Wednesday, February 26, 2014

ఖమ్మం జిల్లా మంత్రి ,శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి &అదర్స్ మిద మద్యం సిండికేట్ కేసు పెట్టాల్సిందే అన్న హై కోర్టు !

                                                         


రూల్ ఉంటె కోర్టుకు పో ! లేకుంటే మంత్రి దగ్గరకు పో ! అనేది లౌక్యం తెలిసిన కార్య సాధకుల మాట!. ఆ  మాట అక్షరాల నిజమేనని రుజువైంది ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి . కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన సంగతి ఎలా ఉన్నా ,బడా  బడా నిందితులు మిద చట్ట పరమైన చర్యలు తీసుకున్నది మాత్రం అయన గారి హయాంలోనే . అయితే అయన గారి నిజాయితిని కూడా సవాలు చేసేలా తయారయింది 2012 లో A.C.B  వారు జరపిన మద్యం సిండికేట్ కెసు. ఈ  కేసులో 12 మంది M.L.A  లతో పాటు ఇద్దరు మంత్రులు శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి , మోపిదేవి వెంకట రమణతో సహా చాలా మంది అధికార అనదికారులమిద విచారణ జరిపారు . అయితే సరి అయిన ఆదారాలు ఉన్నా ప్రజా ప్రతినిధులు మిద కేసులు నమోదు చేయకుండా , రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసును నిరు గార్చడానికి చూస్తున్నారని A.C.B మిద ఆరోపణలు వచ్చాయి .

   చివరకు ఆ ఆరోపణలు ఆదారంగా హైకోర్టులో ఒక ప్రజా హిత వ్యాజ్యం దాఖలు కాగా , దానిని పరిశిలిoచిన ఆంద్ర ప్రదెస్ హై  కోర్టు వారు ఆదారాలు ఉన్న వారి మిద కేసులు నమోదు చేసి 3 నెలలలో విచారణ పూర్తీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ  చేసింది . ఇన్నాళ్ళు ఆగి తీరా ఎన్నికల ముందు ఇలా హై  కోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చు కాని ,  చైతన్యం కల ప్రజలు ఉన్న సమాజంలో పాలకులు తాము ఏమి చేసినా అడిగే వారు ఉండరు అనుకోవటం పొరపాటే . ఆదారాలు ఉంటె ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు . నిందితులు కోర్టుల్లో విచారణ ఎదుర్కుని తమ నిర్దోషిత్వాన్ని నిరూపిoచు కోవలసిందే  అని పై ఉదంతం తెలియ చేస్తుంది .
  ఈ విషయం గురించి మరింత సమాచారం కొరకు క్రింది విడియో ను చూడండి
                  
            

Tuesday, February 25, 2014

మాట తప్పి , ఆంద్ర ప్రదేశ్ లోకే అడుగుపెడుతున్న "తెలంగాణా దొర " గారికి స్వాగతం! సుస్వాగతం !

                                                                   


మొన్నతెలంగాణా   దొర  విమానం ఎక్కి డిల్లికి పోయాడు . బేగం పేట విమానాశ్రయం దగ్గరకు పోయేసరికి ఆయనకి ఒక పోన్ కాల్ డిల్లి నుంచి వచ్చింది . ఈయన దగ్గర M.P  సీటు ప్రామిస్ తీసుకున్న డిల్లీ  నాయకుడు ఒకరు ,  దొర గారికి డిల్లి ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నాడు . ఆ ఇంఫార్మరే పోన్ చేసి మరి చెప్పాడట ! ఈ పార్లమెంట్ సెషన్ లోనే తెలంగాణా బిల్ పాస్ చెయ్యాలని మేడం హుకుం జారీ  చేసేసారట ! అందుకే ఇక తెలంగాణా O.K అని సమాచారం . ఆ మాట వినగానే ఒళ్ళంతా పులకరించింది తెలంగాణా దొరకి . అంతే ! అప్పటికప్పుడు అక్కడున్న మీడియా వారి ముందు వీర ప్రతిజ్ఞ చేసేసాడు . "నేను అడుగంటూ తిరిగి హైదరాబాద్ లో పెడితే "తెలంగాణా రాష్ట్రం " లోనే తప్పా ఆంద్ర ప్రదేశ్ లో కాదు " అని . ఆ మాట విని తెలంగాణా ప్రజలు సంతోషించారు .

   కాని అదే తెలంగాణా దొర ఈ  రోజే డిల్లి నుండి హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు . ఆయనకు తెలంగాణా చరిత్రలో ఎవరికీ పలకని ఘన స్వాగతం పలికేందుకు అయన గారి పార్టి సంసిద్ధులు అవుతున్నారు . మంచిదే ! కాని అయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి ? చేస్తున్న పని ఏమిటి? అయన తిరిగి అడుగు పెడ తానన్నది తెలంగాణా రాష్ట్రంలో . కాని అడుగు పెడుతున్నది ఆంద్ర ప్రదేశ్ లో . కనీసం టెక్నికల్ గా కూడా తెలంగాణా ఎర్పడలేదే ! దానికి రాష్ట్రపతి గారు అప్పాయింటెడ్ డేట్ ను ప్రకటించాల్సి ఉంది కదా ! ఆ  రోజు నుంచి కదా తెలంగాణా ఏర్పాటు ! మరి ఈ నాలుగు రోజులు డిల్లిలోనే ఉండీ రాష్ట్రపతి గారి చేత అ డేట్ ప్రకటింప చేసి , తెలంగాణా ఏర్పడిన తోలి రోజున తోలి అడుగు డిల్లి నుండి వచ్చి పెడితే ఎంత గొప్పగా ఉండేది ? ఇలా  ప్రతిజ్ఞా బంగం చేసి అయన రావడం! దానికి చరిత్ర లో గుర్తుంచుకునే స్వాగతం పలకడం ! చివరకు ప్రజలు అయన వాగ్దానా బంగాన్నే గుర్తుంచుకునే ప్రమాదం ఉంది .

  ఏదైనా దొర  దొరే ! అయన చెప్పిందే వేదం . అందుకే ఆయనకు స్వాగతం! సుస్వాగతం

Sunday, February 23, 2014

రాజకీయపార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయక తప్పేట్టు లేదు !.

                                                        
                                                           

ఆంద్ర ప్రదేశ్ లోని   రాజకీయ పార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేస్తే బాగుంటుంది కదా అని ఆ లోచిస్తున్నారట కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు!. ఇన్నాళ్ళు అంటే తెలుగు జాతికి ఒకే రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నే ప్రాంతీయ పపార్టీలుగా  ఉంటూ తెలుగు ప్రజలు అందరికి సేవ చేసే బాగ్యం దక్కినందుకు పొంగిపోతూ  ఉండేవారు . ఇప్పుడు హఠాతుగా  రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించే సరికి వీరికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎదురయింది . అదేమిటంటే

   ఏదైనా ఒక ప్రాంతీయ  రాజకీయ పార్టి ఒకటి మించి వేరే రాష్ట్రాల్లో అదే గుర్తుతో పోటి చేయాలంటే దానికి జాతీయ స్తాయి గుర్తింపు కావాలి . మరి అలా ఉండాలంటే కనీసం 4 రాష్ట్రాలలో సదరు పార్టికి చట్ట ప్రకారం ప్రాతినిద్యం ఉండాలి . కాని ఇప్పుడు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వలన కంపల్సేరిగా  ప్రాంతియ పార్టీలు రెండు రాష్ట్రాలలోను పార్టీని నడపాల్సిన పరిస్తితి. మరి అటువంటప్పుడు రెండు రాష్ట్రాలలోను ఒకే గుర్తు మిద పోటి చేయాలంటే అ దానికి జాతీయ పార్టి గుర్తింపు కావాలి . అందువల్ల మరో రెండు రాష్ట్రాలు వాటికి కావాలి . ప్రాంతీయ పేరులు పెట్టుకుని ఇతర రాష్ట్రాలలో పార్టి ని విస్తరించలెరు . కాబట్టి ఉన్న ప్రత్యామ్నాయం , సెంట్రల్  చట్టానికి సవరణలు చెయ్యడం లేదా ఉన్న రెండు రాష్ట్రాలను మరో రెండు ముక్కలు చేయడం . కాబట్టి రానున్న 10 సంవత్సరాలలో మరో 2 రాష్ట్రాలు తెలుగు నాట అవతరిoచ వచ్చు .

   మంచి కైనా చేడుకైనా నలుగురు ఉండాలి అంటారు . తెలుగువారి రాష్ట్రాలు కూడా నాలుగు ఉంటె మనకి జాతి య హోదా రాకపోయినా , పార్టీలకు ఒక జాతీయ గుర్తింపు  వస్తుంది కదా !

Saturday, February 22, 2014

రాజీవ్ గాంది ,సంజయ్ గాంది , గార్లు ఒక తండ్రి బిడ్డలు కారా ?!

                                                      
         
                                                                

ఇంతవరకు నాకు తెలియని అంశం . అపకొర్స్ తెలిసినా పెద్దగా ఒరిగేది ఏమి లేదనుకోండి . కాకపొతే నాకు ఒక చిన్న అనుమానం ఉండేది . రాజీవ్ గాంది , సంజయ్ గాంది  గారాలు ఇందిరా గాంది  గారి పుత్రులే కదా. మరి సంజయ్ గాంది  గారి కుటుంభం అంత నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది అని . అది ఇందిరా గాంది , మేనకా గాంది  గారలు మద్య ఉన్న బెదాభిప్రాయాలు అనుకున్నాను కాని ఈ రోజు వారి తండ్రులు వేర్వేరు అని తెలిసాక బహూశా అదే కారణమై ఉంటుందనుకుంటున్నాను . నాకు ఆ సంగతి తెలిపినడది  పైన చిత్రంలో ఉన్న నెహ్రూ గారి వంశ  వృక్షమే . నెహ్రూ గారిది కాశ్మీరి  బ్రాహ్మణ వంశం అంటారు చాలా మంది. అది నిజం కాదని వారిది లౌకిక వoశ మని పై పట్టిక ద్వారా తెలుస్తుంది .అందుకే వారికి హిందూ అంటే సరిపడదు అనుకుంటా !

Friday, February 21, 2014

బ్రహ్మం గారు చెప్పిన "కాలజ్ఞానం" నిజమయినా కాకకపోయినా" కల్కిఖడ్గం" చెప్పిన భవిష్య వాణి మాత్రం నిజమయింది !.

కల్కిఖడ్గం

                                                         

నేను ఈ బ్లాగు మొదలు పెట్టడమే భవిష్య ద్రష్ట లు చెప్పిన ఒకానొక విషయం మిద . అదిఏమిటంటే డిసెంబర్ 21, 2012 న యుగాంతం అని . మొదట్లో నా బ్లాగు పేరు కూడా అదే . ప్రపంచంలో చాలా దేశాలలోని ప్రజలు దానిని నమ్మిన వారు ఉoడొచ్చు. కాని దాని గురించి కోట్లాది మంది ప్రజలు మాత్రం ఉత్సుకత చూపించారు అనేది మాత్రం నిజం . నా బ్లాగులో మాత్రం నేను యుగాంతం గురించి కాదు కాని ఆ రోజు బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన వీరబొగ వసంత రాయలు వస్తాడు అని చెప్పాను. నా బ్లాగు పట్ల కూడా వీక్షకులు కొంత ఆసక్తి చూపారు . అయితే విరబొగ వసంత రాయలు అంటే ఉన్న అర్ధం వేరని అయన వచ్చింది నిజమే అని కొన్ని కారణాల వల్ల ఆయన్ని కనుకొవటం కష్టం అని నేను ప్రచురించిన టపా చూసి   వీక్షకులు నిరాశ చెంది , కేవలo నా బ్లాగు పాపులారిటి కోసం అ పని చేసాను అని అనుకున్నారు . O.K .  నాడు వీరభొగ వసంత రాయలు విషయంలో నేను చెప్పినది నిజం అయినా కాకపోయినా , ఇదే బ్లాగులో పిబ్రవరి 1, 2013 న నేను చెప్పినది మాత్రం నిజమైంది . అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు . నేను పిబ్రవరి 1,2013 న ఏమి చెప్పాను అంటే 
            
   "అదిష్టానం వాగ్దానాల మీద పార్టీలకు నమ్మక్కం లేదు. అందుకే అదిగో తెలంగాణా ఇదిగో తెలంగాణా అంటే అవన్ని పిల్లకాయ మాటలుగా బావించారు. అలాగే పార్టీ అభిప్రాయాలను, అంద్రా ప్రజల అభిప్రాయాలను బేఖాతరు చేసి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్తితిలోను "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు."  
                   అని చెప్పాను . మొన్న 20-2-2014 నాడు తెలంగాణా బిల్  సొనియా గాంధి గారి పట్టుదలతో ఉభయ సభలలొ ఆమోద ముద్ర పడింది . ఇక కేవలం లాంచన ప్రాయమైన రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది . కాబట్టి నేను చెప్పిన మాట నిజమయింది కదా! బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమయినా కాకకపోయినా కల్కిఖడ్గం చెప్పిన భవిష్య వాణి నిజమయింది !.వీరభొగ వసంత రాయలు రాకపోయినా ,కల్కి ఖడ్గం చెప్పిన విదంగా తెలంగాణాని  మాత్రం సోనియమ్మా ఇచ్చింది .

    
  1-2-2013 నాడు పెట్టిన టపా కోసం క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి .  

నాన్నా "తెలంగాణా" వచ్చే! http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

    

Thursday, February 20, 2014

ఈ పదేళ్ళ పందానికి తెలుగు రాజకీయ నాయకులు సిద్దమా !?

                                                             

అయిందేదో అయిపొయింది . మంచో , చెడో ,తను ఎంత పోరాడినా తను అనుకున్నది కానప్పుడు ఏది జరిగినా ఆ  దైవ నిర్ణయం అనుకుని ముందుకు సాగడమే జ్ఞానుల లక్షణం . తెలంగాణా కోసం కోట్లాది ప్రజలు కోరుకున్నారు అనేది వాస్తవo . శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ రానంతవరకూ తెలంగాణా సిమాంద్ర ప్రాంతం కంటే చాలా వెనుకబడి ఉందనే తెలంగాణాలోని అత్యదిక శాతం ప్రజలు అనుకున్నారు . అందుకే తెలoగాణా వేరు పడితే తప్పా అభివృద్ధి సాదిoచలెము అన్న తెలంగాణా నాయకుల మాటను సమర్దిoచారు. దానికి తోడూ రాష్ట్రంలోని ఎ రాజకీయ పార్టి (C.P.M తప్పా ) తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదు . కాబట్టే రాష్ట్ర విభజన సాధ్య పడింది . ఇప్పటికి సిమాoద్రా లోని సామాన్య ప్రజలలో విభజన అంటే ప్రజల మద్య ఎడబాటే అనే బావనతొ ఉండటం వలన శోక తప్తులై ఉన్నారు . కొంత మంది మాత్రమె హైదరాబాద్ ను U.T చేస్తే చాలు అనుకుంటున్నారు తప్పా , సామాన్య జనం మనస్పూర్తిగా విభజనను ఒప్పుకోవడం లేదు . అలాగే తెలంగాణా జిల్లాలోని  అత్యదిక శాతం ప్రజలు విభజన కావాలనే కోరుకుంటున్నారు . అయితే గడచినా 60 సంవత్సరాలుగా సిమాoద్రా నుండి లక్షలాదిగా ప్రజలు తెలంగాణా కు వచ్చి ఇదే తమ జన్మ భూమి అని స్తిర పడిపోయారు . విరెవ్వరికి మనస్పూర్తిగా రాష్ట్ర విభజన ఇష్టం లేదు . కాకపొతే తామున్న దగ్గర సమస్యలు కొని తెచ్చు కోవడం ఇష్టం లేక అందరితో పాటు తాము తెలంగాణా కు జై అంటున్నారు .

  సరే ఏదేమైతేనేం ఆర్టికిల్ 3 అనేది ప్రజల్ని విదదియలెదు . ప్రాంతాలను అది కూడా రాజకీయంగా విడదీయ గలుగుతుంది . సమర్ధులు పాలకులు గా ఉన్నంత కాలం సమైక్యంగా ఉంటారు  , పాలించే వారిలో చేవ చచ్చినప్పుడే  విడిపోతుంటారు అనేది చారిత్రిక సత్యమ్. కాని ఇప్పుడు మాత్రం ప్రజలు కాకుండా ప్రాంతాలను రాజకీయ నాయకులు విడగొట్టుకున్నార్రు . వారు తమ సమర్ధతను చూపించి తమ ప్రాంతాలను స్వర్గ దామం చెయ్యాలని ఉవ్విలూరుతున్నారు . వారి కోరికను కాదనడం ప్రజలకు పాడి కాదు. ఈ రోజు ఏ ఆర్టికిల్ ద్వారా విడి పొయామో అదే ఆర్టికిల్ కి తిరిగి కలిపే శక్తి ఉన్నాడని నేతలుకు తెలియంది కాదు . అందుకే ఈతెలంగాణా  సిమాంద్ర నేతలకు మద్య తెలుగు ప్రజలు ఒక పందెం  పెడితే ఎలా ఉంటుంది ?

  పందెం ఎందుకంటే , తెలంగాణా నెతలెమొ విడిపోతే బాగుపడతాం అంటుంటే , సిమాంద్ర నేతలేమో కలిసి ఉంటే నే బాగుంటాం అంటున్నారు . సామాన్యుడికి సమర్దుడైన నాయకుడి పాలనే కావాలంటున్నారు . మంచో , చెడో ఇంకా 10 ఏండ్లు  రాజధాని , హై కోర్టు , విద్యా అవకాశాలు ఉమ్మడిగా ఉండాల్సిందే . కాబట్టి ఈ 10 యేండ్ల లో ఎ రాష్ట్రం ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందో చూడాలి . ఒక వేల తెలంగాణా ఎక్కువగా  అభివృద్ధి చెందితే విడిపోయిన రాష్ట్రాలు యదావిదిగా ఉండాల్సిందే . లేదూ సిమాంద్ర ఎక్కువుగా అభివృద్ధి చెందితే మరల ఆర్టికిల్ 3 ని ప్రయోగించి రెండు రాష్ట్రాలను కలపాలి. ఇప్పుడు 10 ఏండ్లు విడిపోయినంత మాత్రానా నష్టం ఏమి ఉండదు . ఎందుకంటే అప్పటి దాక కేంద్రం వారు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిన అన్ని సౌకర్యాలు పొందుతాం కాబట్టి , 10 ఏండ్లు రాష్ట్ర విభజన వల్ల లాభమే తప్పా నష్టం ఉండదు .

  మరి పైన చెప్పిన విదంగా పందానికి మన రాజకీయ నాయకులు ఒప్పుకుంటారా ? ఒప్పుకుంటే 2014 నాటికి తెలుగు రాష్ట్రాలు  ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు పొందుతాయి అనడంలో నాకైతే సందేహం లెదు.

Tuesday, February 18, 2014

రాష్ట్ర విభజన బిల్ ని హై కోర్టు ఆపినట్లేనా !?

                                                         ఇప్పుడే అన్ని చానల్స్ లో ప్రసారం చేస్తున్న దాని ప్రకారం ఆర్టికిల్ 3 మిద హై కోర్టు న్యాయవాది శ్రీ P.V క్రిష్నయ్య గారు వేసిన పిటిషన్ ను ఆంద్ర ప్రదెశ్ కోర్టు వారు ఈ రోజు అడ్మిట్ చేస్తూ , కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలకు నోటిసులు జారి చేసింది అని తెలుస్తుంది . . మరి ఇటువంటి పరిస్తితుల్లో రాష్ట్ర విభజన బిల్ మిద చర్చలు కొనసాగించడం కరెక్టు కాకపొవచ్చు. ఇదంతా చూస్తుంటే ఈ బ్లాగులో ఇంతకూ ముందు టపాలో నేను చెప్పిన కాంగ్రెస్ డ్రామా నిజమేనని రుజువైనట్లే ! దిని మిద ఏమి జరుగబొతు0దో ఇంకా కొన్ని గంటల్లోనే తెలస్తుంది ఆ తర్వాత ఎవరు ఏమి చేసారో ఒక స్పష్టమైన అవగాహన కు రావచ్చు . అంతవరకూ డ్రామాలను చూస్తూ ఉండడమే!
అప్ డేట్ : హై కోర్టు నోటిసుల  జారి విషయం గురించి తర్వాత చానల్స్ ప్రసారం చేయటం మానివేయటం చూస్తుంటే , బహూశా ఇది కూడా అబద్దమేనేమో ! ఏది ఏమైనా పార్లమెంటులో మూజువాణి వోటుతో తెలంగాణా బిల్ పాస్సయిoది.ఈ  దెబ్బతో ఏదో రకంగా తమ ఇన్నాళ్ళ కోరికను తీర్చిన సోనియా గాంది తెలంగాణా ప్రజల పాలిత దేవత గా మారితే , సిమాoద్రాలొ దెయ్యం గా మారింది .బిల్ ఎలాగు రాజ్య సభలో కూడా పాసవుతున్ది కాబట్టి రాష్ట్ర విభజన అయినట్లే!అయిందేదో అయింది ! ఇక సిమాoద్రా వారు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయి కాంగ్రెస్ లాంటి చట్ట ఉల్లంగనలకు పాల్పడే పార్టీలను వారి ప్రాంతంలో మనుగడ లేకుండా చెయ్యడమే వారు చేయగలిగిన వివేకమైన పని. ఇక తెలంగాణా వారు "సంబురాలు " మొదలెట్టేసారు కాబట్టి అంతా హ్యాపిసె ! 

Monday, February 17, 2014

సరి అయిన బిల్లు ఏమిటో నాయకులకు తెలియదు! సరి అయిన సమయం ఏమిటో లాయర్లకు తెలియదు!

                                                     


ఆల్  ఇండియా గ్రేట్ డ్రామా కంపెని అయిన  కాంగ్రెస్ వారు ఆడుతున్న నాటకంలో  మంచి రసవత్తర సీన్  నడుస్తుంది . అయితే ఇంత పకడ్బంది నాటకం ఆడి వారు రుజువు చేయడలచింది  ఏమిటంటే తాము రాజ్యంగ పద్దతులు తెలియని మూర్కులమని , తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తప్పా , దాని పలితాలకు తాము బాద్యులం  కాదని తెలంగానా ప్రజలకు తెలియచెయ్యదమే . దిని వలన రాష్ట్ర విభజన బిల్ పాస్ చేసినా దాని పలితం మాత్రం మాత్రం తెలంగాణా ప్రజలకు దక్కుద్దా లేదా అనేది అనుమానంగా ఉంది . . ఈ అనుమానాలు కలగటానికి గల కారణాలు ఇవి
(1). తెలంగాణా బిల్ మిద ఇప్పటివరకు 3 పిటిషన్ లు సుప్రీం కోర్టులో వేయడం జరిగింది . ఆ  మూడింటిని కోర్టు వారు ఒకే ఒక కారణంతో తిరస్కరించారు . అది ఏమిటంటే పిటిషన్ లు విచారించడానికి ఇది సరి అయిన సమయం కాదు, అ సమయం వచ్చాక తప్పకుండా విచారిస్తo అని. దిని వలన అర్దమయ్యేది ఒకటే.. విభజన బిల్ మిద పార్లమెంట్ నిర్ణయం వెలువడ్డాక పిటిషన్ వేస్తె తప్పకుండా విచారణకు స్వికరిస్తామ్ అని ఒక అభయం సుప్రీం కోర్టు వారు ఇచ్చినట్లే కనబదుతు0ది. సుప్రీం కోర్టు లో ఏంతో అనుభవమున్న సీనియర్ లాయర్లు పోయిన సారి వాదించి నపుడు ఇదే విషయం సుప్రిం కోర్టు వారు చెప్పినప్పటికీ "సరి అయిన సమయం " అంటే ఏమిటో తెలియక సిమాంద్ర లాయర్లు "ముద్ద ముద్దకు  బిస్మిల్లా " అన్నట్లు , కేంద్రం ఒక స్తెప్ వేయగానే పిటిషన్ ఒకటి వేస్తూ "సమయం వచ్చిందా , రాలేదా ? అని టెస్ట్ చేస్తున్నారు . ఇది లాయర్ల పరిస్తితి !

 (2). ఇక పొతే నాయకులు విషయానికి వస్తే , అసెoబ్లికీ పంపాల్సింది బిల్లో , డ్రాప్ట్ బిల్లో వారికి తెలియదు . కొన్ని గంటలు చర్చ జరిపాక "తూచ్ ' ఇది డ్రాప్ట్ బిల్ " అని మూజు వాణి  వొటుతో తిరస్కరిస్తారు . 117 మంది సబ్యులు అనుకూలంగా ఉన్న బిల్ మూజువాణితో వోటు తో తిరస్కారానికి గురి అవుతుంటే నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకున్నట్లు మిన్నకుండి పోయారు  తెలంగాణ నాయకులు . పార్లమెంట్ మనదే అయినా , సుప్రీం కోర్టు మనది కాదు అన్న  జ్ఞానం లేకుండా పోయింది వారికి. ఒక వేళ తెలంగాణా బిల్ పార్లమెంటులో పాస్ అయినా కోర్టు వారు ఆపితే, దానివలన కాంగ్రెస్ కె లాభం . ఇచ్చిన మాటకు కట్టు బడి K.C.R గారు తమ పార్టిని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదు . దాని వలన T.R.S నాయకులకు నష్టమైనా ,  K.C.R గారికి మాత్రం డిల్లీలో సోనియా గాంది గారి పర్మనెంట్ కోటరిలో మెంబర్ షిప్ లబిస్తుంది . ఎలాగు రాష్ట్ర విబజన ఆగింది కదా అని సిమాoద్రులు కిరణ్ గారికి జై అంటారు . కిరణ్ గారి ఖాతాలో జమ అయ్యే సీట్లు అన్ని అంతిమంగా కాంగ్రెస్ కు జమ అయ్యెవె ! ఇంత  మహత్తరమైన ప్లాన్ తో గొప్ప నాటకానికి తేరా తిసిందా కాంగ్రెస్ అనిపిస్తుంది . 
    (3) ఇక జాతీయ ప్రతి పక్ష హోదాలో ఉన్న B.J.P విషయానికి వస్తే, పార్లమెంటులో బిల్ ప్రవేశ పెట్టారో లేదో ఘనత వహించిన పార్లమెంటేరియన్ లకు తెలియదట ! బిల్ ప్రవేశం జరిగిపోయిందని అధికార పార్టి వారు అంటుంటే , "సభలో ఉన్న మాకు తెలియకుండానా ! అని బోల్డంత ఆశ్చర్య పోతున్నారు ప్రతి పక్ష నెతలు. చట్టాలు తయారు చేసే వారే , తమ పార్టి స్వార్దాల కోసం డ్రామాలు ఆడుతున్న దేశం లో ప్రజలకు దిక్కెవరు?
           ఈ డ్రామాల వల్ల  తెలుగు ప్రజలు చివరకు ఎ పరిస్తితులకు గురి అవుతారో రాబోయే వారం రోజులలో జరగబోయే పరిణామాలు నిర్ణయిస్తాయి .

 

Thursday, February 13, 2014

రాజగోపాల్ గారికి తన మిద లైంగిక దాడులు జరుగుతాయని భయమా !?

                                                             

మా ఊరి లో ఉన్న మల్లన్న అంటే అందరికి కొంత భయం ఉంటె అంతో ఇంతో గౌరవం కూడా లేక పోలేదు  భయం ఎందుకంటే కండలు తిరిగిన అతని బలిష్టమైన శరీరం  చూసి . ఎవరైనా సరే అతను ఒక గుద్దు గుద్దితే గిద్దెడు మిరియాలు కక్కాల్సిందే అని అనిపించేలా ఉంటాడు.  మరి గౌరవం ఎందుకంటే అంత కండలు తిరిగిన విరుడైనా ఏనాడు పద్దతి తప్పి వ్యవహరించలేదు కాబట్టి . కుస్తీ పోటిలో సైతం ఉపాయపు పట్లే తప్పా దొంగ దెబ్బ తీసి ప్రత్యర్దిని ఓడించాలని చూడడు .అటువంటి మల్లన్న నిన్న పార్లమెంట్ లో జరిగిన కాంగ్రెస్ వీరుల వీరంగం చూసి బాగా నిరాశ చెందాడు .
 మా మల్లన్నకు పార్లమెంట్ లో ఉండే వారంతా పెద్ద మనుషులు అని మా చెడ్డ నమ్మక్కమ్ . వారు ఏదైనా చర్చల ద్వారా సాదిస్తారు అని ఇన్నాళ్ళు అనుకునే వాడు . అందుకే మా ఊరు M.L.A లు వచ్చినా , M.P లు మంత్రులు ఎవరు వచ్చినా వారిని ఎంతో అభిమానంగా గౌరవించే వాడు . భగవంతుడు తనకు బుద్దిబలం  ఇవ్వకుండా కండ బలం ఇచ్చినందుకు తెగ బాద పడేవాడు . కాని నిన్న పార్లమెంట్లో గందరగోళం చూసాక "ఓస్ ! ఇంతోటి దానికా ప్రజలందరూ M.P లను ఎన్నుకునేది అని తెగ ఆచ్చర్య పోయాడు . రేపు రానున్న ఎన్నికల్లో M.P గా తనకే అవకాసం ఇవ్వాలని అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టాడు . మా కూడా అదే కరెక్టు అనిపిస్తుంది .

  అసలు దేశ  హొమ్ మంత్రి సభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి తన చుట్టూ 18 మంది జమా జెట్టి లాంటి M.P లను ఉంచుకోవలసిన అంత దౌర్బాగ్య ప్రజాస్వామ్యమా మనది ?!బిల్ మిద అబ్యంతరాలు ఉన్న వారెవరైనా తమ నిరసనను ప్రజాస్వామ్య యుతంగా మాటల రూపంలో , వ్రాతల రూపంలో తెలపాలి కాని , మంత్రులు మీదకు ఎగబడి బిల్ ను లాక్కుని చించే హక్కు రాజ్యాంగం ఇచ్చిoదా  ? అలాగే ఎవరైనా సబ్యులు తన పనికి ఆటంకం కలిగిస్తున్నారు అని  ముందే తెలిస్తే వారిని సస్పెండ్ చేసి బయటకు పంపమని చట్టాలు చెపుతున్నాయి కాని , తనొక ముటా నాయకుడు లాగా తనకు అనుకూలమైన M.P లను రక్షణ వలయంగా పెట్టుకుని హొమ్ మంత్రి బిల్ ప్రవేశ పెట్టడం ఎంతవరకు సబబు? మీకు రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రివిలేజ్ లు ఇచ్చింది స్వెచ్చగా మీ బావాలను వ్యక్తం చేస్తారని తప్పా , మీ ఇష్టం వచ్చినట్లు బాదుకుని ప్రపంచ దేశాలలో దేశ  ప్రతిష్టను దిగ జారుస్తారని కాదు . అలా చేసే వారు ఒక్క క్షణం కూడా చట్ట సబలలొ ఉండటానికి విలు లేదు .

   ఇకపోతే రాజగోపాల్ గారు ఏకంగా పార్లమెంట్లో కి పెప్పర్ స్ప్రే తీసుకు రావడమే కాక , దానిని ప్రయోగించి కొందరిని హాస్పిటల్ పాలయెలా చేసారు . నిజంగా తెలంగాణా బిల్ చట్ట వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నారు అని మీకు నమ్మకం ఉంటె దానిని చట్టం అయ్యాక కూడా సుప్రీం కోర్టులో చాలెంజ్ చేసి న్యాయం పొoదవచ్చు. ఆ అవకాసం మీకు ఉందని కోర్టు వారు చెప్పారు కూడా ! అది తెలిసిన వారు పెప్పర్ స్ప్రే ప్రయోగించే అంత పనికి పూనుకోవడం ఎందుకు?దేశ ప్రతిష్టను దిగజార్చడం ఎందుకు ? సరే రాజగోపాల్ గారికి తన మిద లైంగిక దాడులు జరుగుతాయని బయం ఉంటె ఉండవచ్చు . దానికోసం అయన కారం పొట్లం కి మోడరన్ రూపం అయిన "పెప్పర్ స్ప్రే " జేబులో పెట్టుకుని తిరుగుతుంటే ఎవరికీ అబ్యంతరం లేదు కాని ,దేశ పరువును నాశనం చేసే ఇలాంటి పనులు చెయ్యడం ఎందుకు? ఇక అటు తెలంగాణా వారు సైతం ఇతర రాష్ట్ర M.Pలతో కలసి కిరాయి గూండాల్లా తోటి M.P లను అడ్డుకోవడం ఎ ప్రజాస్వామ్యానికి ప్రతికలో ఆత్మ విమర్శ చేసుకోవాలి . కండ బలం ఉపయోగించి బిల్ లు పాసు చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెపితే మా ఊరి మల్లయనె పంపే వారం కదా ? మీరెందుకు ?

   అదికార పార్టి వారు వారి స్వార్ధం కోసం ఏదైనా అతిక్రమణలకు పాల్పడితే దానిని సరి చెయ్యాల్సిన బాద్యత ప్రతి పక్షాలది . ఒక పక్క అధికార పార్టి వారు ప్రవేశ పెట్టె  తెలంగాణా బిల్ కి సంపూర్ణ మద్దతు అని చెపుతూ , ఇంకొక పక్క సభ సజావుగా సాగకపోతే సహకరిమ్చమని చెప్పడంలో అంతర్యం ఏమిటి ? మేజార్తి అయిన అదికార , ప్రతి పక్షాలు O.K.  అన్నాక మూజువాణి వోటు తో కూడా బిల్ పాస్ చెసెయొచ్చు కదా ! ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ చేసింది అదే కదా ! దానికి ఇంత  రాదాంతం  సృష్టించాలా ? లేదూ సిమాంద్రా వారికి పలానవి ఇవ్వాలని కచ్చితంగా చెపుతున్నప్పుడు అవి ఇస్తేనే మద్దతు ఇస్తాం అని స్పష్టంగా తెగేసి చెప్పండి . అంటే కాని గంటకొక మాటతో గందరగోళానికి గురిచేసి తమాషా చూడడం ప్రతి పక్షానికి హుందా నివ్వదు .
  ఏది ఏమైనా అటు సిమామ్ద్రా వారు కావచ్చు . ఇటు తెలంగాణా వారు కావచు నిన్న జరిగిన సిగ్గుమాలిన పనికి ముక్య కారణం అధికార కాంగ్రెస్ పార్టి యే ! వారిని గురించి ఉత్తరాది మీడియా ఏమి అనుకుంటుదో క్రింది విడియో చూసి తెలుసుకోవచు . మీరంతా ఇలాగే చేయడం సబబు అని వాదిస్తే  బుద్ది ఉన్న ప్రజలకు రానున్న ఎన్నికలలో "నోటా " మీటను ఉపయోగించడం తప్పా వేరే గత్యంతరం లెదు .

 
         

Tuesday, February 11, 2014

జగన్ కి వార్నింగ్ ఇచ్చి మరి అక్కున చేర్చుకున్న లక్ష్మి పార్వతి !

                                                 

ఒక సారి క్రింది వీడియోను చూడండి . ధర్మాన ప్రసాదరావు గారు , లక్ష్మి పార్వతి గారు Y.S.R పార్టిలో చేరుతున్న సీను. అందరికి పార్టి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్ గారు. అ సందర్బంగా అందరు నవ్వుతూ జగన్ ని ఆలింగనం చేసుకుని తమ ఆత్మీయతను చాటారు . కాని లక్ష్మి పార్వతి గారు మాత్రం ఎందుకో జగన్ కి తర్జని చూపిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది . బహుశా  తనను పార్టీలోకి చేర్చుకున్నాక పార్టికి ఏమైనా అయితే తనను ఏమన్నా ఊరుకోను, అని వార్నింగ్ ఇస్తున్నట్లుంది .గతంలో  అన్నగారి పరిస్తితి చూసిన ఆమెకు ఎందుకైనా మంచిది అని ముందే జాగర్త పడుతున్నట్లు ఉంది .

                

         

Friday, February 7, 2014

టెన్షన్ తో తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు !

                                                                 
                                                         

దేనికైనా ఒక టైం  ఉంటుంది . అది అ టైం  ప్రకారమే జరుగుతుంది . వసంతకాలం లో కోయిలలు కూస్తాయి ,అంతే కాని కోయిల కూసింది కదా అని వసంత కాలం రాదు . వసంత కాలం రాకుండా కూసే కోయిల కూతలు తొందరపడి కూసేవే అవుతుంది . ఇదే విషయాన్ని రెండవ సారి మన సుప్రీం కోర్టు  వారు సిమాంద్ర నాయకుల పక్షానా వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు న్యాయవాదులకు చెపుతూ, వారు దాఖలు చేసిన రాష్ట్ర విభజన మిద పీటిషన్లు ను సున్నితంగా తిరస్కరించారు .

  4 రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర విభజన ను చాలెంజ్ చేస్తూ సిమాo ద్రకు చెందిన వారు 9 పిటిషన్ లు వేసారు . గతంలో ఇలాగే వెయ్యగా అవి అపరిపక్వమైనవని , అసెంబ్లీ తీర్మానం కాని , కేంద్ర ప్రబుత్వ నిర్ణయం కాని జరుగకుండా వాటి మిద విచారణ జరపటం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు వారు పెటిషన్ లను తిరస్కరించారు . ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం అయి పోయింది . విభజన బిల్ టెక్నికల్ గా తిరాస్కారానికి గురి అయిo ది . అయినా సరే రాష్ట్ర విబజనకే  కంకణం కట్టుకున్నట్లు కేంద్రం తెగ యాక్షన్ చేస్తుంటే , టెన్షన్ పెంచుకున్న సిమాంద్ర నాయకులు కొందరు తిరిగి చాలెంజ్ పిటిషన్ లు వేస్తె కోర్టు వారు గంటన్నర వాదనలు విన్నాక , గతంలో పిటిషన్ లకు ప్రస్తుతం వేసిన పిటిషన్ లకు పెద్ద తేడా లేదని పెదవి విరచి ఈ రోజు తిరస్కరించారు

  కాకపొతే సమైక్యతా కోరుకునే వారికి ఉన్న ఒక్క ఆశ  ఏమిటంటే , పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు వారు అన్న మాటలు . " కేంద్ర ప్రబుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా పిటిషన్లు విచారించడం తొoదర పాటు చర్య అవుతుoది. కాబట్టి సరి అయిన సమయంలో వేస్తె పరిశిలించవచ్చు " అంది . అంటే కేంద్రం రాజ్యంగా ప్రకారం రాష్ట్ర విభజన చెయ్యడానికి ఇంకా అవకాశం  ఉంది అని సుప్రీం కోర్టు వారి అభిప్రాయం కావచ్చు. అది నిజమే . రాజ్యంగా బద్దంగా విభజన చెయ్యడానికి కేంద్ర ప్రబుత్వానికి ఆవకాశం  ఉంది . కానీ టైమే  లేదు . కాంగ్రెస్ వారు చెయ్యాలంటే ఇప్పుడున్న రూపంలోనే మమా అనిపించాలి .దానిని కోర్టువారు అడ్డుకునే ఆవకాశం  కూడా లేకపోలేదు . ఈ రోజు కోర్టువారు అన్న చివరి మాటలు అదే అభిప్రాయం కలిగిస్తున్నాయి . ఒక వేలా కోర్టులకు ఆ చాన్స్ ఇవ్వద్దు అనుకుంటే రాష్ట్ర విభజన బాద్యతను రాబోయే ప్రబుత్వానికి వదిలెయ్యాలి .అది కాంగ్రెస్ కి కష్టమైనా పనే . అందుకే డ్రామాలకు తేర తీసింది . చూదాం ఏమి జరుగుద్దో!

Wednesday, February 5, 2014

దేశ ప్రజలకు ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ! రాష్ట్ర ప్రజలకు మాత్రం టెన్షనాయన కష్ట కాలం !

                                                         


ఈ రోజు రధ సప్తమి అంటే సూర్య జయంతి .భూమి మీద సంవత్సర కాలాన్ని రెండు సమ బాగాలుగా విభజించి ఉత్తరాయణం , దక్షిణాయనం అని వ్యవహరిస్తుంటారు . సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకు , కర్కట రేఖ నుండి తిరిగి బూమాద్య రేఖ మీదుగా మకర రేఖకు, ప్రయాణించి తిరిగి భూమధ్య రేఖకు చేరుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది . దిని గురించి వివరంగా క్రింది విడియోలో చూడవచ్చు .

   సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ వైపు ప్రయాణించే కాలం మార్చ్ 22 నుండి మొదలవుతుంది . అ రోజునే ప్రదమాంద్ర పాలకుడు , శక పురుషుడు శాలివాహన చక్రవర్తి జన్మించిన దినo . దానినే ప్రామాణికంగా తీసుకుని మన జాతీయ కాలెండర్ రూపొందించారు . అలాగే జులై 23 నుంచి దక్షిణాయన కాలం ప్రారంబం అవుతుoది . అలా దక్షిణాన ఉన్న మకర రాసి వరకు జనవరి 20 వరకు ప్రయాణించి తిరిగి 21 తారీకు నుండి ఉత్తరo  వైపు మరలటం జరుగుతుంది . దీనినే ఉత్తరాయణం అంటారు . హిందూ సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఉత్తరాయణం వైపు సూర్యగమనం సాగడం శుభదాయకమ్ . అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్య కాలం అంటారు . హిందూ పంచాంగం ప్రకారం ఉత్తరాయణ పుణ్య కాలం మాఘ  శుద్ద సప్తమి నుండి ప్రారంబం అవుతుంది . అందుకే అ రోజు సూర్యుడు తన రదాన్ని ఉత్తరం వైపు మల్లిస్తున్న రోజుగా బావిస్తూ "రద సప్తమి " అనే పేరుతొ దినిని పవిత్ర దినం గా బావిస్తారు. దీనినే సూర్య జయంతి గా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు మాఘ  శుద్ద సప్తమి అంటే రదసప్తమి. ఈ  రోజు నుండి దేశ ప్రజలకు ఉత్తరాయణ పుణ్యకాలం .

  మరి మన రాష్ట్రానికి వస్తే పరిస్తితి వేరుగా ఉంది . యాద్రుచ్చికంగా అయినా మనకు టెన్షన్ ల కాలం ఈ రోజునుంచే మొదలయిన్ది. రాష్ట్ర విబజన జరగదెమొనని తెలంగాణా నాయకులకు  టెన్షన్ అయితే . రాష్ట్ర విభజన జరుగుదెమొనని సిమా0ద్రా నాయకులకు టెన్షన్ . ఇలా ఇరువైపులా ఈ  టెన్షన్ ఉంటుంది . ఆ తర్వాత కూడా తెలుగు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అన్న నమ్మకం లెదు. మొత్తానికి తెలుగు ప్రజలకు కష్ట కాలమే మరి. పుణ్య కాలం లో కష్టాలు అనేది తెలుగు జాతికి రాజకీయ నాయకులు ప్రసాదించిన వర0. పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు . కాని ఖర్మ కొద్ది నాయకులు అనేది తెలుగు ప్రజలకు అనుభవమవుతుంది .
 సూర్య గమనం గురించి క్రింది విడియోలో చూడండి . ఈ రోజు నా పుట్టిన రోజు కూడా . అ వివరాలకు ఈ  లింక్ మిద క్లిక్ చెయ్యండి

రధ సప్తమి నా పుట్టిన రోజు కావటం మా అదృష్టమా ?

 http://ssmanavu.blogspot.in/2014/02/blog-post_5.html
Tuesday, February 4, 2014

రాష్ట్ర విభజన ఆపడానికి ముఖ్య మంత్రి గారికి మరొక టెక్నికల్ అవకాశమిస్తున్నకేంద్ర మంత్రి మండలి !.

                                                        

నేను ఇదే బ్లాగులో తెలంగాణా రాష్ట్ర విభజన విషయం గురించిన టపాలలో తెలంగాణా బిల్ విషయంలో గొప్ప డ్రామా అడిస్తుoదని చెప్పటం జరిగింది . అటు  చేసి చేసి చివరకు తెలంగాణా ప్రజల చెవిలో పూవులు పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయిందని అర్ధమవుతుంది . దీనికోసం పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలు అందరిని వంచించే రీతిలో ఒక హై డ్రామా  నడపటానికి రంగం సిద్దమయింది . ఒక వైపు పార్లమెంటులో బిల్ పాస్ కావడానికి చిత్త శుద్దితో ఉన్నామని ప్రజలను నమించదానికి తెగ ఆరాట పడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంకొక వైపు సమైక్యామ్ద్రా చాంపియన్ గా తాము ప్రమోట్ చేస్తున్న ముఖ్య మంత్రి గారికి సుప్రీం కోర్టు ద్వారా రాష్ట్ర విభజన ఆపే విదంగా టెక్నికల్ అవకాశాలు ఇస్తున్నారు . అవేమిటో చూదాం . 

  రాజ్యాంగం ప్రకారం అసెo బ్లికి ఒరిజినల్ బిల్ పంపాల్సి ఉంది కాని అలా పంపలేదు . డ్రాప్ట్ బిల్ పంపారు . ఇది బలమైన టెక్నికల్ పాయింట్ . దిని సాకుగా చూపి ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ అ బిల్ ని తిరస్కరించింది . అంటే రాష్ట్ర విబజనను కాకుండా టెక్నికల్ పాయింట్ మిద రాష్ట్ర విభజన బిల్ ని తిరస్కరించి వెనుకకు పంపింది . దినిని సరిచేసి తిరిగి అసెoబ్లికి  పంపాలి కాని అలా చెయ్యకుండా డైరెక్టుగా అదే బిల్ ని ఈ నెల 10 వ తారికున రాజ్య సభలో ప్రవేశ పెడుతున్నట్లు హొమ్ మంత్రి ప్రకటించారు . ఇది మరో ఘోర తప్పిదం . రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి మాత్రమె పార్లమెంటుకు బిల్ ని రికమెండ్ చెయ్యాలి. ఈ  విషయంలో కేంద్ర మంత్రి మండలి కలుగ చేసుకోవడం అంటే రాష్ట్ర పతి గారి అధికారాలను బంగపరచినట్లే . రాష్ట్రపతి గారు చెప్పాల్సిన మాటను పబ్లిక్ గా కేంద్ర మంత్రి చెప్పడం వలన మొత్తం ప్రొసిజర్ పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది . ఇది చాలు సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకోవడానికి . మరి ఇలా చెయ్యటం వలన లాబపదెది ఎవరు ? నష్టపోయేది ఎవరు? తరవాతి టపాలో చూదాం . ఎందుకంటే డ్రామా ఈ రోజే మొదలయింది ,ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది కాబట్టి . మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .
                  

Monday, February 3, 2014

మేకప్ లు వేసేసుకుని స్టేజ్ ఎక్కడానికి సిద్దంగా ఉన్న తరుణంలో "డ్రామా " అపమంటే ఎలా !?

                                                     


  పార్లమెంట్ లో అఖిలాంద్రా కాంగ్రెస్ డ్రామా కంపెనీ  వారిచే  భయంకర , బీబత్స రస పోషణతో ప్రదర్సింప బోతున్న గొప్ప  నాటక ప్రదర్శనకు కళాకారులు అందరూ మేకప్ లు వేసుకుని  స్టేజ్ ఎక్కడానికి సిద్దమైన .వేళ ప్రతి పక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు హటాతుగా ఇప్పుడు నాటక ప్రదర్సన వద్దంటే ఎలా చెప్పండి? అందుకే కమలనాదుల పార్టి అబ్యంతరాలను కాంగ్రెస్ మంత్రి కమల్ నాద్ ఒప్పుకొలెదు. నాటకం ఆడి  తీరాల్సిందే అన్నారు. ఇంతకీ నాటకం వివరాలు ఏమిటంటే
 .
 నాటకం పేరు: ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్ వార్ .(తెలంగాణా బిల్ పోరు )

  రచన: కేంద్ర మంత్రుల గుంపు (గూప్ ఆప్ మినిస్టర్స్).


 సాంకేతిక సహకారం :  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ గుంపు .

 వాద్య సహకారం: సీమాంద్రా పార్టీస్(అరుపులు గొలలు)

 స్తంట్ మాస్టర్: తెలంగాణా పార్టీస్ (తంతాం, పొడుస్తాం)

  దర్శకత్వం: తమిళ తంబి   

 పబ్లిసిటి సహకారం  : సీమాంద్రా అండ్ తెలంగాణా N.G.O లు  

స్పాన్సర్ :  సోనియా గాంది .

 క్లుప్తంగా కద: తెలుగునాడు లో అదికార కాంగ్రెస్ వారి ప్రాబవం తగ్గినట్లు కేంద్ర ప్రబుత్వ పెద్దలు గ్రహిస్తారు . 2009 లో 33 సీట్లు గెలిచిన అదికార పార్టీకి రానున్న ఎన్నికల్లొ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్తితిలో అటు తెలంగాణాలో, ఇటు సీమాంద్రాలో అదిక సీట్ల మద్దతు పొందే ఉపాయంతో అటు తెలంగాణా ఉద్యమ నాయకుడితోను, ఇటుసీమాంద్రా  సానుబూతి నాయకుడితోను ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటారు . కాని అది గమనించిన సీమాంద్రా ప్రజలు క్రమంగా అధికార పార్టికి లోపాయాకార మద్దతు ఇస్తున్న సానూబూతి నాయకుడికి కి దూరమవుతుండటం, అటు వైపు తెలంగాణా ఉద్యమ నాయకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటo  తో పునరాలోచన లో పడతారు కేంద్ర పెద్దలు. ఎలాగైనా సరే సీమాంద్రా ఓట్లు తమ గుప్పెట్లో ఉంచుకోవాలి అని తలచిన అధికార పార్టీ తమ అభిమాన పాత్రుడు కిరణ్ ని రంగంలోకి దించుతారు . అతను సీమాంద్రా హీరో గా గుర్తించబడడానికి అన్ని రకాల సహకారమ్ అందిస్టారు . దానివలన రాష్ట్రం లో తెలంగాణా బిల్ ఓడిపోతుంది. కావాలని తప్పుల తడక బిల్ ని తయారు చేసిన కేంద్ర ప్రబుత్వం దానిని ఎలాగైనా పార్లమెంటులో గెలిపిస్తాం  అంటుంది. ఇంకొక పక్క  తమ పార్టీ వారినే  సభ జరుగకుండా అడ్డుకోమని సీక్రెట్ గా చెపుతుంది. అటు కేంద్ర పెద్దలు కిరన్ ని కోర్టుకు వెల్ళి మోకాలు అడ్డు పెట్టమంటారు . ఇలా మాయోపాయంతో అందర్నీ బోల్తా కొట్టించి తాము  మాత్రం లబ్ది పోందాలని చూస్తుoటారు . అదీ కధ.


Sunday, February 2, 2014

పెద్ద కోడలు అని పెత్తనమిస్తే చివరకు సొనియమ్మ చెప్పేది ఇదా!? ! !భారత దేశం అంటే కర్మ భూమి , వేదబూమి అనేక సాంప్రదాయాలు సంస్కృతులు కు నెలవైన భూమి అని ఇన్నాళ్ళు అందరూ అనుకుంటున్న దానిని ఇందిరా  గాంది  గారి పెద్ద కోడలు ఒక్క మాటతో కాదు అని తేల్చేసింది . మేజార్తి హిందువుల ఓట్లతో గద్దె మిద కూర్చున్న కాంగ్రెస్ పార్టికి అదినేత గా ఉన్న ఈమే  తన నోటితో "హిందూ" అనాలoటెనే అసహ్యం అన్నట్లుంది అమె స్పీచ్ లు చూస్తుంటే. కనీసం సూపి పండితులు కూడా హిందుస్తాన్ అని గౌరవంగా పిలుచుకునె బారత దేశాన్ని ఇది మొదట  సూపి పండితుల క ర్మ భూమి అని , ఆ తర్వాతె అందరిది అని అర్దం వచ్చేలా మాట్లాడడంలో అర్దమేమిటి? వినాశకాలే విపరీత బుద్ది అని అన్నట్లు ఇవి ఆమె పాలనకు చరమ దశ అని చెప్పకనె చెపుతున్నవి. ఆత్మాభిమానం ఉన్న  హిందువులు  ఆమె మాటలు విన్న తర్వాత  దానిలొని అంతర్యం గ్రహించి తదనుగుణంగా నడచుకుంటే మంచిది. లేదంటే "హిందువులు " అంటే రాక్షసులు అని డిక్షనరీ లలొ ఎక్కించడానికి ఎత్తుగడలు వేస్తున్న ఈ కుహాన లౌకిక  వాదులు ను ఎదుర్కొవడం కష్టం.2014   ఎన్నికలు హిందువులు అంటే పడని వారికి బుద్ది చెప్పేలా ఉండాలి.

 సోనియా గాంది ఏమందో ఈ క్రింది వీడియోలొ చూడండి.