Tuesday, September 3, 2013

మద్యలో ఉన్న తాడుని ఊపడం తప్పా, వీరు చేస్తున్న ఉద్యమoఏమిటి ?

                                                                
                                                              
  వెనుకటి తెలుగు సినిమాలో చూసేవారం, హీరోలు విలన్లతో వారి గాంగ్ లతో చేసే ఫైట్లు. ఎంతో కామెడిగా అనిపించేవి ఆలొచించే వారికి. వంద మందిని నొంటి చేత్తో విసిరేసిన హీరో గారు వేసుకున్న డ్రెస్ నలిగేది కాదు, క్రాప్ చెదిరేది కాదు.బహూశా తమ అభిమాన హీరోని అలా చూసి తట్టుకునే శక్తి అభిమానులకు కానీ, అలా చూపించే దైర్యం ఆ నాటి కొంతమంది  దర్శకులకు ఉండేది కాదేమో!లేక పోతే హీరోల ఇమేజ్ తగ్గుతుందని బయమో కాని అలా సూపర్మేన్ ఫైట్ సీన్లు పెట్టేవారు. ఆ తర్వాత ట్రెండ్ మారి ఇప్పుడు బురదల్లో కూడా పొర్లి పొర్లి కొట్టుకుంటునారు అనుకోండి!

  మల్లీ ఇన్నాళ్ళకి అలనాటి తెలుగు సినిమా ఫైట్లను చూసే భాగ్యం సచివాలయ ఉద్యోగుల ఘర్షణల్లో  కనిపిస్తుంది. టి.వి.ఆన్ చేస్తే చాలు! "బ్రేకింగ్ న్యూస్"   "సచివాలయంలో  సిమాంద్రా, తెలంగాణా ఉద్యోగుల మద్య ఘర్షణ"! జల సౌదలో వుద్యోగుల మద్య ఉద్రిక్తత! తోపులాటా"! అనే హెడ్డింగులతో ఊదరగొడుతుంటాయి. తీరా చూస్తే అటొక గ్రూపు, ఇటొక గ్రూపు. పోలిస్ లను చూశాక ఒకరి మీదకు ఒకరు వెళుతున్నట్లు వీరావేశంతో కూడిన అరుపులు, నినాదాలు. వీరిని కట్టడి చేయడానికి అన్నట్లు పోలిస్ వారు వారి మద్య ఒక పెద్ద తాడు పట్టుకుని నిలబడ్డాకా, ఇక ఎట్టి పరిస్తితిలో తమ బట్టలు నలగడం కాని, క్రాప్లు చెదరడం కాని జరగవు అని డిసైడ్ అయ్యకా, గొంతున్న వారిని ముందు పెట్టి, తక్కిన వారు వెనుక చేరి ఒక గంటా,గంటన్నర ఎదుటివారి బట్టలు  టచ్ కాకూండా జాగర్తపడుతూ,  మద్యనున్న తాడును ఊపేస్తూ,నానా హంగామా చేస్తుంటే పాపం వీరెంత పోరాటం చేస్తారో ఫ్రీగా ఫైటింగ్ చూదాం అని టి.వి.ల ముందు కూర్చున్న ప్రేక్షకులకు, నోటి ఆరుపులు, మద్యలో ఉన్న తాడు ఊగడం తప్పా, ఏమి కనిపించక నిరాశ పడుతున్నారట!

 ఇంతకీ కొస మెరుపు ఏమిటంటే ఇలా రోజూ పోలిస్ వారి తాడు మాత్రమే ఊగడాన్ని చూసి బరించలేని వారు హైద్రాబాద్ కమీషనర్ గారికి పిర్యాదు చేస్తే, ఆయన గారు ఇరు వర్గాలను పిలిచి,"చూడండి వీరులారా! మీ ఊపుడికి మా తాడు తెగేటట్లుంది, కాబట్టి మీరు రేపట్నుంచి ఒకే చోట ఉద్రెకపడకండి. నల్ల పోచమ్మ గుడివద్ద ఒకరు, మరొక చోట మరొక వర్గంవారు పోరాటం చెయ్యండి, కాని ఒక కండీషన్ ఏమిటంటే ఎవరి తాడులు వారే తెచ్చుకుని ఊపుకోవాలి తప్పా, మా పోలిస్ వారి తాడు ఎట్టి పరిస్తితిలో ఉపయోగించడానికి వీల్లేదు" అనేసరికి అలాగే సార్ అని కాం గ బయటకు వచ్చారట! అమ్మయ్యా!రేపటనుండి వారి బట్టలు, జుట్టులే కావు, పోలిస్ వారి తాడు కూడా నలగకుండా ఉద్రేకంగా ఉద్యమాలు చేస్తారన్న మాట! పని ఎగ్గొడతానికి చేసే పనులు ఇలాగే ఉంటాయి కామోసు! 


Friday, August 30, 2013

ఇండియన్ మదర్ కన్నది అహ్మద్ సిద్దిబప్పానయితే, మదర్సా చదువు మార్చింది యాసిన్ భత్కల్ గా!


                                                                      


   యాసీన్ భత్కల్! ఒక నరరూఫ రాక్షసుడు. వీడికి కులం లేదు. మతం లేదు సరి కదా అసలు మానవత్వం అనేది మచ్చుకైన కానరావు వీడిలో . దేశంలో వివిద ప్రాంతాలలో జరిగిన   బాంబు  ప్రేళ్ళుల్లకు మాస్టర్ మైండ్ భత్కల్. అట్టి నర రూప రాక్షసుడు నిన్న ఇండియా నేపాల్ సరి హద్దుల్లో పోలిసులకు పట్టుబడటం జాతికి ఆనందం కలిగించే విషయం.

 యాసిన్ భత్కల్ అసలు పేరు అహ్మద్ సిద్దిబప్పా. ఇతడు ఉత్తర కర్ణాటక లోని భత్కల్ ప్రాంతానికి చెందిన వాడు. చిన్నప్పుడు' అంజుమన్ ఆమీన్ ఏ ముస్లీమీన్' అనే మదర్సాలో విద్యాబ్యాసం చేసాడు. ఆ తర్వాత దుబాయి వెళ్ళి తండ్రి నడుపుతున్న బట్టల కొట్లో పని చేసాడు. ఇతని లోని తివ్రవాద దోరణిల వల్ల తండ్రి తో సరిపడక అక్కడ నుండి ఇండియాకు వచ్చి ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్తను స్తాపించి దేశం లోని వివిద ప్రాంతాలలో బాంబు పేళ్లుల్లు జరిపి ప్రజలను హత మార్చాడు. ఒక సారీ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయినా పోలిసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడట!

ఇంటిల్జెన్స్ వర్గాల సమాచారం మేరకు  2008  నుండి ఇప్పటి వరకు యాసిన్ భత్కల్  బాంబు పేళ్లుల్లు జరిపిన ప్రాంతాలు.అహ్మదాబాద్    (2008), సూరత్  (2008), జైపూర్ (2008), న్యూ డిల్లీ (2008), వారణాసి (2010),బెంగళూర్  (2010), ఫునె (2011),ముంబై  (2011), హైదరాబాద్  (2013) బెంగళూర్  (2013).

  ఇప్పటికైన ఈ క్రూరుడిని పట్టుకోవడం సంతోషం. త్వరలో మిగతా ఉగ్రవాదులని కూడా పట్టుకుని ఉగ్రవాదుల  నుండి దేశాన్ని కాపాడతారని ఆశిద్దాం. 

Thursday, August 29, 2013

తెలుగోడి రాష్ట్రంలో ఎవడి గోడు వాడిదే !

                                                     


                                                            
ఏమంటూ ప్రకటించారో కానీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు, ఆ రోజు నుంచి రాష్ట్రంలో  రాజకీయ నాయకులకు హడావుడి ఎక్కువైపోయి పాపం కంటి మీద కునుకు లేకుండా పోయినట్లుంది. మొన్నట్టిదాక రాయల సీమ నేతలు, ముస్లిం నేతలు "రాయల తెలంగాణా" ప్రతిపాదనతో, రాయలసీమ జిల్లలను తెలంగాణ లో కలిపి రాష్ట్ర ఏర్పాటు చెయ్యాలని ముందుకు వస్తే,ఇప్పుడు కొంతమంది నాయకులు ఉత్తరాంద్ర జిల్లాలతో కలిపిన తెలంగాణా కావాలని ప్రతి పాదిస్తున్నారు. దీనికి ముఖ్యంగ రేణుకా చౌదరి గారు, ప్రభుత్వ విప్ బట్టీ విక్రమార్క, కోండ్రు మురలి గారు ప్రతిపాదన చేసి ఉత్తరాంద్రా నాయకులను కల్పుకుని డిల్లీలో తమ ప్రతిపాదనను సోనియా గాంది గారికి వివరించలనుకున్నట్లు తెలుస్తుంది. రేణుకా చౌదరి గారికిమేడం గారితో ఉన్న సన్నిహితం ఆమెను ప్రబావపరచడనికి ఉపయోగ పడినా , ఈ ప్రతిపాదనకు నాయకులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు .

 ఆసలు ఈ ప్రతి పాదన వెనుక ఉత్తరాంద్రాలోని కొన్ని మైనింగ్ ఆదారిత కంపెనీల యాజమాన్యాలు హస్తం ఉన్నట్లు కనపడుతుంది .ఖమ్మం జిల్లాలోని ఇనుపరాయి,ఇతర ఖనిజాలు విశాఖ పట్టణం, విజయనగరం లోని ప్లాంట్లకు సరపరా చేస్తుంటారు. అలాగే మన్యసీమలో ఎంతో విలువైన ఖనిజ సంపద ఉత్తరంద్రా జిల్లలోని కంపెనీలకు అవసరం. రేపు తెలంగాణా విడిపోతే ముడి ఖనిజం లబ్యత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బయ్యారం ఇనుపరాయి విశాఖా స్టిల్ ప్లాంట్ కి కేటాయించడాన్ని తెలంగాణ వాదులు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా  ముందు చూపుతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు రాజకీయ నా యకులతో ఈ ప్రతిపాదన చేయిస్తూ ఉండవచ్చు.

  ఇంకా సీమాంద్ర ప్రజలలో తెలంగాణా రాష్ట్ర ఏర్ప్పాటు ఎట్టి పరిస్తితిలో జరగదని నమ్మకం. అందుకే సమైక్యత మీదే వారి ద్రుష్టి నిలిపారు. ఒకవేళా ఆరు నూరైనా రాష్ట్రం విడిపోవడం ఖాయమని వారు కూడా అనుకుంటే అప్పుడు చూడాలి ఎన్ని ప్రతిపాదనలు వస్తాయో.  రాష్ట్రం లో రాజకీయాలు,ఎవడి గోల వాడిదే అన్న ట్లు ఉంటాయి.  

Wednesday, August 28, 2013

ఏమిటీ ! హైదరాబాద్లో మీకు రక్షణ లేదా ? ఇదిగో నా పోన్ నంబర్ తీసుకోండి .ఎనీటైం .... ఎనీవేర్ .... మీకు రక్షణ ఇవ్వడానికి నేను రెడీ !

                                                             

 తెలంగాణా ఏర్పడితే , నూతన రాష్ట్రం లో త్రెలంగానా నిరుద్యోగులకు   ఏటువంటి ఉద్యోగాలు వస్తాయో  తెలియదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం సెక్యూరిటి గార్డులు , బాడి గార్డుల ఉద్యోగాలు మాత్రం బోల్డన్నీ వచ్చేటట్ట్లున్నాయి . ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు , లాండ్ మాఫియా  డాన్ లు తమ ఆసక్తులు ,ఆస్తులు రక్షణకు  బీహారీ  గాంగ్ లను నియమించుకున్నారంట . అలాగే రేపు తెలంగాణ ఏర్పడితే హైద్రాబాద్లో ఉన్న సీమాంద్రా సెటిలర్స్ తమకు రక్షణ ఎలా అని ఆందోళన పడుతున్న నేపద్యమ్ లో తెలంగాణా రాజకీయ నాయకులు పోటీలు పడీ మరీ మీడియా ప్రకటణ లు ఇచ్చేస్తున్నారు  మరి !

 తెలంగానా  రాష్ట్రం ఏర్పడితే సీమాంద్రుల సెటిలర్స  ఆస్తులు, వ్యక్తిగత రక్షణ,    సమస్యగా మారుతుందని సీమాంద్రులు బయపడడానికి   కారణం తెలంగానా ప్రాంత నాయకుల రెచ్చగొట్టే మాటలు..  దానికి సెటిలర్స్ రక్షణ గురించి, వారు అడుగుతుంది ప్రత్యేక  చట్ట రక్షణ, ప్రభుత్వ రక్షణ. అంతే కానీ తెలంగాణా రాజకీయ నాయకుల ఇచ్చే వ్యక్తిగత లేక సామూహిక హామీలు కావు. ఒక వేళా తెలంగాణ నాయకులు బాడీ గార్డులు గా రూపాంతరం చెంది, సెటిలర్స్ కి రక్షణ ఇస్తామన్నా, వారి సేవలు పొందడానికి ఏ సెటిలర్ సిద్దంగ లేడు. ఆసలు సెటిలర్లు బయపడేది తెలంగాణ రాజకీయ నాయకులకే తప్పా, తెలంగాణ లోని సామాన్య  ప్రజలకు కాదు. తెలంగాణా ప్రజలు, ఆంద్రా ప్రజల మద్య ఉన్నది సోదరబావమే తప్పా వేరే అనుమానలు ఏమి లేవు. వచ్చిన సమస్యల్లా రాజకీయ నాయకులతోనే.  N.T.R  వచ్చే దాక హైద్రాబాద్ లో మత ఘర్షణలు ఆపిన  వాడే లేడు . అసలు వాటిని పెంచి పోషించింది రాజకీయా నాయకులే అనేది జగమెరిగిన సత్యం.మరి అటువంటి నాయకులు "మా పోన్ నంబర్ తీసుకోండి. మీకెవరైన ఆపద కలిగిస్తే మాకు పోన్ చెయ్యండి. మీ ప్రాణాలకు మా ప్రాణాలు  అడ్డం" అని సినిమా డైలాగులు కొడుతూంటే తెలంగాణ వారికే అనుమానం వస్తుందట! ఇదేంట్రా బాబూ, వీరేదో తెలంగాణా  రాష్ట్రం తెచ్చి, మనకు ఉద్యోగాలు ఇప్పిస్తారు అనుకుంటే, సీమాంద్రులకు బాడీ గార్డులుగ పని చెయ్యడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇలా ప్రకటణలు ఇస్తున్నారేమిటా? అని.

 కానీ సదరు రాజకీయ నాయకుల ఇంట్లోని ఆడవాళ్ళు మాత్రం తమ మగవారి మాటలను మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదట! ఆ.. ఈళ్ళ బొంద! మా మెళ్ళల్లో గొలుసులని పట్టపగలే దోచుకు వెళుతున్న  వారి నుండి ఇంటి వస్తువులు కాపాడ లేరు కానీ, ఇక సేటిలర్స్ ఆస్తులును కాపాడతారా? అని. కానీ పాపం ఇదేమి తెలియని సదరు నాయకులు మత్రం బాడిగార్డ్ గిరి  చెయ్యడానికి యమ హూషార్  అవుతునారంట !     

Tuesday, August 27, 2013

వ్యక్తుల్ని బౌతిక వాద పద్దత్తుల్లోనే కాదు , బావోద్వేగ పద్దత్తుల్లో కూడా చంపవచ్చు, జన విజ్ఞానుల వారూ

                                                                  
ప్రముఖ హేతువాది శ్రీ నరేంద్ర దబోల్కర్


  మొన్న నేను ఫేస్ బుక్ లో ఒక మిత్రుడు పెట్టిన టపా చూసాను . ఆయనగారి వ్యాఖ్యానం నాకు కొంచం ఆశ్చర్యాన్ని తెప్పించింది . పూర్తీ వ్యాఖ్యానం ఇది

 "ఇది భౌతిక వాద శక్తులు సాధించిన విజయం. మతోన్మాదులార భౌతిక వాదులను చంపాలంటే భౌతిక పద్దతుల్లోనే హత్య చేయాలి తప్ప ఏ భావ వాద పద్దతుల్లో చంపడం సాధ్యం కాదు అని నిరుపించిన గొప్ప వ్యక్తి నరేంద్ర ధబోల్కర్. బాణామతి, చేతబడులతో కాని, మంత్రాలు, మాయలతో కాని మమ్మల్ని చంపలేరనేది నిజం అనే బౌతిక సత్యాని నిరుపించినది ధబోల్కర్ గారి మరణం.

ఇప్పుడే నరేంద్ర ధబోల్కర్ గారి సంస్మరణ సభలో మాట్లాడి వస్తున్న. నిజంగ 8సం. క్రిత
ం ఫొన్ లో పరిచయమై అప్పుడప్పుడు ఆప్యాంగా మట్లాడి సలహాలు ఇచ్చే వ్యక్తి, నేను అభిమానించే వ్యక్తి చని పోవడం ఆ సభలో మాట్లాడాల్సి రావడం చాలా కష్ట సాధ్యమైన పనే. ప్రస్తుత ఐ.జి. ఆనాటి నల్గొండ ఎస్.పి. మహేష్ భగవత్ గారు నాకు నరేంద్ర గారిని పరిచయం చేశారు. అంధ శ్రద్ద ఈర్మూలన సమితి మూఢ నమ్మకాలకు వ్యతిరెకంగ, మోసాలు చేసే స్వాములు, బాబాలను అరెస్ట్ చేసె చట్టం ఒకటి చేయాలని పోరాడుతున్న ఆ మహానుభవుడి నుండి ఆ చట్టం కాపిని తెప్పించుకుని దానిని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరాలని అనుకోవడం జరిగింది. అప్పటి నుండి అప్పుడప్పుడు నరేంద్ర గారితో మాట్లాడుతునే ఉన్నాను. మతోన్మాద శక్తులు ఎంతకైన తెగిస్తాయని చెప్పడానికి ఇది నిదర్శనం.    "J.V.V. Ramesh". 


 కొంతమంది దుండుగలు ప్రముఖ హేతువాది దబోల్కర్ గారిని హత్య చేసారు . ఇది  పిరికి పందల  చర్య . ఇటువంటి దుర్మార్గపు చర్యలను బౌతిక వాదులే కాదు బావ వాదులు కూడా  ఖండించారు, ఖండించాలి కూడా  . కానీ అయన హత్య చేయబడటం బౌతికవాదుల విజయం అంటే కొంచం ఆశ్చర్యంతో కూడిన అనుమానం వస్తుంది . కొంపదీసి తమ వాదాన్ని గెలిపించుకోవటం కోసం బౌతిక వాదులే ఆయన్ని హత్య చేయించారా అని ! లేకపోతే హత్యలో కూడా  బౌతికవాద  గెలుపు చూడటం ఏమిటీ ? 
  ఒక వేళా జన విజ్ఞాన వేదిక వాదన ప్రకారం హత్యలన్నీ బౌతిక వాదుల విజయాలు అయితే ఆత్మ హత్యలన్నీ బావవాదుల విజయాలు అవుతాయి . ఎందుకంటే  బావోద్వేగాలే ప్రదాన పాత్ర వహిస్తాయి కాబట్టి . మొన్నట్టివరకు జరిగిన తెలంగాణా ఉద్యమంలో వేయిమందికి  పైగా ఆత్మ హత్యలు చేసుకున్నారు . ఇప్పుడు సమైక్యతా ఉద్యమంలో నాలుగువందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారట ! మరి ఇవ్వన్నీ బావవాదుల విజయమని వారు చంకలు ఎగురవేస్తే ఎలా ఉంటుంది ? కాబట్టి మిత్రులు హత్యను హత్యగానే చూడాలి తప్పా , అందులో గెలుపు ఉందని బావించడం శవయాత్రలో చిల్లర పైసలు ఏరుకునే నైజం లాంటిది . 

  దేశమంటే మట్టి కాదోయి మనుషులోయి అన్నట్లు , మనిషి అంటే  శరీరం మాత్రమే కాదూ ., బావోద్వేగాల సమ్మేళనం కూడా   అని తెలిసికుంటే మంచిది . .మెదడులో ఎడమ బాగం తప్పా , కుడిబాగం పనిచెయ్యని వారికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు కాబట్టి వారిని చూసి జాలిపడటం తప్పా మనం చేయగలిగింది ఏముండదు ..

  .

 
 

Monday, August 26, 2013

ఈ రోజు ఆహార భద్రతా బిల్లు పాసయింది కాబట్టి, రేపటినుండి తెలంగాణా వాదుల దౌర్జన్యం అణచి వేస్తారంట !

                                                                     

 ఆహార బద్రతా బిల్లుకి తెలంగాణా వాదుల దౌర్జన్యాల అణచివేతకి సంబందం ఏమిటని ఆశ్చ్యర్యపోతున్నార! ఏమో మరి, ఇందాకా టి.వి.లో ఉండవల్లి గారి మీడియా ప్రకటణ చూసి నాకు డౌట్ వచ్చింది.

   ఈ సాయంత్రం సీమాంద్రా నాయకులు ఆంటోనీ కమిటిని కలిసారు. కలిసి హైద్రాబాద్ లో సీమాంద్ర ఉద్యోగుల మీద, లాయర్ల మీద తెలంగాణా వారు రౌడీలు  లాగ దౌర్జన్యం చేస్తునారని, తెలంగాణ కావాలనే హక్కు వారి కెంత ఉందో, సమైఖ్యంద్రా ఉండాలనే హక్కు, తమకూ అంతే ఉందని, కాని దానీ కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న సీమాంద్రా ఉద్యోగులు మీద తెలంగాణ వారు దాడి చేస్తున్నా,  ప్రబుత్వం తగిన చర్యలు తీసుకోవటం లేదని, దీని వలన సీమాంద్రులలో అబద్రత బావం పెరిగి చివరకు లా అండ్ ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉందని మొర పెట్టుకున్నారట. దీనికి సానుకూలంగా స్పందించిన ఆంటోని గారు, దిగ్విజయ్ సింగ్ గారి చేత ముఖ్య మంత్రి గారికి ఇతర అధికారులకు పోన్ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పారట! ఈ విషయాన్ని ఉండవల్లి గారు మీడియా ముందూ వెళ్ళడిస్తూ రేపటినుండి చూడండి ఎలా ఉంటుందో అని నర్మగర్భంగ అంటుంటే నాకు ఒక  సందేహం వచ్చింది.

  నిజంగా సీమాంద్రా నాయకులకు తెలంగాణా వారి చేష్టల మీద అబ్యంతరం ఉంటే, అప్పుడే ఆంటోణి కమిటీకి ఈ విషయం చెప్పి వారికి తగిన రక్షణ ఏర్పాటు చేయ్యమని అడిగి ఉండవచ్చు కదా! ఇప్పట్టి దాక ఇరువర్గా ల మద్య తోపులాటలు అదీ ఫ్రేండ్లీ గేమ్ లాగా జరిగిందే తప్పా, ఒకరికీ  దెబ్బలు తగిలిన దాఖలాలు  లేవు కదా! ఇదంతా , చూసే వారికి పనులు ఎగ్గొడతానికి ఇరువైపుల ఆడే డ్రామాలాగ అనిపిస్తుంది తప్పా, పెద్ద సీరియస్ నెస్ ఏమి కనిపించలేదు వారి తోపులాటలో! మరి ఇంతలో ఈ సిరియస్ అలేగేషన్ ఎందుకబ్బా !ఒహో అంటే ఈ రోజు ఆహార భద్రతా బిల్లు ఒడ్డెక్కింది కాబట్టి, ఇక నుండి హైద్రాబద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గా చెయ్యడానికి అవసరమైన అన్ని చర్యలు మొదలు పెట్టాలని సీమాంద్రా నాయకులు నిర్ణయించి ఉంటారు. దానికి కావల్సిన రిహార్సల్ కి రంగం సిద్దం చేసుకుంటునారు అన్న మాట. కానియ్యండి, కానియ్యండి. ఇంకా తెలుగు ప్రజలు  ఎన్ని డ్రామాలు చూడాల్సి ఉందో! రాజకీయ నాయకులు ఎన్ని నాటకాలు ఆడాలనుకున్నా,చివరకు పైనున్న వాడు ఏది నిర్ణయిస్తాడో అదే జరుగుద్ది అని తెలుగు ప్రజలు చూస్తున్నారు. పాపం!    

Saturday, August 24, 2013

"సందట్లో సడే మియా" ప్రతి పాదన ఎందుకోసం?


                                                                     


   ఒక వ్యక్తి కాని, కుటుంబం కాని బలంగా ఉన్నంత కాలం ఎవడూ మాట్లాడడానికి కాని, వారితో విబేదించడానికి కాని సాహాసం చేయరు.కాని అదే వ్యక్తి కాని, కుటుంబంకాని ఏ కారణాలచేతనైన బలహీనమ పడుతున్నపుడు ప్రతి ఒక్కరూ దాని నుండి ఫాయిదా పొందాలని చూస్తారు. ఇదే పద్దతి ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో జరుగుతుంది.

   ఇప్పటి దాక రెండే వాదాలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో వినిపిస్తుండేవి. ఒకటి ప్రత్యేక తెలంగాణా, రెండు సమైఖ్యతాంద్రప్రదేశ్. తెలంగాణా కోసం మొన్నట్టిదాక తెలంగాణా ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తే, రాష్ట్ర ఏర్పాటుకు అధికార పార్టీ అంగికరించగానే ,జై సమైక్యాంద్రా అంటూ సీమాంద్ర ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం నడుస్తున్న తీరు చూస్తే, సీమాంద్ర ప్రజలలో బావోద్వేగాలతో కూడిన మమకారం మన రాజదాని నగరం మీద చాలా ఎక్కువుగానే ఉందనిపిస్తుంది. కానీ సోనీయా గాంది గారు విబజన తప్పదు అని కరాఖండిగా చెపుతుంటే సీమాంద్ర కాంగ్రెస్ నాయకులకు ఎటూ పాలుపోక కొంతమంది  నష్ట నివారణ కోసం ఆలోచించడం మొదలు పెట్టారు. దానిలో బాగమే "హైద్రాబాద్" ని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడం. ఈ గొడవలు ఇలా ఉంటే ఇంకొక ప్రతిపాదన తెచ్చాడు "సందట్లో సడేమియా".

    సందట్లో సడే మియా అని ఎవరిని అంటారో తెలుసా? ఎవరి గొడవలో వారు టెన్షన్ పడుతుంటే  గప్ చుప్ గా  తన పని కానిచ్చుకునే వాడిని అంటారు. ఇదిగో అలాంటి సడే మియా ఒకరు తయ్యారయ్యారు. ఆయనకి అధిష్టాన దేవత దగ్గర పలుకు బడి ఎక్కువట. అధిష్టాన దేవతకు బి.జె.పి. అంటే ఎలాగు పడదు.  అందుకని నూతనంగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం లో బి.జె.పి. బలపడకుండ, మరియు ముస్లిం ల సీట్లు గణనీయంగా పెంచుకునేందుకు, "రాయల తెలంగాణా" ప్రతి పాదన మొదలుపెట్టి అమ్మ కు విన్నవించాడు.దీనికి కొంతమంది సీమ నాయకుల మద్దతు ఉందని చెపుతున్నారు. ఈ విదంగా  అటు  సీమాంద్రలోను విభజన తేవడానికి ఈ "సడే మియా" ప్రయత్నిస్తున్నాడు. రాయసీమ ప్రాంతం లో ముస్లిం ల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మొన్న శుక్రవారం సమైఖ్యతాంద్ర ప్రదేశ్ కోసం సీమ ముస్లిమ్లు ప్రత్యేకంగా ముస్లిం J.A.C   పేరుతో ఆందోళన చేస్తే లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. అందుకే సీమ ముస్లిం లు, తెలంగాణా ముస్లింలు కలిస్తే తెలంగాణాను  మరొక సారి నవాబుల రాజ్యం చేయవచ్చని వారి ఆశ కాబోలు. మైనార్టిలుగా ఉండబట్టి వారిలోని కాంక్ష బయటపడటం లేదు కానీ, లేకుంటే హైద్రాబాద్ నిజాం లది కాబట్టి దానిని ఏలే హక్కు మాదే అనే కొంత మంది  చెంగీఝ్ ఖాన్ లు బయటపడే వారే.

  ఒక వేళ సడేమియా గారు ఆశించినట్లు రాయల తెలంగాణ వస్తే ఖచ్చితంగ అది మత పరమైన  రాష్ట్ర విభజన  అని చెప్పక తప్పదు. అధికారం కోసం ఎంతటి నీచానికైన తెగించే చరిత్ర అధికార రాజకియ పక్షాలది.ఎవరు ఎమన్నా  రామారావు గారు అధికారానికి రాక ముందు ఉన్న హైద్రాబాద్ ని ఒక్క సారి ఊహించుకుంటే కనపడేవన్నీ మత కలహలే. దానిని రూపుమాపి నగరాన్ని ఒక హై.టెక్ నగరంగా అంతర్జాతీయ స్తాయికి తీసుకు వెల్లిన ఘనత  తెలుగు దేశం  పార్టీదే అని ఒప్పుకోక తప్పదు. కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు.రాజకీయ కారణాల వల్ల విబజన అనివార్యం కావచ్చు. కాని దాని కోసం మత పరంగా బలపడాలనే ఉద్దేశ్యం  తో "సందట్లో సడే మియ"లు చేసే ప్రతిపాదనలు కార్య రూపం దాలిస్తే నాడు హైద్రాబాద్ లో ఉన్న మతకల్లోలాలు యవత్ తెలంగాణా రాష్ట్రం  అంతా ఉంటాయి అని గ్రహిస్తే మంచిది.            

Friday, August 23, 2013

పదేళ్లు పైన కఠిన శిక్ష పడుతుందన్న భయంని, "పశువాంచ" అధిగమిస్తుందా!?.



                                                            


 అవుననే అనిపిస్తుంది. వేయి నిర్బయ చట్టాలు తెచ్చినా ఈ దేశంలో ఆడపిల్లలకి లైంగిక దాడుల భయం పోగొట్టలేము అనేది రూడి అవుతుంది. అసలు నాకొక అనుమానం ఏమిటంటే ,ఏదైన సంచలనాత్మక కేసు జరిగినపుడు ఈ పోలిసులు పట్టుకుంటుంది అసలు నేరస్తులనేనా? శిక్షలు విదించాక అసలు వారినే జైలులో ఉంచుతున్నారా? లేక బినామీలు ఉంటున్నారా? అలా ఉంటే వారిలో ఎందుకు పరివర్తన రావటం లేదు? అసలు చట్టం అంటే ఎందుకు నేరస్తులకు భయం లేకుండా పోతుంది? ఇవ్వన్ని అమాయకుడైన నా  లాంటి వారికి జనియించే ప్రశ్నలు.

  మొన్న డిల్లిలో జరిగిన నిర్బయ రేప్ ఉదంతం లో, ముందు మేమే నేరం చేసామని అంగీకరించిన నేరస్తులు, ఆ తర్వత మేము నిర్దోషులమని మొరపెట్టుకున్నారు. మొదట పట్టుకున్నప్పుడు వారి ముఖాలు అవి కనపడకుండా తీవ్రవాదులకి ముసుగులు వేసినట్లు వేసి మీడియా కంట పడకుండా తీసుకు వెలుతుంటారు పోలిసులు. అదేమిటంటే రేప్ లాంటి సున్నిత కేసులలో ముఖాలు చూపించడం కుదరదు అంటారు. రేప్ కు గురైన స్త్రీకి ఆ నిబందన వర్తిస్తుంది కాని, నిందితులకు ఎలా వర్తిస్తుంది. అటువంటి నీచ కార్యాలు చేసిన వారు ఎవ్వరో సమాజం తెలుసుకోవాలి. కాని అంతా సీక్రేటే అయితే నిజమైన నేరస్తులకే శిక్షలు పడుతున్నాయి అని గ్యారంటీ ఎమిటి? వారే జైలులో ఉంటున్నారన్న గ్యారంటీ ఏమిటి?

  నిన్న ముంబయిలో జరిగిన ఉదంతం కూడా అంతే .అయిదు పశువులు ఒక పొటో జర్నలిస్ట్ ని రేప్ చేసాయి. నిర్బయ కేసులో మాదిరే అమ్మాయి  భాయిప్రెండ్ సాక్షిగా రేప్ జరిగింది. రేప్ జరిగిన రెండు గంటల తర్వాత పోలిసులకు పిర్యాదు అందీంది. ఇది జనాలకు తెలిసి గొడవ అవగనే వెంటనే ఇద్దరిని పోలిసులు పట్టేశారట! వారి ముఖాలు మీడియ కంట బడకుండా చేసారు. అదేమిటంటే సున్నితమైన కేసు అని సమాదానం. అయిదుగురులో ఇద్దరు రౌడీ షీటర్ లట! అందరిని పట్టుకున్నరని ఒక వార్త. కాదు ఇద్దరినేనని పోలిసుల సమాచరం. భాదితురాలను కాని, వారి కుటుంబం గురించి కాని తెలియ చేయక పోయిన పర్వాలేదు. కాని ఆ పశువులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

  డిల్లీ ఉదంతం, ముంబాయి ఉదంతం లో ఇంచు మించు విషయం ఒకటే. అమ్మయి బాయిప్రెండ్ తోడుతో నిర్జన ప్రాంతం(బస్సులో అయిన అదే) లో కనపడ్డారు. క్రూర జంతువుకి సాదు జంతువును చూస్తే ఎంత ఆనందమో, ఒక అమ్మాయి అబ్బాయి నిర్జన ప్రాంతంలో  కనపడితే మ్రుగాళ్లకు అంత ఆనందం. జరిగే ప్రతి దానికి ప్రబుత్వాన్ని, సమాజాన్ని నిందించినంత మాత్రాన మన ఆడపిల్లలకు  లభించే రక్షణ నామ మత్రమే. ఎవరి జాగ్రతలో వారుండాలి. అలా ఉన్నప్పటికి లైంగిక దడులు జరిగితే ఆ దాడులను చేసిన వారిని అమ్మాయి తరపు బందువులు అది మొత్తం కుటుంబం మీద జరిగిన దాడిగ బావించి నేరస్తుడికి పూర్తీ కాలం శిక్ష పడేల చెయ్యడానికి పంతం కట్టి పని చెయ్యాలి. ఎక్కడా రాజి  పడరాదు. అవసరమైతే పోలిస్ ప్రాసిక్యూషన్ కి తోడుగా ప్రైవేట్ లాయర్ని పెట్టి కేసును ఆసాంతం పర్యవేక్షీంచాలి. ఆర్దికంగా స్తోమత లేని వారు స్వచ్చంద సంస్తల సహాయం తీసుకోవాలి. మనం ఎంత రాజ్య రక్షణ విదానం  లో ఉన్న మన ప్రాణాలు, మానాలు తీసిన వారిని శిక్షించడంలో  ప్రభుత్వం విఫలమైతే ఆ పని మనం చేసినా తప్పు లేదని నా అభిప్రయం . అలా  అయిన నేరస్తులకు భయం ఉండి నేర కట్టడి జరిగే అవకాశం ఉంది.              

Wednesday, August 21, 2013

వీదిలో o.k. అని ఇంట్లోకి వచ్చి బావురుమంటున్న "బాబులు"

                                                             
    

 మొత్తానికి సోనియమ్మా సీమాంద్ర లోని లోని రాజకీయ బాబులుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది . పాపం వారి పరిస్తితి చూస్తుంటే , జాలేస్తుంది . వీరి పరిస్తితి ఎలా ఉందంటే , వేలం పాటలో ఎచ్సులుకు పోయి నష్టానికి పాటపాడి , చివరకు ఉంచుకొలేక , వదులుకోలేక యాతన పడే పాటదారులా ఉంది .

  తెలంగాణా ఏర్పాటుకు అందరూ సై  అన్న వారే . ఇప్పుడేమో మీరు కాదని ఉంటే తెలంగాణాను  మా "అమ్మ " ఇచ్చేది కాదని అధికార పక్షం వారు బోరు మంటుంటే , "ఇస్తే ఇచ్చింది కానీ , సీమాంద్ర వారి ప్రశ్నలకు సమాదానం చెప్పకుండా ఇస్తే ఎలా కుదురుద్ది ? అని ప్రతిపక్షం వారు కన్నీళ్ళు పెట్టుకుంట్టునారు.  కాని ఇప్పట్టికైనా "అమ్మా , మీరేదో రాజకీయ డ్రామా కోసం అడిగారని "లేఖలు " ఇచ్చాం కానీ , మీరు సిన్సియర్గా అడుగుతునారని అనుకోలేదు తల్లీ " , కాబట్టి మా లేఖలు కి సీమాంద్ర ప్రజల అభిప్రాయానికి ఎటువంటి సంబందం లేదు . మేము  ఈ  విషయంలో "న్యూట్రల్ " గాళ్ళం , అని ఒక్క మాట నిజాయితీగా ఒప్పుకుంటే ,బంతిని కేంద్రం కోర్టులోకి తోసినట్లయేది . కాని అలా  చెయ్యరు . ఇంకా రాజకీయంగా ఏదో బావుకుందామనే ఆలోచన కాబోలు . తెలంగాణ ఇస్తే సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ , తెలుగు దేశం పార్టీ దాదాపు తుడిచి పెట్టుకు పోవడం ఖాయం . ఇవ్వకపోతే తెలంగాణాలో కొన్ని ప్రాంత్తాలలో దెబ్బ తింటాయి . హైదరాబాద్, రంగారెడ్డి ,ఖమ్మం ఇంకా కొన్ని ప్రాంతాలలో లోసెట్టిలర్స్ ప్రబావం ఎక్కువ అనేది పార్టీలు మరువ రాదు . కాబట్టి ఒక వేళ రాజకీయ లబ్ది కోసమే అయితే సమైక్యతకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకున్న పార్టీలు నష్ట పోక తప్పదు .ఇప్పుడు నష్ట నివారణ కోసం ."ఆత్మ గౌరవ యాత్రలు , ఆత్మ ప్రబోద యాత్రలు , ఆత్మ ఘోష యాత్రలు అంటూ ప్రజలకి స్పష్టంగా తమ మనసులోని మాట చెప్పకుండా మబ్య పెట్టె పనులు చేస్తే , రెండు ప్రాంతాలలో కూడా  పార్టీ కి డిపాజిట్లు పోవడం ఖాయం . 


పిబ్రవరి ఒకటో తారీఖునే ఈ  బ్లాగులో స్పష్టంగా చెప్పాను.  "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. అందరూ విబజనకు సై  అన్నారు , కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు"  అని .మరొక సారి  పోస్టును చూడాలనుకుంటే ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి .http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html .         
   .

Tuesday, August 20, 2013

ఈ ఉద్యమాల వల్ల ఉన్నది పోయేటట్లు ఉంది! ఉంచుకున్నది పోయేటట్లు ఉంది!


                                                                   


  మొన్నటి దాక తెలంగాణా వాళ్ళు చేసిన ఉద్యమానికి మెచ్చి అధిష్టాన దేవత,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సందర్బంగా వారు చెప్పిన మాట ఏమిటంటే ,పదేళ్ళ పాటు హైద్రాబాద్ ఉమ్మడి రాజ్యదానిగా ఉంటుందని. దీని కోసం ఏర్పాటు ప్రక్రియ ఆరు నెల్లలో ముగిస్తాం అని. అంతే ! సీ మాంద్రుల పక్కల్లో బాంబు పేలినట్లై, ఒక్క పెట్టున సీమాంద్రులు సమైఖ్యాంద్ర కొరకు ఉద్యమించేసరికి, "మీరేదైనా సమస్యలు ఉంటే ఆంటోని గారికి చెప్పండి, మీ సమస్యను ఖచ్చితంగా తీరుస్తాం, కాకపోతే ఒక కండిషన్ ఏమిటంటే, మీరేదైనా అడగండి,సమైక్యాంద్ర తప్పా"’ అని నొక్కి చెప్పే సరికి సీమాంద్రులకు సిట్యూషన్ అర్దమై "అయితే మాకు హైద్రబాద్ ని U.T.  గా చూడాలనుంది" అని వరం కోరుకున్నారు. దీనికి కేంద్రం వారు హాపిగ ఒ.యస్ అనడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా వాదులకు ఆ దిశగ సంకేతాలు ఇచ్చేస్తున్నారు కూడా!

  ఒకరు,  ఒకటి ఆశించినపుడు,వేరొకటి త్యాగం చేయక తప్పదు. అసలు ఇంత తొందరగా తెలంగాణ ప్రకటన చెయ్యడం వెనుక, తెలంగాణా ప్రజల కోరిక తీర్చడం కంటే ,దేశం లోనే ఎంతో అభిరుద్ది చెందినది గా బావిస్తున్న హైద్రబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గ చెయ్యాలన్న ఆత్రుతే ఎక్కువుగా ఉన్నట్లుంది. దీనితో ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడినట్లవుతుంది.

  (1). అరవైయేండ్ల సమస్య అని చెప్పబడుతున్న "తెలంగాణా" ఇచ్చినట్లవుతుంది.

   (2). సీమాంద్రుల ప్రత్యమ్నాయ కోరిక ప్రకారం వారి భయాలకు పుల్స్టాప్ పెడుతూ, కేంద్ర పాలిత ప్రాంతం ఉంటుంది. భవిష్యత్ లో దేశ రెండవ రాజదానిగా  చెయ్యడానికి ఎటువంటి అడ్డంకులు అంటే ప్రత్యేకంగా ఏ ప్రాంత ప్రజలకు పాకేజీలు ఇవ్వ వలసిన పని ఉండదు.

  (౩). రెండు రాష్ట్రాలలో అధికార కాంగ్రెస్ తిరిగి అదికారం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

  కాకపోతే ఈ ఏర్పాటు వల్ల తీవ్రంగా నష్ట పోయేది తెలంగాణా ప్రాంతమే. ఎందుకంటే హైద్రాబాద్ లేని తెలంగాణ తల లేని మొండేం లాంటిది. కాని సీమాంద్రుల కోరికకి వ్యతిరేకంగా  తెలంగాణా పొందినపుడు, ఆ మాత్రం త్యాగం చెయ్యడం తప్పనిసరి అని తెలంగాణా వాదులను వొప్పించడం కేంద్రానికి పెద్ద సమస్య కాక పోవచ్చు.ఇప్పటిదాక జరిపిన ఉద్యమాలతోనే, విసిగి వేసారి ఉన్న తెలంగాణా యోదులు చివరకు గత్యంత్రం లేని పరిస్తితుల్లో హైద్రాబాద్ నిU.T.   చెయ్యడానికి ఒప్పుకోవచ్చు. ఆ విదంగ రెంటికి చెడ్డ రేవడి మాదిరి తెలంగాణా ప్రజలు మరొక మారు రాజకీయ నాటకాలకు మోసపోబోతున్నారు అని అనిపిస్తుంది.

  కాబట్టి ఈ  నాటకాలకు ఫుల్స్టాఫ్ పెట్టాలంటే, ఇరుప్రాంత మేదావులు బేషజాలకు పోకుండా ,అసత్య ప్రచారాలను కట్టిపెట్టి ,వాస్తవ పరిస్తితులను సమీక్షీంచి, మొత్తమీద తెలుగు ప్రాంత అధికారాలను, వనరులను తెలుగు ప్రజలకు మాత్రమే చెందేలా, ఒక వివేక మైన నిర్ణయానికి రావల్సిందిగా రాబోయే తరాల వారి తరపున అమాయకంగా అర్దిస్తున్నాం.