Friday, June 28, 2013

పరిచయం లేని మగవాళ్ళని, పబ్ దగ్గర, రాత్రి పూట లిప్ట్ అడిగితే, జరిగేది అదే మరి !

                                                              
                                                             
 డిల్లీలో  మొన్న నిర్బయ ఉదంతం నుంచి నిన్నటి గుర్గావ్ ఉదంతం వరకు ఒకటే విషయం. రాత్రుళ్లు స్త్రీలు ముక్కూ, ముఖం తెలియని వారి వాహనాలలో ఎక్కి, అత్యాచారాలకు గురి కావడం. పాపం నిర్బయ విషయంలో పబ్లిక్ సర్విస్ బస్ అనుకుని ఎక్కి నష్టపోయారు. కాని నిన్న డిల్లిలో జరిగింది మాత్రం స్వయక్రుతాపరాదం. అందుకే కాబోలు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా డిల్లీలో రేప్ లంటే అది కామనేలే అని ప్రాముఖ్యం లేని లోపలి పేజిలలో ప్రచురించడం మొదలు పెట్టారు. దానికి ఉదాహరణ ఈ రోజు ఒక చిన్న న్యూస్ అయిటం గా పేపర్లో ప్రచురితమయిన, గుర్గావ్ లో ఇద్దరు స్త్రీల మీద కారులో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన సామూహిక అత్యాచార గాదా .

  కహానీ లోకి వెళితే, ఇద్దరు అతివలు. రాత్రి పూట పార్టికి అని పబ్బు కొచ్చారట. పార్టి అయ్యక లిప్ట్ కోసమని బయట నిలబడ్డారట. అంతలో ఒక కారు వారి ముందు ఆగిందట. అందులో ఇద్దరు మగవాళ్ళట. రండమ్మా మీరు కోరుకున్న కాడ దింపుతాం అంటే జల్లో పూలు లేకపోయినా, చెవిలో పూలు పెట్టుకుని ఎక్కారట. కారు కొంత దూరం వెళ్ళాకా  మరో ఇద్దరు మగవాల్ళు ఎక్కారట. కారు వెళుతూనే ఉంది. అంతలో ఆ మగవాళ్ళ ముఖాలు "మ్రుగాళ్ళ" ముఖాలుగా మారి పోయాయి అట! అదేమిటి వీళ్ళ  ముఖాలు అలా అయ్యాయి అని అతివలు అనుకునే  లోపే జరగాల్సిన గ్ఃఓరం జరిగిపోయిందట! సీన్ కట్ చేస్తే అమ్మాయిలిద్దరు గాంగ్ రేప్ కి గురయ్యారు. పాపమ్ ఏడ్చుఖుంటూ వెల్ళి పోలిసులకి పిర్యాదు చేస్తే, వాల్లు ఎవరిని అరెస్ట్ చేయాలో అర్దం కాక ఇన్వెస్టిగేషన్ బ్రుందాలను రంగం లొ దించి గాలింపులు మొదలెట్టారట!కడపటి వార్తలందేసరికి అయిదుగురు కార్ డ్రైవర్ లను అదుపులోకి తిసుకున్నట్లు సమాచారం .    అదీ కద!.

  పై కహాని అంతా విన్నాకా ఎక్కడో ఏదో లింక్ మిస్స్ అయినట్లు లేదూ? ఏమిటబ్బా అది? నాకు అర్దం కావటం లేదు మీకేమైనా అనిపిస్తే చెప్పండి. ఇక్కడ రాత్రులు వేళలో ముక్ఖు ముఖం తెలియని వారిని లిప్ట్ లడిగే వారికి చెపుదాం. డిల్లీలో వాల్ళు మన మాట వినకపొయినా ఇక్కడి వారన్నా   విని జాగర్త పడతారేమో!   


Thursday, June 27, 2013

ఇడుగిడుగో వీడే!ఉత్తరాకాండ్ విలయానికి కారకుడు, వ్రుత్రాసురుడు!.


                                                              

 వీడే!వ్రుత్రాసురుడు




  వీడు పుట్టక ముందు అది నిజంగా దేవ బూమే. ఏదో దైవ దర్శనం చేసుకుని అక్కడి ప్రక్రుతి రమణియతను ఆస్వాదించి, అది తమ చిరకాల మదుర స్మ్రుతిగా దాచుకుందామనే తలంపుతో వెళ్ళే భక్తులు, యాత్రీకులు తప్పా వేరే తలంపే ఉండేది కాదు. కాని రాను రాను రోజులు మారాయి. మనిషి విజ్ణానం అభిరుద్ది చెందాక పుట్టిన "వ్రుత్రాసురుడు"  వీడు. వీడిని వ్రుత్రాసురుడు అని ఎందుకంటున్నాను అంటే  పూర్వం వేద కాలం లో వ్రుత్రాసురుడు అనే రాక్క్షసుడు ఉండే వాడట. వాడు పర్వత ప్రాంతంలోనే ఉండే వాడు. వాడి వల్ల మేఘాలలో నుండి వచ్చే  నీరు బందింపబడి పశువులకు, మనుషులకు లభించేది కాదట. అప్పుడు ప్రజలంతా ఇంద్రుడిని ప్రార్దిస్తే, ఇంద్రుడు తనకు "త్వష్ట" అనే రుషి ఇచ్చిన "వజ్రాయుదం" సహాయం తో "వ్రుత్రాసురుడిని " సంహరించి, బందించి ఉన్న నీటిని విడుదల చేసి, సకల ప్రాణకోటికి అనందం కలిగించాడట!. ఇంద్రుడు అటు వ్రుత్రుడితో పాటు "సర్పం" లా ఉండే అహి అనే రాక్షసుడిని వదించాడని కద!.

  పూర్వ కాలం లో మన పెద్దలు చెప్పిన కద లన్నీ ప్రతీకాత్మ మైనవే. ఆ కాలంలోనే పర్వత ప్రాంతం లో ఉండే నదులను క్రిందకు వెల్లకుండా ఆ ప్రాంత రాజకీయ నాయకులు ఆనఖట్టలు కడితే అట్టి ఆన కట్టలు వల్ల ప్రక్రుతి సమతుల్యత దెబ్బ తినడమే కాక క్రింది ప్రాంతం వారికి నీరు లబించేది కాకపోవచ్చు. అహి అంటే పాము ఆకారం లో ఉండే రాక్షసుడు అన్నారు అంటే అది ఆనకట్ట కావచ్చు. దానిని నిర్మించడానినికి ఉపయోగపడే వ్రుత్రాసురుడు అంటే ఒక పెడ్డ  J.C.B      లాంటి యంత్రం కావచ్చు. కాబట్టి ప్రజలకు మేలు కలగాలంటే పైనున్న నీరును విడుదల చెయ్యడం ఒక్కటే మార్గం కాబట్టి ప్రజల రాజు ఇంద్రుడు తన దగ్గర ఉన్న శక్తివంతమయిన ఆయుడంతో ఆ బయంకర యంత్రం నాశనం చెయ్యడమే కాక ఆనకట్టను తెరిపించి నీటిని క్రిందకు పారించి ఉంటాడు.

 ఇక్క పోతే ప్రస్తుతం వాస్తవంలోకి వస్తే పై  J.C.B    గాడు పుట్టాక, నదులులో ఇసుక చట్ట వ్యతిరేకం  గా లోతుగా త్రవ్వి  పారవేసారు. ఎనిమిది మీటర్లు ఇసుక పొర ఉన్న చోట రెండు మీటర్లు మాత్రమే త్రవ్వాలి. అది రూలు. కాని  కాసులు తీసుకుని కళ్ళు మూసుకున్న అధికారుల అండతో విచక్షణా రహితంగా బూమి పొర తాకేదాక   J.C.B      యంత్రాల సహాయంతో కాంట్రాక్టర్లు ఇసుకను తోడి వేసారు. అలా త్రవ్విన ఇసుకతో దేవ బూమిని కట్టడాలతో వ్యాపార  వాణిజ్య సముదాయలతో నింపివేసారు. ప్రజా వలసకు కారణమయి అక్కడి ప్రక్రుతి వనరుల ద్వంసానిక్ కారణ బూతులయ్యారు. నదీ ఒడ్డునే అక్రమ కట్టడాలు కట్టారు. దీనంతిటికి కారణం  వ్రుత్రా సురుడు అనే  J.C.B   లాంటి   మెచిన్ మాత్రమే.

 ఇంకే ముంది అప్పటి దాక ఇసుకలో ఇంకుతూ నెమ్మదిగా ప్రవహించే వరద ఒక్క సారిగా ఒత్తిడికి లోనై, బీకరంగా మారి వెల్లువై చుట్టు ప్రక్కల ఉన్నవాటిని ద్వంసం చేస్తూ పరుగులు తీస్తుంతే ఆ దాటికి పాపం దేశం నలుమూలల్ నుండి వచ్చిన బక్తులు క్కొట్టుకు పోయారు. ప్రక్రుతిని ద్వంసం  చేసింది యంత్రమే అయిన దానిని స్రుష్టించిన మనిషి శిక్ష అనుబవించాడు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రక్రుతి ద్వంసం ఆపుచేస్తే మంచిది లేదా ఉత్తరాకాండ్ లో జరిగింది బారతావని మొత్తం జరిగి తీరుతుంది.

 ప్రబుత్వం వారు ఇప్పటి కైనా  J.C.B    మెచిన్ లాంటి బారీ యంత్ర వినియోగం పైన నియంత్రణ విదిస్తూ చట్టం చెయ్యడమే కాక దాని అమలుక్కు నడుం బిగించాలి. అక్రమ ఇసుక దందాలను తక్షణమే నీరోదించాలి.అక్రమ కట్టడాలను నిర్దాక్షినంగా కూల్చి వేయాలి. లేకుంటే "ఇంద్రుడు"(పర్యావరణ శక్తి)  రావడం  ఖాయం అన్నింటిని నాశనమ్ చెయ్యడం ఖాయం!.      
                                               

ప్రక్రుతిని ద్వంసం  చేస్తున్న వ్రుత్రాసురుడు  

               

Sunday, June 23, 2013

వెర్రెక్కిన విజ్ణానం ఆనకట్టలు కడితే, చిర్రెత్తిన ప్రక్రుతి, చీల్చి చెండాండింది.

                                                                    
                                                               
  మనిషి. ఆఫ్ట్రాల్ ప్రక్రుతిలో అన్ని జీవరాసులతో పాటు వాడూ ఒకడు. ఈ మద్యనే వాడికి విజ్ణానం అబ్బిందట! అంతే అజ్ణానంగా పొంగిపోయి ముందూ వెనుక కానక ప్రక్రుతినే ద్వంసం  చెయ్యడం మొదలు పెట్టాడు. వాడు ఒక పక్క దేవుళ్ళను, ప్రక్రుతిని కొలుస్తాడు. ఇంకొకపక్క ఆ ప్రక్రుతి ఆజ్ణ నే మీరతాడు. అదేమిటంటే అంతా తన చేతిలోనే ఉందంటాడు. ప్రక్రుతి గమనాన్ని మూడురోజులు ముందు కనిపెట్టలేని వాడు ప్రక్రుతి రహస్యం తెలుసంటాడు. ప్రక్రుతి కూడ సామాన్య మానవుల మాదిరి బల హీనమనుకుంటాడు. అందుకే అది నన్నేమి చేస్తుందిలే అని దీమా ఒలక పోస్తుంటాడు.వాడి పొగరును అప్పుడప్పుడు ప్రలయ విపత్తు రూపంలో అణచివేస్తున్నా బుద్ది తెచ్చుకోడు.

  చార్ దాం అనే ప్రాంతాలు సుందర ఆద్యాత్మిక క్షేత్రాలు. మనిషికి ఈ లౌకిక బాదలను మరచిపోయేలా  అలౌకిక ఆనందం ఇవ్వగల్గిన క్షేత్రాలు. అటువంటి క్షేత్రాలు ఉన్నా కేదార్నాద్, బదరీనాద్, గంగోత్రి, యమునోత్రి, ప్రాంతాలకు బారత దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది యాత్రీకుల ద్వారా "ఉత్తరాకాండ్" రాష్త్రం కోట్ల ఆదాయం పొందుతుంది. కాని ఆ ఆదాయ వనరులు చాలక అంతులేని అక్రమ పద్దత్తుల్లో, అవినీతికి పాల్పడి, నదీ ఒడ్డు ప్రాంతంలో నిబందనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చి, గొప్ప తప్పిదం చేసింది. దీని వలన అనేక అంతస్తుల భవనాలు నది ఒడ్డుల మీద ప్రత్యక్షమయ్యాయి. అంతేనా అభిరుడ్డికోసం కరెంట్ అవసరమని ఎక్కడపదితే అక్కడ జల విద్యుత్ ప్రాజెక్ట్ లు కట్టారు. ఈ విదంగా నదుల సహజ గమన్నాన్ని అడ్డగించారు. ఉత్తారాకాండ్ రాష్ట్ర అభిరుద్ది పేరుతో అంతులేని అవినీతికి పాల్పడ్డారని చెపుతున్నారు.

   అసలే గంగమ్మా ! అనుగ్రహమ్ ఉన్నంతసేపు ప్రజలను  తన బిడ్డలవలే కాపాడుతుంది.కన్న  తల్లి అయినా సరే, మామూలుగా స్తన్యమ్ త్రాగే బిడ్డకు ఆనందంగా ఇస్తుంది. అదే దుందుడుకు బిడ్డలు కొరికితే ఒక్క చరుపు చరచి దారిలో పెడుతుంది. అదిగో అటువంటి  చరుపే మొన్న గంగమ్మా తల్లి, ఉత్తరాకాండ్లో చరిచింది. ఇప్పటికైనా పాలకులు దుందుడుకు చేష్టలు మాని పర్యావరణ వేతలు, ఏమి చెపుతున్నారో ఆలకించి ఆ ప్రకారం బుద్దిగా మసలుకోవటం మంచిది. ప్రజలు కూడ  అలా మసలుకునే వారినే ఎన్నుకోవటం మంచిది. అసలు చార్ దాం ప్రాంతాన్ని "పవిత్ర ప్రాంతం" గా ప్రకటించి, రాజకీయ జ్యోక్యం లేకుండా చేయాలి.

  ఉత్తరాకాండ్  రాజకీయ నాయకుల, అధికారుల స్వార్ద ప్రయోజనాలకు  పాపం దేశం లోని  వివిద ప్రాంతాల  భక్తులు ప్రాణాల రూపం లో మూల్యం చెల్లించారు. తక్షణమే వారందరికి ఉత్తరాకాండ్ రాష్ట్ర ప్రబుత్వం, మరియు కేంద్ర ప్రబుత్వాలు మనిషికి పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. తక్షణమే దెబ్బ తిన్న ఆద్యాత్మిక క్షేత్రాలను తిరిగి పూర్వ విదంగా పునరుద్దరించాలి. కనీసం మనుషులుగా ఆ పనైనా చేస్తారని ఆశిద్దాం.  

Wednesday, June 19, 2013

కే.సి.ఆర్. మార్క్ తెలంగాణా రాకున్నా, కాంగ్రెస్ మార్క్ "ప్యాకేజి"వస్తుంది!


                                                                  

  వచ్చే ఎన్నికల లోపు తెలంగాణా ఇవ్వగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బి.జె.పి. వారు ఎన్ని హామీలు గుప్పించిన వారు అధికారం లోకి వచ్చిన తర్వాతే సాద్యం, కాబట్టి ఎన్నికల వరకు  వారు చెయ్యగలిగింది ఏమి లేదు.తెలంగాణా మీద ఏమి తేల్చకుండా ఎన్నికలకు సిద్దపడే దమ్ము అధికార కాంగ్రెస్ కి లేదు.అలా చేస్తే,తెలంగాణాలో ఆ పార్టీ అడ్రెస్ లేకుండా పోయే ప్రమాదముంది. పోని తెలంగాణా డిక్లేర్ చేదామా అంటె ప్రాంతీయ కుంపట్ని ఎగదోసి జాతీయ స్తాయిలో పొగపెట్టుకోవడం పెద్ద తలకాయ నొప్పి.ఇక మిగిలింది తెలంగాణా వాదులను ఊరడింపచెయ్యడానికి ఏదో ఒకటి తక్షణమే చెయ్యాలి కాబట్టి కోర్ కమిటి ఈ విషయంలో హడావుడి చేస్తుంది.

  ప్రస్తుత తరుణంలో "తెలంగాణ"కు బారీ "ప్యాకేజి" ఒకటి ప్రకటించి అది తమ పార్టీకి తెలంగాణా మీద ఉన్న ప్రేమ అని చాటుకోవాలని చూస్తుంది. ఇప్పుడు తెలంగాణా ఇస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ కే. సి.ఆర్. పార్టికే దక్కుతుంది కాబట్టి అలా కాకుండా ప్యాకేజి ప్రకటిస్తే ఆ క్రెడిట్ తమ పార్టీ కొట్టేయొచ్చు అని పార్టిలోని తెలంగాణా వాదులకు నచ్చచెప్పి పార్టీలోనుండి టి.ఆర్.యస్ కి వలసలను కట్టడి చేస్తుంది. అటు రాష్ట్రం విబజించటం లేదు కాబట్టి సమైక్య వాదులను సంత్రుప్తిపరచినట్లవుతుంది.ఇన్నాళ్ళు చేసిన ఉద్యమాలకు ఏదో ఒక బారీ ప్రతిపలం పొందాం కదా అని తెలంగాణా ప్రజలను బావించేలా చేసి కాంగ్రెస్ వారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతుంది. అలా ఒక బారీ ప్యాకేజితో కే.సి.ఆర్.కి ఉన్న అన్ని అవకాశాలను దెబ్బ కొట్టడానికి సమాయత్తమవుతుంది అధికారపార్టీ.పనిలో పనిగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేసి తెలంగాణా వీర వాదులకు కొన్ని పదవులు ఇవ్వవచ్చు. ప్యాకేజిలో కూడా తెలగాణా ప్రాంతానికి ఎన్నికల తర్వాత పార్టి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తాననవచ్చు. ఇక ఇంతకు మించి అధికార  కాంగ్రెస్ తెలంగాణా వారికి ఏమి కావాలి?

   ఈ దెబ్బతో కే.సి.ఆర్. మార్క్ తెలంగాణా రాకున్నా, కాంగ్రెస్ మార్క్ ప్యాకేజి రావడం ఖాయం.     

Tuesday, June 18, 2013

"తెలంగాణా ఉద్యమం " వల్ల లాభపడుతున్న ఆంద్రా విద్యా సంస్తలు!


                                                              
                                                               
  తెలంగాణా వచ్చుడు ఎప్పుడో తెలియకున్నది. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని ఊదరకొట్టిన అధికారపార్టీ నాయకులు" ఇక ఈ పార్టీ వల్ల కాదురా భయి" అని చెప్పి ఆశతో  కే.సి.ఆర్. పార్టిలో చేరుతున్నరు. ఇక కే.సి.ఆర్. గారైతే తెలంగాణా ఇవ్వకుంటే దంచుడు ఖాయమ్ అని అప్పుడప్పుడు గర్జిస్తున్నరు. తెలంగాణా లో ఉన్న ఓ.యు. విద్యార్దులు తెలంగాణా కోసం" తెగించి పోరాడండి" అని పిలుపులిస్తూ అడపా దడప బళ్లు బందు పెడుతుంటే, మన పోరగాళ్ల చదువులు గిట్లయితే గెట్ల అని తల్లితండ్రులు ఒకటే హైరానా పడుతుండ్రు.

  నేను ఆ మద్య విజయవాడ పోయేందుకని రైలెక్కినా. అది ఆదివారం . బండంతా చాలా రష్ గా ఉండె. ఇదేంట్రా ఆదివారం కూడా ఇంతా రష్ ఉందని ఆలోచిస్తూ పక్క పాసింజర్ని అడిగినా అందరూ ఏడికి పోతున్నరు అని. ఆయన నన్ను పిచ్చోడ్ని చూసినట్లు చూశి అన్నడు.
 ఇవాళ ఆదివారం కాద్ద? అని అన్నడు.

 అయితే ఏంది అన్నా.

  పిల్లలకి" ఔటింగ్ " అన్నడు.

 అంటే ? అన్నా తెల్లముఖం వేసుకుని.

  ఆయన నా వంక జాలిగా చూసి విషయం చెప్పిండు. విజయవాడలో తెలంగాణాకి చెందిన అన్ని ప్రాంతాల  నుండి సుమారు లక్ష మంది పిల్లలు, ఇంటర్ చదువుల కోసం చేరారు. వారిని చూడలంటే నెల కొక సారి వీలును బట్టి, ఆదివారం ఔటింగ్ ఇస్తరు. ఆ రోజున తల్లి తండ్రులు వెళ్లి,తమ పిల్లల్ని బయట తిప్పి వారికి కావల్సినవి కొని ఇచ్చి, సాయంత్రం తిరిగి కాలేజీలో దిగపెట్టి వస్తుంటారట.అందుకని ప్రతి ఆదివారం ఏవో కొన్ని కాలేజిలు ఔటింగ్ ఇస్తాయి కాబట్టి, తెలంగాణ నుండి వచ్చే తల్లితండ్రులతో రైళ్లు రద్దీగా ఉంటాయట!

  అదేమిటి, హైద్రాబాద్ ఇంకా ఇతర పట్టణాల్లో మంచి కాలేజీలు ఉండగా ఇంటర్ కోసం విజయవాడ  రావడం ఏమిటి? అని మరింత అమాయకంగ అడిగిన.

  ఎన్ని మంచి కాలేజిలు ఉన్నా, ఎప్పుడు నడుస్తాయో, ఎప్పుడు బందవుతాయో తెలియని పరిస్తితుల్లో అక్కడ చదివించడం కష్టమనే, ఇల్ల లక్షలు ఖర్చు పెట్టి, ఇక్కడ చదివిస్తున్నం.అనాడు.

  మరి లక్షలు ఖర్చు పెట్టలేని వారి పరిస్తితి ఏమిటి? అని అడిగిన.

 దానికి ఆయన చేతులు పైకెత్తి అంతా ఆ పరమత్మ కెరుక అన్నడు. అంటే తెలంగాణా ఉద్యమం వల్ల, సామాన్య విద్యార్ది నష్టపోతుంటే, ఆంద్రా విద్యా సంస్తల యజమానులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్న మాట. ఔరా! తెలంగాణా రాకూడదూ, అలా అని చెప్పి తెలంగాణ ఉద్యమం ఆగకూడదు. ఇది ఆంద్రా విద్యా సంస్తల యజమానుల బావన!
  తెలంగాణా ఉద్యమమ్ జిందాబాద్! ఆంద్రా విద్యా సంస్తలు జిందాబాద్! 

Friday, June 14, 2013

ఆంద్రాలో 5682 ,12878 రాంక్లు కి వచ్చిన మెడిసిన్ సీటు తెలంగాణాలో 3445, 6029 రాంక్ కే ఎందుకు మూసుకు పోయింది?

                                                                      


   అంద్రాకి తెలంగాణాకి అభివ్రుద్దిలో ఏ మాత్రం విచక్షణ చూపించటం లేదు, మాకందరు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అని పాలకులు చెపుతుంటే, చెవిలో పువ్వులు పెట్టుకుని, నోట్లో వేళ్లు వేసుకుని వినే వారు వింటుంటారు. మాకు ప్రాంతీయ బేదాబావాలేమి లేవు, డబ్బున్నవారైతే చాలు, ఏ ప్రాంతం వారికైనా పనులు చేస్తాము అంటే అది కరక్టే అని నమ్మవచ్చు. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే ఈ మద్య medicine    రాంకులు వచ్చాయి. పేపర్లలో ఏ రాంకుకు ఎక్కడ సీటు వస్తుంది అని అంచనా వేసుకోవడానికి పోయిన సంవత్సరం లాస్ట్ రాంక్ లిస్ట్ కాలేజీల వారిగా ఇచ్చారు. అవి పరిశిలించిన నాకు ఎందుకో తెలంగాణా విద్యార్దులకు బోల్డంతా అన్యాయం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది అనిపిస్తుంది. ఇది నిజమా? కాదా? చెప్పండి. ముందు పైనున్న రాంకుల లిస్ట్ గమనించండి.

                                తెలంగాణా ప్రాంతం    (లాస్ట్ కటాప్ మార్కులు).         అంద్రా ప్రాంతం

                                      బాలురు              బాలికలు                   బాలురు         బాలికలు

     (1) ఓపెన్ కేటగిరి           1090                    749                        1495             1357
                                         1796                   1728                       2032             2097

     (2)  బి.సి A  కేటగిరి        4849                    4150                       5502             4390
                                         6570                    6489                        6816            6747

     (3). బి.సి Bకేటగిరి           2168                   1837                         4813             4157
                                          
                                           3445                  3414                         5682             5674

     (4) బి.సి C కేటగిరి           2907                   2733                           2110           2519
                                          4373                   4628                           3516            3521 

     (5) బి.సి D కేటగిరి           2103                    2123                          2323            2077
                                          3095                    3224                          3487           3410
           

    (6). బి.సి E కేటగిరి          3204                    3085                         7935                8299
                                         4718                    4863                          8114              8954


      (7).ఎస్.సి.కేటగిరి         5197                       4837                         6741              6867
                                         7764                      7549                        8884               8910


     (8)ఎస్.టి  కేటగిరి         4254                         3836                       10363            10003
                                      6430                       6029                        12533              12878

               
 పై కేటగిరిలలో మొదటి వరస ప్రబుత్వ వైద్య కళాశాలలో కటాఫ్ మార్కులు కాగా, రెండవ వరుస ప్రివేట్ (ఏ) కేటగిరి లో కటాప్ మార్కులు తెలుపుతున్నాయి. పై లిస్ట్ పరిశిలించినపుడు ఓపెన్ కేటగిరే కాకుండా బి.సి.(బి),ఎస్.సి., ఎస్.టి , బి.సి (ఇ) కేటగిరి విద్యార్దులకు సంబందించి, తెలంగాణా, ఆంద్రా ప్రాంతం లలో చాలా వ్యత్యాసం ఉంది.ఇందులో రాయల సీమ ప్రాంతం కలుపలేదు. పది జిల్లాలు ఉన్న తెలంగాణాకి నాలుగు ప్రబుత్వ వైద్య కళాశాలలు ఉంటే, తొమ్మిది జిల్లాలు ఉన్న, కోస్తాంద్రకు అయిదు ప్రబుత్వ కళాశాలలు ఉండటం, మొత్తం మీద తెలంగాణా కంటే, కోస్తాంద్ర వారికి సుమారు మూడు వందల సీట్లు దాక ఎక్కువ ఉండటం ఈ రాంకుల వ్యత్యాసానికి కారణం . దీని వలన తక్కువ రాంక్ వచ్చిన తెలంగాణా విద్యార్ది సీటు పొందలేక పోతుంటే, రెట్టింపు రాంక్ వచ్చిన కోస్తాంద్ర ప్రాంత విద్యార్దులు వైద్య కళాశాలలొ సీట్లు సంపాదించి, డాక్టర్లు కాగలుగుతున్నారు. ఇంత కంటే వేరే సాక్ష్యాలు కావాలా? తెలంగాణా విద్యార్ది లోకం వివక్షతకు గురిఅవుతుంది అని చెప్పటానికి.ఇలాంటి పరిస్తితి దాపురించబట్టే, తెలంగాణా విద్యార్దులు "జై తెలంగాణా" అంటూ ప్రత్యేక తెలంఘానా కోరుకుంటున్నారు.వారి డిమాండును కాదనే నైతిక హక్కు ఎవరికి లేదు.

  ప్రబుత్వాలు అనేవి ప్రజల వెనుక బాటు తనమే కాదు, ప్రాంతాల మద్య సమతుల్యం పాటించి, పాలన చేయకపోతే తప్పకుండా ఏర్పాటు వాదాలు తల ఎత్తుతాయి . ఇది చారిత్రక సత్యం . పైన తెలిపిన వైద్య సీట్ల పంపకం తెలంగాణా వివక్షతకు ఒక మచ్చుతునక మాత్రమే.ఇదే తరహా లో అన్ని రంగాలోనో జరిగింది. దీనిని తక్షణమే సరి చెయ్యాల్సిన అవసరం ఉంది. 

Tuesday, June 11, 2013

ప్రయాణం లో బోర్ కొట్టిన వేళ బోరింగ్ కొట్టడం ఒక అనుబూతి.



                                                            
సప్తాశ్వవాహనుడు ఏతెంచుతున్న వేళ!


సప్తాశ్వవాహనుడు ఏతెంచన్ వేళ!

ప్రయాణంలో  మా వాహనం ఆగిపోయిన వేళ!

నేనూ, నా శ్రీమతి   


మా కుటుంబ సబ్యులతో నేను స్టిలిచ్చిన వేళ

 నేను సకుటుంబ,బందువులతో......

రాజా గారు లక్ష్మి గారితో...

నేను బోర్ కొట్టి బోరింగ్ కొడుతున్న వేళ!


నేను బోర్ కొట్టి బోరింగ్ కొడుతున్న వేళ!2

ఈ చిత్రంలో ఉన్న వెలుగేమిటొ మా కర్దం కావటం లేదు. మా వెహికిల్ పోతున్నఫ్ఫుడు తీసిన చిత్రం ఇది. పై నుండి నల్లని చాయ, ఆ పై వెలుగు ఏదో బూమి మీదకు వస్తున్నట్లు ఉంది. మీరెవరఈనా అదేమిటో చెప్పగలరా?




  మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు కాని నేనైతే రోడ్డు ప్రక్కన ఉన్న "బోరింగ్ పంప్" కొట్టి వ్యాయమం చేసాను.

  మేము ఈ మద్య శ్రీ శైలం చూద్దామని సకుటుంబ బందు జన సహితంగా (అంతా కలిసి పదిమందే లెండి} బయలుదేరాము. గుంటూరు లో ఒక ట్రావెల్ వారి టెంపొ ఒకటి మాట్లాడుకుని ఉదయానే బయలుదేరాము. తొమ్మిదింటికల్లా శ్రిశైలంలో ఉండాలని చెపితే పాపం డ్రైవర్ వేగంగా బండిని నడుపుతున్నాడు. త్రిపురాంతకం దాటిన తర్వాత అనుకుంటా , ఉన్నట్లుండి వెనుక టైరులోని గాలి తుస్సుమనేసరికి బండి ఆపి చూద్దుము కదా, కొత్తటైరు వేడెక్కిందో ఏమో, అయిర్ వచ్చి ట్యూబు, టైరు పనికి రాకుండా పోయాయి. చిన్నగా డ్రైవర్ టైర్ మార్చే కార్యక్రమంలో పడ్డాడు. నాకు ఏమి చెయ్యాలో తెలియ రాలేదు. అటు ఇటూ కాసేపు పొటోలు తీసుకున్నాక కాసేపు వ్యాయమం చేద్దామనిపించి చుట్టూ చూస్తే అక్కడే రోడ్డు ప్రక్కనే ఒక బోరింఘ పంపు కనిపించింది. అక్కడకు వెళ్ళి దానిని కొట్టడం మొదలుపెట్టా!అంతలో బండి రడీ అనేసరికి వచ్చి వాహనం లో కూలబడ్డాను.

   బోర్ కొట్టిన వేళ బోరింగ్ కొట్టడం ఒక అనుబూతి.       

Monday, June 10, 2013

"అప్లికేషన్ నిర్బయ" అని కాదు "అప్పీల్ టూ శ్రీ క్రిష్ణ" అంటే బాగుంటుందేమో!


                                                                           

  ఈ మద్య డిల్లీ రేప్ బాదితురాలు పేరు (అసలుది కాదు) మీద  స్త్రీ ల  రక్షణా పదకాలు  ప్రవేశ పెడుతున్నారు. ఆ అబాగ్యురాలి మీద జరిగిన అత్యాచారానికి గుర్తుగానో, లేక అటువంటి వాటిని  అరికట్ట లేక పొతున్న మన చేతకాని తనానికి నిదర్శనంగా ఆ పేరు పెడుతున్నారో తెలియదు కాని, ఆ పేరు గుర్తుకువచ్చినప్పుడల్లా యావత్ జాతి మొత్తం సిగ్గుతో తలవంచుకోవలసిందే తప్పా అంతకు మించి మాట్లాడేది ఏమి లేదు. కనీసం ఆ నిర్బాగ్యురాలి వెంట ఉన్న వాడైనా ఆ ముష్కరులతో పోరాడి వీరమరణం పొంది ఉంటే,  ఈ దేశంలోని మగవాళ్ళు కొంచం తల యెత్తుకుని ఉండేవారు.
      ఈ రోజు పేపర్లో ఒక వార్త చూశాను. చాలా సంతోషం అనిపించింది. మన ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి ఆదునిక పరిజ్ణానం ఉపయోగించి "జస్ట్ వింగ్ ఇంఫర్మేటిక్స్" సంస్త వారు రూపొందించిన " m DEFENCE  అనే యాప్ ను మంత్రి గారు ఆవిష్కరించారు. దీ ని వలన స్త్రీ లు విపత్కర పరిస్తితుల్లో, ఒక మొబైల్ బటన్ ప్రెస్స్ చెయ్యడం ద్వారా తమ బందువులను ,పోలిసులను, అలర్ట్ చేయవచ్చట. దీనికి సంబందించిన పూర్తి సమాచారం కొరకు ఈ లింక్http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/06/10/ArticleHtmls/10062013009019.shtml?Mode=1    ని క్లిక్ చెయ్య గలరు. 
    అంతా బాగానే ఉంది కాని ఈ యాప్ కి అప్ప్లీకేషన్ నిర్బయ అని ఆంద్రజ్యోతి వారు నామకరణం చేసేదానికన్నా "అప్ప్లీకేషన్ టూ శ్రీ క్రిష్ణా " అని పెరు పెడితే బాగుండేమో!  ఎందుకంటే ఆ నాడు నిండు సబలో ఒక స్త్రీ  మాన మర్యాదలను నాశనం చెస్తుంటే నిలువుగుడ్లు వేసుకుని చూసిన మగవాళ్లందరిని ఇంక్లూడింగ్  హ్హ్బర్తలను అసహ్యహించుకుని, అన్న అయిన శ్రీ క్రిష్ణుని ప్రార్దించింది ద్రౌపది. అబల మాన రక్షణ కన్న అన్య   దర్మం ఏది ఉండదని ఆ బగవానుడు చీరలను ప్రసాదించి బారత స్త్రీ మాన గౌరవాన్ని కాపాడాడు. అటువంటి వారిని స్పూర్తిగా తీసుకుని ఈ యాప్ కి ఆ పేరు పెట్టి ఉంటే ఎంతో బాగుండేది అని నా అభిప్రాయం. ఏది ఏమైనా  స్త్రీల   మాన మర్యాదలు కాపాడే టెక్నాలజి ని ఆ నాడే శ్రీ క్రిష్న బగవానుడు చీరలు ప్రసాదించే సందర్బంలో ఉపయోగించాడు కాబట్టి ఆయనే ఆద్యుడు. అటువంటి టెక్నాలజిలను ఆవిష్కరించే వారసందరికి ఆ బగవంతుని క్రుప కలుగుగాక!

Saturday, June 8, 2013

విజ్ణానుల నోట్లొ ఇరుకున్న చేప పిల్ల!

Asthma patients start gathering for fish medicine at Exhibition Grounds in Hyderabad on Friday.
శుక్ర వారం నాడె చెప మందు కొసం క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న ఆస్మా రోగులు
                                                                      


  పాపం  ఆ అన్నరు! ఊ అన్నరు1చేప ప్రసాదాన్ని ఇవ్వడం మూర్కత్వం అన్నరు. దానికి సర్కార్ సహయం చెయ్యడానికి ససేమీర విలు లేదన్నరు.నానా యాగీ చేసి ఒక ఆర్డర్ వచ్చే సరికి అదంతా తమ ఘన విజయమని వీరంగం వేసారు. పాపం వారి ముచ్చట ఒక రోజైనా కాకముందే నీరుకారి పొయింది.
  కోడలా ! కోడలా! నీ మురిపెం ఎంతసేపంటే,మా అత్త ఊళ్లోకి వెల్లోచ్చేదాక" అందట. అలా ఉంది జన విజ్ణాన వేదిక వారి పరిస్తితి, పాపం లొకాయుక్త వారు బత్తిన సోదరులు కి వ్యతీరేకంగా తీర్పు ఇచారని చంకలు గుద్దుకున్న వారికి రోలైనా ఆ అనందం నిలవలెదు. కారణం హఈ కోర్టు వారు సదరు తీర్పును మద్యంతర ఉత్తర్వుల ద్వారా  కొట్టి పారేసారు. చెసారు. బత్తిన సోదరుల చెప ప్రసాదం విషయంలొ ఇదివరలొనే హైకోర్తు వారు స్పష్టమైన అదేసాలు ఇచ్చినప్పటికి దానిని కాదని వేరే విదంగా బత్తిన బ్రదర్స్ని ఇరకాటంలొ పెట్టడానికి ప్రయత్నించిన విజ్ణానులకు హై కొర్తు మద్యంతర ఉత్తర్వులు చెంప పెట్టు లాంటిది.  ఇకనైనా వారు చవక బారు ప్రచారాల కోసం ప్రజలకు హని కలిగించని "చేప ప్రసాదం" లాంటి వాటి మీద కాకుండా హాని కలిగిస్తున్న, కల్తీ పాలు, కల్తీ నీళ్లు, కల్తీ మందులు లాంటి వాటి మీద యుద్దం చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. లెదూ చీప్ పబ్లిసిటే వారికి ముఖ్యమనుకుంటే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడక మానరు!

Tuesday, June 4, 2013

పంచె "గోచీ" ఊడబీకినంత ఈజీగా ఊడబీకే "పదవి" ఏదో తెలుసా?


                                                                   
                                                              

  ఇంకేది "మంత్రి" పదవే మరి! పాపం మన  గారు మంత్రి హోదాలో విదేశాల కెళ్ళారా! "మాజీ మంత్రి " హోదాలో స్వదేసాన్కి రావాల్శి వచ్చింది! ఇంత కంటే అన్యాయం ఉంటుందా. కనీసం అటెండర్ పోస్ట్ ఊడబీకాలన్న "నెలరోజుల" ముందు నోటీస్ ఇవ్వాలే, ఆ పాటి చెయ్యదా ?" మంత్రి"  పదవి!  ఇంతోటి పదవి చూసుకునా వీరంతా ఎగెరెగిరెగిరి పడేది.  పదవి కోసమా అధినేత ల చుట్టూ ప్రదక్షిణాలు చేసేది? దీని మీద నాకొక చిన్న డౌట్ వచ్చింది, ఆదేమిటంటే,

  మొన్న మన మంత్రి గారు వేరే దేశమేదో వెళ్ల్లారు కదా, సపోజ్, పర్ సపోజ్, అక్కడ వారికి ఏదైనా ఒక సన్మాన కార్యక్రమమ్ జరుగుతుందనుకుందాం.అప్పుడు అక్కడ నిర్వాహకులు వారిని ఆంద్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా
మంత్రి గా ఉన్నా రెడ్డి గారిని వేదిక మీదకు అహ్వానించి సన్మానం చేస్తున్న సమయం లోనే, ఇక్కడ ఒక్క మాట కూడ చెప్పకుండా ఆయన గారి మంత్రి పదవి పీకేసారనుకోండి! ఏమిటి పరిస్తితి? స్టేజ్ ఎక్కేటప్పుడు మంత్రిగా ఉన్న వాడు స్టేజ్ దిగేటప్పుడు మాజీ గా మారిపోయాడు అంటే ఇంతకంటె నగుబాటు ఉంటుందా? గుండే పోటు వచ్చినట్లు వస్తుంద వైద్య ఆరోగ్య శాఖా మంత్రి గారికి "మంత్రి పోటు" అనేది! ఎంత ముఖ్యమంత్రి గారి ఇష్టం అయితే మాత్రం "పంచె గోచి" ఊడబీకినంత ఈజీ గా పీకేస్తారా "మంత్రి " పదవిని? పంచె గోచి అయినా బాజారులో ఊడపీకరు,ఇంటికెల్లో, చాటుకెళ్ళొ పీకుతారు, పాపం మన మంత్రి గారికి ఆ గౌరవం కూడా ఇవ్వకపాయే! విదేశాలో ఉండగనే పీకీ పారేసే!

   ఏమో ఎవరికెరుకా? సదరు మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఎక్కెదెక్కడా ఏమేమీ పీకారో? అందుకే ఆయన ఇలా చెప్పా పెట్టకుండా పీకీ పారేసి, కసి తీర్చుకున్నారనుకుంటా!

Monday, June 3, 2013

పైసల్ కోసం పక్కలు వేసేవారికి,పదవులు కోసం పార్టీలు మారే వారికి గల బేదమేమి?


                                                                    
అదినేతలూ, రాజకీయ రంకును ప్రోత్సాహించకండయ్యా!



  రెండూ ఒకటే మొదటిది శారీరక పరమైన "రంకు", రెండవది రాజకీయ పరమైన "రంకు", అంతే తేడా!

  అరెరే!పదియెండ్లు, ముప్పైయేండ్లు ఒకే పార్టిలో ఉండి అనేక కీలక పదవులు అనుభవించిన వారిక్ కూడా "పదవుల" మీద ఆశ చావకపోతే ఎలా? వీరిని నమ్మా ప్రజలు వోట్లు వేసి గెలిపించేది?ఇన్నాళ్లు నమ్మిన పార్టిలనే నట్టేట ముంచిన వాడు, జనాల్ని ముంచడని గ్యారంటీ ఏమిటి? పై పెచ్చు ముందుగానే "బేరాలు" ఆడుకుని పలాని సీటు ఖాయమనుకున్నాకే పక్క మారుతున్నారట!

  ఇలాంటి వారిని గురించి రామదాసు గారు ఒక మంచి మాట చెప్పారు!

  "పదవూలు, బిరుదులు పైనా,
   పర నారీ పెదవుల పైనా,
   బుద్దంతా నిలిపేవాడూ, బూడిదైపోతాడు!

   ఖచ్చితంగా ఎరుక గలిగిన ప్రజలు, వీరికి డిపాజిట్లు దక్కకుండా చేస్తారేమో చూడాలి.   

లేచిపోవడంలో ఉన్న మజా! అనుభవించితే తెలియునులే!లలలాం...లలలాం...లలా...

                                                                       


   ఈ రోజు పేపర్లో ఒక మాటర్ చూశా!నగరాల్లో, కలిగిన తల్లితండ్రులు  తమ అమ్మాయిలు కనిపించాడం లేదని పిర్యాదు చేయటం ఈ మద్య ఎక్కువుగా జరుగుతుందట! ఎదైనా అమ్మాయిల విషయంలో జాగర్తగా వ్యవరించాల్సిన అవసరం అటు తల్లి తండ్రులకు, ఇటు పోలిసులకు ఉంది కాబట్టి, సాద్యమైనంత వరకు అమ్మాయిల మిస్సింగ్ కేసులు సీక్రెట్ గానే దర్యాప్తు చేయబడతాయి.

   అమ్మాయిల మిస్సింగ్ ల కేసులలో నూటిక్ తొంబయి వంతులు,ఇష్ట పూర్వకంగా  లేచిపోయిన బాపతేనట! అందులో డెబ్బయి  శాతం కొంకాలం జాలీగా గడిపాక తిరిగి ఇంటికి బుద్దిగా తిరిగి వచ్చి, తల్లితండ్రులు చూశిన వరుల ముందు తలవంచుకుని తాళి కట్టించుకుంటునారట!మిగతావారి సంగతి ఆ దేవుడికే ఎరుక! ఇలా లేచిపోతున్న వారిలో అదిక సాతం విద్యార్ధినులు, ఉపాది కోసం పల్లెటూళ్ల నుండి వచ్చిన వారు అధికంగా ఉన్నారట!మితిమీరిన సెల్పోన్ వినియోగం, సామాజిక వెబ్సైట్లు అంటే పేస్ బుక్ లో ఖాతాలు, చాటింగ్ లు ఇవన్ని లేచిపోవడానికి, లేపుకుపోవడానికి కారణాలవుతునా యని సామాజిక వాదుల పరిశిలనలో తేలిన అంశాలు.

   మన సమాజంలో "డేటింగ్" ని అంగీకరించం. కాని లేచిపోవడాన్ని ఆపలేని దౌర్బాగ్య పరిస్తితిలో ఉన్నాం. పద్దెనిమిదేళ్లు నిండితే,లేచిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. హాయిగా అన్ని అనుభవాలు పొందాక "చీ" వీడితో జీవితం వేస్ట్ అనేసి ఇంటికి వచ్చిన పిల్లలను గప్ చుప్గా కాని కట్నం మరింత ఇచ్చయినా కాని "కన్యా దానం(?) " చేసేస్తుంటారు తల్లి తండ్రులు. పాపం వారికి లేపుకు పోయిన వారిమీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం చట్టం ఇవ్వలేదు మరి!కొంత మంది అయితే ఇదంతా వయసు చేసే పొరపాట్లు, విదేశాలలో "డెటింగ్" ఉంది కాబట్టి పిల్లలు తమకు నచ్చిన వరిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది, డర్టీ ఇండియాలో అది లేదు కాబట్టి దాని బదులు "లేచిపోయి" పరీక్షించుకుంటునారు అంటున్నారు. నిజమే మరి! పూర్వ కాలంలో పెండ్లి పెద్దల ఇష్టం కాబట్టి,ఏ టెస్ట్ లు లేకుండానే పెళ్లిలు చేసుకునే వారు. మరి ఇప్పుడు పిల్లల ఇష్టమే కాబట్టి వారు కొంత కాలం ఒకరి నొకరు అర్థం చేసుకోవదూ! అందుకే "లేచిపోవడం" అన్న మాట! అన్న మాటేమిటి, ఉన్నమాటే!

  అటు ప్రభుత్వం వారు కూడ యువతరానికి "డేటింగ్" స్వేచ్చ ఉండాలనే బావిస్తుండవచ్చు! కాకపోతే చాదస్తపు పెద్దలు, ఆ మాటంటే నాన నానా యాగీ చేసి, ప్రబుత్వాలను దించి వేస్తారనే బయంతోనో, లేక ఆ కారణం తో మత వాద పార్టిలు ఎక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంటాయో అన్న బయంతో ఇలా ఇండైరెక్ట్ గా " పద్దెనిమీదేళ్ళు" వయో పరిమితి పెట్టి, యువతకు ఆ తర్వాత ఫుల్  స్వేచ్చ నిచ్చింది కాబట్టె, ఈ విదంగా "డేటింగ్" లు బదులు "లేచిపోయింగ్" లు ఎక్కువవుతుండవచ్చు!

   ఇక పోలిస్ వారేమో లేపుకుపోయే వారిని చట్ట ప్రకారం మేమేమి చెయ్యలేము, మీ పిల్లల్ని జాగర్తగా కాపాడుకోవడం మీ బాద్యత అని తల్లితండ్రులకు ఉచిత సలహాలు పడేస్తుంటే, చెసేదేమి లేక పాపం తల్లితండ్రులు తిరిగివచ్చిన తమ బిడ్డల్ని "పరువు హత్యలు" చేసే దుష్ట సాంప్రదాయం మనది కాదుకనుక "కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని" ఎవరి కాళ్ళో పట్టుకుని వారి కాళ్ళు కడిగి, "కన్యా దానం " బదులు "కాంతా దానం" చేసి అటు పరువుని ఇటు పిల్లల్ని కాపాడుకుంటునారు.

  ఓ లేచి పోయే  యువతీ యువకులారా! ఒక్క సారి ఏదయినా ఎంట్రన్స్ టెస్ట్లు జరుగుతున్న సెంటర్ క్ వెళ్ళి చూడండి. లోపల పరీక్ష రాసేది ఒకరైతే,  బయట మీ మీద ప్రేమాభిమానాలతో, మీకేరీర్ కోసం, నాలుగు కళ్ళు ఎంత ఆత్రంగా చూస్తుంటాయో! వారేరా తల్లి తండ్రులు! నిత్యం మీకోసం తపించిన ఆ తల్లితంద్రుల అనుమతి మీ పెండ్లికి అవసరం లేదా? అంత క్రుతజ్ణుల గా ఎలా మారి పోతున్నారు? పాపం తల్లితండ్రులను ఈ దౌర్బాగ్య పరిస్తితి నుండి కాపాడే వారెవ్వరు?      


                                                          

Saturday, June 1, 2013

పడితే "ఉడుం" పట్టే పట్టాలి! ఏడిస్తే "గబ్బిలం" ఏడుపే ఏడ్వాలి!













                                                    ఏడిస్తే "గబ్బిలం" ఏడుపే ఏడ్వాలి!


  ఈ మద్య మేము ఒక చోటుకి వెళ్లాం. అది కొంచం చెట్టు చేమలు ఉన్న ప్రాంతం కావడ వల్ల, అక్కడ కొన్ని జీవులు కనిపించాయి. పట్టణాలో ఉండే వారికి ఇవి సాదారణంగా కనపడవు. అందులో ఒకటి "ఉడుము" కాగా, రెండవది గబ్బిలం. సరదా కోసం ఆ రెండింటిని పొటో తీసాము. గబ్బిలం ని పట్టుకుంటే చూడండి అది ఎలా తేలు కుట్టిన దొంగలా ఏడుస్తుందో!ఉడుము మాత్రం ఎంత సేపు నిరీక్షించినా గూడులో నుండి బయటకు రాలేదు. పట్టుకుందామని ప్రయత్నిస్తే, లోపలకు వెల్లిపోతుంది. అందుకే లోపల ఉంచే పోటో క్లిక్ చేసాం.