Friday, December 6, 2013

సోనియా గాందీ పుట్టిన రోజు సీమాంద్రా కాంగ్రెససోల్ల చావు కొచ్చింది!

                                                 
 
ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది అని సామెత! అచ్చం  అలాగే ఉంది, సోనియా గాందీ పుట్టిన రోజు కహాని . డిసెంబర్ 9 ని సీమాంద్రా ప్రజలు ముఖ్యంగా సీమాంద్రా కాంగ్రెస్ నాయకులు మరచిపోలేని దినం గా మారనుంది. ఎందుకంటే ఆ రోజు వలనే తాము నమ్ముకున్నకాంగ్రెస్  పార్టీ కి సీమాంద్ర ప్రజలు గోరి కట్టడానికి కారణ మవుతుంది! తెలివిగా తమిళ తంభి  చిదంబరం K.C.R  గారి చేత నిరాహార దీక్ష చేయించి ఆమె జన్మ దిన కానుకగా పొందిన వరం "తెలంగాణా రాష్ట్రం" . కా బట్టి నాలుగేళ్ళ క్ల్రితమే తెలుసు శ్రీ మాన్ చిదంబరానికి మరియు K.C.R  గారికి, తెలంగాణా ఎట్టి పరిస్తితుల్లో ఆగదని. తెలంగాణ ఇవ్వడం లో సోనియా గాంది కి ఉన్న ఇంట్రస్ట్ కేవలం తన పుట్టిన రోజు కానుకగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడమే తప్ప , వేరే రాజకీయ ఆసక్తులు ఆమెకు లేక పోవచ్చు. ఎందుకంటే ఆమె రాజకీయ పరంగా ఆమెకు ఉన్న జ్ఞానం నిల్  కాబట్టి.

   కానీ చిదంబరానికి మాత్రం ఈ  విషయం లో గట్టి పట్టుదలతో  ఉన్నాడని నిన్న జరిగిన ఉదంతం కూడా తేట తెల్లం చేస్తుంది. నిన్న కేంద్ర కాబినెట్ లో టేబుల్ ఐటం గా తెలంగాణా మీద గ్రూప్ అప్ మినిస్టర్స్ నివేదికకు ఆమోదం తెలిపే ప్రక్రియ చేపట్టాకా , మన రాష్ట్ర మంత్రులు అయిన పల్లం రాజు, కావూరి "ఇది అజెండా లో లేకుండా టేబుల్ ఐటం గా ప్రవేశ పెట్టారు కాబట్టి , విషయ అవగతం కు ఒక 2 రోజులు టైం  ఇవ్వండి " అని అడిగితే ప్రదాన మంత్రి గారు O.K  అన్నారట! కానీ వెంటనే చిదంబరం గారు కలుగ చేసుకుని "అదంతా కుదరదు, వెంటనే ఆమోదం తెలపాల్సిందే" అనే సరికి , రాష్ట్ర మంత్రులు ఇద్దరూ లేచి బయటకు వచ్చేశారట! కాబట్టి 2014 లోపు తెలంగాణా ఏర్పాటు అనేది చిదంబరం "చింత" లో నుంచి పుట్టి, సోనియా పుట్టిన రోజుకు ముడి పెట్టి , అది త్వరిత గతిన సాదించడంలో సక్సెస్ అయ్యడు.

 ఈ  కుట్ర తెలియని సీమాంద్రా నాయకులు ఏమి జరగదు అనే దీమాతో ప్రతి దానికి తల ఆడించి, ప్రజల అభిప్రాయాన్ని సోనియా గాంది కి చెప్పకుండా , తెలంగాణా అంటే తమకు అబ్యంతరం లేదని చెప్పడం వల్లే , రాష్ట్ర ఏర్పాటు సాధ్య పడింది. ఇప్పటికి వారు తమ తప్పు తెలుసుకోకుండా ప్రజలను మబ్య పెడతానికే చూ స్తున్నారు. కేంద్రం లో అద్ కార కాంగ్రెస్ , ప్రతిపక్ష B.J.P  తెలంగాణా కు O.K  అన్నాకా , ఇక బిల్ ఆమోదం పొందడమనేది నల్లేరు మీద నడక. అవసరమైతే రాజ్యంగ సవరణకు కావాల్సిన 2\3 మెజార్టీ ఉంది కాబట్టి పార్ల మెంట్ లో బిల్లు పెడితే నెగ్గడం ఖాయం. ఈ  విషయంణ్ లో కాంగ్రెస్ వారికి, B.J.P  వారికి ఒక అవగాహన ఉందనడానికి నిదర్శనం నిన్న "రాయల తెలంగాణా" ప్రతిపాదన నుండి కేంద్ర మంత్రి వర్గం డ్రాప్ అయి 10 జిల్లాల తెలంగాణాకు ఆమోద ముద్ర వెయ్యడమే!

   కాబట్టి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది సీమాంద్రా  రాజకీయ నాయకులు నిర్లక్ష్య దోరణీకి , మితిమీరిన విశ్వాసానికి , అమ్మకు ఎదురు చెప్పలేని చేతకాని తనం వలననే సాద్యపడింది. దీనికి తెలంగాణా నాయకులూ వారికి థాంక్స్ చెప్పాలి మరి! ఇదే విషయం మీద ఇదే  బ్లాగులో నేను చెప్పిన విషయం ఎలా నిజమయిందో చూడండి

(నాన్నా "తెలంగాణా" వచ్చే!http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html)

No comments:

Post a Comment