Wednesday, December 11, 2013

"గృహ హింస నిరోదక చట్టం" మొగుళ్ళు చావుకొస్తే , మరి "మత హింస నిరోదక చట్టం " ఎవరి చావు కోసం?

                                                             


ఈ  దేశాన్ని విదేశి సంస్క్రుతి యే ఏలుతుంది. తమ పార్టీ వోట్ల కోసం కొన్ని వర్గాల ప్రజలని నిరంతరం బయపెడుతూ , వారి రక్షణ కోసం ఎదో ఒక పనికి మాలిన చట్టం చేస్తూ , తాము మత్రమే సదరు వర్గాల ప్రజల రక్షణకు కంకంణం కట్టుకున్న వీరాది వీరులమని కుహన లౌకిక వాదులు ప్రజలను నమ్మించ చూస్తున్నారు.
ఇప్పటికే కొన్ని వర్గాల రక్షణకు ఉద్దేసించిన చట్టాలు 95% దుర్వినియోగమై , ప్రజల మద్య ఒక కాన రాని విభజన రేఖ ఏర్పడుతూ , ఏ వర్గ రక్షణ కైతే చట్టాలు చేయబడ్డాయో , అ వర్గపు ప్రజలను మిగతా ప్రజలకు దూరం చేస్తున్నాయి అనడం లో అతిశయోక్తి ఏమి లేదు. ఇప్పుడు చాలా  మంది కొన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా ఉండడానికి బయపడుతున్నారు. వారితో డబ్బు లావాదేవీలు లాంటివి నడపడానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు. వారికి తమ వద్ద ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా వారికి భయం పుడుతుంది. ఒక్కప్పుడు మన సమాజంలో కొన్ని వర్గాల వారిని అంటరాని వారిగా పరిగణించి వారిని అవమానించారని, అలాంటి చర్యలు నాగరిక సమాజం లో కూడదనే ఉద్దేశ్యం తోనే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చిన మాట నిజమే అయినా, ఆ చట్ట నిర్మాణం లో కొన్ని  జాగర్తలు తీసుకోక పోవటం వలన చివరకు ఆ చట్టం అమలులో 95% దుర్వినియోగమై తప్పుడు కేసులు పెట్టి ప్రత్యర్దులను హింసించడం ఒక లాభ సాటి వ్యాపార మయ్యే సరికి , సామాన్యుడు ఏమి చెయ్య లేక చివరకు ఆ వర్గ ప్రజలకు దూరంగా ఉండదమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. ఏ అంటరాని తన్నాన్ని ప్రజల మద్య రూపు మాపాలని చట్టం చేసారో , ఆ అంట రాని  తనం ని ఎక్కువ చెయ్యడం లో ఆ చట్టం దోహదపడింది. కాకపోతే ఒకటే తేడా! ఆ నాడు కనపడే అంటరాని తనం, ఈ  నాడు కనిపించని అంట రాని తనం.

 ఇక పోతే గృహ హింస చట్టం తెచ్చిస్త్రీలకు లకు రక్షణ పేరుతో , భర్తలను, వారి కుటుంబ సబ్యులను హింసిస్తూ , వారి ఆత్మ హత్యలకు కా రణమవుతుంది. ఈ  చట్టం కూడా  ఆచరణలో దారుణంగా అంటే 95% విపలమై , కొంతమంది స్త్రీలు అంటే పురుషులు బయపడి పోయే స్తితిని కల్పించింది. నిజమయిన బాదిత స్త్రీలు ఈ చట్టం వలన రక్షణ పోందింది తక్కువ అనేది గణాంకాల వలన అర్దమవుతుంది. దీని పుణ్యమా అని ఎన్నడూ  లేని విదంగా పురుష హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి అంటే పరిస్తితి ఎంత ఘోరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు!

 ఇక ఇప్పుడు మత  హింస నిరోదక బిల్లు పేరుతో మైనార్టీల రక్షణకు బిల్లు తేవాలని తెగ ఉబలాట పడుతుంది సోనియా గాంది  గారి  ప్రభుత్వం . ఒక వేళ ఇది వస్తే ఇక మైనర్టీలను" ఎం బ్రదర్ బాగున్నవ్వా" అని కూడా పలకరిమ్చ లేక ఫొవచ్చు. హిందువుల నమ్మకాలను ఎవరైనా ప్రశ్నించవచ్చు, కాని మైనర్టీల అశాస్త్రీయ బావనలు ఎవరూ ప్రశ్నించ లేక ఫొవచ్చు. ఎందుకంటే వారు మానసికంగా గాయపడతారు కాబట్టి. అదీ పరిస్తితి ! పాపం హిందువులది ఎంత దయనీయ పరిస్తితి? ఇటువంటి దిక్కు మాలిన చట్టాలను సమర్దించే వారికి ఎన్నికలలో బుద్ది  చెప్ప లేక పోతే మన దేశం లో మన సంస్కృతిని కాపాడుకోలేని దీన స్తితిలో ఉండడం ఖాయం.

No comments:

Post a Comment