Sunday, December 1, 2013

"సువ్వర్ కా బచ్చా " అనేదే మనిషికి కరెక్ట్ అంట!

                                                            


శాస్త్ర విజ్ఞానం , శాస్త్ర విజ్ఞానం అని మనం సైంటిస్టులు చెప్పే దానిని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కానీ వారు మొన్నటి దాక మనిషి "కోతి" నుండి పరిణామ క్రమం లో అభివృద్ధి చెందిన వాడు అంటే సరేలే "బందర్ కా బచ్చా " అనేగా అంటున్నది అని ఊ రుకున్నారు . కానీ ఇప్పుడేమో కాదు, కాదు మనిషి కోతినుండి అభివృద్ధి చెందిన వాడు కాదు, వాడు ఆడ చింపాంజీకి , మగ పందికి పుట్టిన అక్రమ సంతానం అని సెలవిచ్చాడు ఒక సైంటిస్ట్. అమ్మా ! ఎంత పని జరిగింది! చివరకు మానవ జాతీ అంతా  అక్రమ సంతానం అయి పోయిందన మాట!

   ఈ మాత్రం కనిపెడతానికి సైంటిస్ట్ లకి ఇన్నాళ్ళు పట్టింది. అదే విషయాన్ని మనలో కొంతమంది పెద్దలు ఏనాడో చెపితే ఎవరైనా పట్టించుకున్నారా? కాకపోతే వారు తిట్ల రూపం లో చెప్పారు . వీరేమో శాస్త్రీయంగా చెపుతున్నాం అంటున్నారు అంతే తేడా! పెద్దలు పిల్లల్ని తిట్టే తిట్లలో "పంది నా .... ! అని సువ్వర్ కా బచ్చా అని అనడం వింటుంటాం. అంటే తమకు తెలియకుండానే తమ మూల పురుషుణ్ణి స్మరిస్తున్నారు అన్నమాట!

   చర్మ కణాలు, గుండె తాలూకు వాల్వ్స్లలక్షణాలు  పందికి మనిషికి ఒకటే నంట. ఆకారం, ఇతరత్రా చింపాజీకి దగ్గర పోలికలు కలిగి ఉంటాడు మనిషి. మనిషిలో తమ పూర్వీకుల  లక్షణాలు ఉండి తీరతయి కాబట్టి , ఈ  రెండు లక్షణాలు మనిషిలో ఉంటానికి కారణం వాటి మద్య ఎప్పుడో జరిగిన అక్రమ సంపర్కమే అని అమెరికన్ సైంటిస్ట్ Eugene McCarthy అనే అయన సిద్దాంతం అనుకుంటా . అయన ఏమి చెప్పాడో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ  క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు. 

   పంది అంటే కొంతమందికి యమ అసహ్యం. హిందువులు విష్ణువుని  "వారాహ మూర్తి" గా పూజిస్తారు కాబట్టి వారికి పర్వాలేదు కానీ , పంది అంటే అసలు పడని వారు ఈ సిద్దాంతాన్ని కోడా అసహ్యించుకుంటారు అనుకుంటా! ఏదైనా పెద్దల తిట్లు దీవెనలే కాదు , సైన్స్ సిద్దాంతాలు కూడా  అన్నమాట! http://www.dailymail.co.uk/sciencetech/article-2515969/Humans-evolved-female-chimpanzee-mated-pig-Extraordinary-claim-American-geneticist.html

No comments:

Post a Comment