Saturday, January 5, 2013

కోటి సంతకాలు కో అంటె దొంగ దొర అవుతాడా?



 అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నరు.? ప్రజలు ఒప్పుకుంటే దొంగ దొర అవుతాడా?అలా అయితే  ఎన్నికల్లో పోటి చేసిన నిందితులు కనుక ఎన్నికల్లో గెలిస్తే, వారికి ప్రజా మద్దతు ఉందని వారి నేరాలను క్షమించాల్సి ఉంటుంది. ఒక వేళా ఇదే పద్దతి అమల్లోకి వస్తే ఎదో ఒక రకంగా కోట్ల    రూపాయలు దోపిడి చేసి, అందులో కొంత సొమ్ము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి,గెలిచి, రాజ్యాంగాన్ని అవమానం చేయవచ్చు

  కాబట్టి ఇటువంటి తప్పుడు చెష్టలు మానుకోవడం మంచిది. ఒక వేళా ఎవరైనా దోపిడి దారులు తాము చేసిన దోపిడికి,ప్రజా సమ్మతి ఉందనుకుంటే, తాము దోపీడి చేసామని ఒప్పుకుంటూ,తాము చేసింది కరక్టే నని  రెఫ్రెండమ్ ద్వారా తేల్చుకో మనండి. ఒక వేళా మెజార్టీ ప్రజలు మీరు చెప్పేదే చట్ట మంటే, కోర్టులు గీర్టులు జాన్తా నై అంటే, మీదే      ఈ దోపిడి రాజ్యం. మేము మీ అడుగు జాడల్లోనే నడుస్తాం. దోచుకున్న వారికి దోచుకున్నంతా మహ దేవా!

 కాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఖచ్చితంగా మీరు నేరం చేసారు అని నిర్దారించుకోవలసి ఉంటుంది. (  ఇది కోటి సంతకాలతో కోర్టులు ని బ్లాక్ మెయిల్ చేద్దామనుకునే వారి నుద్దేసించి మాత్రమే)    

No comments:

Post a Comment