Wednesday, April 16, 2014

వందన సమర్పణ ఎలా చేయాలో ఈ "ఉత్తమ కుమార్ " గారిని చూసి నేర్చుకోవలసిందే !

                                                                   

సభా సాంప్రదాయాలు తెలియని వారు ఘనంగా సభలు నిర్వహిస్తారు . అందరి సంగతి ఏమో కాని ఈ  రోజు కరీంనగర్ లో కాంగ్రెస్ వారు నిర్వహించిన సభ చప్పగా సాగింది అని చెప్పవచ్చు . అధిష్టాన దేవత ఎలాగో చూసి చదువుతుంది కాబట్టి , కంపెని సెక్రటరి వార్షిక నివేదిక చదివినట్లు అనిపిస్తుంది . పోనీ ఇంకా ఎవరైనా ప్రజల్ని ఆకట్టుకునేలా  మాట్లాడారా అంటే అబ్బే అందరికి దేవతను పొగడటం మిద ఉన్న యావ తెలంగాణా బవిశ్యత్ మిద ఉన్నట్లు లేదు . ఇక అందరూ అమ్మకి కండువాలు కప్పాకా , చివరకు వందన సమర్పణ చేయమని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి అవకాసా మిచ్చారు . ఆయనకి అసలు వందన సమర్పణ అంటే ఏమిటో బొత్తిగా తెలిసినట్లు లేదు . అందుకే అయన కూడా పొడి పొడి మాటలతో తానూ కూడా ఉపన్యాసం చెప్పి వెళ్లి పోయాడు . మొత్తానికి వందన సమర్పణ లేకుండానే బారి భహిరంగ సభ ముగిసింది .
     ఉత్తం  గారి  ఉత్తుత్తి వందన సమర్పణ ఎలా ఉందొ చూడాలంటే క్రింది విడియోలో చూడవచు!
             
                 

Tuesday, April 15, 2014

ఎలెక్ట్రాన్ , ప్రోటాన్ లానే న్యూట్రాన్ లను గుర్తించాలన్న సుప్రీం కోర్టు.అప్ ఇండియా !

                                                                 


మానవ సమాజం ,ఒక  అణువు లాంటి నిర్మాణం తో పోలిస్తే అందులో ఎలెక్ట్రాన్ లు న, ప్రోటాన్ లు ఉన్నట్లే సమాజo లో స్త్రీలు , పురుషులు ఉన్నారు . అలాగే ఈ రెండు లింగాలే కాకుండా అటూ ఇటూ కాని వారు కూడా ఉన్నారు . మన దేశంలో ఇప్పటి దాక వారికి, వారు కోరుకున్నట్లు స్త్రీ యో , లేక పురుషుడి గానో పరిగణిస్తూ అన్ని సౌకర్యాలు ఇవ్వటం జరుగుతుంది . కాని దేవుడే తమని ఒక ప్రత్యెక జాతిగా పుట్టిస్తే , మీరేమిటి మాకు సంబంధం లేని జాతిలో(లింగం) మమల్ని చేర్చి అవమాన పరచడం అని వారిలో చైతన్య వంతులైన వారు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు .
 నిజమే మరి అణువులో ఎలెక్ట్రాన్ , ప్రోటాన్ లతో పాటు న్యూట్రాన్ లు ఉంటాయి కదా ! వాటి స్వబావ రిత్యా వాటిని గుర్తించి , న్యూట్రాన్ లని ప్రత్యేకంగా పరిగాణిస్తున్నట్టే ఈ న్యూట్రల్ ల్స్ ని గుర్తించాలి కాని , స్త్రీ పురుషులలో కలిపి వారికి రావాల్సిన ప్రత్యెక  సౌకర్యాలు రాకుండా చేయటమేమిటి ? ప్రత్యెక సౌకర్యాలు ఏమిటంటార ? ఇక నుండి వారు సెక్సువల్ మైనారిటిలు . వారికి కూడా ఇతర మైనార్టిలు కు ఉండే ప్రత్యెక సౌకర్యాలు అన్ని లభిo చవచ్చు . ఈ  విదంగా వారు సక్సేసే అయినట్లే! కాకపొతే ఈ తీర్పు  తమకు కూడా వర్తిస్తుందని కొంతమంది హోమో లు, లెస్బియన్ లు అపోహ పడుతున్నట్లు ఉంది . వారికి ఎంత మాత్రం ఈ తీర్పు వర్తించదని , జన్మతః తృతీయ ప్రక్రుతి కలిగి ఉన్న వారికె ఈ  తీర్పు వర్తిస్తుందని ఉన్నత న్యాయ స్తానం వారు స్పష్టంగా చెప్పారు .
    మరి రిజర్వేషన్ సౌకర్యాలు కోసం కులాలు ని , తెగలు ని సైతం రికార్డు పరంగా మార్చుకునే ఘనులు ఉన్న మన  దేశం లో ఈ  న్యూట్రల్ మైనార్తి సౌకర్యలకోసం కృత్రిమ ఆపరేషన్లు చేయించుకుని ,అన్ని ఉన్న వారు   కూడా న్యూట్రల్ గా మారి సర్టిపికేట్ లు పొందరా అంటే , న్యూట్రల్స్  రాజ్యాదికారులుగా ఉన్నంత కాలం అవి జరుగుతూనే ఉంటాయి . ఇప్పుడు డబ్బు కోసం ఏంతో  మంది మగపిల్లలు "కోజ్జాలు " గా మారుతున్నా దౌర్బాగ్యపు సమాజంలో రేపు సౌకర్యాలు కోసం మారరని  గ్యారంటి ఏమి లేదు . అవినీతి సమాజంలో అన్నిo టి ని మార్చవచ్చు . అప్త్రాల్ లింగాలు ఎంత ?
  ఏది ఏమైనా ఇన్నాలకు న్యూట్రాన్ లను గుర్తించడం ద్వారా మన సమాజం పరిపూర్నమైంది . ఇకపోతే మిగిలింది ఆప్పోజిట్  ఎలేక్రాన్ , అపోజిట్ ప్రోటాన్ లను గుర్తించాల్సి ఉంది . అదే నండి , హోమో లు , లెస్బియన్ లు . ఈ సారి వారిని సపోర్ట్ చేసే రాహుల్ , సోనియాలు అధికారం లోకి వస్తే , చట్టం చేసి వారికి కూడా మైనార్టీ హోదా తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశముంది . ఇంకేం మరి ! ఈ ఎన్నికల్లో వారిని గెలిపిస్త్రే పోలా!

Wednesday, April 9, 2014

ఆమెను చూస్తె తాకబుద్ది అవుతుందట !ఈయన్ని చూస్తె పికబుద్ది అవుతుందట !

                                                                   


2014 ఎలెక్షన్ల తేది లు ప్రకటించేశారు . రాజకీయాలలో ఉన్నవారు , సినిమా రంగంలో ఉన్న వారు తమ తమ అదృష్టాలను పరిక్షించు కోవటానికి సమాయత్త మవుతున్నారు ఈ సమయంలో వారికి గుళ్ళో దేవుని కరుణ కంటే , ఓటరు దేవుని కరుణే అత్యంత అవస్యకం ! అందుకె పొద్దున్న లేచినది మొదలు రాత్రి పడుకోబోయే వరకు రోజూ లక్షలాది ఓటరు దేవుళ్ళను కరునించమని ప్రార్దిస్తూ (అలా నటిస్తూ ), సందు సందుకు , గొంది గొంది కు తిరుగుతున్నారు . మరి ఇటువంటి వారి  తిప్పలు చూస్తున్న ఓటర్లు కొంతమందికి జాలి కలిగి ఓటు వేసి కరునిద్దామా అనే ఆలోచనలో పడుతుంటే , మరి కొంత మందికి విరి చేష్టలు చూసి , వికారం కలిగి , తమలో కలిగే వికారాలను ప్రత్యక్షంగా తెలియ చేస్తున్నారు . అదెలాగ అంటే

     ఉదాహరణకు డిల్లీలో రాష్ట్ర ఎన్నికలలో అధికారానికి దగ్గరగా చేరువైన ఆమ్ అద్మి పార్టి అదినేత అరవింద్ కేజ్రివాల్ గారికి మంచి అవకాసం వచ్చినా అంటే రాష్ట్ర పాలనా అధికారం  కట్టబెట్టినా , సరిగ్గా వ్యవహరించకుండా తిక్కల నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి , అవినీతి నిర్మూలనే తమ అజెండా అని ప్రగల్బాలు పలికి , అసలు అవినీతి సామ్రాట్ లను వదిలివేసి , వారి భరతం పడతానంటున్న మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ , కాంగ్రెస్ వారికి పరోక్షంగా సహాయం చేస్తున్న , డి గ్రేట్ అరవింద్ కేజ్రివాల్ గారిని చూస్తె ఒక అటో డ్రైవర్ కి ఎందుకో కాని ఆయనకి ఒక దండ వేసి చెంప మిద పీక బుద్ది అయిందట ! అంతే! వెంటనే ఒక పూల దండ కొనుక్కుని అరవింద్ గారి కాన్వాయి దగ్గరికి వచ్చాడట . ఇంకేం , తనకు అభిమాని ఎవరో పూలదండ వేస్తున్నాడేమో అనుకుని  అనుకుని అతనికి అవకాసమిస్తె , సదరు అటో డ్రైవర్ పూలదండ వేసినట్లు వేసి , వెంటనే కేజ్రివాల్ చెంప మిద ఒకటి పీకాడట ! దానితో నివ్వెరపోయిన కేజ్రివాల్ అనుచరులు వెంటనే తేరుకుని అతని మిద దాడి చేసి కొట్టి పోలీసులకు అప్పచెప్పారట .
  కేజ్రివాల్ గారికి పై అనుభవం ఎదురైతే , ప్రముఖ గ్లామరస్ నటిమణి నగ్మా గారికి మరో రకం అనుభవాలు ఎదురవుతున్నాయట . ఆమె గారిని చూస్తుంటే ఓట్లు వేయడం తర్వాత కానీ , ఒక్క సారి ఆమెను  తాకితే  చాలు! జన్మ దన్యమైనట్లే ! అని బావిస్తున్నారట ఓటర్లు . అందుకే ఆమెను ఎలాగైనా తాకాలని ఒకరి మిద ఒకరు పోటి పడి పొలిసు వారికి సెక్యూరిటి ప్రాబ్లం కలుగ చేస్తున్నారట . మొన్న ఒక ముసలాయన , M.L.A అంతటి వాడే ఆపుకోలేక టక్కున నగ్మాని ముద్దు పెట్టుకున్నాడట . అది చూసిన పోలిస్ అధికారులు ఇక లాబం లేదని నగ్మాకి పెద్ద ఎత్తున పోలిస్ సెక్యూరిటి కలుగ చేసారట . వీళ్ళు  నాయకులైతే  ప్రజలకు ఏమి సేవ చేస్తారో తెలియదుకాని ప్రస్తుతం మాత్రం ఓటర్లు వీళ్ళని గోకకుండా  కాపాడానికే  ప్రజా దనం  ఎకువ ఖర్చు చేయాల్సి వస్తుంది . అది సంగతి

     ఒక చోట  నగ్మాను  చూస్తె తాకబుద్ది అవుతుందట !మరొక చోట కేజ్రివాల్ ను  చూస్తె పికబుద్ది అవుతుందట ! ఓట్లు వేయండి అని అడుగుతుంటే ఈ  తాకుడు , పికుడు గోల ఏమిటో అర్ధం కావటం లేదట అబ్యర్డులకు! కేజ్రివాల్ గారి చెంప చెళ్ళు కద గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .