Thursday, October 31, 2013

ఉల్లిగడ్డల కోసం ఎల్లయ్య ఉసురు తీసిన దొంగలు!

                                                            


" ఉల్లిపాయకు ఉపదేశ మిచ్చే కల్లగురువులు వస్తారని" బ్రహ్మం గారు చెప్పారు కానీ, ఉల్లిగడ్డల దొంగతనం కోసం ఉసురు తీసే రోజులు వస్తాయని అయన కూడా  ఊహించలేక పోయారు కదా! అరె ! అరె! ఎంత పోక దల  కాలం వచ్చింది ఈ రాష్ట్రంలో ! ఆఖరుకు ఉల్లిపాయల కోసం కూడా ప్రాణాలు తీసే స్తాయికి దిగజారాయి రాష్ట్రం లోని శాంతి బద్రతలు.! ఈ  రోజు రంగారెడ్డి జిల్లలో జరిగిన వింత ఘోరం ఇది. ఒక ఉల్లిపాయల గోడౌన్ కి కాపలాగా ఉన్నాడు ముసలివాడైన ఎల్లయ్య. ముసలి వాడు కాబట్టి అతని ని బెదిరించి ఆ ఉల్లి గడ్డల బస్తాలను ఎత్తుకేల్లినా ,ఏమోలే ఉల్లి పాయకోసం కకుర్తి పడ్డారు అనుకోవచ్చు. కానీ ఏకంగా "ఎల్లయ"నే చంపి ఉల్లి గడ్డల దొంగతనం చేసారు అంటే ఖచ్చితంగా అతనిక్ తెలిసిన వారె ఈ  పని చేసి ఉండాలి. పని పాట చేయలేని పోరం బోకు వాళ్ళు కేవలం తమ చిల్లర ఖర్చుల కోసం ఇంతటి దురాగతానికి ఒడిగట్టి ఉంటారు అనిపిస్తుంది. పాపం ఎల్లయ్య ! దేశం లో ఉల్లి జనాలను ఏద్పిస్తుంటే,రాష్ట్రం లో ఏకంగా ఎల్లయ్య  ప్రాణాలు పోవడానికే కారణ మయింది!

Wednesday, October 30, 2013

శోభన్ సర్కార్ సాదువు"బంగారం కల " భారతీయులకు, వేయి టన్నుల బంగారం కంటే విలువైనది ప్రసాదించింది!

                                                              


అవును! నూటికి  నూరుపాళ్ళు నిజం! ఈ  దేశం లో చాలా మంది చెయ్యలేని పని ఒక సాదువు చేయగలిగాడు. తార్కికంగ ఆలోచించటం చేతకాని వాడిని, ఎవరు ఏది చెపితే అదే నిజమని నమ్మి,పనికి రాని  పనులు చెసే " పిల్ల మనస్తత్వం " మున్నవాడిని  నమ్మి , బవిషత్ లో ఆయన్ని బారతానికి రారాజు ను చేస్తే ఎలాంటి పనులు చేస్తాడో , ప్రజలకు "పవర్ ప్రెసెంటేషన్ " ద్వారా చూపించినట్లు చూపించగలిగాడు . ఆ సాదు మహారాజ్ అయిన "శోభన్ సర్కార్ " కల పుణ్యమాని "యువరాజ్ సర్కార్" గురించి ప్రజలు కళ్ళు తెరిచినట్లైంది.

 ఆయనగారు ఒక సాదువు. పేరు శోభన్ సర్కార్. అన్నింటిలో భగవంతుని దర్శించే గుణమున్న భక్తులు ఆయన్ని భగవద్ స్వరూపంగా కొలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ,ఉన్నావ్ జిల్లలో ,సంగ్రామ్ పూర్ అనే గ్రామంలో ఉన్న "రాంబక్ష్ సింగ్" కోట ప్రాంతంలో సుమారు వేయి టన్నుల బంగారం ఉందని , అదే ప్రాంతానికి చెందిన సదరు  శోభన్ సర్కార్ మహారాజ్ గారు సెలవిచ్చారట! అది ఆయనకు ఎలా తెలిసిందంటే, అయన కు ఒక రోజు కలలో ఆ ప్రాంత పూర్విపు  రాజు అయినటువంటి "రాంబక్ష్ సింగ్" గారు కలలోకి వచ్చి "నాయనా శొభనా ,ఈ  దేశ ఆర్దిక పరిస్తితి చూస్తుంటే నాకు కడుపు తరుక్కు పోతుంది. అందుకే  ఈ  దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాడుగా ( ఆయనను ఆంగ్లేయులు సిపాయి తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఉరి తీసారు) ఒక మేలు చెయాలనుకుంటున్నాను. నా కోట క్రింద సుమారు వేయి టన్నులు బంగారం దాచాను . కాబట్టి దానిని బయటకు తీయించి బారత దేశాన్ని రక్షించు. " అని అన్నారట. ఆ విషయం గురించి సదరు సాదువు గారు, ప్రదాన మంత్రి గారికి, రాష్ట్ర పతి  గారికి లేఖలు రాసా రట. కానీ వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత బారత యువ రాజు గా కీర్తించబడుతున్న "రాహుల్ గాందీ " గారి దృష్టికి స్తానిక మంత్రి గారి తీసుకు వెళ్ళడం , వారీ ఆదేశాలు మేరకు అర్కియాలాజికల్ సర్వే అప్ ఇండియా వారు  దనా దన్  పలుగులు పారాలు పట్టుకు వెళ్లి పదిరోజులు పాటు  సాదువు గారు చెప్పిన చోట త్రవ్వితే , పుర్రెలు, ఏము కలు దొరికాయట. ఆ దెబ్బతో త్రవ్వడం ఆపుచేసి "రాహుల్  సర్కార్" వారికి "నిల్ " అని రిపోర్ట్ ఇచ్చారట. అదీ శోభన్ సర్కార్ అండ్  రాహుల్ సర్కార్  వారి " ది తొఉజెండ్ టన్స్  గోల్డ్ హుంట్" సినిమా !


  అయితే ఈ  ఉదంతం వలన భారతీయుల కు బంగారం లభించక పోయినా కాబోయే రారాజు, దేశ్ కి నేత అని పిలువబడుతున్న ఇద్దరు కాబోయే ప్రదాని  అభ్యర్దుల ఆలోచన సామర్ద్యాన్ని తెలియ చేసింది. కల ను నమ్మి కోట ప్రాంతాన్ని  త్రవ్వించిన రాహుల్ గాందీ గారి మానసిక స్తాయి ని, అది వ్యతిరేకించిన నరేంద్ర మోడీ గారి మానసిక స్తాయిని, అంచనా వేసి ,ప్రజలు రాబోయే ఎన్నికలలో తీర్పు ఇవ్వడానికి తగిన "జ్ఞానోదయం" చేసినట్లయింది. అది వేయి టన్నుల బంగారం కంటే ఎక్కువే గా మరి!

   యువరాజు గారికి సాదువుల  మాట మీద అంత గురి ఉంటే "బాబా రాందేవ్" చెపుతున్న స్విస్  ఖాతాలోని "నల్ల డబ్బు" ని దేశానికి తీసుకు రావచ్చు గా!

Monday, October 28, 2013

'మనువు' కు ' మనాలి' కి ఉన్న ఆ సంబందం ఏమిటి?

మనువు అంటే హిందూ ధర్మశాస్త్ర కారుడు. మరి మనాలి అంటే ఎవరో మీకు తెలుసు. మరి వీరి మద్య ఉన్న ఆ లింక్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ  లింక్ ను క్లిక్ చేయక తప్పదు మరి!

      http://ssmasramam.blogspot.in/2013/10/what-is-link-between-manavu-and-manali.html

Sunday, October 27, 2013

ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి గారికి రాసిన అధికారిక లేఖ "రాష్ట్ర విభజన"కు అడ్డుపడబోతుందా?!

                                                               


 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమైఖ్యాంద్రకు కంకణమ కట్టుకున్నారని అటు కేంద్ర ప్రభుత్వానికి , ఇటు ఆంద్ర ప్రదేసశ్  ప్రజలకు అందరికి తెలిసి పోయింది. మొన్నొక చోట "ప్రక్రుతి తుఫాన్ ను ఆపే శక్తి నాకు లేక పోయినా , విభజన తుపాన్ ఆపే శక్తి ఉంది" అని ప్రకటించి ,అక్కడి ప్రజల మనసులకు స్వాంతన చేకూర్చారు. గమ్మతేమిటంటే  తుఫాన్ పీడిత ప్రజలను ఓదార్చు దామని వెళ్ళిన ముఖ్యమంత్రి , అక్కడ ప్రజలకు ఆర్దిక సహయం చేస్తామని అన్నా వారు పెద్దగా పట్టించుకోలేదు కానీ, విభజన ఆపుతాను అనగానే  ఒక్క పెట్టున హర్ష ద్వానాలు చేసారట! మరి అలాంటి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, ఊరికే ఉంటారా ? ఉండరు కదా! అందుకే ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేసీ ఉంటారు అనిపిస్తుంది. అసలు నూతన  రాష్ట్ర ఏర్పాటు   గురించి భారత రాజ్యాంగం ఏమంటుందో చూద్దాం .
3. Parliament may by law—
(a) form a new State by separation of territory
from any State or by uniting two or more States or
parts of States or by uniting any territory to a part of
any State;
(b) increase the area of any State;
(c) diminish the area of any State;
(d) alter the boundaries of any State;
(e) alter the name of any State:[Provided that no Bill for the purpose shall be
introduced in either House of Parliament except on the
recommendation of the President and unless, where the
proposal contained in the Bill affects the area, boundariesor name of any of the States 1***, the Bill has been referred
by the President to the Legislature of that State for
expressing its views thereon within such period as may
be specified in the reference or within such further period
as the President may allow and the period so specified or
allowed has expired.]Explanation I.—In this article, in clauses (a) to (e),
"State'' includes a Union territory, but in the proviso,
"State'' does not include a Union territory.
Explanation II.—The power conferred on Parliament
by clause (a) includes the power to form a new State or
Union territory by uniting a part of any State or Union
territory to any other State or Union territory.]
                       


కాబట్టి కేవలం రాష్ట్రపతి గారి రెకమెండేషన్ తోనే పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టాలి . అలా రాష్ట్ర పతి గారు రికమేండేషన్ చేసే ముందు బిల్లు ను రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపటం తప్పని సరి. కానీ అసెంబ్లీ  ఒప్పుకున్నా , ఒప్పుకోక పోయినా  పార్లమెంట్ మాత్రం బిల్ ని  ఆమోదించ వచ్చు . రాష్ట్ర ఏర్పాటు జరిగి పోతుంది .
కానీ అసలు రాష్ట్రపతి గారు రికమెండ్ చెయ్యటం కోసం బిల్ ని అసెంబ్లీ అభి ప్రాయానికి పంపక ముందే ,కొన్ని అబ్యంతరాలు ఏకరువు పెడుతూ, కూలంకష  చర్చ కోసం అసెంబ్లీకి బిల్ పంపాలని కోరితే, ఆ లేఖ మీద హోంశాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత, రాష్ట్ర పతి  గారు అసెంబ్లీకి "బిల్" పంపితే , అది రాజ్యాంగ బద్దం అవుతుందా ? 

   ముఖ్య మంత్రి గారు పంపిన లేఖ మీద రాష్ట్రపతి  గారు ఏమి  స్పందించ క పొతే అది వేరు. కానీ ఆ లేఖ మీద స్పందించి, హోం  శాఖ కు  పంపటం జరిగింది. కాబట్టి ఇప్పుడు  విభజన బిల్  పంపితే అది దేని ఆదారంగా తయారు చేసిన బిల్ అవుతుంది? రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి  గారు స్వయంగా కానీ , కేంద్ర మంత్రి మండలి సలహా  ప్రకారం  కానీ బిల్ తయారు చేసి  రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి . కానీ అలా జరుగకుండా  ముఖ్యమంత్రి గారి అధికారిక లేఖ ఆదారంగా, బిల్ తయారు చేసి అసెంబ్లీకి పంపుతున్నట్లు అవుతుంది . కాబట్టే ఈ  అనుమానం! అలా ముఖ్య మంత్రి గారి లేఖ "రాష్ట్ర విబజన" ప్రక్రియను కోర్టుల్లో సవాలు చేయడనికి ఉపయోగ పడుతుందా? అసలే ఆర్టికిల్ 371-డి  మీద స్పష్టత లేదు . అది సవరించనంత కాలం విభజన జగడానికి వీలు లేదని సీమంద్రా న్యాయవాదులు, నాయకులు వాదిస్తున్నరు. దానికి తోడు ఇది జత కానుందా?  చూదాం ఎం జరుగుద్దో!






  

Friday, October 25, 2013

వీరిని "రవాణాసురులు" అని అనవచ్చా?


                                                     

   మన ఇతిహాసాలకు, పురాణాలకు సంబందించిన కధలలో కొంత మంది రాక్షసుల పేర్లకు వారి మాయా ఆకారాలకు సంబందం ఉంటుంది.ఉదాహరణకు బాల కృష్ణుని చంపటం కోసం  అయన మేన మామ కంసుడు బకాసురుడు అనే రాక్షసుని పురామాయిస్తాడు. బకాసురుడు తన పేరెఉకి తగినట్లుగానే పెద్ద కొంగ రూపంలో వెళ్లి , బాల కృష్ణుడిని అపహరించి చంపాలనుకుంటే, కృష్ణుడు వాడి ముక్కును రెండుగా చీల్చి చంపేస్తాడు. అల వారి వారి రూపాలను బట్టి వారికి ఆ పేర్లు పెట్టారనుకుంటా!

  ఇప్పుడు కూడా  కోంత మంది రాక్షస ప్రవ్రుత్తి కలిగిన వారు స్త్రీలను చెరపట్టి వారి మద్య అత్యాచారాలు చేస్తున్నారు. పాపం, అలా అత్యాచారాలకు గురి కాబడిన ఆడపిల్లలకు మారు పేర్లు పెట్టి కేసులు నడుపుతున్నారు కానీ , ఆ రాక్షసులకు మాత్రం ఏ పేర్లు ఉండవు. ఈ  మద్య సంచలనం కలిగించిన రెండు ప్రధాన కేసులలో నిందితులు, దోషులు డ్రైవర్లు. అంటే వాహన చోదకులు.

  నిర్భయకేస్  = 6 నిందితులు బస్సులో అమ్మాయిని రేప్ చేసారు.

   అభయ కేస్= ఇద్దరు నిందితులు కారులో రేప్ చేసారు.

 ఇలా చాలా మంది డ్రైవర్ లు ఆటో లలో, బస్సుల లో, కారులలో అమ్మాయిల్ని అపహరించి అత్యాచారాలు చేస్తునారు . కాబట్టి వీరిని "రవాణా సురులు " అంటే కరెక్టుగా ఉంటుందేమో?

Thursday, October 24, 2013

సెల్ లో సెక్స్ బొమ్మలు చూడటానికి అలవాటు పడిన వారికి వీదీలో "స్త్రీలు" మనుషుల్లా ఎలా కనిపిస్తారు?

                                                              

 ఈ  మద్య ఆడవారి మీద  అత్యాచారాలు ఎకువుగా జరగటానికి కారణాల్లో ఇంటర్నేట్లో పోర్న్ సైట్ల ప్రదర్శన ఎక్కువ కావటం కూడా ఒకటి. ఈ  రోజుల్లో పదేళ్ల పిల్లవాడి దగ్గర్నుంచి ముసల్లోళ్ళ దాక ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంటుంది. ఇంటర్నెట్ పుణ్యామాని,అరచేతిలో స్వర్గాలు చూసే అవకాశం  కుర్రకారుకు కలుగుతుంది. ఏదైనా చదువు ద్యాసమీద పడి బుద్దిగా చదువుకునే పిల్లలు ఉంటే ఓ.కె. కానీ అటు సరి అయిన చదువు లేక, చదువుకున్న చదువుకు ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉండే యువతకు వ్యాపకంగా మరేది స్నేహాలు. ఆ స్నేహితులు కూడా  ఉడుకు రక్తం వారే కాబట్టి వారి ద్యాస అంత వారికీ వేడెక్కించే విషయాల మీదే ఉంటుంది. వారిని మరింత చెడగొట్టడానికి ఇంటర్నేట్ లో విచ్చలవిడిగా , అతి జుగుప్సా కరంగా ఉండే బూతు సైట్లు కారణమవుతున్నాయి. వాటిని చూసిన వారికి స్త్రీలందరు  వారి కోరికలు తీర్చడానికి పనికి వచ్చే వారిగానే కనిపిస్తారు.

  అసలే కోతి, ఆ పై కల్లు  తాగింది అన్నట్లు వయసు వేడి ని రెచ్చగొట్టె అవకాశం అరచేతిలో ఉన్న కుర్ర కారు కొంచం సంపాదనా పరులైతే వారి కోరికలు తీర్చడానికి "వీది బొమ్మలు" చాలా మంది ఉన్నరు. మరి అలాంటి వారితో  తిరగడానికి అలవాటు పడ్డ వారికి స్త్రీల మీద సద్బావన ఎలా ఉంటుంది? పూర్వ కాలంలో "వేశ్యా వాటికలు " అనేవి ఉండేవి అట  !ఇప్పుడు రెడ్  లైట్ ఏరియాలు కొన్ని నగరాల్లో ఉండవచ్చు .కానీ చీకటి వ్యాపారాలు ఈ  రోజుల్లో ఎక్కువుగా జరుగుతున్నాయి. దీనికి ప్రదాన కారణం   అధికారుల రాజకీయ నాయకుల అండ. అలా  వ్యవస్త బ్రష్టు పట్టి పోవడానికి ,యువత చెడిపోవడానికి ఇన్ని అవకాశాలు ఉన్న సమాజంలో మార్పు రావాలంటే ఎలా వస్తుంది? ఎవరు తెస్తారు?

 కొంచం జాగర్తగా ఉండాలి స్త్రీలు అంటే "స్త్రీ వాదులు" ఒప్పుకోరు. ఉరి లాంటి కఠిన శిక్షలు ఉండాలంటే వాటితో నేరాలు తగ్గుతాయా అని పెదవి విరుస్తారు, ఆమ్నెస్టీ సానుబూతి పరులు. మరి ఏమిటి పరిష్కారం అంటే అన్నిటికి ప్రభుత్వం దే బాద్యత అంటారు. మంచిది. అవ్వా,  బువ్వా రెండూ  కావలంటే కష్టం . ఆడపిల్లలకు రక్షణ కావాలంటే కొన్ని కఠిన నియంత్రణ పద్దతులు అవలంబించి పైన చెప్పిన వన్నీ కట్టడి చేసి తీరాల్సీందే. లేదంటే స్త్రీలను చెరపట్టె దుష్ట రాక్షస సంస్క్రుతి వర్దిల్లుతుంది.

Monday, October 21, 2013

మనవు: మా ఇల వేల్పు గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ...

మనవు: మా ఇల వేల్పు గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ...:                                                         మొన్న 19-9-2013 వ తారీకున E.T. V. 2  వారు తమ తీర్ద యాత్ర కార్యక్రమం ద్వారా ...

Sunday, October 20, 2013

చిన్నప్పుడు తనను పట్టించుకోలేదని , పెద్దయినాక తండ్రి ని రోడ్డు మీద వదిలేసినోడిని ఏమనాలి?



                                                          
  


అతని పేరు బత్తుల రాజేంద్ర ప్రసాద్.ఊరు ఆదిలాబాద్ జిల్లా ,కొటాలం మండలం  కన్నేపల్లి గ్రామం  వ్రుత్తి పది మంది కి పాటాలు చెప్పే పంతులు. కానీ చెయ్యరాని పని చేసి రాష్ట్ర ప్రజల దృష్టిలో  కృతఘ్నుడి  గా మిగిలి పోయాడు.

  ఆ పంతులు గారి తండ్రి పేరు ఉపేందర్ . వయస్సు 75 సంవత్సరాలు. అతనికి ఏకైక సంతానం ఐ పంతులు గారు. కానీ ఆ పంతులు గారికి తండ్రి అంటే పడదట! కారణం సదరు ఉపేందర్ తన కొడుకు అయిన ఐ పంతులు గారిని చిన్నప్పుడు నిర్లక్ష్యం చేసాడట. కాబాట్టి చిన్నప్పుడు తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఇప్పుడు సదరు పంతులు గారు 75 యేండ్లు వయసున్న తన తండ్రిని   ఒంటి మీద గుడ్డలు కూడా లేనటువంటి దయనీయ స్తితిలో ఒక రహదారి మీద వదిలేసి వెళ్ళాడట . ఒంటి మీద గుడ్డలు లేకపోవడంతో , సిగ్గుతో చితికి పోయిన ఆ ముసలి తండ్రి , పాపం కాళీడ్చుకుంటు సమీప గ్రామానికి చేరి , అక్కడ ఉన్న ఒక మడుగులోని రెల్లు  దుబ్బుల మధ్యకు వెళ్లి తన మానాన్ని కాపాడుకుంటూ ,అలాగే ఆ మడుగులోని నీటిని త్రాగి తన ప్రాణాల్ని కాపాడుకుంటూ మూడు  రోజులు గడిపాడట. ఆ తర్వాత ఎవరో పశువుల కాపరి చూసి ఆ విషయం గ్రామస్తులకు  చెపితే వారు అతనిని చేర దీసి కూడు ,గుడ్డ ఇచ్చి కొడుకు కి కబురు పంపితే అతడు ఇంటికి తాళం వేసుకుని, ఎటో వెళ్లి పోయాడట. అతని సెల్ కుడా  బంద్  చేసుకున్నాడు. అదీ కద .

   ఇప్పుడు చెప్పండి ఇందులో ఆ కొడుకు అనే వాడికి ఏమైనా మానవత్వం ఉందా? నాగుపాము కైనా పన్నెండెల్లే పగ అంటారే మరి ఆ కొడుకు పాముకి తండ్రి చనిపోయేదాకా పగ చల్లారదా? కూడు  గుడ్డ కోసం తన ఏకైక సంతానమైన కొడుకు మీద ఆదారపడే వయసులో ఆ ముసలి తండ్రిని ప్రతీకారం పేరుతో అనాదను  చెయ్యడం ఎంతవరకు బావ్యం?అతను  టిచర్ . బాగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి చట్ట ప్రకారం అయినా తండ్రిని ఆదరించాల్సిన బాద్యత అతనికి ఉంది. కాబట్టి తక్షణం అధికారులు స్పందించి కొడుకు కి కౌన్సిలింగ్ ద్వారా , మాట వినకపోతే చట్ట ప్రకారం అయినా చర్యలు తీసుకొని తండ్రి అయిన దేవబత్తుని ఉపేందర్ కి పోషణ సౌకర్యాలు కల్పించాలీ .

Sunday, October 6, 2013

" రేప్" చేసిన పదేండ్లకు కేసు పెట్టడం లో మతలబ్ ఏమిటి?


                                                                    

 ఈ మద్య ఆసరామ్ బాపు అనే కలియుగ ఆశ్రమ వాసిని లైంగిక వేదింపులు కింద అరెస్ట్ చేసి జెయిల్ లో పెట్టారు. దానికి అయన కింకా బెయిల్ రాలెదు. కాని విచిత్రంగా నిన్న ఇద్దరు అక్కా చెల్లెలు ఆయన మీద ఆయన కొడుకు మీద కేసు పెట్టాఅట. అదేమిటంటే పది సంవత్సరాల క్రింద ఆస్రామ్ బాపు, ఆయన కొడుకు తమను  రేప్ చేసారని. సూరత్ పోలిసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టారు. ఇటువంటి రేప్ లు వారి మీద 2002  నుండి 2004  వరకు జరిగాయటా! 

 రేప్ కేసులో ప్రదానమైనది మెడికల్ ఎవిడెన్స్. పదేళ్ళు క్రితం జరిగిన రేప్ల ని మరి ఎలా రుజువు చేస్తారో ఆ పోలిసులకే తెలియాలి. మరి పదేళ్ల వరకు కేసు పెట్ట కుండాఎందుకు ఆగారో ఆ అక్క చెల్లెలకి తెలియాలి. ఇవ్వన్ని ఆస్రాం బాపు  అనే ఆశ్రమ వాసికి ఎందుకుnజరుగుతున్నాయో ఆయన్ని కేసులలో ఇరికిస్తున్న రాజకీయ నాయకులకి తెలియాలి. అసలు కేసులో ఉన్న నిజా నిజలు ఆయన కేసు దర్యాప్తు జరుపుతున్న "కరుణామయుడు" జోద్ పూర్ కమీషనర్ జార్జ్ గారికి తెలియాలి. అధికార పార్టీ ని విమర్శించే హిందూ గురూజీల మీద ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టడం ఎందుకు  జరుగుతుందో ఆ సెక్యులర్ అధిష్టాన దేవతకే తెలియాలి.

 అయినా ఆస్రం బాపు మీద ఉన్న కేసులను తక్షణ మే విచారించి అతను దోషి అని రుజువు అయితే ఆయన ఆశ్రమ ఆస్తుల ను ఇతర హిందూ సంస్తలకు అప్ప చెప్పాలి. ఒక వేళ నిర్దోషి అని రుజువు అయితే ఆయన బక్తులే చూసుకుంటారు దానికి కారకులైన వారి సంగతి.  రేప్ చేసారని పదేళ్ళు తర్వత కేసులు పెట్టె వారు ఎక్కువైతే "నిర్భయ" లాంటి కేసులు కూడా జనం నమ్మరు.   

Friday, October 4, 2013

నిన్నటి దాకా ’అమ్మా”అమ్మా’అన్న వారే ఈ రోజు ’అమ్మ నా బూతులు’ తిడుతున్నారు!



                                                                  

  రాజకీయాలు మనిషిని అందలం ఎక్కించనూగలవూ, అదః పాతాళానికి తొక్కి పారెయ్యనూ గలవూ! రాష్ట్రం లోని సీమాంద్రా కాంగ్రెస్ వారి పరిస్తితి ఎంత దయనీయంగా తయారయ్యింది అంటే నిన్నటి దాక ఎవరి పేరు చెప్పి తమ పార్టీ ఉన్నతి గురించి గొప్పలు చెప్పారో ఇప్పుడు వారినే బూతులు తిట్టకపోతే తమ నియోజక వర్గాల్లో తిరగలేని పరిస్తితి.

  సోనియా గాందీ గారికి తెలుగు వారంటే ప్రత్యేకమైన అభిమానం ఏమి లేకపోవచ్చు. ఒక విదంగా చూస్తే, ఆమెకు ఎందుకో పి.వి. నరసింహారావు గారంటే కోపం ఉందనేది ఆయన చనిపోయినప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు తేట తెల్లం చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఎంత గొప్పవారైన సరే ఆమె ముందు "జీ మాతా" అనాల్సిందే అనుకుంటా!. ఇక్కడి ప్రజలుకు నెహ్రూ గారి కుటుంబం పట్ల ఉండే ఆరాదనా బావాన్ని, క్రమంగా రాజశేఖర్ రెడ్డి గారు తన వైపు తిప్పుకుని తిరుగు లేని నాయకుడిగా ఎదగడం, ఎన్నికల  సమయాలలో కేంద్రాన్ని లెఖ్ఖ చెయ్యకుండా తన స్వంత ఆలోచనా విదానంతో ఎక్కువ యం.పి. సీట్లను గెలవడం ఇవ్వన్నీ పైకి ఏమనలేక పోయినా కేంద్రం లోని ఆమె మద్దతు దారులకు కంటగింపుగా ఉండేది . అదీ గాక దక్షిణ బారతం లో ఆంద్రప్రదేశ్ అధిక యం.పి. సీట్లు కలిగిన రాష్ట్రం కావడం వలన ఈ రాష్ట్ర నాయకులు కేంద్రం లో ప్రభావం చూపగలిగిన స్తితిలో ఉండడం కుచ్చిత రాజకీయాలకు మారుపేరైన చిదంబరం లాటి తమిళ తంబి లకు కంటగింపుగా ఉండేదీ కాబోలు. అందుకే బలమైన తెలుగు రాష్ట్రం కంటే బలహినమైన రెండు రాష్ట్రాలుగా ఉండడమే కేంద్ర పెత్తనానికి మంచిదనే బావన కలిగి ఉండవచ్చు.

 అలాంటి కేంద్ర పెద్దలకు కె.సి.ఆర్ తెలంగాణా ఉద్యమం కొత్త ఆలోచనలు రేపి ఉందవచ్చు. కె.సి.ఆర్ ని సోనియా గాంది దగ్గరకు పంపి ఆమె జన్మ దినం నాడు తెలంగాణా ప్రకటన చేసేటట్లు ప్లాన్ చేసి ఉంటాడు చిదంబరం. ఒకసారి మాట ఇస్తే దానిని కాదనే  గుణం సోనియా లాంటి వారికిఉండదు. అదీ జన్మదినం కానుకగ ఇస్తే దానికి తిరుగే ఉందదు. అది తెలిసిన తమిళ తంబి కె.సి.ఆర్ ని ఉపయోగించి సపలుడయ్యాడు. కానీ ఈ విషయం లో సీమాంద్రా కాంగ్రెస్ వారికి అనుమనం రాకుండా "నిరాహార దీక్ష" డ్రామా ఆడించి కె.సి.ఆర్. ని ఖమ్మలో అరెస్ట్ చేయించి ఎదో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లు హల్ చల్ చేసి డిసెంబర్ తొమ్మిదిన "తెలంగాణా ప్రకటణ" చేయించాడు తమిళ తంబి. ఆ తర్వాత ఎగసిన నిరసనలతో తాత్కాలికంగా వెనక్కు తగ్గినప్పటికి, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి "పుట్టిన రోజు కానుక" ను గుర్తు చేసి ఆగ మేఘాల మీద నిబందనలు అన్నీ తుంగలో తొక్కి, తెలంగాణా ప్రక్రియలు పూర్తీ చేస్తున్నారు. అమ్మ నిర్ణయమే తప్పా అన్య విషయం తెలియని,అన్నిటికి తలాడించే ప్రదాణ మంత్రి గారికి సీమాంద్రా నాయకుల వేడుకోళ్ళు చెవికెక్కవు  గాక ఎక్కవు . అందుకే జనవరి లోపు తెలంగాణ ఏర్పడ బోతుంది.

  దీని వెనుక ఉన్న అసలు మతలబ్ తెలియక తెలంగాణా ఏర్పాటు ఆపుతాం అని బీరాలు పలికిన సీమాంద్రా వీరులు ఇప్పుడు బిక్క ముఖాలు వేసుకుని,ప్రజలు సోనియా గాందీ గారిని తిడుతూంటే "అవునూ నిజమే" అని తాము తిట్లకు లంఖించుకున్నారు. ఇక జగన్ ఏమన్న సింహం లా గాండ్రిస్తూ తమకేమన్న దారి చూపుతాడెంఒ అనుకుంటే పదహారు నెలల జెయిల్ జీవితంతో "కరుణా మయుడు" లా మారి పోయి ఏమిటి ఈ దుస్తితి అని బేలగా మాట్లాడుతున్న ఆయనను చూసి సీమాంద్రా కాంగ్రెస్ వారికి ఆశలు అడి యాశలు అయ్యాయి. ఈ సమయం లో ఒక .యన్.టి.ఆర్ లా గర్జించి ప్రజలను ఒక్క తాటి మీద తేగల నాయకుడు కనపడక, ఏమి చెయ్యాలో తెలియక దిక్కుమాలిన బిడ్డలు  లాగా బేల చూపులు చూస్తున్నారు. ఇక పోతే బొత్సా లాంటి వారేమో ఇక ఎలాగు రాష్త్రం విడి పోతుంది కాబట్టి, ఇక సీమాంద్రలో కాంగ్రెస్ అధికారం లోకి రావడం అసంభవం కాబట్తి, మిగిలిన ఈ నాలుగు నెలలు అయినా "ముఖ్యమంత్రి" గా వెలగబెట్టె మహదవకాశం కోసం "డబల్ గేమ్" లు ఆడాలని చూస్తుంటే , ఈ రోజు ప్రజలు ఆయన ఇంటి ముట్టడికి చేస్తున్న హంగామా చూసి నోరు మూసుకుని ముఖ్యమంత్రి గారి మీటింగ్ కు హాజరై అందరి నిర్ణయమే తన నిర్ణయమని కామ్ గా బిత్తర చూపులు చూస్తూ కూర్చున్నాడు.ఇక బాబు గారైతే తన రెండు కళ్ళ సిద్దాంతంతో ఎవరిని ఏమనలేక రాష్త్ర రాజకీయాలు కంటే కేంద్ర రాజకీయాలే బెస్ట్ అని. రాష్ట్ర విబజన సాకుతో  డిల్లీ లో తన ఇమేజ్ పెంచుకునె కార్యక్రమాలు  చేపట్టి,  యన్.డి.యే కన్వినర్ పోస్ట్ కొట్టెదామని ప్లాన్ చేస్తున్నారు.  అదీ పరిస్తితి. ఒక స్త్రీ స్వార్ద నిర్ణయం తెలుగు గడ్డని ముక్కలు చెయ్యడమే కాక, జాతిని నిలువునా చీల్చింది. ఇది మంచికా, చెడుకా అనేది కాలం చెప్పవలసిన జవాబు.    

Thursday, October 3, 2013

"బొత్సా" గారికి సీమాంద్రా ఉద్యమం అంటే తన ఇంటి పేరు లాంటి దానితో సమానమా?



                                                                     

 అవుననే అనిపిస్తుంది ఆయన తంతు చూస్తుంటే. ప్రస్తుతం సీమాంద్రా లో నడుస్తున్న ప్రజా ఆందోళనలు చూస్తుంటే సీమాంద్రకు చెందిన ఏ రాజకీయ నాయకుడూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రవర్తించి, తన రాజకీయ బవిష్యత్ మీద తనే నిప్పులు పోసుకోడు. మరి అటువంటి పనిని రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ బొత్సా సత్య నారయణ గారు చేస్తున్నారంటే అది సాహాసమా? లేకుంటే వేరే ఎదైనా మతలబ్ ఉందా?

  మొన్న ఎందుకో గానీ, సి.యమ్. గారు దిగ్విజయ్ సింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడిన రోజే బొత్సా గరు రాజీనామా చేయబోతున్నారని కొన్ని మీడియాలలో ప్రకటణ లు వచ్చాయి. కాని ఆ రోజు అది జరుగ లేదు. మొన్న  మాత్రం చిరంజీవి గారితో సహ కొంత మందితో సీక్రేట్ మంతనాలు , హుటాహుటిన డిల్లీ వెళ్ళిన ఇరవై నాలుగు గంటల లోపే షిండే గారితో తెలంగాణ నోట్  సిద్దం చేయించి ఈ రోజు సాయంత్రం కేవళం టెబుల్ నోట్ ఆంశంగా కేంద్ర కాబినెట్ ముందు ప్రవేశ పెడుతున్నారంటే ఇందులో బొత్సా గారి పాత్ర ఎంత కీలకమయిందో చెప్పకనే చెపుతుంది.

  బొత్సాగారికి ,కేంద్ర పెద్దలకు మద్య ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో, లగడపాటి న్గారు రాజీనామా చేసాక గాని చెప్పరట! అప్పట్టి దాక ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు  గేమ్ కొనసగుతూనే ఉంటుంది. ఈ రోజుతో బొత్సా గారి నిజ స్వరూపం సీమాంద్రులకు క్లియర్ గా తెలిసి పోయింది. ఆయనకి సీమాంద్రా ప్రజలు చేసే ఆందోళన ఆయనకు ఆయన నెత్తి మీద ఉన్న దానితో సమానం. అందుకే ఇంత ఆందోళనలు చేస్తున్నా ఆయన చేసేది ఆయన చెయ్య గలుగుతున్నాడు. ఆ కదిరీ నరసింహుడే సీమాంద్రులను కాపాడు గాక!

Wednesday, October 2, 2013

ఒక్క రోజు మద్యం, మాంసం మానడమేనా జాతిపితకు మనమిచ్చే నివాళులు.?

          
పూర్తి టపా కొరకు ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి

 http://ssmanavu.blogspot.in/2012/10/blog-post.html#gpluscomments