మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమైఖ్యాంద్రకు కంకణమ కట్టుకున్నారని అటు కేంద్ర ప్రభుత్వానికి , ఇటు ఆంద్ర ప్రదేసశ్ ప్రజలకు అందరికి తెలిసి పోయింది. మొన్నొక చోట "ప్రక్రుతి తుఫాన్ ను ఆపే శక్తి నాకు లేక పోయినా , విభజన తుపాన్ ఆపే శక్తి ఉంది" అని ప్రకటించి ,అక్కడి ప్రజల మనసులకు స్వాంతన చేకూర్చారు. గమ్మతేమిటంటే తుఫాన్ పీడిత ప్రజలను ఓదార్చు దామని వెళ్ళిన ముఖ్యమంత్రి , అక్కడ ప్రజలకు ఆర్దిక సహయం చేస్తామని అన్నా వారు పెద్దగా పట్టించుకోలేదు కానీ, విభజన ఆపుతాను అనగానే ఒక్క పెట్టున హర్ష ద్వానాలు చేసారట! మరి అలాంటి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, ఊరికే ఉంటారా ? ఉండరు కదా! అందుకే ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేసీ ఉంటారు అనిపిస్తుంది. అసలు నూతన రాష్ట్ర ఏర్పాటు గురించి భారత రాజ్యాంగం ఏమంటుందో చూద్దాం .
3. Parliament may by law—
(a) form a new State by separation of territory
from any State or by uniting two or more States or
parts of States or by uniting any territory to a part of
any State;
(b) increase the area of any State;
(c) diminish the area of any State;
(d) alter the boundaries of any State;
(e) alter the name of any State:[Provided that no Bill for the purpose shall be
introduced in either House of Parliament except on the
recommendation of the President and unless, where the
proposal contained in the Bill affects the area, boundariesor name of any of the States 1***, the Bill has been referred
by the President to the Legislature of that State for
expressing its views thereon within such period as may
be specified in the reference or within such further period
as the President may allow and the period so specified or
allowed has expired.]Explanation I.—In this article, in clauses (a) to (e),
"State'' includes a Union territory, but in the proviso,
"State'' does not include a Union territory.
Explanation II.—The power conferred on Parliament
by clause (a) includes the power to form a new State or
Union territory by uniting a part of any State or Union
territory to any other State or Union territory.]
కాబట్టి కేవలం రాష్ట్రపతి గారి రెకమెండేషన్ తోనే పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టాలి . అలా రాష్ట్ర పతి గారు రికమేండేషన్ చేసే ముందు
బిల్లు ను రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపటం తప్పని సరి. కానీ అసెంబ్లీ ఒప్పుకున్నా , ఒప్పుకోక పోయినా పార్లమెంట్ మాత్రం బిల్ ని ఆమోదించ వచ్చు . రాష్ట్ర ఏర్పాటు జరిగి పోతుంది .
కానీ అసలు రాష్ట్రపతి గారు రికమెండ్ చెయ్యటం కోసం బిల్ ని అసెంబ్లీ అభి ప్రాయానికి పంపక ముందే ,కొన్ని అబ్యంతరాలు ఏకరువు పెడుతూ, కూలంకష చర్చ కోసం అసెంబ్లీకి బిల్ పంపాలని కోరితే, ఆ లేఖ మీద హోంశాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత, రాష్ట్ర పతి గారు అసెంబ్లీకి "బిల్" పంపితే , అది రాజ్యాంగ బద్దం అవుతుందా ?
ముఖ్య మంత్రి గారు పంపిన లేఖ మీద రాష్ట్రపతి గారు ఏమి స్పందించ క పొతే అది వేరు. కానీ ఆ లేఖ మీద స్పందించి, హోం శాఖ కు పంపటం జరిగింది. కాబట్టి ఇప్పుడు విభజన బిల్ పంపితే అది దేని ఆదారంగా తయారు చేసిన బిల్ అవుతుంది? రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి గారు స్వయంగా కానీ , కేంద్ర మంత్రి మండలి సలహా ప్రకారం కానీ బిల్ తయారు చేసి రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి . కానీ అలా జరుగకుండా ముఖ్యమంత్రి గారి అధికారిక లేఖ ఆదారంగా, బిల్ తయారు చేసి అసెంబ్లీకి పంపుతున్నట్లు అవుతుంది . కాబట్టే ఈ అనుమానం! అలా ముఖ్య మంత్రి గారి లేఖ "రాష్ట్ర విబజన" ప్రక్రియను కోర్టుల్లో సవాలు చేయడనికి ఉపయోగ పడుతుందా? అసలే ఆర్టికిల్ 371-డి మీద స్పష్టత లేదు . అది సవరించనంత కాలం విభజన జగడానికి వీలు లేదని సీమంద్రా న్యాయవాదులు, నాయకులు వాదిస్తున్నరు. దానికి తోడు ఇది జత కానుందా? చూదాం ఎం జరుగుద్దో!