Saturday, February 2, 2013

నువ్వు వస్తానంటే, నేనిచ్చేస్తాను తెలంగాణాని.



  చివరకు తెలంగాణా విషయం "రాజకీయ ప్రేమ" గా మారిపోయింది. తెలంగాణా ప్రజల ఆత్మాభిమాన్నాని గడ్డి పోచ క్రింద జమ చేసి, నీ  పార్టీని మా పార్టిలో విలీనం చేస్తే తెలంగాణా ఇస్తాననడం నీచాతి నీచమైన ప్రతిపాదన. ఇన్నాళ్ళు తెలంగాణా ప్రజలు చేసిన పోరాటం, వారి ఆకాంక్షలు అన్నీ ఒక పార్టీ వారి ఆకాంక్షలు మాత్రమే అని చాటాలనే కుతంత్రం లో బాగమే ఈ ప్రతిపాదన అనుకోవచ్చా? లేక పోతే ఏమీటి? నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను, ఒక తప్పుడు సంకేతానిచ్చే ప్రతిపాదనతో ముడిపెడతారా?

  "నువ్వు నాతో కలిస్తే నీకు ఆస్తి రాసిస్తా" అని ఎవరు ఎవరితో ఏ సందర్బంలో అంటారు? అటువంటి సంబందమ్ లాంటిదేనా తెలంగాణా అంశం. అలా వచ్చే "తెలంగాణా" తెలంగాణా ప్రజలకు అవసరమా? అలోచించండి నిజమయిన తెలంగానా వాదులారా!  

No comments:

Post a Comment