పవర్ ఫుల్లా! అనిపిస్తుంది. అక్కడ కుంభకోణాల్లో నిందితులైన వారు కిమ్మన్నకుండ రాజీనామాలు చేసి వైదొలిగితే, ఇక్కడ కోర్టుల చేత సమన్లు పొంది, విచారణకు సైతమ్ హాజరై రావడానికి రెడీ కాని రాజీనామాలు మాత్రం ఇవ్వం గాక ఇవ్వం అంటున్నారు. అటు ముఖ్యమంత్రి గారు కూడా వారికి న్యాయ సహయం అందించాడానికి సిద్దం అన్నట్లు ప్రవర్తిస్తూ, ప్రజల్ని విస్మయ పరుస్తున్నారు. మన మంత్రులు ఏ చట్ట ప్రకారం న్యాయ సహాయం పొందడానికి అర్హులో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.
ఇంత అనైతిక పాలన నడపడం కాంగ్రెస్ ప్రబుత్వానికి అవసరమా?. అక్కడ కేంద్రంలో, ఇక్కడ రష్త్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికి ఈ ద్వంద నీతి ఎందుకో అర్దం కావడం లేదు. బాహూశా మన మంత్రులు కేంద్ర మంత్రులకంటే పవర్ ఫుల్లై ఉండాలి! లేదా మన ఆంద్రులుకు ఇటువంటి అవినీతి ఆరోపణలు బాగా అలవాటై ఉండి, వీటి గురించి పెద్దగా పట్టించుకునేదేముందిలే అనే ద్రుక్పదం కలవారై ఉండాలి.
ఆంద్రులు ఆరంభశూరులే కాదు, అవినీతి సమర్దనా ఔదార్యులు! అని కూడా మనం చరిత్రలో మిగిలిపోయే రోజు వస్తుంది.
No comments:
Post a Comment