Wednesday, December 5, 2012

"కల్కి" పుట్టే గ్రామం పేరు ఏమిటో తెలుసా?

 "కల్కి పురాణం’ ప్రకారం  కల్కి జన్మించబోయే గ్రామం పేరు "శంభల".ఈ "శoభల" గ్రామం లోనే ఊరి పెద్ద అయిన ’విష్ణు యశుడు, లేక "దేవగుహ్యుడు" అనే సమాన అర్థాలు కలిగిన వ్యక్తి ఇంటిలో "అవతార పురుషుడు పుడతాడట. వాటి గురించి వివరాలకు క్రింది లంకే ను క్లిక్ చెయ్యండి .

 ఇకపోతే "శంబల" అనే గ్రామము గురించి "నికిలో రోరస్" అనే రష్యన్ పరీసోదకుడు, ఆ గ్రామం "హిమాయలలో ఎక్కడో ఉందని అది మామూలు  మనుషులకు కనపడదని, యోగ సాదకులు మాత్రమే చూడ గల రని  "రాజు గారి దేవతా వస్త్రాలు" కథ చెప్పినట్టు చెప్పాడు. ఆయన పరీశొదనా సారాంశం అంతా ఒక”సైన్స్ ఫిక్షన్" సినిమా కథ ను తలపింప చేస్తుంది. కాబట్టి నమ్మటం కష్టం.

 ఇక పోతే నా పరిశొదన ఏమిటంటే "శంబల" అంటే "మద,మాత్సర్యములు" లేక "ఈర్షా ద్వేషములు" అనే అర్థం ఉంది. దీని ప్రకారం "శంబల గ్రామం" అంతే, అటు వంటి ప్రజలు ఉన్న గ్రామం అని కావచ్చు. అసలు కల్కి బయటకు వస్తేనే ఇది రుజువయ్యేది. కాని ప్రస్తుత కాలంలో ఏ గ్రామమయినా ఇటువంటి ప్రజలు కాక , సత్పురుషులు ఉన్న గ్రామం ఉందా?!కలి కాలం అంటే అర్థం అదే కదా! ప్రజలలో మద మాత్సర్యాలు పెరగడం వలననే,పాపాలు పెరిగి,"కల్కి" రావాల్శి వస్తుంది కదా! అందుకే ఇదే కరెక్ట్ అనుకుంటా http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_5151.html.

Tuesday, December 4, 2012

రాబోయే అవతార పురుషుడి తండ్రి పేరు "దేవగుహ్యుడు"! అంటె అర్థమేమిటి?

నేను ఇంతకు ముందు టపాలో (లింక్ ని క్లిక్ చెయ్యండి} చెప్పినట్లుగా "కల్కి" జన్మ విశేషాలకు, ఇతర వివరాలకు "కల్కి పురాణం" విష్ణు పురాణం" ఆదారాలుగా తీసుకోవటం జరిగింది. మరింత వివరణ కావాల్శినప్పూడు, "బ్రహ్మం గారు" మరియు నోస్ట్రాడామస్ "భవిష్య వాణిని" కూడ పరిశీలించడం జరిగింది.

 అదే విదంగా "కల్కి" తల్లి పేరును తెలియ పరచాను. ఇప్పుడు ఆయన తండ్రి పేరును విశ్లేషించి చెప్పడం జరుగుతుంది.

కల్కి పురాణం లో అయన తండ్రి పేరు "విష్ణు యశుడు" అని చెప్పగా, విష్ణు పురాణం లో "పరమాత్మ" తండ్రి పేరు "దేవ గుహ్యుడు" అని చెప్ప బడింది. మరి ఈ రెండూ ఒకటేనా? వేర్వేరు అయితే ఏది ప్రామాణికమో చూదాం.
"విష్ణు యశుడు" లేక "విష్ణు యశశుడు" అనగా ప్రఖ్యాతమయిన, "విష్ణువు" కు సంబందించిన పేరుగలవాడు అయి ఉండాలి. ఈ విదంగా చాలా నామాలు ఉన్నాయి.అదీ గాక ఆయన ఉండే గ్రామంలో "ప్రదానుడు" అంటే, ముఖ్యుడయి ఉండాలి.  బ్రహ్మ జ్ణాని అయి ఉండాలి.

 ఇక పోతే "దేవగుహ్యుడు" అంటే. తెలుగులో "దేవుని గుంట" అనే సామాన్య అర్థం ఉంది.అలాగే "దేవుని" అంటే పవిత్రమయిన అనే అర్థం కూడ ఉంది. ఈ విదంగా చూస్తే "పవిత్రమయిన మార్మిక స్తానం" అనే అర్థం కూడ వస్తుంది.
  పవిత్రమయిన అనే పదానికి "తిరు" అనే తమిళ పదం కూడా వర్తిస్తుంది. అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు, "గుంటలు’ ని "పతులు" అని కూడా అంటారు . ఈ విదంగా చూస్తే, "దేవుని గుంట" అంటే "పవిత్ర పతి" అనొచ్చు లేక పోతే "తిరుపతి" అని కూడ అనొచ్చు.
 కాబట్టి ఈ క్రింది పేర్లకు సంబందించిన ఏదో ఒక పేరు "కల్కి" తండ్రి పేరు అయి ఉండాలి అనుకుంటున్నాను.

(1), విష్ణు యశ్ (2) దేవపతి,(3)పవిత్ర పతి (4) విష్ణు కీర్తి (5) తిరుపతి. ఈ విదంగా ఈనామములకు సమానార్థ కాలలో ఏదో ఒక పేరు "కల్కి" అవతార పురుషుడి తండ్రి  పేరు అయి ఉండాలి.

  ఇతర వివరాలను తర్వాతి టపాలలో తెలుసుకుందాం . కల్కి తల్లి పేరును తెలుసుకుంటానికి "ఈ క్రింది లంకె ను క్లిక్ చెయ్యగలరు (http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2.html)

" కల్కి" అవతార పురుషుడి తండ్రి పేరు కూడా తెలిసింది!

http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_4.html
(పై లంకె మీద క్లిక్ చెయ్యండి )

Sunday, December 2, 2012

" కల్కి" అవతార పురుషుడి తల్లి పేరు తెలిసింది!

 ఇక నుండి వరుస టపాలలో  రాబోయే కల్కి వివరాలు ప్రచురించాటం జరుగుతుంది. మీకు తెలిసినవారు ఎవరయినా నేను చెపుతున్న వివరాలతో వారి బయో డేటా సరిపోతే, వారి వివరాలను,  నాకు ఈ మెయిల్ చెయ్యగలరని మనవి. వివరాలు మొత్తం చెప్పేదాక, ఈ బ్లాగుని అనుసరించగలరని, వీక్షకులకు సవినయంగా మనవి చేస్తూ.....

  మొదటగా కల్కి తల్లి గారు ఎవరని చెప్ప బడిందో తెలుసుకుందాం.కల్కి చరిత్రను గూర్చి మనకున్నది,ముఖ్యమయిన అదారాలు (1), కల్కి పురాణం లేక బాగవతం (2) విష్ణు పురాణం.

 -----కల్కి పురాణంలో ఇతని తల్లి పేరు "సుమతి" అని చెప్పబడింది. సుమతి అంటె "మంచి బుద్ది కలద్ " అని అర్థమట.

----- అదే విష్ణు పురాణంలో "మన్వంతరం"లు గురించి పద్నాలుగు మంది మనువులు గురించి వివరంగా చెప్ప బడి ఉంది. అంతే కాకుండా, ప్రతి మన్వంతరంలో, పరమాత్మ అవతారం పేరు, అయన తల్లి తండ్రుల పేర్లు కూడ వివరంగా చెప్పబడి ఉండటం వలన " కల్కి పురాణాన్ని,విష్ణు పురాణాన్ని కలిపి విశ్లేచడం జరుగుతుంది. రెండితిలో సారూప్యత ఉన్న వాటికి అధిక ప్రాద్యాన్యత ఇవ్వడం జరిగింది. లేకుంటే ఒక పురాణానికి, ఇంకొక దానికి అసలు సంబందం లేకుంటే అంతా గందర గోళమే కదా! అందుకే ఈ పద్దతి.

    విష్ణు పురాణం లో రాబొయే ఎనిమిదవ మన్వంతరం లొ పరమాత్మ(కల్కి) పేరు సార్వబౌమ అంట! అయన తల్లి పేరు "సరస్వతి" అని చెప్ప బడింది.

    కాబట్టి ఇప్పుడు పైన చెప్పబడిన రెండు పేర్లుకు ఏమన్నా సంబందం ఉందా? అంటె సంబందం ఉందనే చెప్పవచ్చు. సరస్వతికి ఉన్న నానా అర్థాలలో "సుమతి" కూడ ఒకటని చెపుతారు.కాబట్టి   "కల్కి’ ఒక్క తల్లి పేరును "సరస్వతి" లేక "సుమతి’ కి సంబందిచిన వివిద నామాలలో ఒకటయి ఉండాలని నా అభిప్రాయం.

 ఇక పొతె తండ్రి పేరు గురించి తరవాటి టపాలో చూద్దాం.     

డిసెంబర్ 20 తారీకు లోపు మనకి "కల్కి" కనపడతాడట!వివరాలకు చూడండి.....

యస్. నాకు నమ్మకమయిన సమాచారం దొరికింది."కల్కి" గురించి వివరాలు అతి త్వరలో మీ ముందుంచుతాను.మన కంటే విదేశియులే "కల్కి" విషయంలో చాల సమాచారం సేకరించారు. రష్యా వాళ్లైతే రహస్య పరీశొధనలు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారంట! ఇవ్వన్ని సేకరిస్తుంటే నాకే ఆశ్చ్చర్యం వేస్తుంది. ఏది ఏమయినా కల్కి వివరాలు అతి త్వరలో సాక్ష్యాదారాలతో మీ ముందుంచుతాను. యస్. నాకు నమ్మక్కమే. మీకైతే నాది పాత పాటే "నమ్ము,నమ్మకపో,నే పరిశోదిస్తూనే ఉంటా!"

Saturday, December 1, 2012

డిసెంబర్ 20 తారీకు లోపు మనకి "కల్కి" కనపడతాడట!వివరాలకు చూడండి............

యస్. నాకు నమ్మకమయిన సమాచారం దొరికింది."కల్కి" గురించి వివరాలు అతి త్వరలో మీ ముందుంచుతాను.మన కంటే విదేశియులే "కల్కి" విషయంలో చాల సమాచారం సేకరించారు. రష్యా వాళ్లైతే రహస్య పరీశొధనలు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారంట! ఇవ్వన్ని సేకరిస్తుంటే నాకే ఆశ్చ్చర్యం వేస్తుంది. ఏది ఏమయినా కల్కి వివరాలు అతి త్వరలో సాక్ష్యాదారాలతో మీ ముందుంచుతాను. యస్. నాకు నమ్మక్కమే. మీకైతే నాది పాత పాటే "నమ్ము,నమ్మకపో,నే పరిశోదిస్తూనే ఉంటా!"

కరెక్ట్ గా టైం కొచ్చే "ట్రెయిన్" లాంటి వాడే "కల్కి".

  నా బ్లాగులో పోస్ట్ లు చూసి ఎవరూ భయపడక్కర్లేదు. ఎందుకంటే ఒక మిత్రుడు ఇతరులు బయపడతారు అని అన్నాడు. అసలు అవసరం లేదు. కల్కి రావడమే మన అద్రుష్టంగా భావించాలి.ఇది పక్కా మత విశ్వాసం.అంతే.అంతకు మించి ఏమి లేదు."ప్రళయం" రాదు కాబట్టి నో ఫియర్.

  ఇక పోతే కాల ఘణితం ప్రకారం "కల్కి" రాకడ ఎలా సంభవమంటే, ఉదాహరణకు ఒక ట్రయిన్("కల్కి ఎక్స్ ప్రెస్") రైల్వే వారి టైం టేబుల్ ప్రకారం "విజయవాడ" కి రొజూ ఉదయం 10 గంటలకు టంచనుగా వస్తుంది అనుకోండి. "భోగిలు అవే కాక పోవచ్చు, ఇంజన్ అదే కాక పోవచ్చు,కాని  పది గంటలు కొట్టెసరికి "కల్కి ఎక్స్ ప్రెస్" వచ్చేస్తుంది కదా!  వ్యక్తి ఎవరో మనకు తెలియక పోవచ్చు. కాణి ఆ సమయాన్ని బట్టి అతని రాకడ గుర్తిస్తారు నిజమయిన కాలజ్ణులు. మరింత సమాచారం కోసం లంకె మీద క్లిక్ చెయ్యండి.మీ అందరికి కల్కి దర్శనం కలుగుగాక!
http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_9395.html

Friday, November 30, 2012

."కల్కి" రావడం ఖాయం లేకుంటే" మనం" పోవడం ఖాయం.

చాలా మంది ముఖ్యంగా ఈ నాటి తరంవారు "మత గ్రందాలలో" చెప్పిన అవతార పురుషులు వస్తారని ఈ కలి నుండి మనల్ని కాపాడతారని నమ్ము తుండక పోవచ్చు. ఎందుకంటే దేవతలు,రాక్షసులు అనేవారిని పురాణాలలో చదివి వాటిని ఒక " సోషియో ఫాంటసీగా" ఏన్జాయి చెయ్యడమే తప్ప వాటి వెనుక నున్న " బావాజాలాన్ని" గ్రహించలేక పోవడమే అని నా అభిమతం.

 .పౌరాణిక పాత్రలైన "హిరణ్యాక్షుడు,హిరణ్య కశిపుడు, రావణుడు" అందరూ బౌతిక వాదులే అయి నప్పట్టికి అచంచల శివభక్తులు,రావణాశురిడి కాలంలో గాలి ఎంత కావాలి అంటే,అంత మాత్రమే వీచేదట . అలాగే ఆన్ని ప్రక్రుతి శక్తుల మీద "రావణ బ్రహ్మ" కు పట్టు ఉండేదని చెపుతుంటారు. దీని వలన వారు బౌతిక సుఖాలకు  ప్రాదాన్యత ఇచ్చారని తెలుస్తుంది. రామ రాజ్యం కంటె రావణ రాజ్యం ఒక పద్దతి ప్రకారమ్ ఏలబడింది. దేవతలు కంటె "రాక్షసులు బలవంతులని  సమర్దులని ఎన్నోసార్లు రుజువయింది.అయినా వీరు "దైవ క్రుపకు" ముఖ్యంగా "స్తితి కారుడైన" విష్నుమూర్తికి శత్రువులుగా గుర్తించబడి ఆయనచే సంహరించ బడ్డారు. మహా దేవుడి ప్రాపకం ఉన్నా,వీరి నాశన్నాన్ని అది నిరోదించ లేక పోయింది. ఇంకొక గమ్మయితైన విషయం ఏమిటంటే దేవతలు, రాక్షసులు ఇరువురూ ఒక తండ్రి బిడ్డలే. తల్లులే వేరు. ఏమిటిదంతా! ఇలా ఎందుకు పురాణాలలో రాసారు. ఒక వేళ ఇది కేవలం విష్ణు బక్తులు, శివ బక్తుల మీద రాసిన ద్వేషపూరిత రచనలే అయితే, శివబక్తులు, రావణబ్రహ్మ ని హీరో గా చూపిస్తూ కౌంటర్ రచనలు చేయాలిగా? అలా చేయలేదు ఎందుకని? రామాయణంలోనే రావణుడి గొప్పతనం కూడ చెప్పటం జరిగింది కదా!కాబట్టి ఇవి కేవల ద్వేషపూరిత రచనలు కావు. అప్పట్టి రాజులను, పాలనా విదానాన్ని ద్రుష్టిలో పెట్టుకుని కల్పనలు జోడించి రాసిన చరిత్రలే కావచ్చు,     

  సైన్స్ "బౌతిక" ప్రపంచాన్ని నిర్మిస్తుంటే, మతం, నైతికతో కూడిన "మానసిక ప్రపంచాన్ని" నిర్మిస్తుంది.ఈ రెంటి  మద్య సమన్వయం ఉండటం అవసరం."బౌతిక ప్రపంచ వాదులు" "రాక్షసులు గాను, "మానసిక ప్రపంచ వాదులు" దేవతలగాను అభివర్ణించబడినప్పటికి,ఇరువురూ మనుష్యుల ఆలోచనా విదానాలకు ప్రతీకలే తప్ప ఆటువంటి వారు జీవ  పరిణామ క్రమంలో ఉన్నారనడానికి ఈ నాటి వరకు ఆదారాలు లేవు.

 ప్రక్రుతిలో సకల జీవజాలం వర్దిల్లడానికి "మానసిక వాదం" తోడ్పడితే,కేవలం మానవుడి వికాసానికి మాత్రమే "బౌతిక వాదం" తోడ్పడుతుంది. ఈ స్రుష్టీ దర్మం "మానసిక వాదానికే అనుకూలం కాబట్టి ప్రతీకగా "భగవంతుడు,అవతారమూర్తులు" వచ్చారు.ఇంచుమించుగా అన్ని మతాల లోని సారాంశం ఇదే ఉద్బోదిస్తుంది. హిందూ అవతార మూర్తులు ఎప్పుడూ,"ఏ నాడైతే బౌతిక వాదం వెర్రితలలు వేసి, ప్రక్రుతి వినాశనానికి కారణమవుతుందో అప్పుడు ఉద్బవిస్తారు
            .ఒకానొక సిద్దాంతం ప్రకారం ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి "కార్యా కారణ" సంబందం "ఉండి తీరుతుంది.పాలు పొంగితే పొయ్యి ఆరిపోవాలి. లేక పోతే పాలన్ని ఆవిరైపోతయి. కాబట్టి మనం మంట తగ్గిస్తాము. ఇదే సూత్రం ప్రక్రుతి నియమాల్కు వర్తిస్తుంది. బౌతిక సుఖాల మోజులో స్వార్దపూరితమయిన మనిషి చర్యలు సకల జీవజాలానికి వినాశకంగా పరిణమిస్తే, దానిని ప్రక్రుతి ఆపి.తీరుతుంది. అది మానవ చర్యల రూపంలో ఉంటుంది. అలా ఆపేవాడే "కల్కి".ఒక వేళ అలా ఆపకపోతే "ప్రళయం" రూపంలో మన పతనం తప్పదు.   అందుకే నేను ఇంత గట్టిగా విస్వశిస్తుంది."కల్కి" రావడం ఖాయం లేకుంటే మనం పోవడం ఖాయం.