Wednesday, January 2, 2013

"పిరమిడ్ ద్యానం","శాఖాహారం", గురువు కోపాన్నే తగ్గించలేకపోయాయి!

                                              
                                                                     
                                                                              
  ఈ మద్య "కడ్తాల్" లో పిరమిడ్ ద్యానమ్ పేరుతో ఒక గురువు హల్ చల్ చేసాడు. జీవితం లొ సుఖశాంతులు లేని జనం బాగానే అయన చుట్టూ చేరినట్లు తెలుస్తుంది.బాగా ఇంఫ్ల్యూయన్స్ చేసాడు అనుకుంటా మంత్రులు, అదికార్లు దండిగానే విచ్చేశారు. నూట ముప్పై ఎకరాలలో ఒక భారీ "పిరమిడ్" సెట్టింగ్ తో అక్కడ ఒక యాక్షన్ టీమ్ తో కార్యక్రమాలు మొదలు పెత్టి పద్సకొండు రోజులు నిర్వ హించారు.అక్కడ రోజు డాన్స్ లు, గానా బాజానాలు లాంటివి జరిగాయని టి.వీ లు కోడై కూయడమే కాక క్లిప్పింగ్ లు చూపిస్తున్నాయి.

  సరే అసలు పిరమిడ్ ద్యానం అంటే ఏమిటో రెండు ముక్కల్లో  చెప్పుకుందాం. ఏమి లేద్సార్, సాదార్ణంగా ద్యానం అనేది మానసిక ప్రశాంతత కల్పిస్తుందని మనకు తెలుసు. కాని ద్యానం లో మనస్సు లగ్నమ్ చెయ్యాలంటే కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్ని పిరమిడ్ ఆకారం ఉన్న ఏ వస్తువు క్రిమ్ద చెసినా సమయం తగ్గించడమే కాక ద్యాన పలితమ్ ఎక్కువగా ఉంటుందట. అంటే సాదార్ణ ద్యానం "టన్ను" ప్రశాంతత ఇస్తె ’పిరమిడ్ ద్యానం" "వంద టన్నులు"  ప్రశాంతత ఇస్తుందన్న మాట.(ప్రశాతత ని దేనితో కొలవాలో తెలియక టన్ను" ల్లో చెప్పదం జరిగిమ్ది).సరే పిరమిడ్ గురువు గారు చెప్పే దానిని లక్శలాది ప్రజలు నమ్మి,దానిని అచరించారట. ఆ ఆచరణా పలితాలు గురువు గారు చెప్పే దానిని రుజువు చెయ్యడం వల్ల విపరీతమ్ గా ప్రజలు ఈ విదానానికి ఆకర్షింపబడి గురువు గారు పాపులర్ అయ్యారు. ఎంతగా పాపులర్ అయ్యారు అంటే టి.వీ. నైన్ వాళ్ళు తగులుకునేంతగా!

  సరె ఈ విదంగా పాపులర్ అయితే వీరీ సహజ శత్రువులు అదేనండి "జన విజ్ణాన వేదిక" లాంటి శాస్త్రీయ వాదులు,  వారు ఊరుకుంటారా? ఊరుకోరు గాక ఊరుకోరు కాబట్టి, పిరమిడ్ లోని కత ఏందని గురువును అడిగారు. ముందు గురువు గారు ఒక ప్రశ్న వేసారు. మీకు ద్యానం అంటే తెలుసా? అని .దానికి శాస్త్రీయంగా తల అద్డంగా ఊపారట.దానితో చిర్రెత్తుకొచ్చిన గురువు గారు, ద్యానం అంటేనే తెలియని వారికి పిరమిడ్ ద్యానమ్ గురించి ఎంత చెపితె మాత్రమ్ ఏమి లాభం, కాబత్టి ముమ్దు ద్యానం గురిమ్చి తెలుసుకొంది అని అనె సరికి పాపం శాస్త్రీయ వాదులంతా ద్యానం గురించి తెలుసుకోవాలని  "రజనీకాంత్" గారి దగ్గరకు వెళ్లారట. ఎందుకంటరా? హిమాలయాలకు దారెటో కనుకుందామని. కాబట్టి వారు ద్యానమ్ గురించి తెలుసుకుని వచ్చి, గురువు గారి దగ్గర పిరమిడ్ ద్యానమ్ గురించి తెలిసికొని మనకు వివరిoచేదాక "పిరమిడ్ ద్యానమ్ "  లో ఉన్న కిటుకు మనకు తెలియదు. అమ్మయి/అబ్బాయి  ప్రేమలొ పడితె మత్తుగా ఉంటుమ్దని పడిన వాల్లకు తెలుస్తుంది కాని అ మత్తుకు  కారణమేమిటో వారెలా చెప్పగలరు? ఇది అంతె అనుకుంటా!

    కాబట్టి శాస్త్రియ కారాణాలు తెలిసికొలేము. ఇక పొతె,  సలు గురువు గారు చెపుతున్నట్లు పిరమిడ్ ద్యానమ్ మానసిక ప్రశాంతత ఇస్తుందా? ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఆ గురువు గారు ఒక పెద్ద మాట అన్నాడట! (బూతు కాదులెండి). ఈ దేశమ్ లో రిక్షా తొక్కే వాడి దగ్గరి నుంచి, మంత్రుల దాక అంతా మూర్కులె అని .ఇదెమిటి ఇలా అన్నాడని ఆరాతీస్తే ఆయన కోపానికి కారణమ్ తెలిసింది. వాల్లంతా మాంసాహారులంట, అందుకే  వారి బ్రెయిన్ డల్ అయిపోయి మూర్కులై పోతున్నారట. అబ్బా ఎంత సత్యమ్ కనిపెట్తాడండి, ఈ గురువు గారు. ఈయన పత్రి అని పేరు పెట్టుకున్నాడు కాబట్తి అందర్ని పత్రాలు(ఆకులు) తినమని సలహా ఇస్తున్నట్లుంది.పిరమిద్ ద్యానమ్ వల్ల మనిషి ప్రశాంత చిత్తుడయి కోపాన్ని జయించడం నిజమే అయితే, మరి దశాబ్దాలుగా ఆ పిరమిద్ ద్యానమ్ చేస్తున్న గురువు గారిలో ఇంకా కోపం తగ్గలెదే?.గురువు కోపాన్నే తగ్గిమ్చలేని పిరమిద్ లు ప్రజల కోపాన్ని తగ్గిస్తాయా?అయ్యో రామా!

  అయినా మన కిప్పుడు కోపం చాలా అవసరం. అసలే ఒకపక్క అవినీతి పరులు, ఇంకొక పక్క రేపిస్ట్ లు ఈ దేశాన్ని నాశనమ్ చెస్తుంటే వారి మీద కోపం రాకుంటే దర్ణాలు ఎలా చేస్తాం?ఆందోళనలు ఎలా కొన సాగిస్తాము?. అమ్మో,కశ్టం. అమ్దుకే గురువు గారిని టి.వీ.నైన్ వాళ్లకి అప్ప చెప్పి మనం ఎంచక్కా మటన్,చికెన్ దండిగా లాగిద్దాం. అప్పుడే మనం ఉద్యమాలు చెయ్యడానికి శక్తి, మన బాదలకు విముక్తి.        

3 comments:

  1. ప్రస్తుత విషయాల పైన మీరు దృష్టి కేంద్రీకరించడం నాకు బహు ఆనందముగా యున్నది.

    ReplyDelete
  2. ఓ..నిజమా! లబ లబ గారూ.. ఇప్పుడు చూడండి నాకెంత ఉల్లాసంగా ఉందో! ఎంత ఉత్సాహంగా ఉందో!(పవన్ స్టైల్లో)

    ReplyDelete
  3. ఇది చాలా నిజం. పత్రి గారికి సహనం కానీ, సహిష్ణుత కానీ లేదు. వారు చ్ప్పింది వినాలి అంతే. ఎదురు మాట్లడకూడదు. చరిత్ర అడక్కు, చెప్పింది విను అన్నట్లు వారిని ఏదడిగినా వారికి కోపం. వారి ధ్యానం వారి కోపాన్నే తగ్గించలేకపొయింది.

    ReplyDelete