Monday, July 15, 2013

గీతలో "కులం" లేదు. ఉందన్న వారి లోనే "కులతీట" ఉంది.

                                  

                                                                   చదువుకుని కొంత జ్ణానం అబ్బగానే తాము దేనికైనా బాష్యం చెప్పగల పండితులం అనుకునే "పండిత పుత్రులు" చాల మంది ఉన్నారు . వారీలో తమకు ఇష్టం లేని వాటిని బూతద్దంతో శల్య పరీఖ్షలు చేస్తూ, మూల గ్రందాలలో అనకపోయినా , ఎవరో పైత్యపు బాష్యకారుడు అన్నడని దానినే ప్రామాణికంగా తీసుకుని తమ వక్ర బాష్యాలకు ఆధారం గా ఉపయోగిస్తుంటారు.

  నాకు తెలిసినంత వరకు "గీత" లో కుల ప్రస్తావన లేదు. మనిషి జన్మం బట్టి కాక గుణాన్ని బట్టి నాలుగు వర్ణాలు ఉంటాయని శ్రీ క్రిష్ణుడు చెపుతాడు. అలా ఆ గుణాన్ని బట్టే జ్ణానం ఉన్న వారు బ్రాహ్మణులుగాను, పౌరుషం ఉన్నవారు క్షత్రియులు గాను, వ్యాపార ద్రుక్పదం ఉన్న వారు వైశ్యులు గాను, మిగిలిన వారు శూద్రులుగా ను నిర్ణయించబడతారన్నాడు. అసలు గీతాకాలం కంటే ముందే ఈ వర్ణ బావన అప్పట్టి సమాజంలో ఉంది. అప్పుడు మూడు వర్ణాలే ఉండేవి. జ్నానర్జన, రాజ్యరక్షణ చేసే గుణం ఉన్న వారు తప్పా తక్కిన వారంతా వైశ్యులే అనబడే వారు. కాలక్రమేణా వైశ్యులు కూడ వ్యాపార ద్రుక్పదం ఉన్న వారు, నుండి అది లేని సామాన్య గుణం ఉన్న వారిని "శూద్రులుగా" పరిగణించారు.  ఈ వర్గీకరణ చూస్తుంటే "ప్లేటో" ఆదర్శ రాజ్య బావనల కంటే ముందే మన దేశం లో "గీతాకారుడు" అటువంటి బావాలు ప్రబోదించినందుకు మనం ఎంతో గర్వ పడాలి.

  కాని కొంత మంది పండిత పుత్రుల వల్ల  వర్ణం కాస్తా కులాలుగా రూపు చెంది ఈ సమాజాన్ని నాశ్నం చేసాయి. అది ఎలా జరిగిందో నార్ల వెంకటేశ్వర రావు గారి బాష్యంలోనే మీకు చూపిస్తాను.


"శ్రావణ్కు తెలియకపోయినా గీతకు సొంత సమాజశాస్త్రం ఉన్నది. గుణాన్నీ, పనిని బట్టి నాలుగు వర్ణాలూ నేనే సృష్టించానని చెప్పటంలోనే సారాంశం ఉన్నది. నాలుగు వర్ణాల బదులు నాలుగు కులాలని అల్లాడి మహాదేవశాస్త్రి తన అనువాద గ్రంధంలో రాశాడు. (Shankaracharya, The Bhagavadgeetha with the commentary, tr. by Alladi Mahadeva Sastry, 1979) జాన్ డేవిడ్ అనువాదం కూడా నాలుగు కులాల్నే సూచిస్తున్నది. కృష్ణుడు పేర్కొన్న నాల్గు విధాలైన సృష్టి నాలుగు కులాలకు చెందినది. హిందువు కులంలో పుడతాడు, అందులో నివశిస్తాడు, గతిస్తాడు. బ్రతికుండగా పాటించిన కులధర్మాన్ని బట్టే జన్మాంతరం కూడా ఆధారపడి ఉంటుంది. కులవిధానంలో పైకి పోయే అవకాశం లేదు. అదే, వర్గ సమాజంలో కూలివాడి కుమారుడు ఎంత పెద్ద స్థానానికైనా ఎదగవచ్చు" (గీత బోధించే సమాజశాస్త్రమంతా కులపరమైనదే.-16,By late V R Narla Telugu : Innaiah Narisetti).



 పై న చెప్పిన దానిలో నార్ల వారే క్రిష్ణుడు గుణాన్నిబట్టి, పనిని బట్టి నాలుగు వర్ణాలు తాను శ్రుష్టించాడు అని చెప్పినట్లు ఒప్పుకున్నారు. కానీ ఎవరో అల్లాడి మహాదేవశాస్త్రి మరియు జాన్ అనే అనువాదకులు వర్ణం అంటే కులం అని అనువదించారు కాబట్టి అది కులమేనని తీర్మానించారు. ఇంతకంటే వక్ర బాష్యం  ఇంకోటి ఉంటుందా?

      తనకు హిందూ మతమన్నా, దేవుళ్లు అన్నా, హిందువులు పవిత్రంగా బావించే గీత అన్నా పడదు కాబట్టి ఎవరో పైత్యపు అనువాదకులు చెప్పింది వారి   వక్రబాష్యానికి  అనుకూలం గా  ఉందని దానిని ప్రామాణికంగా తీసుకోవటం చూస్తుంటే ఆయన రచనలలో ఉన్న నిజాయితి ఎంతో ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా.కాబట్టి కులం అనేది క్రిష్ణుడు చెప్పిన గీతలో లేదు. గీతకు వక్ర బాష్యాలు చీప్పే వారి  లోనే కులతీట  ఉంది అని ఘంటాపధంగా చెప్పవచ్చు 

 

Saturday, July 13, 2013

నాటి "దేవ సాని" లే నేటి సినీ తారలా?



                                                                      

  అవుననే అనిపిస్తుంది. కొంతమంది సినిమా హిరోయిన్ల స్టేట్మెంట్ లు చూస్తుంటే. ఇదివరలో "కుష్బూ" అనే ఆవిడ గారు పెండ్లికి ముందు సెక్స్లో పాల్గొంటే తప్పేమి లేదని సెలవిచ్చి తన నైజం భయట పెట్టుకుంది. ఇంకొక అమె ఏమో మగాడు అంటే వాడిపారేసే "వేస్ట్ పేపర్" అని తన వేస్ట్ బుద్దిని బయటపెట్టుకుని చివరకు భయటకు రాలేక పోయింది. ఇప్పుడు తాజాగా "శ్రుతి హాసన్" అనే నటీమణి పెండ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటాను అని అర్దం వచ్చేలా మాట్లాడిందట!,

  మన పురాణాల ప్రకారం మానవులంతా పిల్లల్ని కనాలంటే పెండ్లి చేసుకోవలసిందే. కాని దేవ వేశ్యలకు ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే వారు ఇంద్ర లోకంలో ఎవరికి మూడ్ వస్తే వారిని సంత్రుప్తిపరచడమే కాక, ఇంద్రపదవికి భంగం కలిగించే నరులైన మునుల తప్పస్సు భంగం చేసే డ్యూటీ కూడ వారిదే. అందుకే దేవ వేశ్యలకు దేవతల హోదా ఇవ్వడమే కాక, సెక్స్ విషయమ్లో పూర్తి స్వేచ్చ ఇచ్చాడు ఇంద్రుడు. అందుకె మునుల తపస్సు భంగం కావించే ప్రక్రియలో, వారికి నచ్చితే కొంతకాలం వారితో గడిపి పిల్లలని కని ఆ మునుల ముఖాన పారేసి వెళుతుండే వారట. అలా జన్మించినదే భరతుని తల్లి శకుంతల. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

  ఆ దేవతాస్త్రీలే ప్రస్తుతం నర జన్మ ఎత్తి సినిమా స్టార్ లు అయినట్లుంది. అందుకే పూర్వ జన్మ వాసనా బలం చేత అలాంటి ఆలోచనలు కలిగి విచ్చలవిడి మాటలు మాట్లాడుతున్నారు. వీరికి మనుష్యుల కట్టుబాట్లు వర్తించవు కాబోలు. వీరికొక దీవి ని కేటాయించి "హాలీఉడ్" లాగా "జాలీఉడ్" అని పేరుపెట్టి వీరందర్ని అక్కడికి తోలేస్తే, వారితో పని ఉన్న వారందరూ అక్కడికి వెల్ళి "షూటింగ్" లు చేసి వస్తుంటారు. మనుషుల బాధ వారికి, వారి భాద మనుషులకు ఉండదు.  హిందూ మహా సముద్రంలో అండమాన్ నికో బార్ దీవులలో సుమారు వంద వరకు ఖాళీగా ఉన్నాయట!ఎవరైనా మంచి సౌండ్ పార్టిలు ఉంటే అటువంటి వాటిని కొనుగోలు చేసి "జాలీఉడ్" ఎర్పాటు చేస్తే బోల్డంతా "పర్ర్యాటకం" బిజినెస్". 

చర్యలు, ప్రతిచర్యలు మాత్రమే మానవుడి సబ్జెక్ట్ , అద్బుతాలు, విశ్వాసాలు మాత్రం మాదవుడి సబ్జెక్ట్.



                                                                
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు



 తలచినదే, జరిగినదా దైవమ్ ఎందులకు,

  జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.

  ఈ పాట వింటున్నప్పుడు ఎంత అనుబవ పూర్వకంగా చెప్పారో అనిపిస్తుంది.అన్నింటికి మానవుడే కర్త అని, అతను తలచుకుంటే అసాద్యమైనది ఏది లేదని అనుకుంటాడు. కాని అనుకోకుండా జరిగే హటాత్పరిణామాలకు బిక్క చచ్చి బేల చూపులు చూస్తుంటాడు. మళ్ళీ అంతలోనే మరచిపోయి తానే సర్వానికి కేంద్రం అని ఊగుతుంటాడు. రాజ్యాలు ఏలాదామని కలలు కన్న వారు ఒక్క కనురెప్ప పాటుకు కాలి బూడిదయ్యరు. అప్పటి దాక వారినే నమ్ముకుని ఎదో సాదిద్దామనుకున్న వారు కట కటాల పాలయ్యారు. ఆర్నెల్లలో అలా జరుగుతుందని ఏ జ్యోతీష్యుడు ఊహించ గలిగాడు.?. అప్పటి దాక "దేవభూమి" గా అలరారుతూ, ఒక రాష్ట్రానికే ప్రదాన ఆదాయ వనరుగా ఉన్న ప్రాంతం ఒక్క రాత్రీలో కనివిని ఎరుగని విలయానికి గురి అయి "మరుభూమీ" మారితే కనీసం చచ్చిన వాల్లెంత మందో లెక్కలేయలేని దీన స్తితిలో ఉన్న మానవుడు ఏమని చెప్పగలుగుతాడు. కనీసం పదిఘంటల ముందు ఇలా జరుగుద్దని ఏ శాస్త్రజ్ణుడు కనిపెట్టగలిగాడు? చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు నామ రూపాలు లేకుండా పోయినా స్పాట్ కి దగ్గరలో ఉన్న దేవాలయానికి ఏమి జరుగకపోవడం అద్బుతం అనాలా? మానవుడి చర్యలు అనాలా? ఒకలెక్క ప్రకారం మానవుడి చర్యలు , ప్రతి చర్యలు కూడా "దైవసంకల్పంలో బాగమే తప్పా అన్యదా కాదు.

Friday, July 12, 2013

భారతీయుల బానిసత్వానికి కారణం గీతా బద్దులా? చేతగాని "బుద్దులా"?


                                                           

  హిందూ మతం అంటే పడనివారు చరిత్రను ఎంత వక్రీకరించారో, వక్రీకరిస్తూ హిందుత్వం మీద విషం గ్రక్కుతున్నారో, విదేశి గన్నయల తత్వపైత్యం తెలియచేస్తుంది. అలాంటి వారి వక్ర బాష్యాలు  ఎలా ఉన్నాయో ఒక ఉదాహరణ చూడాం. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి అన్నం అంతా పట్టి చూడక్కరలేదు.నాలుగు మెతుకులు పట్టి చూస్తే తెలిసి నట్లే వీరి వక్ర బాష్యాలు ఎలా ఉంటాయో చెప్పటానికి వారు చెప్పిన కొన్ని వ్యాక్యలు విశ్లేషిస్తే చాలు.

 "కృష్ణుడుతనను సర్వాంతర్యామిగా, సర్వశక్తివంతుడుగా చెప్పుకొని అర్జునుడితో పాటు అందరినీ తనకు లొంగిపొమ్మన్నాడు. ప్రపంచ మత సాహిత్యంలో అంత ఆడంబరంగా గొప్పలు చెప్పుకున్న ధోరణి మరి ఎక్కడా కనిపించదు. తన శక్తిని శంకించిన వారినందరినీ ఖండించాడు. అలాంటి తత్త్వం అత్యున్నతమైందని మన నాయకులు పొగిడారు. మనదేశం శతాబ్దాలుగా లొంగిపోయిందంటే ఆశ్చర్యమేమున్నది. ఇరానియాన్లూ, గ్రీకులూ, బాక్టీరియన్లూ, కుషాణులూ, హుణులూ, శాక్యులూ, అరబ్బులూ, తురుష్కులూ, మొగలులూ, ఆఫ్ఘన్లూ, పోర్చుగీస్, ఫ్రెంచి, బ్రిటిషువారికి భారత జాతి లొంగిపోయింది. 1962లో చైనావారి తన్నులకు గురయింది. ఇదంతా లొంగుబాటు తత్త్వ సారాంశమే."(గీతకు తత్త్వం ఉందా?-14--The truth about Gita by  Narla).
 
  పై  బాష్యం  చూస్తే ఎంట వక్రంగా ఉందో అర్దమవుతుంది. భారతీయులందరికి తెలిసిన గీత లో అర్జునుడు యుద్దరంగం లో వైరి పక్షం లో ఉన్న బందువులందరిని చూశి , వీరందరిని సంహరించడం తన వల్ల కాదని వైరాగ్యం తో దుఃఖిస్తుంటే " నీవు నిమిత్త మాత్రుడవు, చంపు నీవెవ్వరూ, చచ్చు వారెవ్వరూ? అన్నీ నేనే,కర్మలను చేయుటయందే నీకు అధికారముంది కాని ఖర్మ పలితం పైన కాదు. నీవు ఖర్మ పలితమునకు కారణం కారాదు, అట్లని ఖర్మలు చేయుట మానరాదు" అని మహోన్నతమైన తత్వం భోదిస్తే, దానితో తనకు కలిగిన వైరాగ్యం నుండి విముక్తుడై, సుడి గాలిలా చెలరేగి యుద్దం చేసి పాండవులకు విజయం చే కూర్చాడు అర్జునుడు.

   మరి పైన తెల్పిన దానిలో ఎక్కడైన శత్రువులకు లొంగి పొమ్మని క్రిష్ణుడు చెప్పినట్లు ఉందా? కాడి వదిలేసిన వాడిని కార్యోన్ముఖుడుని చెయ్యటం బానిసత్వం అవుతుందా? ఏమిటీ పిచ్చి రాతలు!?
సరే మరి ! వీరు విపరీతంగా ఆరాధించే బుద్దుడు ఏమన్నాడో చూద్దాం.

 . జీవ హింస వద్దన్నాడు.పెండ్లి చేసుకోవద్దన్నడు. మద్యం మాంసం తినవద్దన్నాడు. అలా ప్రక్రుతికి విరుద్దమైన పనులు అన్నీ చెప్పి ప్రజలను రాజులును నీరస వాదులుగా మార్చాడు. మన చరిత్రలో అశోక చక్రవర్తే గొప్ప ఉదాహరణ. అంత గొప్ప వీరుడే బౌద్ద మతం తీసుకున్నాక శాంతి పరుడై పోయాడు. ఎవరి డ్యూటి వారు చెయ్యాలి అనే సూత్రమ్ మరచి, ప్రజల్ని రక్షించాల్సిన రాజులే, సన్యాసులై తత్వాలు చెపుతుంటే, విదేశియులు దండ యాత్రలు చేస్తే ఏమి చెయ్యగలరు? కత్తులు తిప్పాల్సిన చోట తత్వాలు చెపితే శత్రువులు "చెవిలో పువ్వులు" పెట్టుకుని వింటుంటారా? వినరు కదా౧ అందుకే మన చేత కాని బుద్దుల వల్ల మన దేశం విదేసియుల దండ యాత్రలకు గురి అయి బ్రష్టు పట్టి పోయింది.

  విజ్ణులైన వారు ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి తాత్వికంగా  గొప్ప వాడు కావచ్చు.కాని ఆయన బోదించిన తత్వమే మన దేశాన్ని విదేసియుల దండయాత్రలనుండి ఎదుర్కోలేని దద్దమ్మలుగా, స్వదేశియులుని చేస్తే దాని వల్ల మనకు కలిగింది లాభమా? నష్టమా?. బుద్దుడు వ్యక్తిగతంగా  మహాత్ముడు కావచ్చు. కాని ఆయన చెప్పిన విదానం ప్రక్రుతికి విరుద్దం. అది ఒక విపల తత్వమ్ అనడానికి,  గన్ లు పెట్టి కాల్చుకుంటున్న బౌద్దులే ప్రతీకలు.

   హీందూ మతం అంటే అది అన్ని  మతాల వలే  కాదు. ఒక జీవన విదానం. అది అందరి తత్వాలలోని మంచిని గ్రహించింది. హిందూ సముద్రంలో అన్ని నదులు కలుస్తున్నట్లే అన్ని తత్వాలు ఇందులో ఇముడ్చుకుంది.బుద్దుడు చెప్పిన ఆచర్నాత్మక విదానాలను హిందూ మతం కాదనలేదు.అందుకే బుద్దుడును భగవానుడే అంది. పచ్చగడ్డి తినే పశువుకు ఏదో ఒక రకమ్ మేతతో జీవించ గలదు. కాని పశు దశ నుండి మనిషి దశకు ఎదిగిన జీవికి ఎదో ఓ ఒక రకమ్ కాదు. అన్నీ సమపాల్ళలో ఉంటేనే కమ్మని బోజనం. అలాగే హిందూ తత్వం ఏ వయసులో ఆ ముచ్చట అనే ప్రక్రుతి దర్మానుసారంగా " ఆశ్రమ జీవన విదానం" అవలంబించమంది.దానిలోనే త్రి మూర్తులను దర్శించవచ్చు. అది ఎలాగ్ ఈ లింక్ మీదhttp://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html క్లిక్ చేసి చూడండి.      


Wednesday, July 10, 2013

బుద్దుడు గయా!తీవ్రవాది ఆయా!

Time magazine's lead article 'The Face of Buddhist Terror', featuring Myanmar’s extremist monk Wirathu. (Photo Courtesy: Official Website of Time Magazine)
Time magazine's lead article 'The Face of Buddhist Terror', featuring Myanmar’s extremist monk Wirathu. (Photo Courtesy: Official Website of Time Magazine)



  మొత్తానికి ఆదర్శ  కమ్మ్యునిస్ట్  వాదం లాగే బౌద్దం కూడ ఆదర్శంలో తప్పా, ఆచరణలో పనికి రాదని తేల్చేసారు బౌద్దులు!. ఒక నాటి  హిందూ మతం లోని అనా చారాల  విపరీత పోకడలను నిరసిస్తూ, ఒక రాకుమారుడు తనకు కలిగిన సకల ఐశ్వర్యాలను, వదలి సన్యాసిగా మారి ప్రవచించిందే బుద్దత్వం. ఆయన చెప్పిన తత్వం ఇక్కడి ప్రజలనే కాక విదేసీ ప్రజలను విశేషంగా ఆకర్షించి, కొన్ని దేశాలు పూర్తిగా బౌద్దమయం గా మారాయి అమ్టే అది ఆ మహానుబావుడీ  వ్యక్తిత్వ ప్రభావం. కాని ఆయన చెప్పిన దాంట్లో మానవ సహజ స్వభావానికి వ్యతిరేకమైన అంశాలు ఉండడం వల్ల, నూటికి నూరు పాళ్ళు బౌద్దం ఆచరణ సాద్యం కాదని తేలిపోయింది.

   బుద్దుడైనా, మహావీరుడైన ఈ ఖర్మ భూమి నుండే ప్రభవించారు కాబట్టి, వారు చెప్పినది కూడహిందూ మతం అధారంగా కాబట్టి, అది హిందూ మతం లో బాగమేగానే గుర్తిస్తున్నాం. మన చట్టాల ప్రకారం కూడా హిందూ ఇంక్లూడ్స్ బుద్ధిస్ట్, అండ్ జైన్.కాబట్టి బౌద్దులకు ఎక్కడ ఏమి జరిగినా దానికి మనం కూడ సహజంగానే ప్రతి స్పందిస్తాం. ఈ సహజ బందం వలనే కాబోలు మియన్మార్లో జరుగుతున్న దానికి ప్రతీకారంగా తీవ్రవాదులు మొన్న బుద్దగయలో ప్రతీకారం తీర్చుకున్నారు.

 ప్రసిద్ద టైమ్  మాగ్జిన్లో రాసిన దాని ప్రకారం మియన్మార్లోని బొద్దులు అహీంసా మార్గాన్ని వదలి హింసా మార్గం లో నడుస్తున్నారట. అలా నడువమని "విరాత్" అనే బౌద్ద సన్యాసి ప్రచారం మొదలెట్టాడట!. అదంతా ఎందుకంటే తమ మతం ని బంగ్లా దేశ్ నుండి వచ్చే ముస్లిం  మత జాలం నుండి కాపాడుకోవాటానికేనట. అక్కడ ముస్లిమ్ లను పెండ్లి చేసుకోవాలంటే, ఆడపిల్లలకు  తల్లితండ్రుల అనుమతితో పాటు, మత పెద్దల అనుమతి తప్పనీసరి అట!. ముస్లిమ్ ల  పట్ల వ్యతీరేకతే కాకుండా వారి షాపులను, బిజినెస్స్ లను బహిష్కరించమని , అందుకోసం హింసను ప్రయోగించినా తప్పు లేదని ప్రకటించాడట ది గ్రేట్ విరాత్ సన్యాసి గారు.

  శబాష్ మొత్తానికి బుద్దులకు జ్ణానోదయం అయింది. అందుకే పరిస్తితులను గమనించి మియన్మార్ లోని బౌద్దులలో "బుద్దుడు"  వెళ్ళిపోయి  వారిలో కూడా తీవ్రవాది ప్రవేశించాడు. కాబట్టి " బుద్దుడు గయా!తీవ్రవాది ఆయా!". కాకపోతే ఉరుము ఉరిమ్ మంగళం మీద పడిందని మియన్మార్లో జరిపే బుద్దుల దాడికి బారత  "బుద్దగయ" లో ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటి? అంటే పైన చెప్పిన సమాధానమే.

Monday, July 8, 2013

విదేశి "గన్నయ్య"ల ద్రుష్టిలో ఆయన ఎవరైనా, స్తీ మాన రక్షణకు చీరలు ఇచ్చిన అన్నయ్యే మా కన్నయ్యా!..



                                                                  


  మొన్న నేనొక ఆర్టికిల్ చదివాను. "మానవ వాదం" పేరుతో హిందువుల పంచమ వేదం  మహ భారతం మీద తన అక్కస్సు నంతా వెళ్ళగ్రక్కాడు ఆ  వ్యాస రచయిత. ముఖ్యంగా యుగపురుషుడు అయిన శ్రీ క్రిష్ణ బగవానుని గురించి కొంత మంది విదేశి గన్నయల పేరు మీద కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు.  మహ భారతం విజ్ణాన గ్రందం ఏమి కాదు విమర్శించడానికి. పై పెచ్చు ఆ వ్యాస రచయితే ఒప్పుకుణ్ణాడు మహా భ్హారతం కాలాంతరంలో ప్రక్షిప్తమయిందని. అటువంటపుడు నిజమేదో , కల్పన ఏదో తెలియని పరిస్తితిలో పని కట్టుకుని పురాణా పాత్రలను, కొన్ని కోట్ల మంది అరాదించే బగవానుడి పట్ల  తనకున్న తన విక్రుత బావాలని విదేశియుల పేరు మీద అంట గట్టి  చూపడం ఎందుకు? ఇది ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలను కించపరచే చర్యే.



 రామాయణ, మహా భారతం లు సీరియల్స్ గా దూరదర్శన్ లో ప్రసారమైనంత కాలం పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఒక ఉద్వేగ బావనతో బారతీయులు వీక్షించారు.అది వార్కి ఆ కదల మీద ఉన్న ఆసక్తి కావచ్చు, భక్తి బావన కావచ్చు, ఏదైనా సరే వారికి ఆద్యాత్మిక ఆనందం పంచిన పురాణ కదలు. ఒక్కొక్క విషయం ఒక్కకరికి ఒక్కొక్క విదంగా అర్దం కావచ్చు. వారు తమకు అర్దమయిన విదంగా ప్రచారాలు చేస్తూ ఉండవచ్చు. ఉదాహరణకి "సత్య హరిచంద్ర" చూసిన వారు అద్యాత్మిక వాదైతే సత్యం కోసం పాటు పడిన హరిశ్చంద్రుడిని ఆదర్శం అంటాడు. కాని మేటీరియలిస్ట్ అయితే "పిచ్చోడు కాబట్టే ఇన్ని బాదలు పడ్డాడు, అదే ఒక్క అబద్దం ఆడితే, సర్వ సౌఖ్యాలు పొందేవాడు కదా " అని బావిస్తాడు. అంటే ఒకటే కధను  వారి వారి చిత్తానుసారం అన్వయించుకుని అర్దం చెప్పుకున్నంత మాత్రానా అసలు సత్య హరిచంద్రుడు సత్యం కోసం పాటు పడమనే కదా ప్రభోదించింది. !

 అలాగే శ్రీ క్రిష్ణుడు  అంటే పరిపూర్ణమయిన మానవుడు. భగవంతుడైనా సరే మానవ జన్మ ఎత్తినందుకు మానవుడు చేసే పనులే చేసాడు. బలం లేని చోట యుక్తితో, బలవంతుల సహాయంతో , శత్రువులను జయించటం కుట్రలు, కుయుక్తులు అవుతాయా? కరూణామయుడు భక్తుల మని చెప్పుకుంటూ, మానవుల మీద బాంబులు కురిపించే విదేశీయుల రక్తం కలిగిన వారు క్రిష్ణుని ఒన్నత్యాన్ని ఏమి అర్ధం చేసుకోగలరు. ఎప్పుడో చిన్నపుడు అల్లరి క్రిష్ణయగా గోపికల చీరలెత్తికెల్లిన ఘట్టాలాంటివి ఆదారంగా కొంతమంది భక్తి బావాలను ప్రచారం చేస్తే, దానికి మలిన శ్రుంగార బావాలు అపాధించ్చి, తమలో ఉన్న విక్రుత బావాలను పురాణ పురుషులకు అంట కట్టి విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమనుకోవాలా?

   అయినా మహా భారత గ్రందంలో క్రిష్ణుడు ఎలా వర్ణించబడ్డాడో, సగటు భారతీయుడుకి అవసరమ్ లేదు. ఎప్పుడు మెదడులో ఎడమ బాగ్తం తప్పా, కుడి బాగం పని చెయ్యని గన్నయల ద్రుష్టిలో శ్రీ క్రిష్ణుడు ఎలా ఉన్నడు అనేది ముఖ్యం కాదు. సగటు భారతీయుల ద్రుష్టిలో ఆయన దేవుడు. ఆయన దుష్ట సంహారం చెయ్యడానికి పాండవుల వైపు నిల బడ్డాడు. దుష్ట కౌరవ సభలో కులసతి  బట్టలు నీచులు  ఊడదీస్తుంటే, చీరలు ఇచ్చి కాపాడిన "అన్నయ్య" అతను. ఆయన అలాగే తెలుసు భారతీయులకు. అలాంటి బావాలను రూపు మాపి హిందూ సంస్క్రుతిని దెబ్బతీయాలనే విదేసి మతస్తుల కుట్రలో బాగంగా, వారికి తోద్పడుతున్న వారు , కుహాన రచయితలు, ఇంకొక వేయి జన్మ లెత్తినా శ్రీ క్రిష్ణుడి పట్ల భారతీయుల కున్న భక్తి బావాన్ని చెరుపలేరు.     

Wednesday, July 3, 2013

హిజ్రాలకు శుభ వార్త!రెండేళ్లలో లింగ మార్పిడి లాగె తల మార్పిడి చేసుకోవచ్చంట!

                                                                     

                                                                   అబ్బా ! క్రుత యుగం ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఇక నుండి ప్రక్రుతి ఇచ్చిన ఆక్రుతి తో జీవించాల్సిన పని లేదు. ఈ మద్య కాలంలో అబ్బాయిలుగా ఉండే కన్నా అమ్మాయిలుగా మారితే బోల్డంత బెనిఫిట్ లు ఉన్నాయి అని గ్రహించిన కుర్రకారు స్వచ్చందంగా ఆపరేషన్లు చేయించుకుని "లింగం" మార్చుకుని ఆ "లింగడు"(శివుడు)  నే సవాలు చేస్తూ జీవిస్తున్నారు. వీరు ఇంతా చేసేదే ఏమిటంటే కష్ట పడి మగవాడిగా జీవించే కంటే "ఇష్టపడే" ఆడదానిగా జీవించడంలో ఎంతో సౌలబ్యం ఉంది. అటు డబ్బుకు, డబ్బు, ఇటు సుఖానికి సుఖం.ఇటువంటి లింగమార్పిడి ఆపరేషన్లు వల్ల వారిని కన్న తల్లితండ్రులకు "పరేషాన్" తప్పా వీరికి మాత్రం అంతా ఆనంద మయమే.

  అయితే వీరు ఎంత గా లింగ మార్పిడి చేయించుకున్నా చాలా మందిలో సహజ స్తీ రూపం రావడం కష్టం. లింగం అంటే మార్చారు కాని పైన కనపడే ఫేస్ మార్చడం కష్టం . దానికి ప్లాస్తిఖ్ సర్జరీలు లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్ లు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ అలా లింగ మార్పిడి చేయించుకున్న వారి కోర్కెలు తీర్చే ఒక సైంటిశ్ట్ ఇటలీలో ఉద్బవించాడు. ఆయన క్రిందే కాదు పై బాగాని కూడ మార్చేస్తా, ఒక్క రెండు సంవత్సరాలు ఓపిక పట్టండి, మీకొర్కె నేరవేరుస్తాను అని హామి ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కోతుల తలలు మారుస్తున్నాడట, అవి సక్సెస్ అయింది కాబట్టి ఇక "కోతి వారసులకు" ఈ ప్రక్రియ మొదలు పెడతా అని తెగ ఉబలాట పడిపోతున్నాడు ఆ ఇటలీ వాలా.

  ఆయన చెప్పేదాని పట్టి ఇద్దరు వ్యక్తుల తలలు పదునైన బ్లేడుతో వేరు చేసి ఒకరి తలను ఇంకొకరికి అమరుస్తాడట! అమ్తే వారు వీరవుతారు! వీరు వారవుతారు! రెడ్లైట్ యేరియాలో ఉండే అమ్మాయిలుకు లంప్ సం గా కొంత డబ్బు ఆశ చూపితే లింగ మార్పిడి చేయించుకున్న అబ్బాయి ఇక అచ్చమయిన అమ్మాయిగా మారి బోల్డంత సుఖం రసికులకు పంచవచ్చు. ఈ విదంగా బవిషత్లో ఈ లింగ మార్పిడి డాక్టర్లకు బోల్డంత గిరాకీ కాబోలు.

  అంతా బాగానే ఉంది కాని తల మార్పిడి చేస్తే దానితో పాటే మెదడు మార్పిడి జరుగుద్ది కదా. మరి ఒక మేదావి తలను కొనుకుని మేదావిగా మారవచ్చా? అలా అయితే చదువు కోనే వారికి ఎంత సుఖం!ఒక్కొక్క సీటుకు కోట్లు ఖర్చు పెట్టి ఉన్న బుర్రంతాఖరాబు చేసుకునే బదులు మంచి మేదావి బుర్ర టోకుగా కొనేసుకుని ఒక్కసారే "తల మార్పిడి" చేసుకుంటే పోలా!. అంటే రానున్న క్రుత యుగంలో అందం ఉన్న ఆడవాళ్ళకు, బుర్ర ఉన్న మగవాళ్ళకు మంచి డిమాండ్ అన్న మాట!. అయితే దీని వలన ఒక డేంజర్ కూడా ఉంది. డిమాండ్ ఉన్న వస్తువులను కాపాడుకునే దమ్ములు లేని వారికి కిడ్నాప్ లు,అవయవ చౌర్యాలు ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి మనిషిని మార్చి వాడిలో చైతన్యం తేలేక పోయినా ఉన్నవాడికి అన్నీ అమర్చే టెఖ్నాలజి కనుకున్నందుకు సైంటిస్టులను ఎన్నిసార్లు అభినందించినా తక్కువే మరి!.              



Friday, June 28, 2013

పరిచయం లేని మగవాళ్ళని, పబ్ దగ్గర, రాత్రి పూట లిప్ట్ అడిగితే, జరిగేది అదే మరి !

                                                              
                                                             
 డిల్లీలో  మొన్న నిర్బయ ఉదంతం నుంచి నిన్నటి గుర్గావ్ ఉదంతం వరకు ఒకటే విషయం. రాత్రుళ్లు స్త్రీలు ముక్కూ, ముఖం తెలియని వారి వాహనాలలో ఎక్కి, అత్యాచారాలకు గురి కావడం. పాపం నిర్బయ విషయంలో పబ్లిక్ సర్విస్ బస్ అనుకుని ఎక్కి నష్టపోయారు. కాని నిన్న డిల్లిలో జరిగింది మాత్రం స్వయక్రుతాపరాదం. అందుకే కాబోలు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా డిల్లీలో రేప్ లంటే అది కామనేలే అని ప్రాముఖ్యం లేని లోపలి పేజిలలో ప్రచురించడం మొదలు పెట్టారు. దానికి ఉదాహరణ ఈ రోజు ఒక చిన్న న్యూస్ అయిటం గా పేపర్లో ప్రచురితమయిన, గుర్గావ్ లో ఇద్దరు స్త్రీల మీద కారులో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన సామూహిక అత్యాచార గాదా .

  కహానీ లోకి వెళితే, ఇద్దరు అతివలు. రాత్రి పూట పార్టికి అని పబ్బు కొచ్చారట. పార్టి అయ్యక లిప్ట్ కోసమని బయట నిలబడ్డారట. అంతలో ఒక కారు వారి ముందు ఆగిందట. అందులో ఇద్దరు మగవాళ్ళట. రండమ్మా మీరు కోరుకున్న కాడ దింపుతాం అంటే జల్లో పూలు లేకపోయినా, చెవిలో పూలు పెట్టుకుని ఎక్కారట. కారు కొంత దూరం వెళ్ళాకా  మరో ఇద్దరు మగవాల్ళు ఎక్కారట. కారు వెళుతూనే ఉంది. అంతలో ఆ మగవాళ్ళ ముఖాలు "మ్రుగాళ్ళ" ముఖాలుగా మారి పోయాయి అట! అదేమిటి వీళ్ళ  ముఖాలు అలా అయ్యాయి అని అతివలు అనుకునే  లోపే జరగాల్సిన గ్ఃఓరం జరిగిపోయిందట! సీన్ కట్ చేస్తే అమ్మాయిలిద్దరు గాంగ్ రేప్ కి గురయ్యారు. పాపమ్ ఏడ్చుఖుంటూ వెల్ళి పోలిసులకి పిర్యాదు చేస్తే, వాల్లు ఎవరిని అరెస్ట్ చేయాలో అర్దం కాక ఇన్వెస్టిగేషన్ బ్రుందాలను రంగం లొ దించి గాలింపులు మొదలెట్టారట!కడపటి వార్తలందేసరికి అయిదుగురు కార్ డ్రైవర్ లను అదుపులోకి తిసుకున్నట్లు సమాచారం .    అదీ కద!.

  పై కహాని అంతా విన్నాకా ఎక్కడో ఏదో లింక్ మిస్స్ అయినట్లు లేదూ? ఏమిటబ్బా అది? నాకు అర్దం కావటం లేదు మీకేమైనా అనిపిస్తే చెప్పండి. ఇక్కడ రాత్రులు వేళలో ముక్ఖు ముఖం తెలియని వారిని లిప్ట్ లడిగే వారికి చెపుదాం. డిల్లీలో వాల్ళు మన మాట వినకపొయినా ఇక్కడి వారన్నా   విని జాగర్త పడతారేమో!   


Thursday, June 27, 2013

ఇడుగిడుగో వీడే!ఉత్తరాకాండ్ విలయానికి కారకుడు, వ్రుత్రాసురుడు!.


                                                              

 వీడే!వ్రుత్రాసురుడు




  వీడు పుట్టక ముందు అది నిజంగా దేవ బూమే. ఏదో దైవ దర్శనం చేసుకుని అక్కడి ప్రక్రుతి రమణియతను ఆస్వాదించి, అది తమ చిరకాల మదుర స్మ్రుతిగా దాచుకుందామనే తలంపుతో వెళ్ళే భక్తులు, యాత్రీకులు తప్పా వేరే తలంపే ఉండేది కాదు. కాని రాను రాను రోజులు మారాయి. మనిషి విజ్ణానం అభిరుద్ది చెందాక పుట్టిన "వ్రుత్రాసురుడు"  వీడు. వీడిని వ్రుత్రాసురుడు అని ఎందుకంటున్నాను అంటే  పూర్వం వేద కాలం లో వ్రుత్రాసురుడు అనే రాక్క్షసుడు ఉండే వాడట. వాడు పర్వత ప్రాంతంలోనే ఉండే వాడు. వాడి వల్ల మేఘాలలో నుండి వచ్చే  నీరు బందింపబడి పశువులకు, మనుషులకు లభించేది కాదట. అప్పుడు ప్రజలంతా ఇంద్రుడిని ప్రార్దిస్తే, ఇంద్రుడు తనకు "త్వష్ట" అనే రుషి ఇచ్చిన "వజ్రాయుదం" సహాయం తో "వ్రుత్రాసురుడిని " సంహరించి, బందించి ఉన్న నీటిని విడుదల చేసి, సకల ప్రాణకోటికి అనందం కలిగించాడట!. ఇంద్రుడు అటు వ్రుత్రుడితో పాటు "సర్పం" లా ఉండే అహి అనే రాక్షసుడిని వదించాడని కద!.

  పూర్వ కాలం లో మన పెద్దలు చెప్పిన కద లన్నీ ప్రతీకాత్మ మైనవే. ఆ కాలంలోనే పర్వత ప్రాంతం లో ఉండే నదులను క్రిందకు వెల్లకుండా ఆ ప్రాంత రాజకీయ నాయకులు ఆనఖట్టలు కడితే అట్టి ఆన కట్టలు వల్ల ప్రక్రుతి సమతుల్యత దెబ్బ తినడమే కాక క్రింది ప్రాంతం వారికి నీరు లబించేది కాకపోవచ్చు. అహి అంటే పాము ఆకారం లో ఉండే రాక్షసుడు అన్నారు అంటే అది ఆనకట్ట కావచ్చు. దానిని నిర్మించడానినికి ఉపయోగపడే వ్రుత్రాసురుడు అంటే ఒక పెడ్డ  J.C.B      లాంటి యంత్రం కావచ్చు. కాబట్టి ప్రజలకు మేలు కలగాలంటే పైనున్న నీరును విడుదల చెయ్యడం ఒక్కటే మార్గం కాబట్టి ప్రజల రాజు ఇంద్రుడు తన దగ్గర ఉన్న శక్తివంతమయిన ఆయుడంతో ఆ బయంకర యంత్రం నాశనం చెయ్యడమే కాక ఆనకట్టను తెరిపించి నీటిని క్రిందకు పారించి ఉంటాడు.

 ఇక్క పోతే ప్రస్తుతం వాస్తవంలోకి వస్తే పై  J.C.B    గాడు పుట్టాక, నదులులో ఇసుక చట్ట వ్యతిరేకం  గా లోతుగా త్రవ్వి  పారవేసారు. ఎనిమిది మీటర్లు ఇసుక పొర ఉన్న చోట రెండు మీటర్లు మాత్రమే త్రవ్వాలి. అది రూలు. కాని  కాసులు తీసుకుని కళ్ళు మూసుకున్న అధికారుల అండతో విచక్షణా రహితంగా బూమి పొర తాకేదాక   J.C.B      యంత్రాల సహాయంతో కాంట్రాక్టర్లు ఇసుకను తోడి వేసారు. అలా త్రవ్విన ఇసుకతో దేవ బూమిని కట్టడాలతో వ్యాపార  వాణిజ్య సముదాయలతో నింపివేసారు. ప్రజా వలసకు కారణమయి అక్కడి ప్రక్రుతి వనరుల ద్వంసానిక్ కారణ బూతులయ్యారు. నదీ ఒడ్డునే అక్రమ కట్టడాలు కట్టారు. దీనంతిటికి కారణం  వ్రుత్రా సురుడు అనే  J.C.B   లాంటి   మెచిన్ మాత్రమే.

 ఇంకే ముంది అప్పటి దాక ఇసుకలో ఇంకుతూ నెమ్మదిగా ప్రవహించే వరద ఒక్క సారిగా ఒత్తిడికి లోనై, బీకరంగా మారి వెల్లువై చుట్టు ప్రక్కల ఉన్నవాటిని ద్వంసం చేస్తూ పరుగులు తీస్తుంతే ఆ దాటికి పాపం దేశం నలుమూలల్ నుండి వచ్చిన బక్తులు క్కొట్టుకు పోయారు. ప్రక్రుతిని ద్వంసం  చేసింది యంత్రమే అయిన దానిని స్రుష్టించిన మనిషి శిక్ష అనుబవించాడు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రక్రుతి ద్వంసం ఆపుచేస్తే మంచిది లేదా ఉత్తరాకాండ్ లో జరిగింది బారతావని మొత్తం జరిగి తీరుతుంది.

 ప్రబుత్వం వారు ఇప్పటి కైనా  J.C.B    మెచిన్ లాంటి బారీ యంత్ర వినియోగం పైన నియంత్రణ విదిస్తూ చట్టం చెయ్యడమే కాక దాని అమలుక్కు నడుం బిగించాలి. అక్రమ ఇసుక దందాలను తక్షణమే నీరోదించాలి.అక్రమ కట్టడాలను నిర్దాక్షినంగా కూల్చి వేయాలి. లేకుంటే "ఇంద్రుడు"(పర్యావరణ శక్తి)  రావడం  ఖాయం అన్నింటిని నాశనమ్ చెయ్యడం ఖాయం!.      
                                               

ప్రక్రుతిని ద్వంసం  చేస్తున్న వ్రుత్రాసురుడు  

               

Sunday, June 23, 2013

వెర్రెక్కిన విజ్ణానం ఆనకట్టలు కడితే, చిర్రెత్తిన ప్రక్రుతి, చీల్చి చెండాండింది.

                                                                    
                                                               
  మనిషి. ఆఫ్ట్రాల్ ప్రక్రుతిలో అన్ని జీవరాసులతో పాటు వాడూ ఒకడు. ఈ మద్యనే వాడికి విజ్ణానం అబ్బిందట! అంతే అజ్ణానంగా పొంగిపోయి ముందూ వెనుక కానక ప్రక్రుతినే ద్వంసం  చెయ్యడం మొదలు పెట్టాడు. వాడు ఒక పక్క దేవుళ్ళను, ప్రక్రుతిని కొలుస్తాడు. ఇంకొకపక్క ఆ ప్రక్రుతి ఆజ్ణ నే మీరతాడు. అదేమిటంటే అంతా తన చేతిలోనే ఉందంటాడు. ప్రక్రుతి గమనాన్ని మూడురోజులు ముందు కనిపెట్టలేని వాడు ప్రక్రుతి రహస్యం తెలుసంటాడు. ప్రక్రుతి కూడ సామాన్య మానవుల మాదిరి బల హీనమనుకుంటాడు. అందుకే అది నన్నేమి చేస్తుందిలే అని దీమా ఒలక పోస్తుంటాడు.వాడి పొగరును అప్పుడప్పుడు ప్రలయ విపత్తు రూపంలో అణచివేస్తున్నా బుద్ది తెచ్చుకోడు.

  చార్ దాం అనే ప్రాంతాలు సుందర ఆద్యాత్మిక క్షేత్రాలు. మనిషికి ఈ లౌకిక బాదలను మరచిపోయేలా  అలౌకిక ఆనందం ఇవ్వగల్గిన క్షేత్రాలు. అటువంటి క్షేత్రాలు ఉన్నా కేదార్నాద్, బదరీనాద్, గంగోత్రి, యమునోత్రి, ప్రాంతాలకు బారత దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది యాత్రీకుల ద్వారా "ఉత్తరాకాండ్" రాష్త్రం కోట్ల ఆదాయం పొందుతుంది. కాని ఆ ఆదాయ వనరులు చాలక అంతులేని అక్రమ పద్దత్తుల్లో, అవినీతికి పాల్పడి, నదీ ఒడ్డు ప్రాంతంలో నిబందనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చి, గొప్ప తప్పిదం చేసింది. దీని వలన అనేక అంతస్తుల భవనాలు నది ఒడ్డుల మీద ప్రత్యక్షమయ్యాయి. అంతేనా అభిరుడ్డికోసం కరెంట్ అవసరమని ఎక్కడపదితే అక్కడ జల విద్యుత్ ప్రాజెక్ట్ లు కట్టారు. ఈ విదంగా నదుల సహజ గమన్నాన్ని అడ్డగించారు. ఉత్తారాకాండ్ రాష్ట్ర అభిరుద్ది పేరుతో అంతులేని అవినీతికి పాల్పడ్డారని చెపుతున్నారు.

   అసలే గంగమ్మా ! అనుగ్రహమ్ ఉన్నంతసేపు ప్రజలను  తన బిడ్డలవలే కాపాడుతుంది.కన్న  తల్లి అయినా సరే, మామూలుగా స్తన్యమ్ త్రాగే బిడ్డకు ఆనందంగా ఇస్తుంది. అదే దుందుడుకు బిడ్డలు కొరికితే ఒక్క చరుపు చరచి దారిలో పెడుతుంది. అదిగో అటువంటి  చరుపే మొన్న గంగమ్మా తల్లి, ఉత్తరాకాండ్లో చరిచింది. ఇప్పటికైనా పాలకులు దుందుడుకు చేష్టలు మాని పర్యావరణ వేతలు, ఏమి చెపుతున్నారో ఆలకించి ఆ ప్రకారం బుద్దిగా మసలుకోవటం మంచిది. ప్రజలు కూడ  అలా మసలుకునే వారినే ఎన్నుకోవటం మంచిది. అసలు చార్ దాం ప్రాంతాన్ని "పవిత్ర ప్రాంతం" గా ప్రకటించి, రాజకీయ జ్యోక్యం లేకుండా చేయాలి.

  ఉత్తరాకాండ్  రాజకీయ నాయకుల, అధికారుల స్వార్ద ప్రయోజనాలకు  పాపం దేశం లోని  వివిద ప్రాంతాల  భక్తులు ప్రాణాల రూపం లో మూల్యం చెల్లించారు. తక్షణమే వారందరికి ఉత్తరాకాండ్ రాష్ట్ర ప్రబుత్వం, మరియు కేంద్ర ప్రబుత్వాలు మనిషికి పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. తక్షణమే దెబ్బ తిన్న ఆద్యాత్మిక క్షేత్రాలను తిరిగి పూర్వ విదంగా పునరుద్దరించాలి. కనీసం మనుషులుగా ఆ పనైనా చేస్తారని ఆశిద్దాం.