Monday, March 31, 2014

పవన్ "ఇజం" లోని ప్రక్రుతి సమతుల్యత బావనకు, "పావురాల గుట్ట " ఉదంతానికి ఏమైనా సంబందం ఉందా ?

                                                                         


నేను ఇదే బ్లాగులో 18 నవంబర్ 2012 న బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!" అనే టపాను పెట్టడం జరిగింది . అందులో మనిషి అనేకం అనుకున్నా , చివరకు భగవంతుడి డెసిషన్ యే పైనల్ అని "పావురాల గుట్ట ఉదంతం " ఉదాహరణ గా చెప్పాను.
  మొన్న వైజాగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గారు , తన "ఇజం " పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ అందులోని ఆరు అంశాలు గురించి టూకీగా చెప్పాడు . మొదటి 5 అంశాలు కామన్ గా అందరూ చెప్పేవే అనిపించింది . కాని అరవ అంశ మైన "ప్రక్రుతి సమతుల్యత " గురించి చెపుతూ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అని అన్నాడు కాని దాన్ని గురించి సరిగ్గా వివరించ లేదు . బహుశా రాజు రవితేజ అయితే బాగా వివరించి ఉండే వాడేమో . అయన రాసిన పుస్తకం ఇంకా మార్కెట్ లో కి రాలేదు కాబట్టి మనకు ఇజం లోని "ప్రక్రుతి సమతుల్యత" గురించి తెలుసు కోవటానికి కొంత సమయం పడుతుంది . ఇక్కడ ప్రక్రుతి అనేది దేవుడు అనే బావనలో ఉపయోగించి ఉండవచ్చు .
                                           తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు !
                                        బుద్ది బూములేలదాం అంటే రాత గాడుదులు కాద్దాం అందట
                                  
అనే సామెతలు మానవ సంకల్పాలు అనుకున్నవి అనుకున్నట్లు జరుగక ఊహించిన దానికి పూర్తీ వ్యతిరేక దోరణిలో జరిగే సంఘటనల అనుభవం లో నుండి పుట్టినవి . అదే భారతీయులను  సమాజంలో జరుగుతున్నా దుష్కృత్యాలను తాము నిరోదిoచ లేమని నైరాశ్యానికి గురి అయినప్పుడు , అందులోనుoఛి  తీవ్ర వాదం జనిo చకుండా కాపాడుతున్నది , దైవిక పరమైన ఈ బావనలే అనేది నిజం . అందుకే సమాజం లోని ప్రజలలో   వేచి చూచే దోరణి , సహనం ఇవ్వన్ని అలవడి కొంత శాంతి సామరస్యాలతో జీవించడానికి అలవాటు పడ్డారు .
               
           నూరు గొడ్లను తిన్న రాబందు , ఒక్క గాలి వానకే ఖతం! అనే బావన కచ్చితంగా ప్రక్రుతి సమతుల్యత బావం లో నుంచి అవిర్బవిమ్చిందే . "ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో , అధర్మం దే పై చేయి అవుతుందో అప్పుడు నేను అవతరించి అధర్మాన్ని అంతం చేస్తాను " అన్న గితాచార్యుని వాక్యాలు ప్రక్రుతి సమతుల్యత బావానికి అడ్డం పట్టేవి . సమాజంలో సంస్కరించ లేనంతగా అరాచకం ప్రబలితే వాటిని దునుమాడె వారే అవతార పురుషులు . వారెవరూ అనేది బవిష్య  చరిత్ర మాత్రమె చెప్పగలదు . ఎందుకంటే వర్తమానం లో ఎవరికీ వారే దేవుళ్ళు . వారు చేసేదే కరెక్టు అనిపిస్తుంది . తాము పుట్టినది  ప్రజా ఉద్దరనకే అని అందరికి అనిపిస్తుంది . అలాగే  "ఆయనోస్తున్నాడు " అని అయనను  అనుసరించే వారు కోరుకుంటూoటారు.   అందుకే దేవుడు ఎవరూ , సైతాన్ ఎవరు అనేది బవిశ్యత్ లో చరిత్ర ను అద్యయనం చేసేవారు తెలుసుకుంటారు .
   మొన్నటి ఎన్నికల్లో ఒక్కొక ఓటరుకు 1000రూపాయలు , వెండి కుంకుమ బరినే లు , వస్త్రాలు ఇలా ఎవరికీ చేతనైన రీతిలో వారు పంచి పెట్టి తమ నాయకత్వ అర్హతను పరిక్షిమ్చుకుంటూ న్నారట . కోటి నిబందనలు పెట్టినా భారత ప్రజాస్వామ్యంలో  నితి  నిజాయితిలు నేతి  బీరకాయలో నేయి లాంటిదే ! మరి ఇలాంటి వాటిని చూస్తూ ఇంకా ఓపిక పట్టడానికి కారణం "ఆయనోస్తాడు " అనే . కాకపొతే అ అయన ఎవరు అంటే ఎవరి దేవుడు వారికి లాగా ఎవరి అయన వారికే అయన!

బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!కొసం లింక్ మిద క్లిక్ చేయండి "http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_18.html

Wednesday, March 26, 2014

కులంలోనైనా కాంప్రమైజ్ ఉంటుందేమో కాని , రక్తంలో మాత్రం "నో కాంప్రమైజ్ " కామ్రేడ్స్ !.

                                                                         


కొంత మంది విజ్ఞాన వాదులు కొన్ని విషయాలు గురించి వివరిస్తూ ఉపమానాలు చెపుతున్నారు . వారు చెప్పే విషయం గురించి పెద్దగా అబ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కాని , వారు చూపే పోలికలు చూస్తుంటే వారిలో ఎ మాత్రం జ్ఞానం ఉందొ యిట్టె అర్ధం అవుతుంది . ఉదాహరణకు మొన్న గుంటూర్ లో తల్లి తండ్రులు తమ కన్నా కూతురిని  తమ అనుమతి లేకుండా , తమను మోసం చేసి వివాహం చేసుకుందనే కోపంతో ఆమెను దారుణంగా చమ్పారు. దీనికి యావత్ ప్రజలు, చివరికి వారి బందువులు కూడా తీవ్రo గా ఖండించడం జరిగింది .
 
      అయితే పై కేసులో అమ్మాయిని చంపటానికి "కులం" కంటే ఆర్దిక కారణాలే ఎక్కువ ప్రబావం చూపాయి . దిని గురించి వివరంగా తెలుసుకోవాలంటే    http://ssmanavu.blogspot.in/2014/03/blog-post_24.html ని క్లిక్ చెయ్యండి . అయితే కొంతమంది మనదంతా ఒకే కులం అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నారు . దానిలో "రక్తం " ఉదాహరణ ఒకటి . పైనున్న బొమ్మ చూసారు కదా ! పేస్ బుక్ లో కొంత మంది మిత్రులు పోస్ట్ చేసారు దాన్ని . కొన్ని దశాబ్దాలుగా ఈ  ఉదాహరణ తో ప్రజలలో "కులం" గురించి ఉన్న అపోహలు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు . ఒక్కప్పుడు దిని ని కరక్టే అనుకున్నారేమో కాని , విజ్ఞానం పెరిగాక ఈ  ఉదాహరణ వాళ్ళ మనుషులు అంతా ఒకటి కాదు అనే బావమే బల పడుతుంది . అదెలాగో చూదాం .

   మనుషులలో లేక భారతీయులలో కులాలు మాదిరిగానే రక్తం లో గ్రూపులు ఉన్నాయి . కులాలు చూసుకోకుండా వివాహాలు చేసుకున్నా ఏమి జరుగదు కాని , గ్రూపులు చూడకుండా ఒకరి రక్తం మరొకరికి ఎకిస్తే మాత్రం ఎగిరి చచ్చె అవకాశ ముంది . కులంలో కొంతైనా కాంప్రమైజ్ ఉంటుందేమో కాని , రక్తంలో మాత్రం "నో కాంప్రమైజ్ " . అందు చేత మనుషులంతా ఒకటే అని చెప్పడానికి "రక్తం" ఉదాహరణ పనికి రాదు . మనుషులంతా వేరు వేరు అని చెప్పడానికి మాత్రం బేషుగ్గా పనికి వస్తుంది

Thursday, March 13, 2014

రాష్ట్ర అద్యక్షుడైనా సరే , ఒంగుంటే "ఓటు మాయం" అట!

                                                            

                                                          

అయన పేరు కఠారి శ్రీనివాస రావు గారు . అయన హోదా "లోక్ సత్తా" అనే జాతీయ పార్టికి రాష్ట్ర అద్యక్షులు . అంటే ఆంద్ర ప్రదేస్ లో ఆ పార్టి బాగోగులు చూడాల్సిన వారు . ఆయనకు గత ఎనిమిదేళ్ళుగా సేరిలింగం పల్లి బూతులో ఓటరుగా తన ఓటు హక్కు వినియోగించు కుంటున్న వ్యక్తీ . దానికి గుర్తుగా ఎప్పుడూ అయన ఓటరు కార్డు అయన జేబులోనే ఉంటుందట . కాని మొన్న ఎందుకో ఓటరు లిస్టు చూస్తె అయన పేరు గారి అయన కుటుంభ సబ్యుల పేర్లు కాని ఓటరు లిస్టు లో లెవట . దానితో ఖంగు తిన్న అయన తిరిగి కొత్తగా ఓటరు లిస్టు లో నమోదు కోసం అప్లై చేసుకున్నారట . దినంతటికీ కారణం ఒంగుంటే ఓట్లు మాయం చేసే ప్రత్యర్ది రాజకీయ పార్తిలే అని అయన గారి అరొపణ . నిజమే సుమా ! అప్పుడప్పుడు చెక్ చేసుకోక పొతే ఏదైనా మాయం చేయగల వారున్న రాష్ట్రం ఇది. తస్మాత్ జాగర్త !
 ఇంతకీ అయన గారి ఈ విషయం గురించి ఏమన్తున్నారి ఈ  విడియోలో తిలకించండి .
      

Monday, March 3, 2014

ముంబాయి పోలీసులు అనూహ్య మర్డర్ కేసును మరో "అయేషా " కేసు గా మార్చ బోతున్నారా !?

                                                             


వినేవాడి చెవిలో పువ్వులు ఉంటె చెప్పేవాడు ఎన్ని కట్టు కదలు చెప్పటానికైన రెడి ! భారత దేశం లో నిర్బయ ఉదంతం తర్వాత జరిగిన హత్యల్లో ఆంద్ర ప్రదేస్ లో ని మచిలీ పట్నం కు చెందిన మహిళా  ఇంజనీర్ అనూహ్య కేసు కూడా ఒకటి . అ హత్య జరిగి నెలలు గడుస్తున్నా నిన్నటి వరకు ఏ  క్లూ సాదిo చినట్లు ముంబాయి పోలీసులు మీడియాకు చెప్పలేదు . ఈ రోజు మాత్రం ఒక 35 ఏండ్ల వ్యక్తిని, హత్య చేసిన నిందితుడిగా ముంబాయి కోర్టులో ప్రవేశ పెట్టి , రిమాండ్ కు పంపించారు . కొద్ది సేపటి క్రితం ముంబై  పోలిస్ వారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి , అనూహ్య కేసులో మిస్టరి చేదిoచామని, ఆమెను  సనప్  అనే పాత నేరస్తుడు , టాక్సీ డ్రైవర్ గా ఆమెను తీసుకు వెళ్లి , అత్యాచారం లేక రాబరి చేయబోతే ఆమె ప్రతిఘటించడం వలన , ఆమెను ఉరి వేసి చంపి , ఆ  పై పెట్రోల్ పోసి తగల బెట్టాడని చెప్పుకొచ్చారు . ఇదంతా వింటుంటే కొన్ని అనుమానాలు బుర్ర ఉన్న వారికెవరికైనా జనిస్తాయి . మరి ఘన మైన ముంబాయి పోలిస్ వారికి రాలేదంటే నమ్మడం కష్టం . కావాలనే ఎవరో వెనుక ఉండి ఈ  కేసును అయేషా కేసు లో మాదిరి పక్క దారి పట్టించి అసలు నెరస్తులను రక్షించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది . ఈ  కేసులో కలుగుతున్న అనుమానాలేమిటంటే ---

    ఎస్తేర్ అనూహ్య ముంబాయి T.C.S కంపెనీలో ఉద్యోగిని . ఆమె గత క్రిస్టమస్ కి తన స్వస్తలం మచిలీ పట్నానికి  వచ్చి , తిరిగి జనవరి మూడవ తారికున బయలు దేరింది . 4 వ తారికున హైదరాబాద్లోని ప్రెండ్స్ తో పార్టి లో పాల్గొని ఆ సాయంత్రం ముంబాయికి రైలులో బయలు దేరింది . 5 వ తారీకు తెల్లవారు జామున ముంబాయిలో దిగిన తర్వాత కొంత సేపు వెయిటింగ్ రూమ్ లో ఉండి అ తర్వాత ఒక వ్యక్తికీ తన బ్యాగ్ ను ఇచ్చి , తానూ సెల్ పోన్లో మాట్లాడుతూ బయటకు వేలుతుండడం క్లియర్ గా రైల్వే స్టేషన్ లోని సి.సి. పుటేజ్ లలో కనిపించింది . అయితే ఆమె తో పాటు పుటేజ్ లలో కనిపించిన వ్యక్తే ఈ రోజు పోలీసులు చెపుతున్న
   సనప్  పాత నెరస్తుడట.పార్ట్ టైం కాబ్ డ్రైవర్ గా ఉన్న అతనికి అనూహ్యను తీసుకు వెళ్ళిన రోజు మాత్రం కాబ్ లెదట . తను కాబ్ డ్రైవర్ ని అని చెప్పి ఆమెతో 300 రూపాయల బేరం కుదుర్చుకున్న అతను  బయట వరకు ఆమెను తీసుకువచ్చిన తర్వాత , తన దగ్గర కాబ్ లేదని మోటార్ సైకిల్ మిద డ్రాప్ చేస్తాను అంటే మొదట్లో అనూహ్య ఒప్పుకోలేదట . అ తర్వాత ఆతను అనుమానం ఉంటె నా సెల్ తీసుకుని మిరేవరితోనైనా పోన్ చేసి విషయం చెప్పండి, కాని నన్ను మాత్రం నమ్మండి , మిమల్ని నమకంగా ఇంటి దగ్గర దిగబెడతాను అంటే , దానికి ఆమె కూడా అతని పోన్ తీసుకుని ఎవరికో పోన్ చేసినట్లు నటించిందట కాని నిజంగా చేయలేదట . గుడ్డిగా అతనిని అనుసరించి హత్యకు గురి అయిo దట . ఇది పోలిస్ వారి కహాని . ఈ కహాని లో   కలుగుతున్న అనుమానాలేమిటంటే -

  (1).  ముక్కు ,  ముఖం తెలియని వాడు కాబ్ ఉందని చెప్పి బయటకు తీసుకు వచ్చి , అక్కడ మోటార్ సైకిల్ చూపించి దాని మిద దిగబెదతాను అంటే అ ఇంజనీర్ నమ్మి గొర్రె పిల్లలా అతని వెంట వెళ్ళిందా ?

 (2). "నా మిద అనుమానం ఉంటె మిరేవరికైనా నా సెల్ లోనే నా గురించి సమాచారం ఇచ్చాకె నాతొ రండి"అని అతడు అంటే సరే అని సెల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడినట్లు నటించాల్సిన అవసరం ఆమెకు  ఏమిటి? ఖచ్చితంగా ఆమె తనకు తెలిసిన వారేవరితోనో మాట్లాడి , వారు పర్వాలేదు అతనితో వెళ్ళమని రికమెండ్ చేసాకే వెళ్లి ఉండాలి . అ నిందితుడు కూడా  ఆమెకు తెలిసిన వ్యక్తీ చెపితేనే ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చానని , కావాలంటే అతనితో/ఆమె తో మాట్లాడండి అని తన సెల్ ఇచ్చి ఉండాలి . అ విషయాన్ని ఆమె అతని సెల్ ద్వారా కన్పర్మ్  చేసుకున్నాకే అమాయకంగా అతనిని అనుసరించి బలి అయి పోయి ఉంటుంది .
(3). ఈ  కేసులో ముంబాయి పోలీసులను ఇమ్ప్లూయన్స్ చేయగలిన వారి హస్తం ఉంది ఉండాలి .వారికి ఆ అమ్మాయికి ఏదో బేదాభిప్రాయాలు ఉంది ఆమె బ్రతికి ఉంటె తమకు ముప్పు అని ముంబాయి పాత నేరస్తులతో ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండాలి . తమక్జు ఉన్న ఇన్ప్లోయన్స్ తో కేసుకు మసి పోసి మారేడు కా య చేసి , పాత నేరస్తులకు కేసు అంట గట్టి , తము తప్పించుకునే ప్రయత్నం అని అనిపిస్తుంది తప్ప, పోలిస్ వారి కహాని ఎ మాత్రం నేమ్ విదంగా లెదు.
        ఈ కేసును నిజాయితిగా సి.బి.ఐ వారి చేత దర్యాప్తు చేస్తే తప్పా నిజాలు నిజాలు వెలుగులోకి రావు . అ  దిశగా ఆమె సంబదికులు చర్యలు తీసుకోవాలి . అవసరమైతే తెలుగు  ప్రజా సంఘాలను కదిలిoచితే తప్పా అనూహ్య కుటుంబానికి న్యాయం జరుగదు .