Sunday, December 15, 2013

ABN చానల్ వారు చేసిన స్టింగ్ ఆపరేషన్ ఎందుకు డంగై పోయింది!?

                                                             



                             తెలుగు జాతి రక్తంలో అవినీతి అనేది ఇంకి పోయింది. తెలుగు రాష్ట్ర విబజన గురించి ఎంతో మరిగి పోతున్న  జాతీ రక్తం అవినీతి అంటే చల్లగా గడ్డ కట్టి పోతుంది. రాష్ట్ర విబజన గురించి నిత్యం బండబూతులు తిట్టుకుంటూ , ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ నాయకులు అవినీతి విషయం లో మాత్రం ఒక సీక్రెట్ అవగాహన తో మెసులుతున్నట్లు అని పిస్తుంది.

     24-11-2013 తేదినాడు, దమ్మున్న చనల్, దుమ్ము రేపే చానల్ అని చెప్పుకునే ABN  వారు రాష్ట్రం లోని కొంతమంది ప్రముఖ నాయకులు తమ వద్ద నున్న నల్ల దనాన్ని, తెలివిగా  ఎలా తెలుపు చేస్తున్నారో ,ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన వివరాలను ప్రసారం చెయ్యడం జరిగింది. అది చూసి నేననుకున్నాను, ఇది రాష్ట్రం లో పెను సంచలనం స్రుష్టిస్తుందని. బహూశా చానల్ వారు కూడా అదే ఊహించి ఉండవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా "సంచలనం" కాదు కదా, సమ్ చలనం కూడా లేకుండా పోయింది. దీని వలన అర్దమయింది ఏమిటంటే తెలుగు జాతి రక్తం అవినితిని సహించే స్తాయికి ఎదిగి  పోయింది. ఎవరైన అవినీతి గురించి చెపితే "ఇట్స్ కామన్ యార్" అనే స్తాయికి తెలుగు కామన్  మాన్ ఎదిగాడు. అందుకే డిల్లీలో "ఆం ఆద్మీ" గా కేజ్రీవాల్ ముందుకు రాగలిగినా, రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ "కామన్ మాన్" థీం  ముడుచుకు పోతుంది. దాని బదులు "కరప్షన్ మాన్"  విజయం సాదించేటట్లు ఉన్నాడు. శబాశ్ !

      24-11-2013 తేది నాడు ABN  చానల్ వారు ప్రసారం చేసిన ఈ వీడియో ను చూడండి           




             

No comments:

Post a Comment