Wednesday, July 31, 2013

రాజీవ్ గాందీ గారి పెండ్లి రాష్త్ర నాయకుల చావు కొచ్చిందా ?

                                                                




ఎంకి పెండ్లి సుబ్బి  చావు కొచ్చిందని సామెత. అలాగే రాజీవ్ గాందీ గారి పెండ్లి మన రాష్ట్ర ప్రజల చావు కొచ్చిందా ,అని అనిపిస్తుంది. పాపం అయన గారు ఉంటే ఆంద్రా నాయకులు అయన గారీ దగ్గర తమ గోడు వెళ్ళ బోసుకునే అవకాసం ఉండేది. ఎంత ఇటలీ అమ్మాయిని పెండ్లాడినా , ఆయనలోను ఉన్నది అయన అమ్మగారి భారతీయ రక్తమే కాబట్టి ఆంద్రా వారిమూగ వేదన ను అర్దం చేసుకుని రాష్ట్రాన్ని విడగొట్టే వారు కాదు. . కానీ ఆ అవకాశం లేకుండా  తమిళ పులులు ఆయన్ని పొట్టన పెట్టుకున్నారాయే !

  అసలే తెలుగు వారికి డబల్ యాక్షన్ అంటే యమ ఇష్టం . అందుకే పైకి చెప్పేదొకటి , మనసులో అనుకునేది ఇంకొకటి. తెలంగాణా లో ప్రజలను మబ్య పెట్టడానికి "ఇచ్చేది మేమే , తెచ్చేది మేమే " అని ఒకరంటే వారు ఇస్తే మాకేమి అబ్యంతరం అని ఉదారత ఒలక బోశారు . అఖిల పక్ష బేటిలోను అదే నొక్కి వక్కానించే సరికి , వీరి డబల్ యాక్షన్ గురించి అవగాహన లేని ఇందిరమ్మ కోడలు జై తెలంగాణా అనేసరికి నోటి మాట రాక , తెల్ల ముఖం వేసుకుని , అమ్మా ,అమ్మా , ఆలోచించమ్మా , అని ఆంద్రా వారు ఆనక ప్రాదేయ పడుతుంటే , 'నదింగ్ డూయింగ్ , డెసిషన్ ఇస్ ఓవర్ " అనే సరికి కళ్ళ నీరు కుక్కుకుంటూ , పైనున్న రాజీవుని తలచుకుని, తలచుకుని బాద పడ్డారట .

  అందుకే పెద్దలంటారు . పెండ్లి చేసుకునే టప్పుడు అటు ఏడు తరాలు , ఇటు ఏడూ తరాలు చూడాలని . రాజరిక వంశాలు లో ఇది తప్పని తప్పని సరి . ఎండుకంటే ఆ వచ్చే వారికి మన ఏడ్చే ఏడ్పు అర్దం కావాలిగా . అందుకని ! అదే రాజీవ్ గాందీ గారు ఐ దేశం అమ్మాయిని పెండ్లి చేసుకుంటే , ఆంద్రా వారి అంతర బాష ,అర్దమయి ఉండేది . "ఒహో b.j.p.  వారికి రామాలయం లాంటిది , ఆంద్రా వారి తెలంగాణం " అని . కాని అది పొసగలేదు. . అప్పుడు అనిపించిందట  " రాజీవ్ గాందీ గారి పెండ్లి రాష్త్ర  నాయకుల చావు కొచ్చిందా " అని !

Tuesday, July 30, 2013

N.T.V.వారు నెలరోజుల ముందు చెపితే కల్కి ఖడ్గం ఆర్నెల్లు ముందే చెప్పింది మరి !

N.T.V  వారు ఒక నెల రోజుల క్రితం కాంగ్రెస్ వారు తెలంగాణా ఇవ్వడం ఖాయమని చెప్పారట ! దానిని N.T.V   వారు గొప్పగా ప్రసారం చేస్తుంటే నాకొకటి అనిపించింది . నేను నా బ్లాగులో ఆరు నెలలు క్రితం ,కరెక్టుగా ఆరు నెలలు అంటే ఈ సంవత్సరం పిబ్రవరి ఒకటవ తారీకున తెలంగాణ గురించి నాకు గల అభిప్రాయాలు చెపుతూ ఒక టపా పెట్టడం జరిగింది . ఆ టపాలో తెలంగాణా వ్యవహారంలో మన నాయకులు తీరును గురించి ఒక కదను కూడా చెప్పటం జరిగింది. ఈ  రోజు తెలంగాణా అంశం మీద డిల్లీ పెద్దల నిర్ణయాలు గురించి  చూస్తుంటే ఆ నాడు నేను చెప్పిన కద చందానే సీన్ నడుస్తుంది అనిపిస్తుంది. ఇంతకి ఆ కద ఏమిటంటారా ? మీరే ఐ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడండి . చూసారా మీడియా వారి కంటే బ్లాగర్లే ఎంత ముందున్నారో !

 http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html  





Sunday, July 28, 2013

మొత్తానికి పిబ్రవరి ఒకటిన నేను చెప్పిన కదే నిజమవ బోతుందన్నమాట !

నేను ఈ సంవత్సరం పిబ్రవరి ఒకటవ తారీకున తెలంగాణ గురించి నాకు గల అభిప్రాయాలు చెపుతూ ఇదే బ్లాగులో ఒక టపా పెట్టడం జరిగింది . ఆ టపాలో తెలంగాణా వ్యవహారంలో మన నాయకులు తీరును గురించి ఒక కదను కూడా చెప్పటం జరిగింది. ప్రస్తుతం తెలంగాణా అంశం మీద డిల్లీ పెద్దల నిర్ణయాలు గురించి వస్తున్నా వార్తలు చూస్తుంటే ఆ నాడు నేను చెప్పిన కద చందానే సీన్ నడుస్తుంది అనిపిస్తుంది. ఇంతకి ఆ కద ఏమిటంటారా ? మీరే ఐ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడండి . 
                                    http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

Tuesday, July 23, 2013

ఒక్క పాటకే "యాంకర్ " ఉద్యమ కారిణి అయితే, వందల పాటలు పాడిన వారి నేమంటారు?

                                                          


నిన్న ఒక  మిత్రుడి బ్లాగులో ఒక లేడి యాంకర్ ని పొగుడుతూ రాసిన పోస్ట్ చూసి కొంత అశ్చ్యర్యం వేసింది . కారణం  అప్పటి దాక ఆ యాంకర్ ని "అప్ట్రాల్" అనుకున్న అ బ్లాగ్ మిత్రుడు ఆమె పాడిన ఒకే ఒక పాట లాంటిది విని , చలించి పోయి ఆమెను గారూ" అని సంబోదిమ్చడమే కాక ఆమెను ఒక ఉద్యమ వెలుగు గా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. నాకైతే  తెలుగు సినిమా కదే గుర్తుకు వచ్చింది .
    సినిమా మొదట్లో అల్లరి చిలరి గా తిరుగుతూ దొంగ తనాలు చేసే హిరోయిన్ ని చూసి అసహ్య హించుకునే హిరో , ఒక సందర్బంలో ఆమె సమాజం లోని దుర్నితి గురించి లెక్చర్ దంచితే కంగుతిని ఆమె అరాదకుడు అయిన హిరోగారి కద  లాగా ఉంది అయన చెప్పింది . ఏదైనా సరే అప్పటి దాక ఆమె యాంకరింగ్  అంటే  ఆయనకి వెగటు పుట్టిoదట! కాని ఒక్క పాటతో 'వెగటు ' కాస్త ఆరాధ్యo గా మారి అభిమానం 'గారు " తుంది !. ఇంతకీ ఆమెగారు పాడింది చూదాం .

                                              
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా.. ఇంక ఆంబోతులాట సాగేరా..
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు
భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు..
ఎవ్వారొ…
ఎవ్వారొ ముద్దు బిడ్డలు రా… ఎందుకనొ పరుగెట్టినారురా..
ఎవ్వారొ ముద్దు బిడ్డాలెందుకనొ పరుగెట్టినారురా..
ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు
ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్
బోరు బోరు గా గండమోర్లు వెట్టి కుండే వలిగె జల్లులు
ఈ కడుపుకోతల నార్పెదెవ్వరురా
ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడురా
రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా -2
రావణాసురులంత జేరి రోజుకొక్కా రచ్చ పెడితే..
పంట చీడను మట్టుపెట్టే పురుగు మందుల విందులాయె–2
ఎంత నెత్తురు ఏరులై నెవ్వాని దూప తీరదాయే
జాలి జూపర జంగమయ్యా జాగిలాలా జాతరాపర.. -2
కొండ దిగిరా కొమూరన్నా కొండముచ్చుల కోర్కెదీర్పర..
రెండు పూటల్ పస్తులుండీ నిండు ప్రాణాలెన్నొ మింగె -2
గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకికూత కోడెనాగులు ..
గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారాలేపేరురా
ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామర –2
ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు
అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ -2
ఎవ్వడిచ్చెదేందిరా ఇది ఎవ్వనీ జాగీరురా.. -2
నీకు నువ్వే రాజురా నిన్నేలెటోడింకెవడురా-2
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ..ఇంక ఆంబోతులాట సాగేరా
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కన్ను సూడు
భూమి బుగ్గై పోయె సూడు బొంద గడ్డల జోరు సూడు..
గంగ గరుడా… గంగ గరుడాలెత్తుకెళ్ళేరా

   పై పాటలో అండర్ లైన్ చేసిన దానిని  గురించి చెప్పాలంటే అసలు  పదవుల కొరకు నిచ రాజకీయాలు చెయ్యడం నేర్పింది ఎవరు? తమకు పదవులు రాలేదని , హైదరాబాద్ ని మత కల్లోల నగరంగా మార్చి , పట్ట పగలు హత్యలు చేయించిన గాడిద కొడుకులు ఎవరు ?వారే ఇప్పుడు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం "తెలంగాణ " చిచ్చు  పెట్టారు . అది కాస్తా రాజుకుని ప్రజలలో వేర్పాటు బావాలు రగిలిస్తే , ఇప్పుడేమో "గద్దె కోసం గాడిదలు " చేస్తున్న రాజకీయం అంటున్నారు .అసలు నిజం చెప్పాలంటే "గద్దె నాశించ కుండ గాడిద చాకిరి చేసే వారెవరు ?

   మనం గత అరవై ఏండ్లుగా "ఇండో చైనా స్సాంస్క్రుతిక సంబందాలు"ఇండో రష్యా  స్సాంస్క్రుతిక సంబందాలు"ఇండియన్అమెరికా స్సాంస్క్రుతిక సంబందాలు" అని ఇతర దేశాల ప్రజలతో స్నేహ బావం పెంచుకోవడానికి కృషి చేసారు కాని ఆంద్రా,తెలంగాణా ప్రజల మద్య ఆత్మీయ సంబందాలు నెలకొల్పడానికి ఎ చర్యలు అయినా చేపట్టారా? ఇప్పటికి చాల మంది ఆంద్రా ప్రజలుకి తెలంగాణా వాలంతే చులకన బావం ఉందనేది కఠిన సత్యమ్. అదే నేడు తెలంగాణా వారు వేర్పాటు వాదాన్ని కోరుకునేలా చేస్తుంది . తెలంగాణా వచ్చి బ్రతికే వారు కూడా , తెలంగాణా ప్రజలను చిన్న చూపు చూస్తుంటే ఎవరు మాత్రం సహిస్తారు? ఏ మాత్రం అవకాసం దొరికిన వారిలో ఉన్న ఆక్రోశం వెల్ల గ్రక్కుతారు . అదే ప్రస్తుతం తెలంగాణా ప్రజలు చేస్తుంది . వారికి కె.సి.ఆర్ రూపం లో అవకాశం దొరికింది . ఉపయోగించుకుని విదిపోవాలను కుంటున్నారు . ఏ ఆశ లేకుండా చాకిరి చేసే గాడిదలు కాని, వాటి కొడుకులు కాని ,రెచ్చగొత్తె పాటలు పాడే వారికి , వారితో పాడించే వారికి ఆదర్శo కావచ్చు !. తెలంగాణా వారికి మాత్రం ఆత్మ గౌరవం కాపాడే వాడు గద్దె నాసించిన తప్పు లేదని రేపు జరగబోయే ఎన్నికలలో తీర్పు చెప్పనున్నారు . అయినా విచిత్రం కాకపొతే ఒక్క పాటకే "యాంకర్ " ఉద్యమ కారిణి అయితే, వందల పాటలు పాడిన నిజమైన ఉద్యమ కారులుని   నేమంటారు? "యాంకర్లు " అంటారా ?!రేటింగ్ ఆర్టిస్టులు అంటారా !

Sunday, July 21, 2013

హిందువులు గురించి అయిపోయింది! ఇక ముస్లిం లది మొదలయింది . !

                                                                            



ఆ  ఊరిలో ఒక పుల్లగొండి పెద్దయ్య ఉన్నాడు .    కొంచం ఎక్కువ చదువుకుని   ఉండటం  వల్ల ,అతను చెప్పేదానికి  ఎవరూ ఎదురు చెప్పే వారు కారు . దానితో ఇక అన్ని తనకే తెలుసనీ, అ ఊళ్ళో వారికి  ఏమి తెలియదని, వక నిర్ణయానికి వచ్చేసి, అవసరం ఉన్నా,లేకపోయినా, పని కల్పించుకుని , దారిన వచ్చే పోయే వారిని పిలిచి మరీ  తన పాండిత్యం ప్రదర్శించడం మొదలు పెట్టాడు .
ఆ ఊరిలో వక గుడి ఉంది . ఆ గుడిలో ఉత్సవాలు జరుగుతునాయి . ఆ సందర్బంగా వారం రోజులు పాటు సాయంత్రం వేళలో 'గీతా పారాయణం ' చేస్తుండే వారు . అది వినడానికి ఆ ఊళ్ళో ముసలి వారు ,స్త్రీలు వచ్చి వెళుతుం దేవారు . అ సమయంలో గుడి కొంచం దూరం లో, దారిలో  ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చుని , అ గీతా పారాయణం విని వస్తున్నా వారిని  తన దగ్గరకు రమ్మని పిలిచే వాడు  పుల్ల గొండి పెద్దయ్య . స్త్రీలు అయితే అతనిని పట్టించుకోకుండా  తమకు పని ఉందని వెళ్లి పోయే వారు. ఇక నడవడం ఇబ్బందిగా ఉన్న, ముసలి వారు , కాసేపు కూర్చున్నట్లు ఉంటుo దని ,అక్కడికి వెళ్లి కూర్చుంటే, వారికి 'గీత ' అనేది పెద్ద రోత  అని  ,దానిని  చెప్పిన కృష్ణుడు  పెద్ద తాగుబోతు, తిరుగు బోతు అని వివరించడానికి ప్రయత్నిస్తే, వారంతా అతనిని  తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి , దేవుడా అంటూ ఇంటికి వెళ్ళిపోయే వారు. వారికి గీతలో ఏముందో  ప్రతి వాక్యం తెలియాల్సిన అవసరం లెదు. వారికి అర్ధం అయింది ఒకతె. ఎవడి పని వాడు చెయ్యటమే దేవుడుకు నచ్చుతుo ది. కుల మతాలతో పని లేకుండా,బక్తితో  పత్రం పుష్పం ఏది ఇచ్చినా దేవుడు తిసుకుo టాడు . వారిని అనుగ్రహిస్తాదు. ఇదే వారికి తెలిసిన గిత. కాని దేవుడనే  దొంగ   అనే  పెద్దయ్య మాటలు ఎవరూ పట్టిం చుకునే వారు కారు. అయినా సరే అ వారం రోజులు పెద్దయ్య తన 'పుల్ల గొండి ' విద్యనూ ప్రదర్శిస్తూనే ఉన్నాదు. ఎలాగో వారం రోజులు గదిచాయి. ఉత్సవాలు తో పాటు గీతా పారాయణం  కూడా ముగిసిo ది. దానితో పెద్దయకు పని లేక నోరు దూల పెట్ట సాగిo ది.
 ఇంతలో ముస్లింల పండగ ఒకటి వచ్చింది . దానితో ముస్లిం లంతా మజిద్ కు  వెళ్లి నమాజులు  చెయ్యటం మొదలు పెత్తారు. అంతే ! పెద్దయ్యకు టక్కున ఒక ఆలోచన వచ్చిo ది . గీతను తిట్టినట్లు ఖురాన్ ని కూడా విమర్సిమ్చడానికి  కంకణం కట్టుకుని, మసీద్ కి దగ్గరలో కూర్చుని బయటకు వస్తున్నా యువకులను పిలిచి, కురాన్ లోని లోపాలను ఎత్తి చూప సాగాదు. అది వింటున్న కుర్ర వాళ్లకి మొదట్లో ఏమి అర్ధం కాలెదు. కొంచం అర్ధం అయ్యే సరికి . వారి కి కోపం నసాళానికి అంటి నట్లు , ఒక్క సారిగా పెద్దయ్య మిద పడి విర కుమ్ముడు కుమ్మే సరికి, పాపం పెద్దయ్య స్పృహ తప్పి పడి  పొతే, అ దారిన పోతున్న క్రిష్నయ్య  వారిని వారించి , పెద్దయ్యకు ఉప చర్యలు చేసి , హాస్పిటల్లో జాయిన్ చెసాదు. అ రోజు నుంచి పెద్దయ్య మాట్లాడితే ఒట్టు!
   

Friday, July 19, 2013

’గాందేయం’ గాన్,! ’బ్రాందేయం’ఆన్



                                                           
                                                                                                                                    
                                                               

   తల్లి కాంగ్రెస్ వారు, పిల్ల కాంగ్రెస్ వారు మాటల యుద్దంలో తగని అస్త్రాలు సందించుకుని,తమ నైజం బయట పెట్టుకున్నారు!. ఎదైనా ఒక రాజకీయ పార్తీలో సబ్యుడు గా చేరాలంటే కొన్ని నియమ నిభందనలు ఉంటాయి. వాటిని క్రింది స్తాయి కార్యకర్తలు పాటించక పోయ్నా, పై స్తాయి నాయకులు పాఠించాల్సిందే.అలా పాటించలేని నిబందనలు ఏమన్నా ఉంటే, వాటిని తొలిగించి, తాము చెప్పేదే చేస్తాం అని నిరూపించుకోవాలి.

  అన్ని పార్టీల సంగతి ఏమో కాని, కాంగ్రెస్ వారి పార్టీ ప్రవేశ నిబందనలలో ముఖ్యమైనది, పార్టీ సభ్యులు మద్యం సేవించుట నిషిద్దం. ఎందుకంటే తమ పార్టీకి మూలపురుషుడు లాగా బావించే గాంది గారి ఆశయం ప్రకారం కాంగ్రెస్ వాదులెవరూ మందు పుచ్చుకోకూడదు. పరిస్తితి అలా ఉంటే, మొన్న ఉత్తరాంద్ర పర్యటనలో "షర్మిల" కాంగ్రెస్ మీద విమర్శనాస్త్రాలు సందిస్తూ,  బొచ్చ సత్యనారాయణ గారిని బ్రాందేయ వాది అని ఎద్దేవా చేసింది. దీనికి కొంచం సంయమనం పాటించి, తాను అలాంటి వాడిని కాదని, తన లాంటి వాడి మీద అలాంటి ఆరోపణలు చెయ్యడం ఆమె అజ్ణానానికి నిదర్శన మని, అని ఊరుకుంటే బాగుండేది. కాని ఆయన ఒక్కసారిగా కస్సుమని" అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న గారు ఏనాడైనా బ్రాందీ తీసుకోకుండా నిద్ర పోయే వారా? మూడు వందల అరవైఐదు రోజులలో ఒక్క రోజైనా అది లేఉండా ఉన్నారా? అని అనే సరికి యావత్ ఆంద్రప్రదేశ్ నోరెళ్ళ బెట్టింది.

  అంత అనుబవం ఉన్న నాయకుడు ముందు వెనుకలు ఆలోచించకుండా చెప్పిన  వాస్తవం  ఆయన ఉంటున్న పార్టీ పరువునే త్సింది. ఎందుకంటే దివంగత రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన మీద ఏ ఆరోపన వచ్చినా, చివరకు అది కాంగ్రెస్ పార్టీ ఖాతా లోకే చేరుతుంది. కాబట్టి అటు షర్మిలమ్మ, విమర్శించినా, ఇటు బొత్స గారు విమర్శించినా మనకు అర్దమయ్యేది ఒకటే. అధికార కాంగ్రెస్ లో ’గాందేయం’ గాన్,! ’బ్రాందేయం’ఆన్ అని!.   
  

Wednesday, July 17, 2013

స్త్రీ తన హ్రుదయాన్ని ఒకరికే ఇస్తుందట నిజమేనా సార్!?


                                                              

                                                               

 అవి నేను పదవ తరగతి చదువుతున్న  రోజులు. ఖమ్మం లోని బస్స్టాండ్ దగ్గర ఉన్న రిక్కా బజార్ హై స్కూలో, కొత్తగూడెం దగ్గర ఉన్న రామ వరమ్లో తొమ్మిదో తరగతి చదివిన నన్ను, పదవతరగతికి ఖమ్మం లో జాయిన్ చేసారు. కారణం అప్పటి దాక రామవరం హైస్కూల్లో లెక్కలు టిచరుగా పని చేస్తున్న మా అన్నయ్య గారు, ఊటుకూరుకు ట్రాన్స్ఫర్ కావడం వల్ల నేను ఒంటరిగా అక్కడ చదవటం వీలు కాక మా నాన్న గారు తీసుకు వచ్చి ఖమ్మం లో పడేశారు.

  నేను చిన్నప్పట్నుండి క్లాసులో చాలా చురుకుగా ఉండేవాడిని.చదువులో మాత్రమే కాక ఇతరత్రా అంటె అంటే ఆటలులో కాదు(నాకు గేమ్స్ ఆడటం  చిన్న్నప్పటినుండే అలవాటు లేదన్నమాట!)  కాని, వ్యాస రచనలు, వక్రుత్వ పోటిలు, సాంస్క్రుతిక కార్యక్రమాలలో హుషారుగా పాల్గుంటుండే వాడిని. సాధారణంగా అల్లరి చేసే అబ్బాయిలు వెనుక బెంచిలో కూర్చుని అల్లరి చేస్తుంటారు. కానీ ఎప్పుడూ ముందు బెంచిలో కూర్చునే సహ విద్యార్దుల మీద, టీచర్ల మీద కామెంట్లతో నవ్విస్తుండే నేనంటే అందరికి అభిమానమే అని చెప్ప వచ్చు. కొత్త గూడెం నుండి వచ్చిన వాడిని అవటం చేత నన్ను అందరూ "కే.టి.డి.యం బయ్యా" అని నిక్ నేమ్ తో పిలిచే వారు.

 ఆ విదంగా నా చదువు సాగిపోతున్న రోజుల్లో , ఒక రోజు మా బయాలజీ సారు క్లాసులో హ్రుదయం(గుండె), గురించి, అది పని చేసే విదం గురించి పాఠం చెప్పారు. పాఠం అంతా అయ్యాక "ఒరే మీలో ఎవరికైనా హ్రుదయం గురించి డౌట్ లు ఉంటే అడగండి అన్నారు. మాలో ఎవ్వరూ ఏమి అడగలేదు. ఎప్పుడైనా విద్యార్ధి అనే వాడు రెండు సమయాలలోనే డౌట్ లు అడగరు . ఒకటి అంతా అర్ధమయినప్పుడు, రెండు ఏమీ అర్దం కానప్పుడు. ఇలా నా ఫ్రెండ్స్ కి ఏమి అర్దం అయిందో నాకు తెలియదు కాని, నాలో మాత్రం వెంటనే ఒక చిలిపి  ప్రశ్న   ఉదయించింది. అంతే! ఠక్కున లేచి చేతులు కట్టుకుని " సార్ స్త్రీ తన హ్రుదయ్యాని ఒకరికే ఇస్తుందట, నిజమేనా సార్!" అని అమాయకంగా ముఖం పెట్టి అదీగాను. అప్పట్టి దాక సైలెంట్ గా ఉన్న క్లాస్ ఒక్క సారీగా గొల్లుమంది. నేనేదో గొప్ప దోఉట్ అడుగుతున్నాని అనుకున్న మా బయాలజీ సార్ ఒక్క క్షణం స్టన్ అయి, తిరిగి మాతో పాటు నవ్వడం మొదలెట్టారు. "రేయి, ఈ డౌట్ కి సమాధానం చెప్పలంటే స్ఫెషల్ క్లాస్ తీసుకోవాలి. కాబట్టి నీవు మాత్రమే ఆ క్లాస్కి వస్తే అప్పుడు చెపుతాను" అన్నారు. ఇంతకి ఆయన తీసుకునే స్పెషల్ క్లాస్(మొట్టికాయల క్లాస్) ఏమిటొ నాకు తెలుసు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం కావాలని సార్ ని  ఎప్పుడూ ఒత్తిడి చెయ్యలేదు .

  అయ్యా అదీ నా పదవ తరగతిలో పదనిసలు. ఎందుకో నా చిన్న నాటి ముచ్చటలు  మీతో షేర్ చేసుకుందామనిపించి ఇలా టపాగా పెట్టడం జరిగింది.

Tuesday, July 16, 2013

తాగే కాడ, ఊగే కాడ, అమ్మాయిలు లేకపొతే ఎంత కష్టం! ఎంత కష్టం!.



                                                              
 అవును మరి ! ఘోరమైన అన్యాయం కదూ  ఇది! ఆన్ని అవకాశాలలో సగ భాగమ్ ఇచ్చిన పడతులకు ’మందు కొట్టే కాడ" "మజాగా ఎగిరే కాడ" ఉండటానికి వీలేదనట మేమిటి? దీని వల్ల అటు  బార్ ఓనర్లు, ఇటు బార్ డాన్సర్ లు కి ఎంత కష్టం? మరి వీరి కష్టాల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇంకెవరూ సాక్షాతు ఆ సుప్రీమ్ కోర్టు వారే పట్టించుకున్నారు! ఆరేండ్ల క్రితం బార్లలో డాన్సులు నిషేదించిన మహారాష్ట్ర ప్రభుత్వం, దానిని సమర్దించిన ముంబాయి హైకోర్టు వారి ఉత్తర్వులను కొట్టి వేస్తూ, బార్లలో స్వేచ్చగా డాన్స్ చేసుకోవచ్చు అని చెప్పారట! చాలా సంతోషం !

  ఇంతకు మునుపే కర్ణాటక హైకోర్టు వారు కన్నడ బార్ యజమానులు వేసిన పిటిషన్ ని విచారించి, బార్లలో లేడి వెఇటర్ లు లేకపోతే వ్యాపారాలు చేసుకోవడం కష్టమవుతుందనో లేక అధి ప్రాదమిక హక్కులకు భంగం అనో బార్ లలో "లేడి వెయిటర్" లని నియమించుకోవడానికి బార్ యజమానులకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్ట్ వారేమో బార్ ల లో డాన్స్ లు వెయ్యడానికి అనుమతిచ్చేశారు. ఇంకేముంది! ఈ మాట  చాలదూ ఆంద్ర ప్రదేష్ లాంటి మద్యం ప్రియులు ఉన్న రాష్ట్రానికి. ఇక అమ్మాయిలు పోస్తుంటే ఫుల్ గా తాగొచ్చు! మూడొస్తే బాగా ఊగొచ్చు! అదేనండి డాన్స్ చేయవచ్చు. అయినా మన పిచ్చి కాని సరి అయిన చట్టాలు చెయ్యకుండా ఏదో జీ.వో. లు పాస్ చేస్తే పౌరుల ప్రాధమిక హక్కుల పరిరక్షణే ద్యేయంగా పని చేసే కోర్టులు వాటిని కొట్టి వెయ్యకుండా ఉంటాయా? కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏమీటంటే, తాగడం, ఊగడం లో పాలు పంచుకోవడం  మగవాళ్లకే కాదు ఆడవాళ్ళకి కూడా ప్రాదమిక హక్కుల్లో బాగమే!.
       అంతా బాగానే ఉంది. బార్ ఓనర్ల కష్టాలు, డాన్సర్ల కష్టాలు సరే , మరి సంసారాలు కూలిపోతుంటే చూస్తూ ఏమి చీయ్యలేని పరిస్తితుల్లో ఉన్న సంసారుల కష్టాలు పట్టించుకునేది ఎవరు?

Monday, July 15, 2013

గీతలో "కులం" లేదు. ఉందన్న వారి లోనే "కులతీట" ఉంది.

                                  

                                                                   చదువుకుని కొంత జ్ణానం అబ్బగానే తాము దేనికైనా బాష్యం చెప్పగల పండితులం అనుకునే "పండిత పుత్రులు" చాల మంది ఉన్నారు . వారీలో తమకు ఇష్టం లేని వాటిని బూతద్దంతో శల్య పరీఖ్షలు చేస్తూ, మూల గ్రందాలలో అనకపోయినా , ఎవరో పైత్యపు బాష్యకారుడు అన్నడని దానినే ప్రామాణికంగా తీసుకుని తమ వక్ర బాష్యాలకు ఆధారం గా ఉపయోగిస్తుంటారు.

  నాకు తెలిసినంత వరకు "గీత" లో కుల ప్రస్తావన లేదు. మనిషి జన్మం బట్టి కాక గుణాన్ని బట్టి నాలుగు వర్ణాలు ఉంటాయని శ్రీ క్రిష్ణుడు చెపుతాడు. అలా ఆ గుణాన్ని బట్టే జ్ణానం ఉన్న వారు బ్రాహ్మణులుగాను, పౌరుషం ఉన్నవారు క్షత్రియులు గాను, వ్యాపార ద్రుక్పదం ఉన్న వారు వైశ్యులు గాను, మిగిలిన వారు శూద్రులుగా ను నిర్ణయించబడతారన్నాడు. అసలు గీతాకాలం కంటే ముందే ఈ వర్ణ బావన అప్పట్టి సమాజంలో ఉంది. అప్పుడు మూడు వర్ణాలే ఉండేవి. జ్నానర్జన, రాజ్యరక్షణ చేసే గుణం ఉన్న వారు తప్పా తక్కిన వారంతా వైశ్యులే అనబడే వారు. కాలక్రమేణా వైశ్యులు కూడ వ్యాపార ద్రుక్పదం ఉన్న వారు, నుండి అది లేని సామాన్య గుణం ఉన్న వారిని "శూద్రులుగా" పరిగణించారు.  ఈ వర్గీకరణ చూస్తుంటే "ప్లేటో" ఆదర్శ రాజ్య బావనల కంటే ముందే మన దేశం లో "గీతాకారుడు" అటువంటి బావాలు ప్రబోదించినందుకు మనం ఎంతో గర్వ పడాలి.

  కాని కొంత మంది పండిత పుత్రుల వల్ల  వర్ణం కాస్తా కులాలుగా రూపు చెంది ఈ సమాజాన్ని నాశ్నం చేసాయి. అది ఎలా జరిగిందో నార్ల వెంకటేశ్వర రావు గారి బాష్యంలోనే మీకు చూపిస్తాను.


"శ్రావణ్కు తెలియకపోయినా గీతకు సొంత సమాజశాస్త్రం ఉన్నది. గుణాన్నీ, పనిని బట్టి నాలుగు వర్ణాలూ నేనే సృష్టించానని చెప్పటంలోనే సారాంశం ఉన్నది. నాలుగు వర్ణాల బదులు నాలుగు కులాలని అల్లాడి మహాదేవశాస్త్రి తన అనువాద గ్రంధంలో రాశాడు. (Shankaracharya, The Bhagavadgeetha with the commentary, tr. by Alladi Mahadeva Sastry, 1979) జాన్ డేవిడ్ అనువాదం కూడా నాలుగు కులాల్నే సూచిస్తున్నది. కృష్ణుడు పేర్కొన్న నాల్గు విధాలైన సృష్టి నాలుగు కులాలకు చెందినది. హిందువు కులంలో పుడతాడు, అందులో నివశిస్తాడు, గతిస్తాడు. బ్రతికుండగా పాటించిన కులధర్మాన్ని బట్టే జన్మాంతరం కూడా ఆధారపడి ఉంటుంది. కులవిధానంలో పైకి పోయే అవకాశం లేదు. అదే, వర్గ సమాజంలో కూలివాడి కుమారుడు ఎంత పెద్ద స్థానానికైనా ఎదగవచ్చు" (గీత బోధించే సమాజశాస్త్రమంతా కులపరమైనదే.-16,By late V R Narla Telugu : Innaiah Narisetti).



 పై న చెప్పిన దానిలో నార్ల వారే క్రిష్ణుడు గుణాన్నిబట్టి, పనిని బట్టి నాలుగు వర్ణాలు తాను శ్రుష్టించాడు అని చెప్పినట్లు ఒప్పుకున్నారు. కానీ ఎవరో అల్లాడి మహాదేవశాస్త్రి మరియు జాన్ అనే అనువాదకులు వర్ణం అంటే కులం అని అనువదించారు కాబట్టి అది కులమేనని తీర్మానించారు. ఇంతకంటే వక్ర బాష్యం  ఇంకోటి ఉంటుందా?

      తనకు హిందూ మతమన్నా, దేవుళ్లు అన్నా, హిందువులు పవిత్రంగా బావించే గీత అన్నా పడదు కాబట్టి ఎవరో పైత్యపు అనువాదకులు చెప్పింది వారి   వక్రబాష్యానికి  అనుకూలం గా  ఉందని దానిని ప్రామాణికంగా తీసుకోవటం చూస్తుంటే ఆయన రచనలలో ఉన్న నిజాయితి ఎంతో ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా.కాబట్టి కులం అనేది క్రిష్ణుడు చెప్పిన గీతలో లేదు. గీతకు వక్ర బాష్యాలు చీప్పే వారి  లోనే కులతీట  ఉంది అని ఘంటాపధంగా చెప్పవచ్చు 

 

Saturday, July 13, 2013

నాటి "దేవ సాని" లే నేటి సినీ తారలా?



                                                                      

  అవుననే అనిపిస్తుంది. కొంతమంది సినిమా హిరోయిన్ల స్టేట్మెంట్ లు చూస్తుంటే. ఇదివరలో "కుష్బూ" అనే ఆవిడ గారు పెండ్లికి ముందు సెక్స్లో పాల్గొంటే తప్పేమి లేదని సెలవిచ్చి తన నైజం భయట పెట్టుకుంది. ఇంకొక అమె ఏమో మగాడు అంటే వాడిపారేసే "వేస్ట్ పేపర్" అని తన వేస్ట్ బుద్దిని బయటపెట్టుకుని చివరకు భయటకు రాలేక పోయింది. ఇప్పుడు తాజాగా "శ్రుతి హాసన్" అనే నటీమణి పెండ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటాను అని అర్దం వచ్చేలా మాట్లాడిందట!,

  మన పురాణాల ప్రకారం మానవులంతా పిల్లల్ని కనాలంటే పెండ్లి చేసుకోవలసిందే. కాని దేవ వేశ్యలకు ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వారు ఇంద్ర లోకంలో ఎవరికి మూడ్ వస్తే వారిని సంత్రుప్తిపరచడమే కాక, ఇంద్రపదవికి భంగం కలిగించే నరులైన మునుల తప్పస్సు భంగం చేసే డ్యూటీ కూడ వారిదే. అందుకే దేవ వేశ్యలకు దేవతల హోదా ఇవ్వడమే కాక, సెక్స్ విషయమ్లో పూర్తి స్వేచ్చ ఇచ్చాడు ఇంద్రుడు. అందుకె మునుల తపస్సు భంగం కావించే ప్రక్రియలో, వారికి నచ్చితే కొంతకాలం వారితో గడిపి పిల్లలని కని ఆ మునుల ముఖాన పారేసి వెళుతుండే వారట. అలా జన్మించినదే భరతుని తల్లి శకుంతల. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

  ఆ దేవతాస్త్రీలే ప్రస్తుతం నర జన్మ ఎత్తి సినిమా స్టార్ లు అయినట్లుంది. అందుకే పూర్వ జన్మ వాసనా బలం చేత అలాంటి ఆలోచనలు కలిగి విచ్చలవిడి మాటలు మాట్లాడుతున్నారు. వీరికి మనుష్యుల కట్టుబాట్లు వర్తించవు కాబోలు. వీరికొక దీవి ని కేటాయించి "హాలీఉడ్" లాగా "జాలీఉడ్" అని పేరుపెట్టి వీరందర్ని అక్కడికి తోలేస్తే, వారితో పని ఉన్న వారందరూ అక్కడికి వెల్ళి "షూటింగ్" లు చేసి వస్తుంటారు. మనుషుల బాధ వారికి, వారి భాద మనుషులకు ఉండదు.  హిందూ మహా సముద్రంలో అండమాన్ నికో బార్ దీవులలో సుమారు వంద వరకు ఖాళీగా ఉన్నాయట!ఎవరైనా మంచి సౌండ్ పార్టిలు ఉంటే అటువంటి వాటిని కొనుగోలు చేసి "జాలీఉడ్" ఎర్పాటు చేస్తే బోల్డంతా "పర్ర్యాటకం" బిజినెస్".