Friday, October 7, 2016

తన వీపు ఎక్కడ పగిలిందో చూపమంటున్న పాకీఖాన్ !!

                                                                       

మీకొక చిన్న కధ  చెపుతాను . విసుగు అనుకోకుండా ఆ సాంతం వినండి .

   రామయ్య , పాకి ఖాన్ లవి ఇరుగు పొరుగు ఇళ్ళు . స్వభావ రీత్యా రామయ్య మిత బాషి శాంత పరుడు అయితే , పాకిఖాన్ ది  అసూయా తో కూడిన దుందుడుకు స్వభావం . రామయ్య గారి కుటుంబం పెద్దదే అయినప్పటికీ , ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ క్రమ శిక్షణ తో కష్టపడటం వలన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా ఉంది .ఆ ఇంట్లోని పిల్లలు బాగా చదువుకొని వారిలో కొంతమంది డాక్టర్లు , ఇంజనీర్లు , శాస్త్రవేత్తలు అయ్యారు. 


 కానీ పాకిఖాన్ ఇంట్లో ఇంట్లో క్రమశిక్షణ కొరవడటం వలన , పెద్దలు మాట పిల్లలు ఆలకించే వారు కారు . ఇంటి పెద్ద పెత్తనం నామ్ కె వాస్తే . తేడా వచ్చినప్పుడల్లా ఇంట్లో బలవంతులైన దుందుడుకు పిల్లలే ఇంటి పెత్తనం తీసుకుని ఇంటి పెద్దని రూములో పడేసి తాళాలు వేస్తుంటారు. దీని వలన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక ,పిల్లలుకు చదువు అబ్బక  రౌడీలుగా గుండాలుగా మారి ఇంట్లోని వారికి మాత్రమే కాక ఆ చుట్టూ ప్రక్కల ఉండే ఇండ్లలోని వారికీ కూడా నానా ఇబ్బందులు కలిగిస్తూ రాక్షసులుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. పాకీ ఖాన్ ఇంటి ప్రక్కనే రామయ్య గారి కుటుంబం ఉండటం వలన వారి దాష్టీకాలకు ఎక్కువుగా నష్టపోతోంది రామయ్య గారి కుటుంబమే . 

      ఆ ఊళ్ళోనే ఉన్నమరొక ఆసామి  చిన్నయ కుటుంబానికి , రామయ్య కుటుంబానికి వ్యాపార రీత్యా పోటీ ఉంది. రామయ్య గారి కుటుంబం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటుంటే వారిని పోటీలో ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఎలా చేసి అయినా రామయ్య గారికి దొడ్డి దారిన చికాకులు కల్పించాలని నిత్యం ప్రయత్నిస్తుంటాడు . ఈ  విషయం లో చిన్నయ్య కి పాకి ఖాన్ బాగా ఉపయోగ పడుతున్నాడు. పాకి ఖాన్ కి ఆర్థిక సహాయం చేస్తూ తరచూ రామయ్య గారి తో గొడవలు పెట్టుకోమని ప్రోత్ససహించే వాడు. ఆర్థికంగా దిగజారి ఉన్న పాకి ఖాన్  చిన్నయ్య ఇచ్చే డబ్బును స్వీకరిస్తూ రామయ్య గారి తో తరచూ గొడవలు పెట్టుకునే వాడు. అంతే కాక గ్రామం మొత్తం ని తమ పాలనా లోకే తెచ్చుకోవాలనుకుంటున్న తీవ్రవాద ముఠాల దగ్గర డబ్బులు తీసుకుని వారికి తమ ఇంట్లో ఆశ్రయం కల్పించడమే కాక వారిని గ్రామం లో ఎవరికీ కనపడకుండా చేసి , వారి తీవ్రవాద కార్యకలాపాలు నిరాటంకంగా చేసుకోవడాన్ని సహాయం చేస్తున్నాడు . 

                                                                         

  
           పాకి ఖాన్ ఇంట్లో ఉన్న తీవ్రవాదుల ఆశయం లో భాగంగా పక్కనే ఉన్న రామయ్య గారి ఇంట్లోకి రహస్యంగా జొరపడి వారికి తరచూ నష్టం కలిగిస్తున్నారు. దీని గురించి పాకి ఖాన్ ని ప్రశ్నిస్తే తమకి వారికి సంబంధం లేదని బుఖాయించడం చేసే వాడు. అలాంటి పరిస్తుతుల్లో ఒక రోజు రాత్రి పాకీఖాన్ ఇంట్లోని తీవ్రవాదులు కొంత మంది అర్ధరాత్రి రామయ్య ఇంట్లో ప్రవేశించి  వారి కుటుంబ సభ్యులను కొట్టారు . ఆ కొట్లాటలో ఆ తీవ్రవాదులు కూడా దెబ్బలు తగిలినప్పటికీ  , తరచూ ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తున్న పాకి ఖాన్ కుటుంబానికి సరి అయిన బుద్ధి  చెప్పకపోతే   లాభం లేదనుకున్న రామయ్య గారు అందుకు తమ కుటుంబం లోని సమర్థులైన సబ్యులకు ఆ పని అప్ప చెప్పారు. 

      సదరు రామయ్య గారి పిల్లలు అర్ధరాత్రి రహస్యంగా పాకి ఖాన్ ఇంట్లోకి వెళ్లడమే కాక అక్కడే ఉన్న తీవ్రవాదులను మరియు పాఖిఖాన్ కుటుంబ సబ్యలను వీపులను విమానం మోత  మోగించి   తిరిగి తెల్లారే సరికి తమ ఇంట్లో పడ్డారు. ఈ విషయాన్ని రామయ్య గారే స్వయంగా చెప్పే దాకా పాఖిఖాన్ కి అసలు ఏమి జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండి  పోయాడు. మొదట మా వీపులు పగల లేదన్నాడు . తర్వాత కొంత సేపటికి దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం అని బింకాలు పలికాడు . అంతలోనే నాలుక కరుచుకుని "అబ్బే మా ఇంట్లో అల్లాంటిదేమీ జరుగలేదన్నారు. సంఘటన జరిగిన రూములు అన్ని  శుభ్రంగా కడిగిన తర్వాత ఇతరులని  పిలిచి "ఏది ఎక్కడా ఆధారాలు ? రూములు అన్ని ఇంత క్లిన్ గా ఉంటేను అని నక్క జిత్తుల మాటలు మాట్లాడాడు. పాకీ  ఖాన్ ఇలా అనటానికి ప్రధానమైన కారణం ,రామయ్య గారు చెపుతున్న "వీపులు విమానం మోత " సంఘటన జరిగిందని ఒప్పుకుంటే తమ ఇంట్లో తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చానని ఒప్పుకున్నట్లు అవుతుంది కాబట్టి ఆ బుకాయింపులు . కాబట్టి , రామయ్య గారి పిల్లలు ఎవరు తమ ఇంట్లికి రాలేదని, వచ్చి వీపులు విమాన మోత  మోగించలేదని , ఒక వేళా అది నిజమయితే రుజువులు చూపాలని ఎదురు మాటల దాడి ప్రారంబించాడు . 


     ఇక్కడ రామయ్య గారి సదరు సంఘటనకు సంబంధించి అన్ని వీడియో రుజువు ఉన్న వాటిని భయట  పెడితే తమ మెరుపు దాడుల టెక్నీక్ ని పాకి ఖాన్ కనిపెట్టి భవిష్యత్ లో జాగ్రత్త పడే అవకాశం ఉన్నందున వాటిని బహిర్గత పరచడానికి ఆలోచిస్తున్నారు . అయితే ఆ గ్రామం మొత్తంకి  రామయ్య గారి మాట మీదే కాక సమర్థత మీద కూడా నమ్మకం ఉన్నందు వలన పాకి ఖాన్ ఇంట్లోని వారి వీపులు విమానం మోత మోగే ఉంటాయని నమ్మడమే కాక, పాకి ఖాన్ ఇంట్లోని తీవ్రవాదుల నుతక్షణమే వేళ్ళ గొట్టాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని , పాకి ఖాన్ ను హెచ్చరించడంతో దిక్కు తోచని స్థితిలో దిగాలు ముఖం వేసుకుని కూర్చున్నాడు పాకి ఖాన్. 

   ఇందులో కోసం మెరుపు ఏమిటంటే తమ ఇంట్లోనుంచి తీవ్ర వాదులను వేళ్ళ గొట్టామని తన కుటుంబ సబ్యులకు పాకి ఖాన్ చెప్ప్పాడట . అది నిజమో కాదో కాలమే చెప్పాలి మరి!.ఏది ఏమైనా రామయ్య గారి దెబ్బకు పాకీ  ఖాన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది అనడం లో సందేహమే లేదు .  


Sunday, October 2, 2016

గొర్రె కొవ్వితే కసాయి వాడిని కుమ్మేసుద్ది !!


గొర్రె క్రొవ్విన కొద్దీ కసాయి వాడికి లాభమే అనేది  పాత సామేత. క్రొవ్విన గొర్రె ను కసాయి కత్తి కూడా ఏమి చేయలేదు అని నిరూపించింది ఒక గొర్రె పొట్టేలు. అది ఏమిటి క్రింది వీడియోలో  చూడండి .