Wednesday, January 1, 2014

న్యూ ఇయర్ పండగ నాడు కూడా పాత ఇల్లేనా!.

మద్య తరగతి వారి న్యూ యియర్ ఆహ్వానాలు
                                                         
మనకు ఒక నమ్మక్కం ఉంది. అదేమిటంటే కొత్త సంవత్సరం మొదటి రోజు ఎలా జరిగితే ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుండి అని. అందుకే ఆనందంగా సంతోషంగా ,కుటుంబ సబ్యులు అందరితో కలసి ఆ రోజంతా సంతోషగా గడపడానికి చూస్తారు. ఇంగ్లీష్ సంవత్సరాది అయినా , తెలుగు సంవత్సరాది అయినా మనం రెండిటిని సమానం గా చూడాల్సిందే. ఎందుకంటే మత  పరమైన కార్యక్రమాలకు తెలుగు క్యాలండర్ ని , లౌకిక పరమైన కార్యక్రమాలకు ఇంగ్లీష్ క్యాలండర్ ని అనుసరించటం మన జీవన విదానం లో బాగంగా చేసుకున్నాం.  కాబట్టి  మనం రెండింటిని అనుసరించక తప్పదు. కానీ ఆ యా నూతన సంవత్సరాలను ఆహ్వానించడం లో మాత్రం మన సాంప్రాదాయ పద్దతులు అవలంభించాలే తప్పా , వెర్రి మొర్రి పద్దతులు, హోటళ్ళ, పబ్ సంస్కృతులను ప్రోస్తాహించే విదంగా ప్రవర్తించడం అభిలషనీయం కాదు.

   మనం ఉగాది విషయం లో ఇంటిల్లి పాదీ ఇంటిలోనే ఉండి ఉదయం లేచినది మొదలు తలలు పోసుకోవడం , కొత్త బట్టలు కట్టుకోవడం, ఉగాది పచ్చడి చేయడం, కమ్మని పిండి వంటలు ,ఇలా ఏది చేసినా ఇంటిల్లిపాది ఆనందించే విదంగా ఉంటుంది. కానీ అదే న్యూ ఇయర్ అనే సరికి అదేదో ఇంటికి సంబందం లేదన్నట్లు, వీది లోకి వెళ్లి హోటల్లో , పబ్ లో కూర్చుని చచ్చిందాక తాగటం, తెలిసినోళ్ళతో , తెలియనోళ్లతో పూనకం వచ్చిన వారిలా ఊగడం, అవసరమైతే తెల్లార్లూ ఆ పబ్  లలోనే గడిపి , ఇంటికి వచ్చి కొత్త సంవత్సరం రోజు బోర్ల బొక్కలా పడుకోవటం, ఇదా నూతన సంవత్సారాని ఆహ్వానం పలికే విదానం? ఇక కురాల్లైతే పుల్ గా మందు కొట్టి , వెర్రి కేకలు పెట్టుకుంటూ , ఏదో గత్తర తగిలిన వారి మాదిరి టూవీలర్ల మీద వీదుల్లో విహారం చేసుకుంటూ దేనికో ఒక దానికి గుద్దుకుని కాళ్ళు చేతులు విరగ గొట్టుకుంటుంటే , వారిని అదుపు చెయ్యడానికి పొలిసు నిబందనలు పెట్టడం, ఏమిటి ఇదంతా? ఇదా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే విదానం ? మన ఇల్లే మనకు స్వర్గం. దానిని ఎప్పుడూ  సుఖసంతోషాలతో ఉంచేలా నూతన సంవత్సరాలకు, ఇంట్లో ఉండే ఇంటిల్లి పాది తో స్వాగతం పలికితే దానికంటే ఆనందం ఏముంటుంది ?!.
                                           B .Tech  ఫైనల్ ఇయర్ చదువుతున్న మా పాప రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇంటి ముందు వేసిన ముగ్గు చూసి నాకు చాలా ఆనందం కలిగింది .మా వీది లో ఇంచు మించు అందరూ అలాంటి ముగ్గులే వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. నిజంగా మధ్యతరగతి ప్రజలే మన సంస్కృతిని కాపాడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహాం లేదు. కాని  వారిలో మగాళ్ళు కొంతమంది న్యూ ఇయర్ పార్టీల  పేరుతో తో రాత్రిళ్ళు ఫ్రెండ్స్ తోకలసి రాత్రాల్లా తాగుతూ బయట గడపడం సమర్దనీయం కాదు. ఒక వేళ మందు అల వాటు ఉంటే  మితంగా తీసుకుని  కుటుంబ సబ్యులుతోనే గడిపితే మంచిది కదా!.

    మనకో సామెత ఉంది? అది ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఇలాంటి పండగలు కూడా ఇదివరలో మన సమాజంలో ఉండేవా అని అనిపిస్తుంది? ఆ సామెత ఏమిటంటే  "పండగ నాడు కూడా  పాత ఇల్లేనా " అని. ఒక వేళ అటువంటి సంస్క్రుతి కావాలనుకునే వారు పబ్ సంస్కృతులను ప్రోత్సాహిస్తాం అంటే అది వారిష్టం. కానీ మద్య తరగతి ప్రజలు, సామాన్య ప్రజలు ఇటువంటి వారికి, వారి సంస్కృతికి దూరంగా ఉండటం మంచిది. మన ఇల్లే మనకు స్వర్గం. అది  ఎప్పుడూ  సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ , నూతన సంవత్సరాలకు ఇంట్లో ఉండే, ఇంటిల్లి పాడితో స్వాగతం పలికితే దానికంటే ఆనందం ఏముంటుంది ?!.

కల్కి ఖడ్గం బ్లాగు వీక్షకులకు, మిత్రులకు అగ్రిగ్రేటర్లకు 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

   కొత్త సంవత్సరానికి పూనకాలతో స్వాగతం పలుకుతున్న వారిని ఈ  వీడియోలో చూడండి.
     

            

No comments:

Post a Comment