Thursday, February 13, 2014

రాజగోపాల్ గారికి తన మిద లైంగిక దాడులు జరుగుతాయని భయమా !?

                                                             

మా ఊరి లో ఉన్న మల్లన్న అంటే అందరికి కొంత భయం ఉంటె అంతో ఇంతో గౌరవం కూడా లేక పోలేదు  భయం ఎందుకంటే కండలు తిరిగిన అతని బలిష్టమైన శరీరం  చూసి . ఎవరైనా సరే అతను ఒక గుద్దు గుద్దితే గిద్దెడు మిరియాలు కక్కాల్సిందే అని అనిపించేలా ఉంటాడు.  మరి గౌరవం ఎందుకంటే అంత కండలు తిరిగిన విరుడైనా ఏనాడు పద్దతి తప్పి వ్యవహరించలేదు కాబట్టి . కుస్తీ పోటిలో సైతం ఉపాయపు పట్లే తప్పా దొంగ దెబ్బ తీసి ప్రత్యర్దిని ఓడించాలని చూడడు .అటువంటి మల్లన్న నిన్న పార్లమెంట్ లో జరిగిన కాంగ్రెస్ వీరుల వీరంగం చూసి బాగా నిరాశ చెందాడు .
 మా మల్లన్నకు పార్లమెంట్ లో ఉండే వారంతా పెద్ద మనుషులు అని మా చెడ్డ నమ్మక్కమ్ . వారు ఏదైనా చర్చల ద్వారా సాదిస్తారు అని ఇన్నాళ్ళు అనుకునే వాడు . అందుకే మా ఊరు M.L.A లు వచ్చినా , M.P లు మంత్రులు ఎవరు వచ్చినా వారిని ఎంతో అభిమానంగా గౌరవించే వాడు . భగవంతుడు తనకు బుద్దిబలం  ఇవ్వకుండా కండ బలం ఇచ్చినందుకు తెగ బాద పడేవాడు . కాని నిన్న పార్లమెంట్లో గందరగోళం చూసాక "ఓస్ ! ఇంతోటి దానికా ప్రజలందరూ M.P లను ఎన్నుకునేది అని తెగ ఆచ్చర్య పోయాడు . రేపు రానున్న ఎన్నికల్లో M.P గా తనకే అవకాసం ఇవ్వాలని అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టాడు . మా కూడా అదే కరెక్టు అనిపిస్తుంది .

  అసలు దేశ  హొమ్ మంత్రి సభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి తన చుట్టూ 18 మంది జమా జెట్టి లాంటి M.P లను ఉంచుకోవలసిన అంత దౌర్బాగ్య ప్రజాస్వామ్యమా మనది ?!బిల్ మిద అబ్యంతరాలు ఉన్న వారెవరైనా తమ నిరసనను ప్రజాస్వామ్య యుతంగా మాటల రూపంలో , వ్రాతల రూపంలో తెలపాలి కాని , మంత్రులు మీదకు ఎగబడి బిల్ ను లాక్కుని చించే హక్కు రాజ్యాంగం ఇచ్చిoదా  ? అలాగే ఎవరైనా సబ్యులు తన పనికి ఆటంకం కలిగిస్తున్నారు అని  ముందే తెలిస్తే వారిని సస్పెండ్ చేసి బయటకు పంపమని చట్టాలు చెపుతున్నాయి కాని , తనొక ముటా నాయకుడు లాగా తనకు అనుకూలమైన M.P లను రక్షణ వలయంగా పెట్టుకుని హొమ్ మంత్రి బిల్ ప్రవేశ పెట్టడం ఎంతవరకు సబబు? మీకు రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రివిలేజ్ లు ఇచ్చింది స్వెచ్చగా మీ బావాలను వ్యక్తం చేస్తారని తప్పా , మీ ఇష్టం వచ్చినట్లు బాదుకుని ప్రపంచ దేశాలలో దేశ  ప్రతిష్టను దిగ జారుస్తారని కాదు . అలా చేసే వారు ఒక్క క్షణం కూడా చట్ట సబలలొ ఉండటానికి విలు లేదు .

   ఇకపోతే రాజగోపాల్ గారు ఏకంగా పార్లమెంట్లో కి పెప్పర్ స్ప్రే తీసుకు రావడమే కాక , దానిని ప్రయోగించి కొందరిని హాస్పిటల్ పాలయెలా చేసారు . నిజంగా తెలంగాణా బిల్ చట్ట వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నారు అని మీకు నమ్మకం ఉంటె దానిని చట్టం అయ్యాక కూడా సుప్రీం కోర్టులో చాలెంజ్ చేసి న్యాయం పొoదవచ్చు. ఆ అవకాసం మీకు ఉందని కోర్టు వారు చెప్పారు కూడా ! అది తెలిసిన వారు పెప్పర్ స్ప్రే ప్రయోగించే అంత పనికి పూనుకోవడం ఎందుకు?దేశ ప్రతిష్టను దిగజార్చడం ఎందుకు ? సరే రాజగోపాల్ గారికి తన మిద లైంగిక దాడులు జరుగుతాయని బయం ఉంటె ఉండవచ్చు . దానికోసం అయన కారం పొట్లం కి మోడరన్ రూపం అయిన "పెప్పర్ స్ప్రే " జేబులో పెట్టుకుని తిరుగుతుంటే ఎవరికీ అబ్యంతరం లేదు కాని ,దేశ పరువును నాశనం చేసే ఇలాంటి పనులు చెయ్యడం ఎందుకు? ఇక అటు తెలంగాణా వారు సైతం ఇతర రాష్ట్ర M.Pలతో కలసి కిరాయి గూండాల్లా తోటి M.P లను అడ్డుకోవడం ఎ ప్రజాస్వామ్యానికి ప్రతికలో ఆత్మ విమర్శ చేసుకోవాలి . కండ బలం ఉపయోగించి బిల్ లు పాసు చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెపితే మా ఊరి మల్లయనె పంపే వారం కదా ? మీరెందుకు ?

   అదికార పార్టి వారు వారి స్వార్ధం కోసం ఏదైనా అతిక్రమణలకు పాల్పడితే దానిని సరి చెయ్యాల్సిన బాద్యత ప్రతి పక్షాలది . ఒక పక్క అధికార పార్టి వారు ప్రవేశ పెట్టె  తెలంగాణా బిల్ కి సంపూర్ణ మద్దతు అని చెపుతూ , ఇంకొక పక్క సభ సజావుగా సాగకపోతే సహకరిమ్చమని చెప్పడంలో అంతర్యం ఏమిటి ? మేజార్తి అయిన అదికార , ప్రతి పక్షాలు O.K.  అన్నాక మూజువాణి వోటు తో కూడా బిల్ పాస్ చెసెయొచ్చు కదా ! ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ చేసింది అదే కదా ! దానికి ఇంత  రాదాంతం  సృష్టించాలా ? లేదూ సిమాంద్రా వారికి పలానవి ఇవ్వాలని కచ్చితంగా చెపుతున్నప్పుడు అవి ఇస్తేనే మద్దతు ఇస్తాం అని స్పష్టంగా తెగేసి చెప్పండి . అంటే కాని గంటకొక మాటతో గందరగోళానికి గురిచేసి తమాషా చూడడం ప్రతి పక్షానికి హుందా నివ్వదు .
  ఏది ఏమైనా అటు సిమామ్ద్రా వారు కావచ్చు . ఇటు తెలంగాణా వారు కావచు నిన్న జరిగిన సిగ్గుమాలిన పనికి ముక్య కారణం అధికార కాంగ్రెస్ పార్టి యే ! వారిని గురించి ఉత్తరాది మీడియా ఏమి అనుకుంటుదో క్రింది విడియో చూసి తెలుసుకోవచు . మీరంతా ఇలాగే చేయడం సబబు అని వాదిస్తే  బుద్ది ఉన్న ప్రజలకు రానున్న ఎన్నికలలో "నోటా " మీటను ఉపయోగించడం తప్పా వేరే గత్యంతరం లెదు .

 
         

No comments:

Post a Comment