Sunday, November 25, 2012

మా ప్రజలకి కావాల్సింది" నీతిగలవాడు" కాదు.వారిని"సబ్సీడీ నీతి" గా పాలించేవాడు..


ఈనాడు ప్రజలకు చాలమందిలో "అవినీతి" గురించి మాట్లాడే వారిలో పెద్ద నమ్మక్కం లేనట్టుంది అందుకే ఎవరి మీద అవినీతి అరోపనలు ఉన్నా వారు పెద్దగ స్పందించడం లేదు. నీవు ఎంత అవినీతి పరుడవన్నది మా కనవసరం ,మా కిచ్చే సబ్సీడీలు మాకు నిజాయీతీగా ఇప్పిస్తే చాలు, "నీవే మా నాయకుడివి" అంటున్నారు. అది కని పెట్టి మన నాయకులు ఒకరిని మించి మరొకరు సబ్సీడీలు మీద  సబ్సీడీలు వాగ్దానం చేస్తున్న్నారు.ఈ కిటుకు తెలియని వారు అమాయకంగా , అవినీతి ,గాడిద గుడ్డు, అంటూ ప్రజలకు పట్టని పంచాంగం వివరిస్తున్నారు,ఏమిటో ఎవడి గోల వాడిది!

Saturday, November 24, 2012

యుగాంతానికి, ప్రళయానికి ఏమిటీ తేడా?

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_2259.html

(పై లంకె మీద క్లిక్ చెయ్యండి)

యుగాంతం తర్వాత "కల్కి" స్తాపించేది "కమ్యూ’నిజమే" నంటా!


విశ్వం లో ఆవిష్క్రుతమవుతున్న  "అరుణ తార"


 ఈ దేశంలో కమ్మ్యునిస్ట్ లు "సోషలిజం ,ఇదిగో వస్తుంది,.అదిగో వస్తుంది అని ప్రజల్ని ఊరించి,ఊరించి అసలు దాన్నేలా ఈ దేశానికి తేవాలో తెలియక 'నోరెళ్ళ బెట్టి  సిద్దాంత రాద్దాంతాలు  చేస్తుంటే, వీళ్ళ గోల అర్థంకాక, ప్రజలు నెహ్రూ గారి ’శోషలిజానికి" జై అనేశారు. అ దెబ్బతో క్రిందబడిన కమ్మ్యునిస్టులు ఇంతవరకు లెగలేదు.
 ఇక మన రాష్ట్రంలో అయితే, "రామారావు" గారు రెండు రూపాయలకు క్కిలో బియ్యం నకు మించిన సోషలిజం ఉందా ? అనేసరికి అప్పట్టి దాక జుత్టు పీక్ఖున్న చాలా మంది జై "తెలుగు దేశం" అనేశారు. ఇక అక్కడక్కడ మిగిలి పోయిన వారు మళ్లి ఎప్పుడో ఒకప్పుడు "మన ఇజం" రాకపోతుందా అని ఎద్రు చూస్తున్నారు. అటువంటి వారికి ఒక శుభ వార్త! మా కల్కి తేబొతుంది నిజమైన "కమ్మ్యునిజమంటా!

   అదేలాగంటే " కల్కి’ దుష్టులను నిర్మూలించి,"బ్రహ్మజ్ణానులను(బ్రాహ్మనులు కాదు) కాపాడతాడట. ఇక మిగిలేది వారే కాబట్టి వారికి ఈ ప్రాపంచిక సుఖాల మీద అంత యావ ఉండదు కాబట్టి, చాతనైనది చెయ్యడం, కావల్సినంత వరకే తీసుకుంటారు."     మార్క్స్"   చెప్పింది అదే గదా. ఆ విదంగా బారతదేశమే మొట్ట మొదటి "మన కమ్మ్యునిస్ట్"  దేశం అవబోతుందహో.... 

మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే

                                                                       

మొన్న తెలంగాణా ప్రాంతంలొకి  "షర్మిల" ప్రవేశించినపుడు అక్కడ ఆమెకు స్వాగతం పలికిన జన  ప్రభంజనం చూసిన ఏ.బి.యన్. చానల్. వారు అయోమయంలో,పడ్డట్టుంది. వెంటనే అదే రోజు తమ చానల్ లో కామెంటోపనిషత్ ప్రసారం చేసారు. ఇక రానుంది ’అన్యమత రాజ్యమే’ అని ఒక సందేశం ప్రజలకు ఇచ్చినట్లుంది.

అయ్యా "దమ్మున్న చానల్, దుమ్ము రేపే చానల్" గారు మన దేశం లో ఏ మతం వారైనా సరే "జనగణమన" పాడ వల్సిందే, చివరకు "జై హింద్" అనాల్సిందే. మా హీందూ మతం గురించి మాకు భయం లేదు. మాకు "కల్కి" వస్తాడు."ధర్మాని రక్షిస్తాడు.ఇది హిందువుల అచంచల నమ్మకం. 

Friday, November 23, 2012

యుగాంతానికి, ప్రళయానికి ఏమిటీ తేడా?


                                                                    

యుగాంతం వేరు, ప్రళయం వేరు. కొంతమంది వీటి మద్య తేడా తెలియక ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందని ప్రచారాలు చేస్తే వాటిని నమ్మిన వారు భయపడుతున్నారు. చాలా మంది "ఉపద్రవం" అనే విషయంలో నమ్మక్కం లేక పోయినా ఏమి మార్పులు జరుగుతాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తుణ్న్నరు . మరి కొంత మంది దీని మీద జోక్ లు వేస్తూ ఎన్జాయ్ చేస్తున్నారు . ఏమైనా వీటి మద్య తేడా తెలుసుకుంటే . మంచిది 

యుగాంతం అంటే మనం లెక్కించే కాలగణన పద్దతిలో ఒకానొక పద్దతి అయిన "మయన్’ కాలెండర్ సమాప్తమయే రొజు. తిరిగి కొత్త కాలెండర్ మొదలవుతుంది .వారి ఒక లెక్క ప్రకారం వచ్చే డిసెంబర్ 21 వ తారికు నుండి మనం కొత్త యుగమైనా "కుంభ రాశి" యుగం లోకి అడుగు పెట్ట బోతున్నాం. దీని వలన మనుష్యుల అలోచనా సరలిలో అనేక మార్పులు రావచ్చు అని తద్వార నీతి వంతమైన  పద్దతులు ఏర్పడి తిరిగి సత్య యుగం మొదలవ్వుదని నమ్మఖ్ఖం.మన దేశంలో చాలామంది నమ్మక్కం ఏమిటంటే  ఆ తేది లోపు "కల్కి అవతార పురుషుడూ" వస్తాడని.దీని గురించి టన్నుల కొద్ది సాహిత్యం ఉంది. ఏది ఏమైనా కొత్త కాలెండర్ రావడం ఖాయం.

ఇక ప్రళయం  అంటే ఈ బూమికి చేటు తెచ్చే ఉపద్రవాలు ముంచుకొచ్చి మనమంతా పోతామని. ఇది నమ్మే మాట కాదు కాబట్టి దానిగురించి ఆందోళన అనవసరం. ఇంకా వివరాల  కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యండి 
                        http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_8271.html 

"విజయ కుమార్" "కల్కి భగవాన్" గా ఎందుకు అవతారం ఎత్తాడో తెలుసా?!.

http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7767.html
( పూర్తి టపా కోసం పై లంకె మీద క్లిక్ చెయ్యండి)   

Thursday, November 22, 2012

’షర్మిల’యే "కలికి" అవతారమా?

                                                           
"కలికి", అంటే అందమయినది, ప్రక్రుతి అనే అర్థంలో చూడవచ్చు. ఈ పదాన్ని అలా అన్వయిస్తే, మన"రాజన్న కూతురు" గా ప్రజల వద్దకు వెల్తున్న"మరో ప్రజా ప్రస్తానం" నాయకు రాలు "షర్మిల" కలికి అవతరమా అనిపిస్తుంది.నిన్న ఆంద్ర జిల్లాల నుండి తెలంగాణ జిల్లాలో ప్రవేశించినప్పుడు "ప్రజలు" ఆమెకు పట్టిన బ్రహ్మ రథం చూస్తె కాసేపు అలా అనిపించింది.కాని ఈక్రింది కారణాల వల్ల కాదులే అనిపిస్తుంది.

  (1).పురాణాలలో కల్కి  పురుషుడు గా చెప్ప బడ్డాడు.

  (2).’కల్కి’ని ఎక్కువ మంది అనుసరించరు.

  (3).అతనికి ప్రజా సహకారం కంటే ప్రక్రుతి(దైవ),సహకారమే ప్రదానంగా ఉంటుంది.

  (4).అతని సైన్యం (అభిమానులు) మెరుపు వేగంతో పనిచెయ్యాలి.     కాని ఆ జనాన్ని చూస్తే   "జైల్లో ఉన్నా జర బయట ఉన్నా,జగన్ జగనేరా డోంగ్రే" అనే యస్.వి.ఆర్. డైలాగ్ గుర్తుకు వచ్చింది.

 కాబట్టి అమే కల్కి అవతారం కాదులే అనే నిర్ణయానికి రావాల్శి వచ్చింది.

చదువుకున్న వారి ద్రుష్టిలో "జగన్" కంటే "జయ ప్రకాష్ నారాయణే" సమర్దుడా?



 నేను నిన్న "ఆంద్ర ప్రదేశ్ లో సుపరిపాలన ఇవ్వగల నాయకుడెవ్వరు" అని సర్వే పోల్ పెట్టగా, "జయ ప్రకాష్ నారాయణ్" గారికే ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి.దీనిని బట్టి నాకొక డౌట్ ఏమిటంటే, చదువుకున్న వారి ఆలోచనలు, సామాన్యుల ఆలోచనలకి చాలా.... బిన్నంగా ఉన్నాయి.ఎవరిది కరెక్ట్ తీర్పు?.మీ అభిప్రాయాలకు ఆహ్వానం,  మీ అభిప్రాయాలు భగవంతుని సంకల్పం గా బావిస్తున్నాను.. ఈ నాటివరకు  "జయ ప్రకాష్ నారాయణే" గారి మీద నాకు ద్రుష్టి లేదు. ఆయన జాతకం చక్రాన్ని పరీసిలించి మీ ముందుంచుతాను.. అంతా మీదే నిర్ణయం.ఆ భగవంతుడే ఈ ప్రజలను సరైనా మార్గంలో నడిపిస్తాడనే   సంపూర్ణ విశ్వాసముతో.... 
                                                                           

Wednesday, November 21, 2012

"కల్కి" అవతారం కంటే ముందు "కల్తీ" సైతాన్ వచ్చేసింది.

                                                                    

కల్కి అయితే యుగాంతాని కి రావచ్చేమో కాని అంత కంటే ముందు "సైతాన్"(కలి) రూపాలు వచ్చేశాయి.వీటి ద్వారానే ప్రస్తుతం నడుస్తుంది "కలి యుగాంత" దశ అని చెప్పవచ్చు. మనం చూస్తున్న వివిద కలి రూపాలలో "కల్తీ" ఒకటి.
 నేను ఈవిషయం గురించి మీకు ఎక్కువగా చెప్పక్కర్లేదు అనుకుంటా? మనం పీల్చే గాలినుంచి, తినే తిండి వరకు కల్తీ లేనిది ఎక్కడో చెప్పండి.డబ్బులు కుమ్మరించిన "కల్తీ"లేని సరుకు దొరకడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో అసలు మనం దేన్ని చూసి మనకున్న పాలనా వ్యవస్త బాగుందని కితాబివాలో అర్థం కావడం లేదు.

 మార్కేట్లో ఒక సహజమైన పండును చూడలేని, స్వచ్చమైన పాలు అందించలేని, మనది ఒక పాలనేనా? రోజూ  కల్తీ పదార్థాలు తిని తిని మన బుద్ది కూడ కల్తీ అయిపోయిందనుకుంటా! అందుకే "కల్తీ నాయకులకు" జై కొడుతున్నాం.వారు  తప్ప దిక్కు లేదని దేబిరిస్తున్నాం.

 మనకు ఈ కలి రూపమయిన "కల్తీ’ ని సంహరించి(నిరోదించి) కల్తీ చేయ్యా లనుకున్న వారి గుండేలో ఎవరు రైళ్లు పరిగెత్తిస్తారో వారే "కల్కి"అవతార పురుషుడు.ఆశ్రమాలు పెట్టి వ్యాపారాలు చేసేవారు కాదు గాక కాదు

       మేదావుల,చదువుకున్న వారి,  ఆలోచనలు సామాన్యుల కంటే మెరుగా ఉంటాయి అనే ఉద్దేస్యంతో  ఈ బ్లాగులో ఒక" సర్వె పోల్ "పెట్టడం జరిగింది.ఇది మాములుదే అనుకోకుండా తప్పకుండా మీ అభిప్రాయం ఓటు ద్వార  తెలుపుతారని ఆశిస్తూ...

"విజయ కుమార్" "కల్కి భగవాన్" గా ఎందుకు అవతారం ఎత్తాడో తెలుసా?!.

                                                                    
ప్రసిద్ద గురువుగా," కల్కి భగవాన్" గా శిష్యులచే పిలవ బడుతున్న, "ఒన్ నెస్" సంస్త స్తాపకుడి  అసలు పేరు విజయ కుమార్.ఇతను కల్కి భగవాన్ గా అవతార మెత్తడానికి  రెండు అంశాలు చెప్తుంటారు

(1), "నోస్ట్రా డామాస్"  తన భవిష్య వాణి లో రాబోయే యుగపురుషుడి పేరు "చైరన్" అంటే "విజేత" అర్థమట." విజయ కుమార్ అన్నా  అదే అర్థం కాబట్టి తనే ఆ యుగ పురుషుడినని శిష్యులని నమ్మించి మన అవతార పురుషుడి పేరు అయిన ’కల్కి భగవాన్"అని పెట్టుకుని  విజయం సాదించాడు(అంటే బాగా  సంపాదించాడు}

(2). "కల్కి  పురాణం ప్రకారం "కల్కి" బార్య "పద్మ’.ఈయన బార్య పేరు కూడ పద్మే కాబట్టి తామే అవతార పురుషులమని నమ్మించారు.

అంతకుమించి "కల్కి"కి ఆయనకు దేనిలోను పోలిక లేదు. ఈయన  ఆశ్రమమ్  వరదాయ పాలెంలో ఉంది.