Wednesday, April 9, 2014

ఆమెను చూస్తె తాకబుద్ది అవుతుందట !ఈయన్ని చూస్తె పికబుద్ది అవుతుందట !

                                                                   


2014 ఎలెక్షన్ల తేది లు ప్రకటించేశారు . రాజకీయాలలో ఉన్నవారు , సినిమా రంగంలో ఉన్న వారు తమ తమ అదృష్టాలను పరిక్షించు కోవటానికి సమాయత్త మవుతున్నారు ఈ సమయంలో వారికి గుళ్ళో దేవుని కరుణ కంటే , ఓటరు దేవుని కరుణే అత్యంత అవస్యకం ! అందుకె పొద్దున్న లేచినది మొదలు రాత్రి పడుకోబోయే వరకు రోజూ లక్షలాది ఓటరు దేవుళ్ళను కరునించమని ప్రార్దిస్తూ (అలా నటిస్తూ ), సందు సందుకు , గొంది గొంది కు తిరుగుతున్నారు . మరి ఇటువంటి వారి  తిప్పలు చూస్తున్న ఓటర్లు కొంతమందికి జాలి కలిగి ఓటు వేసి కరునిద్దామా అనే ఆలోచనలో పడుతుంటే , మరి కొంత మందికి విరి చేష్టలు చూసి , వికారం కలిగి , తమలో కలిగే వికారాలను ప్రత్యక్షంగా తెలియ చేస్తున్నారు . అదెలాగ అంటే

     ఉదాహరణకు డిల్లీలో రాష్ట్ర ఎన్నికలలో అధికారానికి దగ్గరగా చేరువైన ఆమ్ అద్మి పార్టి అదినేత అరవింద్ కేజ్రివాల్ గారికి మంచి అవకాసం వచ్చినా అంటే రాష్ట్ర పాలనా అధికారం  కట్టబెట్టినా , సరిగ్గా వ్యవహరించకుండా తిక్కల నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి , అవినీతి నిర్మూలనే తమ అజెండా అని ప్రగల్బాలు పలికి , అసలు అవినీతి సామ్రాట్ లను వదిలివేసి , వారి భరతం పడతానంటున్న మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ , కాంగ్రెస్ వారికి పరోక్షంగా సహాయం చేస్తున్న , డి గ్రేట్ అరవింద్ కేజ్రివాల్ గారిని చూస్తె ఒక అటో డ్రైవర్ కి ఎందుకో కాని ఆయనకి ఒక దండ వేసి చెంప మిద పీక బుద్ది అయిందట ! అంతే! వెంటనే ఒక పూల దండ కొనుక్కుని అరవింద్ గారి కాన్వాయి దగ్గరికి వచ్చాడట . ఇంకేం , తనకు అభిమాని ఎవరో పూలదండ వేస్తున్నాడేమో అనుకుని  అనుకుని అతనికి అవకాసమిస్తె , సదరు అటో డ్రైవర్ పూలదండ వేసినట్లు వేసి , వెంటనే కేజ్రివాల్ చెంప మిద ఒకటి పీకాడట ! దానితో నివ్వెరపోయిన కేజ్రివాల్ అనుచరులు వెంటనే తేరుకుని అతని మిద దాడి చేసి కొట్టి పోలీసులకు అప్పచెప్పారట .
  కేజ్రివాల్ గారికి పై అనుభవం ఎదురైతే , ప్రముఖ గ్లామరస్ నటిమణి నగ్మా గారికి మరో రకం అనుభవాలు ఎదురవుతున్నాయట . ఆమె గారిని చూస్తుంటే ఓట్లు వేయడం తర్వాత కానీ , ఒక్క సారి ఆమెను  తాకితే  చాలు! జన్మ దన్యమైనట్లే ! అని బావిస్తున్నారట ఓటర్లు . అందుకే ఆమెను ఎలాగైనా తాకాలని ఒకరి మిద ఒకరు పోటి పడి పొలిసు వారికి సెక్యూరిటి ప్రాబ్లం కలుగ చేస్తున్నారట . మొన్న ఒక ముసలాయన , M.L.A అంతటి వాడే ఆపుకోలేక టక్కున నగ్మాని ముద్దు పెట్టుకున్నాడట . అది చూసిన పోలిస్ అధికారులు ఇక లాబం లేదని నగ్మాకి పెద్ద ఎత్తున పోలిస్ సెక్యూరిటి కలుగ చేసారట . వీళ్ళు  నాయకులైతే  ప్రజలకు ఏమి సేవ చేస్తారో తెలియదుకాని ప్రస్తుతం మాత్రం ఓటర్లు వీళ్ళని గోకకుండా  కాపాడానికే  ప్రజా దనం  ఎకువ ఖర్చు చేయాల్సి వస్తుంది . అది సంగతి

     ఒక చోట  నగ్మాను  చూస్తె తాకబుద్ది అవుతుందట !మరొక చోట కేజ్రివాల్ ను  చూస్తె పికబుద్ది అవుతుందట ! ఓట్లు వేయండి అని అడుగుతుంటే ఈ  తాకుడు , పికుడు గోల ఏమిటో అర్ధం కావటం లేదట అబ్యర్డులకు! కేజ్రివాల్ గారి చెంప చెళ్ళు కద గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .

               
             

2 comments:

  1. శీర్షిక చూడగానే ఇద్దరి మొహాలూ మదిలో ఠక్కున వెలిగాయి - పూర్తి పాఠం చదవక్కరలేకుండానే.

    ReplyDelete
    Replies
    1. దాంక్యూ సూర్య గారు మీ స్పందనకు. నాకు కేజ్రివాల్ గారి పొటొ చూస్తుంటె సినిమా యాక్టర్ రాళ్ళ పల్లి గారు గుర్తుకు వస్తున్నారు !

      Delete