Monday, January 7, 2013

మనవాళ్లు వట్టి వెధవాయిలోయి!(వ్యంగ్య రచన)

                                                                                     
                                                                
                                                                                 

  ఇది కన్యా శుల్కం లో గీరీశం అన్న డైలాగ్ అని నేను ఎక్కడో చదివినట్లు గుర్తు. నేనైతే కన్యాశుల్కం చదవలేదు. సినిమా ఏదో వచ్చిందట గాని నేను పుట్టాక అది రాలేదు కాబట్టి దానిని నేను చూడలేదు. కాని మన రాష్ట్రం లో ఒక రాజకీయ పార్టీ ఉంది. దాని నాయకుడు ఒకరు ఈ మద్య సదరు పుస్తకం చదివాడు అట! ఇంకేముంది ఈ వాక్యం ఆయనకు తెగ నచ్చిందట! అసలే ఆయనకు తాము అన్నా, తమ జాతివారు అదేనండి ఆయన మతం వారు అన్నా చాలా గ్రేట్ అని సంపూర్ణ విశ్వాసమట! ఎందుకంటే ఈ దేశం లోని ప్రజలను సుమారు వెయ్యేండ్లు పరిపాలించిన ఘనులు తమ మతం వారని గొప్ప క్రేజ్. అలాగే ఆయనకు ఇంకొక మతం వారన్న కొంచం  గౌరవాభిమానాలున్నాయి అట! ఎందుకంటే తమ వలేనే వారు సుమారు నాలుగు వందలు ఏండ్లు ఈ దేశ ప్రజల్ని పాలించారు అని. మన వాళ్ళు ఎంత వెదవాయిలు కాకపోతే తాము, ఈ దేశాన్ని పరిపాలించి ఉంటారు అని అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా ఆయనకి మనవాళ్ళ వెదావాయి తనాన్ని పరీక్షిద్దామని కోరిక పుట్టిందట. అంతే దానిని అమలు చేసేశాడు.

  ఆయన తమ రాజకీయ పార్టీ మీటింగుల్లో మన మత విశ్వాసాలను ఏకిపారేశాడు. ఏకేసి ఏమి జరుగుతుందో చూదామని లండన్ వెళ్ళాడు. ఇక్కడ ఆయనకు ఒక చిన్న డౌట్ వచ్చిందట. కన్యాశుల్కం  అనేది ఎప్పుడో రాసారు. అప్పటి బుద్దులే మనకు ఇప్పటికి ఉన్నాయా అని? ఎందుకంటే ఈ మద్యనే వారి పార్టీ పెద్దలు ఒక రచయిత్రి వారి మతాన్ని ఏదో కించపరుస్తూ వ్యాక్యలు రాసిందని, ప్రెస్ మీటింగులో స్త్రీ అని కూడ చూడకుండా కొట్టారు. మరి అది చూసి మన వారు కూడ ఏమన్నా  వారి నుంచి నేర్చుకున్నారా అని అను మానం కలిగి ముందు జాగర్త చర్యగా లండన్  వెళ్లాడు . కాని ఆయన అనుమానించినట్లూ ఇక్కడ పెద్దగా స్పందన కనిపించలేదు. ఏవో కేసులు అవి పెట్టారు కాని హీందువులు ఆయన అనుమానించినంతగా ఆవేశ పడలేదు.

  దీనిటో మన వాళ్ళు ఖచ్చితంగా కన్యాశుల్కం బాపతెనని,అప్పటికి,ఇప్పటికి ఏ మార్పు రాలేదని నమ్మకం కుదిరి హాయిగా లండన్ నుండి హైద్రాబద్ కి వచ్చి తమ పార్టీ కార్యకర్తలు జయ జయ ద్వానాలు పలుకుతుండగా హయిగా ఇంటికి వెళ్ళి  పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటూ, పొలిస్ విచారణకు రావాలంటే నాలుగు రోజులాగాలి అని సమాచారం పంపించాడట. అదేంటి మొన్న లండన్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ రాగానే వస్తామన్నారు కదా అని పొలిస్ వారు అమాయకంగా అడిగితే,  తాను నవ్వి,నవ్వీ కడుపునెప్పి వచ్చిందని, అది తగ్గాలంటే మరో నాలుగు రోజులు పట్టుదని, ఈ లోపు ఇంకొక సారి నవ్వు రాకుంటే అప్పుడు తప్పకుండా నాలుగు రోజుల్లో వస్తాను అని చెపితే పోలిస్ లు తెల్లబోయి చూసారట! అది చూసిన సదరు నాయకుడికి మరొక సారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చిందట.

  ఈ విదంగా మన వెదవాయితనమే కాదు, మన పోలిస్ వారిని కూడ చూస్తుంటే ఆయనకు నవ్వు వస్తూనే వుంటుంది కాబట్టి ఇక ఆయన విచారణకు వెళ్లే అవసరం ఉండదనుకుంటా!    

No comments:

Post a Comment