Thursday, December 13, 2012

టిబెట్ "బౌద్దబ్రాహ్మణుల" కుట్రయే "బాల శాంభవి" నాటకం అట!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_13.html

పూర్తి టపా కోసంలింక్ మీద క్లిక్ చెయ్యండి

టిబెట్ "బౌద్దబ్రాహ్మణుల" కుట్రయే "బాల శాంభవి" స్రుష్టి అట!

                                                                   
ప్రసిద్ద, నాస్తిక వాది, "గోగినేని బాబు" గారి విశ్లేషనానుసారం బాల దేవత గా తెలుగు ప్రజలకు పరిచయమయిన, "శాంభవి" అనే ఏడేళ్ల  పాపను హిమాచల్ ప్రదేశ్ లోని "దర్మ శాల" నుండి ఇక్కడకు పంపడం వెనుక బౌద్ద గురువైన "దలై లామ" మరి కొంత మంది హస్తముందట. ’బాల శాంబవి కి తల్లి, తండ్రులుగా వ్యవహరించిన "ఉషా రాణి, సౌమ్యా చారి" ఇరువురూ బ్రాహ్మణ  వర్గానికి, చెందిన వారుగా తెలుస్తుంది. మరి వీరిరువురిని ఉపయోగించి "దలై లామ" గారు ఎందుకు" "శాంబవి" డ్రామా ఆడారో చూడ్డాం.

  "దలై లామా " గారికి బద్ద శత్రువు "చైనా ". అది నాస్తిక కమ్మ్యూనిస్ట్ దేశం. దాని నియంత్రనను "టిబెట్" మీద లేకుండా చెయ్యలి అంటే మన దేశం సహాయం అవసరం. మన దేశం లో హిందూ మతం మెజార్టీ. ఇక్కడి ప్రజల సప్పోర్ట్ ఆయనకు, ఆయన వజ్రయాన బౌద్ద మతానికి అవసరం.వజ్రయాన మతస్తులకు మన లాగే "పునర్జన్మ" సిద్దాంతం మీద విశ్వాసం.అటు వంటి విస్వాసమున్న "దలై లామా" గారికి ఆంద్రుడయిన, బ్రాహ్మణ I.A.S        "ఎక్కిరాల వేదవ్యాస్" గారితో పరిచయ మయింది.

  ఇక్కడ " వేద వ్యాస్" గారి గురించి కొంచం చెప్పుకోవాలి. ఆయన "కలియుగాంతం" 1999 లోనే అవుతుందని ప్రకటించడమే కాక కొన్ని పుస్తకాలు రాసారు. అలాగె "వీరబోగ వసంత రాయులు" గారు వస్తారని కూడ చెప్పారు. అయితే ఆయనకు తన కులాభిమానం చెతనో లేక దేని వలననో కాని  "వీరబోగ వసంత రాయులు"  భ్రాహ్మణ యువకుడి రూపం లో వస్తాడని కరాఖండిగా చెప్పారు. అది జరుగలేదు. కాబట్టి "దర్మ శాల"లో ఉన్న ఆయన అబిమానులు మరొక ప్లాన్ చేసి దానిని అమలు చెయ్యలనుకున్నరు.

 ’గోగినేని బాబు"గారి మాటల్లొనే,ఎవరొ ఒక పిల్లవాడిని "దలైలామ" గారు పద్నాలుగు నెలలు పిల్లవాడిగా ఉన్నప్పుడు, లామా అవతారంగా ప్రకటించి తీసుకొచ్చి,  దక్షిణ బారత దేశం లోని ఒక ఆశ్రమం లో ఉంచారటా. అతను అకడ ఉన్నంత కాలం బయటి వారిని ఎవరిని కలవనివ్వ లేదట! అదే విదoమ్గా "శాంభవిని" కూడ ఉష రాణి, సౌమ్యాచార్యులు ను తాల్లి తండ్రులుగా నటింపచేసి, "సూర్య నంది" ప్రాంతంలో  ఒక ఆస్రం నిర్మించి, అక్కాడ "బాల శాంబవిని" దైవదూత గా ప్రచరం చెయ్యమని పంపారట!  వారి ప్లాన్ ప్రకారం "వీరబోగ వసంత రాయులు" పొయిన సంక్రాంతి  పండుగనాడు ప్రజలకు దర్శనం  ఇస్తారని ప్రకటింప చేసారు. "ఆశ్రమ" ప్రారంబోత్స్వానికి ’దలైలామా" టూర్ ప్రోగ్రాం కూడ ఖరారై పొయింది.

                ఈ విదంగా వారి ప్లాన్ విజయవంతమయితే, వారు రహస్యంగా పెంచిన "లామా" యువకుడినే"వీరబోగ వసంత రాయులు" గ ప్రకటించి సూర్య నందిలో హల్ చల్ చేసి ఉండెవారు. అలా తెలుగు ప్రజలను నమ్మించి అలా అవతార పురుషుడిగా మార్చిన లామా తో ఇటు   ప్రబుత్వాలను, అటు ప్రజలను ప్రబావ పరిచే వారు. అందుకే బాల శాంబవి ఎప్పుడూ "వీరబోగ వసంత రాయులు" వస్తాడు "తిబెట్" ని చైనా నుండి విముక్తం చేస్తాడు అన్ని చెప్పేది.కాని వాల్ల ప్లాన్ మొత్తాని "బాల హక్కుల కార్య కర్తలు చెడ గొట్టారు" అది ఎలా జరిగిందో తర్వాటి టపాలో చూదాం.(సశేషం)   http://nirmukta.com/2010/01/01/update-in-the-case-of-the-7-year-old-sambhavi-declared-the-reincarnation-of-a-buddhist-goddess/

Wednesday, December 12, 2012

బౌద్దం+బ్రాహ్మణం+ పన్నాగం= బాల శాంభవి స్రుష్టి

అవును బాల దేవత శాంభవిని ’సూర్య నందికి పంపించడం వెనుక శూద్రుడయిన అవతారపురుషుడు, వీరబోగ వసంతరాయులును రాకుండ కట్టడి చెయ్యడమే కాక బుద్ద మతానికి చెందిన వారిని" వీరబోగ వసంతరాయులు" గా "దలై లామ" చేత ప్రకటింప చేయాలన్న కుట్రలో బాగం గానే జరిగిందని అనిపిస్తుంది. కాని ఆ దేవుడు "బాలల హక్కుల కార్యకర్తల" రూపం లో వారి కుట్రను భగ్నం చేసాడు.రేపటి టపాలో పూర్తి పరీశోదనా వివరాలు ఉంచడం జరుగుతుంది. అందాక ఈ లింక్ ని క్లిక్ చేసి చూడగలరు.http://kalkiavataar.blogspot.in/2012/12/21.html

డిసెంబర్ 21 న "వీరబోగవసంతరాయులు" ఎవరో తెలిసిపోతుందట!

                                                                    

నేను "కల్కి " అవతారం అని ఒకరంటే ,నేనే"కల్కి భగవాన్" అని మరొకరు ప్రకటించుకున్నారు. "కోట్లాది రూపాయలు" ఆర్జించారు. ఆర్జిస్తున్నారు. ణెను ఈ మద్య కొన్ని వెబ్ సైట్ లు చూసాను. తమిల్ నాడుకు చెందిన కొందరు తాము "కల్కి" అవతారులమని ప్రకటించుకుని,వెబ్ సైట్ ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. కాని కల్కి కి మరో పేరయిన (బ్రహ్మం గారు చెప్పింది) "వీరబోగ వసంత రాయులు" తామేనని పెద్దగా ప్రచారం చేసుకున్నది ఎవరూ లేరు. ఒక్కడు మినహా!

  మన మాజి ముఖ్య మంత్రి స్వర్గీయ నంద మూరి తారక రామారావు గారు అదికారంలో ఉండగా తానే   "వీరబోగ వసంత రాయులు" అని ఒక వ్యక్తి రావడం  ప్రబుత్వ అనుమతిని సంపాదించి, "చింత మాను మటం" లోని "కాలజ్ణాన పాతర" ను త్రవ్వడానికి ప్రయత్నిస్తే, అది ప్రజలు వ్యతిరేకించడం, ఆ తర్వాత  హై కోర్ట్, ప్ర్హబుత్వ అనుమతిని రద్దు చెయ్యడం, సదరు అవతార పురుషుడు మాయమవ్వడం (జయిల్లో మరణించినట్లు వినికిడి) జరిగిపోయాయి. ఎవరో ఒక రిద్దరు తమ గురువు, "వీరబోగ వసంత రాయులు" అవతారాలని ప్రచారం చేస్తున్నా ’కల్కి" వచ్చిన "భక్త స్పందన" "వీరబోగ వసంత రాయులు" కు రాలేదు. ఆ తర్వాత "శాంబవి " అనే బాల దైవ దూత త్వరలోనే "వీరబోగ వసంత రాయులు" రానున్నడని చెప్పి, కొంత హల్ చల్ చేస్తే, "బాలల హక్కులు " గురించి తెగ బాద పడే వారు ఆ బాలికను బాద పెట్టి "దర్మ శాల"కు పంపించారు, ఇంకా వివరాలు కావాలంటే లింక్ ని క్లిక్ చెయ్యండిhttp://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_11.html.

  కాని ఇప్పట్టి దాక జరిగింది ఏమయిన కావచ్చు, మీకు డిసెంబర్ 21 న "వీరబోగ వసంత రాయులు" దర్శనం అవుతుందట!. అటడు ఆకాశం లోనుండి వస్తాడట. కోరుకున్న వారందరికి కనపడతాడట! నాకు ఒక నమ్మక్క మయిన సమాచారం ఆదారంగా చెపుతునాను. నమ్మితే ఆలౌకిక ఆనందం. లేకుంటే లౌకిక ఆనందం(జొక్ అనుకుంటే). మొత్తానికి ఆనందో బ్రహ్మా!  

Tuesday, December 11, 2012

26 న తారీకున "నల్లమల" లో యుగాంతమట!

http://kalkiavataar.blogspot.in/2012/12/26-12-2012.html
(పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

26-12-2012 న 'నంద్యాల' దగ్గర్లోకి "వీరభొగ వసంతరాయులు" రాబోతున్నాడా!?


 నేను నిన్న"

"కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"?

అనే టపా పెట్టడం జరిగింది. ఆ టపాలోని "సండ్ర చెట్టుకు" వీరబోగ వసంత రాయులు గల సంబందాన్ని, పరిశోదించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగినది. దానికి స్పందించిన వీక్షక మిత్రులు దీనికి సంబందించి కొంత సమాచారాన్ని,నా ఈ మెయిల్ అడ్డ్రెస్ కు పంపించడం జరిగింది. దానిని యదాతదంగా ఈ క్రింద ప్రచురిస్తున్నాను:-

"సార్వభౌమ గారు,
యుగాంతం కు కార్యరంగం నల్లమల అడవుల్లొని ఓంకార క్షేత్రం లో సిద్దమవుతూంది.అక్కడ అవధూత కాశి నాయన భక్తుల చే వీరబోగ వసంత రాయల విగ్రహ ప్రతిష్ట జరిగింది.అక్కడి సాంద్ర చెట్టు కింద ఒక శనీశ్వర విగ్రహాన్ని ప్రతిష్టా చేసారు.సిద్దయ్య గ్రామమైన కలుగొత్ళ లో కూడా కల్కి విగ్రహం పెట్టి నిత్య అన్నదానం చేస్తున్నారు.ఓంకారం లో కొంద మీద అనెక దేవతా మూర్థులు పెట్టారు.దానికి ముందు అక్కడ అనెక పుట్ట లను  వెలికి తీసారు.ఇప్పుదు అందులోని ఋషులందరు కొంద మీదకు వెళ్ళారని అంటున్నారు.ఇదంతా నంద్యాల  సమీపం లొ జరుగుతున్నది."

  పయిన మిత్రుడు చెప్పిన దానిలో, కాశి నాయానా అవదూత గారు ప్రక్యాత యోగివర్యులు. వారికి అషేష సంఖ్యలో బక్తులు ఉండటం సహజం. బ్రహ్మం గారి కాలజ్ణానం ళో వీరి గురించిచెప్ప బడింది.వీరి బక్తులు అటవీ ప్రాంతమయిన "నల్లమల"లో శనీశ్వరున్ని ప్రతిష్టించి పూజలు జరుపటం ముదావహం. అందయిన, ఆహ్లాదకరమయిన ’నల్లమల" లోని ఈ ఓంకార క్షేత్రం బక్తులను విశేషంగా ఆకర్షించవచ్చు.సమాచారమిచ్చిన మిత్రులుకు దన్య వాదాలు తెలుపుతున్నాను.దీని గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉన్నందున, "ఒంకార క్షేత్ర" మహత్యం గూర్చి తర్వాతి టపాలో తెలియ చెయ్యడం జరుగుతుంది 


 

Friday, December 7, 2012

అసలు ’కల్కి" అనే పదానికున్న "నానార్థాలు" ఏమిటి?

ఎనిమిది చేతులు గలిగినవాడు,ఎనిమిది మాయలు గలవాడు
                                                                    
నేను ఇంతవరకు రాబోయే అవతారపురుషుడు అయిన "కల్కి’ తల్లి తండ్రుల గురించి, అయన పుట్టబోయే "గ్రామం" గురించి పురాణాలలో, ఎంఉందో నాకు అవగతమయిన విదంగా విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. ఏ ఇద్దరి విశ్లేషణా ఒకటిగా ఉండకపోవచ్చు. ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానాలు చేయొచ్చు.నమ్మేవారు నమ్మొచ్చు,లెనివారు నవ్వుకోవచ్చు. కాని ఇది తప్పు,ఇది ఒప్పు అనేది ఎప్పూడు తెలుస్తుంది,చెప్పేది నిజమయినప్పుడు మాత్రమే, అంతవరకు ఎవరి ఊహ వారిది.

  ఇకపోతే,అసలు "కల్కి"అంటే ఏమున్నది అర్థం,ఒకే అర్థమా, నానార్థాలు ఉన్నాయా, అనేది ఈ టపాలో చూద్దాం.

  కలికి = అందమయినది, స్త్రీ,ప్రక్రుతి

  కల్కి=(కల్క్=బురద),(ఈ=పుట్టినది,నుండి వచ్చినది)= కమలం,తామర

  కల్కి= (కల్లు=రాయి ( ఉదాహరణ ఉప్పుకల్లు),ఈ= లోనుండి పుట్టిన వాడు= రాయిలో నుండి పుట్టినవాడు= నరసింహ స్వామి 

  పై విదముగా నానార్థాలు ఉండటంవలన నేను ’కల్కి పురాణాని’ ఇతర బవిష్య గ్రంథాలతో పోల్చి చూడడం జరుగుతుంది. బ్రహ్మం గారు చెప్పిన "వీరభోగ వసంత రాయలు" కూడ ప్రత్యేకంగా చెప్పబడిన పేరు. మన పురాణ పురుషులలో  ఈ పేరు గలవారు ఎవరూ లేరు.కాబట్టి ఈ పేరును బ్రహ్మం గారు ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో జగ్రత్తగా పరిశోదించాల్సిన విషయం. "నరసీంహ స్వామి"కి ,"వీరబోగవసంత రాయులు"  కి గల సంబందం తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యండిhttp://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8738.html

  ఇక పోతే యుగం ఆంటే లక్షల సంవత్సరాలు అనేది నిజమయితే, అన్ని సంవత్సరాలు ఈ పాప బారం బూమి మీద ఉంటుందా? అసలు ఈ మనిషి చేసే ప్రక్రుతి ద్వంసానికి ఏ జీవరాసి అయినా ఈ గ్రహం మీద ఉంటుందా అనేది అలొచిస్తే, పురాణాలు చెప్పే లెఖ్కలు ఎక్కడో తప్పినట్టు అనిపిస్తుంది. కాబట్టి మయన్ కాలెండర్ కరెక్ట్ అనిపిస్తుంది.

  మరిన్ని వివరాలతో మరో టపాలో

"నార్వే కేస్" కు బ్రహ్మం గారి "కాలజ్ణానం" కి లింక్ ఏమిటి?

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8738.html
(పై లింక్ ని క్లిక్కండి)