Thursday, January 30, 2014

సురభి కళాకారులను మించి పోయిన తెలుగు M.L.A లు మంత్రులు !

                                                         


అనుకున్నది అయింది ! ముక్య మంత్రి గారు లాస్ట్ బాల్ ప్రయోగించారు .  దెబ్బతో ఆట  పూర్తీ కాకుండానే  మాచ్ డిక్లేర్ అయింది . అసెంబ్లీలో తాము గెలిచామని సిమాoద్రా నాయకులు సంబరపడుతుంటే , ఇక్కడి పలితం నామ మాత్రం కాబట్టి , పార్లమెంటులో అసలైన విజయం తమదే నని తెలంగాణా వాదులు అంటున్నారు . కాబట్టి తెలంగాణా ప్రజలు అవేశా లకు లోను కాకుండా సంయమనం పాటించాలని హితవు చెపుతున్నారు . కాని అసలు మాచ్  కు ముందే మాచ్  పిక్స్ అయిందన్న సంగతిని ఎవరూ చెప్పరు . ఎందుకంటే రానున్న ఎన్నికల్లో వారెవరూ ప్రజలు ముందు జిరోలుగా నిలబడటానికి సిద్దంగా లేరు .

  ఇక అసలు మాచ్ పిక్సింగ్  సూత్రదారులైన  కేంద్రo  లోని పెద్దలు రాష్ట్ర విభజన విషయంలో తాము ఎంతో తొందరతో ఉన్నట్లు తెలంగాణా ప్రజలు అనుకోవాలని , అనుకూల మీడియా వర్గాలతో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు షెడ్యూల్ ప్రకటించారు . ఎట్టి  పరిస్తితుల్లో పిబ్రవరి 21 కి రెండు రాష్ట్రాలు గ్యారంటి అంటున్నారు . కాని కిరణ్ కుమార్ గారికి  సుప్రీం కోర్టు కు వెళ్ళే బంగారం లాంటి చాన్స్ ను తామే కావాలని ఇచ్చినట్లు ప్రజలకు చెప్పరు  గాక చెప్పరు ! ఎo దుకంటే రేపు సిమాంద్రాలో  తమ కు దిక్కు కిరణ్ గారే కాబట్టి .

  మొన్నట్టి  దాక ఒరిజినల్  బిల్ అన్న కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ వారు చివరి దశలో తాము రాష్ట్ర పతికి పంపింది ముసాయిదా బిల్ మాత్రమె అని చెప్పడంలో ఉన్న పరమార్దం ఏమిటి ? అది మాచ్  పిక్సింగ్ లో బాగం కాదా ?

సాంప్రాదాయం  ప్రకారం అయితే ముసాయిదా బిల్ , రాజ్యంగ ప్రకారం అయితే ఒరిజినల్ బిల్ పంపాలని కేంద్ర ప్రబుత్వ పెద్దలకు తెలియదా? తెలియదని ప్రజల్ని నమ్మ మంటారా? రాజ్యాంగం ప్రకారం ఒరిజినల్ బిల్ ని సమగ్రం గా  తయారు చేసి రాష్ట్ర అసెంబ్లీకి  పంపించాలి . అదే ఇతర రాష్ట్రాల విబజన విషయాలలో మాదిరి సాంప్రాదాయ  విదానం అయితే ముసాయిదా బిల్ పంపితే సరిపోతుంది . ఎందుకంటే సంప్రాదాయ విదానంలో రాష్ట్ర అసెంబ్లీ విబజన చేయమని తీర్మానించాకే  విబజన ప్రాసెస్ మొదలు అవుతుంది . అలానే చేద్దామని కేంద్రం వారు మొదట్లో అనుకున్నారు . అప్పుడు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి కాబట్టి అసెంబ్లీ నుండే ప్రాసెస్ మొదలు పెట్టొచ్చు అనుకున్నారు.అలా చేస్తే తెలంగాణలో T.R.S తోనూ , సిమామ్ద్రాలొ లో జగన్ తోను పొత్తుపెట్టుకుని ప్రతి పక్షాలను దుంప నాశనం చెయొచు అనుకున్నారు కాని సిమాన్ద్రా ప్రజలు కాంగ్రెస్ వారి మిద తీవ్రంగా ఎదురు తిరగడంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక , చివరకు సిమాంద్రా  వారితో మాచ్ పిక్సింగ్ చేసుకుని కిరణ్ గారిని కెప్టైన్ గా బరిలోకి దించే కండిషన్ మిద గేమ్ మొదలు పెట్టారు . అందులో బాగమే ముక్య మంత్రి గారు ఈ  రోజు అసెంబ్లీలో బిల్ ని తిరస్కరించి "జై సమైక్యామ్ద్రా " అంటూ అసెంబ్లీలో నినాదాలు చేస్తూ బయటకు రావడం .

  ఇక ఈ  డ్రామా లోని రెండవ అంకం డిల్లీలో జరగ బోతుంది . అక్కడా అంతే ! సిమంద్రా ..M.P లు సబను సాగ బోనివ్వమంటూ విర పద్యాలు పాడుతుంటే ప్రబుత్వం  తమ కర్తవ్యంలో బాగంగా , ఎన్ని అడ్డంకులు  ఎదురయినా పార్లమెంటులో బిల్ పాసవ్వడానికి నానా ప్రయాస పడుతున్నట్లు యాక్షన్ చేస్తుంది . ఈ  లోపు సుప్రీం కోర్టు వారు  జ్యొక్యమ్ చేసుకుంటారు . తాము ఎంత చిత్త  శుద్దితో ఉన్నప్పటికీ కిరణ్ గారి వాళ్ళ అది సాద్యం కాలేదని చెపితే తెలంగాణా ప్రజలు నిజమే అని నమ్మి కనీసం 5 సీట్లు అయినా గెలిపిస్తారని , అలాగే తాము హిరోను చేసిన కిరణ్ గారు సిమామ్ద్రాలొ స్వీప్  చేసినా లేక అత్యదిక సీట్లు సాదిమ్చినా అవి తమకు మాత్రమే ఉపయోగ పడతాయని అధికార పార్టి వారి బావన . అందుకే కిరణ్ గారికి కోర్టు తలుపు లు తట్టే టెక్నికల్ అవకాసం కల్పించారు అనేది స్పష్టం అవుతుంది .

  కాబట్టి తెలుగు ప్రజలారా ఇంకా 4 నెలలు దాకా మనందరికీ ఉచిత డ్రామా ప్రదర్సనలు ఉండబోతున్నాయి అన్న మాట . మొత్తానికి తెలుగు  M.L.A లు మంత్రులు సురభి కళాకారులను మించి పోయారని పిస్తుంది . ,

Monday, January 27, 2014

ఒక్క రాత్రిలో ప్రజా నాయకుడు కి కావాల్సిన అర్హత సంపాదించా నంటున్న "తనిష్క్ జ్యయలరి" దొంగ !

                                                        


అయన పేరు కిరణ్ . ఊరు గుంటూరు జిల్లాలోని ఈపూరు. అయనకి సమాజ సేవ చేయాలన్న తపన ఎక్కువట. అ ఉద్దేశ్యంతోనే తమ గ్రామ సర్పంచిగా పోటి చేద్దామని తన ఆలోచన ఊరి వారికి చెపితే ఊల్లో వారందరూ నవ్వి ఇతనిని పిచ్చోడి క్రింద జమ కట్టారట. దానితో మనస్తాపం చెందిన అతను హైద్రబాద్ కి వచ్చేసి తనంటే ఏమిటో సమజానికి చెప్పాలనుకున్నాడు. కొన్నాళ్ళు బాగా ఆలోచించి నట్లుంది " ప్రజా నాయకుడు" కావాలంటే కావాల్సిన  ప్రాదమిక అర్హత ఏమిటా అని. అలా ఆలోచించగా , ఆలోచించగా ఒక రోజు బుద్దుడికి జ్ణానోదయం అయినట్లు అతనికి జ్ణనోదయం అయింది. ప్రజాసేవకుడు కావాలంటే కోట్లు కొల్లగొట్టగలిగిన గుండె దైర్యం కావాలని అతనికి కలిగిన జ్ణానోదయం. అందుకు తాను సమర్దుడా , కాదా అని చిన్న పరీక్ష తనకు తానే పెట్టుకుని అందులో ఘన విజయం సాదించాడు . ఆ తర్వాత తాను చేసిన పని ద్వారా తనకు ప్రజానాయకుడు అయ్యే అర్హత వచ్చిందని , కాబట్టి తాను చేసిన పనిని బట్టి అయినా తన సమర్దతను గమనించి తనకు "లీడర్" పొస్ట్ ఇవ్వాలని తెలుగు ప్రజలకు సంచలన టి.వీ. ద్వారా విజ్ణప్తి చేస్తున్నాడు.

 ఇంతకీ కి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? హైద్రాబాద్ లోని పేరెన్నిక గన్న బంగారం షాప్ లలో ఒకటైనా "తనిష్క్ జ్యూవలరీస్ షాప్" లో అర్ద రాత్రి కన్నం వేసి కోట్లు విలువ చేసే బంగారం దొంగతనం చేసాడు. దీనిని  పోలిస్ వారు అంతర్ రాష్త్రీయ దొంగల ముఠా  పని అయి ఉంటుందని చెప్పి, పోలిస్ వారిని బ్రుందాలుగా ఏర్పాటు చేసి వెతకడం  ప్రారంబించారు. మూడు రోజుల తర్వాత సదరు ప్రజాసేవక అభిలాషి కిరణ్  గారు టి.వి.9 చానల్ వారి దగ్గరకు వెళ్ళి తనేలా  ఆ  దొంగతనo  చేసింది, సొము ఎక్కడున్నది పూస గుచ్చినట్లు వివరించారు. దానితో ఎగిరి గంతేసిన సదరు చానల్ వారు "తనిష్క దొంగ మా ముందు సరెండర్ అయ్యాడు. అతనిని పట్టి ఇవ్వడానికి మేమె కారణం" అని ఈ రోజు పొద్దున్నుంచి తమ ఛానల్ లో ఒకటే ఊదరగొట్టడం మొదలు పెట్టారు. అంటే "సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది" అన్నట్లు తను కష్టపడి చేసిన చోరి గురించి, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి ప్రజలకు చెపుతారని ముందుగా ఫొలిసుల వద్దకు వెళ్ళకుండా టి.వి. 9 వారి వద్దకు వస్తే, దొంగను పట్టించిన ఘనత తమదిగా ప్రసారమo  చేసుకుంటున్నారు.అప్ కోర్స్, దానికి ప్రతి పలంగా దొంగ గారి సద్దుదేశ్యాన్ని గూర్చి కూడా ప్రసారం చేస్తున్నారు అనుకోండి . చివరకు పోలిసులు సరెండర్ అయిన వాడిని అరెస్ట్ చేసి టి.వి9 వారికి క్రుతజ్ణతలు చెప్పారు. 

   మొత్తానికి తన అర్హత నిరూపించుకుని ప్రజల అభిమానం పొంది ప్రజా సేవకుడు కావాలనుకుంటున్న "కిరణ్ ది తీప్" గారిని గుర్తించి ఏ రాజకీయ పార్టీ సీటు ఇస్తుందో వేచి చూడాలి. ఇప్పటికైనా ఈపూరు గ్రామ ప్రజలు అతనిలోని సమర్దతను గుర్తించి , తమ నాయకుడు గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఊరి పేరు అంద్రప్రదేశ్ మొత్తం తెలిసిందంటే కిరణ్ చేసిన ప్రయోగమే కద! ఇంత కంటే సమర్దత ఉన్న నాయకుడు వారికి దొరకడం కష్టమే మరి! జై ప్రజా నాయకా!   దిని గురించి మరిన్ని వివరాలకు క్రింది విడియో చూడండి .   


           

         

Friday, January 17, 2014

ముంబాయి డాన్సర్ "రేప్" కేసు కున్న ప్రాదాన్యత, మచిలీపట్టణం ఇంజనీర్ అనూహ్య మర్డర్ కేసుకు లేదా ?

                                                             


 లేదనే అనిపిస్తుంది , ముంబాయి పోలిసుల తీరు  చూస్తుంటే . ఇక విషయానికి వస్తే , మొన్నీ  మద్య ,హైదరాబాద్ లో జనవరి 1 వేడుకల్లో డాన్స్ చెయ్యడానికని ముంబాయికి చెందిన డాన్సర్ ఒకామె హైదరాబాద్ కి వచ్చింది . ఆమెను ఎయిర్పోర్టులో పికప్ చేసుకోవడానికి వచ్చిన వారు ఆమెకు మత్తు  మందు ఇచ్చి , దూరంగా ఎక్కడి కో  తీసుకు వెళ్లి, ఆమె మిద సామూహిక అత్యాచారం జరపి , ఆమె దగ్గరున్నది దోచుకుని , అ తర్వాత ఆమెను ముంబాయి బస్ ఎక్కించారట . ఆమె కూడా మత్తులో ఉండటం వలన ఇవేవి గమనించక ఇంటికి పోయి చూసుకున్న తర్వాత గాని తనకు జరిగిన అన్యాయం అర్ధం కాలేదట . అక్కడి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే వారు పట్టించుకో పోయేసరికి , తనకున్న ఇన్ప్లూయన్స్ తో ఒక సామాజిక సంస్ట  ద్వారా  ముంబాయి పోలీసులను కదిలించి , వారిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చి , ఇక్కడి పోలీసులను కదిలిస్తే , అప్పటికప్పుడు 4 స్పెషల్ టీంలు  ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని కట కటాల  వెనుకకు నెట్టారు . ఈ  కేసు గురించి పోలిస్ అధికార్లు ఎంత శ్రద్ద తీసుకున్నారో పోలిస్ అధికారుల మాటల్లోనే ఈ విడియో  ద్వారా తెలుస్తుంది . ఇందుకు హైదరాబాద్ పోలిస్ వారిని అభినందించి తీరవలసిందే !


                                               

  అయితే ఇక్కడొక ప్రశ్న  ఏమిటంటే , ముంబాయికి చెందిన అమ్మాయి రెప కేసు గురించి హైదరాబాద్ పోలీసులు చూపించిన శ్రద్ద లో , మచిలీ పట్నానికి  చెందిన తెలుగు ఇంజనీర్ అనూహ్య ఘోరంగా మొన్న తగులపెట్టబడి శవంగా ముంబాయి సమీపంలో దొరికితే , ఆ  కేసు మిద ముంబాయి పోలీసులు వందవ  వంతైనా చూపించారా అని ?
  ఈ  కేసు వివరాలు లోకి వెళితే , మచిలీ పట్నానికి  చెందిన అమ్మాయి అనూహ్య ముంబాయి లో ఇంజనీర్ గా ఉద్యోగం  చేస్తుంది . క్రిష్టమస్ సెలవులకు ఇంటికి వచ్చిన అనూహ్య ,పండగ తర్వాత ముంబాయి వెళ్ళింది . కాని ఆమె ముంబాయి చేరినట్లు సమాచారం ఆమె తండ్రికి రాలెదు. అ రోజు నుంచి ఆమె ఏమైందో అర్ధం కాలెదు. దానితో విజయవాడ రైల్వే పోలిస్ స్టేషన్ లో ఆమె తండ్రి పిర్యాదు చేస్తే , మిస్సింగ్ కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు కేసును ముంబాయి పోలీసులకు బదిలీ చేసారు . కానీ అక్కడి పోలీసులు ఈ  కేసును ఎ మాత్రం పట్టించుకోక పోవడం తో , అమ్మాయి తాలూకు వారె ఒక టీం  గా ముంబాయి వెళ్లి అక్కడి స్తానికుల సహకారం తో గాలింపు చేపట్టారు . చివరగా వారికి ఒక చోట తగుల పెట్టబడి కంపు కొడుతున్న స్తితిలో , అనూహ్య శవం  కనిపించగా , ఆ  సమాచారాన్ని తండ్రికి చెపితే అయన ముంబాయి వెళ్లి, దారుణంగా హత్య చేయబడిన తన కూతురు ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు . కాని ఈ విషయం  లో ముంబాయి పోలీసులు ఎ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తుమ్ది..  దిని మిద అమ్మాయి తాలూకు వారి బాదను క్రింది విడియో లో చూడండి . కాబట్టి దిని వలన అర్దమయ్యేది ఒకటే , ముంబాయి డాన్సర్ గారికి ఉన్న ఇంప్లూయన్స్  ఆంద్రా  అమ్మాయి తల్లి తండ్రులకు లెదు. ఉంటే ఇంత నిమకు నిరెత్తినత్లు ఉంటారా పోలీసులు ?
ముంబాయి అయినా , హైదరాబాద్ అయిన అందరూ ఇండియన్ పోలీసులే . మరి డాన్సర్ గారి విషయంలో చూపిన శ్రద్ద , అబాగ్య ఇంజనీర్ విషయం లో ఎందుకు చూపించడం లేదు? ఈ  విషయం లో తెలుగు వారు అంతా అనూహ్య తల్లి తండ్రులకు సంగి బావం తో కూడిన సంతాపం తెలుపాల్సిన   అవసరం ఉంది . దానిలో బాగంగానే అనూహ్య తల్లి తండ్రులకు కల్కి ఖడ్గం బ్లాగర్ గా నా సంఘీ బావం ను మరియు సంతాపం ని తెలియ చేస్తున్నాను.      

        

                   

Wednesday, January 8, 2014

పాపం! అమాయకుడైన "ఉదయ కిరణ్" ఉసురు పోసుకోవడానికి మీకు మనసెలా ఒప్పింది?

                                                               

  నేను నిన్న ఉదయి కిరణ్   మరణ ఉదంతం గురించి "P.V నరసింహా రావుగారి మరణం ని గుర్తుకు తెచ్చిన "ఉదయి కిరణ్ " ఉదంతం!." అనే  టపా పెట్టడం జరిగింది. అందులో " సినిమా మెగా దేవుడుకు పనికి రాని  వారెవరైనా సరే వారికి అన్ని రకాల అవకాశాలు కోల్పోవాల్సిందే. దీని గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టాన దేవుళ్ళు అంతరంగం ఎరిగి మసలుకునే వారు సినిమా రంగం నిండా ఉన్నారు. ఆ విదంగా ఉదయి కిరణ్ సినిమా రంగం నుండి వెలివేయబడ్డాడు . అదే అతని జీవితం ని నిరాశమయంగా మార్చి వేసింది. క్రమంగా దెప్రెషన్ లోకి వెళ్ళిన ఆత ను చివరకు బలవన్మరణానికి గురిఅయ్యాడు. ఇది చాలా విషాదకరం." అని చెప్పటం   జరిగింది. దానికి రుజువుగా ఈ  రోజు ఒక  న్యూస్ ఐటం చూడడం జరిగింది. అదే పైనున్న చిత్రం

.    ఇక పోతే ఉదయి కిరణ్ కి చిరంజీవి గారు అంటే  అభిమానమో "ఇంద్ర" పంక్షన్ లో ఉదయి మాట్లాడిన  తెలియ చేస్తుంది. ఇంతటి అభిమానాన్ని చూపించిన ఇటువంటి అమాయకుడి మీదనా వీరు పగ బట్టి నట్లు వెంటాడి అతనికి అవకాశాలు రాకుండా చేసింది! పాపం ఉదయి కిరణ్ ! ఎన్ని  బాదలు  పడ్డావయా! నీ  ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్దిస్తున్నాను .

  ఏది ఏమైనా , నిజానిజాలు ఎలా ఉన్నా  ఒకటి మాత్రం నిజం . అమాయకుల ఉసురు పాశుపతాస్త్రం కంటే పవర్ పుల్ . అతని పతనానికి కారకులైన వారు ఎంత గొప్పవారైనా సరే , ఆ ఉసురు కు ఊడ్చుకుపోవటం ఖాయం! ఉదయ కిరణ్ అభిమాన్నాన్ని  క్రింది వీడియోలో చూడండి. అలాగే నిన్నటి టపాను ఈ  లింక్ ను క్లిక్  చూడవచ్చు . http://kalkiavataar.blogspot.in/2014/01/pv.html         
    

                       

Monday, January 6, 2014

P.V నరసింహా రావుగారి మరణం ని గుర్తుకు తెచ్చిన "ఉదయి కిరణ్ " ఉదంతం!.

                                                          
                                                      

ఈ  దేశంలో ఆ రంగం ఈరంగం అని కాక అన్ని రంగాలు కొంతమంది గుత్తాదిపత్యం లోనే ఉన్నయి. ఆ గుత్తాదిపతుల ను కాదంటే ఎలాంటి పరిస్తితి దాపురస్తుందో మొన్న బలవన్మరణానికి గురయిన ఉదయి కిరణ్ ఉదంతమే చక్కని ఉదాహరణ. అయినా మన పిచ్చి కానీ పవర్ ఉన్న ఒక విదేశి కోడలును దిక్కరించినందుకే సాక్షాత్తు ఈ  దేశ    మాజీ ప్రదాని గారి శవంని  కుక్కలు కు అప్ప చెప్పిన   దౌర్బాగ్యపు రాజకీయ జాతి ఉన్న దేశం లో ఆప్ట్రాల్ ఒక చలన చిత్ర నటుడు ఎంత?

       ఉదయి కిరణ్ చేసింది ఒకటే తప్పు. చలన చిత్ర రంగం ని ఏలుతున్నా రారాజుల కుటుంబం తో సంబందం కలుపుకుందామను కోవడం. అదెందుకు బెడిసి కొట్టిందో తెలియదు. కాని అది ఉదయి కిరణ్ కెరీర్ నే దారుణంగా దెబ్బ తీసింది. సినిమా మెగా దేవుడుకు పనికి రాని  వారెవరైనా సరే వారికి అన్ని రకాల అవకాశాలు కోల్పోవాల్సిందే. దీని గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టాన దేవుళ్ళు అంతరంగం ఎరిగి మసలుకునే వారు సినిమా రంగం నిండా ఉన్నారు. ఆ విదంగా ఉదయి కిరణ్ సినిమా రంగం నుండి వెలివేయబడ్డాడు . అదే అతని జీవితం ని నిరాశమయంగా మార్చి వేసింది. క్రమంగా దెప్రెషన్ లోకి వెళ్ళిన ఆత ను చివరకు బలవన్మరణానికి గురిఅయ్యాడు. ఇది చాలా విషాదకరం.

   సినిమా రంగం అంత చంచల మైనది మరొకటి లేదు అనటం లో అతి శయోక్తి లేదు. ఆ రంగం లో  మూడు హిట్ లు కొడితే సూపర్ స్టార్ కి ఎదిగినోడు , రెండు వరుస ప్లాప్ లు ఎదురైతే అదో పాతాళానికి లెవెల్ కి నెట్టి వేయబడతాడు. . అందుకే దానంత అబద్రతా రంగం మరొకటి లేదు. ఉదయి కిరణ్ స్వబావం ఆ రంగానికి సరిపోయేది కాదేమో అనిపిస్తుంది. "హిట్టయితే నా మాయా , పట్ అయితే దేవుడి మాయా" అనుకునే వాడే ఈ  చంచలన రంగం లో జీవించగలడు. ముఖ్యంగా గాడ్ పాదర్ ల అండ లేనిదే నిల దొక్కుకోవడం కష్టం. ఎందుకంటే ఆ గాడ్ పాదర్ల మర్కట వారసత్వం పది కాలాల పాటు చలన చిత్ర రంగంలో వర్దిల్లాలి అంటే అంతకంటే ముక్కు , ముఖం బాగున్న వాడు , నటనా కౌశల్యం ఉన్నవారు హీరోలుగా ప్రమోట్ కావడానికి వీలు లేదు. ఇవేవి తెలియని ఉదయికిరణ్ అమాయకంగా అందరిని నమ్మి ఆహుతైపోయాడు.

      పాపం ,అతని దౌర్బాగ్యం ఏమిటంటే , ఆతను డిప్రెషన్ కి గురి అయిన వేళ తోడుగా నేనున్నాను అని ఓదార్పు నివ్వగలిగిన కుటుంభ సబ్యులు కూడా లేకపోవడం. ఈ  విషయం అతని అంత్య క్రియల విషయం లో అతని తండ్రి , బార్యా ప్రదర్శిస్తున్న ప్రవర్తన తెలియ చేస్తుంది. మీడియాలో వస్తున్న విమర్శలకు తట్టుకోలేక పిలిం చాంబర్ వారు పట్టించుకుని అతని అంత్య క్రియలకు పూనుకోవడం కొంత ఊరట. ఏది ఏమైనా ఉదయకి రణ్ లాంటి సున్నిత మనస్కులకు చలన చిత్ర రంగం ఒక పెద్ద ఊభి  లాంటిది అని ఈ  ఉదంతం తెలియ చేస్తుంది. అంతే కాదు కుటుంబం లో నయినా సరే సబ్యుల మద్య ప్రేమాభిమానాలు లేక పోతే ఏకాకి జీవితమే తప్పా ,మిగిలేది ఏమి ఉండదు అని అనిపిస్తుంది.

Saturday, January 4, 2014

సూర్య సావర్ణిక మన్వంతరం మొదలయిందా ?!









 హిందూ పురాణాల ప్రకారం కాలాన్ని  14 మన్వంతరాలు గా విభజించారు. అందులో ప్రస్తుతం 7 వ మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరం నడుస్తుందని చెపుతారు. కొంతమంది పండితుల లెక్కల ప్రకారం వైవస్వత మన్వంతరం పోయి 8వది  అయిన సూర్య సావర్ణిక మన్వంతరం రావడానికి ఇంకా కొన్నీ వేల యేండ్లు  పడుతుందని చెపుతూ ,సంకల్పంలో వైవస్వత మన్వంతరాన్నే ప్రస్తావిస్తున్నారు. కాని నాకైతే ఒక గట్టి నమకం ఏమిటంటే వైవస్వత మన్వంతరం వెళ్లి పోయి ఆల్రడీ సూర్య సావర్ణిక మన్వంతరం వచ్చేసిందని. ఇలా అనిపించడానికి గల కారణం  ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచం లోని కొన్ని దేశాలతో పాటు భారత దేశం లోని ప్రజలు తమ నిత్య అవసరాలకు అవసరమైన విద్యుత్ శక్తిని ఆ ప్రత్యక్ష బగవానుడు అయిన సూర్య భగవానుడి నుండి  పోందుతుండటడమే. అంతే కాకఇప్పిడిప్పుడే ఇండియాలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు , గుజరాత్ లో నరెంద్రమోడి గారు సోలార్ పవర్ ద్వారా సాదిస్తున్న అనేక విజయాలు చూసి , ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తాము సౌర శక్తి ఉత్పాదన దిశగా అడుగులు వెయ్యడం ప్రారంబించాయి.

   గుజరాత్ లో నరేంద్ర మోడి గారి విజన్ లో ప్రత్యేకం గా చెప్పుకో తగ్గది "కెనాల్ టాప్ సోలార్ ప్లాంట్" . ఈ  తరహ ఆలోచన తో కూడిన సౌర విద్యుత్ శక్తి ప్లాంట్ నిర్మించడం ప్రపంచం లో ఇదే మొదటిది. ఇది ఎలా నిర్మిస్తున్నారు అంటే , సాదారణంగా పంట పోలాలకు నీళ్ళను అందించే కాలువల మీద సోలార్ పలకలను బిగిస్తారు. అలా ఎరపరచిన సోలార్ పలకలు సూర్య కిరణాలను గ్రహించి వాటిని విద్యుత్ శక్తి గా మార్చి దగ్గరలో ఉన్న ఎలక్టికల్ గ్రిడ్ లకు సరపరా చేస్తే అక్కడ నుంచి ప్రజల అవసరాలకు సరపరా చేయబడుతుంది. దీని వలన రెండు లాబాలు ఉన్నాయి. (1). సౌర విద్యుత్ శక్తి ఉత్పాదనకు ముఖ్య ఆటంకం భూమి కొరత. దీని కోసం  పంట పొలాలను లేక ఖరీదైన భూములను సేకరించడం ప్రభుత్వానికి ఇబ్బంది . దానిని కెనాల్ టాప్ విదానం అదిగమిస్తుంది. కాలువల పైన కాబట్టి అదనంగా భూమి సేకరించకుండనే కాళీగా ఉన్న కాలువల పై బాగాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి చాల ఖర్చు తగ్గుతుంది. (2). కాలువల పైన సౌర విద్యుత్ పలకలు ఉండబట్టి కాలువలలో ప్రవహించే నీరు ఆవిరి కావడమనేది ఉండదు. కావున బోల్డంతా నీరు అదా అవుతుంది. ఈ  కారణం చేతనే గుజరాత్ ప్రభుత్వం యొక్క దూర దృష్టి ప్రపంచ దేశాల మన్నన పొందుతుంది .

  అంతే కాకుండా కేంద్ర సర్కార్ వారు సైతం రూప్ టాప్ అంటే ఇండ్ల మీద సైతం సౌర పలకలు అమర్చుకుని విద్యుత్ ఉత్పత్తి  చేసి  ఇంటి అవసరాలకే కాక, మిగులు విద్యుత్ ని విద్యుత్ సంస్తలు కొనుగోలు చేసే వీలుగా రెగులేషన్ లు పాస్ చెయ్యడం జరిగింది. దీని వలన లబ్ది దారులకు పరికరాల కొనుగోలులో ప్రత్యక్షంగా 50% రాయితీ లభించడమే కాక , అనుమతులు పొందడం సరళ తరం అయింది. వీటన్నింటికి కారణం ఈ రంగంలో ముందడడుగు వేసి   ఇండియాలో విజయం సాదించిన గుజరాత్ ప్రభుత్వం దాని రద సారది నరేంద్ర మోడి గారి స్పూర్తి అని చెప్పక తప్పదు. మన ఆంద్ర ప్రదేశ్ కూడా  ఈ   దిశగా  క్రుషి చేస్తే అనూహ్య అభివృద్దిని సాదించడం ఖాయం. ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం నడుస్తుంది " సూర్య శక్తి మన్వంతరం " అంటే అదే సూర్య సావర్ణిక మన్వ తరం, అవునా కాదా!  

    గుజరాత్ లోని కెనాల్ టాప్ సోలార్ ప్రాజెక్టు విశేషాల కోసం ఈ  క్రింది విడియో ను చూడండి                           


                  
                        

Wednesday, January 1, 2014

న్యూ ఇయర్ పండగ నాడు కూడా పాత ఇల్లేనా!.

మద్య తరగతి వారి న్యూ యియర్ ఆహ్వానాలు
                                                         
మనకు ఒక నమ్మక్కం ఉంది. అదేమిటంటే కొత్త సంవత్సరం మొదటి రోజు ఎలా జరిగితే ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుండి అని. అందుకే ఆనందంగా సంతోషంగా ,కుటుంబ సబ్యులు అందరితో కలసి ఆ రోజంతా సంతోషగా గడపడానికి చూస్తారు. ఇంగ్లీష్ సంవత్సరాది అయినా , తెలుగు సంవత్సరాది అయినా మనం రెండిటిని సమానం గా చూడాల్సిందే. ఎందుకంటే మత  పరమైన కార్యక్రమాలకు తెలుగు క్యాలండర్ ని , లౌకిక పరమైన కార్యక్రమాలకు ఇంగ్లీష్ క్యాలండర్ ని అనుసరించటం మన జీవన విదానం లో బాగంగా చేసుకున్నాం.  కాబట్టి  మనం రెండింటిని అనుసరించక తప్పదు. కానీ ఆ యా నూతన సంవత్సరాలను ఆహ్వానించడం లో మాత్రం మన సాంప్రాదాయ పద్దతులు అవలంభించాలే తప్పా , వెర్రి మొర్రి పద్దతులు, హోటళ్ళ, పబ్ సంస్కృతులను ప్రోస్తాహించే విదంగా ప్రవర్తించడం అభిలషనీయం కాదు.

   మనం ఉగాది విషయం లో ఇంటిల్లి పాదీ ఇంటిలోనే ఉండి ఉదయం లేచినది మొదలు తలలు పోసుకోవడం , కొత్త బట్టలు కట్టుకోవడం, ఉగాది పచ్చడి చేయడం, కమ్మని పిండి వంటలు ,ఇలా ఏది చేసినా ఇంటిల్లిపాది ఆనందించే విదంగా ఉంటుంది. కానీ అదే న్యూ ఇయర్ అనే సరికి అదేదో ఇంటికి సంబందం లేదన్నట్లు, వీది లోకి వెళ్లి హోటల్లో , పబ్ లో కూర్చుని చచ్చిందాక తాగటం, తెలిసినోళ్ళతో , తెలియనోళ్లతో పూనకం వచ్చిన వారిలా ఊగడం, అవసరమైతే తెల్లార్లూ ఆ పబ్  లలోనే గడిపి , ఇంటికి వచ్చి కొత్త సంవత్సరం రోజు బోర్ల బొక్కలా పడుకోవటం, ఇదా నూతన సంవత్సారాని ఆహ్వానం పలికే విదానం? ఇక కురాల్లైతే పుల్ గా మందు కొట్టి , వెర్రి కేకలు పెట్టుకుంటూ , ఏదో గత్తర తగిలిన వారి మాదిరి టూవీలర్ల మీద వీదుల్లో విహారం చేసుకుంటూ దేనికో ఒక దానికి గుద్దుకుని కాళ్ళు చేతులు విరగ గొట్టుకుంటుంటే , వారిని అదుపు చెయ్యడానికి పొలిసు నిబందనలు పెట్టడం, ఏమిటి ఇదంతా? ఇదా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే విదానం ? మన ఇల్లే మనకు స్వర్గం. దానిని ఎప్పుడూ  సుఖసంతోషాలతో ఉంచేలా నూతన సంవత్సరాలకు, ఇంట్లో ఉండే ఇంటిల్లి పాది తో స్వాగతం పలికితే దానికంటే ఆనందం ఏముంటుంది ?!.
                                           B .Tech  ఫైనల్ ఇయర్ చదువుతున్న మా పాప రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇంటి ముందు వేసిన ముగ్గు చూసి నాకు చాలా ఆనందం కలిగింది .మా వీది లో ఇంచు మించు అందరూ అలాంటి ముగ్గులే వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. నిజంగా మధ్యతరగతి ప్రజలే మన సంస్కృతిని కాపాడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహాం లేదు. కాని  వారిలో మగాళ్ళు కొంతమంది న్యూ ఇయర్ పార్టీల  పేరుతో తో రాత్రిళ్ళు ఫ్రెండ్స్ తోకలసి రాత్రాల్లా తాగుతూ బయట గడపడం సమర్దనీయం కాదు. ఒక వేళ మందు అల వాటు ఉంటే  మితంగా తీసుకుని  కుటుంబ సబ్యులుతోనే గడిపితే మంచిది కదా!.

    మనకో సామెత ఉంది? అది ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఇలాంటి పండగలు కూడా ఇదివరలో మన సమాజంలో ఉండేవా అని అనిపిస్తుంది? ఆ సామెత ఏమిటంటే  "పండగ నాడు కూడా  పాత ఇల్లేనా " అని. ఒక వేళ అటువంటి సంస్క్రుతి కావాలనుకునే వారు పబ్ సంస్కృతులను ప్రోత్సాహిస్తాం అంటే అది వారిష్టం. కానీ మద్య తరగతి ప్రజలు, సామాన్య ప్రజలు ఇటువంటి వారికి, వారి సంస్కృతికి దూరంగా ఉండటం మంచిది. మన ఇల్లే మనకు స్వర్గం. అది  ఎప్పుడూ  సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ , నూతన సంవత్సరాలకు ఇంట్లో ఉండే, ఇంటిల్లి పాడితో స్వాగతం పలికితే దానికంటే ఆనందం ఏముంటుంది ?!.

కల్కి ఖడ్గం బ్లాగు వీక్షకులకు, మిత్రులకు అగ్రిగ్రేటర్లకు 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

   కొత్త సంవత్సరానికి పూనకాలతో స్వాగతం పలుకుతున్న వారిని ఈ  వీడియోలో చూడండి.