ప్రసిద్ద, నాస్తిక వాది, "గోగినేని బాబు" గారి విశ్లేషనానుసారం బాల దేవత గా తెలుగు ప్రజలకు పరిచయమయిన, "శాంభవి" అనే ఏడేళ్ల పాపను హిమాచల్ ప్రదేశ్ లోని "దర్మ శాల" నుండి ఇక్కడకు పంపడం వెనుక బౌద్ద గురువైన "దలై లామ" మరి కొంత మంది హస్తముందట. ’బాల శాంబవి కి తల్లి, తండ్రులుగా వ్యవహరించిన "ఉషా రాణి, సౌమ్యా చారి" ఇరువురూ బ్రాహ్మణ వర్గానికి, చెందిన వారుగా తెలుస్తుంది. మరి వీరిరువురిని ఉపయోగించి "దలై లామ" గారు ఎందుకు" "శాంబవి" డ్రామా ఆడారో చూడ్డాం.
"దలై లామా " గారికి బద్ద శత్రువు "చైనా ". అది నాస్తిక కమ్మ్యూనిస్ట్ దేశం. దాని నియంత్రనను "టిబెట్" మీద లేకుండా చెయ్యలి అంటే మన దేశం సహాయం అవసరం. మన దేశం లో హిందూ మతం మెజార్టీ. ఇక్కడి ప్రజల సప్పోర్ట్ ఆయనకు, ఆయన వజ్రయాన బౌద్ద మతానికి అవసరం.వజ్రయాన మతస్తులకు మన లాగే "పునర్జన్మ" సిద్దాంతం మీద విశ్వాసం.అటు వంటి విస్వాసమున్న "దలై లామా" గారికి ఆంద్రుడయిన, బ్రాహ్మణ I.A.S "ఎక్కిరాల వేదవ్యాస్" గారితో పరిచయ మయింది.
ఇక్కడ " వేద వ్యాస్" గారి గురించి కొంచం చెప్పుకోవాలి. ఆయన "కలియుగాంతం" 1999 లోనే అవుతుందని ప్రకటించడమే కాక కొన్ని పుస్తకాలు రాసారు. అలాగె "వీరబోగ వసంత రాయులు" గారు వస్తారని కూడ చెప్పారు. అయితే ఆయనకు తన కులాభిమానం చెతనో లేక దేని వలననో కాని "వీరబోగ వసంత రాయులు" భ్రాహ్మణ యువకుడి రూపం లో వస్తాడని కరాఖండిగా చెప్పారు. అది జరుగలేదు. కాబట్టి "దర్మ శాల"లో ఉన్న ఆయన అబిమానులు మరొక ప్లాన్ చేసి దానిని అమలు చెయ్యలనుకున్నరు.
’గోగినేని బాబు"గారి మాటల్లొనే,ఎవరొ ఒక పిల్లవాడిని "దలైలామ" గారు పద్నాలుగు నెలలు పిల్లవాడిగా ఉన్నప్పుడు, లామా అవతారంగా ప్రకటించి తీసుకొచ్చి, దక్షిణ బారత దేశం లోని ఒక ఆశ్రమం లో ఉంచారటా. అతను అకడ ఉన్నంత కాలం బయటి వారిని ఎవరిని కలవనివ్వ లేదట! అదే విదoమ్గా "శాంభవిని" కూడ ఉష రాణి, సౌమ్యాచార్యులు ను తాల్లి తండ్రులుగా నటింపచేసి, "సూర్య నంది" ప్రాంతంలో ఒక ఆస్రం నిర్మించి, అక్కాడ "బాల శాంబవిని" దైవదూత గా ప్రచరం చెయ్యమని పంపారట! వారి ప్లాన్ ప్రకారం "వీరబోగ వసంత రాయులు" పొయిన సంక్రాంతి పండుగనాడు ప్రజలకు దర్శనం ఇస్తారని ప్రకటింప చేసారు. "ఆశ్రమ" ప్రారంబోత్స్వానికి ’దలైలామా" టూర్ ప్రోగ్రాం కూడ ఖరారై పొయింది.
ఈ విదంగా వారి ప్లాన్ విజయవంతమయితే, వారు రహస్యంగా పెంచిన "లామా" యువకుడినే"వీరబోగ వసంత రాయులు" గ ప్రకటించి సూర్య నందిలో హల్ చల్ చేసి ఉండెవారు. అలా తెలుగు ప్రజలను నమ్మించి అలా అవతార పురుషుడిగా మార్చిన లామా తో ఇటు ప్రబుత్వాలను, అటు ప్రజలను ప్రబావ పరిచే వారు. అందుకే బాల శాంబవి ఎప్పుడూ "వీరబోగ వసంత రాయులు" వస్తాడు "తిబెట్" ని చైనా నుండి విముక్తం చేస్తాడు అన్ని చెప్పేది.కాని వాల్ల ప్లాన్ మొత్తాని "బాల హక్కుల కార్య కర్తలు చెడ గొట్టారు" అది ఎలా జరిగిందో తర్వాటి టపాలో చూదాం.(సశేషం) http://nirmukta.com/2010/01/01/update-in-the-case-of-the-7-year-old-sambhavi-declared-the-reincarnation-of-a-buddhist-goddess/