Saturday, February 2, 2013

నువ్వు వస్తానంటే, నేనిచ్చేస్తాను తెలంగాణాని.



  చివరకు తెలంగాణా విషయం "రాజకీయ ప్రేమ" గా మారిపోయింది. తెలంగాణా ప్రజల ఆత్మాభిమాన్నాని గడ్డి పోచ క్రింద జమ చేసి, నీ  పార్టీని మా పార్టిలో విలీనం చేస్తే తెలంగాణా ఇస్తాననడం నీచాతి నీచమైన ప్రతిపాదన. ఇన్నాళ్ళు తెలంగాణా ప్రజలు చేసిన పోరాటం, వారి ఆకాంక్షలు అన్నీ ఒక పార్టీ వారి ఆకాంక్షలు మాత్రమే అని చాటాలనే కుతంత్రం లో బాగమే ఈ ప్రతిపాదన అనుకోవచ్చా? లేక పోతే ఏమీటి? నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను, ఒక తప్పుడు సంకేతానిచ్చే ప్రతిపాదనతో ముడిపెడతారా?

  "నువ్వు నాతో కలిస్తే నీకు ఆస్తి రాసిస్తా" అని ఎవరు ఎవరితో ఏ సందర్బంలో అంటారు? అటువంటి సంబందమ్ లాంటిదేనా తెలంగాణా అంశం. అలా వచ్చే "తెలంగాణా" తెలంగాణా ప్రజలకు అవసరమా? అలోచించండి నిజమయిన తెలంగానా వాదులారా!  

నాన్నా "తెలంగాణా" పులి వచ్చే!

http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి

Friday, February 1, 2013

నాన్నా "తెలంగాణా" వచ్చే!


                                                                   

  చిన్నప్పుడు చదువుకున్న కథల్లో  "నాన్న పులి వచ్చె" అనే కథ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. టూకీగా కథ ఏమిటంటే ఒక మేకల కాపరి రోజూ తన మేకలను కొండగట్టు దిగువున ఉన్న ప్రాంతంలోకి తీసుకు  వెళ్ళి జగర్తగా మేపుకుని సాయంత్రం వేళకు ఇంటికి తోలుకెల్లేవాడు. కొండకు అవతలి వైపు ఉన్న అడవిలో పెద్దపులి ఒకటి ఉండేది.ఏ మాత్రం ఏ మరుపాటుగా ఉన్నా ఆ పులి దాడి చేసి మేకలను ఎత్తుకెల్లేది. కాబట్టి కాపరులు చాల జాగర్త గా మేకలను కాచేవారు. దాని బారి నుంచి మేకలను కాపాడటం ఎలాగో ఆ కాపరికి తెలుసు. అలా ఒక రోజు  ఆ కాపరి తన కొడుకును వెంట బెట్టుకుని మెకలను తోలుకుని వెళ్లాడు. కొండగట్టు క్రిందనే అతనికి పొలం ఉంది. ఆ పొలం లో పని చేసుకుందామని తన కొడుకుతో "ఒరే కొండయ్యా(కొడుకు పేరది) నేను పొలం లో పని చెయ్యాలి, ఈ మేకలను చూస్తుండు, పులి కనుక వస్తే వెంటనే నను పిలువు " అని జాగర్తలు చెప్పి వెల్తాడు.

   అలా కొంత సేపు గడిచేసరికి ఆ పిల్ల వాడిలో తను కేక పెడితే తండ్రి వస్తాడా రాడా అనే పిల్ల చాపల్యంతో పులి రాకపోయినప్పటికి "నాన్నా పులి వచ్చే" అని కేక పెడటాదు. అది విన్న ఆ తండ్రి అదరా భాదారా  పరిగెత్తుకుంటు మేకల దగ్గరికి వస్తే, అక్కడ పులి లేదు. ఏదిరా పులి అని కొడుకుని అడిగితే, ఊరికినే తమాషాకి పిలిచాను అనేసరికి కొడుకుని కోఫ్పడి వెలతాడు. అలా రెండు సార్లు జరిగే సరికి కొడుకు మాటల మీద నమ్మక్కం కోల్పోతాడు తండ్రి. చివరకు పులి రానూ వస్తుంది ఒక మేకని ఎత్తుకుని వెలుతుంది. ఈ సారి నిజంగా కొడుకు ఎంత అరచినా అదంతా అబద్దం అని ఆ తండ్రి రాడు. చివరకు వచ్చి చూస్తే ఒక మేక ఉండదు.కొడుకు ఆకతాయి తనం వల్లా మేకను కోల్పోయినందుకు విచారిస్తాడు ఆ రైతు.కాబట్టి అబద్దాలు ఆడకూడదని నీతి.

  ఈ కథ  మన తెలంగాణా ఏర్పాటు విషయం లో వర్తిస్తుంది. మన రాజాకీయ నాయకులు కేంద్రం వారు అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అనే అబద్దపు మాటలను నమ్మక, కాంగ్రెస్ వారికి తెలంగాణా ఇవ్వడం ఇస్టం లేదనే అభిప్రాయనికి వచ్చారు. అలా డిసెంబర్ ఎనిమిదవ తారీకున కూడ వారు ఇవ్వరనే ఉద్దేస్యంతోనే, మాకు తెలంగాణా వస్తే అబ్యంతరం లేదని చెప్పారు. తీరా తొమ్మిదో తారీకునా తెలంగాణా ఏర్పాటు త్వరలో మొదలవుద్ది అనగానే, గగ్గోలు పెడుతూ ఆంద్రా నాయకులు రాజీనామాలు చేశి హంగామా చేసే సరికి "సోనియా గాందీ" గారికి ఏమి అర్థం కాలేదు.అందరి అభి ప్రాయం తీసుకున్నాకే తాము తెలంగాణా ప్రకటిస్తే ఆంద్రా వాళ్ళూ ఎందుకు అబ్యంతరం చెప్పారో ఆమేకి అస్సలు అర్థం కాలేదు.

  ఆ తర్వాత కొంత కాలం వేచి ఉండి, మళ్లీ అందరి అభ్హిప్రాయం అడిగితే తిరిగి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సారి కరెక్ట్ గా చెప్పారేమో అనుకుని నెల రోజుల్లో తెలంగాణా ప్రకటణ ఖాయం అనే సంకేతాలు ఇచ్చారు. కాని మళ్ళీ అంద్ర వాళ్ళు గొడవ మొదలు పెట్టే సరికి అధిష్టానానికి ఈ ట్విస్ట్ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే వారికి మన తెలుగు కతల్ గురించి తెలియదు, పైన చెప్పిన కథ గురించి అస్సలు తెలియదు.

  అదిష్టానం వాగ్దానాల మీద పార్టీలకు నమ్మక్కం లేదు. అందుకే అదిగో తెలంగాణా ఇదిగో తెలంగాణా అంటే అవన్ని పిల్లకాయ మాటలుగా బావించారు. అలాగే పార్టీ అభిప్రాయాలను, అంద్రా ప్రజల అభిప్రాయాలను బేఖాతరు చేసి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్తితిలోను "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.