Monday, February 17, 2014

సరి అయిన బిల్లు ఏమిటో నాయకులకు తెలియదు! సరి అయిన సమయం ఏమిటో లాయర్లకు తెలియదు!

                                                     


ఆల్  ఇండియా గ్రేట్ డ్రామా కంపెని అయిన  కాంగ్రెస్ వారు ఆడుతున్న నాటకంలో  మంచి రసవత్తర సీన్  నడుస్తుంది . అయితే ఇంత పకడ్బంది నాటకం ఆడి వారు రుజువు చేయడలచింది  ఏమిటంటే తాము రాజ్యంగ పద్దతులు తెలియని మూర్కులమని , తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తప్పా , దాని పలితాలకు తాము బాద్యులం  కాదని తెలంగానా ప్రజలకు తెలియచెయ్యదమే . దిని వలన రాష్ట్ర విభజన బిల్ పాస్ చేసినా దాని పలితం మాత్రం మాత్రం తెలంగాణా ప్రజలకు దక్కుద్దా లేదా అనేది అనుమానంగా ఉంది . . ఈ అనుమానాలు కలగటానికి గల కారణాలు ఇవి
(1). తెలంగాణా బిల్ మిద ఇప్పటివరకు 3 పిటిషన్ లు సుప్రీం కోర్టులో వేయడం జరిగింది . ఆ  మూడింటిని కోర్టు వారు ఒకే ఒక కారణంతో తిరస్కరించారు . అది ఏమిటంటే పిటిషన్ లు విచారించడానికి ఇది సరి అయిన సమయం కాదు, అ సమయం వచ్చాక తప్పకుండా విచారిస్తo అని. దిని వలన అర్దమయ్యేది ఒకటే.. విభజన బిల్ మిద పార్లమెంట్ నిర్ణయం వెలువడ్డాక పిటిషన్ వేస్తె తప్పకుండా విచారణకు స్వికరిస్తామ్ అని ఒక అభయం సుప్రీం కోర్టు వారు ఇచ్చినట్లే కనబదుతు0ది. సుప్రీం కోర్టు లో ఏంతో అనుభవమున్న సీనియర్ లాయర్లు పోయిన సారి వాదించి నపుడు ఇదే విషయం సుప్రిం కోర్టు వారు చెప్పినప్పటికీ "సరి అయిన సమయం " అంటే ఏమిటో తెలియక సిమాంద్ర లాయర్లు "ముద్ద ముద్దకు  బిస్మిల్లా " అన్నట్లు , కేంద్రం ఒక స్తెప్ వేయగానే పిటిషన్ ఒకటి వేస్తూ "సమయం వచ్చిందా , రాలేదా ? అని టెస్ట్ చేస్తున్నారు . ఇది లాయర్ల పరిస్తితి !

 (2). ఇక పొతే నాయకులు విషయానికి వస్తే , అసెoబ్లికీ పంపాల్సింది బిల్లో , డ్రాప్ట్ బిల్లో వారికి తెలియదు . కొన్ని గంటలు చర్చ జరిపాక "తూచ్ ' ఇది డ్రాప్ట్ బిల్ " అని మూజు వాణి  వొటుతో తిరస్కరిస్తారు . 117 మంది సబ్యులు అనుకూలంగా ఉన్న బిల్ మూజువాణితో వోటు తో తిరస్కారానికి గురి అవుతుంటే నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకున్నట్లు మిన్నకుండి పోయారు  తెలంగాణ నాయకులు . పార్లమెంట్ మనదే అయినా , సుప్రీం కోర్టు మనది కాదు అన్న  జ్ఞానం లేకుండా పోయింది వారికి. ఒక వేళ తెలంగాణా బిల్ పార్లమెంటులో పాస్ అయినా కోర్టు వారు ఆపితే, దానివలన కాంగ్రెస్ కె లాభం . ఇచ్చిన మాటకు కట్టు బడి K.C.R గారు తమ పార్టిని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదు . దాని వలన T.R.S నాయకులకు నష్టమైనా ,  K.C.R గారికి మాత్రం డిల్లీలో సోనియా గాంది గారి పర్మనెంట్ కోటరిలో మెంబర్ షిప్ లబిస్తుంది . ఎలాగు రాష్ట్ర విబజన ఆగింది కదా అని సిమాoద్రులు కిరణ్ గారికి జై అంటారు . కిరణ్ గారి ఖాతాలో జమ అయ్యే సీట్లు అన్ని అంతిమంగా కాంగ్రెస్ కు జమ అయ్యెవె ! ఇంత  మహత్తరమైన ప్లాన్ తో గొప్ప నాటకానికి తేరా తిసిందా కాంగ్రెస్ అనిపిస్తుంది . 
    (3) ఇక జాతీయ ప్రతి పక్ష హోదాలో ఉన్న B.J.P విషయానికి వస్తే, పార్లమెంటులో బిల్ ప్రవేశ పెట్టారో లేదో ఘనత వహించిన పార్లమెంటేరియన్ లకు తెలియదట ! బిల్ ప్రవేశం జరిగిపోయిందని అధికార పార్టి వారు అంటుంటే , "సభలో ఉన్న మాకు తెలియకుండానా ! అని బోల్డంత ఆశ్చర్య పోతున్నారు ప్రతి పక్ష నెతలు. చట్టాలు తయారు చేసే వారే , తమ పార్టి స్వార్దాల కోసం డ్రామాలు ఆడుతున్న దేశం లో ప్రజలకు దిక్కెవరు?
           ఈ డ్రామాల వల్ల  తెలుగు ప్రజలు చివరకు ఎ పరిస్తితులకు గురి అవుతారో రాబోయే వారం రోజులలో జరగబోయే పరిణామాలు నిర్ణయిస్తాయి .

 

No comments:

Post a Comment