మీకు తెలుసా? బ్రహ్మం గారి కాలజ్ణానంలో రాబొయే అవతారపురుషుడు"వీరభొగ వసంతరాయలు"(ఇయనే కల్కి అని చాల మంది నమ్మకం), ఎప్పుడు బయట ప్రపంచానికి కనపడతాడు అనేది స్పష్టంగా ఉంది. నేను "కల్కి" వివరాలు గురించి ముందు చెప్పి, ఆ తర్వాత వీరభోగుని గూర్చి చెపుదాము అనుకున్నాను. కాని ఎందుకో మన రాష్ట్రంలో మరియు ఇతర దేశంలో ఈ మద్య జరిగే కొన్ని సంఘటనలు గమనించాక "వసంతరాయలు" గురించి అర్జంట్ గా ఒక ముక్క మీ చెవిన వేద్దామనే తహ, తహ తో ఈ టపా మీ ముందుంచడమయినది.
"కాలజ్ణనం"లో ఒక చోట "వీరభోగ వసంతరాయలు" ప్రజలకు ఎప్పుడు దర్శనమిస్తాడు అనేది వివరిస్తూ,"ప్రహ్లాదమయిన పని కాగలదు, వారి కొరకు రావాల్సి ఉండును" అని ఉంది. ’ఈ ప్రహ్లాదమయిన పని ఏమిటా అని నేను చాలా సార్లు ఆలోచించాను. కాని నా బుర్రకేమి తోచలేదు. గత నాలుగు రోజులుగా అటు టి.విల్లోను,ఇటు మన బ్లాగుల్లోను ఒకటే ఊదరగొడుతున్న,"నార్వే వారి దెబ్బ, అంద్ర దంపతులు అబ్బా" అనే సీరియల్ "టపాఓపాఖ్యానం" చూసాక సడెన్ గా ఒక అయిడియా "ఫ్లాష్" అయింది.
"నార్వే" వారు ఆంద్రా దంపతులను జైల్లో వేయడానికి కారణం ఏమిటి? వారి పిల్లలే కదా! పిల్లల్ణి హింసిసించారన్న కారణంగానే తల్లి తంద్రులకు సిక్ష పడింది కాబట్టి,ఇదే "ప్రహ్లాద కారణం".ఎందుకంటే బాగవతంలో "ప్రహ్లాదుడు"తండ్రి చేత హింసించబడితే "నరసీంహుడు’ ఉద్బవించి, అతని తండ్రి హిరణ్యకశిపుని వదిస్తాడు. కాబట్టి బాల హింసే "ప్రహ్లాద కారణం".అయితే డిని కోసం "వీరభోగ వసంతరాయలు" రావడమేమిటి అన్నది కోటి డాలర్ల ప్రశ్న?
నేను ఒకచోట చదివాను. ’కదిరి" లో ఉన్న "నరసింహ స్వామి"నే "వీరభోగ వసంతరాయలు" అంటారట. మరి అయితే ఆ స్వామి వస్తాడా ఇప్పుడు, లేక అయన పేరు గలవారు వస్తారా? లేక "కదిరి" నుంచి వస్తారా? అసలు "వీరబోగ వసంతరాయలు" అనే పేరును బ్రహ్మం గారు ఎందుకు చెప్పారు? ఈయనకు "కల్కి"కి ఏమయినా సంబందం ఉందా? ఉంటే అది ఎలాంటిది? వీటన్నిటికి సమాదానం త్వరలో రాబొయే టపాలలో.