Thursday, December 11, 2014

"విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరేకించే వారిలో ఏముంది....?

                                                                           


ఈ  మద్య నేను ఒక మిత్రుని బ్లాగులో విగ్రహారాదనను హిందూ మహా పండితులు వ్యతిరేకించారు కాబట్టి దానిని పాటించక పోవడమే మంచిది అన్న ఉచిత సలహా చూసే సరికి , నాకు నవ్వు ఆగలేదు . అసలు హిందూ అంటె అర్దం తెలియని వారు , తాము అనుసరించే మతవిదానాలు మాత్రమె మహా గొప్పవని విశ్వసించే వారు రాసిన బ్లాగ్ రాతలు అవి. హిందూ ఆరాధనా పద్దతులు లో రెండు రకాలు ఉన్నవి . ఆకార, నిరాకార పద్దతుల్లో ఆ భగవంతుణ్ణి ఆరాదించవచ్చని మన పెద్దలు చెప్పారు. వ్యక్తుల యొక్క మనస్సును  నిగ్రహించే  స్తాయి ని పట్టి అతనికి లేక ఆమెకు ఆకార లేక నిరాకార ఆరాధనా పద్దతిని ఎంచుకోవడం జరుగుతుంది .

        ప్రతి మతంలో కొన్ని శాఖలు ఉన్నాయి . వారికి వేరెవేరు ఆరాధనా పద్దతులూ ఉన్నయి. ఎవరి పద్దతిలో వారు పూజలు చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కాని నీది తక్కువ  నాది ఎక్కువ  అన్నప్పుడే , ఆ ఎక్కువ తన్నాన్ని పరీక్షించడానికి మొత్తం కెలక వలసి వస్తుంది. ఇది దేవుదు ఒక్కడే అని నమ్మే వారికి సరి అయిన పద్దతి కాదు. అసలు విగ్రహారాదన పద్దతి ఎవరికీ  అవసరం , నిరాకార ఆరాధన పద్దతి ఎవరికీ అవసరం అనేది చూదాం .

  మనకు  " హిప్నాటిజం " అనే దానిలో సాధకుడు అవలంభించే విదానాలు ఎలాగుంటాయి చూడండి . బాగా ప్రాక్టిస్ ఉన్నవారు " సెల్ప్ సజె షన్ " ల ద్వారా సబ్కాన్షియస్ స్తితికి వెళ్లి , ఆ స్తితిలో మైండ్ కి పాజిటివ్ సజెషన్ ల ద్వారా తమలోని నెగటివ్ బావాలను మాయమయ్యేలా చేస్తారు . తద్వారా వారు నిజ జీవితంలో విజయాలను సాదిస్తారు  అని అంటారు. అలాగే కొత్తగా ప్రాక్టిస్ చేసే సాధకుల ఎదుట , హిప్నాటిశ్ట్ ఒక లైట్ నో , లేక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంచి దానినే తదేకంగా చూస్తూ ఉండమని చెప్పి, వారికి సజెషన్ లు ఇస్తూ సబ్ కాన్షియస్ స్తితిలోకి తీసుకువెలటాడు . ఆ తర్వాత పాజిటివ్ సజెషన్ లతో మైండ్ లోని నెగటివ్ నెస్ ని లేకుండా చేస్తారు. బాగా ప్రాక్టీస్ ఉన్న వారికి ఏ అబ్బ్జెక్టు ఉండవలసిన అవసరంలేదు.

   హిందూ ఆరాధనా పద్దతిలో విగ్రహారాదన కూడా మానసిక స్తిరత్వానికి ఉద్దేసించిందే . విగ్రహం ని ఒక ఆబ్జెక్టు గా చేసి, సంకల్పం ద్వారా భగవంతుని అరాదనకు మనసును సిద్ధంచేసి, తదేక ద్యానంతో భక్తులు తమ మనసును ఆ భగవంతుని మీద లగ్నం చేసి ఆరాదిస్తారు. దానికి ఆచార్యులు  ఆరోహ , అవరోహణ క్రమంలో పాటించే మంత్రోచ్చారణ , భక్తులను త్వరగా సబ్కాన్షియస్ స్తితిలోకి తీసుకు వెలుతుంది. ఆ స్తితిలో వారి మనసు కోరుకునేదే నిజ జీవితంలో సిద్దిస్తుంది. ఒక వేళ విగ్రహం , మంత్రోచ్చారణ లేకుండా మనసుని సబ్కాన్షియస్ స్తితికి తీసుకువెళ్ళే సమర్దత  ఉన్న వారికి విగ్రహం అవసరం లేదు. అటో సజెషన్ చాలు. అంటె ఒక రకంగా ఈ నాడు హిప్నాటిజం లో మనసు ని నియంత్రించుకుని , పాజిటివ్ సజెషన్ ల ద్వారా మైండ్ ని శక్తివంతం చేసుకుని నిగ్రహ పరులుగా మారడానికి ఏ పద్దతులు అవలంబిస్తున్నారో , అవే పద్దతులు విగ్రహ ఆరాధన పద్దతిలో , వేల సంవత్సరాల క్రితమే మన పూర్వికులు ప్రవేశ పెట్టారు. అసలు హిప్నాటిజం సైన్సు కాదు అనే వారు ఉన్నారు. వారికి పెద్ద నమస్కారం పెట్టి వదిలెయ్యడం మంచిది.

   యితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటె,సోషలిజం కి, కమ్యునిజం కి తేడా తెలియని బోల్డంత మంది , కమ్మ్యునిస్ట్ పార్టిలో  ఉన్నట్లు, నిరాకారా పద్దతిలో ద్యానం  చేసి మనసుని స్వాదీనంలోకి తెచ్చుకోవటం ఎలాగో తెలియని వారు , నిరాకార ఆరాధనా పద్దతి గురించి తెగ లెక్చర్ లు ఇస్తున్నారు . అదే అసలు బాద. మనసుని స్వాదీనంలోకి తెచ్చుకోవడమనేది చాలా కష్ట తరమైన ప్రక్రియ. అది సామాన్యునికి సాద్యం కాదు. రోజుకు 3 సార్లు వంగుని లెగిస్తేనొ, 30 సార్లు బోర్లా పడుకుంటేనో అది సాధ్య పడుతుందని నేను అనుకోవడం లేదు. అందుకే సామాన్యులైన మానవులు " విగ్రహారాదన " పద్దతిలో అయినా ఆ దేవున్ని పూజిస్తే కొంతలో కొంత మానసిక  తృప్తి పొందవచ్చు . అందుకే జ్ఞానులకు నిరాకార మార్గం, సామాన్యులకు ఆకార మార్గం. అన్నీ తెలిసిన వారికి ఆకారం అయినా నిరాకారం అయినా ఒకటే . తెలిసి , తెలియని వారికి ఏ "కారం " అయితే బెస్టో  వాళ్ళ దేవుడే చెప్పాలి.

      చివరగా ఒక మాట. సైన్స్ ప్రకారం ఈ సృష్టి అంతా ఎలక్టాన్ , ప్రోట్రాన్ , న్యూట్రాన్ లే ఉన్నప్పుడు ,కనిపించే  విగ్రహం లో నైనా , కనిపించని నిగ్రహం లోనైనా ఉన్నవి అవే కదా? మరి ఏ పద్దతిలో పూజిస్తేనేమ్ . అంతా ఎలెక్ట్రాన్ ,ప్రోటాన్ , న్యూట్రాన్ ల మాయే తప్పా , అనుకోవడానికి ఏముంది ? !!!!

No comments:

Post a Comment