Thursday, December 12, 2013

AIDS కారకాన్ని ప్రోత్సాహిస్తున్న సోనియా , రాహుల్ గాందీ !

                                                               

సమాజంలో మానవ జీవనానికి విఘాతం కలిగించే దుర్నీతి , దుర్నడతలను తప్పుబట్టవలసిన అవసరం ఆ యా సమాజం లలోని మేదావులందరి పైన ఉంది. స్వలాబాలను , పార్టీల ఓట్ల కోసం సదరు దుర్నడతలను ప్రోత్సాహిస్తే దాని ప్రబావం సమాజం లోని అందరి పైన ఉంటుందనేది మేదావులు అనబడుతున్న వారు మరచి పోకూడదు .
  మొన్న సుప్రీం కోర్టు వారు స్వలింగ సంపర్కాలను నేరం గా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు చాల మంది గే, లెస్బియన్ మేధావులను నిరాశ పరచింది. ఇదేదో తమ వ్యక్తీ గత హక్కులకు భంగం అని కొంత మంది ప్ల  కార్డులు చేత పట్టి వీదుల్లో హంగామా చేస్తున్నారు. దానికి సామాజిక కార్యకర్తల ముసుగులో కొంత మంది దీనికి వత్తాసు పలుకుతున్నారు.

ఈ  సృష్టిలో ప్రతి జీవ రాశికి ప్రక్రుతి పరమైన రక్షణలు ఉన్నాయి. అలాగే సెక్స్ లో కూడా  ప్రక్రుతి నిర్దేశించిన సహజ రతి క్రియ ద్వారా మానవుడు పునరుత్పత్తి పొందటమే కాక , సహజఆరోగ్య  రక్షణ పోందుతున్నాడు. మనిషిలో రతి సమయం లో సహజంగా ఉత్పత్తి అయ్యే కొన్ని ద్రవాలు యొక్క రక్షణ పలితాన్ని కేవలం సహజ రతి ప్రక్రియలోనే పొందగలరు. ఒక అద్యయనం ప్రకారం సహజ రతి ప్రక్రియలో కంటే అసహజ రతి ప్రక్రియ లో ఎయిడ్స్ ముప్పు 1800% ఎక్కువట! మరి ఇలాంటి ముప్పు కలిగిస్తున్న స్వలింగ సంపర్కాలను వ్యతిగత స్వేచ్చా పేరుతో మన దేశ రాణీ , యువరాజు లు అని మెజార్టీ ప్రజల చేత కొనియాడ బడుతున్న సోనియా గాందీ , రాహుల్ గాంది   గారలు , ప్రోత్సాహించడం ఎంతవరకు సమంజసం?. ప్రజల ఆరోగ్యాలకు బంగం కలిగించెట్టట్లు ఉంటే, అది  మత పరమైన హక్కులైన సరే నియంత్రించవలసిందే అని భారత రాజ్యాంగం చెపుతుంది. మరి మన  దేశం లో ఉన్న కొద్ది మంది గే , లెస్బియన్ ల కోసం మెజార్టీ ప్రజల ఆరోగ్యాలకు  కీడు తెచ్చే స్వలింగ సంపర్క సంస్కృతిని ప్రోత్సాహించడం , కొంతమంది మేదావులనబడే వారిలోని అజ్ఞానానికి ప్రతీక అనుకోవచ్చా!?

      ఇదే విషయం పై మరింత సమాచారం కొరకు చూడండి http://www.aidsmap.com/HIV-transmission-risk-during-anal-sex-18-times-higher-than-during-vaginal-sex/page/1446187/

No comments:

Post a Comment