2032 లో దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ నాయకుడు ఆసియా ఖండంని ఏకం చేస్తాడు అని ప్రఖ్యాత భవిష్యద్రష్ట నోస్ట్రడామస్ తెలిపారు. అలాగే రాబోయే కాలం లో తాను వీరభోగవసంత రాయలుగా గా పుట్టి రాజ్యసింహాసనమ్ అదిష్టిస్తాను అని ఇండియన్ నోస్ట్రడామస్ గా పిలువుబడుతున్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తన కాలజ్ణానం లో చెప్పి ఉన్నారు. మరి వీరు తెల్పిన కాలజ్ణాన వాక్యాలు నిజమయ్యే అవకాశం ఉందా అనేదాని తో పాటు సమకాలీన రాజకీయాలు గూర్చి చర్చించడమే ఈ బ్లాగు పని.
Wednesday, November 21, 2012
’కసబ్ వాదానికి’ "కల్కి వాదమే" కరెక్ట్ అయినది, మరియు చవకైనది.
అబ్బా! మొత్తానికి కసబ్ ని ఏసేసారు! ఉరి! ఇదంతా బాగానే ఉందిగాని ఈ ధర్మ యుద్దం లో ఎవరు గెలిచారు "కసబా(ఉగ్రవాదం)? ప్రభుత్వమా(ప్రజాస్వామ్యం)? అనేది సమీక్షించాల్సిన అవసరం ఉంది.
కసబ్ వైపు లాభ, నష్టాలు:- వీళ్లెలాగు "ఆత్మాహుతి దళం" కాబట్టి వీళ్ల ప్రాణాలకు విలువలేదు.ఒక వేళ ఉన్నా పదిమంది అనుకుంటా.కొంత ఆయుద సంపత్తి లక్షల్లో ఉంటుదేమో. ఇది నష్టం. పోతే లాభం,ఏమిటంటే వాళ్ళ జాతికి "వీరులు" అన్న గౌరవం, ఒక పెద్ద దేశాన్ని వణికించామన్న త్రుప్తి,పది మందికి 166 ప్రాణాలు తీసామన్న పైశాచికానందం, ప్రంపంచస్తాయిలో ఉనికి నిరూపణ.బారతీయ న్యాయ స్తానాలను అవహేళన చెయ్యడం(కసబ్ చేసింది},
ప్రభుత్వం వైపు లాభ, నష్టాలు:- మంచి సమర్దులైన పోలిస్ ఆఫిసర్లను కోల్పోవడం,166 మంది ప్రజలను కోల్పోవడం,నాలుగేండ్లు, విచారణ పేరుతో సుమారు ముప్పయి కోట్ల రూపాయలు ఖర్చు కావడం, అయితే ఇక లాభం ఒకటే "ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించారు అని, దీనివెనుక "పాకిస్తాన్ వుంది" అనేది. ప్రపంచానికి చాటడం
ఏదైనా తీవ్రవాదానికి, తీవ్రవాదమే కరెఖ్టేమోఅనిపిస్తుంది. వాడిని ఆరోజే ఖతం చేసి, ఉగ్రవాద తండాల మీద అమెరికా తరహాలో దెబ్బతీస్తే దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉండెవి.మన ప్రజలు శాంతమూర్తులు కాని మనదేవుళ్లు శాంతి మూర్తిత్వత్వం చెప్పలేదు. కరూణామయుడిని ఆరాదించే వాళ్లే శత్రు వినాశనం కొరకు అన్ని విదాల హింసను అమలు చేస్తుంటే మనకేమిటి ఈ దిక్కుమాలినతనం? కాబట్టి కసబ్ వాదానికి’ "కల్కి వాదమే" కరెక్ట్ అయినది, మరియు చవకైనది.
Tuesday, November 20, 2012
మీ పేరుకి"తామర(కమలం) పుష్పం" కి ఏమైనా సంబందం ఉందా? అయితే మీరే "కల్కి" కావచ్చు.
"రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా" |
మీ పేరు "తామర పువ్వు" సంబందం ఉన్న పేర్లు అంటే "కమల,కమల్ కుమార్,పంకజ్,పంకజం,అరుణ కుమార్,అరుణకుమారి,సూర్య,సూర్య కుమారి,అరుణోదయ,పద్మ,పద్మ కుమార్, ఈ విదంగా తామరకు కాని దాని వికాసానికి కారకు డైన సూర్యుడి పేరుతో కాని సంబందంఉంతే మీరే కల్కి కావచ్చు.మీ జాఅతక చక్రం లో నేను రాబోవు టపాలలో చెప్పే విదంగా గ్రహ,రాశులు ఉంటే తప్పనిసరిగా మీరే మేమంతా ఎదురుచూసే "కల్కి" అవతార పురుషుడు (స్త్రీ కూడా కావచ్చు.).మరి ఈ బ్లాగును డిసెంబెర్ 21 దాక చూస్తుండంది. ఒక వేళా మీరే అని రుజువైతే మా ఓట్లన్ని మీకే.
ఇదంతా ఏమిటంటే"కల్కి" అనే పదానికున్న అర్థం!. "కల్క" అంటే "బురద".కల్కి అంటే "బురద లోనుంచి జన్మించినది "కమలం" లేక తామర పువ్వు.మీకు ఘంటసాల గారి పాటొకటి గుర్తుందా?"రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా" అని. అదన్నమాట.సూర్యుడికి కమలానికి లంకె,ఇలా సూర్య కిరణాలు వల్ల వికసితమైన కమలం లాగా సూర్యుడివల్ల "కల్కి" శక్తి ఉద్వమవుతుందా? లేక ఆయన లేకఆమే పేరులోనే పై విదంగా ఉంటాయా? అన్నది తరవాతి తపాలలో తెలుసు కుందాం.
"లోటస్ మహల్" గురించి తెలుసుకోవాలంటే ఈ లంకె మీద క్లిక్ చెయ్యగలరు http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7331.html
వీక్షకులకు మనవి:- నేను ఈ టపాలో "సర్వే పోల్" ఒకటి పెట్టడం జరిగింది.మీ ఓటు ద్వారా అభిప్రాయం చెప్ప గలరు.ఇది సీక్రెట్ ఓటింగే.
మనకు మంచి పాలన ఇవ్వగల నాయకుడెవరో చెప్పగలరా?
మేదావుల,చదువుకున్న వారి, ఆలోచనలు సామాన్యుల కంటే మెరుగా ఉంటాయి అనే ఉద్దేస్యంతో ఈ బ్లాగులో ఒక" సర్వె పోల్ "పెట్టడం జరిగింది.ఇది మాములుదే అనుకోకుండా తప్పకుండా మీ అభిప్రాయం ఓటు ద్వార తెలుపుతారని ఆశిస్తూ..........యుగాంతం
Monday, November 19, 2012
"యుగాంతం" అంటే నవ్వులాట కాదు,"ప్రళయం" అంటే పరాచికం కాదు
"ఇదే మహా విజ్ణానులు మయన్ల కాలెండర్", |
ప్రళయానికి, యుగాంతానికి తేడా తెలియని వారు,ఇంగ్లిష్ సినిమా చూసి యుగాంతం అంటే ఇలా ఉంటుందా అని గజ గజ వణికే వారికి ఒక శుభ వార్త .రాక్షస బల్లుల్లా మనం తుడిచి పెట్టుకు పోయే ప్రళయం" మాత్రం ఇప్పుడే రాదు లెండి. దానికి ఎవ్వరయినా గ్యారంటి ఇవ్వవచ్చు.
ఎందుకంటె,జీవ పరీణామం ఒక క్రమం లో అభివ్రుద్ది చెందినప్పట్టికి దాని అంతం అలాగే ఉండాలని రూలేమి లేదు.దీనికి ఉదాహరణ"రాక్షస బల్లులే".ఇది ఆస్తికులు చెప్పిందికాదు "నాస్తికులు" చెప్పిందే.
ఈ మద్యకొంత మంది "యుగాంతం వాయిదా" అని ఫేస్ బుక్ లో పెట్టారు.అది చూస్తే నాకు కొంచెం జాలి వేసింది.యుగాంతం అన్నది ఒక కాలగణితం ఆదారంగాచెప్పే మాట."ప్రళయానికి దానికి సంబందం లేదు."మయన్లు" కాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వచ్చే నెల 21 వ తారీకున "యుగాంతమే".ఇందులో నవ్వుకోవల్సినది ఏముందో అర్థం కావటం లేదు.
వారి కాలెండర్ ప్రకారం ఆ రోజు తో వారి కాలెండర్ ఆపుచేసారు అంటే వారికి వారి లెఖ్క మీద ఎంత నమ్మక్కముందో దీనిని బట్టే తెలుస్తుంది.తిరిగి నూతన కాలేందర్ ఆవిష్కరించ బడుతుంది."మనం దీపావళి చేసుకోనంత మాత్రానా అమావాస్యే రాదు" అన్నట్టుంది కొంత మంది పద్దతి చూస్తుంటే.
కల్కి,వీరభోగ వసంతరాయులు,ఇవి బవిష్య వాణి.గణికుల శక్తి సామర్థ్యాలు బట్టి వారు పుట్టే తేదిలు ప్రాంతం అంచనాలు ఉండవచ్చు. 1999 లో ఏదొ వీరబోగ వసంత రాయలు పుడటాడని కొంతమంది రాసారు.అందులో "ఎక్కిరాల వేదవ్యాస్ గారు" ఒకరు.ఆయన జ్యోస్యాన్ని బౌద్ద గురువు "దలైలామా" గారే నమ్మినట్టుంది."శాంబవి"అనే బాల దేవతని ఇక్కడకు పంపించడంలో ఆంతర్యం అదే అనుకుంటా."సూర్య నందియందు ఉద్భవం అయ్యేను" అని బ్రహ్మం గారి కాలజ్ణానం వ్యాక్యల అదారంగానే "శాంభవి" ని సూర్య నందికి పంపారు. ఇది అంతా అంత గొప్ప బౌద్దగురువు నమ్మటం వలనే కదా! మనం అనుకున్నవి అనుకున్న రూపంలో జరగనంత మాత్రాన అసలు జరుగదనికాదు.మనంఅర్థం చేసుకోవడం లో తేడా! అంతే!
" కల్కి రాని రాకపోని,వీర భోగ వసంత రాయుడు పుట్టని పుట్టకపోని,ఈ బూమి మీద ఉన్న నాస్తికులు ఒక్క పెట్టున అడ్డం తిరిగినా "యుగాంతం" జరిగి తీరుంది. ఎందుకంటే అది "కాల చక్రం". దానిని ఆపడం ఎవరి వల్లాకాదు. అసలు మయన్లు ఎవరు? వారేమి చెప్పారు? అనేదాని మీద చాలాసమాచారం నెట్లో దొరుకుతుంది. ఆసక్తి ఉన్న వారు చూడ వచ్చు. తరవాటి టపాలలో నేను దాని గురించి చెప్పుకున్నాకే,మళ్లి "కల్కి" దగ్గరకు వెళదాం. ,
జడలు పెంచుకుని "చంద్రగిరి" వచ్చే,"జగన్నాయకులు" ఎవరు?
కాలజ్ణానం లో ఒక చోట "జడలు పెంచుకుని జగన్నాయకులు చంద్రగిరి చేర వచ్చేను" అని ఉంది. ఈ జగన్నాయకులు ఎవరు? జదలు పెంచుకుని రావడమేమిటి?అది కూడా చంద్రగిరికి రావడమేమిటీ? అనేది విశ్లేషిస్తే నాకు ఈవిదంగా అనిపించింది.
చంద్రబాబు గారు, ఒక వేళ చంద్రగిరి నుంచి పోటి చేస్తే అయన మీద పట్టు దలకు పోయి జగన్ గారు, కూడ అదే నియోజక వర్గం నుంచి పోటి చేస్తాడా? ఇక్కడ జడలు పెంచుకోవడం అంటే పట్టుదల పట్టడం అని అర్థం కావచ్చు. జగన్నాయకులు అంటే "జగన్" గారె
కావచ్చు. ఏదైనా ఆసక్తికర అంశమే కదా? మొత్తానికి రానున్న ఎన్నికలు బహు రంజుగా ఉంటాయ్యన్న మాట!
జగన్ గారికి "కల్కి" కి ఉన్న లింక్ ఏమిటో తెలియాలంటే ఈలంకే ను క్లిక్ చెయ్యాలిhttp://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_7331.html
బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!
http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_18.html
(పూర్తి టపాకోసం లంకె మీద క్లిక్ చెయ్యగలరు)
(పూర్తి టపాకోసం లంకె మీద క్లిక్ చెయ్యగలరు)
Sunday, November 18, 2012
బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!
ఏమిటి సామెతను మార్చేసాను అనుకుంటున్నారా!.అవును అనుబవం లో నుంచి పుట్టేవే సామెతలు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. జరిగితే ఆ దేవుడిని(దేవతని) మనం మర్చి పోతామని ఆయన భయం కాబోలు.
నేను చెప్పే ఈ సామెత మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి గురించే.నిజంగా ఆయన ఒకగొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పవచ్చు. ఆయన ఊహించిన విదంగా ఆయన అనుకున్న"అపరేషన్ ఆకర్ష్" కనుక విజయవంతమైతే,ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పరేషానే. 2014 కల్లా వందమంది కార్యకర్తల బలమున్న అన్ని పార్టీలలోని చోటా,మోటా నాయకులంతా "వై.యస్.ఆర్,జిందాబాద్" అనే వాళ్లు.రాహుల్ గాందికి మద్దతిచ్చే అంశంతో ఇక్కడ ఎదురులేని రారాజుగా మన రెడ్డి గారు తెలుగు నేలను మరొక 2౦ సంవత్సరాలు ఏకదాటిగా పాలించే వారు.ఇది ఆయన బుద్ది బలం.కాని ఏమి జరిగింది చివరకు?
భగవంతుడి ఆలోచన వేరుగా ఉంది. తెలుగు నేల మీద ఏదో ఒక కొత్త శక్తి రావాలనో,లేక రోశయ్య,కిరన్ కుమార్ రెడ్డి గార్ల జాతక చక్రంలో ముఖ్య మంత్రి యోగం ఉండటం వలనో,అయన మార్గంలోకి "పావురాల గుట్ట"ను(రాజశేఖర్ రెడ్డిగారు ప్రమాదానికి గురి అయిన హెలికాప్టర్ ను డీ కొట్టింది "పావురాల గుట్ట" యే’) అడ్డంగా పెట్టాడు.కనిసం అయన కొడుకునైనా వెంటనే సింహాసనం మీద కూర్చో బెట్టాడ అంటే అదీ లెదు తీసుకెళ్లి జైలులో కూర్చో బెట్టాడు. పాపం ఇంటిల్లి పాదిని,ఎప్పుడు ఎండ ముఖం ఎరుగని పిల్లల్ని ఎండలో త్రిప్పి హింసిస్తున్నాడు. ఇదీ ఆయన రాత!అసలు ఆ భగవంతుడి ఉద్దేశ్యం ఏమిటి? కాలం మాత్రమె సమాదానం చెప్పగలదు.మనం ఊహించినా వేస్టే.ఎందుకంటే మన ఊహకందనివే కదా దైవ లీలలు!.
Saturday, November 17, 2012
వారేవ్వా! ముస్లిమ్ లు కూడ "కల్కి పురాణం" నమ్ముతున్నారు!
http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_982.html
(పూర్తి టపా కోసం లంకే మీద క్లిక్ చెయ్యండి)
(పూర్తి టపా కోసం లంకే మీద క్లిక్ చెయ్యండి)
Subscribe to:
Posts (Atom)