Friday, February 21, 2014

బ్రహ్మం గారు చెప్పిన "కాలజ్ఞానం" నిజమయినా కాకకపోయినా" కల్కిఖడ్గం" చెప్పిన భవిష్య వాణి మాత్రం నిజమయింది !.

కల్కిఖడ్గం

                                                         

నేను ఈ బ్లాగు మొదలు పెట్టడమే భవిష్య ద్రష్ట లు చెప్పిన ఒకానొక విషయం మిద . అదిఏమిటంటే డిసెంబర్ 21, 2012 న యుగాంతం అని . మొదట్లో నా బ్లాగు పేరు కూడా అదే . ప్రపంచంలో చాలా దేశాలలోని ప్రజలు దానిని నమ్మిన వారు ఉoడొచ్చు. కాని దాని గురించి కోట్లాది మంది ప్రజలు మాత్రం ఉత్సుకత చూపించారు అనేది మాత్రం నిజం . నా బ్లాగులో మాత్రం నేను యుగాంతం గురించి కాదు కాని ఆ రోజు బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పిన వీరబొగ వసంత రాయలు వస్తాడు అని చెప్పాను. నా బ్లాగు పట్ల కూడా వీక్షకులు కొంత ఆసక్తి చూపారు . అయితే విరబొగ వసంత రాయలు అంటే ఉన్న అర్ధం వేరని అయన వచ్చింది నిజమే అని కొన్ని కారణాల వల్ల ఆయన్ని కనుకొవటం కష్టం అని నేను ప్రచురించిన టపా చూసి   వీక్షకులు నిరాశ చెంది , కేవలo నా బ్లాగు పాపులారిటి కోసం అ పని చేసాను అని అనుకున్నారు . O.K .  నాడు వీరభొగ వసంత రాయలు విషయంలో నేను చెప్పినది నిజం అయినా కాకపోయినా , ఇదే బ్లాగులో పిబ్రవరి 1, 2013 న నేను చెప్పినది మాత్రం నిజమైంది . అదే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు . నేను పిబ్రవరి 1,2013 న ఏమి చెప్పాను అంటే 
            
   "అదిష్టానం వాగ్దానాల మీద పార్టీలకు నమ్మక్కం లేదు. అందుకే అదిగో తెలంగాణా ఇదిగో తెలంగాణా అంటే అవన్ని పిల్లకాయ మాటలుగా బావించారు. అలాగే పార్టీ అభిప్రాయాలను, అంద్రా ప్రజల అభిప్రాయాలను బేఖాతరు చేసి చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్తితిలోను "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు."  
                   అని చెప్పాను . మొన్న 20-2-2014 నాడు తెలంగాణా బిల్  సొనియా గాంధి గారి పట్టుదలతో ఉభయ సభలలొ ఆమోద ముద్ర పడింది . ఇక కేవలం లాంచన ప్రాయమైన రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది . కాబట్టి నేను చెప్పిన మాట నిజమయింది కదా! బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమయినా కాకకపోయినా కల్కిఖడ్గం చెప్పిన భవిష్య వాణి నిజమయింది !.వీరభొగ వసంత రాయలు రాకపోయినా ,కల్కి ఖడ్గం చెప్పిన విదంగా తెలంగాణాని  మాత్రం సోనియమ్మా ఇచ్చింది .

    
  1-2-2013 నాడు పెట్టిన టపా కోసం క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి .  

నాన్నా "తెలంగాణా" వచ్చే! http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html

    

No comments:

Post a Comment