమ్ లో ఉండి అ తర్వాత ఒక వ్యక్తికీ తన బ్యాగ్ ను ఇచ్చి , తానూ సెల్ పోన్లో మాట్లాడుతూ బయటకు వేలుతుండడం క్లియర్ గా రైల్వే స్టేషన్ లోని సి.సి. పుటేజ్ లలో కనిపించింది . అయితే ఆమె తో పాటు పుటేజ్ లలో కనిపించిన వ్యక్తే ఈ రోజు పోలీసులు చెపుతున్న
   సనప్  పాత నెరస్తుడట.పార్ట్ టైం కాబ్ డ్రైవర్ గా ఉన్న అతనికి అనూహ్యను తీసుకు వెళ్ళిన రోజు మాత్రం కాబ్ లెదట . తను కాబ్ డ్రైవర్ ని అని చెప్పి ఆమెతో 300 రూపాయల బేరం కుదుర్చుకున్న అతను  బయట వరకు ఆమెను తీసుకువచ్చిన తర్వాత , తన దగ్గర కాబ్ లేదని మోటార్ సైకిల్ మిద డ్రాప్ చేస్తాను అంటే మొదట్లో అనూహ్య ఒప్పుకోలేదట . అ తర్వాత ఆతను అనుమానం ఉంటె నా సెల్ తీసుకుని మిరేవరితోనైనా పోన్ చేసి విషయం చెప్పండి, కాని నన్ను మాత్రం నమ్మండి , మిమల్ని నమకంగా ఇంటి దగ్గర దిగబెడతాను అంటే , దానికి ఆమె కూడా అతని పోన్ తీసుకుని ఎవరికో పోన్ చేసినట్లు నటించిందట కాని నిజంగా చేయలేదట . గుడ్డిగా అతనిని అనుసరించి హత్యకు గురి అయిo దట . ఇది పోలిస్ వారి కహాని . ఈ కహాని లో   కలుగుతున్న అనుమానాలేమిటంటే -

  (1).  ముక్కు ,  ముఖం తెలియని వాడు కాబ్ ఉందని చెప్పి బయటకు తీసుకు వచ్చి , అక్కడ మోటార్ సైకిల్ చూపించి దాని మిద దిగబెదతాను అంటే అ ఇంజనీర్ నమ్మి గొర్రె పిల్లలా అతని వెంట వెళ్ళిందా ?

 (2). "నా మిద అనుమానం ఉంటె మిరేవరికైనా నా సెల్ లోనే నా గురించి సమాచారం ఇచ్చాకె నాతొ రండి"అని అతడు అంటే సరే అని సెల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడినట్లు నటించాల్సిన అవసరం ఆమెకు  ఏమిటి? ఖచ్చితంగా ఆమె తనకు తెలిసిన వారేవరితోనో మాట్లాడి , వారు పర్వాలేదు అతనితో వెళ్ళమని రికమెండ్ చేసాకే వెళ్లి ఉండాలి . అ నిందితుడు కూడా  ఆమెకు తెలిసిన వ్యక్తీ చెపితేనే ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చానని , కావాలంటే అతనితో/ఆమె తో మాట్లాడండి అని తన సెల్ ఇచ్చి ఉండాలి . అ విషయాన్ని ఆమె అతని సెల్ ద్వారా కన్పర్మ్  చేసుకున్నాకే అమాయకంగా అతనిని అనుసరించి బలి అయి పోయి ఉంటుంది .
(3). ఈ  కేసులో ముంబాయి పోలీసులను ఇమ్ప్లూయన్స్ చేయగలిన వారి హస్తం ఉంది ఉండాలి .వారికి ఆ అమ్మాయికి ఏదో బేదాభిప్రాయాలు ఉంది ఆమె బ్రతికి ఉంటె తమకు ముప్పు అని ముంబాయి పాత నేరస్తులతో ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండాలి . తమక్జు ఉన్న ఇన్ప్లోయన్స్ తో కేసుకు మసి పోసి మారేడు కా య చేసి , పాత నేరస్తులకు కేసు అంట గట్టి , తము తప్పించుకునే ప్రయత్నం అని అనిపిస్తుంది తప్ప, పోలిస్ వారి కహాని ఎ మాత్రం నేమ్ విదంగా లెదు.
        ఈ కేసును నిజాయితిగా సి.బి.ఐ వారి చేత దర్యాప్తు చేస్తే తప్పా నిజాలు నిజాలు వెలుగులోకి రావు . అ  దిశగా ఆమె సంబదికులు చర్యలు తీసుకోవాలి . అవసరమైతే తెలుగు  ప్రజా సంఘాలను కదిలిoచితే తప్పా అనూహ్య కుటుంబానికి న్యాయం జరుగదు .