Monday, December 30, 2013

స్త్రీ పురుషులు ఒకటయితే పుట్టినోళ్ళు , స్త్రీ వేరు, పురుషుడు వేరు అనటమే విడ్డూరం

                                                      

   
  స్త్రీ వాదం స్త్రీల హక్కుల కొరకు మాత్రమే పోరాటం చెయ్యడం ప్రారంబించాక ,వాటి వలన లాబాల సంగతి ఏమో కానీ దానికి వ్యతిరేకంగా పురుష వాదం కూడా పుట్టుకొచ్చింది. అసలు నాకొక డౌట్  ఏమిటంటే కార్మికుల సంఘాలు  లాగా స్త్రీల హక్కుల సంఘాలు , పురుష హక్కుల సంఘాలు అనేవి  ఉండడం వాంచనీయమా? ఒక సమాజంలో స్త్రీల సమస్యలు అనేవి పురుషులకు సంబందం లేకుండా ఉంటాయా? అలాగే పురుషుల సమస్యలు అనేవి స్త్రీలకు సంబందం లేకుండా ఉంటాయ?

   ఉదాహరణకు ఒక కుటుంబం లోని పురుషుడు తప్పు చేస్తే , దానికి బాదిత స్త్రీలు కు సంబందించిన వారు స్పందిస్తే , ఈ  పురుషుడు తాలూకు స్త్రీలు ఎవరి పక్షం వహిస్తారు? బాదిత స్త్రీల వైపా ? లేక తమ పురుషుడు వైపా? . ఖచ్చితంగా తమ పురుషుడి వైపే ఉంటారు. ఎందుకంటే ఆతను వారికి రక్త సంబదీకుడో , బందువో అయి ఉంటాడు కాబట్టి. కానీ కార్మికుల సంఘాల విషయం లో అలా కాదు. కార్మికుడి కి అన్యాయం జరిగిందని బావిస్తే కార్మికులు అంతా ఒకే పక్షం. అది కార్మిక పక్షం. ఇదే సూత్రం పురుష హక్కులకు వర్తిస్తుంది. కాబట్టి మానవ హక్కులు నుండి స్త్రీల హక్కులు , పురుష హక్కులు అంటూ ప్రత్యేకంగా విడదీసి చూడడం అసంబద్దం అవుతుంది.                                          
                                                            

   మనిషి భూమి మీద ఉన్న జీవ రాసులలో చాలా తెలివిగల వాడినని విర్రవీగుతుంటాడు. తనకు జ్ఞానం  ఉంది కాబట్టి తోటి మానవుడు తన పట్ల జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు . అందుకు సంతోషించ వలసిందే. కానీ అదే సూత్రాన్ని తోటి జీవుల పట్ల మాత్రం వర్తింప చేయడు.ఉదాహరణకు  ఒక సెల్ టవర్ ని ఒక ప్రాంతం లో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం లోని చిన్న జీవులు మరణిస్తాయి అని మనిషికి తెలిసినా, తన సౌలబ్యం  కోసం వాటి ప్రాణాలు తీసే పనినే చేస్తున్నాడు. అంటే ఇక్కడ పక్కా స్వార్దం . ఈ  భూమి మీద  మనిషి మత్రమే బ్రతకాలన్న స్వార్దం. అది కూడదన్న  "బుద్దుడు " లాంటి వారిని బొమ్మను చేసి , ఆయన్ని పూజిస్తూ తన జీవ హింస తానూ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మానవ  హక్కులు  కూడా ప్రపంచ జీవుల  జీవ హక్కులు కు వ్యతిరేకమైనవే. కానీ ఇక్కడ మనిషి తానూ ఇతర జంతు కోటికి బిన్నంగా ఎదిగాడు కాబట్టి వాటి నుండి విడి పోయి "మానవ హక్కులు" అనేవి ప్రత్యేకంగా ఏర్పరచుకోగలిగాడు. మరి ఆ పని మనిషిలో బాగంగా ఉన్న స్త్రీలు కానీ, పురుషులు   కానీ చెయ్య గలరా? (చెయ్యడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తునట్లుంది గే, లెస్బియన్ మేదావులు)

   కాబట్టి ఏ స్త్రీ తనలో ఉన్న తండ్రికి వ్యతిరేకంగా , అలాగే పురుషుడు తనలో ఉన్న తల్లికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇష్టపడరు. ఇక పోతే పురుషుల మీద స్త్రీలు, స్త్రీల మీద పురుషులు ప్రదర్శించే అయిష్టత , కోప తాపాలు ఇవ్వన్నీసహజ  మానవ చర్యలలో బాగాలే తప్పా , ఒక జాతి పట్ల మరొక జాతి ప్రదర్శించే ప్రతిస్పందనలు  లాంటివి కావు. కొంత మంది తమ మీద తమకే ద్వేషం కలిగి ఆత్మహత్యలు చేసుకుంటుటారు. అంత మాత్రం చేత వారు ఎప్పుడూ  తమకు తామే వ్యతిరేకంగా ఉంటారని అనలేము కదా!. అలాంటివే స్త్రీ పురుష సంబందాలు. కాబట్టి మనుష్యులకు  సమస్యలు ఏర్పడినప్పుడు  అవి మానవ  సమాజ సమస్యలు గా బావించి వాటి నివారణకు మానవు రూపాలైన స్త్రీ పురుషులు కలసి పని చెయ్యాలి కానీ, మీకు మీరే , మాకు మేమే అంటే అది సమగ్ర ద్రుష్టి  కాదు అని నా అభిప్రాయం.


   

No comments:

Post a Comment