Thursday, September 19, 2013

కాలేజీ గాళ్ సా ? కాశ్మీరీ ఎక్స్ ట్రీమిస్ట్సా !?



                                                                   

  మన సాంప్రాదాయ రీతిలో మన ఆడపిల్లలు లంగా ఓణీ, చీర లాంటి వస్త్రదారణలో చదువుకుంటుంటే వారు చదువుకున్న అమ్మాయిలుగా కనిపించరు అని మెజార్టీ తల్లి తండ్రుల అభిప్రాయం. ఈ రోజుల్లో పల్లేటూల్లో ఉండే అమ్మాయిలు కూడా పాషన్ కోసమని పంజాబీ వస్త్రదారణ చేస్తూ ఆదునికంగా కనపడుతున్నారు. బుర్రలో ఉండే మెదడు ఏ మాత్రం మెరుగుపరచుకోలేకపోయినా,వేరే రాష్ట్రాల వారి  వస్త్రధారణ ను వీరు  ఆదునిక వస్త్రధారణ గా మార్చుకుని తెలుగు రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రంగా మార్చి వేసారు మన అమ్మాయిలు. సాంప్రాదాయక వాదులు కూడా పెద్దగా అబ్యంతరం చెప్పటంలేదు.

                                                  
       
                                                           
  నేను మొన్న ఒక పనుండి ఒక కాలేజికి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పుడే కాలేజీ ప్రారంబమవుతుంది అనుకుంటా, రై రై మంటూ మగపిల్లలు, ఆడపిల్లలు తమ బైక్ ల మీద వచ్చేసి బైక్లు పార్క్ చేసీ తమ తమ క్లాసుల వైపు వడి వడిగ వెళిపోతున్నారు. సరే అబ్బాయిలు అంటే  ఇంగ్లీష్ వారి గెట్ అప్ మన ట్రెడిషనల్ గా మార్చుకున్నాం కాబట్టి, ఫాంట్ షర్ట్ లో కనపడుతూ వారి వారి ముఖాలు మనకు కనపడుతున్నాయి. కానీ అమ్మాయిలను చూదామంటే అంతా ఒకటే ముసుగుల గెట్ అప్. తమ తమ చున్నీలు కళ్ళు మాత్రం తప్పా తల అంతా చుట్టుకుని కాశ్మీరీ  తీవ్ర వాదులు లాగా కనిపిస్తున్నారు. పఈన కాశ్మీరీ, క్రింద పంజాబీ వస్త్రధారణతో నా తెలుగు తల్లులు వెలిగిపోతుంటే, నిజం చెప్పొద్దూ  నాకు కోంచం  ముచ్చట వేసింది. కానీ అంతలోనే నాలోని తెలుగు బిడ్డ లేచి గాండ్రించడం మొదలు పెట్టాడు " చీ, చీ, ఒక తెలుగు వాడివి అయి ఉండి ఇలా పరాయి రాష్ట్రాల వారి లాగా బురఖా వేసుకుని మన ఆడపిల్లలు తిరుగుతుంటే ముచ్చటపడతావా"?

  "ఇందులో తప్పే ముంది? మనం ఏనాడో ఇంగ్లీష్ వాడిని అనుకరిస్తే తప్పు లేదు కానీ ఇప్పుడు మన దేశం లోని ఇతర రాష్ట్రాల వారిని, మన ఆడపిల్లలు అనుకరిస్తే తప్పేమిటి?

  " అంటే మన తెలుగు తనం అంతరించి పోవల్సిందేనా?

   అబ్బే, అంత డేంజరేమి లేదు. మనకు  పదిహేను రోజులకో సారి  పండగ వస్తుంది  కాబట్టి అప్పుడు మన వస్త్రాలు వేసుకుని మన  సంస్క్రుతిని కాపాడితే సరి అన్నాను.

  పదిహేను రోజులకొకసారి అంటే ఎప్పుడూ, అమావాస్య కు ఒకసారా" అన్నాడు కచ్చిగా  నాలోని తెలుగు బిడ్డ.

  అంత కోపమెందుకు రా? అయినా మన వారి  పరికిణీ ఓణీ  గెట్ అప్ కంటే వారు వేస్తున్న కాశ్మీరీ గెట్ అప్ వల్ల లాభాలు ఎక్కువ" అన్నాను.

  "లాభాలా ఏంటవి?

  తల చుట్టూ, క్లాత్ కవర్ వల్ల బైక్ డ్రైవ్ చేసేటప్పుడు చెవిలోకి గాని ,ముక్కులోకి , ముఖం మీద కానీ  దుమ్ము పడదు. ముఖం చూసి కామెంట్ చేసే పోకీరీ గాళ్ళకు వీరి ముఖాలు కనపడవు కాబట్టి  వాళ్లు తెల్ల ముఖాలు వేసుకు చూడటం తప్పా కామెంట్లు చెయ్యరు. అలాగే పిల్లలు ముఖాలు కనపడకుండా తల వంచుకుని నడవాల్సిన పని ఉండదు. తల ఎత్తుకుని నడవడం వలన వారిలో ఆత్మస్తైర్యం పెరుగుతూంది....

  స్టాప్.స్టాప్. ఇక ఆపు. ఇంకొక పని చేస్తే వారికి చాలా మేలు జరుగుతుంది అన్నాడు తె.బి. ఎక్కసక్కెంగా.

 ఏమిట ది?

  వారందరికి తలొక మెచిన్ గన్ ఇస్తే అచ్చం కాశ్మీరీ తీవ్ర వాదులు లాగా ఉండటమే కాక, ట్రెనింగ్ కూడా ఇస్తే తమ వెంట బడి వేదించే మ్రుగాళ్ళను కూడా కాల్చి పారేస్తారుగా! ఆవేశంగా అన్నాడు తె.బి.

 నేను ఆలోచనలో పడ్డాను వాడు ఆవేశంగా అన్నా అందులో నిజం ఉందనిపించింది. ప్రతి ఆడపిల్లకి  పిస్టల్ లైసెన్స్ లు ఇస్తే ఎలా ఉంటుంది? వారి మీద జరిగే దాడులను వారు అరికట్ట గలరా? ఏమో మరి వారు కూడా తీవ్రవాదులుగా మారితే తప్పా మగవారి అరాచకాలకు అంతం ఉండదేమో! మొత్తానికి మన ఆడపిల్లలు గన్ లెస్ కాశ్మీరి టెర్రరిస్ట్ అవతారాలలో దర్శన మిస్తున్నందుకు నాకు ముచ్చటగనే ఉంది. మరి మీకేమనిపిస్తుంది?           

Wednesday, September 18, 2013

భద్రాచలాన్ని వాళ్ళొదులుకోలేరు, భాగ్య నగరాన్ని వీళ్లోదుకోలేరు!



                                                              

  భద్రా చలం! పరమ పవిత్ర రామ ధామం. పుణ్య గోదావరీ తీరాన నిర్మితమైన చారిత్రక పుణ్య క్షేత్రం. ఒక్క ఆంద్ర ప్రదేశ్ కే కాక యావత్ భారత దేశంలో విశిష్ట గుర్తింపు కలిగిన క్షేత్రం. ఆదాయం పరంగా కాక పోయినా, రామాయణ కాలం నాడు శ్రీ రాములు వారు సీతాలక్ష్మణ సమేతంగ తిరుగాడిన ప్రాంతం కాబట్టి, ఆ క్షెత్రానికి దేశ వ్యాప్తంగా పేరు గాంచింది. మరి అటువంటి భద్రాచలం తెలంగాణా ఎర్పాటు ప్రకటన వలన సమస్యల్లో చిక్కుకుంది.

  ఆంద్రప్రదేశ్ ఏర్పడక ముందు భద్రాచలం  నిజాముల నిర్వాకం వల్ల బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళి సీమాంద్రా ప్రాంతం లో ఉండేది. తెలుగువారంతా ఒకటేనని ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత, భద్రాచలం డివిజన్ ని తెలంగాణా లోని ఖమ్మం  జిల్లాలో కలిపారు.మరి ఇప్పుడు తెలంగాణ వాదులు కోరుతున్నట్లు  1956 ముందు తెలంగాణా ప్రాంతాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నందువలన భద్రాచలాన్ని తెలంగాణా వారు వదులుకోక తప్పని పరిస్తితి. కానీ సీమాంద్రులకు పుణ్యక్షేత్రం కంటే తమ పిల్లలకు ఇంత ఫుడ్ పెట్టె బాగ్యనగరం గురించే బెంగ పట్టుకుంది కాబట్టి, ప్రస్తుతం భద్రాచలం విషయంలో అంత సీరియస్ గా లేకపోయినా, బవిష్యతులో తెలంగాణా ఖాయం అని వారికి అనిపిస్తే భద్ద్రాచలం గురించి సీరియస్ గా క్లైమ్ చేయవచ్చు. కాబట్టి ఇరు ప్రాంతాల గురించి చర్చలు జరిగేటప్పుడు బాగ్యనగరం గురించి ఎంత పట్టుదలగా సీమాంద్రులు క్లైమ్ చేస్తారో భద్రాచలం గురించి తెలంగాణా వారు అంతే సీరియస్ గ క్లైమ్ చేస్తారు.

   మొత్తానికి అటు  సీమాంద్రులకు బాగ్యనగరం తో ఎంత అట్టాచ్ మెంట్ ఏర్పడిందో ఖమ్మం జిల్లా వారికి భద్రాచలం తో అంత అటాచ్ మెంట్ ఏర్పడింది. ఈ రెండు ప్రాంతాల భవితవ్యం ఏమిటో వేచి చూడాలి.  

Tuesday, September 17, 2013

రాష్ట్రంలో ఇంకా "రజాకార్ల సంతతి" మిగిలి ఉన్నట్లే కనిపిస్తుంది.



తెలంగాణా విమోచన కోసం అశువులు బాసిన తెలంగాణా వీర మాతలకు, వీర పుత్రులకు జోహార్లు అర్పిస్తూ.....  
                                                                

 ఈ రోజు తెలంగాణా విమోచనా దినం అని కొందరు, కాదు "వీలీన దినం" అని కొందరు ఎవరికి తోచిన బాష్యాలు వారు చేస్తున్నప్పటికి అంతిమంగా అందరూ అంగీకరించే విషయం ఏమిటంటే ఈ రోజు నిజాం పాలన కు గోరి కట్టిన దినం.మన తాతలు, తండ్రులు, అవ్వలు, అమ్మమ లందరి త్యాగాలకు ప్రతిపలంగా తెలంగాణా బిడ్డలు భారత సర్కార్ సహాయంతో నైజామోడి పీడ విరగడ చేయించుకున్న రోజు. ఎనబైఅయిదు  శాతం మంది మెజార్టీ ప్రజలను అష్టకష్టాలు పాలు చేసి ఊచకోత కోయించిన నిజామ్  "రాక్షస రజాకార్" ల పాలన నుండి విముక్తులమైన రోజు. ఇండియాకి పంద్రాగస్టు ఎలానో తెలంగాణాకు సత్రాసెప్టెంబర్ అలాగే. కానీ ఇ విషయాన్ని మనతో పాటు విముక్తులైన మరాఠా, కన్నడ రాష్ట్రాల వారు గుర్తుంచుకుని అధికారిక కార్యక్రమాలు చేస్తుంటే, మన వారు మాత్రం తూ తూ మంత్రాలతో మమ అనిపిస్తున్నారు.

 ఈ మద్య తెలంగాణా విభజన ఉద్యమం ఎక్కువయ్యాక, ఇదే సందురా అని చెప్పి అప్పటి రజాకార్ల మానస పుత్రులు కొందరు పైకి సీమాంద్రావారిని తెగడతున్నట్లు నటిస్తూ, అంతర్గతంగ నైజాము ప్రభువులను పొగిడే కార్యక్రమాలు చేపడుతూ, తెలంగాణా వారిలో నిజాముల పట్ల ఆరాదానా బావం పెంపొందించాలని చూస్తున్నారు. పొద్దున టి.వి. లో ఒక చర్చను చూశాను. అందులో ఒక మానసపుత్రుడు రాజాకార్ల దుష్క్రుత్యాలను సీంపుల్ గా తీసేస్తూ, భారత సైన్యం తెలంగానా ముస్లిమ్లను ఊచకోత కోసిందని సెలవిస్తూ, దానికి కారణం సీమాంద్రుల స్వార్దం అని వితండ వాదం చేస్తున్నాడు.అంటే మన తెలంగాణా లో ఇంకా రజాకార్ల పుత్రులు ఉన్నారని దీనిని బట్టి అర్దమవుతుంది.

 సీమాంద్రులు, తెలంగాన వారు అన్నదమ్ములు.  క్రిష్ణా గోదావరి మద్యనున్న గడ్డ అసలైన తెలుగుగడ్డ. తర్వాత కాల క్రమేనా జనాభివ్రుద్ది చేత అటు కావేరి వరకు విస్తరించ బడ్డాం. అంతే కానీ ఎక్కడో ఉజ్బెకిస్తాన్ నుండి పొట్ట కూటి కోసం వచ్చి పాలకులైన  నిజాములకు తెలంగాణా వారికి సంబందమే లేదు. వారి పాలన తెలుగు వారి పాలనా చరిత్రలో బాగం కాజాలదు.అన్నదమ్ముల మద్య అభిప్రాయ బేదాలు కలిగినంత మాత్రానా పరాయి వారిని తమ పూర్వికులు అని చెప్పుకునే దుస్తితిలో తెలంగాణా ప్రజలు లేరు.

  నాడు గోచి పెట్టి కొడవలి చేత పట్టి రజాకార్లను,వారి తొత్తులైన దొరలను దునుమాడిన వీర తెలంగాణా మాతల బిడ్డలమే మనం తప్పా, గొప్ప గొప్ప బవంతులు కట్టించాడని నిజాములను మన తెలంగాణ వాడు అని చెప్పటం ఆత్మ ద్రోహమే అవుతుంది.అసలు మరాఠీలు బొంబాయి ని ముంబాయి చేసిన  మాదిరి పౌరుషం ఉన్నవాళ్ళమైతే  మన పాలన రాగానే హైద్రాబాద్ పేరు మార్చి"ఐలమ్మ బాద్" అని పెట్టాల్సి ఉండే.అది మానేసి ఇంకా రజాకార్ల స్రుష్టి కర్తలను ఆరాదిస్తునారంటె ఎక్కడో రక్తం కలుషితమై ఉంటుంది అనుకోవాల్సి వస్తుంది. చచ్చినా బ్రతికినా అన్నదమ్ములు అన్నదమ్ములే. సందు దొరికింది కదా అని తోక జాడించాలనుకుంటె బేదాభిప్రాయాలు తొలిగిన నాడు తోకలు కట్ చేస్తారు అని రజాకార్ మానస పుత్రులు గుర్తుంచుకోవడం మంచిది.             

Thursday, September 12, 2013

రాష్ట్ర సర్వీసులు బంద్ చేస్తే,కేంద్రానికి ఏమిటి నొప్పి?


                                                                    
                                                               

లక్షలాది  సీమాంద్రా ప్రజలు సమైఖ్యాంద్రప్రదేశ్ కోసం నలబై రోజులుగా రోడ్ల మీద ధర్ణా చేస్తే కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు అనిపిస్తుంది. గతంలో తెలంగాణా ఉద్యోగులు సైతం నలబై రోజుల సమ్మె చేస్తే ఇదే రెస్పాన్స్ కేంద్రం నుండి . ఎందుకు ఇలా జరుగుతుంది.? లక్షాలాది ప్రజల మాట అంటే కేంద్రానికి దేనితో సమానం?

  తెలంగాణా ఏర్పాటు అనేది పూర్తీగా కేంద్రం వారి బాద్యత. దానికి రాష్ట్ర ప్రభుత్వానిది నామ మాత్ర తంతు నిర్వహణా బాద్యత. అసెంబ్లీ కీ బిల్ వస్తే అప్పుడు మాత్రమే అనుకూలంగానో, వ్యతిరేకంగానో తీర్మాణం చేసి పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర తీర్మానం ని ఖాతరు చేయాల్సిన అవసరం కేంద్రానికి లేదు. అదే విషయం కేంద్ర పెద్దలు తెగేసి చెప్పారు. మీరు అవునన్నా, కాదన్నా, తెలంగాణా ఇచ్చి తీరుతాం అని డిల్లీ పెద్దలు తేగేసి చెప్పాకా ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదిగేదేముంది? మరి అటువంటప్పుడు అటు సీమాంద్రులు కానీ ఇటు తెలంగాణా వారు కానీ వారీ కోర్కేల సాధనకు రాష్ట్ర సర్వీసులను స్తంభింపచేయ్యడంలో ఔచిత్యమేమున్నది?

  నలబై రోజులుగా ఆర్.టి.సి. బంద్ చేసారు.వైద్యం బంద్ చేసారు. ఇప్పుడు విద్యుత్ బంద్ చేస్తాం అంటున్నారు. దీనివలన బాదపడుతుంది ఎవరు? రాష్ట్ర ప్రజలు. నష్టం ఎవరికి? రాష్ట్ర సర్కారుకు. తప్పు కేంద్రం చేస్తే, శిక్ష రాష్ట్ర సర్కారుకు వేస్తే ఎలా? నలబై రోజులు బంద్ అవసరమా? నాలుగు రోజులు కేంద్ర సర్వీసులు అయిన రైళ్లు, ఇతర సర్వీసులు ఆపి చూడండి. ఎంత తొందర్గా మీ సమస్యలను పట్టించుకుంటారో. మన పిల్లోడ్ని కొడితే ఎదుటింటోడికి ఏమిటి నొప్పి?  కేంద్ర సర్వీసులు నడిచినంత కాలం ప్రజల గోడు కేంద్రం పట్టించుకోదు గాక పట్టించుకోదు.    

Wednesday, September 11, 2013

"తెలంగాణా నోట్" లో ఏం పెట్టిన్రు? తెలంగాణా వారి నోట్లో ఏం పెట్టబోతున్రు ? జర జల్దీగా చెప్పండి !

                                                                    


 అదిగో తెలంగాణా నోట్, ఇదిగో తెలంగాణ నోట్ అని తెలంగాణా వారిని ఊరించి, ఊరించి చంపుతున్నారు కేంద్ర హోమ్ మంత్రి షిండే గారు.నిన్నటి దాక తెలంగాణ ఇచ్చుడు ఖాయమని, హైద్రాబాద్ మీద మాత్రం కేంద్రం వారి నిర్ణయమే పైనల్ అని సెలవిచ్చారు మంత్రి వర్యులూ. హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గా చేస్తే ప్రజా స్పందన ఎలా ఉంటుంది అని నిన్నటి దాక పత్రికలకు లీక్ చెయ్యటం ద్వారా పరీక్షించిన కేంద్రం వారు, ఇప్పుడు డిల్లీ తరహా రాష్ట్రం గా హైద్రాబాద్ ని చేస్తే ఎలా ఉంటుంది అని మరొక వార్తను ప్రజల్లోకి వదిలారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యడానికి హైద్రబాదీ రాజకీయ నాయకులు ఈ విషయం లో ఒప్పుకోవచ్చని బావిస్తుంది కేంద్ర ప్రభుత్వం . తమ చిరకల మిత్రులైన మజ్లిస్ వారిని,హైద్రాబాదీ  తెలంగాణా కాంగ్రెస్ వారిని, సెట్టిలర్స్ ని సంత్రుప్తి పరచవచ్చని అధికార పార్టీ వారి ఆలోచన. ఈ విషయం చూచాయాగా తెలియబట్టే కె.సి.ఆర్. గారు కూడా ఎదో విదంగా ఉద్యమాల రూపంలో నిరసన తెలియ పరుదాం అని బావిస్తున్నట్లుంది.

 మొత్తానికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుందేమో ,తెలుగు వారి పోరాట  పలితం. తెలంగాణ ఇచ్చుడు ఖాయం. , అనేదే కేంద్రం వారు తెలంగాణ వారికి చెప్పదలచిన మాట . అందుకే మాట్లాడితే తెలంగాణా నోట్,తెలంగాణా నోట్ అంటుంది కానీ, ఆ నోట్ లో అసలు ఏముంది"తెలంగాణ ఇచ్చుడు ఖాయం.హైద్రాబాద్ పోవుడు ఖాయం" అని ఉందా లేదా? ఉంటే కొంచం తొందరగా చెప్పేస్తేఅటు" సంబరాలు "ఇటు  "సంబురాలు" చేసుకుంటారు, నమ్ముకున్న జనం! ఇంతకి తెలంగాణా ప్రజల నోట్లో బెల్లం గడ్డ పెడుతున్నారా! మట్టి గడ్డ కొడుతున్నారా! అనేది కేంద్రం వారి నోట్ వస్తే కానీ తెలియదు. ఎలాగు అమ్మ, అమెరికా నుండి వచ్చింది కాబట్టి వారం లోపే తెలంగాణ నోట్ గురించి తెలివిగల తెలుగువారికి తెలిసి పోవచ్చు. 

Tuesday, September 10, 2013

వాడికి "రేప్" చెయ్యగల ’మగ ’ తనం వచ్చింది కానీ "ఉరిశిక్ష" వేయించుకోగల" వయో " తనం రాలేదన్న మట!


                                                                  

                                                               
 ఈ రోజు "నిర్భయ" కేసులో నిందితులందరూ, శిక్షార్హులు అని డిల్లి లోని  సాకేత్ కోర్టువారు తీర్పు ఇచ్చారు. చాలా సంతోషించ దగిన విషయం. రేపు శిక్ష నిర్దారణ చేస్తారు .జాతి మొత్తం ,మ్రుగాళ్ళకు ఉరిశిక్ష పడుతుందని ఎదురు చూస్తున్నరు. దేశం లో సంచలనం రేపిన కేసు మాత్రమే కాక అనేక చట్ట సవరణల కు దారి తీసిన కేసు ఇది. అంతే కాక స్త్రీ ల రక్షణ విషయం లో న్యాయ వ్యవస్త సైతం పట్టుదలతో ఉంది కాబట్టి, నిందితులకు గరిష్టంగా శిక్ష అంటే "ఉరి శిక్ష" విదించే అవకాశం ఉంది.

 అయితే ఇదే కేసుకు సంబందించి ఇదివరకు, బాలల న్యాయస్తానం, మైనర్ నిందితుడకు మూడేళ్ళు మాత్రమే శిక్ష విదించడం పట్ల జాతి తీవ్ర నిరసనలు తెలిపింది. దీనికి న్యాయస్తానాన్ని తప్పు పట్టవలసిన పని లేదు. చట్ట ప్రకారం అదే మైనర్లకు గరిష్ట శిక్ష మరి! ఎప్పుడో జమానా లో అంటే పాతీకేళ్ళకు కూడా  అమ్మాయిలతో మాట్లాడటానికి  మగాళ్ళు బిడియ పడే రోజుల్లో చేసిన చట్టాలు కామోసు అవి!  అందుకే అంత శిక్ష చాలులే అనుకుని ఉంటారు మన చట్ట నిర్మాతలు. కానీ  ఇప్పుడు పన్నిండేల్లకే  "రేప్"  లు చెయ్యగల ముదురు  పౌరులు అయ్యారు అని గ్రహించ లేక పోతున్నారు నేటి ప్రజా ప్రతినిదులు. లేకపోతే, ఇదే తరహా కేసులో పాల్గొన్న నిందితులకు , అమెరికాలో సైతం కఠిన సిఖ్షలు ఉంటే మన కేమిటీ ఈ దిక్కు మాలిన ఉదారత! అసలు మ్రుగాళ్ళకు "అరబ్ కంట్రీస్ " లాంటి  చట్టలు చేస్తే బాగుంటుందనుకుంటా!

 ఏది ఎమైన నిర్భయ కేసులో మైనర్ గాడికి రేప్ చేసే వయస్సు వచ్చింది కాని ఉరిశిక్ష వేయించుకునే వయసు రాలేదు కాబట్టి బ్రతికి పోయాడు. రేపు వాడు ఎన్నికల్లో నిలబడి "నిర్భయ ఫేం" గా ఏదో ఒక పార్టీ నాయకుడు అయినా ఆశ్చర్య  పడవలసిన పని లేదు.



Saturday, September 7, 2013

పిచ్చోడు పిటిషన్ వేస్తే, ప్రొటెక్షన్ ఎదుటోడికి రావడమంటే ఇదే మరి!.


                                                              

 ఎదుటోడు  ఏదైనా చేస్తుంటే కడుపుబ్బు పట్టలేక చేసే పనులన్ని చాలా సార్లు ఎదుటొడికే లాభిస్తాయి. ఈ రోజు సమైఖ్యాంద్రా ఉద్యోగుల సభ విజయవంతం కావడానికి ఉద్యోగులలో ఉన్న సంకల్పం సగం కారణమైతే, ఏమి చేస్తున్నారో తెలియని స్తితిలో, తెలంగాణా  వారు చేసిన ప్రతీకార పనులు సగం కారణం అని చెప్పవచ్చు.

   తెలంగాణా వారు చేసిన పిచ్చి పనుల్లో ప్రధానమైనది సిమాంద్ర ఉద్యోగుల సభకి వ్యతిరేకంగా హై కోర్టులొ పిటిషన్ వెయ్యడం. ఏ కోర్టు అయినా పౌరుల ప్రాదమిక హక్కులకు ముఖ్యంగా బావ ప్రకటనా స్వేచ్చకు భంగం కలిగించే ఆర్డర్ లు ఇస్తుందా? అలా ఇవ్వలేదు సరి కదా,ఉద్యోగుల సబలో ఎటువంటి అవాంచనీయ సంఘటణలు జరుగకుండా చూడాల్సిందిగా పోలీసులకు  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతే! అప్పటి దాక పంతొమ్మిది షరతులు పెట్టి సీమాంద్రా ఉద్యోగులను కంగారు పెడుతున్న పోలిసులు, ఒక సారీగ ఎలర్ట్ అయి, సీమాంద్ర ఉద్యొగుల సభను సక్సెస్ చెయ్యడమెలా అనే ఆలోచనలో పడ్డారు. దానిలో బాగంగనే సభలకు ఆటంకం కలిగించే వారి తాటలు తీస్తామని హుకుం జారీ చేసి దానిని పాటించారు కూడా.అడుగడుగునా పోలిస్ రక్షణ కల్పించి, సీమాంద్రా ఉద్యోగుల సమైక్యతా రాగం దేశానికి వినిపించడంలో సక్సెస్ అయ్యేలా సహకరించారు.   ఈ విదంగ తెలంగాణా వారు వేసిన పిటిషన్ సీమాంద్రా ఉద్యోగులకు స్పెషల్  పోలిస్ ప్రొటెక్షన్  ఇచ్చేలా చేసి , ఎనలేని లాబం చేకూర్చింది.

  అందుకే పెద్దలంటారు. చెరపకురా, చెడేవూ! అని . వినిపించుకుంటెనా.  

Wednesday, September 4, 2013

నాడు నమ్మిన అన్న ! నేడు నట్టేట ముంచిన అన్న,అమ్మ, చెల్లి !

                                                      


 ఒక నాడు  తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన రాజశేఖరరెడ్డిగారి తనయుడనే అభిమానంతో, తెలంగాణా కీ చెందిన ఆడబిడ్డ, తనకు గల మంత్రి పదవిని త్రుణప్రాయంగా ఎంచి రాజీనామా చేసి, ఏ పదవి లేకుండా ఆ అన్న(తమ్ముడు ), లాంటి వాడిని నమ్ముకున్నందుకు ఏమి జరిగింది? నట్టేట్లో మునిగినట్లైంది.

  ఆయన మాట తప్పని, మడమ తిప్పని వంశాంకురంఅట! ప్రజల  సొమ్ము అయితే లక్షల కోట్లు కాజేసి చేతనైతే నేరాన్ని నిరూపించండి అని భారత అత్యున్నత పరిశోధనా సంస్తను చాలెంజ్ చేసిన ఘనుడు అతను. అలాంటి వ్యక్తికి, తనను నమ్మి మంత్రి పదవిని సైతం త్యాగం చేసి వచ్చిన చెల్లికి ఏమిచ్చిన్నా తక్కువే. కానీ అలా చేయకుండా చెల్లేలికి పదవుల  మీద నమ్మక్కం లేకపోయినా, తనకు మాత్రమ్ పదవే పరమార్దమని, దాని కోసం కన్న తండ్రి చనిపోయిన కొద్దిగంటలకే తన తండ్రి  సీటు కోసం ప్రయత్నించానని, అలాంటి తనకు సెంటిమెంట్ కోసం చెల్లెలు లాంతి దానిని వదులుకోవటం పెద్ద సమస్య కాదని తేల్చేశాడు.

  మాట తప్పడం,మడమ తిప్పడం ఆ కుటుబానికి తెలుసో తెలియదో కాని, పదవుల కోసం ఎంత కష్టమైన పడే శ్రమజీవులు వారు. అన్న జైలుకి వెళ్ళగానే   పార్టీ ప్రచార   బాద్యతను తన స్వంత చెల్లికి అప్పచెప్పాడు కాని, తన కోసం మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తి, విషయ్యాన్ని కుండబద్దలు కొట్టేలా చెప్పగల దైర్యవంతురాలు, రాజకీయ అనుభవం ఉన్న ఆ చెల్లి లాంటి వ్యక్తికి అప్ప చెప్ప లేక పోయాడు. అదీ తనను నమ్మిన వారిమీద ఆయనకున్న నమ్మఖ్ఖం. అలాంటి వాడిని నమ్మీ సీమంద్రా ప్రజలు జే జే లు కొడుతున్నారు.నమ్మి, మంత్రి పదవి వదలి వచ్చిన ఆమెనే నట్టేట ముంచిన వాడు, రేపు సీమాంద్రులను ముంచడని గ్యారంటీ ఏమిటి? పాపం సీమాంద్రులు! 

    మీకెవరికైనా, ఆయనగారి గురించి తెలుసుకోవాలనుకుంటే, "శ్రీ మతి కోండా సురేఖా, మాజీ మంత్రి, తెలంగాణా ఆడబిడ్డ "గారిని అడగండి,అన్నీ వివరాలు తెలుస్తాయి

Tuesday, September 3, 2013

మద్యలో ఉన్న తాడుని ఊపడం తప్పా, వీరు చేస్తున్న ఉద్యమoఏమిటి ?

                                                                
                                                              
  వెనుకటి తెలుగు సినిమాలో చూసేవారం, హీరోలు విలన్లతో వారి గాంగ్ లతో చేసే ఫైట్లు. ఎంతో కామెడిగా అనిపించేవి ఆలొచించే వారికి. వంద మందిని నొంటి చేత్తో విసిరేసిన హీరో గారు వేసుకున్న డ్రెస్ నలిగేది కాదు, క్రాప్ చెదిరేది కాదు.బహూశా తమ అభిమాన హీరోని అలా చూసి తట్టుకునే శక్తి అభిమానులకు కానీ, అలా చూపించే దైర్యం ఆ నాటి కొంతమంది  దర్శకులకు ఉండేది కాదేమో!లేక పోతే హీరోల ఇమేజ్ తగ్గుతుందని బయమో కాని అలా సూపర్మేన్ ఫైట్ సీన్లు పెట్టేవారు. ఆ తర్వాత ట్రెండ్ మారి ఇప్పుడు బురదల్లో కూడా పొర్లి పొర్లి కొట్టుకుంటునారు అనుకోండి!

  మల్లీ ఇన్నాళ్ళకి అలనాటి తెలుగు సినిమా ఫైట్లను చూసే భాగ్యం సచివాలయ ఉద్యోగుల ఘర్షణల్లో  కనిపిస్తుంది. టి.వి.ఆన్ చేస్తే చాలు! "బ్రేకింగ్ న్యూస్"   "సచివాలయంలో  సిమాంద్రా, తెలంగాణా ఉద్యోగుల మద్య ఘర్షణ"! జల సౌదలో వుద్యోగుల మద్య ఉద్రిక్తత! తోపులాటా"! అనే హెడ్డింగులతో ఊదరగొడుతుంటాయి. తీరా చూస్తే అటొక గ్రూపు, ఇటొక గ్రూపు. పోలిస్ లను చూశాక ఒకరి మీదకు ఒకరు వెళుతున్నట్లు వీరావేశంతో కూడిన అరుపులు, నినాదాలు. వీరిని కట్టడి చేయడానికి అన్నట్లు పోలిస్ వారు వారి మద్య ఒక పెద్ద తాడు పట్టుకుని నిలబడ్డాకా, ఇక ఎట్టి పరిస్తితిలో తమ బట్టలు నలగడం కాని, క్రాప్లు చెదరడం కాని జరగవు అని డిసైడ్ అయ్యకా, గొంతున్న వారిని ముందు పెట్టి, తక్కిన వారు వెనుక చేరి ఒక గంటా,గంటన్నర ఎదుటివారి బట్టలు  టచ్ కాకూండా జాగర్తపడుతూ,  మద్యనున్న తాడును ఊపేస్తూ,నానా హంగామా చేస్తుంటే పాపం వీరెంత పోరాటం చేస్తారో ఫ్రీగా ఫైటింగ్ చూదాం అని టి.వి.ల ముందు కూర్చున్న ప్రేక్షకులకు, నోటి ఆరుపులు, మద్యలో ఉన్న తాడు ఊగడం తప్పా, ఏమి కనిపించక నిరాశ పడుతున్నారట!

 ఇంతకీ కొస మెరుపు ఏమిటంటే ఇలా రోజూ పోలిస్ వారి తాడు మాత్రమే ఊగడాన్ని చూసి బరించలేని వారు హైద్రాబాద్ కమీషనర్ గారికి పిర్యాదు చేస్తే, ఆయన గారు ఇరు వర్గాలను పిలిచి,"చూడండి వీరులారా! మీ ఊపుడికి మా తాడు తెగేటట్లుంది, కాబట్టి మీరు రేపట్నుంచి ఒకే చోట ఉద్రెకపడకండి. నల్ల పోచమ్మ గుడివద్ద ఒకరు, మరొక చోట మరొక వర్గంవారు పోరాటం చెయ్యండి, కాని ఒక కండీషన్ ఏమిటంటే ఎవరి తాడులు వారే తెచ్చుకుని ఊపుకోవాలి తప్పా, మా పోలిస్ వారి తాడు ఎట్టి పరిస్తితిలో ఉపయోగించడానికి వీల్లేదు" అనేసరికి అలాగే సార్ అని కాం గ బయటకు వచ్చారట! అమ్మయ్యా!రేపటనుండి వారి బట్టలు, జుట్టులే కావు, పోలిస్ వారి తాడు కూడా నలగకుండా ఉద్రేకంగా ఉద్యమాలు చేస్తారన్న మాట! పని ఎగ్గొడతానికి చేసే పనులు ఇలాగే ఉంటాయి కామోసు! 


Friday, August 30, 2013

ఇండియన్ మదర్ కన్నది అహ్మద్ సిద్దిబప్పానయితే, మదర్సా చదువు మార్చింది యాసిన్ భత్కల్ గా!


                                                                      


   యాసీన్ భత్కల్! ఒక నరరూఫ రాక్షసుడు. వీడికి కులం లేదు. మతం లేదు సరి కదా అసలు మానవత్వం అనేది మచ్చుకైన కానరావు వీడిలో . దేశంలో వివిద ప్రాంతాలలో జరిగిన   బాంబు  ప్రేళ్ళుల్లకు మాస్టర్ మైండ్ భత్కల్. అట్టి నర రూప రాక్షసుడు నిన్న ఇండియా నేపాల్ సరి హద్దుల్లో పోలిసులకు పట్టుబడటం జాతికి ఆనందం కలిగించే విషయం.

 యాసిన్ భత్కల్ అసలు పేరు అహ్మద్ సిద్దిబప్పా. ఇతడు ఉత్తర కర్ణాటక లోని భత్కల్ ప్రాంతానికి చెందిన వాడు. చిన్నప్పుడు' అంజుమన్ ఆమీన్ ఏ ముస్లీమీన్' అనే మదర్సాలో విద్యాబ్యాసం చేసాడు. ఆ తర్వాత దుబాయి వెళ్ళి తండ్రి నడుపుతున్న బట్టల కొట్లో పని చేసాడు. ఇతని లోని తివ్రవాద దోరణిల వల్ల తండ్రి తో సరిపడక అక్కడ నుండి ఇండియాకు వచ్చి ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్తను స్తాపించి దేశం లోని వివిద ప్రాంతాలలో బాంబు పేళ్లుల్లు జరిపి ప్రజలను హత మార్చాడు. ఒక సారీ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయినా పోలిసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడట!

ఇంటిల్జెన్స్ వర్గాల సమాచారం మేరకు  2008  నుండి ఇప్పటి వరకు యాసిన్ భత్కల్  బాంబు పేళ్లుల్లు జరిపిన ప్రాంతాలు.అహ్మదాబాద్    (2008), సూరత్  (2008), జైపూర్ (2008), న్యూ డిల్లీ (2008), వారణాసి (2010),బెంగళూర్  (2010), ఫునె (2011),ముంబై  (2011), హైదరాబాద్  (2013) బెంగళూర్  (2013).

  ఇప్పటికైన ఈ క్రూరుడిని పట్టుకోవడం సంతోషం. త్వరలో మిగతా ఉగ్రవాదులని కూడా పట్టుకుని ఉగ్రవాదుల  నుండి దేశాన్ని కాపాడతారని ఆశిద్దాం.